home entry
-
జగనన్న కాలనీలో గృహప్రవేశం
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని యర్రగుంటపల్లె లే అవుట్‌లోని జగనన్న కాలనీలో ఒక లబ్ధిదారు గృహప్రవేశం చేశారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా పీలేరు పట్టణానికి చెందిన రెడ్డిరాణి, రెడ్డీశ్వర్‌రెడ్డి దంపతులకు ఇల్లు మంజూరైంది. స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టి 2 నెలల్లో పూర్తిచేశారు. ఆదివారం వైఎస్సార్ సీపీ మండల నాయకుడు కంభం సతీష్‌రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డిరాణి, రెడ్డీశ్వర్రెడ్డిలను ఆదర్శంగా తీసుకుని మిగిలిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జగన్మోహన్రెడ్డి, హబీబ్‌బాషా, ఎంపీటీసీ సభ్యుడు అమరనాథరెడ్డి, నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వినోద్‌కుమార్, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌ల నిర్మాణం: మంత్రి అనిల్ ఏపీ: 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ సొంతింటి కల నెరవేరింది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని మాకు సొంతింటి కల నెరవేరింది. కొన్నేళ్లుగా సొంతిళ్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా మాకు ఇల్లు మంజూరైంది. జగనన్న కాలనీలో మా ఇంట్లోకి గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉంది. – రెడ్డిరాణి -
లేని ఇంటికి గృహ ప్రవేశం..
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ) : సొంత ఇల్లే తన కల అని చెప్పాడు... దాచుకున్న డబ్బులకు తోడు అమ్మ.. అమ్మమ్మ కూడబెట్టిన డబ్బులు తీసుకుని తుళ్లూరులోని టౌన్ షిప్లో ఇల్లు కడుతున్నానని అం దరితో గొప్పగా చెప్పాడు.. గృహ ప్రవేశం అంటూ బంధువులకు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు అందచేశాడు... కార్యక్రమానికి విచ్చేసిన వారికి అన్ని మర్యాదలు చేశాడు.. హోటల్లో రూమ్‌లు, తుళ్లూరుకు వెళ్లి వచ్చేందుకు కార్లు ఏర్పాటు చేశాడు... ముహూర్త సమయం సమీపిస్తుండటంతో ముందు మీరు వెళ్లండి.. అని చెప్పి హోటల్ నుంచి ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి లోని ఆంజనేయ వాగు సెంటర్లో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన పెద్ది నాగమణి, కోటేశ్వరరావు భార్యభర్తలు. వీరికి ఇద్దరు సం తానం. నాగమణి రెండేళ్ల కిందట పెద్ద కుమారుడు పెద్ది రవిని తీసుకుని విజయవాడ కొత్తపేట ఆంజ నేయ సెంటర్‌కు వచ్చేశారు. పెద్ది రవి మహాత్మాగాంధీ రోడ్డులోని బాలాజీ అల్యూమినియం సెంటర్లో పని చేస్తుంటాడు. ఖరగ్‌పూర్‌లోనే భర్త కోటేశ్వరరావు, చిన్న కుమారుడు తేజేశ్వరరావు కిరాణా వ్యాపారం చేస్తుంటారు. పెద్ది రవి కొంత కాలంగా అమరావతి రాజధాని తుళ్లూరులోని శ్రీ సాయి నికేతన్ టౌన్ షిప్లో ఇంటిని కొనుగోలు చేశానని తల్లి, అమ్మమ్మలను నమ్మించాడు. ఇందుకోసం తల్లి వద్ద నుంచి లక్షలలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటి నిర్మాణం పూర్తయిందని చెప్పి శుక్రవారం రాత్రి 1–05 గంటలకు గృహ నిర్మాణం అంటూ ఆహ్వాన పత్రికలు వేయించాడు. శనివారం సత్యనారాయణస్వామి వ్రతం కూడా ఉందని చెప్పాడు. స్నేహితులతో పాటు ఖరగ్‌పూర్‌లోని తండ్రి, సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. తమ్ముడు తేజేశ్వరరావు పది రోజుల కిందట విజయవాడ రాగా, బంధువులు గురువారం ఉదయానికి చేరుకున్నారు. వీరందరికీ ఓ పెద్ద హోటల్లో రూమ్‌లు సైతం బుక్ చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో తల్లిదండ్రులను, బంధువులను కార్లలో తుళ్లూరుకు బయలుదేరి వెళ్దామని చెప్పాడు. అందరూ సిద్ధమైన తర్వాత మీరు ముందు తుళ్లూరులోని ఇంటి వద్దకు వెళ్లమని అడ్రస్సు చెప్పాడు. తనకు ఇంట్లో చిన్న పని ఉందని అది చూసుకుని వచ్చేస్తానని నమ్మకంగా చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులందరూ తుళ్లూరు వెళ్లారు. టౌన్షిప్ గురించి ఆరా తీయగా అసలు అక్కడ ఆ పేరుతో టౌన్ షిప్ లేదని, ఇది తప్పుడు అడ్రస్ అని తెలిసింది. అయితే ఆహ్వాన పత్రికలో మాత్రం తుళ్లూరు, కృష్ణా జిల్లా అని ముద్రించడంతో ముందుగానే ప్రణాళిక ప్రకారం ఇది జరిగిందని బంధువులు పేర్కొంటున్నారు. ఇంతలో రవికి ఫోన్ చేయగా అవతలి వైపు నుంచి సమాధానం రాకపోవడంతో తిరిగి వాగు సెంటర్లోని ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చేసరికి తలుపులు గడియ వేసి ఉండటంతో ఉత్తరం వైపు ఉన్న సందులో నుంచి లోపలకు చూడగా వంట గదిలో హుక్కు చీరతో ఉరికి వేలాడుతూ పెద్ది రవి కనిపించాడు. దీంతో వెంటనే తలుపులు తెరిచి రవిని ఉరి నుంచి కిందకు దింపగా అప్పటికే ప్రాణాలను కోల్పోయాడు. వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డబ్బులు ఏం చేసినట్లు.. అయితే పెద్ది రవి చాలా మంచివాడని స్థానికులు చెబుతున్నారు. కొంత కాలంగా అర్ధరాత్రి వరకు ఇంటి ముందు కూర్చుని ఫోన్లో మాట్లాడటం, లక్షలాది రూపాయలు ఏం చేశాడనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులతో పాటు తెలిసిన వారి వద్ద కూడా ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడని ప్రచారం జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
త్వరలో గృహప్రవేశం చేస్తా!
తమిళసినిమా: కొందరు జీవితంలో లక్ష్యాలే లేవంటారు. మరి కొందరు భవిష్యత్ ప్రణాళికలే ఉండవంటారు. మరి కొందరు లక్ష్యం దిశగా పయనిస్తారు. ఇటీవల సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన తాప్సీ తన లక్ష్యాన్ని అధిగమించనంటోంది. ఆడగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు, ఝుమ్మందినాదం చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈఢిల్లీ బ్యూటీ తెలుగులో కాస్త ఎక్కువ చిత్రాలే చేసినా, కోలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలనే చేసింది. ఇక్కడ అవకాశాలు అడుగంటాయి.దీంతో ముంబైలో మకాం పెట్టింది. లక్కీగా అక్కడ పింక్, నామ్ షబానా వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టడంతో ఇక అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుందట.దీంతో ముంబైలో సొంత నివాసం, ఒక సొగసైన కారు కొనుక్కోవాలని, అది తన పుట్టిన రోజు లోపే సాధించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఆ అమ్మడికి ఆగస్ట్ ఒకటో తేదీ పుట్టిన రోజు. కాగా ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఫ్లాట్‌ను ఇటీవలే కొనుగోలు చేసిందట. తాప్సీ తెలుపుతూ తన పుట్టిన రోజుకు ముందే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నానని అంది. థ్యాంక్స్ గాడ్ అంతకు ముందే తన లక్ష్యాన్ని అధిగమించాను అని పేర్కొంది. ప్రస్తుతం ఫ్లాట్‌లో చిన్న చిన్న వర్క్ జరుగుతోందని, త్వరలోనే తన సోదరితో కలిసి గృహ ప్రవేశం చేస్తానని అంటోంది. -
నేడు, రేపు గృహ ప్రవేశం
♦ హైటెక్స్‌లో ఇండియా ♦ ప్రాపర్టీ.కామ్ ప్రాపర్టీ షో సాక్షి, హైదరాబాద్: ఇండియా ప్రాపర్టీ.కామ్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో గృహ ప్రవేశం పేరిట 96వ ప్రాపర్టీ షో జరగనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న ఈ షోలో నగరానికి చెందిన 65కి పైగా నిర్మాణ సంస్థలు.. 250కి పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నాయి. అపర్ణా, ఆదిత్య, రాంకీ, ఎస్వీసీ, ఎన్సీసీ అర్బన్, సైబర్‌సిటీ, హిల్‌కౌంటీ, ప్రెస్టిజ్, శ్రీ ఆదిత్య హోమ్స్, కె రహెజా కార్ప్, వెర్టెక్స్ హోమ్స్, త్రిశూల, సత్వా, ఎస్ఎంఆర్, ప్రణీత్ గ్రూప్, ఎంపైర్ డెల్టా, వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్, ముప్పా, అక్యురేట్ గ్రీన్ మిడోస్, రాజపుష్ప, ఆకృతి వంటి నిర్మాణ సంస్థలకు చెందిన ప్లాట్లు, ఫ్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలుంటాయి. ♦ ప్రదర్శనకు కుటుంబంతో కలిసి వచ్చేవారి స్టాళ్లను సందర్శించేందుకు వీలుగా పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ప్లే ఏరియాను ఏర్పాటు చేశాం. హైదరాబాద్ అభివృద్ది గురించి చెప్పాలంటే.. ఇటీవలే ఏసియా పసిఫిక్ రీజియన్‌లో రియల్టీ పెట్టుబడులో నగరం మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఇతర నగరాల్లో ఐటీ రంగం ప్రతికూలంగా ఉంటే హైదరాబాద్‌లో మాత్రం కార్యాలయాల లీజు/కొనుగోలు కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రతీ ఏటా కార్యాలయాల అద్దెలూ పెరుగుతున్నాయి.