Sidiri Appalaraju
-
పోలీసులపై సీదిరి అప్పలరాజు ఫైర్
-
చంద్రబాబు, నారా లోకేష్ కు సీదిరి అప్పలరాజు సవాల్..
-
బాబూ.. ఒక్క మెడికల్ కాలేజైనా తెచ్చావా?: సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి సీదిరి అప్పలరాజు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని మండిపడ్డారు. అలాగే, మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీమంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో ఒకే టర్మ్‌లో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. పద్నాలుగేన్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు.వైఎస్ జగన్ తీసుకువచ్చిన విధానాలను చూసి కేంద్రం, ఇతర రాష్ట్రాలు ముందుకెళ్లాయి. పులివెందులలో మెడికల్ సీట్లు వద్దని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే. 750 మెడికల్ సీట్లు రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అసలు దొంగలను వదిలి అమాయకులను ట్రాన్స్ఫర్ చేస్తారా...?
-
రూ.5800 కోట్ల దోపిడీకి కూటమి సర్కార్ కుట్ర: సీదిరి అప్పలరాజు
సాక్షి, పలాస: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకానికి నీరుగార్చడమే కాకుండా తాజాగా హైబ్రిడ్ మోడల్ పేరుతో దాదాపు రూ.6 వేల కోట్ల దోపిడికి కుట్ర చేస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పనంగా చెల్లించే ఆ డబ్బంతా తిరిగి నారా లోకేశ్ జేబుల్లోకే చేరబోతుందని పలాసలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రస్టు మోడల్ కన్నా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న హైబ్రిడ్ మోడల్‌తో ఏం ఉపయోగాలున్నాయో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.సీదిరి అప్పలరాజు ఇంకా ఏమన్నారంటే..దేశానికే తలమానికంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ట్రస్టు మోడల్ నుంచి హైబ్రిడ్ మోడల్లోకి మారుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఆదాయ పరిమితి ఉన్న 1.43 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల వరకు రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా అందించడం జరిగింది.ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం రూ.2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆపై మరో రూ.2.5 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలందిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే కాంక్లియర్ ఇంప్లాటేషన్, బోన్ మ్యారో సర్జరీ వంటి ఖరీదైన చికిత్సలు పేదవారికి ఉచితంగా అందే పరిస్థితి ఉండదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు క్లైయిమ్లు తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటి? అత్యవసర వైద్యానికి అప్రూవల్ రావడంలో ఆలస్యమైతే ఎవరు బాధ్యులు?ఆరోగ్యశ్రీలో 3257 ప్రోసీజర్లకు వైద్యం అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే హైబ్రిడ్ మోడల్లో, అన్ని ప్రొసీజర్లకు వైద్యం అందుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఉచితంగా మందులు ఇవ్వరు. రోగి హెల్త్ ప్రొఫైల్‌ని పరిగణలోకి తీసుకుంటే ఇన్సూరెన్స్ వర్తింపజేయరు. ప్రైవేట్ ఇన్సూరెన్స్‌లో ఉన్న ఇబ్బందులను అధిగమించడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్ట్ మోడల్లో తీసుకొచ్చి వేగంగా వైద్య సేవలందించే విధానం తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు మళ్లీ పాత విధానానికి తీసుకెళ్తున్నారు.ఇదంతా మంత్రి లేదా నారా లోకేష్‌కు సంబంధించిన వారి బీమా కంపెనీ కోసమే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లలో రూ.12,677 కోట్లు ఖర్చు చేయగా.. రాష్ట్రంలో కోవిడ్ సమయంలో వైరస్ బారిన పడ్డ రెండు లక్షల మందికిపైగా బాధితులకు ఉచితంగా చికిత్స అందించి, అందు కోసం మరో రూ.744 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించిన హైబ్రిడ్ మోడల్లో ప్రీమియమ్ చెల్లింపులు, రాష్ట్రంలో పథకం లబ్ధిదారులను పరిగణలోకి తీసుకుంటే, దాదాపు రూ.19,218 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో కంటే, చాలా ఎక్కువగా వ్యయం చేస్తూ.. ఇందులో రూ.5,800 కోట్ల దోపిడికి కుట్ర కనిపిస్తోంది.కాగా, ఇప్పుడున్న రేట్ల ప్రకారమే ఇంత అదనంగా వెచ్చిస్తుంటే రాబోయే రోజుల్లో రేట్ల పెంపు పేరుతో మరింత దోపిడీకి పాల్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు జేబులు నింపుకోవడమే సంపద సృష్టి అనుకోవాలేమో!. ఏ పథకం అమలు చేయకుండానే కేవలం జీతాలు చెల్లించడానికి, పింఛన్లు ఇవ్వడానికి ఏడు నెలల్లో రూ.1.19 లక్షల కోట్ల అప్పు చేయడం ఏంటి?. ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులకు, చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదు. ఈ అప్పుల దెబ్బకు రాష్ట్రం శ్రీలంక కాదు. ఏకంగా సోమాలియా అయిపోతుందేమో అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. -
బాబు బాదుడుపై సీదిరి అప్పలరాజు అదిరిపోయే సాంగ్
-
అర్ధరాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్తల కిడ్నాప్.. వారిద్దరూ ఎక్కడ?
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను కూటమి సర్కార్ టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం సృష్టించింది.శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కిడ్నాప్‌నకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లారు. పోలీసు యూనిఫామ్‌లో వచ్చిన కొందరు దుండగులు కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ కిడ్నాప్ విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు తెలియడంతో ఆయన కార్యకర్తల కుటుంబాల వద్దకు చేరుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్ ముందు అప్పలరాజు నిరసనకు దిగారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల పేరుతో తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెంటనే తీసుకు రావాలని డిమాండ్ చేశారు. వారు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ఈ క్రమంలో అప్పలరాజు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆయన అక్కడే కూర్చుని నిరసనలు తెలిపారు. -
కూటమి టైం దగ్గర పడింది సీదిరి సీరియస్ వార్నింగ్
-
వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారు
-
హత్యకు యత్నం.. స్టేషన్‌కెళ్తే అక్కడా దాడి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు మరింత బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైఎస్సార్సీపీ వర్గీయులపై హత్యాయత్నం చేయడమేగాక ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపై పోలీస్ స్టేషన్లోనే దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వారిస్తున్న పోలీసుల్ని పక్కకు తోసేశారు. పోలీసు స్టేషన్లో కూడా బాధితులకు రక్షణ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన అనుచరులపై దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులోని నిత్య ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు, పాత్రికేయుడు అల్లు రమణ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడు వేణుగోపాలరెడ్డి, మరో ఇద్దరు శనివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొర్ల విష్ణుచౌదరి తన కారులో అక్కడికి వచ్చాడు. కారునుంచి దిగి వారిపై దాడిచేశాడు. వారిని కొట్టి, కారులోంచి కత్తి తెచ్చి హత్యాయత్నం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న రమణ తన స్నేహితుడు మొదలవలస మన్మథరావును తీసుకుని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసు స్టేషన్లోనే.. విష్ణుచౌదరి తమను హత్యచేయడానికి ప్రయత్నించిన కత్తిని పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ వద్ద అప్పగించిన రమణ, మన్మథరావు ఫిర్యాదు రాయసాగారు. అదేసమయంలో విష్ణుచౌదరి, టీడీపీకి చెందిన బడ్డ నాగరాజు, జోగ మల్లి, బడ్డ నాగరాజు బంధువులు ఇద్దరు, మరికొందరు పోలీసు స్టేషన్లోకి వచ్చి రమణ, మన్మథరావుపై దాడిచేశారు. వారి దుస్తులను చించేసి, పిడిగుద్దులతో రెచ్చిపోయి భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేసి, హెచ్చరించారు. మీరిలా పోలీసు స్టేషన్లో కొడుతుంటే తమ ఉద్యోగాలు పోతాయని పోలీసులు ప్రాధేయపడినా టీడీపీ రౌడీలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకుల దాడిని ఒకరు సెల్ఫోన్లో రికార్డు చేయడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పలాస ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీస్‌స్టేషన్‌లో దాడిపై కేసు నమోదు కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ దాడి మోహనరావు తెలిపారు. టీడీపీ నాయకులు విష్ణు చౌదరి, వంశీతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు అల్లు రమణ, మొదలవలస మన్మధ.. కానిస్టేబుల్ నారాయణ విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎస్పీగారూ.. ఏం జరుగుతోంది? ఎస్పీగారూ.. కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఏం జరుగుతోంది. పోలీసుల సమక్షంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జరిగిన ఘటనపై ఎఫ్ఐఎర్ నమోదు చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి. – విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు రాష్ట్రంలో.. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు జరిగిన పలాసలో ఇప్పుడు మళ్లీ అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ నాయకుడు బాలికపై దాడి చేస్తే పోక్సో కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తమపై హత్యాయత్నం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిపై టీడీపీ వర్గీయులు దాడిచేసినా పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు. ఇక్కడి గూండాలను స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నారని మండిపడ్డారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
మీరేమైనా పోటుగాల్లా.. తన హౌస్ అరెస్ట్ పై మండిపడ్డ సీదిరి
-
పేదల ప్రాణాలతో చెలగాటమాడటం తగదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి అప్పలరాజు డయేరియా విజృంభించిన విజయనగరం జిల్లాలోని గుర్ల మండల కేంద్రంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా ఒకే ఊరిలో 450 మంది అతిసారం బారినపడి బాధపతున్నారని, వారిలో 11 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా పేదలు మృతి చెందారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ వైద్య వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది అప్పగించారని... కానీ చంద్రబాబు ప్రభుత్వం డయేరియా బాధితులకు వైద్యం కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బెంచీలు, కుర్చీలపై రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారంటేనే ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. కనీసం రోగులకు బెడ్ కూడా వేయకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ జగన్ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు–నేడు’ అభివృద్ధి పనుల వల్లే ఇప్పుడీ బెంచీలు, విద్యుత్తు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా సదుపాయాలు కలిగాయని, ఒకవేళ గుర్ల పాఠశాలను ఇలా తీర్చిదిద్ది ఉండకపోతే ఇప్పుడు రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేసేవారా...? అని ప్రశ్నించారు. పరిసర ప్రాంతాల్లోని పీహెచ్‌సీల నుంచి బెడ్స్ తీసుకొచ్చి వేయించడం కూడా తెలియదా..? అని మండిపడ్డారు. ఇవేవీ చేయలేనప్పుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఎందుకొచ్చారని, ఫొటోలు తీయించుకోవడానికా అని నిలదీశారు.సీఎం చంద్రబాబు మద్యం మత్తు, ఇసుక మాఫియా నుంచి బయిటకొచ్చి పేదల గురించి పట్టించుకోవాలని అన్నారు. ఆకస్మిక తనిఖీల పేరుతో వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేశ్ పక్కనేవున్న గుర్ల మండలంలో వందల మంది కష్టంలో ఉంటే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, రక్షిత నీటి విభాగం శాఖల పూర్తి వైఫల్యానికి నిదర్శనమే గుర్ల విషాదమన్నారు. ఆ రెండు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. వందలాది ప్రజలు డయేరియాతో అల్లాడుతుంటే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా గ్రామంలో జ్వరాలు వస్తే తక్షణమే ఫీవర్ సర్వే చేయించి కారణాలు తెలుసుకుని నిరోధించే చర్యలు చేపట్టే వారమని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివసరావు చెప్పారు. ఇప్పుడీ ప్రభుత్వం డయేరియా రోగులను స్కూల్ పిల్లల బెంచీలపై పడుకోబెట్టి కర్రలు కట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించే దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వైద్య శిబిరంలో కనీస సౌకర్యాలు లేవు: సీదిరి అప్పలరాజు
-
‘బాబు.. సారా మత్తు కాదు.. డయేరియా గురించి ఆలోచించండి’
విజయనగరం,సాక్షి: గుర్ల మండలంలోని డయేరియా వైద్య శిబిరంలో సౌకర్యాలు లేవని మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. దేశం ఉలిక్కిపడిన సంఘటన ఇదని తెలిపారు. ఆయన శనివారం గుర్లలో డయేరియా వైద్య శిబిరంలో రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘నాలుగు రోజులుగా వైద్య శిబిరం నడుస్తోంది. ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. దయనీయమైన పరిస్థితి వుంది. బెంచీలు, కుర్చీలు మీద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. తాము విద్యా , వైద్యం మెరుగుపరిచి చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించాం. వైఎస్ జగన్ స్కూల్లో బెంచీలు, కుర్చీలు సమకూర్చపోయి ఉంటే.. నేల మీద పడుకోబెడతారా? పీహెచ్‌సీల నుంచి బెడ్స్ సేకరించి వైద్య శిబిరంలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? సీఎం చంద్రబాబు సారా మత్తు నుంచి బయటకు రండి.ఇసుకమత్తు నుంచి బయటకు రండి.ఈ రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు వున్నాయో చూడండి. ఇదేనా ప్రజా వైద్యం తీరు. వైద్యం హక్కుగా ఉన్న స్థితి నుంచి ఆడుకున్నే స్థితికి తీసుకువచ్చారు. ఈ దుర్భర పరిస్థితులను నేషనల్ మీడియా చూస్తే రాష్ట్ర పరువు పోతుంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మంత్రి వచ్చి చూసి వెళ్లి.. ఏం చర్యలు తీసుకున్నారు?’’ అని అన్నారు. గుర్ల మండలంలో డయేరియా పంజా విసురుతోంది. గోషాడ, కెల్ల, కోటగండ్రేడు, పెనుబర్తిల్లో 450 మందికిపైగా డయేరియా బారినపడ్డారు. ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడ్డారు. -
‘గుడ్ బుక్ రాస్తాం.. అండగా ఉంటాం’
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం, రాష్ట్ర వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా సీదిరి అప్పల రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అంతా వైఎస్సార్సీపీ పార్టీదే. కూటమి పాలనలో పధకాలన్నీ కొట్టుకుపోయాయి. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని అన్నారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. ‘‘పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. పార్టీ అధికారంలో లేనప్పుడు బరువు మోయడమే అసలైన పని. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా జగన్ పనిచేయమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. 4 నెలలో ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. నేను ఆముదాలవలసలోనే ఉంటా.. ప్రజల కోసమే పనిచేస్తా. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ అన్ని ఆగిపోయాయి. నిత్యవసరాలు ఆకాశానంటుతున్నాయి. ధరల కంట్రోల్‌కి బడ్జెట్లోనే మేం నిధులు ఇచ్చేవాళ్లం. నాలుగు నెలలో రూ. 30 వేల కోట్లు అప్పుచేశారు. మెడికల్ సీట్లు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంత దారుణం?. పేదల విద్యార్దులకు సీట్లు రాకుండా చేయడానికే కదా. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వరద సహాయం పేరుతో అక్రమాలు చేశారు’’ అని అన్నారు.అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ, ‘‘ కార్యకర్తలు కసితో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాయమాటలు చేబుతూనే వస్తున్నారు. బిర్యాని వస్తుందని పలావు పెట్టే వారిని ఓడించారు. ఇప్పుడు పలావు, బిర్యానీ రెండూ లేవు. వంద రోజుల్లో ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. గుడ్ బుక్ రాస్తాం.. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడటం మొదలు పెడతాం’’ అని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు దేవుడే బుద్ధి చెబుతాడు: సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఆయన శనివారం మందసలోని వాసుదేవా పెరుమాళ్ళ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు త్వరలోనే బుద్ధి చెప్పాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని ప్రతిష్టను బజారుకు ఈడ్చే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు తప్పుగా మాట్లాడడం సమాజసం కాదు. ప్రతి పదార్థానికి పరీక్షలు చేసిన తర్వాతే టీటీడీ ప్రసాదంలో వాటిని వినియోగిస్తారు. ఇదే విషయాన్ని టీటీడీ ఈవో సైతం చెప్పారు’’ అని అన్నారు.ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే.. -
సత్య కుమార్ యాదవ్ పై సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్
-
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయం
కాశీబుగ్గ: మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య అని.. ఈ విషయంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు. -
ఆ జ్ఞాపకం.. నా జీవితంలో మర్చిపోలేను..
-
టీడీపీ నేతలకు సీదిరి అప్పలరాజు ఓపెన్ ఛాలెంజ్
-
పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయండి: సీదిరి అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి సర్కార్ పనిచేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో అంచనాలతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కూటమి సర్కార్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు.‘‘విత్తనాల పంపిణీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పార్టీలకతీతంగా రైతన్నలకు న్యాయం చేయాలి. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది’’ అని అప్పలరాజు చెప్పారు. -
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు.. సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
-
హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూల్చేస్తారా?
కాశీబుగ్గ: హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఎలా కూల్చివేస్తారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలోనే దుర్దినమని అన్నారు. ఆయన శనివారం పలాసలో విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖపట్నం, అనకాపల్లి, ఇతర వైఎస్సార్సీపీ కార్యాలయాలకు నోటీసులు పంపిస్తున్నారని అన్నారు. ‘మీ పార్టీ కార్యాలయాలకు ఒక తీరు. వేరే పార్టీలకు ఒక తీరా? అలాంటి వాటిపై మాట్లాడితే కేసులు పెడతారా’ అని ప్రశ్నించారు. కూల్చివేతలు మొదలైన చోటే పునర్నిర్మాణాలు మొదలవుతాయని, ఎక్కడైతే వినాశనం మొదలవుతుంతో అక్కడే పునఃసృష్టి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ తీసేసి యెల్లో పీనల్ కోడ్ తెచ్చారన్నారు. 10 శాతం ఓట్లతో పార్లమెంట్లో ఇందిరాగాంధీకి ప్రతిపక్ష హోదా కల్పించారని, 40 శాతం ఓట్లు ఉన్న తమకు ప్రతిపక్ష హోదా కల్పించకపోవడం దుర్మార్గమని అన్నారు. అసెంబ్లీలో గొంతు విప్పడానికి అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒకటో తేదీన పింఛన్లు, జీతాల కోసం అప్పులకు తిరుగుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పరిపాలన విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.5,340 కోట్లు విడుదలయ్యాయని గుర్తు చేశారు.‘జగన్ ఓడిపోయాడు.. చచ్చి పోలేదు’ వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. బూతులు మాట్లాడటంలో అయ్యన్న టాప్ ర్యాంకులో ఉన్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలతో రైతుల వద్దకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వస్తున్నాయని రైతులు సంతృప్తి చెందుతున్నారని, అలాంటి రైతుల గుండెల్లో వైఎస్ జగన్ స్థానాన్ని తీసేయలేరని అన్నారు. వైఎస్ జగన్ నిర్మించిన ఆర్బీకేల వద్దే టీడీపీ వారు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో పీఏసీఎస్‌ల వద్ద రేయింబవళ్లు వేచి ఉండి పోలీసుల సమక్షంలో పంపిణీ చేసేవారని, విత్తనాల కోసం యుద్ధాలే జరిగేవని, రైతులకు ఆ పరిస్థితులు మళ్లీ తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. -
టీడీపీ పతనానికి ఇదే నాంది: సీదిరి అప్పలరాజు
-
ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్
-
ఏపీలో టీడీపీ అరాచకాలు...గవర్నర్ యాక్షన్ తీసుకోవాలి
-
చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
-
కూటమికి భారీ ఓటమి
-
జగనన్న పాట పాడి..డాన్స్ తో అదరగొట్టిన సీదిరి అప్పలరాజు
-
బందిపోటు రాజకీయమే బాబు పాలన మార్క్!
సాక్షి, పలాస: అయ్యా చంద్రబాబూ.. నీ 14 ఏళ్ల అమోఘమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతోపాటు నీ ముఠాలో ఉన్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఇలా అందరూ ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో.. రాష్ట్ర భవిష్యత్తును ఎంత నాశనం చేశారో ప్రజలంతా చూశారు. పెత్తందార్ల ముఠాకు చంద్రబాబు నాయకుడనేది ప్రజలందరికీ తెలిసిపోయింది’ అని అప్పలరాజు తెలిపారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కు వంతపాడిన పీవీ రమేష్ చంద్రబాబు తొత్తుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏదేదో మాట్లాడాడు. మరి, యువతకు ఉద్యోగాల పేరిట శిక్షణ ఇస్తామంటూ చంద్రబాబు ముఠా స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌కు పాల్పడ్డప్పుడు ఇదే వ్యక్తి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ ప్రోగ్రాంకు సంబంధించి నోట్‌ఫైల్ తయారు చేశాడు. నోట్‌ఫైల్‌లో పీవీ రమేష్ అనే అధికారి చేతిరాతతో ఏం రాశాడో కూడా అందరం చూశాం. ‘ఓరల్ ఇనస్ట్రక్షన్ ఆఫ్ హానరబుల్ సీఎం.. రిలీజ్ ద ఫండ్స్..’ అని రాసింది ఇదే పీవీ రమేష్. ఈ సంగతి ఆయన మరిచినా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. రూల్స్‌ను అతిక్రమించి మరీ చంద్రబాబు ఫండ్స్‌ను రిలీజ్ చేయమన్నాడు. అప్పటికీ, కిందిస్థాయి అధికారులు ఇది సాధ్యం కాదనప్పటికీ, ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆదేశాలంటూ చెప్పిందీ ఆయనే.. స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ జరుగుతుందనే సమాచారం ఆయనకు తెలిసినప్పటికీ ఫండ్స్ రిలీజ్ చేశారు. పైగా, ఆ స్కామ్‌తో తనకేం సంబంధం లేదని ఎంటైర్ ఫైల్ రిఫరెన్స్ కోసం తనకు పంపాలని కూడా నోట్‌ఫైల్‌లో రాశాడు. దళితుడిగా పుట్టి.. పేదవర్గాలకు అన్యాయం చేస్తావా..? పీవీ రమేష్‌ను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. ఏమయ్యా.. నువ్వూ ఒక దళితుడివే కదా...? దళితులకు ఏం అవసరమో నీకు తెలియదా..? నువ్వు ఆర్థికరంగ నిపుణుడువే కదా..? అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్ అదే కదా..? మరి, ఒక పేదవాడి సంక్షేమానికి ఆ బడ్జెట్లో చంద్రబాబు ఏం చేశాడు..? ఇవాళ జగన్మోహన్రెడ్డి గారు ఏం చేస్తున్నారో నీకు తెలియదా..? మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు ఖజానాలో ఉంది కేవలం రూ.100 కోట్లే.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరంటూ మాట్లాడాడు కదా..? ఇది వాస్తవమే కదా..? మరి, జగన్మోహన్రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకూ ప్రతీ నెలా ఒకటోతేదీకే మేం జీతాలెలా ఇచ్చాం..? దాదాపు డీబీటీ కింద ప్రభుత్వ సంక్షేమాన్ని పేద ప్రజలకు రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపిణీ చేశాం..? ఇన్నిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేయగలిగాం..? వీటిపై నీకు ఏనాడూ ఆలోచన కలగలేదా..? అదే నువ్వు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవ్వన్నీ చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు..? దీనికి నువ్వు స్పష్టమైన సమాధానం చెప్పాలి. దళితుడిగా పుట్టి దళితులకు అన్యాయం చేసే మాటల్ని దయచేసి నువ్వు మాట్లాడొద్దు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే దళితుల్ని పదేపదే అవమానిస్తూ.. వారి సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని అతనికి వంతపాడుతున్నావంటే నిన్ను ఏ రకమైన మనిషిగా సంభోదించాలో నీకునువ్వు ఆలోచించుకో.. పెత్తందారీ ముఠా నాయకుడైన చంద్రబాబుకు నువ్వు వంత పాడుతున్నావంటే నువ్వెలాంటి వాడివో రాష్ట్రప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమౌతుంది. బందిపోటు రాజకీయమే బాబు పాలన మార్క్ చంద్రబాబు ఈ రాష్ట్రప్రజలకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడు..? ఆయన పాలనలో పేదలకు మంచి చేసిన మార్క్ ఏంటి..? ఆ విషయం చెప్పుకోలేనోళ్లు ఇవాళ రాష్ట్రంలో బందిపోట్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పేదలకు అవసరమైన వైద్యాలయాలన్నీ నిర్వీర్యం చేయడం బందిపోట్ల పరిపాలన కాదా..? అదే, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. పేదవాడికి అందుబాటులో వైద్యనిలయాలున్నాయి. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్‌లు, మండలస్థాయిలో ప్రైమరీ హెల్త్ క్లినిక్‌లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఏరియా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, పాత ఆస్పత్రి భవనాలన్నింటినీ నాడు - నేడు కింద బాగుచేయడం అనేది బందిపోట్ల పాలన అంటారా..? పేదపిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను తీసుకుంటే నీ హయాంలో ఏ ఒక్క పాఠశాలనైనా బాగు చేయగలిగావా..? ..ఇవాళ నాడు-నేడు కింద స్కూళ్ల భవనాలను సుందరంగా తీర్చిదిద్దడాన్ని బందిపోట్ల పాలన అంటారా..? ఏ రంగం తీసుకున్నా.. 14 ఏళ్ల పరిపాలనలో నీ మార్కేంటి..? రాష్ట్రంలో ఫలానా ప్రాజెక్టు నీ బ్రెయిన్ చైల్డ్‌గా చెప్పుకునే దమ్ముందా..? నీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాగలిగావా.? ఏమీ చేయలేని నువ్వొక పెద్ద అభివృద్ధి దార్శనీకుడవని నీ తొత్తులు చేసే భజన మేం వినాల్నా..? ఏంటి నీ బందిపోటు రాజకీయం..? ఇకనైనా నీ బోడి మాటలు కట్టిపెట్టు. నీకులా మాకు మాట్లాడటం చేతగాదా..? మేమేమీ చదువుకోలేదా..? నీకన్నా ఎక్కువే చదివి రాజకీయాల్లో ఉన్నామని గుర్తించు. దివంగత వైఎస్ఆర్ బ్రెయిన్‌చైల్డ్ ఉత్తరాంధ్ర సృజలస్రవంతి ఉత్తరాంధ్ర సృజలస్రవంతి కోసం నువ్వు కల గన్నావా..? ఏం మాట్లాడుతున్నావు..? ఆ ప్రాజెక్టు ఎవరి బ్రెయిన్‌చైల్డ్..? దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు పోలవరం దగ్గర్నుంచీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తీసుకురావాలని ప్రాజెక్టును రూపకల్పన చేశారు. పోలవరం లెఫ్ట్‌కెనాల్‌ను విశాఖపట్టణం వరకు ఆయనే తవ్వించారు. ఉత్తరాంధ్ర సృజలస్రవంతికి శాంక్షన్ ఇచ్చి ఇక్కడ్నుంచి విజయనగరం వరకు నీటిని పంపాలని చూస్తే.. సరిగ్గా వారు దిగిపోయేనాటికి చంద్రబాబు 2018లో మరో జీవో ఇచ్చాడు. అంటే, దీన్నిబట్టి ఉత్తరాంధ్ర సృజలస్రవంతి గురించి ఎవరు కలగన్నట్టు..? చంద్రబాబూ.. నీ హాయంలో ఉత్తరాంధ్ర సృజలస్రవంతి ప్రాజెక్టు కోసం ఒక్క ఎకరా భూమినైనా సేకరించావా..? కనీసం, నీ హయాంలో భూసేకరణ అథారిటీనైనా ఏర్పాటు చేశావా..? నువ్వు ఏమీ చేయకపోతే.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మేం భూమిని సేకరించాం. ఇప్పటికే భూసేకరణ పూర్తిచేసుకుని పనులు మొదలుపెట్టబోతున్నాం. ప్రేమోత్సవం కబుర్లే గానీ.. టూరిజంకు నువ్వేం వెలగబెట్టావ్..? విశాఖపట్టణంలో టూరిజం అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావా..? గతంలో నువ్వేం మాట్లాడావో మరిచావా..? విశాఖలో ప్రేమోత్సవం పెడతానన్నావు గుర్తుందా..? గతంలో గోవాలో జరిగిందంట.. దాన్ని తెచ్చి విశాఖలో పెడతానన్నది నువ్వేకదా..? మరి, పెట్టావా..? ఇదంతా నా సొంత కవిత్వం కాదు. మీ ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసిందే మాట్లాడుతున్నాను. ప్రేమోత్సవంలో ప్రతీ జంటకూ ఒక ఇండివిడ్యువల్ టెంట్ ఏర్పాటు, మూడు రోజులపాటు బికినీలతో షోలని చెప్పావే..? ఇవ్వన్నీ మేం మరిచిపోయామా..? నీ ప్రేమోత్సవాలు.. కామోత్సవాలన్నీ ప్రజలకింకా గుర్తున్నాయి. ఇవాళ ఇక్కడకొచ్చి వైజాగ్ నుంచి భావనపాడు వరకూ బీచ్‌రోడ్ వేస్తానంటే.. నీ 14 ఏళ్లు అధికారంలో ఏం గాడిదలు కాశావు..? అప్పట్లో చేయని టూరిజం అభివృద్ధి... రేపు చేస్తానంటే నీ మాటలు నమ్మేది ఎవరయ్యా ..? నీ కల్లబొల్లి కబుర్లు కట్టిపెడితే మంచిది. 4 పోర్టులు, హార్బర్లతో తీరప్రాంత అభివృద్ధిప్రదాత జగన్‌గారు రాష్ట్రంలో సుమారు 975 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంటే నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో నువ్వు చేసిందేంటి.? ఎక్కడైనా ఒక ఇటుక పెడ్డ గానీ ఒక సిమెంట్ బస్తాగానీ వేశావా..? ఎన్ని హార్బర్లు, పోర్టులు మంజూరు చేశావు..? అదే జగన్మోహన్రెడ్డి గారి హయాంలో ఇవాళ 4 పోర్టులు నిర్మాణమవుతున్నాయి. మూలపేట, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టు, మచిలీపట్నం, రామాయపట్టణం పోర్టులు శరవేగంగా పనులు జరుగుతోన్నాయి. మరి, నీ హయాంలో ఇవ్వనీ చేయడం నీకు చేతకాలేదా..? నీ ఊహకందని అభివృద్ధి ఇది. ప్రతీ జిల్లాలో హార్బర్లు మంజూరు చేశారు. ఇప్పటికే 4 హార్బర్లు కూడా పూర్తయ్యాయి. అలాంటిది, నువ్వు ఇప్పుడొచ్చి కోస్టల్లైన్లో రోడ్లు వేసేదేముంది..? అభివృద్ధి చేసేదేముంది..? నీ చేతగానితనం చూసింతర్వాతే ప్రజలు నిన్ను నీ పార్టీని మూలనకూర్చోబెట్టారు. పారిశ్రామికాభివృద్ధిపై నీ ఉత్తకబుర్లు ప్రజలకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడుతున్నావే..? నువ్వు తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెబుతావా చంద్రబాబూ..? భోగాపురం ఏయిర్పోర్టు, మూలపేట పోర్టు, బుడగట్లపాడు హార్బర్లను కట్టడంతో పాటు నువ్వులపేట ఎఫ్ఎల్సీని హార్బర్‌గా మార్చబోతున్నాం. చింతపల్లి జెట్టీని మేం కడుతున్నాం. భీమిలి దగ్గర అదనంగా మరో జెట్టీ ఇచ్చాం. పోర్టుకోసం 4,600 ఎకరాల ల్యాండ్‌బ్యాంకును సిద్ధం చేసి ఉంచాం. మరి, నీ హయాంలో నువ్వు చేసిందేంటి..? చెప్పుకోవడానికి నువ్వు చేసిందేమీలేదు. అది చేస్తా.. ఇది చేస్తాననే నీ ఉత్తకబుర్లును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. బాబు వయసుకు మాటలకు పొంతన ఉందా? రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని ఊదరగొట్టుకునే నీకు ఎదుటి మనిషిని గౌరవించడం తెలియదా..? నువ్వు మా నోట్లో సీసం పోస్తానంటావా..? దొబ్బెస్తారంటావా..? బొక్కేశారంటావా.?? బూతులు నీకేనా.. మాకు రావా..? నీ భాషకు నీ వయస్సుకేమైనా సంబంధం ఉందా..? నీ నోటికేదొస్తే అది మాట్లాడటం కాదు చంద్రబాబూ.. ? మేమూ అధికారంలో ఉన్నాం. నువ్వు నోట్లో సీసం పోస్తే.. మేం నీ నవరంధ్రాల్లోనూ అదే సీసం పోయగలం. ఇందులో మాకేం మొహమాటం లేదు. ఇప్పటికైనా నీ వయస్సును నువ్వు గుర్తు తెచ్చుకుని ఎందుకంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావో.. సమాధానం చెప్పు. రుషికొండపై నీ పిచ్చివాగుడు కట్టిపెడితే మంచిది రుషికొండ జపం చేసే బాబూ.. నిన్నొక ప్రశ్న అడుగుతున్నాను. గతంలో రుషికొండపై రిసార్టు కొండమీద కట్టలేదా..? కొండను తొలిచి హరిత బీచ్ రిసార్టు కట్టలేదా.. జవాబివ్వు..? దాన్ని ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్యక్రమం అక్కడ జరుగుతోంది. మరి, రామోజీరావు రామోజీఫిల్మ్సిటీని ఎక్కడ కట్టాడు..? కట్టింది కొండమీద కాదా..? రామానాయుడు స్టూడియోను కూడా కొండతొలిచి కట్టిందే కదా..? మధురవాడ ఐటీ ఎస్ఈజెడ్ కొండలమీదనే కదా కట్టింది..? అంటే, మీరు కట్టినప్పుడు అవన్నీ ప్రకృతికి అనుకూలం..? మేం కడితే మాత్రం ప్రకృతికి ప్రతికూలమా..? రుషికొండపై మేం ఇవాళ కట్టేది ప్రైవేటు భవనాలేమీ కాదు. అవన్నీ ప్రభుత్వ భవనాలే గనుక నీ పిచ్చివాగుడు కట్టిపెడితే మంచిది. ఉద్దానం ఆస్పత్రిపై నీ బడాయి మాటలు చాలించు ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఆస్పత్రి నువ్వు కట్టించావా..? నువ్వు ఆ రోజు ఇచ్చిన శాంక్షన్ ఆర్డర్ ఏంటి..? ప్రైవేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కళాశాలల సంఘం ఆధ్వర్యంలో వాళ్లు ఒక ఆస్పత్రి పెట్టుకుంటానంటే నువ్వు భూమివ్వాలని ఆర్డర్ ఇచ్చావు గానీ.. కిడ్నీ డయాలసిస్ సెంటర్ కోసం కాదే..? పైగా, నువ్వు వచ్చి ఇక్కడ 200 పడకల ఆస్పత్రి ఇచ్చానని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా..? నువ్వు మనిషివా..? మృగానివా..? సూదికొండ దోపిడీ చేస్తానంటే ఊరుకునేదిలేదు సూదికొండ గురించి నువ్వు నా మీద అభాండాలేయడం కాదు. ఎవడైతే సూదికొండను దోచేద్దామని పనిచేస్తున్నాడో వాడి మెడలోనే నువ్వు కండువా వేశావని తెలుసుకో.. నేనిప్పుడు ఒక విషయం చెబుతున్నా.. నా ప్రాణం ఉండగా సూదికొండపై ఎవడినీ చేయి వేయనివ్వనని హెచ్చరిస్తున్నా గుర్తుపెట్టుకోండి.. 6.72 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్‌గారిది ఇంటికో ఉద్యోగం ఇస్తానని నాడు యువనేస్తం పేరిట చంద్రబాబు యువమోసం చేసింది చాలక.. మళ్లీ ఇప్పుడొచ్చి అదేమాట మాట్లాడుతున్నాడు. అది నోరా.. తాడిమట్టా..? ఆయన హయాంలో 70 లక్షల టీచర్ల ఉద్యోగాలిచ్చానంటాడు. అసలు, అంతమంది విద్యార్థులే లేరుకదా..? మరి, టీచర్ల పోస్టులు అన్నెలా ఇచ్చావు..? అదే జగన్మోహన్రెడ్డి గారు అధికారంలోకొచ్చాక కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కలిపి 6.72 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఉత్తరాంధ్రలో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే చంద్రబాబు బందిపోటు రాజకీయాలను అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు లేరు. ఒకప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని అక్రమ కేసులు పెట్టారో.. గిరిజన కుటుంబాలు ఇళ్లూవాకిళ్లు, ఊళ్లు వదిలిపెట్టి అడవుల బాట పట్టారో అందరికీ తెలుసు. కానీ, జగన్మోహన్రెడ్డి పాలనలో అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వ సంక్షేమం నేరుగా పేదల ఖాతాలకు చేరుతుంటే ఆనందంగా జీవనం గడుపుతున్నారు. ఎవరి హయాంలో పరిపాలన ఎంత సంతోషంగా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు గనుక రేపటి ఎన్నికల్లోనూ ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని ధీమాగా చెబుతున్నాం అని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. -
ఇద్దరూ పప్పులే
-
లోకేష్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు
-
అలా అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్‌కు ఉందా?: మంత్రి సీదిరి
సాక్షి, పలాస: లోకేష్ మాట్లాడేవన్నీ పనికి మాలిన మాటలంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఆదివారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని టీచర్ జాబ్‌లు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాట్లాడే మాటల మీద లోకేష్‌కు అసలు కంట్రోల్ ఉందా? అంటూ ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అవగాహన లేకుండా లోకేష్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.6 లక్షల పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. సీఎం జగన్ లక్షా 43 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాల కల్పన గురించి లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదం’’ అంటూ మంత్రి అప్పలరాజు దుయ్యబట్టారు. లోకేష్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయ్యలేదు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండనే దమ్మున్న నాయకుడు సీఎం జగన్. ఇలా అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్‌కు ఉందా?. లోకేష్ చేసేవన్నీ దొంగ పాదయాత్రలు. ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా?’’ అంటూ సీదిరి అప్పలరాజు నిలదీశారు. చదవండి: అభివృద్ధి మీ కళ్లకు కనిపించడం లేదా చంద్రబాబూ..: మంత్రి ధర్మాన -
నారా లోకేష్ కు మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్
-
అభివృద్ధిపై చర్చకు లోకేష్ కు సవాల్ విసిరితే రాలేదు : మంత్రి సీదిరి
-
‘భువనేశ్వరి యాత్రతో ఒరిగేదేంటి?’
సాక్షి, విశాఖపట్నం: పదవులంటే అత్యాశ కలిగిన వారు మాత్రమే పార్టీని వీడుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గెలవడం ముఖ్యం కాదని.. జగన్ సీఎం కావడం అవసరమన్నారు. అన్ని రంగాలు బాగుపడాలంటే వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలన్నారు. తాము గెలుస్తాం అనుకుంటేనే టికెట్ ఇవ్వమని తామే చెప్పామని మంత్రి అప్పలరాజు అన్నారు. ‘‘చంద్రబాబు ఆధునిక అంటరానితనాన్ని ప్రోత్సాహించాడు. పేద వర్గాలను వేరు చేశాడు. ఆధునిక అంటరానితనం పోయి.. సమసమాజం నిర్మాణం కావాలంటే జగన్ సీఎం కావడం అవసరం. భువనేశ్వరి యాత్ర చేస్తే ఒరిగేది ఏంటి..? రాజకీయాల్లో ఆమెకున్న ప్రాదాన్యత ఏమిటి..? బాబు జైలులో ఉన్నప్పుడు డ్రామాలు చేశారు. బయటకు వచ్చాక ఆపేసారు. ఇప్పుడు మమ అనిపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
వైఎస్ఆర్సీపీపై భయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను కలిశారు: సిదిరి అప్పలరాజు
-
పవన్ కళ్యాణ్ పై మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
-
మంత్రి సీదిరి అప్పలరాజు మాస్ స్పీచ్..దద్దరిల్లిన పలాస
-
పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభానికి 12న సీఎం జగన్
కాశీబుగ్గ: పలాసలో కిడ్నీ ఆస్పత్రి ప్రారంభించేందుకు డిసెంబర్ 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలాస రానున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను బుధవారం ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి సందర్శించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజాసంఘాలు, వామపక్షాలతో కలిసి కిడ్నీ బాధితుల పక్షాన గళం వినిపించామని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రాలు కార్యరూపం దాల్చాయని చెప్పారు. రూ.700 కోట్లతో మంచినీటి పథకం సైతం నిర్మించినట్టు తెలిపారు. వీటిని ప్రారంభించేందుకు సీఎం జగన్ డిసెంబర్ 12న పలాస వస్తున్నారని చెప్పారు. అన్నిరకాల వైద్యసేవలూ పొందేలా.. పలాసలో ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ ఆస్పత్రి కేవలం కిడ్నీ వ్యాధిగ్రస్తులకేననే అపోహ ఉందని మంత్రి అప్పలరాజు అన్నారు. కానీ.. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, న్యూరాలజీ, పల్మనాలజీ, ఆడియోగ్రఫీ, ఐసీయూ వంటి అత్యవసర వైద్యసేవలు 24 గంటలూ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అత్యవసర వైద్యం అవసరమున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే సేవలు పొందవచ్చన్నారు. డయాలసిస్ యూనిట్లో 40 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మూడు నుంచి నాలుగు షిఫ్ట్‌లలో రోజుకు 120 నుంచి 200 మందికి రోజుకు డయాలసిస్ చేసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఆయన వెంట మహేంద్ర రైతు కూలీ సంఘం, ఉద్దాన రైతు కూలీ సంఘం, జీడి రైతు సంఘం, యూటీఎఫ్, యూవీవీ సేవా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, పలాస యూత్ అసోసియేషన్, శ్రీవివేకానంద సేవాసమితి, గ్రీన్ ఆర్మీ అసోసియేషన్, సీపీఐ ప్రతినిధులు ఉన్నారు. -
ఫిషింగ్ హార్బర్ ప్రమాద భాదితులను సీఎం గొప్ప మనసుతో ఆదుకున్నారు
-
విశాఖ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం: ఎంపీ మోపీదేవి
-
ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘటనపై వెంటనే స్పందించారు: అవంతి
-
దేశంలోనే అత్యధికంగా మత్స్యకార భరోసా ఇస్తున్న రాష్ట్రం ఏపీ: సీదిరి
-
విశాఖ బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు
సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది. ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసింది. ఈ నెల 19వ తేదీ రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మత్స్యకారులకు నేనున్నానంటూ... భరోసానిచ్చారు. బాధిత మత్స్యకారులకు 80శాతం పరిహారం ఇస్తామని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లుగానే ప్రమాదం జరిగిన 48గంటలు గడవక ముందే జిల్లా కలెక్టర్ డాక్టర్ అకౌంట్‌కు పరిహారం డబ్బులను సీఎం కార్యాలయం జమ చేసింది. పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించింది. బోట్లు దగ్ధమవడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద రూ.10వేలు చొప్పున అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, మత్స్యకారులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటోందని ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్సకారుల డీజిల్ బకాయిలు కూడా చెల్లిస్తామని, త్వరలో ఆ బకాయిలు రూ.4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ‘‘విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఎం ఇవేం పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారు కలాసీలకు పరిహారం ఇవ్వాలని చెబితే వెంటనే పది వేలు చొప్పున ఇవ్వాలని సీఎం చెప్పారు. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. స్టీల్ బోట్లు తయారీకి ఇప్పుడు 60 శాతం సబ్సిడీ ఇస్తోంది.ఇప్పుడు దరఖాస్తు చేస్తే లాంగ్ లైనర్ల కోసం 75 శాతం వరకు ఇస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు: ఎంపీ మోపిదేవి విశాఖ హార్బర్ ప్రమాదం మానవ తప్పిదం.. కానీ సీఎం జగన్ తన ఉదారత చాటుకున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పరిహారం ఇవ్వడంలో సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. 150 కోట్లతో హార్బర్ ఆధునీకరణ గొప్ప నిర్ణయం. ఇన్ని జట్టీలు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. ఫిషింగ్ జట్టీల ఏర్పాటు తో ఆర్థిక ప్రగతి వుంటుంది. ఈ రోజు ఇచ్చిన పరిహారం అంచనాలకు తగ్గట్టు అధికారులు ఇచ్చారు. ఈ పరిహారం వృధా చేయకుండా లాంగ్ లైనర్ బోట్లను కొనుగోలు చేయాలన్నారు. బోట్ల కొనుగోలుకు బ్యాంకులు సహకరించేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని, రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు వస్తారు.. వారికి నమ్మకండి’’ అంటూ మోపిదేవి సూచించారు. మత్స్యకారులకు అండగా ఉంటాం: వైవీ సుబ్బారెడ్డి మత్స్యకారులకు సీఎం అండగా నిలిచారని, విపత్తుల సహాయం చేయడం సహజం.. కానీ ఇది విపత్తు కాదు.. ప్రమాదంలో బోట్లు తగలబడినా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన గంటల్లోనే విలువలో 80 శాతం పరిహారం సీఎం ఇవ్వడం గొప్ప విషయం. కలాసీలకు 10 వేలు పరిహారం ఇవ్వడం చారిత్రక నిర్ణయం. ఈ పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు.. బోట్లు తిరిగి నడిపే వరకు అండగా వుంటాం. గత ప్రభుత్వం బోట్ల మరమ్మత్తులకు 6 లక్షలు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం హామీ అమలు జరిగేలా ప్రయత్నిస్తాం’’ అని సుబ్బారెడ్డి అన్నారు. -
సీఎం జగన్‌తోనే జనం: స్పీకర్ తమ్మినేని
సాక్షి, విశాఖ: ఏపీలో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బుధవారం విశాఖపట్నం జిల్లా విశాఖ సౌత్, నంద్యాల జిల్లా బనగానపల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు నుంచి ఉత్తరాంధ్ర ప్రజల మేలుకోవాలి. విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. వైజాగ్ రాజధాని అయితే యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయి. విశాఖ రాజధాని అయితే ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి. ఒక కులం కోసం అమరావతి నీ రాజధాని చేశారు. వైజాగ్‌లో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారా?. వైజాగ్ రాజధాని అయితే మాఫియా పెరుగుతుందని అబద్ధాలు చెబుతున్నారు. సిగ్గు లేకుండా రామోజీ రావు అబద్ధాలు రాస్తున్నారు. వెనుక బడిన కులాలు అంటే చంద్రబాబుకు ఒక ద్వేషం. తోలు తీస్తానని చంద్రబాబు మత్స్యకారులను బెదిరించారు. చంద్రబాబును ఓడించిదే ఒక మత్స్య కారుడే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అవమనిచింది చంద్ర బాబు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం వారిని గౌరవించారు. విశాఖలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అలీబాబా 40 దొంగల్లా చంద్రబాబు ముఠా దోచుకుంది. పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలి వచ్చేశారు. రాష్ట్రంలో పెత్తందార్లకు, పేదలకు మధ్య య ఉద్ధం జరుగుతోంది. పేదల పక్షాన సీఎం జగన్ నిలబడ్డారు. మార్పు అనేది సీఎం జగన్‌తోనే సాధ్యం. సామాజిక సాధికార యాత్ర అనుకున్న దానికంటే ఎక్కువగా విజయవంతం అవుతున్నాయి. ఎంతమంది కలిసిన జగన్‌తోనే జనం అంటున్నారు. సింహం ఎన్నడూ సింగిల్‌గానే వస్తుంది. బడుగు బలహీనర్గాల గౌరవాన్ని ముఖ్యమంత్రి జగన్ పెంచారు. పిల్లల భవిష్యత్‌కు బాటలు వేశారు. మళ్ళీ జగన్ సీఎం అయితేనే బడుగుల జీవితాల్లో వెలుగులు ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్‌ను మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. పేదల దైవం సీఎం జగన్’ అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబుకి అసలు సర్జరీ ఎలా చేశారు?
సాక్షి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వైద్య నివేదికలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే అంత తీవ్రమైన రోగాలు ఉంటే.. ఏ వైద్యపరీక్షలు చేయకుండానే కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? అనేది నమ్మబుద్ధి కావడంలేదు. ఈ దశలో నిజంగానే ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? జైలుకు పోకుండా ఉండడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఒక రాజకీయ నేత మాత్రమే కాదు.. ఒక వైద్యుడు కూడా. చంద్రబాబు వైద్య నివేదిక విషయంలో ఒక వైద్యుడిగా ఆయన తన అనుమానాల్ని బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు(73).. ఫ్రీక్వెంట్ బౌల్స్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్ విత్ పెయిన్(ఛాతీలో బరువు.. నొప్పి), గిడ్డినెస్(తల తిప్పడం), నిద్రలేమి, ఇతరతత్రా ఇబ్బందికర పరిస్థితులతో పాటు తన శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధుల సమస్యలతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ రెండు ప్రధానమైన అంశాలను ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒకటి.. కరోనరీ ఆర్టరీ వ్యాధి(హృదయ సంబంధ వ్యాధులలో సర్వసాధారణమైంది), రెండోది..హైపర్ ట్రోపిక్ కార్డియోమియోపతి(హృదయ కండర పెరుగుదల వ్యాధి). హైపర్ ట్రోపిక్ కార్డియోమయోపతి(గుండె కండర పెరుగుదల వ్యాధి)తో పాటు ఎల్వీ (Left Ventricular గుండెలో ఎడమ జఠరిక) గడ్డ కట్టింది. అలాగే.. డయాబెటిస్ ఉంది. చర్మ సంబంధిత వ్యాధి ఉంది. వీటన్నిటికీ సంబంధించి వచ్చే మూడు నెలలలో ఇవాక్యుయేషన్ కావాలి. వ్యాయామాలు, శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. ఇంకా అడ్వాన్సుడ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు ఉన్నటువంటి అంబులెన్స్ నిత్యం కూడా టూర్ షెడ్యూల్లో ఉండాలి.. వైద్య నివేదికలో రిఫర్ చేశారు. మరోవైపు కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉందని, విటిలిగో(బొల్లి)కి సంబంధించి ఇమ్యునో మార్జిలేటర్ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. ఎరిట్రియా ప్రోన్ అంటే.. గుండె కొట్టుకోవడంలో హఠాత్తుగా వైవిధ్యమైన పరిస్థితులు చంద్రబాబులో ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు. అలాంటప్పుడు ఇటువంటి ఆరోగ్య పరిస్థితిల్లో ఉన్న వారికి సర్జరీ కోసం మత్తుమందు(ఆనస్తీషియా) ఇవ్వటం ప్రాణాంతకం. పైగా ఏ వైద్యుడు కూడా అంత సాహసానికి దిగడు. ఒకవేళ అలా మత్తు మందు ఇవ్వాలి అంటే గనుక.. ముందస్తు పరీక్షలన్నీ చేసుకున్నాకే నిర్ధారించుకుంటారు. కానీ.. చంద్రబాబు విషయంలో రెండో తేదీన అడ్మిట్ అయితే.. ఆ మరుసటి రోజే సర్జరీ చేసి డిశ్చార్జి కూడా చేశారు. ఏ వైద్యుడైనా సరే చంద్రబాబు హెల్త్ రిపోర్టులు చూపించాక.. సర్జరీ చేయడానికి కచ్చితంగా ఆలోచిస్తారు అనేది డాక్టర్ సీదిరి అప్పలరాజు చెబుతున్న మాట. చంద్రబాబు గుండె సైజు పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా బాబుకు కంటి ఆపరేషన్ చేయరు. బెయిల్ పొడగించుకోవడానికే ఈ మెడికల్ రిపోర్టు స్టోరీ అల్లుతున్నారు. అయినా బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు… pic.twitter.com/3AtDBI2rQl — YSR Congress Party (@YSRCParty) November 17, 2023 ఇక్కడ.. చంద్రబాబు కేసులో కంటి చూపు తగ్గిపోయింది అనే విషయానికి ఎవరూ అభ్యంతరం చేయరు. అయితే సీపీ కాల్షియం స్కోర్ 2019 రిపోర్టు ప్రకారం 916 ఉంది. ఇప్పుడు ఏకంగా 1,611 ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని వైద్యులు అన్నారు. కాల్షియం ఇంతలా పెరిగితే.. ఏ కార్డియాలజిస్ట్ అయనా సరే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ కచ్చితంగా చేస్తారు. పైగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయటం ద్వారా ఆయన కరోనరీ ఆర్థరీస్ ఎలాగ ఉన్నాయో తెలుస్తవి. అలా తెలిసినప్పుడు ఆయనకి కచ్చితమైన చికిత్స అందిచడానికి అవకాశం ఉంటుంది. మరి.. ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ముందస్తు పరీక్షలు చేయకుండా.. కనీసం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయకుండా ఏ వైద్యుడు ముందుకు వెళ్లడు కదా. కాబట్టి.. బెయిల్ పొడిగింపు కోసం ఇది వడ్డివారుస్తున్న కథ కూడా అనుకోవచ్చు అని మంత్రి సీదిరి అభిప్రాయపడుతున్నారు. సీదిరి మాట్లలోనే.. ‘‘చంద్రబాబుకు గుండె కండర పెరుగుదల వ్యాధి ఉందన్న విషయం మెడికల్ స్టూడెంట్స్‌గా ఉన్న టైంలోనే నాకు తెలుసు. గతంలో ఆయన ఓసారి ఉపవాస కార్యక్రమం చేపట్టినప్పుడు.. నిమ్స్ వైద్యులు ఆయన్నీ పరీక్షించారు. అప్పుడు నిమ్స్‌లో పని చేస్తున్న మా సీనియర్లు ఆ విషయం నాకు చెప్పారు. చంద్రబాబుకు ఇంతగా తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు.. కచ్చితంగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయాలి. ఇటువంటి జబ్బుల గురించి టెక్నికల్‌గా మాట్లాడితే.. మాయక్టిమి అంటారు. ఈ స్థితిలో.. గుండె ఎనలార్జ్ అయిన భాగాన్ని శుభ్రంగా తొలగిస్తారు. తద్వారా గుండె కొట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఇంకా చంద్రబాబుకు ఉన్న కరోనరీ ఆర్టరీ వ్యాధికి బైపాస్ తప్పనిసరి. ఇంకా ఏవేవో ఉన్నాయని రాసిచ్చారు. అయోగ్టిక్ స్టినోసిస్ ఉందన్నారు. డైలేటెడ్ ఎస్ఎండింగ్ అయ్యోర్టా ఉందన్నారు. నిజంగా అవన్నీ ఉంటే.. అయోర్టిక్ వాల్ కూడా రీప్లేస్ చేయాలి. కచ్చితమైన పరీక్షలు.. కచ్చితమైన ట్రీట్మెంట్ ఏమీ అందించకుండానే ఆపరేషన్ చేస్తారా?.. ఒక ప్రెస్టేజ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి రిపోర్టులను తన లాయర్ల ద్వారా తనకు నచ్చినట్లుగా రాయించుకుని కోర్టులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారేమో. కనీసం ఉన్న సమస్యలకు మందులు వాడడమో.. ఆ మందుల గురించి ప్రిస్క్రిప్షన్లు ఏవీ లేవు. చదవండి: బోగస్ ఇన్వాయిస్లతో ‘స్కిల్’ నిధులు స్వాహా -
మానవతా దృక్పథంతో కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది: మంత్రి అప్పలరాజు
-
బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: మానవతా దృక్ఫథంతో కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు న్యాయ వాదులు అఫిడివిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టుని కోరారని.. చంద్రబాబు నిప్పు అని క్వాష్ పిటిషన్ వేశారు తప్ప, ఎక్కడా తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. ‘‘చంద్రబాబు జైలులో ఉన్నన్నాళ్లు జనం చచ్చిపోతున్నారని పచ్చ మీడియా వార్తలు రాసింది. చనిపోయిన వాళ్లని ఓదార్చుతామని, నిజం గెలవాలని భవనేశ్వరి యాత్ర చేపట్టారు. బయటకు వచ్చాక యాత్ర ఎందుకు ఆపేశారు? అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ డ్రామాలపై నిజం గెలవాలని మేమూ డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్‌గా పరిశీలించాను. చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చింది. గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబుకి ఏ డాక్టర్ కూడా కన్ను ఆపరేషన్ చేయరు. బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు ఎందుకు’’ అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. సిటీ కాల్షియమ్ స్కోర్ 1611కి పెరిగి, ప్రమాదమని రిపోర్ట్‌లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ చేయరు. బెయిల్ పొడిగించుకోవడానికి ఈ మెడికల్ రిపోర్ట్ స్టోరీ అల్లుతున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం గుండెకు మెయిక్టమీ, బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ రిపోర్ట్స్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదు. ఏంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు. బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీస్‌లో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇచ్చారు’’ అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? -
జగన్ పై సిదిరి అప్పలరాజు అదిరిపోయే స్పీచ్
-
పురందేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు: మంత్రి సీదిరి
సాక్షి, తాడేపల్లి: అబద్దాలను సృష్టించి.. ఎల్లోమీడియాలో ప్రచారం చేయటమే టీడీపీ, జనసేన పని అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భయం సృష్టించాలనేది వారి ప్లాన్.. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘చిత్తూరు డైరీని చంద్రబాబు సర్వనాశనం చేశారు. మ్యాక్స్ చట్టం తెచ్చి తన మనుషులకు డెయిరీలను కట్టబెట్టారు. సంగం, విశాఖ, కృష్ణా డెయిరీలను తన వారి చేతిలో పెట్టారు. చిత్తూరు డెయిరీని ఎలా నాశనం చేశారో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వానికి చెందిన సంగం డెయిరీ ధూళిపాళ్ల నరేంద్రకు ఎలా వెళ్లింది?. 73 ఎకరాల భూములు సంగం డెయిరీకి ఉండేవి. ఆ భూములపై రూ.150 కోట్ల వరకు అప్పు తెచ్చుకున్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర కబ్జా చేసిన భూములు, డెయిరీలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టటంలో టీడీపీ వారికి ఉన్నంత స్కిల్ మరెవరికీ లేవు. ప్రభుత్వ ఆస్తులను దోచుకునే టీడీపీ నేతలు మాపై ఆరోపణలు చేయటం ఏంటి? అంటూ మంత్రి ప్రశ్నించారు. అమూల్ పేరు వింటేనే టీడీపీ నేతలకు నిద్ర పట్టటం లేదు. అమూల్ వలన పాడి రైతులకు మంచి లబ్ది చేకూరింది. అమూల్ రాకముందు సంగం డెయిరీ వారు 58 రూపాయలు రైతులకు ఇచ్చేవారు. అమూల్ వచ్చాక రూ.69.35లు ఇస్తున్నారు. అమూల్ రాక ముందు సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో వారు పాల ధర పెంచేవారు. అమూల్ వచ్చాక బలవంతంగా ధరలు పెంచక తప్పని పరిస్థితి వచ్చింది. గత మూడేళ్లలో 8 సార్లు ధరలు పెంచారు. ఇదీ జగనన్న పాలవెల్లువ ఎఫెక్ట్. ఇది తట్టుకోలేకనే అమూల్‌పై ఎల్లోమీడియాలో విషం కక్కుతున్నారు’’ అని మంత్రి నిప్పులు చెరిగారు. 3.73 లక్షల మంది రైతులు అమూల్‌కి పాలు పోస్తున్నారు. అమూల్ వల్ల 4,490 కోట్ల అదనపు లబ్ధి రైతులకు చేకూరింది. అంటే అమూల్ వలన పాడి రైతులకు మేలు చేకూరటం కాదా?. జనసేన పరిస్థితి విచిత్రంగా ఉంది. తెలంగాణలోని ఒక పార్టీ నుండి, ఏపీలో మరొక పార్టీ నుండి స్క్రిప్టు వస్తుంది. నాదెండ్ల మనోహర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. చంద్రబాబు పాలనలో ఆదరణ పథకం కింద ఏ ఒక్క కుటుంబమైనా బాగుపడిందా?. మేము ఒక పాడిగేదెని కొనివ్వటం వలన ఆ కుటుంబం బాగుపడింది. చేయూత పథకం ద్వారా మా ప్రభుత్వం ఎంతోమందికి మేలు చేకూర్చింది. నాదెండ్ల మనోహర్ సొంత బుర్ర ఉపయోగించి విషయాలు తెలిసుకుని మాట్లాడితే మంచిది’’ అని మంత్రి హితవు పలికారు. ‘‘టీడీపీ, జనసేన ఎప్పుడూ కలిసే ఉన్నాయి. గత ఎన్నికలలో కూడా ఒప్పందం మేరకే వేర్వేరుగా పోటీలో ఉన్నారు. అమరావతి ఎవరి రాజధాని? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే అమరావతి పై ఎందుకు ప్రేమ చూపుతున్నారు. పార్టీని పవన్ అమ్మేశాడని జన సైనికులు గుర్తించాలి. ఏపీలో మద్యం బ్రాండ్లను పురందేశ్వరి టేస్టు చేస్తున్నారేమో తెలీదు. ఇప్పుడు ఉన్నవన్నీ చంద్రబాబు పర్మిషన్తో వచ్చినవే. కాబట్టి పురందేశ్వరి వెళ్లి చంద్రబాబునే ప్రశ్నించాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. ఆమె కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కాస్త గౌరవం ఉండేది. బీజేపీలోకి వచ్చి, చంద్రబాబుకు వంత పాడటం మొదలెట్టాక ఆమె పరువు దిగజారింది. బీజేపీలో ఉన్న క్యాడరే పురందేశ్వరితో విభేదిస్తున్నారు. పురంధేశ్వరికి అంత ఇష్టం ఉంటే టీడీపీలో చేరితే మంచిది. ఏపీలో మద్యం అక్రమాలు ఉన్నట్టుగా అనిపిస్తే సీబీఐతో విచారణ చేయించుకోవాలి. పురంధేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు. చంద్రబాబు అన్ని ప్రభుత్వ సంస్థల నుండి తన ఖాతాలోకి డబ్బులు మళ్లించారు’’ అంటూ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. చదవండి: Fact Check: రోడ్డున పడ్డది రామోజీ పరువే.. -
స్వప్రయోజనాల కోసం చిత్తూరు డెయిరీని చంద్రబాబు నిర్వీర్యం చేశారు: మంత్రి అప్పలరాజు
-
పెత్తందారీ వ్యవస్థపై జ'గన్'
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో పెచ్చరిల్లిన పెత్తందారీ వ్యవస్థను సీఎం జగన్ సమూలంగా పెకలించివేశారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అంటరానివారుగా చిత్రీకరించి పెత్తందార్ల కాళ్ల కింద ఉంచితే, సీఎం జగన్ అదే పేదలకు పట్టం కట్టారని తెలిపారు. కావలిలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు విపరీతమైన అహంకారంతో మత్స్యకారులను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు. మత్స్యకారుల తోకలు కత్తిరిస్తానని, ఎస్సీ, ఎస్టీలుగా ఎవరూ పుట్టాలని కోరుకోరని బహిరంగంగా అవమానించడంతో పాటు బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు అని తెలిపారు. ఆయన పదవీ కాలంలో పేదలకు, అట్టడుగు వర్గాలకు పనికివచ్చేలా ఒక్క పనీ చేయలేదన్నారు. జన్మభూమి కమిటీలనే అసాంఘిక శక్తులను పేదల నెత్తిన పెట్టి స్వైరవిహారం చేయించాడని అన్నారు. ప్రజలు బాబు పాలనను ఛీకొట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగించిన తరువాత పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. రేషన్‌కార్డు, పింఛను, ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు ఏది కావాలన్నా అర్హత ఉంటే చాలు నేరుగా వలంటీర్లు ఇళ్ళ వద్దకు వెళ్ళి అందిస్తున్నారని, ఈ ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. కావలిలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం సామాజిక న్యాయానికి రోల్ మోడల్ జగన్ : ఎంపీ మస్తాన్‌రావు సామాజిక న్యాయానికి, సాధికారతకు సీఎం వైఎస్ జగన్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. ఎనిమది మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలు ఉన్నారన్నా, కేబినెట్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారంటే అందుకు జగన్మోహన్ రెడ్డి దార్శనికతే కారణమన్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దే: జూపూడి ప్రభాకర్ రాష్ట్రంలో అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని అందలం ఎక్కించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అధికార మదంతో అణగదొక్కితే.., సీఎం జగన్ మాత్రం ఈ వర్గాలను ఆదరించి, అభివృద్ధిలోకి తెస్తున్నారని తెలిపారు. జగన్‌తోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం సీఎం జగన్‌తోనే ప్రారంభమైందని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కనకపట్నంగా మారనున్న కావలి: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి సీఎం వైఎస్ జగన్ పాలనలో కావలి కనకపట్నంగా మారనుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి అన్నారు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దామవరం ఎయిర్‌పోర్టులతో నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి కూడా ఊపందుకుంటుందని వివరించారు. 21న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ హార్బర్ అందుబాటులోకి వచ్చిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, సామాజిక సాధికార బస్సు యాత్రలకు వస్తున్న స్పందనను చూసి టీడీపీ, ఆపార్టీకి వంతపాడుతున్న పచ్చమీడియాకు నిద్రపట్టడం లేదన్నారు. పేదల సంక్షేమమే సీఎం జగన్ అజెండా: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు పేదల సంక్షేమమే ఏకైక అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తెలిపారు. రాష్ట్రంలో సామాజిక సాధికారతతో పాటు సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలంతా అండగా నిలిచి, రానున్న ఎన్నికల్లో 175 స్థానాలను బహుమానంగా అందించాలని ప్రజలను ఆయన కోరారు. వెనుకబడిన వర్గాలు ఎల్లవేళలా మంచిగా ఉండాలంటే మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావాలని హఫీజ్‌ఖాన్ అన్నారు. -
సామాజిక సాధికార బస్సు యాత్ర.. ఎనిమిదో రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: నేడు ఎనిమిదో రోజు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార యాత్ర జరుగనుంది. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో యాత్ర ముందుకు సాగుతుంది. సామాజిక సాధికార యాత్రలో పలువురు వైస్సార్సీపీ నేతలు పాల్గొననున్నారు. పలాసలో యాత్ర రూట్ మ్యాప్: ⏰ఉదయం 10:15 గంటలకు: శ్రీకాకుళం నుండి బయలుదేరి టెక్కలి చేరుకుంటుంది. ⏰ ఉదయం 11:00 గంటలకు: ఎస్ కన్వెన్షన్ హాల్లో ప్రెస్ మీట్. ⏰మధ్యాహ్నం 12:00 గంటలకు: టెక్కలి నుండి బయలుదేరి పలాస వరకు బస్సు యాత్ర సాగుతుంది. ⏰మధ్యాహ్నం 1గంటకు: పవర్ గ్రిడ్ అతిథి గృహం (రామకృష్ణాపురం) పలాసకు చేరుకోవడం, భోజన కార్యక్రమం. ⏰ మధ్యాహ్నం 2 గంటలకు: పవర్ గ్రిడ్ గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమవుతుంది. ⏰ మధ్యాహ్నం 2:15 గంటలకు: కోసంగిపురం జంక్షన్‌కు చేరుకుంటుంది. ⏰ మధ్యాహ్నం 2:30 గంటలకు: 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & ఆసుపత్రికి చేరుకోవడం (అభివృద్ధి కార్యాచరణ సందర్శన) ⏰ మధ్యాహ్నం 2:45 గంటలకు: కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ నుండి ప్రారంభమై వైఎస్సార్ స్క్వేర్ కాశీబుగ్గ వరకు సాగుతుంది. ⏰ మధ్యాహ్నం 3.00 గంటలకు: కాశీబుగ్గ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సామాజిక సాధికర యాత్ర సభా వేదిక వద్దకు చేరుకుంటుంది. -
YSRCP Bus Yatra: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో మూడో రోజు వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. భీమిలో శనివారం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు. తగరపువలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. లోకేష్, భువనేశ్వరి సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయని విమర్శించారు. మత్స్యకారుల తోలు తీస్తానంటూ చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. మత్స్యకారులను దూషించిన చంద్రబాబును ఎవరైనా మరిచిపోతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు.. దొరికిన దొంగ చంద్రబాబు.. దొరికిన దొంగ అని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్నాడని ధ్వజమెత్తారు. సైకిల్ పోవాలంటూ చంద్రబాబే స్వయంగా ప్రచారంలో చెప్పారని ప్రస్తావించారు. తాను నిప్పంటూ ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు.. స్కీమ్‌ల పేరిట అన్ని స్కామ్‌లు చేసి జైల్లో ఉన్నారని దుయ్యబటారు. ‘బాబు ముసలోడు అయిపోయాడు, ఆయన్ను బయటకు తేవాలంటున్నారు. స్కీమ్‌ల పేరిట స్కామ్‌లు చేసిన చంద్రబాబును ప్రజలు నమ్ముతారా?. టీడీపీ నాయకుల్లో ఎవరికైనా దమ్ముంటే.. బాబు తప్పు చేయలేదని బెయిల్ అడగాలి. చట్టంలోని లొసుగుల గురించి మాట్లాడుతున్నారే గానీ.. చంద్రబాబు తప్పు చేయలేదని మాట్లాడటం లేదు’ అని మంత్రి సీదిరి మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు చరిత్ర ముగిసింది: విజయసాయిరెడ్డి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్.. ‘సామాజిక న్యాయం జరిగింది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. నాడు-నేడు కార్యక్రమంంతో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంగ్లీష్ విద్యను ప్రతి పేదవాడకి అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఓట్ల కోసం కాకుండా.. పేదవాడి చిరునవ్వు కోసం సీఎం జగన్ తపిస్తారు. పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. యాదవులకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ పెద్దపీట వేశారు’ అని పేర్కొన్నారు. మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్.. ‘14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బలహీన వర్గాలకు ఏం చేశారు?. నాయి బ్రహ్మణుల తోకలను కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. బలహీన వర్గాలంటే బాబుకు చాలా చులకన భావం. చంద్రబాబు దొరికిన దొంగ. స్కీమ్‌ల పేరిట చంద్రబాబు చేసింది స్కామ్‌లే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు సీఎం జగన్. పేదవాడి పిల్లలు ఇంగ్లీష్‌లో రాణించాలని నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రాజ్యంగ బద్ధంగా పేదలకు హక్కులు కల్పించింది సీఎం జగన్’ అని తెలిపారు. -
బడుగులకు ఆత్మగౌరవం విలువ చూపించిన జగన్
నరసాపురం: సమాజంలో బడుగు వర్గాలకు అత్మగౌరవం కల్పించి, ఆ విలువ చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సమాజంలో రాజసంతో జీవించే స్థితికి తెచ్చారని తెలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎన్నో అన్యాయాలకు, అవమానాలకు గురయ్యారని మంత్రి అప్పలరాజు చెప్పారు. అడుగడుగునా ఆయన ప్రదర్శించిన కుల అహంకారాన్ని, అధికార మదాన్ని వెనుకబడిన కులాలవారు, దళితులు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని కులాలు, అన్ని వర్గాలను ఒకేలా చూస్తున్నారని, అనేక కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని చెప్పారు. ఓ మత్స్యకారుడిని మంత్రిని చేశారని, మరో మత్స్యకారుడు మోపిదేవి వెంకటరమణను పార్లమెంటుకు పంపారని తెలిపారు. ఆలయాల పాలక మండలిలో నాయీ బ్రాహ్మణుడిని డైరెక్టర్‌గా పెట్టాలని నిబంధన పెట్టి ఆ సామాజికవర్గం గౌరవం పెంచారన్నారు. ఇది నిజమైన సామాజిక సాధికారత అని చెప్పారు. అన్ని జిల్లాల్లో హార్బర్లు నిర్మిస్తున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో కాపులే నష్టపోయారు: మంత్రి వేణుగోపాలకృష్ణ చంద్రబాబు హయాంలో కాపులే ఎక్కువగా నష్టపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఇప్పుడు కాపులు పవన్ భ్రమలో పడి ఇంకా నష్టపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి, సమాజంలో ముందడుగు వేయడానికి సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బడుగుల పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరిచారని చెప్పారు. ఓ కల్లుగీత కార్మికుడి కొడుకు చెట్టు ఎక్కకుండా, విదేశాల్లో ఉద్యోగం కోసం విమానం ఎక్కుతున్నాడంటే కారణం వైఎస్ కుటుంబమేనని తెలిపారు. అదే చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని సగానికి తగ్గించారని, ఆయన కులం వారి కాలేజీల్లో ఫీజులు అడ్డగోలుగా పెంచుకోవడానికి అనుమతులిచ్చారని చెప్పారు. దళితులు, బీసీలపై జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి: పినిపే మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ దళితులు, బీసీలు, మైనార్టీల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి అని చెప్పారు. కేబినెట్లో, నామినేటెడ్ పోస్టుల్లో దళితులు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఈ ప్రాధాన్యం చంద్రబాబు పాలనలో కనిపించలేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. అవినీతి లేని పాలన: మోపిదేవి సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ద్వారా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా, అవినీతి అన్నది లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తూ సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలన అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు వెనుకబడిన వర్గాలు కాదని, సమాజానికి వెన్నెముక లాంటివారని చెప్పడమే కాకుండా, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్ అని తెలిపారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు పాలన నాటి రోజులు తప్పవని చెప్పారు. నీ పిల్లలను మొగల్తూరులో తెలుగు మీడియం చదివించు పవన్ : పేర్ని నాని సీఎం వైఎస్ జగన్ పేదలు, బడుగు వర్గాల కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెగ బాధపడిపోయారని, ఆయన పిల్లలను సొంతూరు మొగల్తూరులో తెలుగు మీడియం స్కూల్లో చదివించవచ్చు కదా అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు మరెవరూ చేపట్టలేరని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం ఖాయమన్నారు. ఆశలు నిజం చేసిన నాయకుడు జగన్ : ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ఉన్నతంగా జీవించాలన్న అట్టడుగు వర్గాల కలలను నిజం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ అని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నరసాపురం నియోజకవర్గంలో రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని, రూ.1,500 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంక రవీంద్రనాథ్, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు. -
బీసీలు జడ్జీలుగా పనికిరారని సుప్రీంకోర్టుకు చంద్రబాబు లేఖ రాశారు: మంత్రి సీదిరి
-
‘ప్రతీ కుటుంబం తనదేనని భావించిన వ్యక్తి సీఎం జగన్’
సాక్షి, నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు సెంటర్లో వైఎస్సార్సీపీ బస్సు యాత్ర ప్రారంభమైంది. మొగల్తూరు నుంచి రామన్నపాలెం, ఎల్బీ చర్ల మీదుగా యాత్ర నరసాపురం చేరుకుంది. సాయంత్రం ఆరు గంటలకు నరసాపురంలోని ప్రకాశం రోడ్డు రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, నేతలు పాల్గొన్నారు. మరోవైపు, బస్సు యాత్ర సందర్బంగా ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టాము. 175 నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుంది. నరసాపురం నియోజకవర్గంలో ఈ యాత్ర మొగల్తూరు నుంచి ప్రారంభిస్తున్నాము. సీఎం జగన్ నాలుగున్నర సంవత్సరాల పాలన, సాధికారత ప్రజలకు వివరించనున్నాము అని తెలిపారు. ప్రతీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు.. మంత్రి శ్రీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికారత యాత్ర నరసాపురం నియోజవర్గంలో ప్రారంభం అవుతుంది. 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగి పట్టణంలో బహిరంగ సభ వరకు చేరుకుంటుంది. ప్రతిపక్షాలు యాత్ర ఎందుకు అంటున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మా గొంతు మా పాత్ర ప్రభుత్వాల్లో లేదే అని ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాలను గుర్తించారు. ప్రతీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి అండగా నిలిచారు. ప్రతీ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధి ఉండాలని వివిధ కార్పొరేషన్ల లోనూ ప్రభుత్వ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమపాళ్లలో ప్రాతినిధ్యం కల్పించారు. దీనిపై కూడా చంద్రబాబు తొత్తులు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కేబినెట్లోకి ఒక్క మైనార్టీకి కూడా తీసుకోలేదు. యనమలకు కౌంటర్.. బీసీలకు సమన్యాయం జరిగిందా అని ఏ రోజైనా యనమల రామకృష్ణుడు అడిగారా?. బీసీలకు ఆత్మగౌరవం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్. దళితులు తలెత్తుకుని జీవించేలా.. గిరిజనులు గర్వపడేలా చేసిన నాయకుడు సీఎం జగన్. ఏ పేదవాడు కూడా కష్టాల్లో ఉండకూడదని ప్రతీ కుటుంబం తన కుటుంబంగా భావించిన వ్యక్తి సీఎం జగన్. బహుజన భావజాలంతో పేదలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. గొప్ప భావజాలంతో ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్. జనహోరును తలపించేలా బస్సుయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. జగనన్న వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బహిరంగ సభతో ఈ యాత్ర జరగటం సంతోషదాయకం. 53 నెలల పరిపాలన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సామాజిక విప్లవకారులుగా మారారు. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పు కోసం సీఎం జగన్ కృషి చేశారు. పాదయాత్ర ఒక తపస్సు లాగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికారత యాత్రకు ఉవ్వెత్తున ప్రజల నుండి స్పందన వస్తోంది. జగనన్న వెంట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. బీసీల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. బీసీల కోసం ఇంతలా ఆలోచించిన నాయకుడు భవిష్యత్తులో కూడా రాడు. పదనాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సైతం బీసీల కోసం ఏమీ చేయలేదు. తొమ్మిదేళ్లు బీసీలను అణగదొక్కాడు. 2019లోనే నారాసురుడుని గుడ్‌బై.. కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు పథకాలు చేరుస్తున్న వ్యక్తి సీఎం జగన్. 2019లోనే ప్రజలు నారాసురుడుని వధించారు. నారా భువనేశ్వరి నిజాన్ని గెలిపించండి అంటున్నారు. ఎవరో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే అది పట్టుకుని తిరుగుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దద్దరిల్లెలా మన బిడ్డల భవిష్యత్తు జగన్ ద్వారా సాధ్యమని అందరూ తెలుసుకోవాలి. నాడు సామాజిక న్యాయం ఎండమావి.. నేడు సామాజిక న్యాయం నిండుకుండ. సీఎం జగన్ పాలనలో కొత్త ఒరవడి.. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది సాంఘిక అసమానతలకు గురయ్యారు. మంచి విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, తిండి లేవు. సీఎం జగన్ పరిపాలన చేపట్టాక నూతన ఒరవడితో సమసమాజస్థాపనకు కృషి చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో సీఎం జగన్ విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమాన్ని చేరువ చేశారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఈనాడు, ఏబీఎన్ పనికట్టుకుని జగనన్న చేసిన మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. 17 మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించారు. నలుగురికి రాజ్యసభ సీట్లు కేటాయించారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశాడు. భువనేశ్వరి ఆ విషయం తెలియదా? మహిళలకు పెద్దపెట్టవేసిన దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగనన్న.. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇల్లు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో పేదల పక్షాన జగనన్న ఉన్నాడు.. పెత్తందారుల పక్షాన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా ఉన్నారు. అనేక స్కాములతో అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నాడు చంద్రబాబు. నిజం గెలవాలని భువనేశ్వర్ గారు తిరుగుతున్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరు చంద్రబాబు కాదా?. 19 అవినీతి స్కాముల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు కాదా. రెండు ఎకరాల అధిపతి లక్షల కోట్లకు పడలెత్తాడని భువనేశ్వర్ గారికి తెలియదా?. అవినీతి రాజకీయాలకు, మీ వెన్నుపోటు రాజకీయాలకు జగనన్నను గుండెల్లో పెట్టుకున్న అక్క చెల్లెమ్మలు మీకు బుద్ధి చెబుతారు. -
నిప్పు.. నిప్పుగా చెప్పుకున్న బాబు పాపం పండింది
-
‘అవినీతి బాబును అరెస్ట్ చేస్తే యుద్ధం చేస్తావా పవన్..?’
సాక్షి, శ్రీకాకుళం: దేశంలోనే చంద్రబాబు ఒక పెద్ద స్కిల్డ్ క్రిమినల్ అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. అవినీతి చేసినవాడు ఏ స్థాయి వాడైనా శిక్షార్హుడే అని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు(సోమవారం) ప్రెస్‌మీట్ నిర్వహించిన మంత్రి సీదిరి అప్పలరాజు.. బాబు అవినీతి చరిత్రపై ధ్వజమెత్తారు. మంత్రి సీదిరి మీడియాతో ఏం మాట్లాడారంటే: ►అవినీతి చేసిన వాడు ఏ స్థాయి వాడైనా శిక్షార్హుడే ►చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ఒక వర్గం మీడియా, చంద్రబాబు పెయిడ్ బ్యాచ్.. రాజకీయ కుట్రగా ప్రచారం చేస్తున్నారు. ►కక్షసాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ►రాష్ట్రంలో యువకులను నైపుణ్య శిక్షణ ఇవ్వకుండా నేరుగా ప్రజల సొమ్మును సొంత ఖాతాల్లో జమ చేసుకోవడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదు. ►యువత, రాష్ట్ర ప్రజలు అవినీతి జరిగిందా లేదా అనేది చూడాలని కోరుతున్నా. ►అవినీతి చేసిన వాడు ఏ స్థాయి వాడైన శిక్షార్హుడే అన్నది గుర్తించాలి. ►దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా ప్రభుత్వ ధనాన్ని తన సొంత ఖాతాలో వేసుకోవడం ప్రప్రథమం. ►వ్యవస్థల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని నేరుగా ప్రభుత్వ సొమ్మును కాజేయడం కంటే అతిపెద్ద స్కాం ఎక్కడా ఉండదు. ►సీమెన్స్ కంపెనీ వారు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా..? ►పేరు సీమెన్స్ కంపెనీది.. దాన్ని అడ్డుపెట్టి డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ►ఆ డిజైన్ టెక్ కంపెనీ వారికి నేరుగా డబ్బులు వేశాడు. అక్కడి నుంచి సింగపూర్, మలేసియాల్లో ఉన్నా షెల్ కంపెనీలకు పంపారు. ►ఆ కంపెనీల నుంచి డబ్బంతా చంద్రబాబు పీఏకి పంపించారు. ►చంద్రబాబు దేశంలోనే ఒక పెద్ద స్కిల్డ్ క్రిమినల్... ►నేను వ్యవస్థలను ఎలాగైనా మేనేజ్ చేయగలను అనే అహంకారంతో చేసిన పని ఇది. ►అందుకే చంద్రబాబు గర్వంగా చేతనైతే నిరూపించుకోండి..సాక్షాధారాలు చూపించండి అంటాడు. ►ఎక్కడా నేను అవినీతి చేయలేదు అని మాత్రం చెప్పడు. ►నాలుగు రోజుల క్రితం నంద్యాలలోనూ ఇదే మాట్లాడాడు. ►చంద్రబాబు తన కేసు తాను వాదించుకుంటూ క్యాబినెట్ నిర్ణయాలను మీరెలా తప్పు పడతారు అన్నాడు. ►క్యాబినెట్ నిర్ణయాలపై విచారణ ఏంటి...మీరెవరు నన్ను అడగడానికి అని చంద్రబాబు అడిగాడు. ►వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏ పదవిలోనూ లేరు. ►అప్పట్లో వైఎస్సార్ గారి క్యాబినెట్- భూముల కేటాయింపులో నిర్ణయం తీసుకుంటే జగన్ పై ఇదే చంద్రబాబు తన మనుషులతో రిట్ పిటిషన్ వేయించాడు. ►ఆయా కంపెనీలు జగన్ గారి కంపెనీలో పెట్టుబడి పెట్టాయని క్విడ్‌ప్రోకో జరిగిందని నానా రాద్దాంతం చేశాడు. ►సుప్రీంకోర్టులో కూడా ఇదే టీడీపీ నేతలు అధికారికంగా ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపించారు. ►మరి, అవి క్యాబినెట్ నిర్ణయాలు కావా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ►వైఎస్సార్ గారి క్యాబినెట్ నిర్ణయాలపై కేసులు వేయవచ్చు... నీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకూడదా..? ►నీ మేనేజ్ మెంటు టైం అయిపోయింది... ఎల్లో మీడియా టైమూ అంతకంటే అయిపోయింది. ►మీరు నిజాలు దాస్తే దాగేవి కాదు..కాలం మారిపోయింది. ►కక్ష సాధింపు అంటే బాబు చేసింది..: ►నువ్వు ఏ విధంగా జగన్‌ని ఇబ్బంది పెట్టావో తెలుగు ప్రజలంతా చూశారు. ►అదీ రాజకీయ వైరం అంటే...రాజకీయంగా నువ్వు చేసిన తప్పిదం. ►ఏ తప్పు చేయకుండానే జగన్ గారిపై అప్పటి కేంద్ర ప్రభుత్వంతో కుమ్ముక్కై, రాజకీయంగా కక్ష సాధించారు. ►చంద్రబాబు ప్రభుత్వంలోని ఓ ఐఏఎస్ అధికారికే అనుమానం వచ్చి రాతపూర్వకంగా సీఎం చెప్తే ఇస్తున్నా అని రాశాడు. ►చంద్రబాబు హయాంలోనే జీఎస్టీ అధికారులు తీగలాగితే డొంక కదిలింది. ►2021లో కేసు నమోదు చేసి విచారిస్తే అసలైన సూత్రధారి చంద్రబాబు జైళ్లోకి వెళ్లాడు. ►ఇందులో రాజకీయ కక్ష ఏముంది..? చంద్రబాబు ఈ రోజు కూడా తాను తప్పు చేయలేదు అనడం లేదు. ►చంద్రబాబు తప్పు చేశాడని ఆయన లాయరే కన్విన్స్ అయ్యాడు. ►అందుకే అరెస్ట్ చేసిన విధానం బాగాలేదని అన్నాడు తప్ప, తప్పు చేయలేదు అనలేదు. ►ఎన్ని తిట్టినా జైళ్లో బాబును గౌరవంగానే చూస్తున్నాం: ►రాజమండ్రి సెంట్రల్ జైళ్లో ఓ ప్రత్యేక వసతి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆయన్ను చాలా గౌరవంగా చూసుకుంటోంది. ►మాజీ ముఖ్యమంత్రి అని, ముసలోడు అని ఆయన ఎన్ని మాటలు అన్నా అవన్నీ పక్కన పెట్టి గౌరవంగా చూస్తున్నారు. ►మా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి నీ పుట్టుకే ఒక తప్పుడు పుట్టుక అన్నాడు. ►ఒక గౌరవ ప్రదమైన స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి..? ►మేం తిట్టలేమా..? మాకు మాటలు రావా..? ►రాష్ట్రంలోని ప్రజలందరూ జగన్ తల్లిదండ్రుల త్యాగం ఎలాంటిదో చెప్తారు. ►నీ తల్లిదండ్రుల త్యాగం గురించి నువ్వు చెప్పగలవా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఆయన తల్లిదండ్రులెవరో తెలుసా..? ►ఆయన కొడుకు కట్డ్రాయర్ల మీద ఊరేగిస్తా..బట్టలూడదీస్తా అంటాడు. ►నమస్కారం రా అయ్యా..రాజకీయాల్లో బట్టలు ఊడదీయడం అంటే నిన్న మీ నాన్నకు జరిగిందే. ►మీ నాన్నను నంద్యాల నుంచి విజయవాడ వరకూ తీసుకు వచ్చారు కదా.. ►కోర్టు బోనులో దీనంగా కూర్చోబెట్టారు కదా. అదీ బట్టలూడదీయడం అంటే. ►మీ నాన్న సానుభూతి కోసం తెగ ప్రయత్నం చేశాడు..ఈ రాష్ట్రంలో ఒక్క సాధారణ పౌరుడైనా సానుభూతి చూపించాడా..? ►మంచిపనైంది..ఈ రాష్ట్రానికి దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నారు. ►ఎవరో ఒకరు రాకపోతారా..చంద్రబాబు అవినీతిని పెకిలించి తీయకపోతారా అని అనేక సందర్భాల్లో ప్రజలు కోరుకున్నారు. ►అవినీతి బాబును అరెస్ట్ చేస్తే యుద్ధం చేస్తావా?: ►విచిత్రం ఏంటంటే...పవన్ కల్యాణ్ కూడా వీళ్ల అవినీతిపై గతంలో విమర్శించాడు. ►ఇంతటి అవినీతి ప్రభుత్వం నేను చూడలేదు..తోలు తీస్తాం..తాట తీస్తాం అన్నాడు. ►అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రోడ్డుపై ఈ డ్రామాలేంటి..? ►పవన్ కల్యాణ్ ఒక్క సారి మీ జనసైనికుల మనోవ్యధ వినండి. ►ఇంకెన్నాళ్లు ఈ చంద్రబాబు జెండానే ఎజెండాగా తీసుకెళ్తాం అని వాళ్లు కుమిలిపోతున్నారు. ►నీకేం నువ్వు బాగానే ఉన్నావు.. ప్యాకేజీ తీసుకుని అస్తులు కూడబెట్టుకుంటున్నావు. ►వాళ్ల నమ్మకాన్ని, కష్టాన్ని నువ్వు వేరే వారి దగ్గర ప్యాకేజీ తీసుకుని, డబ్బుగా మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదు. ►దీనికంటే చిరంజీవిలా గౌరవంగా పార్టీని వదిలేసి సినిమాలు తీసుకోవడం బెటర్. ►చక్కగా సినిమాలు తీసుకో...రాజకీయాలకు నువ్వు సూట్ అవ్వవు. ►కన్నకొడుకులోనే అంత ఆక్రోశం చూడలేదు కానీ..దత్తపుత్రుడి ఓవరాక్షన్ చూస్తున్నాం. ►వాళ్ల అమ్మగారిని తిట్టినప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఇంత ఓవరాక్షన్ చేయలేదు. ►చివరికి తాను చేసే రీమేక్ సినిమాల్లోనూ పవన్ కల్యాణ్ అంత ఓవరాక్షన్ చేయలేదు. ►అవినీతి చంద్రబాబును అరెస్టు చేస్తే మాత్రం ఇక యుద్ధమే అంటున్నాడు. ►ఇన్నాళ్లు నువ్వేం చేస్తున్నావు..? రాజకీయాల్లో ప్రతి రోజూ యుద్ధమే. ►ఇన్నాళ్లు నువ్వు చేసింది రాజకీయ వ్యభిచారమే.. ►చంద్రబాబు అరెస్టు అనేది ప్రభుత్వం విధి.. బాధ్యత. ►బాబులాంటి అవినీతి పరుడికి వంత పాడే నీలాంటి వాడికి ప్రజలు ఎలా అవకాశం ఇస్తారు..? ►అసెంబ్లీలోకే అడుగుపెట్టలేకపోయావు..ఇలా అయితే అసెంబ్లీ గేటు కూడా తాకలేవు. ►పచ్చమీడియా, ఇకనైనా కళ్ళు తెరవండి. చంద్రబాబు అవినీతిని ప్రజలకు వివరించండి...మీరు చేసిన పాపాల్లో కొంతైన ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ►కమ్యూనిస్టులు ఎక్కడైనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతారు కానీ ఒక్క ఏపీలోనే అవినీతికి మద్దతు పలుకుతున్నారు. ►అందుకే నేడు కమ్యూనిస్టులు నామ మాత్రం అయిపోయారు. ►చంద్రబాబు లాంటి అవినీతి పరుడికి మీరు వంతపాడుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో మీరు ఎంత దిగజారిపోయారో గమనించుకోండి. ►స్కాం జరిగిందని యనమలకు తెలియదా..? ►యనమల రామకృష్ణుడు విమర్శించడం విడ్డూరం. స్కిల్ లో అవినీతి జరిగిందని ఆయనకు తెలియదా..? ►అప్పుడు ఆర్థిక మంత్రి ఆయనే కదా..? ఆయనకు తెలుసు..అందుకే అప్పుడే ఆయన తప్పుకున్నాడు...అందుకే ఆయన పేరు ఎక్కడా రాలేదు. ►ఫైనాన్స్ శాఖ అభ్యంతరం తెలిపింది అంటే ఆ శాఖ మంత్రి కూడా అభ్యంతరం తెలిపినట్లే. ►మళ్లీ ఇప్పుడొచ్చి దొంగ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు..? ►అచ్చెన్నాయుడు ఒక రూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే పీక కోసుకుంటాను అన్నాడు. ►కోర్టు అవినీతి జరిగిందని బలంగా నమ్మబట్టే చంద్రబాబును జైలుకు పంపించింది. ►మరి అచ్చెన్నాయుడు పీక కోసుకున్నాడా..? ఇంకా ఎందుకు పీక కోసుకోలేదు..? -
సాక్ష్యాధారాలు ఉండడంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు
-
చంద్రబాబు స్కామ్‌పై వార్తలేవి?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): చంద్రబాబుకు ఆగస్టు నెలలో ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తుంటే రాష్ట్రంలో ఉన్న రామోజీకి, రాధాకృష్ణ, టీవీ–5 నాయుడులకు కనిపించడం లేదా, వినిపించడం లేదా? అని రాష్ట్ర పశుసంవర్ధశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. సుమారు రూ.118 కోట్లు తేడా వచ్చాయని వాటికి సంబంధించి పూర్తి లెక్కలు, వివరాలు ఇవ్వకపోతే చంద్రబాబుపై పూర్తి చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ తెలిపినట్లు మీడియాలో కథనాలు వస్తున్నా ఎల్లోమీడియా మాత్రం నాలుగులైన్ల వార్త కూడా రాయకపోవడం దారుణమని చెప్పారు. ఎల్లోమీడియా ఉన్నంతకాలం రాష్ట్రానికి మంచి రోజులు రావన్నారు. ఆయన ఆదివారం శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారని గుర్తుచేశారు. మీ కులం వ్యక్తి అయిన చంద్రబాబు తప్పులు ప్రజలకు తెలియజేయకుండా మౌనం వహించడమే మీకు తెలుసన్న విషయం అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో మీ కులానికి చెందిన వ్యక్తి కాకుండా ఇంకెవరైనా ఇలాంటి తప్పుచేసి ఉంటే రోజుల తరబడి పతాక శీర్షికల్లో వార్తలు చూపించేవారని చెప్పారు. ఇదేనా మీ నైతిక విలువలు, సిద్ధాంతాలు అని మండిపడ్డారు. చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో వినయ్, విక్కి అనే వ్యక్తుల ద్వారా బోగస్ కంపెనీలు రిజిస్టర్ చేసి వాటికి సబ్ కాంట్రాక్టులు పనులు ఇప్పించుకుని సబ్‌కాంట్రాక్టుల ఖాతాల్లో డబ్బులు వేసి తిరిగి వాటిని బాబుకు చేర్చేవారని, ఇదేనా సంపద సృష్టించడమంటే అని ప్రశ్నించారు. పోలవరం ఒరిజినల్ బిడ్డర్ని పక్కన పెట్టి రామోజీరావు బంధువు నవయుగ వారికి ఇచ్చేసిన ఘనుడు చంద్రబాబు అని చెప్పారు. ఇన్నాళ్లు తొడలు గొట్టిన చంద్రబాబు మూడురోజుల నుంచి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోలు ధరలు పెరిగినప్పుడు సీఎం జగన్ వల్లే పెంచారని ప్రచారం చేసే పచ్చమీడియా, చంద్రబాబు.. ధరలు తగ్గినప్పుడు జగన్ వల్ల తగ్గాయని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పవన్ నోరు ఏమైంది? ‘ప్యాకేజీ స్టార్.. ఇప్పుడు ఎందుకు నీ ప్రశ్నించేతత్వం మౌనంగా ఉంది? నీ యజమాని చంద్రబాబు అక్రమాలు బయటపడితే నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు. అంటే నువ్వు నిజంగా ప్యాకేజీకి అమ్ముడుపోయావని అర్థమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే పవన్‌కు ముఖ్యం’ అని మంత్రి పేర్కొన్నారు. -
‘వైఎస్సార్ ఫోటోను చూసినా చంద్రబాబుకు భయం’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఒక శాడిస్ట్ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. 2014-19 వరకూ వైఎస్సార్ విగ్రహాలు పెట్టనివ్వకుండా చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, వైఎస్సార్ ఫోటోను చూసినా చంద్రబాబు భయపడుతుంటారని ఎద్దేవా చేశారు వెల్లంపల్లి. ‘విజయవాడలో రాత్రికి రాత్రి 45 ఆలయాలను కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం జగన్ వచ్చాక ఆ ఆలయాన్నింటిని పునర్నిర్మిస్తున్నారు.చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా?, వైఎస్సార్ కుటుంబం అంటే గుర్తొచ్చేది అభివృద్ధి సంక్షేమం. చంద్రబాబు అంటే అవినీతి వెన్నుపోటు’ అని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. ఒలింపిక్స్‌లో మెడల్కొట్టి డోపింగ్‌లో దొరికినట్టయ్యింది చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులివ్వడంపై మంత్రి సీదిరి అప్పలరాజు తనదైన శైలిలో చమత్కరించారు. చంద్రబాబు పరిస్థితి ఒలింపిక్స్‌లో మెడల్కొట్టి, డోపింగ్‌లో దొరికినట్లయ్యిందన్నారు. ‘ చంద్రబాబుకు ఐటీశాఖ నోటీసులిచ్చింది. లెక్కల్లో చూపని రూ. 118 కోట్లకు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. బాబుకు ఐటీ నోటీసులపై రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్నాయుడు స్పందించరు. బాబు తప్పుల గురించి వారు ప్రజలకు తెలపరు. అమరావతి అనే మాయా ప్రపంచాన్ని చంద్రబాబు సృష్టించారు. అమరావతిలో ఇతురులెవరూ భూమి కొనుగోలు చేయకుండా చట్టం సృష్టించాడు బాబు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే చెప్పారు’ అని మంత్రి అప్పలరాజు మరోసారి గుర్తుచేశారు. చదవండి: లోకేశ్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు: కన్నబాబు పొలిటికల్ పంచ్ -
‘బాబుకు ఎన్టీఆర్ బొమ్మతో రాజకీయాలు మాత్రమే కావాలి’
సాక్షి, కాకినాడ: చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. కుప్పంలో దొంగ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నాడని అన్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరుమీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు అని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కుప్పంలోనే 30-40వేల బోగస్ ఓట్లు ఉన్నాయి. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే బాబు మొసలికన్నీరు కారుస్తున్నాడు. చాలాసార్లు బీజేపీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ పేరుమీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎందుకు అడగలేదు?. ఎన్టీఆర్ బొమ్మతో ఓట్లు లబ్ధి పొందాలనేదే చంద్రబాబు తాపత్రయం. ఎన్టీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు కావాలనే ఆలోచన బాబుకు లేదు. ఎన్టీఆర్ బొమ్మతో చంద్రబాబుకు రాజకీయాలు మాత్రమే కావాలి. ఇదే సమయంలో విశాఖ మత్య్సకారుల సమస్యలపై కూడా మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. విశాఖలో మత్స్యకారుల సమస్య ఈనాటిది కాదు. గత ముప్పై ఏళ్ల కింద ఇచ్చిన హామీ అమలు కాలేదు. విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్‌తో మాట్లాడాను. మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై పోసాని సీరియస్ కామెంట్స్ -
ఆదివాసీలతో మంత్రి అప్పలరాజు డ్యాన్స్
-
సేంద్రియ మత్స్య ఉత్పత్తులను ప్రోత్సహించాలి
సాక్షి, అమరావతి: సమాజంలో ప్రతి ఒక్కరు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, ఎలాంటి రసాయన అవశేషాల్లేని సముద్ర మత్స్యఉత్పత్తులను కూడా సేంద్రియ ఉత్పత్తులుగానే పరిగణించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భూమి ఆర్గానిక్స్ సహకారంతో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో మూడురోజులు నిర్వహించే 2వ దక్షిణ భారత స్థాయి సీఫుడ్ ఫెస్టివల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నంబర్–1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వినియోగం ఎనిమిది కిలోలకు మించడం లేదన్నారు. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర బ్రాండింగ్‌తో హబ్స్ అండ్ స్పోక్స్ మోడల్లో పెద్ద ఎత్తున మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్వాహబ్, దానికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1,400 అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశామని, మరో రెండువేల అవుట్‌లెట్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఔత్సాహికులు ముందుకొస్తే 40 నుంచి 60 శాతం సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేయడమేగాక ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని రకాల చేయూత అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులను ప్రోత్సహించడం, మాంసాహార ప్రియుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సీఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరాల్లో నిర్వహించిన ఫెస్టివల్స్‌కు అనూహ్య స్పందన లభించిందన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఫెస్టివల్లో రూ.699కి అన్లిమిటెడ్ సీఫుడ్ బఫెట్ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు వంటి నగరాల్లో సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫిష్ ఆంధ్ర ఆన్లైన్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఏఎఫ్సీవోఎఫ్ చైర్మన్ కె.అనిల్‌బాబు, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ అంజలి, జేడీలు వి.వి.రావు, హీరానాయక్ పాల్గొన్నారు. -
రెండున్నర గంటల్లో రేషన్‌కార్డు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినంచల గ్రామ సచివాలయంలో బుధవారం లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న సుమారు రెండున్నర గంటల్లో కొత్త రేషన్ కార్డును అధికారులు మంజూరు చేసి రికార్డు సృష్టించారు. చినంచల గ్రామానికి చెందిన పినకాన ప్రభావతి దంపతులు ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లారు. గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతోందని తెలిసి బుధవారం ఉదయమే గ్రామానికి వచ్చారు. భార్యాభర్తలు సచివాలయానికి వెళ్లి రేషన్ కార్డు కోసం ఉదయం 10.30 గంటలకు దరఖాస్తు (టి232995259) చేసుకున్నారు. మధ్యాహ్నం 1.17 నిమిషాలకు కార్డు మంజూరు కావడంతో అక్కడే జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతులమీదుగా కార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ నాయుడు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వెంటనే సచివాలయం నుంచి ఎమినిటీ, వీఆర్వో, ఆర్ఐలను దాటుకుని మండల సివిల్ సప్లయ్ డీటీకి దరఖాస్తు చేరిందని, వెంటనే రేషన్‌కార్డు (1627648) మంజూరై తిరిగి సచివాలయానికి చేరిందని, దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని వివరించారు. -
పశుపోషణ, పాడి, డెయిరీ, సాగు రంగాల్లో.. ఏపీ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి/భవానీపురం/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : పశుపోషణ, పాడి, డెయిరీ, సాగు రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేరళ, ఇథియోపియా బృందాలు కొనియాడాయి. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు.. అలాగే, రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే) ద్వారా గ్రామస్థాయిలో అందిస్తున్న సేవలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని తెలిపాయి. ఏపీలో తీసుకొస్తున్న లైవ్‌స్టాక్ అండ్ పౌల్ట్రీ ఫీడ్ అండ్ మినరల్ మిక్చర్ బిల్లు–2022ను స్ఫూర్తిగా తీసుకుని దానిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలుచేసే నిమిత్తం మంత్రి చెంచురాణి నేతృత్వంలోని 10 మంది ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన కేరళ ప్రభుత్వ సెలక్ట్ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో మంగళవారం రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో కేరళ బృందం సమావేశమైంది. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో తమ ప్రభుత్వం నాలుగేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని వివరించారు. ప్రతీ ఆర్బీకేను రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దామన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ డెయిరీ రంగం బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. కేరళ ఎమ్మెల్యేల సందేహాలను మంత్రి అప్పలరాజు నివృత్తి చేశారు. ఏపీ పశుదాణా చట్టం–2020 అమలుతీరును పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ వివరించారు. సీఎం జగన్ దూరదృష్టి అద్భుతం : కేరళ మంత్రి చెంచురాణి కేరళ మంత్రి చెంచురాణి మాట్లాడుతూ ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టికి తామంతా ముగ్ధులయ్యామన్నారు. పశుపోషణ, పాడి, డెయిరీ రంగాల్లో ఏపీ సర్కార్ అందిస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. కేరళలో పాడి, పౌల్ట్రీ సంపదకు అవసరమైన దాణా, ఫీడ్ కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. 50 శాతానికి పైగా పశు దాణా, పౌల్ట్రీ ఫీడ్లను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ చేపట్టిన కార్యక్రమాలను కేరళలో కూడా అమలుచేసేందుకు తమ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు, వైద్య, విద్యరంగాల్లో తీసుకొచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. కేరళ మంత్రి, ఎమ్మెల్యేలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆచరించదగ్గ ఎన్నో విషయాలున్నాయిక్కడ: ఇథియోపియా బృందం ప్రశంస మరోవైపు.. ఆర్బీకేల సేవలు అద్భుతంగా ఉన్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం కితాబిచ్చింది. ప్రపంచంలో వ్యవసాయాధారిత దేశాలన్నీ ఆచరించదగ్గ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ అమలవుతున్నాయని అభిప్రాయపడింది. ఇథియోపియా బృందం పర్యటనలో భాగంగా రెండోరోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని గొల్లపూడి ఆర్బీకే కేంద్రాన్ని బృందం సందర్శించింది. ఆర్బీకేలోని కియోస్క్ ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల బుకింగ్, సరఫరా గురించి రైతులను అడిగి బృందం సభ్యులు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకిచ్చిన ట్రాక్టర్ ఎక్కి రైతు క్షేత్రంలో దుక్కి పనుల్లో పాల్గొన్నారు. మూలపాడులో ఖరీఫ్ పంటల ఈ–క్రాప్ నమోదును పరిశీలించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొని ఆర్బీకే ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల గురించి తాము విన్నదానికంటే ఎన్నో రెట్లు బాగున్నాయని బృంద సభ్యులు ప్రపంచానికే ఏపీ ఒక దిశానిర్దేశం చేసిందన్నారు. ఈ బృందంలో ప్రపంచ బ్యాంకు సలహాదారు హిమ్మత్ పటేల్, ఇథియోపియా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. -
సీఎం పదవి ప్రజలివ్వాలి.. అడుక్కుంటే రాదు పవన్: మంత్రి సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైరయ్యారు. ముందు నువ్వు ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెప్పు అని ప్రశ్నించారు. అసలు జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో చెప్పాలి. ముఖ్యమంత్రి పదవి అంటే ప్రజలు ఇవ్వాలి.. అడుకుంటే రాదు పవన్ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ అసెంబ్లీకి వెళ్లడానికి నన్ను ఎవరు ఆపేది అంటున్నాడు. ముందు ఎక్కడ పోటీ చేస్తున్నాడు చెప్పమనండి. రాష్ట్రం మొత్తం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఎలా?. ముందు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తావో డిసైడ్ అవ్వు. రాష్ట్రం మొత్తం తిరిగి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే అది అసమర్థ యాత్ర. 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సీఎం అవ్వరు అంటూ చురకలు అంటించారు. చెప్పులు పోతే కొనుకోవచ్చు కానీ.. మీ పార్టీ గుర్తుపోతే ఎలా?. మీ గుర్తే మీకు తెలియదు. ముందు మీ గుర్తు ఏదో వెత్తుకోండి. 2019లో అందరూ కలిసే ఉన్నారు. మేము ఒంటరిగా పోటీ చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని స్పష్టం చేశారు. పవన్.. నేను ట్రైనింగ్ అయ్యాను.. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటున్నావ్. అసలు జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో చెప్పాలి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పవన్.. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావ్: మంత్రి వేణు -
టీడీపీ మినీ మేనిఫెస్టోపై మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు
-
మూగజీవాలకు సేవ చేయడం దేవుడిచ్చిన అదృష్టం: మంత్రి అప్పలరాజు
సాక్షి, విజయవాడ: మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తూ తద్వారా పాడిరైతులకు, పశువుల పెంపకందార్లకు మేలుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర పశు సంవర్థక, డెయిరీ, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ప్రపంచ పశువైద్య దినోత్సవం-2023 సందర్భంగా శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో పశు సంవర్థక శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవం-2023 సందర్భంగా “పశువైద్య వృత్తిలో వైవిధ్యం, సమానత్వం, సమగ్రతను ప్రోత్సహించడం” అనే థీమ్ పై ఆయన సుదీర్ఘంగా చర్చించి విలువైన సలహాలు, సూచనలు అందించారు. నాలుగేళ్ల పశు సంవర్థక శాఖ సాధించిన పురోగతిని, సాధించాల్సిన ప్రగతిని, లక్ష్యాలను మంత్రి క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా పశు సంవర్థక శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. నోరులేని మూగజీవాలకు సేవ చేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావించాలని సూచించారు. వాల సేవలో తరిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి పేరుపేరున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోని ప్రగతి ఆ దేశంలో ఉన్న పశువుల ఆరోగ్యస్థితిని బట్టి చెప్పవచ్చన్న మహాత్మాగాంధీజీ స్పూర్తితో పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ ద్వారా పశువులకు కూడా అంబులెన్స్ సేవలు తీసుకొచ్చామని మంత్రి అన్నారు. మూగ జీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు 1962 నంబర్‌కు కాల్ చేస్తే సత్వరమే పశువుల అంబులెన్స్‌లు పశువు ఉన్న ప్రాంతానికి వెళ్లి వైద్య సేవలందించడం గొప్ప సంస్కరణ అన్నారు. చదవండి: ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించడంలో రజనీకాంత్ పాత్ర: మంత్రి జోగి రమేష్ పాడి పశువులతో పాటు గొర్రెలు, మేకలు వంటి జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మందులతో పాటు పశువులను అంబులెన్స్ వాహనంలోకి ఎక్కించేందుకు వీలుగా హైడ్రాలిక్ సౌకర్యం ఏర్పాటుచేశామన్నారు. అవసరమైన పరిస్థితుల్లో దగ్గర్లోని ఏరియా పశువైద్యశాలకు పశువులను తరలించి సరైన వైద్యం అందించడం ద్వారా వాటిని ప్రాణాపాయం నుంచి రక్షించడం జరుగుతుందన్నారు. పశు పోషకులకు ఫోన్ కాల్ ద్వారా అందించే గౌరవాన్ని ప్రత్యక్షంగా పరీక్షించానని తన అనుభవాన్ని చెబుతూ మంత్రి సీదిరి అప్పలరాజు 1962 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ సిబ్బంది పనితీరును వివరిస్తూ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ అమూల్ పాలవెల్లువ ద్వారా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఆటోమేటెడ్ పాలసేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెల యూనిట్ల ఏర్పాటు, అక్కచెల్లెమ్మలకు మెరుగైన జీవనోపాధి కల్పనలో భాగంగా సుస్థిర ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ చేయూత ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందిన లబ్ధిదారులను, వారు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను చూసి సంతోషమేసిందన్నారు. పాడి రైతులకు మేలు చేసే విధంగా రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు పునరుద్ధరించడమే గాకుండా వాటిని బలోపేతం చేసే లక్ష్యంతో అమూల్ తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని మంత్రి వివరించారు. పాల ఉత్పత్తి దారులకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి లీటర్ పాలపై ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే అదనంగా ఆదాయం కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను జారీ చేసిన రాష్ట్రం తమదేనని, ఇదొక గొప్ప చర్య అని మంత్రి అభివర్ణించారు. చదవండి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి ట్వీట్ పశుసంవర్థక శాఖ ద్వారా అమలు చేస్తున్న వినూత్న పథకాల ద్వారా జీఎస్ డీపీ పెరిగిందని, అందుకు కారకులైన పశుపోషకులకు, పశు వైద్యులకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయం అన్నారు. పశు సంవర్థక సహాయకులు, పారా స్టాప్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల ద్వారా పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నేటివ్ బ్రీడ్ కన్జర్వేషన్ పై ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారన్నారు. 154 వెటర్నరీ ల్యాబ్ లను త్వరితగతిన వినియోగంలోకి తేనున్నామన్నారు. ప్రతి ల్యాబ్ ను వినియోగంలోకి తీసుకువస్తే విజయం సాధించినట్టే అన్నారు. పాడిరైతులకు అభయమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డా.వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకాన్ని తెచ్చిందని మంత్రి తెలిపారు. తద్వారా ప్రమాదవశాత్తు, ఆకస్మాత్తుగా పశువులు, గొర్రెలు వంటి జీవాలు చనిపోతే నష్టపరిహారం అందించి ఆదుకుంటున్న విషయం గుర్తుచేశారు. రూ.40 కోట్లతో ప్రారంభించిన మిషన్ పుంగనూర్ ప్రాజెక్టు, ముర్రా బ్రీడింగ్ సెంటర్ ను మంత్రి వివరించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా బ్రీడ్ లను ఇంప్రూవ్ మెంట్ చేస్తున్నామన్నారు. లైవ్ స్టాక్ గ్రోత్ వృద్ధిలో భాగంగా కాపోస్కోపీ పరీక్షల ద్వారా ఉత్పత్తి శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కోటికి పైగా పశు సంపద ఉందన్నారు. ప్రతి 5000 పశువులకు ఒక వెటర్నరీ డాక్టర్ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా రాష్ట్రవ్యాప్తంగా పశు సంవర్థక శాఖలో ఖాళీల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 10వేలకు పైగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి చోటా వెటర్నరీ అసిస్టెంటులున్నారన్న విషయం గుర్తుచేశారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆముదాలవలస, పుంగనూరు, బనావసి, సంతనూతలపాడులో 4 వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అసంపూర్తిగా గరివిడిలో ఉన్న వెటర్నరీ కాలేజీలో పూర్తి సౌకర్యాలు కల్పించి అడ్మిషన్లు కూడా జరిపామన్నారు. త్వరలో పులివెందులలో వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న పశు సంవర్థక శాఖ కార్యాలయాల భవనాల్ని ఈ ఏడాదిలో ఆధునికీకరిస్తామన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పశు సంవర్థక శాఖ ప్రధాన కార్యదర్శి డా. గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ ద్వారా పశుపోషకుల సంక్షేమం, పశువుల సంరక్షణకు మరిన్ని సేవలు అందించాలన్నారు. గుడ్ల ఉత్పత్తిలో మొదటిస్థానంలోనూ, పాలు, మాంసం ఉత్పత్తిలో అగ్ర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ పోటీపడుతూ 5వ స్థానంలో నిలిచిందన్నారు. సర్వీస్ డెలివరి సెంటర్ పాయింట్ లుగా ఆర్బీకేలు నిలిచాయన్నారు. పశుపోషణ ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి పశుపోషణ మరింత దోహదం చేస్తుందన్నారు. పశు సంవర్థ శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్రకుమార్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో మొదట ప్రపంచ పశు వైద్య సేవ దినోత్సవం నేపథ్యం, ఈ ఏడాది థీమ్, పశు వైద్యుని ప్రాముఖ్యత,పశు పోషకులకు అందించాల్సిన సేవలను వివరించారు. ముఖ్యంగా ప్రతి ఏడాది ఏప్రిల్ చివరి శనివారం రోజు ప్రపంచ పశు వైద్య దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జ్యోతి ప్రజ్వలన, ప్రసంగాలు పూర్తి అయిన అనంతరం డా.సి.కే.రావు ఎండోమెంట్ ట్రస్ట్ 22వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిష్ణాతులైన 16 మంది పశు వైద్యులను, ఔత్సాహిక వేత్తలు, విద్యార్థులను మంత్రి సీదిరి అప్పలరాజు శాలువాతో సత్కరించి జ్ఞాపికతో పాటు మెడల్ ను బహుకరించారు. తొలిసారిగా డా.ఎస్.ఎస్.కృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా 8 మంది పశువైద్యులను, ఔత్సాహికులను, విద్యార్థులను, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ తరపున ఇద్దరు పశు వైద్యులను, పశు సంవర్థక శాఖలో నాలుగు నిష్ణాతులైన పశు వైద్యులను సత్కరించి మంత్రి అభినందించారు. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పశువైద్య దినోత్సవం-2023 సందర్భంగా ఉద్యోగులంతా ప్రతిజ్ఞ చేశారు.సీకే.రావు ఎండోమెంట్ ట్రస్ట్ కు సంబంధించిన పుస్తకాన్ని మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ కె.వెంకట్రావు, స్మైల్ డైరెక్టర్ డా. వై.సింహాచలం, ఎస్.ఎస్. కే ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. కృష్ణమూర్తి, సీ.కే.రావు ఎండోమెంట్ ట్రస్ట్ సభ్యులు, రిటైర్డ్ సీఈవో డా. రామలింగరాజు, పశు సంవర్థక శాఖ రిటైర్డ్ డైరెక్టర్ సోమశేఖర్, శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, 26 జిల్లాల నుంచి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ పాల్గొన్నారు. -
‘చంద్రబాబుకు ఏపీలో చిరునామా ఉందా?’
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అచ్చెన్నాయుడు చర్చకు రావాలన్నారు. నా ఛాలెంజ్‌ను అచ్చెన్నాయుడు స్వీకరించాలని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో చిరునామా ఉందా?. చంద్రబాబు, నారా లోకేష్ ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి. మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. రామ్మోహన్నాయుడు కూడా మైక్‌ల ముందు మాట్లాడేస్తున్నాడు. నీ బాబాయ్ నిన్ను క్షేత్రస్థాయిలోకే వెళ్లనివ్వడం లేదు. ఎంపీ లాడ్స్ నుంచి పలాస రైల్వే స్టేషన్లో స్టీల్ కుర్చీలు మాత్రమే వేసిన రామ్మోహన్ నాయుడా అభివృద్ధి గురించి మాట్లాడేది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అచ్చెన్నాయుడు చర్చకు రావాలి. నా ఛాలెంజ్‌ను అచ్చెన్నాయుడు స్వీకరించాలి. ఇదే క్రమంలో గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కి బయ్యారం గనులు అడిగితే వ్యతిరేకించారు. స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొంటామని బీఆర్ఎస్ హైప్ క్రియేట్ చేసింది అంటూ కేసీఆర్ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు. -
అచ్చేన్నా...నీకు మొగుడు వచ్చాడు కాస్కో...
-
‘పవన్ మాటల వెనుక రహస్యం ఏమిటో బయటపెట్టాలి’
శ్రీకాకుళం జిల్లా: తెలంగాణ మంత్రులు ఏపీ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు మంత్రి సీదిరి అప్పలరాజు. తెలంగాణ మంత్రి హరీష్‌రావును పవన్ వెనుకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీశారు మంత్రి అప్పలరాజు. ‘తెలంగాణ మంత్రులు ఏపీ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదు. బీఆర్ఎస్తో పవన్ కల్యాణ్‌కు ఉన్న రహస్య ఒప్పందం ఏమిటి?, పవన్ కల్యాణ్‌తో బీఆర్ఎస్ వేల కోట్ల ఒప్పందం జరిగిందని మీడియాలో చూశా. బహుశా ఇది నిజమేనేమో. తెలంగాణలో బీఆర్ఎస్తో, ఏపీలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌కు ఉన్న లాలూచీ ఏమిటి. వరంగల్‌లో అమ్మాయి ఆత్మహత్య, తలంగాణ ఆస్పత్రిలో వీల్‌చైర్‌లో రోగిని ఈడ్చుకువెళ్తే మాట్లాడావా. గోదావరి జలాలపై మాట్లాడావా. మరి ఇప్పుడు హరీష్‌రావుని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావంటే.. మేం ఏం అర్థం చేసుకోవాలి. సీఎం జగన్ కోసం తక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు మంత్రి అప్పలరాజు. -
పలాస ఎప్పటికీ వైఎస్సార్సీపీ అడ్డానే: మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి: 175 అసెంబ్లీ స్థానలకు 175 గెలవాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు తాడేపల్లి మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సీఎం చాలా సానుకూల ధృక్పథంతో ఉన్నారని, మరింత ప్రజలకు చేరువ కావాలని సూచించారని చెప్పారు. ‘మొన్న మంత్రి పదవి తీసేస్తారని ప్రచారం చేశారు. ఈరోజు ఎమ్మెల్యేగా పీకేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. పలాస ఎప్పటికీ వైఎస్సార్సీపీ అడ్డానే. సాఫ్ట్ టార్గెట్‌తో మరింత ఉత్సాహంగా పనిచేస్తా. పలాసలో ఏం జరిగినా అప్పలరాజే కారణమని టీడీపీ ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు. ఆగస్టు నాటికి గడపగడపకు కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప గడపకు వెళ్లాలని సీఎం సూచించారని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి 21 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఉంటుందని, దీనిపై సీఎం దిశానిర్ధేశం చేశారన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. రామోజీరావు ధృతరాష్టుడిగా మారిపోయాడు పేదల కోసం చంద్రబాబు, రామోజీ ఆలోచించారా అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తులు చంద్రబాబు, రామోజీరావు అంటూ ధ్వజమెత్తారు. తమకు ఓటేసినా.. వేయకపోయినా ఇంటింటికీ వెళ్లి పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రామోజీరావు ధృతరాష్టుడిగా మారిపోయి, గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు రూపొందించిన బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే ఈరోజుకీ తెలుగు రాష్ట్రాల్లో మద్యం సేల్స్ జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ విషయం రామోజీరావుకి తెలియదా అని నిలదీశారు. ‘మద్యపానం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, రామోజీరావుకి లేదు. పేదల రక్తం తాగి ఈరోజు రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఏ రోజైనా పేదల గురించి రామోజీరావు, రాధాకృష్ణ వార్తలు రాశారా. పచ్చళ్లు, ఊరగాయలు అమ్ముకునే రామోజీరావు ఈరోజు వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. మార్గదర్శి అక్రమాలపై ఈడీ విచారణకు పిలిచింది. మార్గదర్శి అక్రమాలపై పేపర్లో రాశాడా. స్కిల్స్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు దొరికినా ఏనాడైనా రాశాడా. ఈనాడులో రాసేవన్నీ పచ్చి అబద్ధాలు’ అని నారాయణ స్వామి దుయ్యబట్టారు. -
జగనన్న కాలనీలు ఆధునిక లోగిళ్లు
సాక్షి, అమరావతి: జగనన్న కాలనీల్లో శాశ్వతప్రాతిపదికన అత్యాధునిక మౌలిక సౌకర్యాలు కల్పించి, ఆధునిక లోగిళ్లుగా తీర్చిదిద్దుతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయని, రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అని చెప్పారు. 4బీ అప్లికేషన్ జియో ట్యాగ్ విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని, చివరికి కోర్టులో కేసులు కూడా వేయించారని తెలిపారు. భూములను కొని మరీ పేదవారికి ఇళ్లు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఏ పార్టీ వారైనా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ఇళ్లు కట్టించి ఇస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. వేలాది ఎకరాల భూమి కొనుగోలు చేసి సంతృప్తస్థాయిలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వడం ఓ చరిత్ర అని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి కొనియాడారు. కొన్నిచోట్ల పట్టా కేటాయించిన తర్వాత రద్దవడంపై పరిశీలన జరపాలని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు కోరారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఇళ్లను అమ్ముకునేవని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. సాంకేతిక సమస్యలతో ఇళ్లు లభించని వారికి వేరే చోట పట్టాలివ్వాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కోరారు. సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు తరం, వైఎస్ జగన్మోహన్రెడ్డి తరం అని చరిత్ర చెప్పుకుంటుందని అన్నారు. టీడీపీ హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు - మంత్రి రజిని టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ హయాంలో 107 ప్రొసీజర్లు పెంచితే, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. మత్స్యకారులకు అండగా ఉంటాం- మంత్రి సీదిరి అప్పలరాజు వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకారునికి మత్స్యకార భరోసా అందిస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు కుటుంబ పెద్ద కాకపోయినప్పటికీ పరిహారం అందిస్తున్నామని చెప్పారు. భీమిలి, చింతపల్లి, రాజయ్యపేట వద్ద ఎఫ్‌ఎల్‌సీలకు టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామన్నారు. అవసరమైతే సబ్సిడీ మొత్తాన్ని పెంచుతామన్నారు. మత్స్యకార భరోసా కుటుంబంలో అందిరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ కోరారు. 15 రోజుల శిక్షణతో అర్చకత్వం హిందూ ధర్మ ప్రచారం, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది 2,900 దేవాలయాలు నిర్మిస్తున్నామని, ధూపదీప నైవేద్యాల కింద రూ.27.47 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ధూపదీప నైవేద్యాల పెండింగ్ బిల్లులు పది రోజుల్లో క్లియర్ చేస్తామన్నారు. దేవాలయానికి సంబంధం ఉన్న ప్రతి కమిటీకి ఏటా రూ.15 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. దేవాలయాల్లో పని చేసేందుకు ఆసక్తితో ఉన్న వారికి 15 రోజులు శిక్షణ ఇచ్చి అర్చకత్వంలో నియమిస్తామని చెప్పారు. 16 ఏళ్లు నిండిన తరువాత వంశపారంపర్య అర్చకులుగా నియమిస్తామన్నారు. హిందూధర్మ పరిరక్షణకు జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను సీఎం జగన్ పునర్మిస్తున్నారని తెలిపారు. -
దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశు పోషకులకు తక్కువ ధరలకే నాణ్యమైన పశువుల జనరిక్ మందులను అందించే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 52 పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని గురువారం మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొబైల్ అంబులేటరీ క్లినిక్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశువులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మందుల కోసం పశు పోషకులు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఆ భారం తగ్గించేందుకే ఈ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ డ్రగ్స్‌ను చాలా తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఒక్కో కేంద్రం రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తుండగా.. 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందన్నారు. లబ్ధిదారులు కేవలం 25 శాతం వాటా చెల్లిస్తే సరిపోతుందన్నారు. పశు పోషకులు, ఔత్సాహిక వ్యాపార వేత్తలు, జాయింట్ లయబులిటీ గ్రూపులు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలతో పాటు ఆసక్తి కల్గిన ప్రైవేటు వ్యక్తులను కూడా ఈ షాపుల ఏర్పాటుకు ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతి జిల్లా పశు వైద్యశాలలో ఔషధ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుందన్నారు. పశు వైద్యులు జనరిక్ మందులు మాత్రమే ప్రోత్సహించే విధంగా అవసరమైన సహకారాన్ని అందిస్తారన్నారు. అనంతరం వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంత్రి పరిశీలించారు. ఈ తరహా ఆస్పత్రులను రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, అదనపు సంచాలకులు పి.సత్యకుమారి పాల్గొన్నారు. -
సీఎం జగన్ పై నమ్మకంతోనే సదస్సుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరు
-
‘ఏపీకి సీఎం జగనే బ్రాండ్ అంబాసిడర్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులను ఉద్దేశించి మంత్రి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ భారీ పెట్టుబడులు ఆయన ఛరిష్మాతోనే వచ్చాయి అని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. అలాగే.. త్వరలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోందన్న ఆయన.. అందులో భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు అభివృద్ధికి కీలకం కానుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల పండుగగా వర్ణిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రెండో రోజూ కొనసాగుతోంది. -
ఎన్నికలు ఏవైనా.. గెలుపు వైఎస్సార్సీపీదే
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం వైఎస్సార్‌సీపీదేనని.. కుప్పంలోనే టీడీపీని కుప్పకూల్చేశామని టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం సీఎం జగన్ ఏపీని సంక్షేమాభివృద్ధి వైపు నడిపించారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు తొలిగిన అనంతరం.. ఏప్రిల్ తర్వాత విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటవుతుందని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 18 మందికి గాను 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. టీడీపీ నేతల కుట్రలకు అవకాశం ఇవ్వకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ను, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావును గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. నాడు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో మాత్రమే యాదవులకు గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. దీనివల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్ సచివాలయాలతో పాటు విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగ విప్లవం సృష్టించారని చెప్పారు. వాస్తవ పరిశ్రమల స్థాపనకు అత్యధిక ఎంఓయూలు జరిగింది వైఎస్సార్సీపీ హయాంలోనేనని తెలిపారు. పట్టభద్రులను, ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు మాట్లాడే ముందు చేసిన దుర్మార్గాలు దుర్మార్గాలు గుర్తుకు రావా?: మంత్రి అప్పలరాజు
-
‘విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలి. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును ప్రజలు తరిమికొడతారు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లతో ప్రజలు ఓ మూలన కూర్చోబెట్టారు. 2024లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధిచెబుతారు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది. గతంలో ఎమ్మెల్యేలకు ప్యాకేజీలు ఇచ్చి లాక్కున్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు వేధించలేదా?. దమ్ముంటే రండి తేల్చుకుందామని చంద్రబాబు తొడగొడుతున్నాడు. 14ఏళ్లు సీఎంగా చేసి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయంలో చంద్రబాబు చేసిన ఒక్క పని గురించైనా చెప్పగలడా.. ఒక్క మంచి పథకం పేరైనా చెప్పగలడా?. ప్రజలకు చంద్రబాబు ఏం మేలు చేశాడో చెప్పాలి. ఒక్క కుటుంబానికైనా మంచి చేశానని చంద్రబాబు చెప్పగలడా?. సైకో చంద్రబాబును ప్రజలు తరిమికొట్టాల్సిన అవసరం ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘బీసీలకు చంద్రబాబు చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదు’
శ్రీకాకుళం: బీసీలకు చంద్రబాబు నాయుడు చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. బీసీలను అత్యంత అవమానానికి గురిచేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు మంత్రి. ప్రస్తుత వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుందో ఎమ్మెల్సీ అభ్యర్థులను చూస్తే అర్ధమౌతుందని, సింహభాగం వెనుబడినవారే ఎమ్మెల్సీలుగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యం గతంలో ఎవరూ ఈ వర్గాలకు ఇవ్వలేదన్నారు. ‘లోకేష్ వడ్డేరాలను అణగద్రోక్కేస్తున్నామంటున్నారు. మిష్టర్ మాలోకం.. వడ్డేరాలకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో కూర్చో పెడుతున్నాం. మీ నాన్న బీసీలకు ఎంత అన్యాయం చేశాడో చూడు. బలహీనవర్గాలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అణగొక్కారు. గతంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారో లోకేష్ చెప్పాలి. ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు కోర్టుకు వెళ్లలేదా?, సిగ్గులేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. రాబోయే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారీ వ్యవస్థకు మధ్య జరిగే ఎన్నికలు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును మట్టికరిపించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. -
మీ తోకలు కత్తిరిస్తానని బెదిరించింది చంద్రబాబు కాదా?: మంత్రి సీదిరి అప్పలరాజు
-
విశాఖలో త్వరలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: మంత్రి అప్పలరాజు
-
మార్చిలోగా 4 వేల ఫిష్ అవుట్లెట్లు
సాక్షి, అమరావతి: మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో 4 వేల ఫిష్ అవుట్లెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని ఆక్వా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఆక్వా సాధికారత కమిటీ సమావేశంలో ఆక్వా రంగం అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఆక్వా రైతులకు అండగా నిలవడం, సీడ్, ఫీడ్ రేట్లను శాస్త్రీయంగా నిర్ణయించడం, ధరల స్థిరీకరణ వంటి అంశాల్లో కమిటీ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే వాటిలో స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఒడిశాలో ఆక్వా ఉత్పత్తులు స్థానిక అవసరాలకు సరిపోతున్నాయని, అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి లేదని తెలిపారు. దీనివల్ల మార్కెట్ ఒడిదొడుకుల సమయంలో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలు మెరుగు పడతాయన్నారు. మన రాష్ట్రంలో కూడా స్థానిక వినియోగం పెంచాలని అన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫిష్ అవుట్లెట్లకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద సబ్సిడీతో కూడిన రుణాలిచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆక్వా హబ్‌ల ద్వారా మన ఉత్పత్తులు విక్రయించాలని చెప్పారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ నగరాల్లో ఆక్వా ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించాలన్నారు. నియంత్రణలో ఫీడ్, సీడ్ రేట్లు సీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లతో ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చల ఫలితంగా సీడ్, ఫీడ్ ధరలు నియంత్రణలోకి వచ్చాయని, ఆక్వా ఉత్పత్తుల ధరలు పతనం కాకుండా అడ్డుకట్ట వేయగలిగామని మంత్రులు పేర్కొన్నారు. రైతుల్లోనూ అంతర్జాతీయ మార్కెట్లు, ధరలపై అవగాహన కల్పించి, హేతుబద్ధమైన విస్తీర్ణంలోనే సాగు చేసేలా చూడాలన్నారు. డిమాండ్, సప్లైపై అవగాహన లేకపోతే అంతిమంగా రైతులే నష్టపోతారన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదునూ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. వచ్చే నెలాఖరుకు జోనింగ్ సర్వే పూర్తి ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు సాగు చేసే వారికి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీని అందిస్తోందని మంత్రులు చెప్పారు. ఇప్పటికే 26 వేల కనెక్షన్లకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వా జోన్ పరిధిలో సాగయ్యే విస్తీర్ణాన్ని గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వే వచ్చే నెలాఖరుకి పూర్తవుతుందన్నారు. సర్వేలో ఆధార్‌తో రైతుల వివరాలు అనుసంధానం చేస్తున్నారని, దీనివల్ల అర్హులైన రైతులు ఎంతమందో కచ్చితంగా తేలుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ అందించాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రులు చెప్పారు. సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్, స్పెషల్ సీఎస్ (ఇంధనశాఖ) కె.విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం వాళ్లు ఏది చెబితే పవన్ అది చేస్తున్నారు
-
‘పవన్.. నీకు ఆ దమ్ములేదు.. ప్యాకేజీ మాటలు మాట్లాడకు’
తాడేపల్లి: చంద్రబాబు నాయుడు స్క్రిప్టు ప్రకారమే నడుస్తున్న పవన్ కల్యాణ్.. ఎంతసేపు ఊడిగం చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాజకీయం అంటే ఎంత సేపు ఊడిగం చేయడం కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. నాయకుడు అంటే కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపాలే కానీ, ప్యాకేజీ మాటాలు మాట్లాడకూదని సీదిరి ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం) ప్రెస్మీట్లో మాట్లాడిన మంత్రి అప్పలరాజు.. పవన్ కల్యాణ్ సభలకు పేర్లు కూడా టీడీపీనే నిర్ణయిస్తుందన్నారు. ‘చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదు. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం వాళ్లు ఏది చెబితే పవన్ కల్యాణ్ అది చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభలకు పేర్లుఉ కూడా టీడీపీ నిర్ణయిస్తుంది. మత్స్యకారుల గురించి పవన్‌కు అవగాహన ఉంది. టీడీపీ హయాంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ కట్టలేదు. సీఎం జగన్ వచ్చాక 9 ఫిషింగ్ హార్బర్లను ప్రారంభించారు. సీఎం జగన్ సింహం లాంటి వారు నీలాంటి గ్రామ సింహాలకు బెదరడు.కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబుకు పవన్ తాకట్టుపెడుతున్నారు. రాజకీయం అంటే ఎంతసేపు ఊడిగం చేయడమేనా?, రాష్ట్రాభివృద్ధిపై చర్చకు పవన్ సిద్ధమా?, మీకు రాష్ట్రంపై ఏ స్థాయిలో అవగాహన ఉందో తేలుతుంది. చంద్రబాబును కలిసిన రోజు పవన్ అడ్వాన్స్ తీసుకున్నారు’ అని విమర్శించారు. -
త్వరలో పవన్ చేసే యాత్రకు రేట్లు మాట్లాడుకోవడం కోసమే భేటీ: మంత్రి సీదిరి అప్పలరాజు
-
Seediri Appalaraju: కన్నీరు తుడిచి.. కష్టాన్ని తొలగించి
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగింది. రెల్లివీధికి చెందిన పద్మ అనే ఇల్లు లేని ఓ మహిళ మంత్రి ముందు కన్నీరుమున్నీరై తన వేదన తెలుపుకున్నారు. తనకు ఇల్లు లేదని, కర్రలపై పరదాలు కప్పుకుని తల దాచుకుంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నిసార్లు ఇంటి కోసం దర ఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతోందని చెప్పారు. దీంతో మంత్రి ఆ గుడిసెలోనే కూర్చుని ఆమెను ఓదార్చి అధికారులతో మాట్లాడారు. అన్ని పథకాలపై ఆమె ఇంటి పేరుకు బదులు లబ్ధిదారు(హోల్టర్) అని తప్పుగా ముద్రితమవ్వడంతో పథకాలు అందకుండాపోతున్నాయని గుర్తించారు. ఇలాంటి చిన్న తప్పులు కూడా కనిపెట్టలేకపోతున్నారని మంత్రి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూదికొండలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే తప్పిదాన్ని సరిచేసి ఈమెకు ఇంటిని మంజూరు చేయాలని కమిషనర్ రాజగోపాలరావును ఆదేశించారు. (క్లిక్ చేయండి: గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు) -
ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం: మంత్రి అప్పలరాజు
-
దుబాయ్‌లో శ్రీకాకుళం మహిళకు భర్త వేధింపులు
సాక్షి, అమరావతి: దుబాయ్‌లో భర్త వేధింపులకు గురవుతున్న శ్రీకాకుళానికి చెందిన మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులను ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) సురక్షితంగా భారతదేశానికి చేర్చింది. శ్రీకాకుళానికి చెందిన కావ్య, తన భర్త అవినాష్, రెండేళ్ల కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. ఇటీవల భర్త అవినాష్ అదనపు కట్నం కోసం తనతోపాటు కుమార్తెను, తల్లిదండ్రులను సైతం వేధిస్తున్నాడని కావ్య ఇటీవల వీడియో ద్వారా తెలియజేసింది. తాము భారత్ రాకుండా అడ్డుకునేందుకు అవినాష్ అక్కడి కోర్టును ఆశ్రయించి తన రెండేళ్ల కుమార్తె ప్రయాణంపై నిషేధం విధించేలా చేశాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డ్టాకర్ సీదిరి అప్పలరాజు తమ దృష్టికి తీసుకువచ్చారని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. తాము వెంటనే వివరాలు సేకరించి కావ్య తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లే విధంగా ఎంబసీ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కావ్య కుమార్తెను కూడా స్వదేశానికి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత కావ్య సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తాము క్షేమంగా భారత్‌కు చేరుకునేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ చేసిన సాయం మరువలేనిదని, తన పాపను కూడా తీసుకొచ్చే విధంగా చూడాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
‘సంగం డెయిరీ ప్రస్థానం ఎలా జరిగిందో ప్రజలకు తెలియాలి’
తాడేపల్లి: చిత్తూరు డెయిరీని చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారని, రోజుకు రెండున్నర లక్షల పాలు వచ్చే డెయిరీని అన్యాయంగా మూతేయించారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆ స్థానంలో హెరిటేజ్ డెయిరీని చంద్రబాబు తెచ్చుకున్నారని మంత్రి విమర్శించారు. సంగం డెయిరీని ప్రభుత్వం కచ్చితంగా స్వాధీనం చేసుకుని తీరుతుందని మంత్రి తెలిపారు. సంగం డెయిరీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని మంత్రి ప్రశ్నించారు. ‘ టీడీపీ నేత పట్టాభి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు సంగం డెయిరీ ప్రస్థానం ఎలా జరిగిందో జనానికి తెలియాలి. పాడి రైతుల డబ్బుతో స్థలం కొని డెయిరీ ప్రారంభించారు. మిల్క్ యూనియన్‌కి అధ్యక్షుడైన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కథ నడిపారు. పది ఎకరాల స్థలాన్ని సొంతానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉంటే వాటిని తిరిగి ఇచ్చేసి, కలెక్టర్ దగ్గర నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాకనే మ్యాక్స్ చట్టంలోకి ఏ డెయిరీ అయినా వెళ్తుంది. కానీ అవేమీ జరగకుండానే మ్యాక్స్ చట్టంలోకి తెచ్చి, ఆ తర్వాత సొంతానికి మార్చుకున్నారు. అది కూడా పూర్తిగా చట్ట విరుద్దం. ఎలాంటి ఎన్వోసీలు లేకుండా కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంగం డెయిరీ ని లాగేసుకున్నారు. చిత్తూరు డెయిరీని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. రోజుకు రెండున్నర లక్షల పాలు వచ్చే డెయిరీని అన్యాయంగా మూతేయించారు. పట్టాభి భాషకీ, బాడీ లాంగ్వేజ్ కీ ఏదైనా సంబంధం ఉందా?, సీఎం గురించి ఎక్కువ మాట్లాడితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది జాగ్రత్త. చిత్తూరు డెయిరీని ఎవరు నాశనం చేశారో ముందు అది తెలుసుకో. చంద్రబాబు హయాంలో చాలా ప్రభుత్వ ఆస్థులను ప్రయివేటు పరం చేశారు.పైగా దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు. -
సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు
సాక్షి, గుంటూరు: చంద్రబాబునాయుడు ఒకపథకం ప్రకారం రాష్ట్రంలో సహకార సంఘాల్లో ఉన్న పాల డెయిరీలను తన వాళ్లకు కట్టబెట్టాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం డెయిరీ ప్రభుత్వం ఆస్తి.. అది ప్రజల సొత్తు అని చెప్పారు. ఏ రోజుకైనా సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు పిచ్చెక్కిందని అన్నారు. ఎన్నికల సమయానికి చంద్రబాబు పిచ్చి ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. గతంలో చేసిన పాపాలతో ఇదే కర్మ రా బాబు అని చంద్రబాబు రోడ్ల వెంబడి తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. చదవండి: (అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్) -
శ్రీకాకుళం: గొప్ప మనసు చాటుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి సాయం అందించి మంత్రి సీదిరి అప్పలరాజు గొప్ప మనసు చాటుకున్నారు. క్షతగాత్రులకు తన ప్రోటోకాల్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నుంచి తన స్వగ్రామానికి మంత్రి సీదిరి అప్పలరాజు కాన్వాయ్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో పూండి గ్రామ సమీపంలో బైక్‌పై వెళ్తూ ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఆ సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సీదిరి.. క్షతగాత్రులను చూశారు. అనంతరం, వెంటనే రోడ్డు ప్రక్కనే కాన్వాయ్‌ని నిలిపివేసి వారికి ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నారు. వారు తీవ్రంగా గాయపడటంతో తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని గుర్తించిన మంత్రి సీదిరి.. హై స్పీడ్‌తో వెళ్లవద్దని సూచించారు. అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతుందని హితవు పలికారు. -
మానవత్వం చాటుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు
-
బీసీల్లోని అన్ని కులాలకు సీఎం ప్రధాన్యత ఇచ్చారు : మంత్రి సీదిరి
-
‘వీరంతా సిండికేట్‌గా ఏర్పడి ఆక్వా రంగాన్ని పాడు చేశారు’
శ్రీకాకుళం: చంద్రబాబుకు పెట్టుబడి పెట్టే పెట్టుబడిదార్లు ఆక్వా రంగంలో స్థిర పడ్డారని, వీరంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి వ్యవస్థను పాడు చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. చంద్రబాబు వదిలి వెళ్లిపోయిన రూ. 330 కోట్ల బకాయిలను సైతం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన మంత్రి అప్పలరాజు.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఆక్వారంగానికి 2వేల ఆరువందల కోట్ల రూపాయిలు పవర్ సబ్సిడీ చెల్లించాం. సీఎం జగన్ తన పాదయాత్రలో యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకు ఇస్తామన్న తర్వాత, చంద్రబాబు రెండు రూపాయిలు అని ప్రకటించి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆక్వా రైతులను ఆదుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన కాలంలో రూపాయిన్నరకు విద్యుత్ ఎందుకు ఇవ్వలేదు. ఆక్వా ప్రాసెస్, సీడ్ మిల్లర్లు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామని అంటున్నారు.. దీనికి సంబంధించి ఒక్కరితోనైనా మాట్లాడించగలరా. చంద్రబాబుకు పెట్టుబడి పెట్టే పెట్టుబడి దార్లు ఆక్వారంగంలో స్థిరపడ్డారు. వీరంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి వ్యవస్థను పాడుచేసారు. ఆక్వారంగంలో మాఫియా ను సీఎం జగన్ ఆడ్డుకోకపోతే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆక్వారంగం కుదేలు అయిపోయేది. ప్రపంచంలో ఆర్దిక మాంద్యం, ప్రపంచ మార్కెట్ ధరల నేపధ్యంలో ఎగుమతులు తగ్గాయి. ప్రతికూల పరిస్థితుల్లో సీఎంజగన్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడింది. ఆక్వా ఎగుమతిదార్లకు ఎదరువతున్న సమస్యలు పరిష్కారానికి కమిటీ వేసి సమీక్ష చేస్తున్నాం. ఆక్వా రంగంలో సంస్కరణలు తెచ్చి చట్టాలు చేశాం.చంద్రబాబు పాలనలో ఆక్వారంగం స్టేక్ హోల్డర్స్ తో ఎప్పుడైనా మాట్లాడారా’ అని ప్రశ్నించారు. -
ఆక్వా పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు : మంత్రి సీదిరి అప్పలరాజు
-
సీఎం జగన్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు : సీదిరి అప్పలరాజు
-
బాబూ.. తథాస్తు
-
2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు
-
‘లోకేష్‌పై ఆశలు లేవు.. పైగా మానసిక ఒత్తిడి’
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు ఆడినా జనం నమ్మరని, రానున్నవి టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. తాజాగా కర్నూల్ పర్యటనలో చంద్రబాబు చేసిన ‘చివరి ఎన్నిక కామెంట్ల’పై.. గురువారం తాడేపల్లిలో మంత్రి సీదిరి మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు తొలిసారి నిజం మాట్లాడారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కానున్నాయి. అవి టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. తులసి తీర్థం పోస్తే తప్ప బతకను అన్నట్లుగా చంద్రబాబు కన్నీరు కారుస్తున్నారు. పనిలో పనిగా ఆయన తన భార్యను కూడా రాజకీయాల్లోకి లాగారు. భార్యను అడ్డుపెట్టుకుని సానుభూతి పొందాలనుకోవడం దారుణం. కానీ, ఆయన ఎన్ని నాటకాలు ఆడినా జనం నమ్మరు. ‘‘వెన్నుపోటు, నమ్మకద్రోహమే చంద్రబాబు పెట్టుబడి. ఆయన పాలనలో ఆయన వర్గానికే మేలు జరిగింది. గుర్తుంచుకునే పథకం ఒక్కటైనా అమలు చేశారా?. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగరాజరతాడు. చంద్రబాబు ఏడుపులు, గగ్గోలు చూసి జనం నవ్వుకుంటున్నారు. తనయుడు లోకేష్‌పై చంద్రబాబుకు ఆశలు లేవు. తీవ్ర మానసిక ఒత్తిడిలో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు. వికేంద్రీకరణను పక్కదారి పట్టించేందుకే కర్నూల్లో బాబు పర్యటిస్తున్నాడు. కర్నూల్లో హైకోర్టుకు చంద్రబాబు వ్యతిరేకమా? కాదా?.. వ్యతిరేకమే’’ అని ఉద్ఘాటించారు మంత్రి సీదిరి అప్పలరాజు. -
రాష్ట్రమంతా ఒకేలా కొనుగోలు చేయాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రాష్ట్రమంతా ఒకేరీతిలో రొయ్యల కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. 100 కౌంట్ రొయ్యల ధర రూ.210కి తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ధర కంటే తక్కువగా కొనుగోలు చేసే ప్రాసెసింగ్ కంపెనీలను ఉపేక్షించబోమన్నారు. ఆక్వా సాధికారత కమిటీ సమావేశం బుధవారం మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును అధికారులు మంత్రులకు వివరించారు. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ 100 కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేయాలన్న గత కమిటీ భేటీలో నిర్ణయాన్ని మెజార్టీ ప్రాసెసింగ్ కంపెనీలు పాటిస్తున్నాయని, కొన్ని కంపెనీలు మాత్రం నేటికీ రూ.190 నుంచి రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. అటువంటి కంపెనీలు, వ్యాపారులతో నిత్యం సంప్రదిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ సాధికారత కమిటీ సమావేశాల్లో మంత్రులు ఇచ్చిన ఆదేశాల మేరకు సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు ధరలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించినట్లు చెప్పారు. సీడ్, ఫీడ్ రేట్లను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ పోర్టల్‌లో ఉంచుతున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ధరలను కూడా పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆక్వారంగానికి ప్రభుత్వం చేయూత మంత్రులు మాట్లాడుతూ ఆక్వా రంగానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగితేనే ఆక్వారంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఆక్వారంగం సమస్యల పరిష్కారం కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సాధికారత కమిటీ ఏర్పాటైందని చెప్పారు. ధరల విషయంలో నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని, సమస్య ఏర్పడిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. రొయ్యల ధరల స్థిరీకరణ, సీడ్, ఫీడ్ రేట్లు, నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రం మనదేనని చెప్పారు. అత్యధికంగా ఆక్వా ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా మన రాష్ట్రంలో ఆక్వారేట్లు కొన్నిసార్లు తగ్గిపోతున్నాయని, స్టోరేజీ అవకాశాలను పరిశీలించి అటువంటి సమయాల్లో ధరలను స్థిరీకరించేందుకు పరిశీలించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో పర్యావరణం, అటవీ సైన్స్, సాంకేతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ఆక్వా రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. 100 కౌంట్ రొయ్యలకు కనీసం రూ.210 తగ్గకుండా చెల్లించాల్సిందే. ఇదే రీతిలో మిగిలిన కౌంట్ ధరలు కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. ఇష్టమొచ్చినట్టు రొయ్యల ధరలు తగ్గిస్తే చర్యలు తప్పవు’ అని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులను ఆక్వా సాధికార కమిటీ హెచ్చరించింది. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు, సీడ్, ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో ఏపీఐఐసీ భవనంలో గురువారం ఆక్వా సాధికార కమిటీ భేటీ జరిగింది. రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచే విషయంలో ప్రాసెసింగ్ కంపెనీలు పెద్ద మనసు చాటుకోవాలని కోరారు. కనీసం10 రోజులపాటు ఇవే ధరలు కొనసాగాలని, ప్రభుత్వం రోజూ కొనుగోళ్లు, ధరలను సమీక్షిస్తుందని చెప్పారు. ధరల విషయంలో ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకుందామని సూచించారు. మార్కెట్ బాగోలేదనే సాకుతో ధరలను తగ్గిస్తామంటే సహించేది లేదన్నారు. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ రైతులను గందరగోళపరిచేలా కంపెనీలు వ్యవహరించొద్దని హితవు పలికారు. ధరలు, మార్కెట్ పరిస్థితులపై ప్రతి రోజు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రైతుల వద్ద ఉన్న సరుకును పూర్తి స్థాయిలో నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు. జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ కంపెనీలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, వాళ్లెంత కొనుగోలు చేయగలరో ముందే చెబితే ఆ మేరకే ఇక నుంచి ఉత్పత్తి చేస్తామని చెప్పారు. మార్కెట్ లేనప్పుడు ఎందుకు 80 బిలియన్ల సీడ్, 16 లక్షల టన్నుల ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. యూఎస్ మార్కెట్ ఆగిపోయిందని, చైనా మార్కెట్ ఓపెన్ కాలేదని, అందువల్లే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నామని పలువురు ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు సాధికార కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అయినా రైతుల వద్ద ఉన్న సరుకును ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు వద్దు ప్రభుత్వంతో చర్చల అనంతరం నాలుగు నెలలుగా రాష్ట్రంలో రొయ్యల మేతల్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తున్నామని రొయ్యల మేత తయారీదారుల సంఘం పేర్కొంది. ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ రొయ్యల రైతుల అభ్యర్థన, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, రొయ్యల మేత తయారీదారుల నుంచి రూ.5 వేల కోట్లు వసూలు చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రొయ్యల మేత తయారీ పరిశ్రమ ఏడాది టర్నోవరే రూ.5 వేల కోట్లు ఉంటుందని తెలిపింది. అలాంటిది ప్రభుత్వానికి రూ.5 వేల కోట్లు లంచంగా ఇవ్వనున్నారని కొందరు రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. -
ఎకరాకు రూ.25 లక్షల పరిహారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: భావనపాడు పోర్టు ప్రభావిత గ్రామాల్లోని రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, దీనికి రైతులు సంతృప్తి వ్యక్తంచేశారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన గురువారం మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుతో కలిసి మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులతో డీఎల్ఎన్సీ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గతంలో ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని, రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో రూ.5 లక్షలు పెంచుతూ రూ.25 లక్షల పరిహారాన్ని అందించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. దీనిపై నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలువురు నిర్వాసిత రైతులను మంత్రులు సత్కరించారు. రైతుల త్యాగాలు మరువలేమని మంత్రులు చెప్పారు. త్వరలోనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి మంజూరు ఉత్తర్వులు వచ్చిన వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో జయరావు, తహసీల్దార్ చలమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్దానంపై ప్రేమ కాదు.. ఉత్తరాంధ్రపై ఏడుపు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఈనాడు రామోజీరావుకు ఉద్దానంపై ప్రేమ లేదని, విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందేమోనన్న ఏడుపు మాత్రమే వారిలో కనిపిస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు అన్యాయమంటూ ఈనాడు రాస్తున్నదంతా విష ప్రచారమేనని అన్నారు. అందులో భాగంగానే ఉద్దానంపైనా అసత్య కథనం రాశారని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్దానంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇక్కడ రక్షిత మంచినీటి ప్రాజెక్టు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నారని, పలు చోట్ల డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారని చెప్పారు. కిడ్నీ వ్యాధి వ్యాపించకుండా చర్యలు చేపట్టారన్నారు. ఇవన్నీ కళ్లెదుట కనిపిస్తున్నా, అసలక్కడ ఏ కార్యక్రమమూ జరగడంలేదన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు అబద్ధపు రాతలు రాస్తున్నారని అన్నారు. అసలు చంద్రబాబు హయాంలో ఉద్దానం ప్రజలను కబళిస్తున్న కిడ్నీ వ్యాధి నివారణకు ఏమి చర్యలు చేపట్టారో చెప్పాలని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉద్దానం కోసం ఒక్కటైనా చేశారా? దీనికి రామోజీరావు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఉద్దానంపై వాస్తవాలు వక్రీకరించి అంతులేని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర ఈనాడు రామోజీరావు ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యానవనంలా ఉద్దానం ఘన చరిత్ర ఉన్న ఉద్దానం టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా మారిందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఉద్దానంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, కిడ్నీ జబ్బులు నయం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపోందించారని తెలిపారు. తుపాన్ వల్ల కుదేలైన ఉద్దానానికి ప్రత్యేక పరిహారం అందిచారన్నారు. అక్కడ పంపిణీ చేసిన జీడి, కొబ్బరి చెట్లతో ఉద్దానం ఉద్యానవనంగా మారుతోందని అన్నారు. వైఎస్ జగన్ 2017లో కవిటి సభలో చెప్పిన విధంగా తమ ప్రభుత్వం రాగానే అక్కడ రీసెర్చ్ సెంటర్, ప్రత్యేకంగా కిడ్నీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఉద్దానం కోసం చేసిన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒక్కటీ లేవన్నారు. ఉద్దానంలో రీసెర్చ్ సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కేజీహెచ్ సెంటర్‌గా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పని చేస్తుందన్నారని, అదీ జరగలేదని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రత్యేకంగా స్పెషలైజ్డ్ నెఫ్రాలజీ యూనిట్ ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకే చికిత్సలో, మందుల సరఫరాలో ఎక్కడా లోపం జరగడంలేదని చెప్పారు. అయినా, ప్రజలను పక్కదోవ పట్టించేలా కథనాలు ప్రచురిస్తున్న ఈనాడును, టీడీపీని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి చెప్పారు. -
పవన్‌పై మంత్రి సీదిరి సెటైర్లు.. ‘ఏదో శక్తి రారమ్మని పిలిచింది.. అందుకే ఎగురుకుంటూ..
సాక్షి, విజయవాడ: ఉత్తరాంధ్ర సింహ గర్జన విజయవంతం తర్వాత ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. మంత్రులు రోజా, విడుదల రజనీ, జోగి రమేష్‌తోపాటు వైవీ సుబ్బారెడ్డిపై దాడి చేయటానికే పవన్ వైజాగ్ వచ్చాడని మండిపడ్డారు. గర్జన స్ఫూర్తిని దెబ్బతీయటానికి ప్లాన్ వేశారని విమర్శించారు. ప్యాకేజీలు ఇచ్చి విడాకులు తీసుకున్నానని పవన్ చెప్తున్నాడని, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని ఆ డబ్బును వారికి ఇచ్చాడని మంత్రి ఆరోపించారు. విడిపోయిన చంద్రబాబుతో మళ్ళీ కలవటానికి పవన్ ఇప్పుడు ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దంటూ చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నాడని, దీనికి పవన్ లాంటి ఊరకుక్కలు మద్దతు తెలపటం సిగ్గుచేటని అన్నారు. పవన్ హద్దుమీరి మాట్లాడుతుంటే ఎల్లోమీడియా బాకాలు ఊదిందని, ఇంతకంటే నీచమైన మీడియా సంస్థలు ఏ రాష్ట్రంలోనూ లేవని అన్నారు. పవన్ చేసే పనులను చూస్తుంటే ప్యాకేజీ స్టార్ అనే అంటారని గుర్తు చేశారు. ప్యాకేజీ స్టార్ కాదని నిరూపించుకోవాలంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. సినిమాల్లో లాగనే రాజకీయాలలో కూడా పవన్ ప్యాకేజీ తీసుకుంటాడని విమర్శించారు. చదవండి: చిలకలూరిపేటలో చంద్రబాబుకు చేదు అనుభవం.. ‘విశాఖలో మూడు రోజులు ఉండి హడావుడి చేసి వెళ్లిపోయాడు. తిరిగి ఎప్పుడు వస్తాడో తెలీదు. యుద్ధానికి సిద్ధం అంటూ పవన్ అంటున్నాడు. ఫామ్‌హౌజ్‌లో చేసే యుద్దానికేనని మీ కార్యకర్తలకు చెప్పు. రాత్రిపూట యుద్దాలే తప్ప ప్రజల కోసం ఏ యుద్దమూ చేయలేవు. తాగి, పిచ్చికుక్కల్లాగ మంత్రుల మీద దాడి చేసిన వారికి చంద్రబాబు పరామర్శ అంట. ఇదేనా చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్యం? 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం, రోజాని సంవత్సరంపాటు సస్పెండ్ చేయటమా ప్రజాస్వామ్యం అంటే? అసెంబ్లీలో నోరెత్తనీయకుండా చేయటమేనా ప్రజాస్వామ్యం అంటే? పవన్ ఓ రాజకీయ వ్యభిచారి. పైకి బీజేపీతో పొత్తు ఉన్నట్టు నటిస్తూ చంద్రబాబుతో పవన్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇవి చూసిన వారందరికీ పవన్ నైతికత ఎలాంటిదో తెలిసింది. అభివృద్ధి, పరిపాలనని వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. సీఎం జగన్ అదే చేస్తుంటే వీరికి కడుపుమంటగా ఉంది. అమరావతిని వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ ఇప్పుడు ప్యాకేజీ తీసుకుని మళ్ళీ అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొని వెళ్తున్న వారిపై దౌర్జన్యం చేశారు. దాడి చేసిన వ్యక్తులను పరామర్శించటం సిగ్గుచేటు. పది కోట్లు ఇచ్చి చంద్రబాబు తన తల్లిని తిట్టించాడని పవన్ అన్నారు. చంద్రబాబుని అంతం చేయటమే తన లక్ష్యం అన్నారు కదా? అమరావతి కొందరికే చంద్రబాబు పరిమితం చేశాడని పవన్ అన్నాడు. మరి ఈరోజు ఏ లక్ష్యం కోసం అదే చంద్రబాబుని పవన్ కలిశాడు? ఏదో సమ్మోహన శక్తి పవన్‌ను రారమ్మని పిలిచింది. అందుకే ఎగురుకుంటూ వెళ్లి చంద్రబాబును కలిశారు. పని పూర్తయ్యాక తిరిగి ఫామ్‌హౌస్‌లో యుద్ధం చేయటానికి హైదరాబాద్ వెళ్లిపోయాడు’ అని మంత్రి సీదిరి అప్పలరాజు పవన్ కల్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
చంద్రబాబు, పవన్ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
-
ఏపీ మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తో " స్ట్రెయిట్ టాక్ "
-
చంద్రబాబు తొత్తుగానే పవన్ మాట్లాడుతున్నారు : మంత్రి అప్పలరాజు
-
మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి: మావోయిస్టు లేఖపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. ఇటువంటి లేఖపై స్పందించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ‘‘నేను భూములు ఆక్రమించుకున్నట్లు లేఖలు వచ్చాయి. ఆ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు. చదవండి: ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్ విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి అని మంత్రి ప్రశ్నించారు. ‘‘అమరావతిని ఏ ప్యాకేజీ కోసం పవన్ సమర్థిస్తున్నారు. చంద్రబాబు తొత్తుగానే పవన్ మాట్లాడుతున్నారు. కచ్చితంగా పాదయాత్రను అడ్డుకుని తీరతాం’’ అని అప్పలరాజు అన్నారు. మా గుండెల మీద తంతాం. నోటి కాడ కూడు లాగేస్తామంటే ఊరుకుంటామా.. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రను అడుగు పెట్టనివ్వం’’ అని మంత్రి అప్పలరాజు తేల్చి చెప్పారు. -
ఆక్వా రైతులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి: ‘ఆక్వా రంగ బలోపేతం కోసమే ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఆక్వా రంగ కార్యకలాపాలన్నీ ఈ చట్టం పరిధిలోకే వస్తాయి. రొయ్యల ధరలు తగ్గించినా.. ఫీడ్ ధరలు పెంచినా అప్సడా చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారిత కమిటీ బుధవారం విజయవాడలో సమావేశమైంది. తొలుత కమిటీ సభ్యుడైన అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ ఆక్వా రైతుల సమస్యలను మంత్రుల దృష్టికి తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, దళారులు ఇష్టానుసారంగా రొయ్యల కౌంట్ ధరలను తగ్గించేస్తున్నారన్నారు. మూడు నెలల క్రితం రూ.90 వేల నుంచి రూ.97 వేలున్న టన్ను సోయాబీన్ ప్రస్తుతం రూ.45 వేల–రూ.55 వేల మధ్య ఉందని చెప్పారు. అలాగే గత ఆర్నెళ్లుగా ఫిష్ ఆయిల్, వీట్ ధరలు భారీగా తగ్గినప్పటికీ కంపెనీలు ఫీడ్ రేట్లును ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయని, దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై చర్చించాక ఫీడ్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకుందామని గతంలో అంగీకరించినదానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రైతుకు అన్యాయం జరిగితే ఊరుకోం.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స మాట్లాడుతూ.. రొయ్యల కౌంట్ ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఫీడ్ ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కొనుగోలుదారులు, తయారీదారులపై ఉందన్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా ఉందని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇష్టానుసారంగా ధరలు పెంచడం, తగ్గించడం చేస్తే చర్యలు తప్పవన్నారు. రైతులతోపాటు ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులతో గురువారం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో ఫీడ్ ధరల నియంత్రణ, కౌంట్ ధరల పెంపుపై అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ నివేదికను కమిటీకి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతోపాటు కమిటీ సభ్యులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇంధన, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తికోసం అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫెస్టిసైడ్స్, రసాయనాలు ఎక్కువగా వాడుతున్నందున అవి జంతువుల్లోకి ఆహారం, వివిధ రూపాల్లో చేరి, తద్వారా పాలల్లో వాటి అవశేషాలకు దారితీస్తున్నాయని, అందుకనే స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని పేర్కొన్నారు. ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని సీఎం జగన్ తెలిపారు. దీని మీద సమగ్ర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలన్నారు. అమూల్ ద్వారా రైతులకు మంచి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తక్కువ పెట్టుబడి, సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించే అంశంపై పరిశోధనలు, ఆ పరిశోధనల ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలన్నారు. అమూల్ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలని పేర్కొన్నారు. పాలు, గుడ్లు వాడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, కానీ అవే పాలలో రసాయనాల అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందనే పరిస్థితులను చూస్తున్నామని సీఎం అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు ద్వారానే మంచి భవిష్యత్తు తరాలు నిర్మాణం అవుతాయని పేర్కొన్నారు. పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టులను భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►వైయస్సార్ చేయూత, ఆసరా ద్వారా కొనుగోలు చేసిన పశువులన్నింటికీ కూడా బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ►పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ►ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. ►ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు వస్తాయి. ►ఇలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. ►80శాతం ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది కేటిల్ డాక్టర్ కాన్సెప్ట్ ►పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో కూడా రైతులకు తగిన అవగాహన కల్పించాలి. ►సాయిల్ డాక్టర్ మాదిరిగా కేటిల్ డాక్టర్ కాన్సెప్ట్ కూడా అమలు చేయాలి. ►ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా పశువుల ఆరోగ్యాలను పరిశీలించి, పరీక్షించి వాటి వివరాలను పశు ఆరోగ్య కార్డుల్లో అప్‌గ్రేడ్ చేయాలి. వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు-నేడు ►వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద పనులు చేపట్టాలి. ►ఆ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ►మండలం ఒక యూనిట్‌గా తీసుకుని ప్రతిచోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక అమలు చేలి. ►వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. ►సెకండ్ ఫేజ్ కింద అక్టోబరులో మరిన్ని పశు అంబులెన్స్‌లు ప్రారంభానికి సిద్ధంచేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. ►ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ►ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందాలి. ►ఈమేరకు మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆమేరకు కార్యాచరణ రూపొందించాలి. సిబ్బందిని కూడా నియమించుకోవాలి ►వచ్చే సమావేశంలో దీనికి సంబంధించిన కార్యాచరణను నివేదించాలి గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతంపై దృష్టి ►రైతులకు ప్రత్యామ్నాయం ఆదాయాలు పశుపోషణ ద్వారా వచ్చేలా చూడాలి. ►పశుపోషణ విషయంలో వారికి అండగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ►దీనివల్ల వ్యవసాయంతోపాటు, పశుపోషణ ద్వారా అదనపు ఆదాయాలు లభిస్తాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ►ఆసరా, చేయూత కింద లబ్ధిదారులైన మహిళలకు పశువుల పెంపకంపై వారికి తోడుగా నిలవాలి. ►బ్యాంకర్లతో మాట్లాడి వారికి రుణాలు వచ్చేలా కృషిచేయాలి. ►ఆర్బీకేలలో, కమ్యూనిటి హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచాలి. లంపీ వైరస్‌పై ముందు జాగ్రత్త చర్యలు ►జంతువుల్లో లంపీ వైరస్ వ్యాపిస్తుందన్న సమాచారం వస్తోంది ►దీనిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి. ►వైరస్ జంతువులకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ►సరిపడా మందులను, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. ఈ సమావేశంలో పశు సంవర్ధక, పాడి అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశు సంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్. అమరేంద్ర కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు సముచితం
సాక్షి, అమరావతి: హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సముచితం అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. వైఎస్సార్ పరిపాలనకు ముందు, ఆ తరువాత వైద్య రంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, వైద్య విద్య, వైద్య శాఖలో సంస్కరణల్లో స్పష్టమైన తేడా ఉందని తెలిపారు. వైఎస్సార్ సువర్ణ పాలన, ఆయన ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టామన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో లక్షలాది మంది గుండెలు ఆగిపోకుండా ఉన్నాయంటే అందుకు కారణం వైఎస్సార్ తీసుకువచి్చన ఆరోగ్యశ్రీ పథకమే కారణమని మంత్రి చెప్పారు. వేలాది నిరుపేద విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకుంటున్నారంటే దానికి వైఎస్సార్ చేసిన సేవే కారణమన్నారు. అన్ని బోధనాస్పత్రులు, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేసిన చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చి నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందజేయాలనే ఆలోచన చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను క్షోభకు గురిచేసి మానసికంగా హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. దాని నుంచి బయ టపడాలని విరుగుడుగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాడని, అందుకు చంద్రబాబు ఎంత బాధపడి ఉంటాడో ఆయ న మాటల్లోనే అర్థం అవుతుందని చెప్పారు. -
వైఎస్సార్ హయాంలో వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు : మంత్రి సీదిరి అప్పలరాజు
-
అవసరమైతే రక్తం చిందిస్తాం
కాశీబుగ్గ: విశాఖ పరిపాలన రాజధానిని సాధించుకోవడానికి, అమరావతి పాదయాత్రను ఆపడానికి ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే రక్తమైనా చిందిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చెప్పారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ పలాస జేఏసీ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో శనివారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఆ ప్రాంతంలో భవనాలు, రోడ్లు, పార్కులు అన్నీ గ్రాఫిక్స్‌లో మాత్రమే చూపించారని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతేనని, వారి మనుషులకు భూములిచ్చి బహుజనులను దూరం పెట్టారని విమర్శించారు. -
చూస్తూ ఊరుకోం: మంత్రి సీదిరి అప్పలరాజు
ఉత్తరాంధ్రపై ద్వేషంతో, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్రతో విశాఖపై దండెత్తి వస్తే చూస్తూ ఊరుకోం. పాదయాత్ర పేరుతో రైతుల ముసుగులో టీడీపీ వారు లక్షల్లో వచ్చినా అంతకు రెట్టింపుగా వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలు వారిని వెనక్కు పంపుతారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత అంటూ కోర్టుల్లో వాదిస్తారా? అలాంటి ప్రాంతంలో కొన్ని గ్రామాల వారి కోసమే రాజధాని కట్టడానికి వెనుకబడ్డ వర్గాలు ఎందుకు అంగీకరించాలి? ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 54 వేల ఎకరాల్లో రైతులకు 11 వేల ఎకరాలు ఇవ్వాలి. అభివృద్ధి కోసం 30 వేల ఎకరాలు ఖర్చవుతుంది. ప్రభుత్వం చేతిలో 10 వేల ఎకరాలే ఉంటుంది. ఇది ఏ రకంగా త్యాగమవుతుంది’ అని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. -
చంద్రబాబును ఓడించేది మత్స్యకారుడే..
వజ్రపుకొత్తూరు రూరల్: ‘అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులను తొక్క తీస్తాం.. తోలు తీస్తాం... అంటూ కించపరిచిన చంద్రబాబును గంగపుత్రులు ఎన్నడూ మర్చిపోరు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓ మత్స్యకారుడే కుప్పంలో ఓడిస్తారు...’ అని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని, అందువల్లే ఆ పార్టీని ప్రజలు 23 స్థానాలకు పరిమితం చేశారని చెప్పారు. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఈ నెల 22న వైఎస్సార్ చేయూత సొమ్ము జమ కానుందని తెలిపారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆస్పత్రి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. నువ్వలరేవు జెట్టీ పనులు, రూ.700 కోట్లతో ఇంటింటికీ తాగునీటి ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయన్నారు. -
ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఏపీ
సాక్షి, అమరావతి: ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సాగు, దిగుబడులు, ఎగుమతుల్లోనే కాకుండా స్థానికంగా వినియోగంలో సైతం రాష్ట్రాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులతో కలిసి ఆక్వా హబ్‌లు, రిటైల్ ఔట్లెట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోందని చెప్పారు. వీటిలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి పేటీఎంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం మంత్రి సమక్షంలో పేటీఎం, రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఆఫ్కాఫ్ చైర్మన్ కె.అనిల్ బాబు, పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం రిటైల్ ఔట్లెట్ నిర్వాహకులకు రూ.22 వేల విలువైన పాయింట్ ఆఫ్ సేల్ (పోస్), క్యూఆర్ కోడ్, తదితరాలను పేటీఏం సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ ఔట్లెట్లను తీసుకొస్తున్నామని చెప్పారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా పోషక విలువలు ఉన్న తాజా చేపలు, సముద్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామన్నారు. వీటి ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ్ శర్మ మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిలో పేటీఏంను భాగస్వామిని చేయడం గర్వకారణంగా ఉందన్నారు. -
మంత్రివి ఎలా అయ్యావు లోకేశ్?
కాశీబుగ్గ: ‘ఏపీ రాష్ట్రం మీ బాబు జాగీరా.. లోకేశ్ నువ్వు మంత్రి ఎలా అయ్యావు.. టీడీపీని ఆక్రమించుకున్నది మీరు. అలాంటి మీరు సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తారా?’ అంటూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. ఆయన ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాసలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉండి దొడ్డిదారిలో లోకేశ్‌కు ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి అయ్యారని చెప్పారు. చంద్రబాబు కుమారుడిగా పుట్టడం తప్ప లోకేశ్‌కు ఇంకెలాంటి అర్హతలు లేవని విమర్శించారు. ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలవగలవా అని సవాల్ విసిరారు. కుప్పంలో మత్స్యకారుడు పోటీచేస్తున్నాడని, ఆయనపై చంద్రబాబు గెలవగలరా అంటూ ప్రశ్నించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయితే దేశ నాయకుడు అయిపోరని చురకలు అంటించారు. సీఎం జగన్ వద్దకు వెళ్లాలంటే అప్పలరాజు వంటి లక్షలమందిని దాటాల్సి ఉంటుందని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు నివాసంతోపాటు ప్రజావేదిక వంటివన్నీ అక్రమ నిర్మాణాలేని, అలాంటి వ్యక్తులు అక్రమాలపై మాట్లాడడమా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే పలాసలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. వైఎస్ జగన్ నేర్పించిన క్రమశిక్షణ వల్ల సహనంతో ఉంటున్నామన్నారు. గౌతు కుటుంబసభ్యులు తమ 60 ఏళ్ల పాలనలో పలాసకు ఒక డిగ్రీ కాలేజీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. సీఎం దయ వల్ల డిగ్రీ కళాశాల, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ కేంద్రాలు తెచ్చుకున్నామని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని గిరిజన గ్రామాల్లో రూ.42 కోట్లతో రోడ్లు వేశామన్నారు. గౌతు శిరీష మాటతీరు చూస్తుంటే లచ్చన్న మనవరాలి మాటల్లా లేవన్నారు. తనను పలుమార్లు పశువు పశువు అని సంభోదిస్తుంటే చాలా బాధ కలిగిందని చెప్పారు. -
శ్రీకాకుళం : పలాసలో ఉద్రిక్తత
-
ఐదేళ్లలో టీడీపీ దొంగలు చేసిన భూ ఆక్రమణలు తొలగిస్తాం
-
పలాసలో హై టెన్షన్.. లోకేష్ ఓవరాక్షన్!
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపును టీడీపీ అడ్డుకుంది. దీంతో, టీడీపీ వైఖరికి నిరసనగా ఆ పార్టీ కార్యాలయం ముట్టడికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కాగా, వైఎస్సార్సీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు సహా పార్టీ శ్రేణులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ నేతల ఆక్రమణలను తొలగిస్తుంటే.. పేదల ఇళ్లను తొలగిస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు కొండలు, చెరువులను కూడా వదిలిపెట్టలేదు. టీడీపీ నేతల చెరలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాము’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. పలాస ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వైఎస్సార్సీసీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. శ్రీకాకుళం కొత్తరోడ్ వద్ద టీడీపీ నేత నారా లోకేష్ ఓవరాక్షన్ చేశారు. పలాస వెళ్లేందుకు లోకేష్ ప్రయత్నించారు. ఈ క్రమంలో లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో లోకేష్.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, రణస్థలం పోలీస్ స్టేషన్‌కు లోకేష్‌ను తరలించారు. ఇది కూడా చదవండి: ఓటమి భయంతోనే ఉన్మాదపు కూతలు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సిదిరి అప్పలరాజు
-
పాట పాడిన మంత్రి సీదిరి.. దద్దరిల్లిన ప్లీనరీ..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కమిటీ కన్వీనర్ వంగపండు ఉష ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు జానపద నృత్యాలు, గీతాలతో అలరించారు. చదవండి: అంతులేని అభిమానం.. తీవ్ర అనారోగ్యంలోనూ ప్లీనరీకి.. నవరత్నాలు, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బాణీలతో కూర్చిన గేయాలకు చిందేసి ఆడుతూ ప్లీనరీకి వచ్చిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సినీనటుడు జోగినాయుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం కాగా, ప్రజాప్రతినిధులు సైతం పాలుపంచుకున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సీఎంని కీర్తిస్తూ పాటపాడారు. వేదికపై ఆలపిస్తున్న వంగపండు ఉష, తదితరులు -
ఘనంగా కాకినాడ జిల్లా ప్లీనరీ
కాకినాడ రూరల్/కరప: వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా ప్లీనరీ మంగళవారం సాయంత్రం కాకినాడ రూరల్ పరిధిలోని నడకుదురులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్లీనరీకి భారీఎత్తున వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా.. ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు. ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి సీదిరి అప్పలరాజు, మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పరిశీలకురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంపీ వంగా గీత, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. -
ఎలుగుబంటి దాడి బాధితులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
-
ఏపీకి నాలుగు స్కోచ్ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు స్కోచ్ అవార్డులు వరించాయి. 2021 సంవత్సరానికి గాను జౌళి, పశు సంవర్ధక, మత్స్యసంపద, వ్యవసాయ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ఈ అవార్డులు దక్కాయి. శనివారం ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన 83వ స్కోచ్ సమ్మిట్‌లో ఇండియా గవర్నెన్స్ ఫోరం అవార్డులను ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక, మత్య్స సంపద, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న పశు సంరక్షక యాప్, ఈ–ఫిష్, ఆర్బీకే స్థాయిలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న హార్బర్లు వంటి అనేక అంశాలను ఇతర రాష్ట్రాలతో బేరీజు వేసుకొని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేశారని తెలిపారు. అంతేగాక వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉన్నాయని తెలిపారు. దేశంలోనే ఆర్బీకే వంటి వ్యవస్థ ఏదీ లేదని, దేశానికి ఇది దిక్సూచి అని స్కోచ్ సంస్థ ప్రశంసించి ఏపీకి వ్యవసాయ రంగంలో అవార్డు ఇచ్చిందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనా దక్షత, ప్రజలకు మేలు చేసేందుకు ఆయన పడుతున్న తపన కారణంగానే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఇలాంటి అవార్డులు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కాగా జౌళి శాఖలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అనంతపురం జిల్లాకు అవార్డు లభించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వైఎస్సార్ చేయూత, గ్రామ, వార్డు సచివాలయాలకు ఇచ్చిన అవార్డును శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అందుకున్నారు. -
బస్సు యాత్ర స్పందన చూసి చంద్రబాబుకు వణుకు: సీదిరి అప్పలరాజు
-
AP: తగ్గిన రొయ్య మేత ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జోక్యంతో రొయ్య మేత తయారీదారులు దిగివచ్చారు. పెంచిన ధరలను తగ్గించారు. శనివారం నుంచి పాత ధరలతోనే రొయ్య మేత అందుబాటులో ఉంటుంది. ముడిసరుకు ధరలను సాకుగా చూపి ఇటీవల కిలోకి రూ.2.60 చొప్పున టన్నుకు రూ.2,600 మేర మేత ధరలు పెంచారు. ధరల పెంపుపై నియంత్రణ ఉండాలని, లేకుంటే సాగు చేయలేమంటూ రొయ్య రైతులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రొయ్య రైతులు, మేత తయారీదారులతో మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సచివాలయంలో సమావేశమయ్యారు. చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు మేత ధరలపై సమీక్షించారు. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు కరెంట్ కోతల వల్ల జనరేటర్లపై ప్లాంట్లు నిర్వహించాల్సి వచి్చందని అందువల్లే మేత ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులు చెప్పారు. ఇలా ప్రతి మూడు నెలలకు పెంచడం తమకు భారంగా మారుతోందని రొయ్య రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్సడా చట్టం ప్రకారం మేత ధరలు ఇష్టానుసారం పెంచడానికి వీల్లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలను ప్రభుత్వం ఎత్తివేసిందని మంత్రి చెప్పారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఇందుకు తయారీదారులు అంగీకరించారు. టన్నుకు రూ.2,600 చొప్పున తగ్గించి శనివారం నుంచి పాత ధరలకే అమ్ముతామని చెప్పారు. ఇక నుంచి నాలుగు నెలలకోసారి సమీక్షించాలని, అప్పటి ముడిసరుకుల ధరలను పరిగణనలోకి తీసుకొని మేత ధర నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించారు. తయారీదారుల సూచన మేరకు రొయ్యల మేతలో ఉపయోగించే సోయా దిగుమతులను అనుమతించి, ఎగుమతులపై నిషేధం కొనసాగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మేత ఉత్పత్తిదారులు, ఆక్వా రైతులు ఉమ్మడిగా కృషి చేయాలని నిర్ణయించారు. రొయ్యల పెంపకంలో యాంటిబయాటిక్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని మంత్రి చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, రాష్ట్ర ఆక్వా అభివృద్ధి సంస్థ కో వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ఆల్ ఇండియా చేపల మేత ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడుæ బీద మస్తాన్‌రావు, ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మోహన్‌రాజు పాల్గొన్నారు. -
మొదట మెకానిక్ కావాలనుకున్నాను.. కానీ : మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): తొలుత మెకానిక్ కావాలనుకున్నానని..అయితే ఫిజిక్స్ మాస్టార్‌ను చూసి ఉపాధ్యాయుడిగా మారాలనుకున్నానని మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. శనివారం రాత్రి కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు స్కూల్ వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బాల్యదశలో ఆలోచనాశక్తి వివిధ రకాలుగా ఉంటుందని.. చూసే ప్రతీ ప్రొఫెసన్‌లో తాముండాలని అనుకుంటారన్నారు. చిన్నారులకు గొప్ప వ్యక్తులు, విజేతలను ప్రత్యక్షంగా చూపించాలన్నారు. తాను చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవన్నారు. బాల్యదశ నుంచి టాపర్‌గా ఉండడంతో డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా మారానన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీవెనతో రెండోసారి మంత్రిని అయ్యానని చెప్పారు. మంచి ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నారన్నారు. విశ్రాంత జడ్జిలు, డాక్టర్లను వేదికపైకి పిలిపించి ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిల్లలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు వెంకటదొర, రామ్మోహన దొర, మున్సిపల్ చైర్మన్ బి. గిరిబాబు, ఎంఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చదవండి: మటన్ , చికెన్ అంటే భలేభలే! వారంలో 2, 3 రోజులు ఉండాల్సిందే! -
కేటీఆర్‌కు మంత్రి అప్పలరాజు సవాల్.. ‘40 బస్సులు వేసుకొని రండి’
సాక్షి, విజయవాడ: ఏపీలో మౌలిక వసతులు సరిగా లేవంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. తాజాగా కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడటం బాధాకరమన్నారు. ఏపీకి నాలుగు బస్సులు కాదు. జిల్లాకు 40 బస్సులు వేసుకురండని సవాల్ విసిరారు. చదవండి: AP Minister: కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న మంచిని చూసి తెలంగాణలో కూడా చేద్ధామని కేసీఆర్ కూడా చెప్పారు, ఈ విషయం మీకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ‘ఏపీలో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమం స్పూర్తితోనే తెలంగాణలో అమలు చేస్తున్నారు. ఏపీ మాదిరిగానే ఇంగ్లీష్ మీడియం తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు. ఈ విషయం మీకు తెలియలేదా? నీతి ఆయోగ్ ఇచ్చిన వార్షిక నివేదికలో ఏపీది 3వ స్థానం .ఈ విషయం మీకు తెలుసా? ఎవరో ఫ్రెండ్ చెబితే ఏపీని తక్కువ చేసి మాట్లాడతారా? హైదరాబాద్ లేని తెలంగాణను మీరు ఓ సారి ఊహించుకోండి. చదవండి: హైదరాబాద్‌లోనే కరెంట్ లేదు: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ హైదరాబాద్ అభివృద్ధిలో మీ పాత్ర, మీ నాన్నగారి పాత్రేంటో చెప్పండి. మీ ఎనిమిదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో తెచ్చిన మార్పులేంటి. మీ తెలంగాణలో విద్యుత్ కోతలు లేవా. మొన్నటికి మొన్న విద్యుత్ కోతలపై రైతులు ధర్నా చేయలేదా. ఏపీకి రండి ఎన్నివేల కోట్లతో రోడ్లు వేసుకోగలిగామో చూపిస్తాం.రోడ్ల కోసం ఈ మూడేళ్లలో మీరెంత ఖర్చుచేశారో...మేమెంత ఖర్చు పెట్టామో ఓపెన్ డిబేట్‌కు రండి. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలని పనిచేస్తున్న ప్రభుత్వం మాది. చదవండి: ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. కేటీఆర్‌కు మంత్రి రోజా కౌంటర్ తెలంగాణ గొప్పదనమేంటో కోవిడ్ సమయంలోనే తేలిపోయింది. మిగులు బడ్జెట్ ఉండి కూడా కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడం మీకు సాధ్యపడిందా. తెలంగాణ నుంచి ప్రజలు ఏపీకి ట్రీట్ మెంట్ కోసం వచ్చారు. కోవిడ్ సమయంలో దేశం మొత్తం వైఎస్ జగన్ పేరు స్మరించుకుంది. గౌరవమైన పదవుల్లో ఉన్న వారు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. టీడీపీ నేతలకు బుర్రాబుద్దీ ఉందా. కేటీఆర్ పనిలేక మాట్లాడాడు. టీడీపీ నేతల ఆత్మగౌరవం చచ్చిందా. కేటీఆర్ తానా అంటే తందానా అనడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా’ అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. చదవండి: ‘కేటీఆర్.. ఏపీకి రండి.. అభివృద్ధి చూపిస్తాం’ -
సీదిరి అప్పలరాజు అనే నేను..
-
చరిత్రలో ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యం సీదిరి అప్పలరాజు సొంతం
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి సీదిరి అప్పలరాజు చరిత్ర సృష్టించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను మంత్రిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.సమర్థమైన పనితీరు, చక్కటి వాగ్ధాటి ఆయనకు కలిసొచ్చాయి. పలాస నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యత సంతరించకుంది. అంతా అనూహ్యమే సీదిరి రాజకీయ ప్రవేశమే అనుహ్యం. వైద్యవృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలో చేరడమే తరువాయి క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. కిడ్నీ రోగుల బాధలు తెలుసుకునేందుకు కవిటి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి, ఆ తర్వాత పలాస నియోజకవర్గకర్తగా నియమితులై రాజకీయాల్లో దూసుకుపోయారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో పాతుకుపోయి ఉన్న నేతల పునాదులు కదిల్చారు. టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల అధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీ సాధించారు. నేపథ్యం.. పేరు: డాక్టర్ సీదిరి అప్పలరాజు నియోజకవర్గం: పలాస స్వస్థలం: దేవునల్తాడ తల్లిదండ్రులు: దాలమ్మ, నీలయ్య (లేటు) పుట్టినతేదీ: ఫిబ్రవరి 22, 1980 విద్యార్హతలు: ఎండీ జనరల్, ఎంఈడీ సతీమణి: శ్రీదేవి సంతానం: కుమారులు ఆర్నవ్ వర్మ, ఆరవ్ వర్మ జిల్లా: శ్రీకాకుళం రాజకీయ నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి చిన్నవయసులో 26 ఏళ్లకే విశాఖపట్నం లోని కేజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2007 డిసెంబర్ 14న పలాస–కాశీబుగ్గ పట్టణంలో సేఫ్ హాస్పిటల్ స్థాపించి వైద్యుడిగా కొనసాగుతూ దాదాపు 12 సంవత్సరాల పాటు వైద్యునిగా సేవలు అందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు 2017 ఏప్రిల్ 19న వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పలాస నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన గౌతు కుటుంబంపై విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. జూలై 22, 2020న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (Dharmana Prasada Rao: ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక) -
రాజీనామాల తర్వాత అసంతృప్తి అనేది అవాస్తవం: మంత్రి సీదిరి అప్పలరాజు
-
ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా..
సాక్షి, ప్రకాశం: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం బాలినేని మాట్లాడుతూ.. ‘‘వైఎస్ఆర్ మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవి వదులుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన నిలబడ్డాను. సీఎం జగన్‌కు నేను వీరాభిమానిని. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నా అని సీఎం జగన్ అన్నప్పుడే నా పూర్తి మద్దతును బహిరంగంగా ప్రకటించాను. నాకు పార్టీ ముఖ్యం.. మంత్రి పదవి కాదని నేను ఎప్పుడో చెప్పాను. ఆంధ్రజ్యోతి రాతలు మరింత నీచంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి విషప్రచారం మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తా’’ అని హెచ్చరించారు. మరోవైపు.. విజయవాడలో సీదిరి అప్పలరాజు సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాజీనామాల తర్వాత అసంతృప్తి అనేది అవాస్తవం. మంత్రులందరం సీఎం జగన్ నిర్ణయాన్ని గౌరవించి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేశాం. కొన్ని మీడియాలు ప్రజలని తప్పుదోవ పట్టించేలా అసంతృప్తులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై స్వేచ్చగా నిర్ణయం తీసుకునే అధికారం సీఎం జగన్‌కు ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయాలకి అనుగుణంగానే అందరూ పనిచేయాల్సి ఉంటుంది. సీఎం జగన్ పనితీరుని చూసే ప్రజలు ఓట్లేస్తారు.. మమ్మల్ని చూసి కాదు. మా అందరికీ ముఖ్యమంత్రి జగన్‌పై అపార నమ్మకం, అచంఛల విశ్వాసం ఉంది. బలహీనవర్గాలలో ఇంతమందికి గతంలో ఎవరూ అవకాశం కల్పించలేదు. సామాన్య కుటుంబంలో పుట్టిన నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా సీఎం వైఎస్ జగన్ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ దగ్గర పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా సంతోషంగా పాటిస్తాం’’ అని తెలిపారు. -
మంత్రి పదవికి రాజీనామా: స్పందించిన అనిల్‌కుమార్ యాదవ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ను ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. గురువారం మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 'సీఎం జగన్‌కు సైనికుడిగా పనిచేయడమే తనకు అత్యంత ఇష్టమని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి 2024లో మళ్లీ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుదని చెప్పారు. అందులో భాగంగానే నేడు మంత్రులంతా చాలా సంతోషంగా రాజీనామాలు చేశామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. చదవండి: (మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు) రాజీనామాలపై మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. 'మంత్రులందరూ రాజీనామాలు చేశాం. మరికొందరికి మంత్రులుగా అవకాశం లభిస్తుంది. ఇక పార్టీ కోసం పనిచేసే గొప్ప అవకాశాన్ని సీఎం మాకు కల్పిస్తున్నారు. ఇదో గొప్ప అరుదైన క్షణమని' మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. చదవండి: (మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) -
టీడీపీ చిడతల బ్యాచ్ పై అప్పలరాజు ఫైర్
-
పశు సంవర్ధక ల్యాబ్‌లకు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని 60 డాక్టర్ వైఎస్సార్ పశు సంవర్ధక వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలకు ఒకేసారి ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్) గుర్తింపుతో పాటు ఐఎస్ఒ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) సర్టిఫికెట్ లభించింది. వీటి ద్వారా సేవల్లో నాణ్యత పెరగడంతో పాటు ధ్రువీకరించిన నాణ్యమైన ఇన్పుట్స్ అందించేందుకు వీలవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాడి రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ రిఫరల్ ల్యాబ్‌ను, డాక్టర్ వైఎస్సార్ పశు సంవర్ధక ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ప్రాంతీయ స్థాయిలో 4, జిల్లా స్థాయిలో 10, నియోజకవర్గ స్థాయిలో 154 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు అనుబంధంగా ఇవి పనిచేస్తాయి. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి ల్యాబ్‌లు ఉన్నాయి. ఇటీవలే 65 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవి కూడా త్వరలో రానున్నాయి. వీటిలో 20 రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో 60 ల్యాబ్‌లకు ఐఎస్ఒ–9001:2015 సర్టిఫికేషన్‌తో పాటు ఎన్ఏబీఎల్ గుర్తింపు కూడా లభించింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 11, కర్నూలులో 7, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఆరేసి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఐదేసి, శ్రీకాకుళంలో 4, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ల్యాబ్‌లకు ఈ గుర్తింపు లభించింది. గుర్తింపుతో ప్రయోజనాలెన్నో.. ఈ గుర్తింపుతో ల్యాబ్‌ల సామర్థ్యం పెరుగుతుంది. మరింత నాణ్యమైన సేవలకు అవకాశం ఏర్పడుతుంది. ధ్రువీకరించిన నాణ్యమైన దాణాను అందించవచ్చు. పాడి రైతులకు సరఫరా చేసే ఇన్పుట్స్ నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చు. రాష్ట్రంతోపాటు దక్షిణ భారత దేశంలోని ఇతర రాష్ట్రాల పాడి రైతుల అవసరాలను తీర్చ గలిగే స్థాయికి మన ల్యాబ్‌ల సామర్థ్యం పెరుగుతుంది. కేంద్ర కార్యదర్శి ప్రశంసలు దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నియోజకవర్గ స్థాయిలో పశు సంవర్ధక వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారని కేంద్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అతుల్ చతుర్వేది ప్రశంసించారు. ఒకేసారి 60 ల్యాబ్‌లకు ఐఎస్ఓ, ఎన్‌ఎబీఎల్ గుర్తింపు లభించిన సందర్భంగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ముఖ్యమంత్రి కృషి ఫలితమే నాణ్యమైన ఇన్పుట్స్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు వ్యవసాయ, పాడి, ఆక్వా రైతుల కోసం ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లున్న ఏకైక రాష్ట్రం మనదే. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేశాం. అత్యుత్తమ సేవలందిస్తున్నాం. ఒకేసారి 60 ల్యాబ్‌లకు ఐఎస్ఓ, ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించడం ముఖ్యమంత్రి కృషి ఫలితమే. మిగిలిన ల్యాబ్‌లకు కూడా త్వరలోనే గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు
-
2015లో చంద్రబాబు నీచపు పని బయటపెట్టిన మంత్రి అప్పలరాజు
-
పింఛన్ అర్హత వయసు తగ్గింపుతో..10.60 లక్షల మందికి లబ్ధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించామని, దీంతో 10,60,208 మంది లబ్ధిపొందారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2019–20లో 7.58 లక్షలు, 2020–21లో 6.15 లక్షలు, 2021–22లో 5.01 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చామన్నారు. ఇలా గడిచిన మూడేళ్లలో 18.74 లక్షల పింఛన్లను పెంచామన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షలమందికిపైగా లబ్ధిపొందుతున్నట్టు వెల్లడించారు. అర్హత ఉండీ దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో పింఛన్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. చేనేతలకు బాబు శూన్యహస్తం: మంత్రి అప్పలరాజు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం చేయడానికి చంద్రబాబుకు చేతులు రాలేదని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిహారం చెల్లిస్తే, 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న 82 చేనేతల కుటుంబాలకు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వమే పరిహారం చెల్లించిందన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని, 2019–20లో 81,783 మందికి, 2020–21లో 78,211 మందికి, 2021–22లో 80,031 మందికి కలిపి మొత్తం రూ. 576.86 కోట్ల ఆర్థిక సహాయం చేసినట్టు వివరించారు. చేనేతలకు నూలు కొనుగోళ్లలో 40 శాతం మేర సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచాలన్నది సీఎం ఆలోచనని చెప్పారు. విప్లవాత్మక సంస్కరణలు నాడు గంగను భగీరథుడు భువికి తీసుకొచ్చినట్టు.. నేడు సీఎం జగన్ ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే అసమానతలు రూపుమాపుతున్నారు అంబేడ్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా పేదలకు విద్యనందించి, సీఎం అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నారు. – మేరుగ నాగార్జున, వేమూరు ఎమ్మెల్యే స్థానిక భాషలకు ప్రోత్సాహం బాగా వెనుకబడిన మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా ఈరోజు నాణ్యమైన విద్య అందుతోంది. గిరిజన ప్రాంతాల్లోని స్థానిక భాషలను కూడా ప్రోత్సహించాలి. – కె.భాగ్యలక్ష్మి,ఎమ్మెల్యే అందరూ బడికెళుతున్నారు ఏపీలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలతో పిల్లలు ఎవ్వరూ బెంగళూరులో పనికి వెళ్లడంలేదు. సొంతూళ్లలో చక్కగా బడికి వెళ్తున్నారు. – బియ్యపు మధుసూదన రెడ్డి, ఎమ్మెల్యే -
గౌతమ్‌రెడ్డి శాఖలు ఇతర మంత్రులకు కేటాయింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. -
ఆ జీవోపై పవన్‌కు అవగాహన లేదు
కాశీబుగ్గ/రేపల్లె రూరల్: జీవో 217 వల్ల మత్స్యకారులకు మరింత లాభం కలుగుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. జీవో 217కు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎటువంటి సంబంధం లేదన్న విషయం కూడా తెలియని అజ్ఞాని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అని ధ్వజమెత్తారు. ఈ జీవోను ఎందుకు తప్పుపడుతున్నారో, దానివల్ల మత్స్యకారులకు జరిగే నష్టం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నరసాపురంలో జరిగింది మత్స్యకార సభ కాదని, సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల సమస్యలపై అవగాహనలేని పవన్సినిమా స్క్రిప్టులు, చంద్రబాబు స్క్రిప్టు చదువుతూ మభ్యపెడుతున్నారని చెప్పారు. మంత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలోను, ఎంపీ గుంటూరు జిల్లా రేపల్లెలోను ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇంతకుముందు ఇన్‌ల్యాండ్ వాటర్ బాడీస్‌లో మత్స్యకారుల పేరుచెప్పి అధికారపార్టీ దోపిడీ చేసేదని, వారికి రూపాయి కూడా దక్కేది కాదని చెప్పారు. మత్స్యకారుల నోటికాడ తిండిని పెట్టుబడిదారులు, దళారులు కొట్టేసి ఏడాదికి రూ.300, రూ.వెయ్యి చేతిలో పెట్టేవారన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు, మత్స్యకార సొసైటీలో ప్రతి సభ్యుడికి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేలా చూసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 217 జీవో తీసుకొచ్చారని చెప్పారు. ఈ జీవోను పైలట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్నామని, 27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లామని తెలిపారు. వాస్తవంగా తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయని, వేల ఎకరాల చెరువులు, ట్యాంక్‌లు సొసైటీల పరిధిలో ఉండటం లేదని చెప్పారు. దీంతో వాటిపై వచ్చే ఆదాయం దళారీ వ్యవస్థకే చెందుతోందన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి ఆ ఫలసాయాన్ని సొసైటీల ద్వారా మత్స్యకారులకు అందించేందుకు ఈ జీవో ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. దీనిపై అవగాహనలేని పవన్‌కల్యాణ్ ఆ జీవోను చించేశానంటున్నాడని ఎద్దేవా చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల బతుకులు మార్చేందుకు చేపల అవుట్ లెట్లతో విక్రయాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే వాటిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మత్స్యకారులకు మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. ఊరి చివర ఈగల మధ్యలో విక్రయాలు చేసే అవస్థ రాకుండా మత్స్యకార యువకులకు శిక్షణ ఇచ్చి, సబ్సిడీ రుణాలు అందించి అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. యువకులకు ఉపాధి కల్పిస్తుంటే ప్రభుత్వం చేపలు అమ్ముతోందని ఎద్దేవా చేయడం సబబు కాదన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించే వారెవరైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. మత్స్యకారుల సమస్యల గురించి అప్పట్లో చంద్రబాబుకు విన్నవిస్తే.. తొక్కతీస్తామన్నారని, ఆ సమయంలో పవన్ స్పందించలేదని గుర్తుచేశారు. పవన్ అవగాహన లేకుండా 215, 217 జీవోలపై జెట్టి, గంగమ్మ పూజలు, ఫిషింగ్ హార్బర్ అంటూ చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మత్స్యకారులు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. -
ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం: మంత్రి సీదిరి అప్పలరాజు
-
ఎందుకీ డ్రామాలు పవన్!?
పలాస (శ్రీకాకుళం జిల్లా): మాజీ సీఎం చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు ఏం చేయలేదని, ఇప్పుడు అన్ని రకాలుగా వారికి మేలు జరుగుతోందని తెలిసి కూడా ఈ డ్రామాలు ఏమిటని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పశుసంవర్థక, మత్స్య శాఖమంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మత్స్యకారులకు చంద్రబాబు చేసిన మోసాన్ని, హేళనగా మాట్లాడిన మాటలను మర్చిపోం అని ఆయనన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు నిర్మిస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను చూపిస్తానని, లేదంటే ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెళ్లి పరిశీలించుకోవచ్చన్నారు. అలాగే, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని.. ఇందులో భాగంగానే ఆ వర్గం మహిళలకు గౌరవం దక్కేలా చేపల అమ్మకానికి రిటైల్ ఔట్లెట్లు, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే అవహేళన చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. గతంలో మత్స్యకారులను ఉద్దేశించి ‘తోలు తీస్తా.. ఫినిష్ చేస్తా’ అని చంద్రబాబు అన్నప్పుడు ఏనాడూ స్పందించని పవన్ ఈరోజు వారిపై అకస్మాత్తుగా ప్రేమ కనబర్చడం వెనుక ఆంతర్యమేమిటన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి టీడీపీకి బీ టీమ్‌గానే వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. పవన్ స్వతంత్రంగా వ్యవహరించి తమ ప్రభుత్వంలో జరిగే మంచిని కూడా గ్రహించాలని మంత్రి హితవు పలికారు. మత్స్యకారులకు పక్కా ఇళ్లు లేవని.. కానీ, సీఎం వైఎస్ జగన్ వచ్చిన తర్వాత 32 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామని.. రాబోయే రోజుల్లో ప్రతి మత్స్యకారుడు ఇల్లు లేదనే పరిస్థితి ఉండదన్నారు. జనసేన వైఖరి చూస్తుంటే టీడీపీని బలోపేతం చేయాలన్న తపన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మత్స్యకారులకు టీడీపీ భృతి ఇచ్చిందా? ఏప్రిల్–మే వస్తే మత్స్యకారులు వేట ఆపేయాలని.. ఆ సమయంలో బోటుకు రూ.4 వేలు ఇస్తామని అనేవాళ్లు తప్ప చంద్రబాబు ఏనాడూ ఇవ్వలేదని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. దీనిపై పవన్ ఏనాడైనా అడిగారా అని ప్రశ్నించారు. నేడు సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలు ఇస్తున్నారని.. వారికి డీజిల్ సబ్సిడీ కూడా ఇస్తున్నట్లు తెలుసా అని పవన్‌ను అడిగారు. మత్స్యకారుడు వేటకు వెళ్లి చనిపోతే రూ.10 లక్షలు పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని, ఈ విషయమైనా తెలుసా అని మంత్రి ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ చేపలు అమ్ముకుంటున్నారంటూ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన కలిసే ఈ నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. జనసేనకు వీలైతే మంచి సలహాలు ఇవ్వాలి తప్ప సీఎం జగన్‌ను దూషిస్తామంటే ఏ మత్స్యకారుడూ స్వాగతించడన్నారు. -
పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్
కనీసం ఒక లీటర్ మంచి నీళ్ల సీసా ధర కూడా పాలకు రావడం లేదని, ఇలాగైతే ఎలా బతకాలని అక్కచెల్లెమ్మలు నా పాదయాత్ర సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందుకే పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి రేటు వచ్చేట్టుగా, ఎటువంటి మోసం, దళారులు లేని పరిస్థితిని అమూల్ ద్వారా తీసుకువచ్చాం. ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అమూల్ పాల సేకరణ చేస్తోంది. ఇప్పుడు ఏడవ జిల్లాగా అనంతపురంలో అడుగుపెట్టింది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమూల్‌తో పోటీ వల్లే ప్రైవేట్ డెయిరీలు కూడా పాల రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, వాళ్లకేదైనా అదనపు ఆదాయం గ్రామంలోనే ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావడంతో పాటు మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో జగనన్న పాల వెల్లువ శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో అమూల్ రంగ ప్రవేశం వల్ల పాడి ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ, రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే కేవలం దానిమీదే ఆధారపడితే సరిపోని పరిస్థితుల్లో పాడిని తోడుగా చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తికి, పాడి పెంపుదలకు అమూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. అక్క చెల్లెమ్మలే యజమానులు ► అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న సంస్థ. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్ యాజమానులు. అందుకే మార్కెట్లో ఏ ఇతర ప్రైవేటు డెయిరీ కంటే అమూల్ ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ► పాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రాసెసింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉంది. పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్థాయికి అమూల్ ఎదిగింది. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోంది. అందువల్లే ఎలాంటి మోసాలు, కల్తీ, దళారుల డెడద లేకుండా అక్కచెల్లెమ్మలకు మంచి రేటు ఇస్తోంది. వచ్చిన లాభాలను కూడా బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అక్కచెల్లెమ్మలకు వెనక్కు ఇస్తోంది. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా చూడలేం. ► మన రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరుగార్చిన నేపథ్యంలో అక్కడో, ఇక్కడో ఉన్న కొద్దొ గొప్పో డెయిరీలు సహకార రంగంలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో ఉన్నాయి. వాస్తవానికి సహకార రంగంలో ఉండటం అంటే ఇలా.. అని చూపించిన పరిస్థితి దేశం మొత్తం మీద అమూల్‌లోనే ఉంది. లాభాలు పాలు పోసే అక్కచెల్లెమ్మలకే వస్తాయి అని అమూల్ చూపించింది. అందుకే అమూల్‌కు అంత ప్రాధాన్యత. అమూల్ రాకతో పోటీతో పాటు మార్పు ►నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాలు పోసే అక్కచెల్లెమ్మలు, రైతులు వచ్చి వాటర్ బాటిల్ చూపించే వారు. మార్కెట్లో వాటర్ బాటిల్ ధర రూ.23 అయితే, లీటరు పాలు అంత కన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే మేం ఎలా బతకాలని అడిగే వారు. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ► అమూల్ రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా పోటీలో లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకు పెంచి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడే ఎందుకు రేటు పెరిగిందంటే.. గతంలో గ్రామ స్థాయిలో మోసాలే కారణం. పాలు పోసిన వెంటనే గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు అనే పరిస్థితులు ఉండేవి. ► రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీయూ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. దాదాపు 4,900 బీఎంసీయూలు, 11,690 ఏఎంసీయూ (ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్)లను ఏర్పాటు చేస్తోంది. ► అమూల్ విస్తరించే కొద్దీ, ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తాం. వీటి వల్ల అక్కచెల్లెమ్మలు పాలు పోసేటప్పుడు అక్కడికక్కడే.. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు.. ఎంత ధర వస్తుందని వివరిస్తూ రశీదు ఇస్తారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. మీ కళ్ల ముందే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ జరుగుతుంది. మోసాల నివారణకు చర్యలు ► పాల సేకరణలో జరిగే మోసాలను నివారించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధ్యాస పెట్టింది. తనిఖీలు విస్తృతంగా చేపట్టింది. దీనివల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఇలా పట్టుబడిన కేసుల్లో ప్రైవేటు డెయిరీలు లీటరుకు 45 పైసల నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ► ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో బాలమృతం, అంగన్వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్‌తో అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అమూల్ ఎండీ ఆర్ఎస్ సోథీ, కైరా మిల్క్ యూనియన్ ఎండీ అమిత్ వ్యాస్, బనస్కాంత మిల్క్ యూనియన్ ఎండీ సంగ్రామ్ చౌదరి, సబర్కాంత మిల్క్ యూనియన్ ఎండీ అనిల్ బయాతీలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయతో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. -
విశాఖ రింగు వలల వివాదం పరిష్కారంపై సమావేశం
-
విశాఖ: మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేత
సాక్షి, విశాఖపట్నం: రింగు వలల వివాదం పరిష్కారానికి మత్స్యకార సంఘాల నాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు ఆదివారం చర్చలు జరిపారు. సంప్రదాయ కారులు, రింగు వలల మత్స్యకార సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని గడువు పెట్టామని తెలిపారు. రేపటి నుంచి సంప్రదాయ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొచ్చాన్నారు. సముద్రంలో 8 కి.మీ తర్వాత రింగు వలలు వాడొచ్చని పేర్కొన్నారు. అధికారులు, మత్సకార సంఘాల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో రేపటి నుంచి 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: 'ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది' ఇటీవల రింగు వలల వినియోగం విషయంపై సముద్రంలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో మత్స్యకార సంఘం నాయకులతో భేటీ అయ్యారు. ఇరు వర్గాల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వీటిపై అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు ఈ దశలో సాంప్రదాయ మత్స్యకారులు చేపల వేట కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు తేల్చారు. అలాగే రింగు వలల వినియోగంపై లైసెన్స్ ఉన్న మత్స్యకారులు తీరం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో చేపలవేట కొనసాగించవచ్చని కూడా అధికారులు నిర్ణయించారు అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేపలవేట సాగించినట్లయితే ఎలాంటి మత్స్య సంపద లభించదని రింగు వలల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు నిర్ణీత ప్రాంతంలో చేపల వేట కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను మత్స్యకారులు కోరారు. అలాంటి అనుమతులు చట్టబద్ధంగా ఇవ్వడానికి అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు కొందరు అధికారులతో కలిసి కమిటీగా ఏర్పడి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. దీంతో ఈ నెల 20వ తేదీలోగా ఈ సమస్యపై గ్రామ పెద్దల మధ్య చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రులు సూచించగా.. ఇరు గ్రామాల ప్రజలు కూడా సమ్మతించారు మరోవైపు ఉద్రిక్తతల నడుమ కొనసాగిస్తున్న 144 సెక్షన్ కూడా ఎత్తి వేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మత్స్యకారులు సమన్వయంతో చేపల వేటను రేపటినుంచి కొనసాగించవచ్చని మంత్రులు ప్రకటించారు.