sangam dairy
-
అవినీతి అనకొండ
ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్ దేనినీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తూళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే అయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటాను దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్ని కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్ని కూడా దక్కించుకున్నారు. గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ వర్క్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్టు దక్కించుకొని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. సంగం ఆస్తులు స్వాహా.. పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలో కొనసాగింది. తరువాత ఎన్టీఆర్ హయాంలో 1995లో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిషీలో ఉండేది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. విలువైన భూములూ హాంఫట్..: అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభవృద్ధిని పట్టించుకోలేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట..: పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో నలుగురు ఎంపీలు ఇచ్చిన నిధులు రూ. 23 కోట్లతో 2003లో కల్యాణ మండపాన్ని నిర్మించారు. ఇలా నిర్మించిన ఏ నిర్మాణాలైన పంచాయతీ, మున్సిపాలిటీ ఆదీనంలోనే ఉండాలి. అయితే ఈ కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. -
AP: టీడీపీ కార్యకర్తలకే ‘ధూళిపాళ్ల’ టోపీ
సాక్షి, ఏలూరు : రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వకుండా శఠగోపం పెట్టారు. పైగా న్యాయం అడిగిన వారిపై దాడులు చేయించారు. ఆ పచ్చ నేత మోసం చేసింది టీడీపీకి చెందిన రైతులే అయినా..వారంతా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులంటూ ప్రచారం చేశారు. చివరికి అడ్డంగా దొరికిపోయి పరారయ్యారు. బాధితులంతా తాము టీడీపీ రైతులమే అని స్పష్టం చేయడంతో పాటు ధూళిపాళ్ళ నరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులపై దాడి చేయించిన నరేంద్రను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా లింగాయపాలెం మండలం వేములపల్లి, నరసన్నపాలెం గ్రామాల్లో ద్వారకాయయి మిల్క్ సెంటర్‌తో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ పాలుపోసేలా ఒప్పందం కుదుర్చుకుంది. వేములపల్లి సర్పంచ్ ముసులూరి రాము, నర్సన్నపాలెం సర్పంచ్ కూరపాటి వెంకటేశ్వర్లు తమ గ్రామాల పరిధిలో పాలను సేకరించి సంగం డెయిరీకి సరఫరా చేస్తున్నారు. 14 శాతం బోనస్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతులందరి నుంచి గ్రామాల్లో పాలు సేకరించి సంగం డెయిరీకి చేర్చేవారు. అయితే రైతుల దగ్గర పాలుపోయించుకుని కేవలం నాలుగుశాతం మాత్రమే బోనస్ ఇస్తామని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అడ్డం తిరిగారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఏలూరు జిల్లాకు చెందిన రైతులంతా సంగం డెయిరీకి వచ్చారు. రైతులు సంగం డెయిరీకి వచ్చి కార్లు దిగారో లేదో... ధూళిపాళ్ల నరేంద్ర కిరాయి సైన్యం ఒక్కసారిగా తమపై దాడికి దిగారని రైతులు ఆరోపిస్తున్నారు. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా బాదిపడేశారని అంటున్నారు. రైతులు తీసుకొచ్చిన కార్లను కూడా ధ్వంసం చేశారని విమర్శించారు. తాము డెయిరీకి పాలుపోసిన రైతులమని చెప్పినా కూడా కనికరం చూపించలేదని ఆక్రోశించారు. నరేంద్ర కిరాయి రౌడీల దాడిలో పదిహేను మంది రైతులు గాయపడ్డారు. ఈ దాడిపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్రతోపాటు మరో పద్నాలుమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న ధూళిపాళ్ల నరేంద్ర, అతని అనుచరులు వారం రోజులపాటు పరారయ్యారు. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన నరేంద్ర రైతులను కిరాయి మూకలని అడ్డగోలు దబాయించాడు. అంతేకాదు ప్రభుత్వమే ఈ పని చేయించిందంటూ దుష్ప్రచారం చేశాడు. వాస్తవానికి వేములపల్లి సర్పంచ్ ముసులూరి రాము కరడుగట్టిన తెలుగుదేశం నాయకుడు. 2015నుంచి 2019వరకూ లింగయపాలెం మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. రెండేళ్లక్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతో ముసులూరి రాము భార్య సర్పంచ్ గా గెలిచింది. చంద్రబాబు, లోకేష్‌తో కూడా ముసులూరి రాముకు పరిచయాలున్నాయి. లోకేష్ పాదయాత్రకు కూడా లక్షలు ఖర్చుపెట్టాడు. టీడీపీకి చెందిన ముసులూరి రామును వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ధూళిపాళ్ల నరేంద్ర నిజస్వరూపాన్ని చూసిన ఏలూరు జిల్లా రైతులు చీదరించుకుంటున్నారు. తమ కష్టాన్ని దొగింలించిన నరేంద్ర తమను కిరాయి వ్యక్తులుగా చిత్రీకరించడం దారుణమంటున్నారు. ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న తమకు సొంత పార్టీ నేతే మోసం చేసి, దాడి చెయ్యడం... ఇప్పుడు తమను వైసీపీ నాయకులనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదీచదవండి..అమరావతిపై బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రశ్నలు -
అడ్డంగా దొరికిన ధూళిపాళ్ల
-
పోలీసులపై ‘సంగం’ దౌర్జన్యం
చేబ్రోలు: తమకు బకాయి ఉన్న బోనస్ డబ్బులను చెల్లించాలని కోరిన ఏలూరు జిల్లా పాడి రైతులపై దాడి చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై సంగం డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాలు పోసిన రైతులకు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సుమారు రూ.50లక్షల బోనస్ డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారంటూ సంగం డెయిరీ సిబ్బందిని నిలదీసిన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం, వేములపల్లి గ్రామాలకు చెందిన పాడి రైతులపై చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులు దాడి చేసిన విషయం విదితమే. డెయిరీ సిబ్బంది, ధూళిపాళ్ల అనుచరులు సుమారు వందమంది విచక్షణారహితంగా కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడంతో 15మంది రైతులకు కాళ్లు, చేతులు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. మూడు కార్లు ధ్వంసం కావడంతో రూ.ఐదు లక్షల మేర నష్టం జరిగింది. అప్పట్లో బాధిత రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులోని కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ సీఐ ఎం.రాంబాబు, చేబ్రోలు ఎస్ఐ కె.ఆనంద్, పొన్నూరు ఎస్ఐ బార్గవ్, పోలీసు సిబ్బంది శుక్రవారం డెయిరీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నారు. మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్, డీఈ వెంకటేశ్వరరావు తదితరులు పోలీసులు అనుమతి లేకుండా సంగం డెయిరీలోకి ప్రవేశించడానికి వీలులేదని తెలిపారు. ఏలూరు రైతులపై దాడి కేసులో నిందితులు డెయిరీలో ఉన్నారని.. వారి కోసం వచ్చినట్లు సీఐ, ఎస్ఐలు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. సెర్చ్ వారెంట్, రెవెన్యూ అనుమతి కావాలని చెప్పడంతో ఇరువురు వీఆర్వోలు ఉన్నారని చూపినప్పటికీ లోపలికి రావడానికి వీల్లేదని పట్టుబట్టారు. సంగం డెయిరీ సిబ్బందితోపాటు, నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు, పొన్నూరు, పెదకాకాని మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
ఇంకా పరారీలోనే ధూళిపాళ్ల నరేంద్ర
సాక్షి, గుంటూరు: సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ ధూళిపాళ్ల నరేంద్ర మోసానికి తెరతీసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో ఎనిమిది రోజుల నుంచి ధూళ్లిపాళ నరేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. ధూళిపాళ్లతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉండగా, ఎనిమిది రోజుల నుంచి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైతులపై దాడి చేసిన ధూళ్లిపాళ్ల అనుచరులు సంగం డెయిరీలో దాక్కున్నారన్న సమాచారంతో డెయిరీకి పోలీసులు వెళ్లగా, లోపలికి రానివ్వకుండా ధూళ్లిపాళ్ల అనుచరులు డెయిరీ గేట్లు మూసివేశారు. చదవండి: ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం -
పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
సాక్షి, గుంటూరు: నాలుగు రోజుల క్రితం ఏలూరుకు చెందిన రైతులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుల దాడి చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ ధూళిపాళ్ల మోసానికి తెరతీశాడు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు పోలీసులు .. వారిని పట్టుకోవడానికి మూడు స్పెషల్ టీంలుగా రంగంలోకి దిగారు.. నిన్న రాత్రి నుంచి నరేంద్రతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉన్నారు. నరేంద్ర ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. చదవండి: పెత్తందార్ల పెద్దా.. ఇదేనా మీ బాధ! -
‘సంగం డెయిరీ ప్రస్థానం ఎలా జరిగిందో ప్రజలకు తెలియాలి’
తాడేపల్లి: చిత్తూరు డెయిరీని చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారని, రోజుకు రెండున్నర లక్షల పాలు వచ్చే డెయిరీని అన్యాయంగా మూతేయించారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆ స్థానంలో హెరిటేజ్ డెయిరీని చంద్రబాబు తెచ్చుకున్నారని మంత్రి విమర్శించారు. సంగం డెయిరీని ప్రభుత్వం కచ్చితంగా స్వాధీనం చేసుకుని తీరుతుందని మంత్రి తెలిపారు. సంగం డెయిరీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని మంత్రి ప్రశ్నించారు. ‘ టీడీపీ నేత పట్టాభి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు సంగం డెయిరీ ప్రస్థానం ఎలా జరిగిందో జనానికి తెలియాలి. పాడి రైతుల డబ్బుతో స్థలం కొని డెయిరీ ప్రారంభించారు. మిల్క్ యూనియన్‌కి అధ్యక్షుడైన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కథ నడిపారు. పది ఎకరాల స్థలాన్ని సొంతానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉంటే వాటిని తిరిగి ఇచ్చేసి, కలెక్టర్ దగ్గర నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాకనే మ్యాక్స్ చట్టంలోకి ఏ డెయిరీ అయినా వెళ్తుంది. కానీ అవేమీ జరగకుండానే మ్యాక్స్ చట్టంలోకి తెచ్చి, ఆ తర్వాత సొంతానికి మార్చుకున్నారు. అది కూడా పూర్తిగా చట్ట విరుద్దం. ఎలాంటి ఎన్వోసీలు లేకుండా కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంగం డెయిరీ ని లాగేసుకున్నారు. చిత్తూరు డెయిరీని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. రోజుకు రెండున్నర లక్షల పాలు వచ్చే డెయిరీని అన్యాయంగా మూతేయించారు. పట్టాభి భాషకీ, బాడీ లాంగ్వేజ్ కీ ఏదైనా సంబంధం ఉందా?, సీఎం గురించి ఎక్కువ మాట్లాడితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది జాగ్రత్త. చిత్తూరు డెయిరీని ఎవరు నాశనం చేశారో ముందు అది తెలుసుకో. చంద్రబాబు హయాంలో చాలా ప్రభుత్వ ఆస్థులను ప్రయివేటు పరం చేశారు.పైగా దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు. -
సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు
సాక్షి, గుంటూరు: చంద్రబాబునాయుడు ఒకపథకం ప్రకారం రాష్ట్రంలో సహకార సంఘాల్లో ఉన్న పాల డెయిరీలను తన వాళ్లకు కట్టబెట్టాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం డెయిరీ ప్రభుత్వం ఆస్తి.. అది ప్రజల సొత్తు అని చెప్పారు. ఏ రోజుకైనా సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు పిచ్చెక్కిందని అన్నారు. ఎన్నికల సమయానికి చంద్రబాబు పిచ్చి ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. గతంలో చేసిన పాపాలతో ఇదే కర్మ రా బాబు అని చంద్రబాబు రోడ్ల వెంబడి తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. చదవండి: (అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్) -
‘ధూళిపాళ్ల నరేంద్ర చేయని నేరాలు, ఘోరాలు లేవు’
సాక్షి, గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్ర చేయని నేరాలు, ఘోరాలు లేవని జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక పథకం ప్రకారం సంగం డెయిరీ ఆక్రమించుకున్నాడని దుయ్యబట్టారు. ‘‘జీడీసీసీ బ్యాంకులో రూ.500 కోట్ల అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. దమ్ముంటే అక్రమాలను నిరూపించాలని.. నిరూపిస్తే పాలకమండలి మొత్తం రాజీనామా చేస్తామని సీతారామాంజనేయులు సవాల్ విసిరారు. నిరూపించకుంటే సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్నారు. చదవండి: పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు 2017 నుంచి పథకం ప్రకారం టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకున్నారన్నారు. వారిలో 15 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. బ్యాంకు రుణాలకు సంబంధించిన డేటా ఇవ్వమని ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నాడు. ఆధారాలు లేకుండా ఎలా రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?. గతంలో చింతలపూడి సహకార సంఘం సెక్రటరీని ధూళిపాళ్ల వేధించారు. ఆయన వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారని గుర్తు చేశారు. కోవిడ్ టైమ్‌లో డీవీసీ ఆసుపత్రి ద్వారా ధూళిపాళ్ల రూ.కోట్లు సంపాదించారని రాతంశెట్టి సీతారామాంజనేయులు మండిపడ్డారు. -
రూ.100 కోట్ల భూమి ‘ధూళి’.. పాలు!
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా 80 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది. పాత తేదీలతో తప్పుడు పత్రాలు సృష్టించి మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.100 కోట్ల విలువైన సర్కారు భూమిని తమ కుటుంబం ఆధీనంలోని ప్రైవేట్ ట్రస్ట్‌కు బదలాయించుకుంది. డెయిరీ న్యాయాధికారి వంగల వేణుగోపాలం, అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి గురునాథం ద్వారా ఈ వ్యవహారం నడిపించినట్లు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. వేణుగోపాలాన్ని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేసి విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా ఈ నెల 23 వరకు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పాత తేదీతో తప్పుడు సర్టిఫికెట్.. సంగం డెయిరీ ఆస్తులను స్వాహా చేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం పక్కా ప్రణాళిక రచించింది. నరేంద్ర భార్య జ్యోతిర్మయి చైర్మన్‌గా ఉన్న ట్రస్ట్‌కు ఆస్తులను బదలాయించి కాజేయాలని పథకం వేశారు. 2012 సెప్టెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం సహకార సొసైటీల ఆస్తుల బదలాయింపుపై కొత్త మార్గదర్శకాలను జారీ చేయడం ధూళిపాళ్ల కుటుంబానికి అడ్డంకిగా మారింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సొసైటీ ఆస్తులతో కొత్తగా ప్రొడ్యూసర్ కంపెనీ (ట్రస్ట్గానీ మరేదైనాగానీ) ఏర్పాటు చేయాలంటే జిల్లా సహకార శాఖ రిజిస్ట్రార్ నుంచి ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) పొందడం తప్పనిసరి. డెయిరీ ఆస్తులను తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ ట్రస్ట్‌కు బదలాయించేందుకు 2012 సెప్టెంబర్‌లో ధూళిపాళ్ల కుటుంబం ప్రయత్నించగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి శ్రీకాంత్ అంగీకరించలేదు. ఇందులో ఏదో మతలబు ఉందని గుర్తించి ఫైల్ పెండింగ్‌లో పెట్టారు. ఇది బెడిసికొట్టడంతో ధూళిపాళ్ల కుటుంబం మరో ఎత్తుగడ వేసింది. గుంటూరు జిల్లా సహకార శాఖ అధికారిగా రిటైరైన గురునాథం పేరుతో కథ నడిపించింది. ఇందుకోసం సంగం డెయిరీ న్యాయాధికారి వంగల వేణుగోపాలాన్ని వినియోగించుకుంది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులు ఏవీ లేవని 2011 ఫిబ్రవరి 26వ తేదీతో ఓ తప్పుడు సర్టిఫికెట్ తయారు చేశారు. దానిపై ఫిబ్రవరి 28న రిటైరైన గురునాథం సంతకం ఉంది. తప్పుడు మార్గంలో సృష్టించిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించి ప్రభుత్వానికి చెందిన 80 ఎకరాలను ధూళిపాళ్ల కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు బదిలీ చేసింది. తీగ లాగితే కదిలిన డొంక... సంగం డెయిరీ అక్రమాలపై ఏసీబీ అధికారులు చేపట్టిన విచారణలో ఈ బాగోతం బట్టబయలైంది. డెయిరీ ఆస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయడంలో నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని ఏసీబీ గుర్తించింది. ఆస్తుల బదిలీకి ఎన్వోసీ ఎలా వచ్చిందనే అంశంపై కూపీ లాగడంతో డొంక కదిలింది. అంతకుముందు డెయిరీ ఆస్తుల జాబితాలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా... ట్రస్ట్‌కు బదిలీ చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వ ఆస్తులు లేవని సర్టిఫికెట్ జారీ చేసిన విషయాన్ని గుర్తించారు. ఈ అంశంపై లోతుగా విచారించడంతో అసలు వ్యవహారం బహిర్గతమైంది. గుంటూరు జిల్లా సహకార శాఖ కార్యాలయంలో ఎన్వోసీ జారీకి ముందు ఎలాంటి రిఫరెన్స్ ఫైళ్లు తయారు చేసినట్లు రికార్డుల్లో లేవు. ఇన్వర్డ్, అవుట్ వర్డ్ ఫైళ్ల రికార్డులు లేవు. పాత తేదీతో వంగల వేణుగోపాలం తయారు చేసిన సర్టిఫికెట్‌పై అప్పటికే రిటైరైన గురునాథం సంతకం చేశారని వెల్లడైంది. ఈ మేరకు సంగం డెయిరీ రికార్డులను పూర్తి ఆధారాలుగా ఏసీబీ అధికారులు సేకరించారు. -
జీవో 19 అమలు నిలుపుదల సబబే
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 27న జారీచేసిన జీవో 19 అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సమర్థించింది. ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడుతూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. స్థిర, చరాస్తులను విక్రయించడం, బదలాయించడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం వంటివి కోర్టు అనుమతి లేకుండా చేయరాదని సంగం డెయిరీ యాజమాన్యాన్ని సింగిల్ జడ్జి ఆదేశించారని గుర్తుచేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంది. ఈ కారణాలరీత్యా ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. తమ ఫిర్యాదు మేరకే సంగం డెయిరీపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, అయితే సింగిల్ జడ్జి తమ వాదనలు వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారంటూ గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా ధర్మాసనం కొట్టేసింది. జీవో 19ని సవాలు చేస్తూ సంగం డెయిరీ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ఈ సంఘం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ సింగిల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉందని, ఈ ఉత్తర్వుల్లో తమ అభిప్రాయాలకు ప్రభావితం కాకుండా దాన్ని విచారించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పులు చెప్పింది. -
ప్రభుత్వ అప్పీల్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలకు సంబంధించి ఇటీవల సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ గత నెల 27న జారీచేసిన జీవో 19 అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 7న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి అసలు సంగం డెయిరీ ఎలా ఏర్పాటైందన్న కీలక అంశాన్ని తేల్చ కుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చారన్నారు. డెయిరీ యాజ మాన్య హక్కుల గురించి తేల్చేదిశగా విచారణ జరపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. సంగం డెయిరీ మోసపూరిత చర్యలను తేల్చకుండా ప్రభుత్వ అధికారంపై ఉత్తర్వులిచ్చారని వివరించారు. అన్ని రకాలుగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు తప్పు అని పేర్కొన్నారు. -
Dhulipalla Narendra: సాక్షులను ప్రభావితం చేస్తున్నారుగా?
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు సోమవారం విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఒక రోజు ముందు నోటీసు ఇచ్చి విచారణ కోసం విజయవాడలోని బస్ భవన్లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 8 గంటల పాటు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించనని చెబుతూ బెయిల్ పొందిన ధూళిపాళ్ల.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. సంగం డెయిరీ డైరెక్టర్లతో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించడం బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకమైన డెయిరీ డైరెక్టర్లతో సమావేశం కావడమంటే.. వారిని ప్రభావితం చేసేందుకేనని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ధూళిపాళ్లను ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు డెయిరీ వ్యవహారాల్లో ధూళిపాళ్ల కుటుంబం పాల్పడిన అక్రమాలపై ఏసీబీ ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది. వాటి ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. సహకార చట్టం నిబంధనలకు విరుద్ధంగా డెయిరీకి చెందిన 10 ఎకరాలను తన కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేయడం, ఫోర్జరీ పత్రాలతో రూ.153 కోట్లు రుణాలు తీసుకుని దారి మళ్లించడం, ఇటీవల డెయిరీ ఖాతాల నుంచి రూ.50 కోట్లు ట్రస్టుకు మళ్లించడం మొదలైన విషయాలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టయినప్పుడు విచారణలో ధూళిపాళ్ల చెప్పినదానికి, ప్రస్తుత విచారణలో చెబుతున్నదానికి పొంతన లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. నిధులు మళ్లించలేదని ధూళిపాళ్ల మొదట్లో వాదించారు. కాగా ఏసీబీ అధికారులు తాజా విచారణలో ఆధారాలు చూపించి మరీ ప్రశ్నించడంతో కంగుతిన్నారు. దీంతో ఆ నిధుల మళ్లింపునకు ఏవేవో కారణాలు చెబుతూ తన చర్యను సమర్థించుకునేందుకు విఫలయత్నం చేసినట్టు సమాచారం. కానీ సహకార చట్టం నిబంధనలను ఏసీబీ అధికారులు గట్టిగా ప్రస్తావించడంతో ఆయన చాలాసేపు మౌనం వహించారని తెలుస్తోంది. -
Dhulipalla Narendra Kumar: ధూళిపాళ్లపై ఈడీ కన్ను
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ కుంభకోణం కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఆయన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల తమ కుటుంబ ట్రస్టుకు బదిలీ చేసి భారీ అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ పక్కాఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు సొంత పార్టీలోనే ధూళిపాళ్లకు పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. దశాబ్దాలుగా కష్టపడ్డవారిని విస్మరించిన ఆయన తన స్వార్థం చూసుకున్నారని గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. ఆయనకు ఏ విధంగానూ సహకరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆయనకు అండగా నిలబడకుండా తూతూమంత్ర పరామర్శలతో సరిపెడుతున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆధారాల సేకరణ వందల కోట్ల విలువైన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం కొల్లగొట్టిన ఉదంతంపై ఈడీ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఫోర్జరీ పత్రాలతో భారీ మొత్తాల్లో రుణం తీసుకోవడం, వాటికి లెక్కాపత్రం లేకపోవడంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే తక్షణం రంగంలోకి దిగి ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రస్టుకు వచ్చిన నిధులను నరేంద్ర దారి మళ్లించి ‘బ్లాక్’ చేసినట్లు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభించాయి. ► సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 10 ఎకరాలను ధూళిపాళ్ల తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా బదిలీ చేయడం సహకార చట్టంలోని 439 నిబంధనకు విరుద్ధమని ఈడీ గుర్తించింది. ఆ భూముల్లో తమ కుటుంబ ట్రస్ట్ పేరిట ఓ కార్పొరేట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా తేల్చింది. ధూళిపాళ్ల భార్య జ్యోతిర్మయి ఆ ఆస్పత్రికి ఎండీగా ఉన్న విషయం గమనార్హం. ► సహకార సొసైటీని కంపెనీగా మార్చాలంటే ముందు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించడంతోపాటు ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చేసి నిరభ్యంతర పత్రం పొందాలి. ఈ నిబంధనలను కూడా ధూళిపాళ్ల పట్టించుకోలేదు. ► ఫోర్జరీ పత్రాలతో ధూళిపాళ్ల జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నుంచి రూ.115.58 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులను తమ కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేసినట్టు కూడా ఈడీ గుర్తించింది. ► సంగం డెయిరీ నిధులతో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలను ధూళిపాళ్ల హస్తగతం చేసుకున్న విషయంపై ఈడీ కూపీ లాగుతోంది. ► సంగం డెయిరీ చైర్మన్‌గా ఉంటూనే సహకార చట్టాలకు విరుద్ధంగా ధూళిపాళ్ల సొంతంగా మిల్క్‌లైన్ అనే డెయిరీని నెలకొల్పడం, అనంతరం దానికి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేయడంపై కూడా దృష్టి సారించింది. ► తాజాగా డెయిరీ నిధులు రూ.50 కోట్లను ధూళిపాళ్ల తమ సొంత ట్రస్ట్‌కు బదిలీ చేసిన విషయాన్నీ ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ పాల్పడి అక్రమాలకు పాల్పడ్డ ధూళిపాళ్ల నరేంద్రపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఈడీ సమాయత్తమవుతోందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. ► సుదీర్ఘకాలంగా డెయిరీలో పనిచేస్తున్న ముఖ్యులను కాదని.. నిబంధనలకు విరుద్ధంగా నిధులను దారి మళ్లించడంతో వారంతా నరేంద్ర పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈడీ జోక్యం చేసుకోనున్న నేపథ్యంలో వారంతా మౌనాన్ని ఆశ్రయించడం మేలనే భావనలో ఉన్నారు. ధూళిపాళ్లపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత మరోవైపు ధూళిపాళ్లకు సొంత పార్టీ టీడీపీలోనే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం పొన్నూరుతో సహా గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలిచేందుకు ఏమాత్రం సుముఖత చూపించడం లేదు. భారీ అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా దొరికిన ఆయనకు ఈ కేసులో శిక్ష పడటం ఖాయమని టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇక ఆయన అక్రమాలపై తాజాగా ఈడీ కూడా దృష్టి సారించడంతో టీడీపీలో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో ధూళిపాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చదవండి: ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు -
లోతుగా విచారణ జరపాల్సిన అవసరముంది
సాక్షి, అమరావతి: సంగం డెయిరీకి సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై లోతుగా విచారణ జరపాల్సిన అవసరముందని.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం కోరినట్లుగా సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తే జీవో 19 అమల్లోకి వస్తుందని.. అందువల్ల పూర్తి విచారణ జరపకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సంగం డెయిరీని ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ గత నెల 27న జారీ చేసిన జీవో 19 అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల రద్దు కోరుతూ పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇటీవల హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రజల ఆస్తులు ప్రైవేటు చేతుల్లో ఉండకూడదనే.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో 19 ఇచ్చినట్లు తెలిపారు. సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో తాము ప్రస్తావించిన తీర్పుల గురించి కూడా రాయలేదని తెలిపారు. సంగం డెయిరీ పలు ఉల్లంఘనలకు పాల్పడిందని వివరించారు. న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ జోక్యం చేసుకుంటూ.. తాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంగం డెయిరీపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. తమ వాదనలు వినాలని కోరినా సింగిల్ జడ్జి పట్టించుకోలేదని తెలిపారు. జీవో 19ని నిలుపుదల చేయడమంటే అక్రమాలను సమర్ధించినట్లవుతుందన్నారు. సింగిల్ జడ్జి వద్ద తాము వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై పిటిషనర్ కూడా అభ్యంతరం తెలపలేదన్నారు. సంగం డెయిరీ న్యాయవాది ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ.. తాము అభ్యంతరం తెలిపామని చెప్పారు. దీన్ని ప్రభునాథ్ ఖండించారు. ఈ సమయంలో ఇద్దరు న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ.. న్యాయవాదులు ప్రతి కేసులో ఇలా వాగ్వాదానికి దిగడం సరికాదని హితవు పలికింది. ఏజీ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ.. కొందరు న్యాయవాదులు తీవ్ర స్వరంతో కోర్టులను శాసిస్తున్నట్లు మాట్లాడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది. ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా సంగం డెయిరీలో ఆస్తుల బదలాయింపుతో పాటు ఇతర అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఏసీబీని ఆదేశించింది. డెయిరీ ఆస్తుల బదలాయింపుపై నోటీసులు తదుపరి విచారణ 20కి వాయిదా ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆస్తులను గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(అమూల్)కు అప్పగిస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 4న చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి మండలి తీర్మానాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించడంతో పాటు ప్రభుత్వం గతేడాది జారీ చేసిన జీవో 25ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేశారు. దీనిని ధర్మాసనం సోమవారం విచారించింది. -
‘సంగం’ కేసులో దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు నో
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాలపై ఏసీబీ చేపట్టిన దర్యాప్తు ప్రక్రియను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆ కంపెనీ ఎండీ గోపాలకృష్ణన్ కస్టడీ విషయంలో చట్ట నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టును శుక్రవారం ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకురావొచ్చని తెలిపింది. కంపెనీకి సంబంధించిన వ్యాపార వివరాలు, పాల ఉత్పత్తిదారుల వివరాలు కంపెనీ ప్రాంగణం దాటి బయటకు వెళ్లకూడదని దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసింది. కంపెనీ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దంది. ఏ రోజు చేసిన దర్యాప్తు వివరాలు ఆ రోజు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో పంచనామా రూపంలో రికార్డ్ చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అధికారులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. -
రైతుల లాభాలన్నీ ధూళిపాళ్ల జేబులోకే..
సాక్షి, అమరావతి: రైతుల కష్టార్జితమైన సంగం డెయిరీని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర తన సొంత ఆస్తిగా మలుచుకున్నాడని, రైతులకు దక్కాల్సిన లాభాలను తన జేబుల్లో నింపుకొన్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య ధ్వజమెత్తారు. దోపిడీదారుడిని అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ అర్హులైన రైతులు అందరికీ ఈ నెల్లో మరోసారి రైతు భరోసా జమ చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 18 వేల కోట్లు రైతు శ్రేయస్సుకు వెచ్చించిందని, రైతు భరోసా కేంద్రాలు, ఇన్పుట్ సబ్సిడీలు.. అన్నీ సమకూర్చడం వంటివి రైతులపై వైఎస్ జగన్ ప్రేమకు నిదర్శనమన్నారు. ఆయన ఇంకేమన్నారంటే.. ధూళిపాళ్ల మోసం చెప్పరేం? సంగం డెయిరీని అమూల్‌కు కట్టబెడుతున్నారని ఆరోపించే టీడీపీ నేతలు.. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన మోసమేంటో ప్రజలకు చెప్పకపోవడం దారుణం. 1977లో రైతుల కృషితో రూపుదిద్దుకున్న ఈ డెయిరీని ధూళిపాళ్ల దొడ్డిదారిన హస్తగతం చేసుకున్నారు. సహకార చట్టం ప్రకారం రెండేళ్లు డెయిరీకి పాలుపోస్తేనే డైరెక్టర్‌గా ఎన్నికయ్యే అర్హత ఉంటుంది. ఇవేవీ లేకుండా నరేంద్ర చైర్మన్ అయ్యారు. సహకార డెయిరీని సొంత వ్యాపార సంస్థగా మార్చారు. అసలు సహకార డెయిరీలను నిర్వీర్యం చేసింది టీడీపీ కాదా? చిత్తూరు డెయిరీని మూసేసి హెరిటేజ్‌ను లాభాల్లోకి తెచ్చుకున్నారు. దీనివల్ల చంద్రబాబు రూ. వేల కోట్లు సంపాదించారు. డీవీసీ ట్రస్టు పేరుతో అక్రమాలు రైతులకు చెందాల్సిన సంగం డెయిరీ లాభాలను ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) ట్రస్టుకి నరేంద్ర మళ్లిస్తున్నారు. లాభాలు ప్రకటించే ముందే సొసైటీల దగ్గర్నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారు. బోనస్‌ను రైతు ఖాతాల్లో వేసి, తర్వాత డీవీసీ ట్రస్టుకు మళ్లించారు. సంవత్సరానికి రూ. 50 వేలు లాభాలుండని సొసైటీలు డీవీసీ ట్రస్టుకు రూ. లక్షల్లో చందాగా ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే రైతుల లాభాలు ధూళిపాళ్ల కాజేస్తున్నట్టా? కాదా? అసలు సంగం డెయిరీకి, డీవీసీ ట్రస్టుకు సంబంధమేంటి? డెయిరీ నుంచి వచ్చే లాభాల్లో 3 నుంచి 5 శాతం ట్రస్టుకు ఇవ్వొచ్చని తీర్మానం చేశారు. ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా అక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అవినీతి నిరోధక సంస్థకు తెలియజేయడం నా బాధ్యత. టీడీపీ హయాంలో మూతపడ్డ సహకార డెయిరీలను అమూల్ సంస్థ ద్వారా మళ్లీ దారికి తెస్తుంటే తప్పుబట్టడం శోచనీయం. సంగం డెయిరీని కూడా సహకార సంఘం కిందకు తీసుకొచ్చేలా, రైతులకు ఉపయోగపడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. -
ఆ ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయించండి
సాక్షి, అమరావతి/కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించాలని హైకోర్టు బుధవారం ఏసీబీ, రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించింది. ఒకవేళ వారికి కోవిడ్ నిర్ధారణ అయితే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. సంగం డెయిరీ అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఎండీ గోపాలకృష్ణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు బుధవారం విచారణ జరిపారు.ఏసీబీ తరఫు న్యాయవాది గాయత్రీరెడ్డి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని, అందువల్ల విచా రణను వేసవి సెలవుల తరువాత చేపట్టాలని అభ్యర్థించారు. ధూళిపాళ్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఎండీ గోపాలకృష్ణన్‌కు కరోనా సోకిందన్నారు. మిగిలిన ఇద్దరు కూడా జైల్లో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆయుష్కు గోపాలకృష్ణన్ తరలింపు.. సంగం డెయిరీ అక్రమాల కేసు ఏ2 నిందితుడు గోపాలకృష్ణన్‌ను వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడలోని ఆయుష్‌కి తరలించామని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆయన ‘వైరల్ బ్రాంకో న్యూమోనియా’తో బాధపడుతున్నట్లు తెలిపారని చెప్పారు. -
రైతులకు లాభం రావడం టీడీపీకి ఇష్టం లేదు
తాడేపల్లి: టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సంగం డెయిరీ రైతులను నిలువు దోపిడీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఆయనపై ధ్వజమెత్తారు. మూత పడిన డైరీలను తెరిపించే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంటే అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తున్నారు. అసలు డైరీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. బషీర్ బాగ్ ఘటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు, అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. రైతు భరోసాతో రైతులను అదుకుంటున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. ఆముల్ సంస్థకు కట్టబెడుతున్నాం అంటున్నారు... కానీ సంగం డెయిరీలో ఎమీ జరిగిందో మాత్రం బయటికి చెప్పరు. రైతులు స్థాపించిన సంగం డెయిరీకి దొడ్డి దారిన ధూళిపాళ్ల చైర్మన్ అయిన సంగతి అందరికీ తెలుసు. దాన్ని సొంత వ్యాపార సంస్థగా మార్చుకున్నారు...వచ్చిన లాభాలను రైతులకు చెందకుండా కాజేస్తున్న వ్యక్తి ధూళిపాళ్ల. డెయిరీలను నాశనం చేసింది మీరు కదా.. చిత్తూరు డెయిరీ నాశనం చేసి హెరిటేజ్ స్థాపించలేదా? అన్నారు. టీడీపీ అధినేత బాటలోనే ధూళిపాళ్ల నడిచారు. సంగం డెయిరీకి వచ్చిన లాభాలను ధూళిపాళ్ల వీరయ్య చౌదరీ ట్రస్ట్ కి బదిలీ చేసుకున్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఒక్కో సొసైటీకి 40 వేలు లాభం వస్తే లక్షల రూపాయలు ట్రస్ట్ కి డొనేట్ చేస్తున్నారు. ట్రస్ట్ కింద ఒక కార్పొరేట్ ఆస్పత్రి కట్టి దానికి ట్రస్టీగా నరేంద్ర ఉన్నారు. డెయిరీ సొమ్ముతో ఆస్పత్రి కట్టి దానికి ట్రస్టీగా ఎలా ఉంటావ్ చెప్పాలని ప్రశ్నించారు. సంగం డెయిరీ పాలరైతులు నిలువున దోపిడీకి గురయ్యారు. వైఎస్ జగన్ రైతులకు రూ.4 ధర పెంచి మేలు చేశారు. నరేంద్ర, చంద్రబాబు లాంటి వాళ్ళు ఉంటే ఆముల్ సంస్థ ఆ స్థాయికి ఎదిగేది కాదు అని విమర్శించారు. అందుకే అక్కడ జరిగిన అక్రమాలను ఏసీబీ దృష్టికి తీసుకొచ్చా రైతులకు మేలు జరగాలని ఆముల్ తో ఒప్పందం చేసుకుంటే ఏదేదో మాట్లాడతారు. పాడి రైతుల లాభాల కోసం మూతపడిన వాటిని ఆముల్ కి అప్పజెప్తున్నాం. రైతులకు లాభం రావడం, మూతపడిన వాటిని తెరిపించడం టీడీపీ వారికి ఇష్టం లేదు అని మండిపడ్డారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: దిక్కుతోచని స్థితిలో టీడీపీ.. -
సంగం డెయిరీలోని దోపిడీలను అరికట్టాలి
-
నరేంద్ర తదితరుల విచారణకు ఏసీబీకి హైకోర్టు అనుమతి
సాక్షి అమరావతి: సంగం డెయిరీ అక్రమాలకు సంబంధించి టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్, సహకారశాఖ మాజీ ఉద్యోగి గురునాథంలను ఏసీబీ అధికారులు ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటినుంచి నరేంద్రను 3 రోజులు, గోపాలకృష్ణన్‌ను రెండురోజులు, గురునాథంను ఒకరోజు విచారించవచ్చని ఏసీబీ అధికారులకు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ధూళిపాళ్ల నరేంద్ర తదితరులను సంగం అక్రమాల కేసులో విచారించాల్సి ఉందని, అందువల్ల వారిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు నరేంద్ర తదితరులను 5 రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి.. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తి.. ధూళిపాళ్ల తదితరుల విచారణకు ఏసీబీకి అనుమతి ఇచ్చారు. జీవో 19పై ముగిసిన వాదనలు మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 19ని సవాలు చేస్తూ సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ధర్మారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు నిన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారమే జీవో ఇచ్చామన్నారు. షరతులకు అనుగుణంగా నడుచుకోకుండా, నిబంధనలను ఉల్లంఘించినందునే సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. దీనివల్ల పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్దంగా 10 ఎకరాల భూమిని ఆస్పత్రి నిర్మాణం నిమిత్తం ట్రస్ట్‌కు బదిలీ చేశారని తెలిపారు. డెయిరీ విషయంలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయన్నారు. అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని, మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని చెప్పారు. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. స్వాధీన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
సంగం డెయిరీ కార్యకలాపాలు యథాతథం
సాక్షి, అమరావతి: సంగం డెయిరీలో రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సుమారు లక్షమంది పాల ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.14 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జీతభత్యాలను డెయిరీలో పనిచేస్తున్న 771 మంది పర్మినెంట్ ఉద్యోగులకు ఇప్పటికే చెల్లించామని, 415 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల 4వ తేదీన చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. సోమవారం డెయిరీకి 4.96 లక్షల లీటర్ల పాలు వచ్చాయని, వాటిని ప్రాసెస్ చేసి యథావిధిగా మార్కెటింగ్ చేశామని తెలిపారు. సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా జరుగుతున్నందున పాల ఉత్పత్తిదారులు, కాంట్రాక్టర్లు, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. -
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడీకి హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి : సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆయనను మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. సంగం డెయిరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరుతూ ఏసీబీ హై కోర్టును ఆశ్రయించారు. ధూళిపాళ్ల నరేంద్రను కోర్టు మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటుగా ఏ2 గోపాలకృష్ణను రెండురోజులపాటు, ఏ3 గురునాథంను ఒకరోజు పాటు హైకోర్టు కస్టడీకి అప్పగించింది. చదవండి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ -
Dhulipalla Narendra: ముగ్గురూ.. ముగ్గురే
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు నిందితులపై నేర నిరూపణకు అవసరమైన పక్కా కార్యాచరణతో మరింత లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ఏ–1, ఏ–2, ఏ–3 నిందితులుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ప్రస్తుత ఎండీ పి.గోపాలకృష్ణన్, జిల్లా సహకార శాఖ మాజీ అధికారి (రిటైర్డ్ డీసీవో) ఎం.గురునాథంలను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో మాజీ ఎండీ కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు మరికొందరు నిందితులుగా ఉన్నారు. సంగం డెయిరీలో 1994 నుంచి 2000 వరకు జరిగిన అక్రమాలు, అవకతవకలకు సంబంధించి కీలక ఆధారాలను ఏసీబీ సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. డెయిరీకి చెందిన ప్రభుత్వ ఆస్తులను కొట్టేసే భారీ స్కెచ్‌లో ఆ ముగ్గురూ ఎవరి పాత్ర వారు పోషించినట్టు నిగ్గు తేలుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురి పాత్రపై ఏసీబీ సేకరించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి. అప్పనంగా కట్టబెట్టేశారు రెండో ప్రధాన నిందితుడైన గోపాలకృష్ణన్ సహకార నిబంధనలను, చట్టాలను పట్టించుకోకుండా డెయిరీకి చెందిన పదెకరాల ప్రభుత్వ భూమిని ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ట్రస్ట్‌కు బదలాయించేశారు. ఆ భూమిని సంగం డెయిరీ అభివృద్ధి కోసం గతంలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీడీడీసీ) మిల్క్ కమిషనర్ పేరుతో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన భూమి. మూడో ప్రధాన నిందితుడైన గురునాథం సంగం డెయిరీని సహకార రంగం నుంచి కంపెనీగా మార్చేందుకు జరిగిన కుట్రలో కీలకమైన నకిలీ నిరభ్యంతర ధృవపత్రం (ఎన్వోసీ) సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారు. ఏదైనా సహకార సంఘం కంపెనీగా మారాలంటే ప్రభుత్వం భూములు, నిధులు వెనక్కి అప్పగించడంతోపాటు జిల్లా సహకార అధికారి (డీసీఓ) నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే గురునాథం పోర్జరీ వ్యవహారం జరిగింది. కంపెనీగా మార్చేందుకు 2011 సెప్టెంబర్ 24న తీర్మానం చేస్తే అంతకు ఏడు నెలల ముందు అంటే అదే ఏడాది ఫిబ్రవరి 26న గురునాథం ఫోర్జరీ ఎన్వోసీ సృష్టించారు. నా తరువాత రెండు రోజులకే ఆయన రిటైరయ్యారు. ఇలా సృష్టించిన ఎన్వోసీని జతచేసి 2012 సెప్టెంబర్‌లో కంపెనీగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు దరఖాస్తు చేసి 2013 జూన్ 18న ధూళిపాళ్ల సొంత కంపెనీగా మార్చేసుకున్నారు. తండ్రి పేరిట భూములు కొట్టేసిన ధూళిపాళ్ల 1973లో ఏర్పాటైన సంగం డెయిరీకి 1992లో ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్ అయ్యారు. 1994 నుంచీ అక్రమాలకు తెరతీశారు. తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. డెయిరీ ఆస్తులను సొంత ప్రయోజనాలకు దారి మళ్లించేలా స్కెచ్ వేసి 10 ఎకరాలను సొంతం చేసుకున్నాడు. నిధుల దుర్వినియోగం, పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడటం వంటి తీవ్రమైన అభియోగాలు సైతం ధూళిపాళ్లపై ఉన్నాయి. డెయిరీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో పదెకరాలను సొంత ట్రస్ట్‌కు మళ్లించి.. ఫోర్జరీ పత్రాలతో ఎన్డీడీబీ నుంచి రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ భూమిలో సొంతంగా ఆస్పత్రి నిర్మించుకున్నారు. అంతేకాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడి సహకార డెయిరీని తన కంపెనీగా మార్చుకున్నాడు. తద్వారా డెయిరీకి, ప్రభుత్వానికి చెందిన దాదాపు రూ.700 కోట్ల విలువైన 72.54 ఎకరాలను, ఇతర ఆస్తులను సొంతం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేశాడు. రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల హైకోర్టు ఆదేశాల మేరకు సంగం డెయిరీ అక్రమాల కేసులో నిందితులైన ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్, గురునాథంలను ఏసీబీ అధికారులు ఆదివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, హౌస్‌మోషన్ రూపంలో దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు శనివారం రాత్రి ఏసీబీ కస్టడీని రద్దు చేసింది. దీంతో తొలి రోజు విచారణ అనంతరం ముగ్గురు నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు ఆదివారం అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి అప్పగించారు. కాగా, కేసు దర్యాప్తు సమాచారాన్ని ఏ మీడియా సంస్థలకు తాము ఇవ్వలేదని ఏసీబీ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వార్తలను కొన్ని పత్రికలు ప్రచురించాయని, దీనివల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అనధికార సమాచారాన్ని ప్రచురించవద్దని కోరింది. -
డెయిరీ భూముల్ని సొంత ట్రస్ట్‌కు ఎందుకు మళ్లించారు!
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: సంగం డెయిరీకి చెందిన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా సొంత ట్రస్ట్‌కు ఎందుకు మళ్లించారని సంబంధిత కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రశ్నించారు. ‘రూ.కోట్ల విలువైన డెయిరీ ఆస్తులను కాజేసేందుకు పథకం ప్రకారం పోర్జరీ పత్రాలు సృష్టించింది నిజం కాదా? మీరు చేసిన అక్రమాల్లో ఎవరికి ఎటువంటి లబ్ధి కలగజేశారు? విచారణలో వాస్తవాలు చెప్పి కేసు దర్యాప్తునకు సహకరించండి’ అంటూ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో శనివారం ఈ విచారణ సాగింది. సంగం డెయిరీ అక్రమాల కేసులో లోతైన దర్యాప్తుకోసం రిమాండ్‌లో ఉన్న ఏ1, ఏ2, ఏ3 నిందితులు ధూళిపాళ్ల, గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు తమ కస్టడీకివ్వాలని ఏసీబీ కోరగా.. కోర్టు అనుమతివ్వడం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణ, గురునాథంలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ముందు జాగ్రత్తచర్యగా ముగ్గురు నిందితులకు పీపీఈ కిట్లు వేసి విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విచారణ నిర్వహించారు. డెయిరీభూములను ట్రస్ట్‌కు మళ్లించటం, ఫోర్జరీ పత్రాలు సృష్టి అనే కీలక అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. నిందితులు ముగ్గురూ మితంగానే బదులిచ్చినట్టు సమాచారం. నిందితుల విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ధూళిపాళ్ల నరేంద్రను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు వచ్చారు. ఆయన్ను కలిసేందుకు అనుమతించాలంటూ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొలిరోజున విచారణ అనంతరం నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఏసీబీ ఉత్తర్వుల అమలు నిలిపివేత.. ఇదిలా ఉంటే.. ధూళిపాళ్ల నరేంద్రతోపాటు గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. నరేంద్ర తదితరులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. తమను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్ రూపంలో పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.