సాక్షి, గుంటూరు: జిల్లాలో జనవరి 7 నాటికి 2.80 లక్షల ఇళ్ల స్థలాలు, 30 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజుల్లో 20 వేల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ‘‘స్థలాలను జియో టాగింగ్ చేస్తున్నాం. ప్రత్తిపాడు పాతమల్లాయపాలెంలో ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చాయి. అందులో నలుగురు మాత్రమే అర్హులయ్యారు. మిగిలిన వారి పేర్లపై ఇళ్ల స్థలాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఇరవై దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. నలభై మంది లబ్ధిదారులు ఉంటే నలుగురికి మాత్రమే ఇచ్చారని వచ్చిన వార్తలు.. వాస్తవం కాదని’’ ఆయన వివరణ ఇచ్చారు. ఇళ్ళ నిర్మాణానికి అనుమతి వచ్చిన వాటికి శంకుస్థాపన కార్యక్రమాలను చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: కొత్త చట్టాలపై అపోహలొద్దు: జీవీఎల్)
జిల్లాలో యూకే నుంచి వచ్చిన వారిని 267 మందిని ట్రేస్ చేశామని, అందరికి పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. యూకే నుండి వచ్చిన వారు.. 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని, ఫ్రాన్స్ నుండి వచ్చిన మహిళకు, ఆమె బంధువులు మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ వెల్లడించారు. (చదవండి: అంతర్వేది: నూతన రథాన్ని పరిశీలించిన మంత్రి)
Comments
Please login to add a commentAdd a comment