
సాక్షి, అమరావతి: సంగం డెయిరీలో రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సుమారు లక్షమంది పాల ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.14 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
ఏప్రిల్ నెలకు సంబంధించి జీతభత్యాలను డెయిరీలో పనిచేస్తున్న 771 మంది పర్మినెంట్ ఉద్యోగులకు ఇప్పటికే చెల్లించామని, 415 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల 4వ తేదీన చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. సోమవారం డెయిరీకి 4.96 లక్షల లీటర్ల పాలు వచ్చాయని, వాటిని ప్రాసెస్ చేసి యథావిధిగా మార్కెటింగ్ చేశామని తెలిపారు. సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా జరుగుతున్నందున పాల ఉత్పత్తిదారులు, కాంట్రాక్టర్లు, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment