అవినీతి అనకొండ | Former MLA Dhulipalla Narendra corruption | Sakshi
Sakshi News home page

అవినీతి అనకొండ

Published Thu, Mar 7 2024 4:46 AM | Last Updated on Thu, Mar 7 2024 4:46 AM

Former MLA Dhulipalla Narendra corruption  - Sakshi

కబ్జాలకు పెట్టింది పేరు.. ధూళిపాళ్ల తీరు!

గ్రావెల్, ఇసుక తవ్వకాలతో అడ్డగోలుగా దోపిడీ  

సంగం డెయిరీనీ సొంత ఆస్తిగా మార్చేసిన నేత 

దాని ప్రాంగణంలో తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణం 

దేవదాయ భూముల్నీ వదల్లేదు.. 

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంలో దిట్ట  

సుద్దపల్లి చెరువును క్వారీగా మార్చేందుకు యత్నం 

తిరగబడిన స్థానికులపై ఎస్సీఎస్టీ కేసులు 

ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా  ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్‌ దేనినీ వదల్లేదు.  ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే రోశయ్యపై శ్వేతపత్రం అంటూ  హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. 

సాక్షి ప్రతినిధి, గుంటూరు:   నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తూళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్‌ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం.

ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్‌ కోసం అనుమతులు తీసుకుంటే అయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటాను దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్ని కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్ని కూడా దక్కించుకున్నారు.

గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్‌ వర్క్‌ పనులకు గ్రావెల్‌ తరలించే కాంట్రాక్టు దక్కించుకొని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్‌ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు.  

సంగం ఆస్తులు స్వాహా..
పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మించారు.  

చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలో కొనసాగింది. తరువాత ఎన్టీఆర్‌ హయాంలో 1995లో మ్యాక్స్‌ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిషీలో ఉండేది.  

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. 

విలువైన భూములూ హాంఫట్‌..: అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించారు.

పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభవృద్ధిని పట్టించుకోలేదు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే  ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.   

కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట..: పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో  ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో  నలుగురు ఎంపీలు ఇచ్చిన నిధులు రూ. 23 కోట్లతో 2003లో కల్యాణ మండపాన్ని నిర్మించారు.  ఇలా నిర్మించిన ఏ నిర్మాణాలైన పంచాయతీ, మున్సిపాలిటీ ఆదీనంలోనే ఉండాలి. అయితే ఈ కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి  భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement