
సాక్షి, శ్రీకాకుళం : చెప్పిన మాట ప్రకారం చేస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అప్పలరాజు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం యువకులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించారు. పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ ఆసుపత్రికి శంకుస్థాపనతో ప్రజల కోరిక నెరవేరిందన్నారు. రూ. 600కోట్లతో ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీటి సరఫరా పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయటం హర్హణీయమన్నారు. ఉద్దానం పునర్నిర్మాణానికి సీఎం జగన్ కృషి అభినందనీయమన్నారు.
100 రోజుల పాలనలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు: ధర్మాన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 100రోజుల పాలనలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.
సీఎం జగన్ చేసిన చట్టాలు చారిత్రాత్మకమైనవి: తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన చట్టాలు చారిత్రాత్మకమైనవని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని అన్నారు. శుక్రవారం సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాసలో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలనలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు.