సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: విజయసాయిరెడ్డి | Vijayasai Reddy Attends YSR Jagananna Illa Pattalu Distribution At Elamanchili | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: విజయసాయిరెడ్డి

Published Fri, Jan 8 2021 4:12 PM | Last Updated on Fri, Jan 8 2021 4:13 PM

Vijayasai Reddy Attends YSR Jagananna Illa Pattalu Distribution At Elamanchili - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని భారతదేశంలో అతిపెద్ద కార్యక్రమంగా నిలిపినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం యలమంచిలిలో ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'యలమంచిలి నియోజకవర్గంలో 7,200 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు చేస్తున్న కార్యక్రమాలు అనిర్వచనీయం. ఇలాంటి ముఖ్యమంత్రి మరో 25 సంవత్సరాలు ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి. సీఎం మహిళా పక్షపాతిగా నిరూపించుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నారు. అవినీతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు' అని విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: ('పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద చర్యకైనా సిద్ధమే')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement