మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సీదిరి అప్పలరాజు, గవర్నర్, సీఎంలతో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
ఒకరు వీర విధేయుడు.. మరొకరు స్థిత ప్రజ్ఞుడు. ఒకరేమో అనుభవజ్ఞుడు. మరొకరేమో పనిలో సమర్థుడు. పార్టీపై చూపిన విశ్వసనీయతకు, పనిలో చూపిన దక్షతకు ఇద్దరికీ సముచిత గౌరవం లభించింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఆది నుంచి వైఎస్ జగన్ వెన్నంటే నడిచిన ధర్మాన కృష్ణదాస్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఇక తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచినా పాలనా పద్ధతుల్లో చూపిన చొరవ, సమస్యల పరిష్కారంలో ప్రదర్శించిన చతురత సీదిరి అప్పలరాజును మంత్రిని చేసింది. వీరిద్దరూ అమరావతిలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కోలుపై వైఎస్ జగన్ తన ప్రేమను మరోసారి ఇలా చాటుకున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన అభిమానాన్ని మరోసారి చూ పించుకున్నారు. ఇప్పటికే ఉద్దానం కిడ్నీ పరిష్కార బాధ్య తను భుజానికెత్తుకున్నారు. రీసెర్చ్ సెంటర్‌తో పాటు ఆస్ప త్రి నిర్మిస్తున్నారు. మత్స్యకారుల వలసలు తగ్గించేందుకు జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రవాణా, ఎగుమతుల కోసం భావనపాడు పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు వేయిస్తున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్‌లో బీసీ వర్గాలకు ఇద్దరి నేతలకు అగ్రతాంబూలం ఇచ్చారు. ఒకర్ని స్పీకర్‌ని చేయగా, మరొకర్ని మంత్రిని చేశా రు. అంతటితో ఆగకుండా మరో వెనకబడిన వర్గానికి చెందిన విద్యావంతుడికి మంత్రి వర్గంలో చోటు కలి్పంచారు. మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి కట్టబెట్టి సిక్కోలుకు రాజకీయంగా, అధికారికంగా పెద్దపీట వేశారు. దీంతోపాటే మంత్రి కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి గౌరవాన్ని పెంచారు.
అనుభవం.. విధేయత
ఒకవైపు అనుభవజు్ఞలకు పెద్దపీట వేస్తూనే, వినయ విధేయతతో పనిచేసే వారికి పట్టం కడుతూ కొత్త తరాన్ని వైఎస్ జగన్ ప్రోత్సహిస్తున్నారు. వెనకబడిన వారిలో అన్ని వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఇంతవరకు మత్స్యకార సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చిన దాఖలాల్లేవు. దాన్ని తిరగ రాస్తూ ఉత్తరాంధ్రలో, అదీ వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలోని అట్టడుగు వర్గానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గ నేత, కొత్త రక్తం సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చి బీసీలపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ బీసీకి చెందిన త మ్మినేని సీతారాంను స్పీకర్‌గా కూర్చోబెట్టి, మరో బీసీ వర్గానికి చెందిన ధర్మా న కృష్ణదాస్‌ను మంత్రిని చేశారు.
తాజాగా సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇవ్వడం చూస్తుంటే రాజకీయాల్లో సరికొత్త అధ్యాయంగా పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఉండాలంటే కుటుంబ నేప థ్యం ఉండాలని, డబ్బులుంటేనే రాజకీయం చేయగలమని, అనుభవం ఉంటేనే అందలమెక్కుతామనే రోజులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెక్ పెట్టారు. దక్షత ఉంటే సాధారణ వ్యక్తిని సైతం ఉన్నత పదవిలో కూర్చోబెట్టొచ్చని చేసి చూపించారు. దాసన్నకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి విధేయతకు ఎప్పుడూ పార్టీ, ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిరూపించారు.
వీర విధేయుడు..
మృదు స్వభావి... సౌమ్యు డు.. ఇతరులకు సహాయపడాలనే మంచి మనసున్న వాడు.. వివాద రహితుడు. ఇవే ధర్మాన కృష్ణదాస్‌ను రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నాయి. ఏ స్థాయి లో ఉన్నా సామాన్యుడిగా నడవడమే తన సహజ తత్వమని తెలియజేసే నేత ఆయన. పార్టీ పట్ల వినయం, అధినేతపై విధేయత ఆయన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. అభిమానించే నేత కోసం ఎమ్మెల్యే పదవిని సైతం తృణపాయంగా వదిలేసి, కష్టాల్లో అండగా నిలిచి తాను కష్టాలను చవి చూసి రాజకీయంగా ఎదురీదిన నేతగా జిల్లాలో తనకంటూ ఓ చరిత్ర లిఖించుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే తాను అని పట్టుదలతో ఉండిపోయారు. ఆ విధేయతే శ్రీకాకుళం జిల్లా నుంచి తొలి ఉపముఖ్యమంత్రిగా ఎదిగేందుకు దోహదపడింది. 2019 ఎన్నికల్లో గెలిచిన కృష్ణదాస్‌కు సీఎం వైఎస్ జగన్ మంత్రి పదవి ఇచ్చారు. కీలకమైన రోడ్లు, భవనాల శాఖను అప్పగించా రు. నాటి నుంచి మచ్చ లేకుండా పనిచేస్తూ వచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మంచితనం, నడవడికే ఇప్పుడు మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.
2003లో రాజకీయ ప్రవేశం
చిన్న తనం నుంచీ రాజకీయంగా ఉత్సాహం ఉన్నా తమ్ముడు ప్రసాదరావు రాజకీయాల్లో ఉండటంతో ఆయనకు వెనక నుంచి మద్దతు ఇస్తూ ఉండేవారు. 2003లో వైఎస్సార్ పాదయాత్రలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయనతో కలసి నడిచారు. వైఎస్ నింపిన స్ఫూ ర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో మొదటి సారి అసెంబ్లీకి నరసన్న పేట నుంచి పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించా రు. తర్వాత 2009, 2013 ఉపఎన్నికల్లో విజయం సాధించారు. 2013 ఉప ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఎంత ఒత్తిడి చేసినా జగన్ వెంటే నడిచారు. విజయమ్మ, షరి్మళ వెన్నంటే ఉండి నరసన్నపేట నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దాసన్నకు వైఎస్ కు టుంబమంటే మక్కువ. జగన్‌మోహన్ రెడ్డి అంటే మరింత అభిమానం
విద్యా కెరటం
పుట్టింది సాధారణ మత్స్యకార కుటుంబంలో.. చదువుకున్నది మామూ లు ప్రభుత్వ పాఠశాలల్లో. అయినా ఆయన ఎదుగుదల ఆగలేదు. చదువుకున్నప్పటి నుంచి అందరి కంటే చురుగ్గా వ్యవహరించడం అలవాటున్న సీదిరి అప్పలరాజు రాజకీయాల్లోనే అదే వేగం చూపిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం, తొలి ఎన్నికలోనే గౌతు వంశీయురాలిపై అఖండ విజయం సాధించడం, కొద్ది రోజుల్లోనే నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందడం, ఆపై మంత్రిగా ఎదగడం అన్నీ చాలా వేగంగా చేసి చూపించారు. అయితే ఆయన నేప థ్యం మాత్రం ఆసక్తికరం. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడి తీరులో ఎదుగుతున్న అప్పలరాజు ప్రయాణం అందరికీ ఆదర్శప్రాయం.
వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తా డ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్వ గ్రామం. స్థానిక పాఠశాలలోనే 7వ తరగత వరకు చదివి జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించారు. తండ్రి నీలయ్య చేపల వేట చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. తల్లి దాలమ్మ ఆ చేపలు విక్రయించేవారు. అప్పలరాజు చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు సంపాదించారు. పెద్దన్నయ్య త్రినాథ్, రెండో అన్నయ్య చిరంజీవి సోదరి కౌసల్యలు కూడా చదివేవారు. అయితే 12 ఏళ్ల వయసులో కౌసల్య గుండ సంబంధిత సమస్యతో చనిపోవడంతో ఆ అన్నదమ్ములు చదువు మానేసి వలస మత్స్యకారులయ్యారు. బొంబాయి వరకు వల స వెళ్లి తండేలి (బోటు నడిపి, చేపల వేట చేసే నాయకుడు)గా పని చేసేవారు. ఆ డబ్బుతోనే అప్పలరాజు చదువుకునేవారు.
ఎంబీబీఎస్, పీజీ చ దువులకైతే అప్పులు చేయక తప్పలేదు. కుటుంబ సభ్యుల కష్టాన్ని అప్పలరాజు అర్థం చేసుకుని చదివారు. మంచి వైద్యుడిగా గుర్తింపు సాధించారు. ఇప్పటికీ దేవునల్తాడ గ్రామంలో డాక్టర్ అప్పలరాజుకు 12 అడు గుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో ఉన్న రెండు గదులతో ఉన్న చిన్నపాటి ఇల్లు ఉంది. ప్రస్తుతం ఇందులో అప్పలరాజు రెండో అన్నయ్య సీది రి చిరంజీవి నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ సీదిరి చిరంజీవి సంద్రంలో వేట సాగిస్తున్నారు. అప్పలరాజు చదువే పెట్టుబడిగా చక్కటి ప్రతిభ కనబరిచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనలో ఉన్న విశేషమేమిటంటే మనçస్పూర్తిగా ఏ కార్యం తలపెట్టినా అందులో విజయం వరించాల్సిందే. బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment