ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 100రోజుల పాలనలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు.