ఇళ్ల పట్టాల పంపిణీతో పండగ వాతావరణం.. | Deputy CM Dharmana Krishnadas Praises CM Jagan | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యం, వ్యవసాయానికి సీఎం జగన్‌ పెద్దపీట..

Published Sun, Jan 3 2021 4:08 PM | Last Updated on Sun, Jan 3 2021 4:21 PM

Deputy CM Dharmana Krishnadas Praises CM Jagan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే సమర్థమంతమైన పాలన అందిస్తున్న సీఎంల్లో జగన్‌ ఒకరు.. అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ మన్ననలను సీఎం జగన్‌ పొందారన్నారు. మరో 30 ఏళ్లపాటు జగన్‌ పాలన ఉండేలా ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు.విద్య, వైద్యం, వ్యవసాయానికి సీఎం జగన్‌ పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు వలస కూలీలుగా బాధలు పడ్డారని, రాష్ట్రంలో రైతులను సీఎం జగన్‌ రైతు భరోసాతో ఆదుకుంటున్నారని ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు.(చదవండి: ‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement