Dharmana Krishnadas
-
ఎన్నికలు ఏవైనా.. గెలుపు వైఎస్సార్సీపీదే
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం వైఎస్సార్‌సీపీదేనని.. కుప్పంలోనే టీడీపీని కుప్పకూల్చేశామని టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం సీఎం జగన్ ఏపీని సంక్షేమాభివృద్ధి వైపు నడిపించారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు తొలిగిన అనంతరం.. ఏప్రిల్ తర్వాత విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటవుతుందని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 18 మందికి గాను 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. టీడీపీ నేతల కుట్రలకు అవకాశం ఇవ్వకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ను, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావును గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. నాడు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో మాత్రమే యాదవులకు గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. దీనివల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్ సచివాలయాలతో పాటు విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగ విప్లవం సృష్టించారని చెప్పారు. వాస్తవ పరిశ్రమల స్థాపనకు అత్యధిక ఎంఓయూలు జరిగింది వైఎస్సార్సీపీ హయాంలోనేనని తెలిపారు. పట్టభద్రులను, ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. -
ఇది కదా జగనన్న పాలన..
నరసన్నపేట: అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాంలో టీడీపీ సీనియర్ నాయకుడు, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లు చంద్రమౌళికి మూడున్నరేళ్లుగా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాలన్నీ వివరించారు. చంద్రమౌళికి రైతు భరోసా కింద రూ. 38,500, సున్నా వడ్డీ కింద రూ.1,168, వైఎస్సార్ ఆసరా కింద రూ. 11,640 ప్రయోజనం కలిగినట్లు వివరించారు. బుక్‌లెట్‌ను ఎమ్మెల్యే కృష్ణదాస్ జల్లు చంద్రమౌళికి ఇచ్చారు. ఇది కదా జగనన్న పాలన అంటే.. అని స్థానికులు చర్చించుకున్నారు. -
ఉత్తరాంధ్రను చంద్రబాబు, పవన్ అవహేళన చేస్తున్నారు : మంత్రి ధర్మాన
-
ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టింది చంద్రబాబే
నరసన్నపేట: మెడికల్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం వంద శాతం సముచితమని శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకులపాడులో విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ను క్షోభపెట్టింది చంద్రబాబేనని చెప్పారు. ఎన్టీఆర్‌ను మానసికంగా హింసించిన చంద్రబాబు చివరకు ఆయన చావుకు కారణమయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అంటే తమకు కూడా గౌరవం ఉందని, అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని అన్నారు. టీడీపీ 14 ఏళ్ల పాలనలో ఎందుకు ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో పలు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని, వైద్యానికి రాష్ట్రాన్ని హబ్‌గా తీర్చిదిద్దారని, 108, 104, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని, యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం అభినందనీయమని చెప్పారు. కుప్పంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ సభకు అధికంగా ప్రజలు తరలివచ్చారని, అక్కడ 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడికి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. అక్కడి ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. -
వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం
నరసన్నపేట: ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా అధికార వికేంద్రీకరణకే కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తీవ్రంగా నష్టపోయామని, మళ్లీ ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించి నష్టపోలేమని అన్నారు. 60 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేసిన జంట నగరాలను విభజన కారణంగా కోల్పోయామని, ఇది పునరావృతం కాకూడదని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా అమరావతిలో మాత్రమే కాకుండా మూడు ప్రాంతాల్లో అభివృద్ధిని జనం కోరుకుంటున్నారని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మళ్లీ విభజన ఉద్యమాలు రాకూడదంటే అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఆయన తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. -
సానుకూల అంశాలు ఉంటేనే పరిగణనలోకి..
నర్సీపట్నం(విశాఖపట్నం): కొత్త జిల్లాల ఏర్పాటులో సానుకూలమైన అంశాలు ఉంటేనే సవరణలకు పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సోమవారం నర్సీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుభవజ్ఞునిలా పాలన చేస్తున్నారని, పరిపాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలను చేశారన్నారు. చరిత్ర కలిగిన ప్రాంతాలకు అల్లూరి సీతారామరాజు, ఎన్టీ రామారావు, శ్రీ సత్యసాయి పేర్లుగా నామకరణం చేశారని తెలిపారు. సీఎంకు రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై సమగ్రమైన అవగాహన ఉందన్నారు. జలయజ్ఞం ద్వారా తీసుకొచ్చిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం ప్రాధాన్యమిస్తూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నారని వివరించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సీఎం సానూకూలంగా పరిష్కరించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదికాదన్నారు. ప్రత్యేకహోదా సాధనకు సీఎం కృషి చేస్తున్నా.. కేంద్రం నుంచి సానుకూలత రావడం లేదన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్నందునే నవరత్నాలకు రూపకల్పన చేశారని చెప్పారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న 2 లక్షల ఎకరాలకు సాగు పట్టాలతో పాటు.. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి..వారిపై తనకున్న ప్రేమను సీఎం జగన్ చాటుకున్నారని చెప్పారు. -
సీఎంకు ఆశీస్సులు ఇవ్వాలి
రాజమహేంద్రవరం రూరల్: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94 శాతం అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అందరూ ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్స్‌లోగల ఎంపీ కార్యాలయంలో సోమవారం సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్, రూరల్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, రాజమహేంద్రవరం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మరో ముఖ్య అతిథి, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దేవుడిని కొలిచినప్పుడు ప్రతి ఆంధ్రుడూ అంబేడ్కర్ ఆశయాలతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గురించి కూడా వేడుకోవాలని కోరారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సీఎం జన్మదిన వేడుకలను ఒక రోజు ముందుగానే వినూత్న రీతిలో జరిపారని అన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. చందన నాగేశ్వర్ ప్రసంగించారు. ఈ మంత్రులతో భారీ కేక్ కట్ చేయించారు. మొక్కలు నాటించారు. మూడువేల మందికి వస్త్రాలు పంపిణీ చేశారు. పింఛనును రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచినందుకు సీఎం జగన్ చిత్రపటానికి వృద్ధులు క్షీరాభిషేకం చేశారు. మహిళలు ప్లకార్డులతో ‘హ్యాపీ బర్త్‌డే సీఎం సార్’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర తెలికుల, గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిన భవానీప్రియ, తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు మార్తి లక్ష్మి, పిల్లి నిర్మల, కానుబోయిన సాగర్, రాష్ట్ర కార్యదర్శులు మింది నాగేంద్ర, గిరజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్, అజ్జరపు వాసు తదితరులు పాల్గొన్నారు. -
ధర్మాన కృష్ణదాస్ అంటే జిల్లాల్లో క్రీడాకారుడిగానే తెలుసు
సాక్షి, శ్రీకాకుళం: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని జిల్లాలోని ఎన్టీఆర్ఎంహెచ్ స్కూల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజయరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ షూటింగ్ అకాడమీ , విక్రాంత్ బాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రిగా క్రీడలంటే నాకు చాలా ఇష్టం. ఏపీలోని అన్ని జిల్లాలకు క్రీడాకారుడిగానే కృష్ణదాస్ అంటే తెలుసు.క్రీడలతోనే నాకు గుర్తింపు వచ్చింది. స్కూల్లో పాస్ మార్కులు వస్తే చాలనుకునేవాడిని ఆటల కోసమే విశాఖ వెళ్లి డిగ్రీలో చేరాను.గతంలో క్రీడలు ఎంతో దయనీయస్థితిలో ఉండేవి.. ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఆన్ స్పోర్ట్స్ క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం . ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే ... వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుందనేది నా భావన క్రీడలకు ఖర్చు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను ప్రోత్సహించాలి. సమాజం పట్ల గౌరవం , క్రమశిక్షణ ఒక్క క్రీడాకారుడికే ఉంటాయి.' అని మంత్రి చెప్పుకొచ్చారు. -
నకిలీ చలాన్లలో రూ.3.38 కోట్లు రికవరీ
సాక్షి, అమరావతి: నకిలీ చలాన్ల వల్ల ప్రభుత్వానికి గండిపడిన ఆదాయంలో రూ. 3,38, 11,190 రికవరీ చేశామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ) ధర్మా న కృష్ణదాస్ తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ ఎంవీ శేషగిరిబాబుతో ఈ అంశంపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం తప్పుడు చలాన్ల ద్వారా రూ. 7,13,76,148 ఆదాయానికి గండిపడిందని గుర్తించామన్నారు. అందుకు బాధ్యులను గుర్తించి ఇండియన్ స్టాంప్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.3.38 కోట్లు రికవరీ చేశామని, ఇంకా రూ.3.75 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. అధికారుల తనిఖీలలో 11 జిల్లాల్లోని 36 సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1,252 డాక్యుమెంట్లకు సంబంధించిన తప్పుడు చలానాలు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేసి, 9 మంది సబ్–రిజిస్ట్రార్లను విధుల నుంచి తప్పించామన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మరికొంతమంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సీఎఫ్ఎంఎస్ను సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానించామని, ఇకపై అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మాన వివరించారు. -
అమర జవాన్ కుటుంబానికి సాయం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్ లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం అందజేశారు. లావేటి ఉమామహేశ్వరావు 2020, జూలై 18న కశ్మీర్లో టెర్రరిస్టులు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేస్తూ అవి పేలడంతో మృతి చెందారు. అప్పట్లోనే ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరామర్శించి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు విడుదల చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ లావేటి ఉమామహేశ్వరరావు సతీమణి నిరోషాకు కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, తూర్పు కాపు, కాళింగ, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, పేరాడ తిలక్, అంధవరపు సూరిబాబుల సమక్షంలో చెక్కును అందజేశారు. పూర్తి న్యాయం జరిగింది సీఎం జగన్ తనకు పూర్తి న్యాయం చేశారని వీర జవాన్ ఉమామహేశ్వరరావు భార్య నిరోషా అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 50 లక్షల చెక్కు అందుకున్న అనంతరం ఆమె ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ సహాయం అందించడంలో కాస్త జాప్యం జరిగినా ఊహించని స్థాయిలో మొత్తాన్ని ఇవ్వడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. భర్తను కోల్పోయిన తాను ఇద్దరు పిల్లలతో జీవనం సాగించడం కొంత కష్టంగా ఉండడంతో సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలిపానే తప్ప ప్రభుత్వంపైన గానీ, ప్రజాప్రతినిధులపైన గానీ ఆరోపణలు చేయలేదన్నారు. -
జవాన్ ఉమా మహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
సాక్షి, శ్రీకాకుళం: సరిహద్దులో విధి నిర్వహణలో మృతి చెందిన వీర జవాన్ లావేటి ఉమా మహేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.50లక్షల చెక్కును డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లడూతూ ఆర్మీ జవాన్ ఉమా మహేశ్వరరావు మృతి తీరని లోటుని అన్నారు. ఆయన ప్రాణాలను ఫణంగా పెట్టి దెశాన్ని కాపాడారాని.. ప్రతి ఒక్కరూ వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రూ.50 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ద్వారా వారి కుటుంబానికి అందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు
సాక్షి, కాకినాడ సిటీ: గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా కాలనీలు కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా పెద్ద ఎత్తున గ్రామాల నిర్మాణమే జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇళ్ల పట్టాలు అందజేయడం, ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియని, అర్హులు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టా మంజూరవుతుందని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలూ రాకుండా స్వచ్ఛమైన భూ రికార్డులే లక్ష్యంగా భూముల రీ సర్వేను ప్రారంభించామని అన్నారు. దీనిని రూ.వెయ్యి కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టామని ధర్మాన తెలిపారు. జిల్లాలో 4 లక్షల ఇళ్ల నిర్మాణం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన తూర్పు గోదావరి జిల్లాలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. 90 రోజుల్లో ఇంటి పట్టా కార్యక్రమంతో కలిపి, జిల్లాలో దశల వారీగా 4 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి 20 ఇళ్లకు ఓ అధికారిని, అలాగే ప్రతి లే అవుట్‌కు మండల స్థాయి అధికారిని నోడల్ అధికారులుగా నియమించామని చెప్పారు. భౌగోళికంగా ఎంతో వైవిధ్యం ఉన్న జిల్లాలో సవాళ్లను అధిగమిస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఈ కార్యక్రమం అమలులో ముందుండేలా కృషి చేస్తున్నారని అభినందించారు. కొమరిగిరి లే అవుట్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్ల వంటి వాటి ఏర్పాటుతో భవిష్యత్తులో ఓ ఆదర్శ పట్టణం సాక్షాత్కరించనుందని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా లే అవుట్లలోనే సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని రాయితీతో అందుబాటులో ఉంచనున్నామని మంత్రి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం స్పెషల్ లైన్ ద్వారా ఇసుకను లే అవుట్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ, అమలాపురం డివిజన్లో లోతు ఆధారంగా లే అవుట్లలో లెవెలింగ్ కార్యకలాపాలు సాగించాల్సి ఉందని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తవన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చేపట్టిన పేదలందరికీ ఇళ్లు యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. సమావేశంలో కాకినాడ ఎంపీ వంగా గీత, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌గుప్తా, సీఈ పి.శ్రీరాములు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు, జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, ఎ.భార్గవతేజ, జి.రాజకుమారి, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, జెడ్పీ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రూ.4 లక్షల కోట్ల సంపద సృష్టి పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే దాదాపు రూ.4 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుందని మంత్రులు ధర్మాన కృష్ణదాస్, శ్రీరంగనాథరాజు అన్నారు. సమావేశం అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్రంలో రూ.12 వేల కోట్లతో భూసేకరణ చేసి, లే అవుట్లను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలుంటే వీటికి అనుబంధంగా మరో 17,500 కొత్త గ్రామాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. సముద్ర తీర గ్రామాల్లో తుపానులను సైతం ఎదుర్కొనేలా ఇళ్లు నిర్మిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లోని లే అవుట్లలో భూగర్భ డ్రైనేజీలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32 వేల కోట్లు కేటాయించామని వివరించారు. ఇంటి నిర్మాణం పూర్తయితే ఒక్కో లబ్ధిదారుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల ఆస్తి సమకూరుతుందన్నారు. తొలి దశలో 1,34,458 ఇళ్లు ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం స్థితిగతులను కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వివరించారు. తొలిదశలో రూ.2,420 కోట్లతో 758 లే అవుట్లలో 1,34,458 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని వెల్లడించారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటి సరఫరా పనులు 60 శాతం పూర్తయ్యాయని, 758 లే అవుట్లకు గానూ 673 లే అవుట్లకు విద్యుత్ సర్వీసులు మంజూరు చేశామని తెలిపారు. లే అవుట్లలో శాశ్వత మౌలిక వసతుల అభివృద్ధికి శాఖల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేశామని చెప్పారు. జియోట్యాగింగ్, మ్యాపింగ్, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డు మ్యాపింగ్, మెగా గ్రౌండింగ్ మేళా, ఇళ్ల నిర్మాణ సామగ్రి సేకరణ లక్ష్యాలను చేరుకునేందుకు లే అవుట్లను ఎ, బి, సి కేటగిరీలుగా వర్గీకరించామన్నారు. స్వయంసహాయ సంఘాలకు అడ్వాన్స్ రుణాల గురించి కలెక్టర్ వివరించారు. -
చెప్పినదానికన్నా మిన్నగా బీసీలకు గౌరవం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాక ముందు ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో చెప్పిన దాని కన్నా మిన్నగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు రాష్ట్రంలో బీసీలకు గౌరవం కల్పించినట్లు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఒక సామాన్య బీసీ కులంలో పుట్టిన తనను డిప్యూటీ సీఎం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో సోమవారం జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మేమెందుకు బీసీలుగా పుట్టలేదా అని మిగిలిన కులాల వారు అసూయ చెందేలా రాష్ట్రంలో బీసీల సంక్షేమం అమలవుతోందని చెప్పారు. బీసీలకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్‌ను కాపాడుకోవాల్సిన కనీస ధర్మం బీసీలుగా మనపైనే ఉందన్నారు. ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా మనం మన కులాలను అన్ని రకాలుగా బలోపేతం చేసుకుంటూనే మరో పక్క సీఎంకి అండదండలు అందిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు ఇంత పెద్దపీట వేసిన ముఖ్యమంత్రులు గతంలో ఎవరూ లేరన్నారు. బీసీలు ఉన్నతస్థాయికి ఎదిగేలా వారికి అన్ని రంగాల్లో సీఎం జగన్ సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలోనే బీసీ కార్పొరేషన్ చైర్మన్ల చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ కార్పొరేషన్ కార్యాలయాలను బుధవారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందరూ హాజరుకావాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, గ్రూపు రాజకీయాలకు అతీతంగా ఆయా కులాల సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. తద్వారా పార్టీ పటిష్టతకు కృషిచేస్తూనే బలమైన నాయకులుగా ఎదగాలని కోరారు. మీటింగ్‌లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల పట్టాల పంపిణీతో పండగ వాతావరణం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే సమర్థమంతమైన పాలన అందిస్తున్న సీఎంల్లో జగన్ ఒకరు.. అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రధాని మోదీ మన్ననలను సీఎం జగన్ పొందారన్నారు. మరో 30 ఏళ్లపాటు జగన్ పాలన ఉండేలా ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు.విద్య, వైద్యం, వ్యవసాయానికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు వలస కూలీలుగా బాధలు పడ్డారని, రాష్ట్రంలో రైతులను సీఎం జగన్ రైతు భరోసాతో ఆదుకుంటున్నారని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.(చదవండి: ‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’) -
భూ వివాదాల్ని తొలగించేందుకే రీ సర్వే
తక్కెళ్లపాడు (జగ్గయ్యపేట): రాష్ట్రంలో భూ వివాదాలను పూర్తిగా తొలగించేందుకే సమగ్ర భూముల రీ సర్వే నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని 2023 నాటికి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామం నుంచి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 21న ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. కృష్ణదాస్ మాట్లాడుతూ వందేళ్ల అనంతరం సీఎం జగన్ చొరవతో రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతోందన్నారు. ఏళ్ల తరబడి గ్రామాల్లో భూ సమస్యలు, భూ సంబంధ కోర్టు కేసులు వంటివి భూముల రీ సర్వే ద్వారా పరిష్కారమవుతాయని తెలిపారు. 13 జిల్లాల సర్వే బృందాలకు ముఖ్యమంత్రి జెండా ఊపి సర్వేను ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వ విప్ ఉదయభాను మాట్లాడుతూ తక్కెళ్లపాడులో రీ సర్వే ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాలకు రోడ్డు మార్గం ద్వారా వస్తారన్నారు. -
మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుంది: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: భూములు అమ్మేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పత్రికలు గగ్గోలు పెడుతున్నారని, అది వృధా ప్రయాస అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలు, నాడు-నేడు నిధుల కోసం భూములు వేలం వేస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకత దేశంలో ఎవరైనా వాటిని కొనుగోలు చేసేలా ఈ-వేలం వేస్తున్నామన్నారు. గడిచిన మీ హయాంలో ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన వారికి ఎన్ని భూములు కట్టాబెట్టారో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. అయితే తాము సద్వివిమర్శను ఆహ్వానిస్తామని, మీ అవినీతిని రాస్తే పెద్ద గ్రంథం అవుతుందని విమర్శించారు. రాజధాని పేరుతో పేదల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములు సేకరించింది మీరు కాదా? అని వాటిని పెద్దలకు కట్టబెట్టింది మీ హయాంలోనే కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా కోర్టులో స్ఫష్టమైన తీర్పు వచ్చిదన్నారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని అచ్చెన్నాయుడు రాషష్ట్రంలో తిరుగుతా అంటున్నారని వెంటనే తిరగండని పేర్కొన్నారు. విశాఖలో భూ కుంభకోణం చూసి మీ హయాంలో మంత్రులే రోడ్డున పడ్డారని, త్వరలో సమగ్ర భూ సర్వేకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 100 ఏళ్లనాటి రికార్డులు ప్యూరిఫికేషన్ చేస్తామని, మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి భూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని, త్వరలో అంత: రాష్ట్ర వివాదాలు పరిష్కరించి నేరడి బ్యారేజ్ నిర్మించి తీరుతామని ధర్మాన పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాతయాత్ర కృష్ణా జిల్లా: ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు అయిన సందర్బంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. పెనుగ్రంచిప్రోలు పాత సినిమా హాలు సెంటర్ నుంచి మున్నేరు వంతెన మీదగా ముచ్చింతల వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని నేరుగా తెలుసుకున్న నేత సిఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర పరిపాలనలో 90 శాతానికి పైగా హామీలను ఆయన నెరవేర్చారన్నారు. ప్రజలకిచ్చిన నవరత్నాల హామీలే కాకుండా 16 రకాలకు పైగా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు అండగా నిలబడిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వం అభివృద్దిని, సంక్షేమాన్ని రెండింటినీ విస్మరించిందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో విద్య, వైద్యంలో విప్లకాత్మకమైన మార్పులకి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే... సీఎం వైఎస్ జగన్ వైద్య ఖర్చు వెయ్యి రూపాయిలు దాటితే ఆరోగ్యశ్రీలోకి చేర్చి పేదలకి అండగా నిలబడ్డారన్నారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మరో 30 ఏళ్లు కొనసాగుతారని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. కాగా ఈ పాదయాత్రలో భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
నేడు స్వదేశానికి ‘లిబియా బాధితులు’
టెక్కలి: కిడ్నాపర్ల చెరలో బిక్కుబిక్కుమంటూ గడిపిన శ్రీకాకుళం జిల్లా యువకులు స్వదేశానికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, మంత్రి సీదిరి అప్పలరాజు, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎప్పటికప్పుడు వారి విడుదలకు చర్యలు చేపట్టడంతో 28 రోజుల్లో కిడ్నాపర్ల చెర నుంచి వారికి విముక్తి లభించింది. సంతబొమ్మాళి మండలం సీతానగరానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య లిబియా నుంచి స్వదేశానికి వస్తూ ట్రిపోలీ ఎయిర్పోర్ట్ మార్గ మధ్యలో కిడ్నాప్‌కు గురైన ఘటన సంచలనం కలిగించింది. మంత్రి సీదిరి అప్పలరాజు, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. లిబియాలో భారత ప్రభుత్వ దౌత్య కార్యాలయం నుంచి కంపెనీ ప్రతినిధులతో చర్చించి కిడ్నాపర్ల నుంచి వారిని విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ప్రయతి్నంచారు. కిడ్నాపర్ల చెర నుంచి బయట పడిన యువకులు నేడు ఢిల్లీకి రానుండగా మరో రెండు రోజుల్లో ఇళ్లకు చేరుకోనున్నారు. ప్రభుత్వ చొరవ మరిచిపోలేం ట్రిపోలీ ఎయిర్పోర్ట్ వద్ద కిడ్నాప్‌కు గురయ్యాం. ప్రభుత్వ చొరవతో లిబియాలో మా కంపెనీ ప్రతినిధులు కిడ్నాపర్లతో చర్చలు జరిపి మమ్మల్ని విడిపించారు. ప్రభుత్వ చొరవ మరిచిపోలేం. – బత్సల వెంకట్రావు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం కిడ్నాప్‌కు గురైన తర్వాత జీవితంపై ఆశలు వదులుకున్నాం. ఎంతో భయపడ్డాం. అయితే మమ్మల్ని విడిపించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చొరవ చూపారు. – బత్సల జోగారావు మరో రెండు రోజుల్లో ఇంటికి.. మమ్మల్ని విడిపించడంలో మంత్రి అప్పలరాజు, ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ కృషి చేశారు. 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నాం. – బొడ్డు దానయ్య -
బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
సాక్షి, నెట్వర్క్: బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. సోమవారం పలుచోట్ల పూలె, అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు పెద్దపీట వేశారంటూ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మహిళలు సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మేకా ప్రతాప అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంపాలెంలో మంత్రులు శ్రీరంగనాథరాజు, హోం మంత్రి మేకతోటి సుచరిత, అనంతపురంలో మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ పాల్గొన్నారు. చిత్తూరులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలే విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. శ్రీకాకుళంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తదితరులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, వేముల, లింగాల, బద్వేలు, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, చాపాడు, రాజంపేట తదితర ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకటచినప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, వెల్దుర్తి, ఆదోని, ఆలూరు, డోన్, కోడుమూరు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. విశాఖలో బీచ్‌రోడ్డు, విశాఖ దక్షిణ, మధురవాడ, ఎన్ఏడీ జంక్షన్, కొత్త గాజువాక, పిలకవానిపాలెంల్లో సంబరాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజీనామాకు సిద్ధం.. నాపై పోటీ చేసి గెలవగలరా..?
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని, తనపై పోటీ చేసి గెలవగలరా అని మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. మంచికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మాన కృష్ణదాస్ మాటలను వక్రీకరించడం సరికాదని హితవు పలికారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దాసన్న తన సొంత నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన సంభాషణను ఎల్లో మీడియా వక్రీకరించి బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించడం సరికాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ మహిళతో ‘మా ప్రభుత్వం ఇచ్చిన పదివేలు తీసుకుని ఓటేయ్యవా.. అని అది నీ అమ్మ మొగుడు సొమ్మా’ అని అసభ్యకర పదజాలంతో మాట్లాడిన సంగతి అందరికీ గుర్తుందని అన్నారు. అదే పార్టీ కి చెందిన కూన రవికుమార్ ఫోన్ సంభాషణలు అందరికీ తెలుసని చురకలు అంటించారు. ఎవరైతే బాగా బూతులు మాట్లాడగలరో, వీధి రౌడీల్లా ప్రవర్తించగలరో అలాంటి వారిని చంద్రబాబు గుర్తించి అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారంటే ఆ పార్టీ తీరు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. దాసన్న రాజకీయ చరిత్రలో ఎక్కడా కాంట్రవర్సీ లేదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఆయన తన మార్క్ చూపించారని తెలిపారు. భావనపాడు పోర్టు, ఉద్దానం ప్రజలకు రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ బాధితులకు ఆస్పత్రి, నేరడి బ్యారేజీ నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో రియల్ వ్యాపారులు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కరోనా కాలంలో కనిపించని ఎంపీ రామ్మోహన్నాయుడు స్టేషన్ వద్దకు దౌర్జన్యం చేసేందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. దాసన్న అందరి కుటుంబ సభ్యుడు.. అనంతరం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడారు. రాజధాని విషయంలో డిబేట్ జరిగినప్పుడు విశాఖలో రాజధాని కావాలనుకుంటున్నారా లేదా అని టీడీపీ నేతలను ప్రశ్నిస్తే కిక్కుమని సౌండ్ లేదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వారి రౌడీయిజానికి నిదర్శనమన్నా రు. దాసన్న అందరికీ ఓ కుటుంబ సభ్యుడితో సమానమని, ఆయన నీతి నిజాయితీలను గుర్తించే సీఎం ఆయనకు డిప్యూటీ సీఎం, మంత్రి వంటి ఉన్నత పదవులు కట్టబెట్టారన్నారు. (క్షమాపణ చెప్పిన కబ్జా సబ్బం) అభివృద్ధి ఓర్వలేకే.. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నిబద్ధత, క్రమశిక్షణ గల వ్యక్తి అని ఆయన నోట ఎప్పుడూ తప్పుడు మాటలు రావని అన్నా రు. కూన రవి, అచ్చెన్నాయుడుల అవినీతి అక్రమాలు గుట్టలుగుట్టలుగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు హోం శాఖ, డిప్యూటీ సీఎం, విప్ వంటి పదవులు ఇచ్చింది సీఎం జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హిత వు పలికారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీదిరి, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి పార్టీ నేతలు పిరియా సాయిరాజ్, విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, అంధవరపు సూరిబాబు తదితరులు వారికి ఆ స్థాయి లేదు.. వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మునిగిపోయిన నావకు డ్రైవర్ పదవి ఇచ్చినట్లు కాలం చెల్లిన పారీ్టలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లు అధ్యక్షులుగా ఎంపికయ్యారని చమత్కరించా రు. డిప్యూటీ సీఎం దాసన్నపై విమర్శలు చేసే స్థాయి వారికి లేదన్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లి వచ్చిన అచ్చెన్నాయడు, ఇసుక దందా చేసుకుని, వీధి రౌడీ లా వ్యవహరించే కూన రవికుమార్‌లు దాసన్నపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్, డీసీసీబీ చైర్మ న్ పాలవలస విక్రాంత్‌లు మాట్లాడుతూ దాసన్న పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించారని అన్నారు. అలాంటి వ్యక్తిపై దు్రష్పచారం చేయడం తగదన్నారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే') విశాఖలో రాజధాని వద్దంటూ కృష్ణదాస్‌పై చంద్రబాబు పోటీ చేసి గెలవగలరా అని సవాల్ విసిరారు. పార్టీ నేత అంధవరపు సూరిబాబు మా ట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారని, ఆయన ఆశయాలను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అలాంటి నేతపై అభాండాలు వేయడం తగదన్నారు. స మావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, ఎంవీ స్వరూప్, ఎన్ని ధనుంజయరావు, పొన్నాడ రుషి, హనుమంతు కిరణ్‌కుమార్, చింతాడ రవికుమార్, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు దళితులంటే గౌరవం
సాక్షి, తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దళితులంటే ఎంతో గౌరవం ఉందని, డా.బాబా సాహేబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నిబద్దతతో అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దళిత మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని కొనియాడారు. వైఎస్సార్ సీపీ అందరికీ సమాన హక్కులు, హోదా ఉండాలని కోరుకునే ప్రజా పార్టీ అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ దళితుల కోసం మాట్లాడుతున్నాడు. ( ఆ సమావేశానికి కర్త కర్మ క్రియ చంద్రబాబే..) దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని అనడానికి చంద్రబాబును ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక వ్యక్తి చేసిన విమర్శలు సద్విమర్శలు అయితే ప్రతి ఒక్కరు దానిని ఆహ్వానిస్తారు. నాయకుని పట్ల అంకిత భావంతో ఉండాలి. ఇవాళ మేమంతా సీఎం జగన్ కోసం అంకిత భావంతో పని చేస్తున్నా’’మన్నారు. -
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
సాక్షి, అమరావతి: రెవెన్యూ భూముల సంస్కరణల మంత్రి వర్గ ఉప సంఘం భేటీ గురువారం జరిగింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రెవెన్యూ సంబంధిత సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూ సమస్యలు తగ్గించేలా అందరికీ ఆమోదయోగ్యమైన సూచనలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలన,సూచనలు చేయడమే లక్ష్యంగా చర్చ సాగింది. (చదవండి: పరిటాల సునీత ఫ్యామిలీ భూబాగోతం!) 22ఏ కింద ఉన్న భూములపై అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎస్టేట్, ఇనాం భూములపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూములను అతి తక్కువగా నామినల్ రుసుము చెల్లించి కన్వెర్ట్ చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు నెల రోజులపాటు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. -
విశాఖ పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి
-
వెనుకబడిన జిల్లాపై సీఎం జగన్ ఔదార్యం
ఒకరు వీర విధేయుడు.. మరొకరు స్థిత ప్రజ్ఞుడు. ఒకరేమో అనుభవజ్ఞుడు. మరొకరేమో పనిలో సమర్థుడు. పార్టీపై చూపిన విశ్వసనీయతకు, పనిలో చూపిన దక్షతకు ఇద్దరికీ సముచిత గౌరవం లభించింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఆది నుంచి వైఎస్ జగన్ వెన్నంటే నడిచిన ధర్మాన కృష్ణదాస్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఇక తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచినా పాలనా పద్ధతుల్లో చూపిన చొరవ, సమస్యల పరిష్కారంలో ప్రదర్శించిన చతురత సీదిరి అప్పలరాజును మంత్రిని చేసింది. వీరిద్దరూ అమరావతిలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కోలుపై వైఎస్ జగన్ తన ప్రేమను మరోసారి ఇలా చాటుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అభిమానాన్ని మరోసారి చూ పించుకున్నారు. ఇప్పటికే ఉద్దానం కిడ్నీ పరిష్కార బాధ్య తను భుజానికెత్తుకున్నారు. రీసెర్చ్ సెంటర్‌తో పాటు ఆస్ప త్రి నిర్మిస్తున్నారు. మత్స్యకారుల వలసలు తగ్గించేందుకు జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రవాణా, ఎగుమతుల కోసం భావనపాడు పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు వేయిస్తున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్లో బీసీ వర్గాలకు ఇద్దరి నేతలకు అగ్రతాంబూలం ఇచ్చారు. ఒకర్ని స్పీకర్‌ని చేయగా, మరొకర్ని మంత్రిని చేశా రు. అంతటితో ఆగకుండా మరో వెనకబడిన వర్గానికి చెందిన విద్యావంతుడికి మంత్రి వర్గంలో చోటు కలి్పంచారు. మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి కట్టబెట్టి సిక్కోలుకు రాజకీయంగా, అధికారికంగా పెద్దపీట వేశారు. దీంతోపాటే మంత్రి కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి గౌరవాన్ని పెంచారు. అనుభవం.. విధేయత ఒకవైపు అనుభవజు్ఞలకు పెద్దపీట వేస్తూనే, వినయ విధేయతతో పనిచేసే వారికి పట్టం కడుతూ కొత్త తరాన్ని వైఎస్ జగన్ ప్రోత్సహిస్తున్నారు. వెనకబడిన వారిలో అన్ని వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఇంతవరకు మత్స్యకార సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చిన దాఖలాల్లేవు. దాన్ని తిరగ రాస్తూ ఉత్తరాంధ్రలో, అదీ వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలోని అట్టడుగు వర్గానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గ నేత, కొత్త రక్తం సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చి బీసీలపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ బీసీకి చెందిన త మ్మినేని సీతారాంను స్పీకర్‌గా కూర్చోబెట్టి, మరో బీసీ వర్గానికి చెందిన ధర్మా న కృష్ణదాస్‌ను మంత్రిని చేశారు. తాజాగా సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇవ్వడం చూస్తుంటే రాజకీయాల్లో సరికొత్త అధ్యాయంగా పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఉండాలంటే కుటుంబ నేప థ్యం ఉండాలని, డబ్బులుంటేనే రాజకీయం చేయగలమని, అనుభవం ఉంటేనే అందలమెక్కుతామనే రోజులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారు. దక్షత ఉంటే సాధారణ వ్యక్తిని సైతం ఉన్నత పదవిలో కూర్చోబెట్టొచ్చని చేసి చూపించారు. దాసన్నకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి విధేయతకు ఎప్పుడూ పార్టీ, ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిరూపించారు. వీర విధేయుడు.. మృదు స్వభావి... సౌమ్యు డు.. ఇతరులకు సహాయపడాలనే మంచి మనసున్న వాడు.. వివాద రహితుడు. ఇవే ధర్మాన కృష్ణదాస్‌ను రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నాయి. ఏ స్థాయి లో ఉన్నా సామాన్యుడిగా నడవడమే తన సహజ తత్వమని తెలియజేసే నేత ఆయన. పార్టీ పట్ల వినయం, అధినేతపై విధేయత ఆయన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. అభిమానించే నేత కోసం ఎమ్మెల్యే పదవిని సైతం తృణపాయంగా వదిలేసి, కష్టాల్లో అండగా నిలిచి తాను కష్టాలను చవి చూసి రాజకీయంగా ఎదురీదిన నేతగా జిల్లాలో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే తాను అని పట్టుదలతో ఉండిపోయారు. ఆ విధేయతే శ్రీకాకుళం జిల్లా నుంచి తొలి ఉపముఖ్యమంత్రిగా ఎదిగేందుకు దోహదపడింది. 2019 ఎన్నికల్లో గెలిచిన కృష్ణదాస్‌కు సీఎం వైఎస్ జగన్ మంత్రి పదవి ఇచ్చారు. కీలకమైన రోడ్లు, భవనాల శాఖను అప్పగించా రు. నాటి నుంచి మచ్చ లేకుండా పనిచేస్తూ వచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మంచితనం, నడవడికే ఇప్పుడు మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. 2003లో రాజకీయ ప్రవేశం చిన్న తనం నుంచీ రాజకీయంగా ఉత్సాహం ఉన్నా తమ్ముడు ప్రసాదరావు రాజకీయాల్లో ఉండటంతో ఆయనకు వెనక నుంచి మద్దతు ఇస్తూ ఉండేవారు. 2003లో వైఎస్సార్ పాదయాత్రలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయనతో కలసి నడిచారు. వైఎస్ నింపిన స్ఫూ ర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో మొదటి సారి అసెంబ్లీకి నరసన్న పేట నుంచి పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించా రు. తర్వాత 2009, 2013 ఉపఎన్నికల్లో విజయం సాధించారు. 2013 ఉప ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఎంత ఒత్తిడి చేసినా జగన్ వెంటే నడిచారు. విజయమ్మ, షరి్మళ వెన్నంటే ఉండి నరసన్నపేట నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దాసన్నకు వైఎస్ కు టుంబమంటే మక్కువ. జగన్మోహన్ రెడ్డి అంటే మరింత అభిమానం విద్యా కెరటం పుట్టింది సాధారణ మత్స్యకార కుటుంబంలో.. చదువుకున్నది మామూ లు ప్రభుత్వ పాఠశాలల్లో. అయినా ఆయన ఎదుగుదల ఆగలేదు. చదువుకున్నప్పటి నుంచి అందరి కంటే చురుగ్గా వ్యవహరించడం అలవాటున్న సీదిరి అప్పలరాజు రాజకీయాల్లోనే అదే వేగం చూపిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం, తొలి ఎన్నికలోనే గౌతు వంశీయురాలిపై అఖండ విజయం సాధించడం, కొద్ది రోజుల్లోనే నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందడం, ఆపై మంత్రిగా ఎదగడం అన్నీ చాలా వేగంగా చేసి చూపించారు. అయితే ఆయన నేప థ్యం మాత్రం ఆసక్తికరం. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడి తీరులో ఎదుగుతున్న అప్పలరాజు ప్రయాణం అందరికీ ఆదర్శప్రాయం. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తా డ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్వ గ్రామం. స్థానిక పాఠశాలలోనే 7వ తరగత వరకు చదివి జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించారు. తండ్రి నీలయ్య చేపల వేట చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. తల్లి దాలమ్మ ఆ చేపలు విక్రయించేవారు. అప్పలరాజు చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు సంపాదించారు. పెద్దన్నయ్య త్రినాథ్, రెండో అన్నయ్య చిరంజీవి సోదరి కౌసల్యలు కూడా చదివేవారు. అయితే 12 ఏళ్ల వయసులో కౌసల్య గుండ సంబంధిత సమస్యతో చనిపోవడంతో ఆ అన్నదమ్ములు చదువు మానేసి వలస మత్స్యకారులయ్యారు. బొంబాయి వరకు వల స వెళ్లి తండేలి (బోటు నడిపి, చేపల వేట చేసే నాయకుడు)గా పని చేసేవారు. ఆ డబ్బుతోనే అప్పలరాజు చదువుకునేవారు. ఎంబీబీఎస్, పీజీ చ దువులకైతే అప్పులు చేయక తప్పలేదు. కుటుంబ సభ్యుల కష్టాన్ని అప్పలరాజు అర్థం చేసుకుని చదివారు. మంచి వైద్యుడిగా గుర్తింపు సాధించారు. ఇప్పటికీ దేవునల్తాడ గ్రామంలో డాక్టర్ అప్పలరాజుకు 12 అడు గుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో ఉన్న రెండు గదులతో ఉన్న చిన్నపాటి ఇల్లు ఉంది. ప్రస్తుతం ఇందులో అప్పలరాజు రెండో అన్నయ్య సీది రి చిరంజీవి నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ సీదిరి చిరంజీవి సంద్రంలో వేట సాగిస్తున్నారు. అప్పలరాజు చదువే పెట్టుబడిగా చక్కటి ప్రతిభ కనబరిచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనలో ఉన్న విశేషమేమిటంటే మనçస్పూర్తిగా ఏ కార్యం తలపెట్టినా అందులో విజయం వరించాల్సిందే. బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. -
‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాద స్థలంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి మంత్రుల బృందంతో సమామేశమై తాజా పరిణామాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. సాయంత్రానికి 48 గంటల పూర్తవుతున్ననేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు ఐదు గ్రామాల ప్రజలను వెనక్కి పంపించే విషయమై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. (చంద్రబాబు హయాంలో రూ. కోటి పరిహారం ఇచ్చారా? ) ప్రస్తుతం స్టైరిన్ అదుపులోకి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లడం దారుణమని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఎల్జీ పాలిమర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏం చర్యలు తీసుకున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. సింహాచలం దేవస్ధానం భూములను సైతం డీనోటిఫై చేయలేదా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండానే ఫ్యాక్టరీ విస్తరణకు మీరు ఎలా అనుమతులిచ్చారని ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. (బాబు నిర్వాకం.. విశాఖకు శాపం) చంద్రబాబు తప్పిదాల వల్లే ఈ రోజు ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ప్రమాదం జరిగి ఉండేది కాదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. చంద్రబాబు తప్పు చేసి తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఏ నాయకుడు స్పందించని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి రూ.కోటి నష్ట పరిహారం ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. రూ.30 కోట్లు విడుదల చేస్తూ జీఓ కూడా జారీ చేశామని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చర్యలపై ప్రతిపక్షాలన్నీ అభినందించినా చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు కుటిల రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయని మంత్రి మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా పలు కమిటీలు వేశామని ఆయన తెలిపారు. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. అన్ని కమిటీల సూచనలతో భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
రాజధానిపై చంద్రబాబు విఙ్ఞత ఏమైంది?
-
ప్రతి నియోజకవర్గంలో జాబ్‌మేళాలు
సాక్షి, నరసన్నపేట: డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ మేళాలో 30 కంపెనీ ప్రతినిధులు పాల్గొనగా, జిల్లా వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. 4,723 మంది నిరుద్యోగులు తమ అభ్యరి్థత్వాన్ని నమోదు చేసుకోగా, వీరిలో 1,653 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. మరో 432 మంది విశాఖపట్నంలో శిక్షణకు పంపారు. ముందుగా ఈ మేళాను ప్రారంభించిన ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో దేశ చరిత్రలోనే నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రుజువైందన్నారు. అదేవిధంగా పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రతీ నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి వందలాది మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగులు ఉపాధి జ్యోతిని వినియోగించుకోండి.. ఆగస్టు 23న ప్రారంభించిన ఉపాధి జ్యోతి పథకాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని మంత్రి కృష్ణదాస్ కోరారు. ఈ వెబ్సైట్లో జిల్లా నుంచి 30 వేల మంది, నరసన్నపేట నియోజకవర్గం నుంచి 5,300 మంది నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్సైట్లో నమోదు చేసుకున్న వారికి జాబ్‌మేళాలో ప్రాధాన్యమిస్తామన్నారు. పార్టీ యువజన విభాగం ప్రతినిధి ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రతీ ఆర్నెల్లకోసారి నరసన్నపేటలో జాబ్‌మేళా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పరిశీలించిన కలెక్టర్.. జాబ్‌మేళా నిర్వహణ తీరును కలెక్టర్ జే నివాస్ పరిశీలించారు. ఇక్కడ నిరుద్యోగులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అధిక మంది నిరుద్యోగులను ఎంపిక చేయాలని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కల్యాణచక్రవర్తి, నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్ గోవిందరావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కరిమి రాజేశ్వరి, సీడాప్ మేనేజర్ రామ్మోహన్, వైఎస్సార్సీపీ నాయకులు చింతు రామారావు, ఆరంగి మురళి, మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
'ఆయనకు చదువు అబ్బక ఇక్కడే ఉండిపోయారు'
సాక్షి, రాజాం/రూరల్: ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించాలంటే ప్రాథమిక విద్య చాలా బలంగా ఉండాలని, అప్పుడే విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకుంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. గురువారం పొగిరి జెడ్పీ హైస్కూల్ వద్ద ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ప్రారంభించారు. శిలాఫలకాన్ని పాఠశాల ఆవరణలో ఆవిష్కరించి, సరస్వతీదేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యలో స్పష్టమైన మార్పు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేకతను తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పేదల పక్షపాతి అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించేందుకు వీలుగా ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తప్పనిసరిగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుందన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డి చాలా చోట్ల విద్యార్థులతో మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలల రూపురేఖలు మార్చుతామని హామీ ఇచ్చారని, ఇందులో భాగంగానే ఈ బృహత్తర కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 16 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 33 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొడాలి నాని అయోమయంలో చంద్రబాబు చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయిన బాధ నుంచి తేరుకోలేకపోతున్నారని, ఇంకా అయోమయంలోనే కొనసాగుతున్నారని కొడాలి నాని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెడుతుంటే విమర్శలకు దిగుతున్న చంద్రబాబు... ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో గండిపేటలో నిర్వహిస్తున్న పాఠశాల ఏ మీడియంలో నడుస్తుందో ప్రజలకు చెప్పాలని సవాలు విసిరారు. ఇంగ్లీషు మాధ్యమంలో బోధిస్తే విద్యార్థులు మట్టి కొట్టుకుపోతారని పవన్ కళ్యాణ్ విమర్శించారని, మరి తన పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో కనీసం తన అభిమానులకైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పనిపాట లేక విజయవాడ చుట్టుపక్కల తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన సోదరుడి కొడుకైన ఎంపీ రామ్మోహన్నాయుడు బహుశా ఇంగ్లీషు మీడియంలో చదివి ఉండడం కారణంగానే ఢిల్లీలో బాగా మాట్లాడగలుగుతున్నారని గుర్తు చేశారు. ఈయనకు ఆ చదువు అబ్బక ఇక్కడే ఉండిపోయారన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యంపై సీఎం దృష్టి జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు నెహ్రూ జయంతి సందర్భంగా ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరేవి కావని, ఇలా చేస్తే కార్పొరేట్ పాఠశాలలు నష్టపోతాయని వారు భావించేవారని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం, మైదానాలు, నీటి సౌకర్యం, బెంచీలు, లైట్లు, ఇంగ్లిషు ల్యాబ్‌లు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులెడుతుందన్నారు. సమావేశానికి హాజరైన మహిళలు, విదార్థులు, పెద్దలు సామాజిక పింఛన్లు పెంపు, ఆశా కార్యకర్తలు, వెలుగు యానిమేటర్ల గౌరవ వేతనం పెంపు, ఆటో డ్రైవర్లకు రూ.10 వేల నగదు సాయం, అగ్రి గోల్డ్ బాధితులకు రూ.10 వేలు పంపిణీ, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతులందరికీ ఆర్థిక చేయూత, 4 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన వంటివి చేపట్టారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ మాట్లాడుతూ యువత అంతా వైఎస్సార్సీపీ వైపు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎస్వీ రమణారావు, రాజాం కన్వీనర్లు పాలవలస శ్రీనివాసరావు, లావేటి రాజగోపాలనాయుడు, జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, టంకాల అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసీ శ్రీనివాస్, డీఈఓ కె.చంద్రకళ, పాలకొండ ఆర్డీఓ టి.వి.ఎస్.జి.కుమార్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి బి.శాంతికుమారి, రాజాం మండలం ప్రత్యేకాధికారి ఎం.జగన్నాధం తదితరులు ఉన్నారు. థ్యాంక్యూ సీఎం... ఈ సమావేశంలో పొగిరి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాథ్యమం ప్రవేశపెట్టడం ద్వారా తమకు ఎంతో బాగుంటుందని వారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలు మరువలేమన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్, సీదిరి అప్పలరాజు గురువారం చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం బాధితులను ఆదుకున్నారని అన్నారు. మిగతా డిపాజిటర్లకు కూడా మరో దశలో చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. నమ్మకమైన చట్టబద్ధత సంస్థలోనే మీ కష్టార్జితం పెట్టుబడి పెట్టండని మంత్రి బాధితులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు, కన్నీళ్లు సీఎం జగన్ అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలే అగ్రిగోల్డ్ కుట్రదారులని, సంస్థ ఆస్తులను చౌకగా లాగేసుకొవడానికే డిపాజిట్ దారులను నిలువునా మోసం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడతూ.. సీఎం జగన్ పేదలకు అండగా ఉండాలనే సంకల్పంతో ఉన్నారని, మోసపోయి కష్టాల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ఆగ్రి గోల్డ్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రతి ఒక్క బాధితుడిని సీఎం జగన్ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్థలు మోసం చేస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చెల్లించిన సందర్భం లేదని, అగ్రిగోల్డ్ హాయ్ లాండ్ భూములను కాజేయాలని గత ప్రభుత్వం లక్షల మంది డిపాజిట్ దారులను మోసం చేసిందని ఆయన అన్నారు. బాధితుల కష్టార్జితం ఒక్కపైసా కూడా నష్టపోకుండా సీఎం జగన్ తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకున్నారని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. -
పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని
సాక్షి, టెక్కలి: ఇసుక విధానంపై కనీస అవగాహన లేని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పవన్‌ను రాజకీయ అజ్ఞానిగా భావించవచ్చునని, ఆయన చేయబోయే లాంగ్‌మార్చ్ ప్రజలను వంచించడానికేనన్నారు. ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని, టెక్కలి, నరసన్నపేట తదితర కేంద్రాల్లో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేందుకు గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్‌కు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒకే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. తొలి నుంచీ ఇద్దరికీ రాజకీయ బంధం ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడంతో మరోసారి బట్టబయలైందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.రాజు, పార్టీ నాయకులు అన్నెపు రామారావు, దుబ్బ వెంకటరావు, పేడాడ వెంకటరావు, ఆర్.శైలేంద్రకుమార్, బోయిన నాగేశ్వరరావు, దుక్క రామకృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ అంతకుముందు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. పాఠశాల వసతి సమస్యలు, ఉపాధ్యాయుల జీతభత్యాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రజలు బుద్ధి చెప్పినా.. తీరు మారలేదు.. !
సాక్షి, నరసన్నపేట: ‘ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతికి, చూపించిన నరకానికి ప్రజలు మీకు ఓటుతో బుద్ధి చెప్పారు.. సీనియార్టీ పేరుతో చేసిన దారుణాలను చూసి, విశ్రాంతి తీసుకోమని ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు.. అ యినా మీరు మారలేదు.. తన పాలనతో ప్రజ ల ప్రశంసలు అందుకుంటున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డినే విమర్శించడానికి తెగించారు.. ఇది తగదు..’ అని శ్రీకాకుళంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. రెండు రోజు ల పర్యటనకు సోమవారం శ్రీకాకుళం వచ్చిన చంద్రబాబు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశంలోనే ఒక రోల్ మోడల్ సీఎంగా పేరు తెచ్చుకొని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజలందరి మన్ననలు పొందుతుంటే ఓర్వలేక, సిగ్గులేక విమర్శలు చేయడం తగదన్నారు. ‘అసెంబ్లీలో 23 మంది టీడీపీ సభ్యులను పులులుగా మీరు వర్ణించుకుంటున్నారు.. అయితే అవి నిజమైన పులులు కాదు .. కాగితం పులులు’ అని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలు పదేళ్ల తరువాత 2014లో అధికారం ఇస్తే ఒక వర్గానికి, ఒక పార్టీకి ప్రయోజనం కల్గిస్తూ చేసిన పాలన ప్రజలు మరిచిపోలేదన్నారు. ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు పథకాలు చేరుతున్నాయని, నీ పాలనలో ఒక్క పథకమైనా సక్రమంగా అమలు చేశావా బాబూ అని మంత్రి నిలదీశారు. ఉచిత ఇసుక పేరున టీడీపీ నాయకులు ఎంత దోచుకున్నారో తెలీంది కాదన్నారు. నాలుగు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని, ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి చెప్పి పారదర్శతకు పెద్ద పీట వేశారని, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ వాహనమిత్ర వంటి పథకాలను కొద్ది కాలంలోనే అమలు చేసి చూపించారన్నారు. వైఎస్ జగన్ పాలనలో బీసీలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ‘నీ తీరు.. నీ ప్రసంగాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. నీ చుట్టూ ఉన్న కొందరు జే కొడితే ఏదో అనుకుంటున్నావు.. వాస్తవాలు గ్రహించండి‘ అని హితవు పలికారు. ‘నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఎవరూ నమ్మరు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అసలు నమ్మరు. నీకు, నీ కోటరీ నాయకులకు ప్రజలు మున్ముందు మరింత దిమ్మతిరిగే తీర్పులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‘ని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రేలాపనలు ఆపి సది్వమర్శలు చేస్తే స్వీకరిస్తామని హితవు పలికారు. -
అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పరువు తీస్తున్నారు..
సాక్షి, అమరావతి: టీడీపీ నేత అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పరువు తీస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు తీరుపై మండిపడ్డారు. పోలీస్ అధికారులను యూజ్లెస్ ఫెలో అనడం శోచనీయమన్నారు. ప్రశాంత రాష్ట్ర్రంలో అశాంతి వాతావరణం సృష్టించడానికి ఎత్తుగడలు వేసి.. టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు షో అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. -
ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాం
-
‘అలాంటి నాయకుడు సీఎం జగన్ ఒక్కరే’
సాక్షి, శ్రీకాకుళం : చెప్పిన మాట ప్రకారం చేస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అప్పలరాజు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం యువకులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించారు. పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ ఆసుపత్రికి శంకుస్థాపనతో ప్రజల కోరిక నెరవేరిందన్నారు. రూ. 600కోట్లతో ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయటం హర్హణీయమన్నారు. ఉద్దానం పునర్నిర్మాణానికి సీఎం జగన్ కృషి అభినందనీయమన్నారు. 100 రోజుల పాలనలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు: ధర్మాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 100రోజుల పాలనలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ చేసిన చట్టాలు చారిత్రాత్మకమైనవి: తమ్మినేని ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన చట్టాలు చారిత్రాత్మకమైనవని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని అన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలనలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. -
దశల వారీగా దేవాలయాల అభివృద్ధి : మంత్రి వెల్లంపల్లి
శ్రీకాకుళం: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించబడిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లా సందర్శనలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాసుతో కలసి ఆరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను అర్చకులు శంకర శర్మ మంత్రికి వివరించారు. స్వామి వారి దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని రాబోయే ఐదు సంవత్సరాల్లో జిల్లాను అభివృద్ధి చేసి చూపుతామన్నారు. రాష్ట్రంలో దశల వారీగా దేవాలయాలు అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవాలయాల అభివృద్ధిలో భాగంగా అరసవెల్లి , శ్రీకూర్మం దేవాలయాలను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభమయిందన్నారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాసు కోరిన విధంగా త్వరలోనే శ్రీకూర్మంలో నిత్యఅన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో దశల వారీగా దేవాలయాలు, టూరిజం వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. -
దుర్గగుడి ఫ్లైఓవర్ విజయవాడకు ప్రతిష్టాత్మకం
-
డిసెంబర్‌కల్లా దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి
సాక్షి, విజయవాడ: ఈ ఏడాది డిసెంబర్ నాటికి దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. పనుల జాప్యంపై మంత్రులు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ.. దుర్గగుడి ఫ్లైఓవర్ విజయవాడ నగరానికే ప్రతిష్టాత్మకమని అన్నారు. తొలి ప్రాధాన్యతగా ఫ్లైఓవర్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిజైన్ మార్పుతో పాటు, వయాడక్ట్ ఏర్పాటు చేయడం లాంటి పనుల వల్ల బడ్జెట్ పెరిగిందన్నారు. ఫ్లైఓవర్ పనుల కోసం నెలరోజులపాటు ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. -
ప్రజల పక్షపాతి జగన్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయ న కుమారుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రజల పక్షపాతి. మాట మార్చ రు, మడమ తిప్పరు అనేది వైఎస్ వంశంలోనే ఉంది’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామా త్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘ఇన్నాళ్లూ హామీలు ఇచ్చి మరచిపోయే ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాటన్నింటినీ రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో జగన్ చూశారు. తమ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఇచ్చిన ప్రతి హామీ, ప్రతి వాగ్దానమూ నెరవేర్చే దిశగా యువ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుం టున్నారు. అందులో భాగంగానే గత వారం రోజుల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో సోమవారం జరిగిన క్యాబినెట్ తొలి సమావేశమే అద్భుతం. ఆ మంత్రివర్గంలో సభ్యుడిగా నేనూ పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది’ అని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉద్వేగంతో చెప్పారు. బుధవారం అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... ‘మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయే నాయకుడు కాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ, వాగ్దానాన్నీ అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదీ పూర్తి పారదర్శక విధానంతో అవినీతికి ఆస్కారం లేకుండా పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానంలోనే తమ ప్రభుత్వం పనిచేస్తుం దని ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారం రోజునే జగన్ విస్పష్టంగా ప్రకటించారు. శాసనసభాపక్ష సమావేశంలోనూ, క్యాబినెట్ మీటింగ్‌లోనూ మాకు కూడా అదే దిశానిర్దేశం చేశారు. మరో విశేషమేమిటంటే జగన్ మంత్రివర్గ కూర్పు. బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన మాదిరిగానే తు.చ తప్పకుండా అమలుచేయడం ఆయన విశ్వసనీయతకు అద్దం పడుతోంది. నవరత్నాలు అమలు మా పార్టీ వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోలో జగన్ రూపకల్పన చేసి నవరత్నాల్లాంటి పథకాలను పొందుపరిచారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటిని అమలు చేసేందుకు ఆయన కనబరుస్తున్న శ్రద్ధాసక్తులు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన వారి జీవితాలను మెరుగుపరుస్తుంది. 2004 సెప్టెంబరు తర్వాత ఉద్యోగాలు పొందినవారికి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌ను దూరం చేసే సీపీఎస్ విధానం రద్దుకు తీసుకున్న నిర్ణయం అద్భుతం. రైతులపై మమకారం.. వ్యవసాయం దండగని తన మనసులో మాటను బయటపెట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతుల పట్ల వివక్షనే చూపించారు. కేవలం అధికారంలోకి రావడానికే రైతు రుణాలన్నీ మాఫి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి గత ఐదేళ్లలో చూశాం. అందుకు భిన్నం మా ప్రభుత్వం. రైతులపై గౌరవం ఉంది. వ్యవసాయం అంటే మమకారం ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రకటించారు. ఆయనకంటే అన్నదాత అభిమాని ఇంకెవరూ ఉండరు. విప్లవాత్మకమైన మార్పులు.. అమ్మ ఒడి పథకం నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ వరకూ అన్ని అంశాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయన పరిపాలనలో రాష్ట్ర ప్రజలు నిజమైన, మెరుగైన జీవన ప్రమాణాలు పొందుతారనడంలో సందేహం లేదు. ప్రభుత్వపరంగా అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు చేయాలనే సంకల్పం ఆయనది. ప్రతిపక్షం నుంచి మాటల్లేవ్.. రాష్ట్ర శాసనసభ బుధవారం కొలువుదీరుతున్న వేళ యువ ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చూసి ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నోట మాటే కరువైంది. ఒకప్పుడు జగన్ ఇస్తున్న హామీలను ఎద్దేవా చేసింది వారే. ఆ హామీలు సాకారమవుతుంటే ఏమంటారని ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మూలాలతో సహా పెకిలించి త్వరలోనే ఆయా నాయకుల జాతకాలు బయటపెడతాం. ప్రజా సంక్షేమ ప్రభుత్వం మాది.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల వరకూ జీతాలు, వేతనాల్లో ఒకేసారి మార్పుతీసుకొచ్చిన ప్రభుత్వం మాది. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి జగన్ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు జగన్. ఆయన మంత్రివర్గంలో నాకు చోటుదక్కడం నా జీవితంలో ఓ అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నా. నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. జిల్లా అభివృద్ధికి నా వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తా.’ -
ప్రజలను ముంచిన చంద్రబాబు
వంగర : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే రాజన్నరాజ్యం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. గురువారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషిచేశారన్నారు. ఆయన హాయాంలో కుల,మత,వర్గాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించి రాష్ట్రప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్ అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేసి ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. పేదల పథకాలను విస్మరించి టీడీపీ ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు అండగా నిలిచిందన్నారు. అర్హత లేని జన్మభూమి కమిటీల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పచ్చచొక్కాల వారికే ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు అబద్దాలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అధికారం దక్కించుకుని ఆ తర్వాత ప్రజలను నట్టేట ముంచారన్నారు. 2050 నాటికి అత్యాధునిక హంగులతో రాజధాని నిర్మాణం చేస్తామని చెబుతున్న చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్లలో మూడేళ్లు పూర్తయిందని తెలిపారు. ఇంటికో ఉద్యోగం అన్నారే తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. డ్వాక్రా,రైతు రుణాలు మాఫీ పేరుతో మహిళలు, రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. వంశధార,తోటపల్లి,ఆఫ్‌షోర్ ప్రాజెక్టులు నిర్మించిన ఘనత వైఎస్‌దేనన్నారు. టీడీపీ ప్రాజెక్టులను నిర్మిస్తుందని గొప్పలు చెబుతున్నా రైతులు ఎవరూ చంద్రబాబును నమ్మరన్నారు. నవనిర్మాణ దీక్షలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని, ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందన్నారు. మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో ఏడు నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు పునరావాసం కల్పించక అవస్థలు పడుతున్నారని, పట్టించుకునే నాధుడే లేడని, గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ అభిమానులు, లబ్దిదారులకు కనీసం పెన్షన్లు, ఇళ్లు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చేస్తున్నారని గీతనాపల్లి సర్పంచ్ నెయిగాపుల శివరామకృష్ణ సమస్యలను కృష్ణదాస్‌కు వివరించారు. టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, రానున్నది రాజన్నరాజ్యమేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీసీ జిల్లా కార్యదర్శి ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, జలుమూరు మండల జెడ్పీటీసీ మెండ విజయశాంతి, మెండ రాంబాబు, జలుమూరు మండల వైసీపీ కన్వీనర్ ఎం.శ్యామలరావు, కొయ్యాన సూర్యారావు, మండల విప్ బుక్కా లక్ష్మణరావు, మల్లిఖార్జున చేనేత సంఘం అధ్యక్షుడు చల్లా సాంబశివరావు, వంగర మండల నేతలు పనస రమణనాయుడు, పొదిలాపు రామినాయుడు, నెయిగాపుల ప్రసాదరావు,జలుమూరు,వంగర మండలాలకు చెందిన పలువురు నాయకులు,సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
19, 20 తేదీల్లో జిల్లాలో జగన్ పర్యటన
-
19, 20 తేదీల్లో జిల్లాలో జగన్ పర్యటన
హిరమండలం: వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. హిరమండలంలో ఈనెల 19న ఆయన పర్యటించనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. స్థానిక ప్రైవేటు కల్యాణ మండపంలో సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార నిర్వాసితులను ఆదుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్వాసితులను క్షోభ పెడుతోందని తెలిపారు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వాసితుల కన్నీళ్లు తుడవడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బహిరంగ సభ కోసం స్థల పరిశీలన కూడా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అల్లు కృష్ణారావు, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు శంకర్రావు, త్రినాథరావు, ప్రసాద్, షన్ముఖరావు, నాయకులు మురళి, కన్నయ్య, సత్యన్నారాయణ, రవివర్మ, నరేష్, కొల్ల కృష్ణ పాల్గొన్నారు. కన్నీళ్లు తుడవడానికే.. శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ప ర్యటన ద్వారా వంశధార నిర్వాసితులను, ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ రోగులను కలసి వారి సమస్యలను తెలుసుకుంటారని రెడ్డి శాంతి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ హ యాంలో వంశధార ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారని, కానీ ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆమె ఆరోపించారు. టీడీపీ నాయకులు ప్రాజెక్టు నిర్మాణంపై కనీస శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ఏడాది బడ్జెట్లో కనీస నిధులు కూడా కేటాయించలేదన్నారు. ప్రాజెక్టు పరిధిలో 29 గ్రామాలు ఉండగా వారెవ్వరికీ ఎలాంటి ప్యాకేజీ ఇ వ్వలేదన్నారు. గత ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట తన స్వలాభం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలోకి చేరారని మండిపడ్డారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణం వల్ల పునరావాసం లేకుండా, నష్టపరిహారం అందకుండా 8 వేల కుటుం బాలు రోడ్డున పడ్డాయని చెప్పారు. రణస్థలం మండలం కొవ్వాడ ప్రాంతంలో నిర్మించనున్న అణుప్రాజెక్టు కోసం ఆ ప్రాంతంలో భూసేకరణ చేపడితే అక్కడి వారికి ఎకరాకు రూ. 11లక్షల నుంచి 14లక్షల వరకూ ప్రభుత్వం చెల్లిస్తోం దని, వంశధార ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసిత రైతులకు మాత్రం కంటితుడుపు చర్యగా నగదు చెల్లించడం శోచనీయమన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి వంశధార నిర్వాసితులకు అండగా నిలబడతారని తెలిపారు. అలాగే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో కిడ్నీ వ్యాధికి గల కారణాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని కూడా వేశారని, ఆయన మరణం తర్వాత అది మరుగున పడిందన్నారు. టీడీపీ ప్రభుత్వం కిడ్నీ రోగులకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నామమాత్రంగా చర్యలు చేపడుతోందని, జగన్మోహనరెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. -
కొణతాలకు పరామర్శ
శ్రీకాకుళం న్యూకాలనీ: సతీ వియోగంతో బాధ పడుతున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతిలు పరామర్శించారు. వీరు సోమవారం అనకాపల్లిలోని కొణతాల నివాసానికి వెళ్లి ఆయనను ఓదార్చారు. ఈ సందర్భంగా కొణతాల భార్య సుజాత చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కొణతాలను పరామర్శించిన వారిలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు ఎ.మురళీధరరావు, బి.ఈశ్వరరావు, కె.రమణమూర్తి, తదితరులు ఉన్నారు. -
దేశంలో క్రీడలపై చిన్నచూపు
ప్రభుత్వాల తీరుకు ప్రజాప్రతినిధిగా సిగ్గుపడుతున్నా జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్య ఒక్కో పాఠశాలకు క్రీడలకోసం రూ.లక్ష కేటాయించాలి: ఎమ్మెల్సీ గాదె ప్రారంభమైన మూడు రోజుల జిల్లాస్థాయి సెమినార్ శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రపంచంలో అత్యధిక మానవ వనరులు కలిగిన మన దేశంలో ఇప్పటికీ క్రీడలపై ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తుండడం బాధాకరమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా పీఈటీ సంఘ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కనీస నిధులు కేటాయించకుండా క్రీడలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న తీరు, విధానాలపై ప్రజాప్రతినిధిగా సిగ్గుపడుతున్నానని వాపోయారు. జిల్లా పీడీ, పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో సోమవారం ప్రారంభమైన మూడు రోజుల జిల్లాస్థాయి వ్యాయామోపాధ్యాయుల సెమినార్ కమ్ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తెలుగుతేజం సింధూను అభినందించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతూ వేలాది కోట్లు ఖర్చుపెట్టే ప్రభుత్వాలు.. వ్యాయామం, క్రీడలతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందన్న విషయాన్ని గుర్తించలేకపోవడం బాధాకరమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకిS వస్తే రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంద్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ క్రీడాకారులు పతకాలు సాధించి తెచ్చిన తర్వాత ఇచ్చే ప్రోత్సాహాకాలను, క్రీడాకారులు తయారుచేసే సమయంలో కేటాయింపు చేస్తే ఎంతో మంది ఒలింపియన్లను తయారుచేయవచ్చన్నారు. ప్రతి జిల్లాకు ఒక స్పోర్ట్స్ స్కూల్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి హైస్కూల్‌కు క్రీడల నిర్వహణ, క్రీడా పరికరాల కోసం తక్షనమే రూ.లక్ష చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ క్రీడలతోనే దేశం గుర్తింపు పొందుతుందన్నారు. డీఈఓ డి.దేవానందరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి పీడీ, పీఈటీలకేనని అన్నారు. విద్యార్థులను క్రీడాకారులగా మలచాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈఓ ఎ.ప్రభాకరరావు మాట్లాడుతూ ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా క్రీడల దినోత్సవానికి రూ.50వేల నిధులు జిల్లాకు వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్వీఎం పీఓ త్రినాథరావు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, రాష్ట్ర పీఈటీ సంఘం అధ్యక్షులు బి.కరిముల్లారావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, జిల్లా డిప్యూటీ విద్యాధికారులు వి.ఎస్.సుబ్బారావు, బి.సత్యనారాయణమూర్తి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.బాబూరావు, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా పీఈటీ సంఘ ముఖ్య ప్రతినిధులు వై.పోలినాయుడు, ఎం.సాంబమూర్తి, కె.రాజారావు, వెంకటరమణ, ఎస్.సూరిబాబు, శేఖర్, హరిబాబు తదితరులు ప్రసంగించారు. అనంతరం పీఈటీలకు పలు అంశాల్లో అవగాహన కల్పించారు. పీఈటీలుగా గుర్తించండి కస్తూరిబా విద్యాలయాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8.30 వరకు హాస్టల్ వార్డెన్ల మాదిరిగా పనిచేస్తున్న పీఈటీలను గుర్తించాలంటూ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడుకు విన్నవించారు. విద్యాలయాల్లో తమను పీఈటీలుగా పరిగణించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో రమణమ్మ, దీపిక, నీరజ, భారతి, సన్యాసమ్మ, తదితరులు ఉన్నారు. -
పరిశీలకులను నియమించిన వైఎస్సార్ సీపీ
-
‘స్థానిక’ ఎన్నికల వైఎస్సార్సీపీ పరిశీలకులు వీరే!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులను నియమించింది. ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, ఎం.ప్రసాదరాజు (శ్రీకాకుళం), పిరియా సాయిరాజ్, సుజయ్ కృష్ణ రంగారావు, కోలగట్ల వీర భద్రస్వామి, బెల్లాన చంద్రశేఖర్ (విజయనగరం), తమ్మినేని సీతారాం, గుడివాడ అమర్నాథ్, బొడ్డేటి ప్రసాద్ (విశాఖపట్టణం), జి.ఎస్.రావు, జ్యోతుల నెహ్రూ, ఐ.రామకృష్ణంరాజు(తూ.గోదావరి), ధర్మాన ప్రసాదరావు, ఆదిరెడ్డి అప్పారావు, ఆళ్ల నాని(ప.గోదావరి), కె.పార్థసారథి, పేర్ని వెంకట్రామయ్య, సామినేని ఉదయభాను (కృష్ణా), కొడాలి నాని (విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్), మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణారావు, వి.బాలశౌరి, భూమన కరుణాకర్‌రెడ్డి(గుంటూరు), బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎల్.అప్పిరెడ్డి (ప్రకాశం), వి.ప్రభాకర్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి (నెల్లూరు), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్.అమర్నాథ్రెడ్డి (చిత్తూరు), వైఎస్ అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు (వైఎస్సార్ కడప), అనంత వెంకట్రామిరెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, శంకరనారాయణ(అనంతపురం), భూమా నాగిరెడ్డి (కర్నూలు) పరిశీలకులుగా నియమితులయ్యారు. వీరు కాక ఆయా జిల్లాల్లోని ఎంపీలు కూడా స్థానిక ఎన్నికల పరిశీలకులుగా ఉంటారు. కేంద్ర కార్యాలయంలో ఎంవీ మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పర్యవేక్షక విభాగం సభ్యులుగా వ్యవహరిస్తారు. -
విజయమ్మ పరామర్శ నేడు
కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో పర్యటన శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రచండ పై-లీన్ తుఫాన్ తాకిడికి అతలాకుతలమైన జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం పర్యటించనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో ఈ విషయం పేర్కొన్నాయి. బుధవారం ఉద యం విజయమ్మ హైదరాబాద్‌లో బయలుదేరి 8 గంటలకు విశాఖపట్నం వస్తారు. అక్కడి నుంచి 9.30 శ్రీకాకుళం సింహద్వారం వద్దకు చేరుకుంటారు. స్థానిక నాయకులతో కలసి అక్కడి నుంచి నేరుగా కంచిలి వెళ్తారు. ఆ మం డలంలోని పెద్దకొజ్జిరియా, జాడుపూడి ప్రాం తాల్లో పర్యటిస్తారు. అనంతరం కవిటి మం డలం రాజపురం, జగతి, ఇద్దివానిపాలెంతోపాటు అదే మండలంలోని కళింగపట్నం వె ళ్తారు. అక్కడి నుంచి సోంపేట మండలం ఇసుకలపాలెం చేరుకొని అటు తరువాత తలతంపర మీదుగా బారువ వెళ్తారు. ఆయా ప్రాం తాల్లో తుఫాన్ నష్టాలను పరిశీలించడంతోపా టు బాధితులను పరామర్శించి వారి కష్టనష్టాల ను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళతారు. విజయవంతం చేయండి : కృష్ణదాస్ రిమ్స్‌క్యాంపస్: తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వస్తున్న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులను కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు జిల్లా పార్టీ నాయకులంతా కలసి బాధిత ప్రాంతాల్లో పర్యటించామని, అక్కడి ప్రజల కష్టాలను ఆయనకు తెలియజేయగా విజయమ్మను జిల్లాకు పంపుతున్నారని వివరించారు. తుఫాన్ దాటికి తీవ్ర నష్టం వాటిల్లి ప్రజలు నానావస్ధలు పడుతుంటే, వారిని అదుకోవటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్ర మంత్రుల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించినా కనీసం ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని అన్నారు. కవిటికి వెళ్లిన మంత్రి కొండ్రు మురళీ అసలు ఇక్కడేమీ నష్టం జరగలేదని వ్యాఖ్యానించడం దారుణమని విమర్శించారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ టెక్కలి డివిజన్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. బాధిత ప్రాంతాల్లో ఎక్కడా ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతున్నట్టు లేదన్నారు. బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయటం పట్ల వై.ఎస్.ఆర్ సీపీ ముందుండి నిల్చుంటుందని చెప్పారు. సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, ఆమదాలవలస, ఎచ్చెర్ల సమన్వయకర్తలు బొడ్డేపల్లి మాధురి, గొర్లె కిరణ్‌కుమార్, జిల్లా అడ్హాక్ కమిటీ సభ్యుడు అందవరపు సూరిబాబు, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షులు ధర్మాన ఉదయ్ భాస్కర్, రాష్ట్ర సాంసృ్కతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, తదితరులు పాల్గొన్నారు.