
తాడేపల్లి: చంద్రబాబు నాయుడు స్క్రిప్టు ప్రకారమే నడుస్తున్న పవన్ కల్యాణ్.. ఎంతసేపు ఊడిగం చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాజకీయం అంటే ఎంత సేపు ఊడిగం చేయడం కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. నాయకుడు అంటే కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపాలే కానీ, ప్యాకేజీ మాటాలు మాట్లాడకూదని సీదిరి ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం) ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మంత్రి అప్పలరాజు.. పవన్ కల్యాణ్ సభలకు పేర్లు కూడా టీడీపీనే నిర్ణయిస్తుందన్నారు.
‘చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదు. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం వాళ్లు ఏది చెబితే పవన్ కల్యాణ్ అది చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభలకు పేర్లుఉ కూడా టీడీపీ నిర్ణయిస్తుంది. మత్స్యకారుల గురించి పవన్‌కు అవగాహన ఉంది. టీడీపీ హయాంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ కట్టలేదు.
సీఎం జగన్ వచ్చాక 9 ఫిషింగ్ హార్బర్లను ప్రారంభించారు. సీఎం జగన్ సింహం లాంటి వారు నీలాంటి గ్రామ సింహాలకు బెదరడు.కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబుకు పవన్ తాకట్టుపెడుతున్నారు. రాజకీయం అంటే ఎంతసేపు ఊడిగం చేయడమేనా?, రాష్ట్రాభివృద్ధిపై చర్చకు పవన్ సిద్ధమా?, మీకు రాష్ట్రంపై ఏ స్థాయిలో అవగాహన ఉందో తేలుతుంది. చంద్రబాబును కలిసిన రోజు పవన్ అడ్వాన్స్ తీసుకున్నారు’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment