తాడేపల్లి: చిత్తూరు డెయిరీని చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారని, రోజుకు రెండున్నర లక్షల పాలు వచ్చే డెయిరీని అన్యాయంగా మూతేయించారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆ స్థానంలో హెరిటేజ్ డెయిరీని చంద్రబాబు తెచ్చుకున్నారని మంత్రి విమర్శించారు. సంగం డెయిరీని ప్రభుత్వం కచ్చితంగా స్వాధీనం చేసుకుని తీరుతుందని మంత్రి తెలిపారు. సంగం డెయిరీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని మంత్రి ప్రశ్నించారు.
‘ టీడీపీ నేత పట్టాభి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు సంగం డెయిరీ ప్రస్థానం ఎలా జరిగిందో జనానికి తెలియాలి. పాడి రైతుల డబ్బుతో స్థలం కొని డెయిరీ ప్రారంభించారు. మిల్క్ యూనియన్‌కి అధ్యక్షుడైన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కథ నడిపారు. పది ఎకరాల స్థలాన్ని సొంతానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉంటే వాటిని తిరిగి ఇచ్చేసి, కలెక్టర్ దగ్గర నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాకనే మ్యాక్స్ చట్టంలోకి ఏ డెయిరీ అయినా వెళ్తుంది. కానీ అవేమీ జరగకుండానే మ్యాక్స్ చట్టంలోకి తెచ్చి, ఆ తర్వాత సొంతానికి మార్చుకున్నారు. అది కూడా పూర్తిగా చట్ట విరుద్దం. ఎలాంటి ఎన్‌వోసీలు లేకుండా కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంగం డెయిరీ ని లాగేసుకున్నారు.
చిత్తూరు డెయిరీని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. రోజుకు రెండున్నర లక్షల పాలు వచ్చే డెయిరీని అన్యాయంగా మూతేయించారు. పట్టాభి భాషకీ, బాడీ లాంగ్వేజ్ కీ ఏదైనా సంబంధం ఉందా?, సీఎం గురించి ఎక్కువ మాట్లాడితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది జాగ్రత్త. చిత్తూరు డెయిరీని ఎవరు నాశనం చేశారో ముందు అది తెలుసుకో. చంద్రబాబు హయాంలో చాలా ప్రభుత్వ ఆస్థులను ప్రయివేటు పరం చేశారు.పైగా దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment