dhulipalla narendra
-
ధూళిపాళ్ల నరేంద్రకు చంద్రబాబు మొండిచేయి..
-
గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్
-
పా‘పాల’ ధూళిపాళ్ల..‘అవినీతి అనకొండ’
ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్ దేన్నీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే కిలారి రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500 కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే ఆయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటా దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్నీ కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్నీ కబళించారు. గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ వర్క్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్టు దక్కించుకుని చేబ్రోలు మండలంలోని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. సంగం ఆస్తులు స్వాహా.. ► పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. ► చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆ«దీనంలో కొనసాగింది. తరువాత 1995లో చంద్రబాబు హయాంలో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిïÙలో ఉండేది. ► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. విలువైన భూములూ హాంఫట్... అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజి్రస్టేషన్ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదు. 2019 లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే ఏం చేయాలో పాలుపోక ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో కల్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. ఆ సమయంలో నలుగురు ఎంపీలు ఈ కల్యాణ మండప నిర్మాణానికి వారి ఎంపీ నిధులు కింద రూ. 23 కోట్లు మంజూరు చేశారు. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా నిర్మించిన ఏ నిర్మాణాలైనా పంచాయతీ, మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉండాలి. కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి చైర్మన్‌గా వ్యవహరిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఏసీబీ కేసులో అరెస్ట్ ► సంగం డెయిరీలో జరిగిన అవకతవకలపై క్రైం నెంబర్– 02/ ఖఇౖ– ఎNఖీ– అఇఆ/2021తో 408, 409, 418, 420, 465, 471, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ, సెక్షన్ 13 (1) ( ఛి)( ఛీ) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఏసీబీ కేసు నమోదు చేసింది. పొన్నూరు నియోజకవర్గ చింతలపూడి గ్రామంలో ఆయన స్వగృహంలో ఉండగా ఏసీబీ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసింది. ► సంగం డెయిరీలో పాలవిక్రయాలపై 14% బోనస్ చెల్లించాలని కోరిన పాడి రైతులపై దాడి చేసినందుకు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో 15–11–2023న ఎఫ్ఐఆర్ నెంబర్ 286/2023తో ధూళిపాళ్లపై 143,147,148, 427,324,384,506,109,307 ట/ఠీ149 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. దీనిలో ఆయన 14వ ముద్దాయిగా ఉన్నారు. ► పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈఓ కార్యాలయం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా వచ్చి ఆందోళనలకు దిగారని ఈవో ధూళిపాళ్ల నరేంద్రపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ► కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సంగం డెయిరీకి చెందిన 20 మందితో కలిసి హోటల్లో మీటింగ్ నిర్వహించినందుకు గుంటూరు ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
30 లక్షలు విలువచేసే సైకిళ్ళు పంపిణీకి సిద్ధం చేసిన టీడీపీ అభ్యర్థి
-
ధూళిపాళ్ల బరితెగింపు
-
సొంత అభివృద్ధి తప్ప, నియోజకవర్గం అభివృద్ధి పట్టించుకున్నావా ?
-
అవినీతి అనకొండ
ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ‘ధూళి’ కమ్మేసింది. వరుసగా ఐదుసార్లు ప్రజా ప్రతినిధిగా గెలిపించిన అక్కడి ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. ఇసుక, గ్రావెల్, మెటల్ దేనినీ వదల్లేదు. ‘సంగం డెయిరీ’ని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనా దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎమ్మెల్యే రోశయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. ఇదీ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టా. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నరేంద్ర ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్వారీలు, రీచ్‌ల్లో అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్నారు. తూళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కాసులు కాజేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ఈయన సోదరులే కీలకం. ఇసుక రీచ్‌లపైనే ఆయన సుమారు రూ.500కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిదో అర్థమవుతుంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే అయన్ను బెదిరించి లాభాల్లో 40 శాతం వాటాను దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్ని కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుడిని బెదిరించి దాన్ని కూడా దక్కించుకున్నారు. గుంటూరు నుంచి తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ వర్క్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్టు దక్కించుకొని శేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, శేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. సంగం ఆస్తులు స్వాహా.. పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (సంగం డెయిరీ) మొదట్లో 1964 సహకార చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలో కొనసాగింది. తరువాత ఎన్టీఆర్ హయాంలో 1995లో మ్యాక్స్ చట్టంలోకి వచ్చిన తరువాత కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుత్తాధిపత్యం పాలకవర్గం అజమాయిషీలో ఉండేది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీ యాక్ట్‌లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి పది ఎకరాల డెయిరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. విలువైన భూములూ హాంఫట్..: అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని ప్రాంతంలో రూ. కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రెండు, మూడు చేతులు మార్చినట్లుగా డాక్యుమెంటు నంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు. పొన్నూరు దేవదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజికవర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభవృద్ధిని పట్టించుకోలేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోశయ్య నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతుంటే ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. కల్యాణ మండపం నిర్వహణతో కాసుల వేట..: పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డుపక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో నలుగురు ఎంపీలు ఇచ్చిన నిధులు రూ. 23 కోట్లతో 2003లో కల్యాణ మండపాన్ని నిర్మించారు. ఇలా నిర్మించిన ఏ నిర్మాణాలైన పంచాయతీ, మున్సిపాలిటీ ఆదీనంలోనే ఉండాలి. అయితే ఈ కల్యాణ మండపానికి నరేంద్ర తల్లి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. -
చంద్రబాబు లాగా ఆ లక్షణం నాకు లేదు: మంత్రి గుడివాడ అమర్నాథ్
-
సీఎం జగన్ కుర్చీలో నేను కూర్చోలేదు.. ధూళిపాళ్లకు దిమ్మతిరిగే కౌంటర్
-
గ్రావెల్ మీద ధూళిపాళ్ల దొంగ ఏడుపు ఏడుస్తున్నారు
-
AP: టీడీపీ కార్యకర్తలకే ‘ధూళిపాళ్ల’ టోపీ
సాక్షి, ఏలూరు : రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వకుండా శఠగోపం పెట్టారు. పైగా న్యాయం అడిగిన వారిపై దాడులు చేయించారు. ఆ పచ్చ నేత మోసం చేసింది టీడీపీకి చెందిన రైతులే అయినా..వారంతా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులంటూ ప్రచారం చేశారు. చివరికి అడ్డంగా దొరికిపోయి పరారయ్యారు. బాధితులంతా తాము టీడీపీ రైతులమే అని స్పష్టం చేయడంతో పాటు ధూళిపాళ్ళ నరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులపై దాడి చేయించిన నరేంద్రను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా లింగాయపాలెం మండలం వేములపల్లి, నరసన్నపాలెం గ్రామాల్లో ద్వారకాయయి మిల్క్ సెంటర్‌తో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ పాలుపోసేలా ఒప్పందం కుదుర్చుకుంది. వేములపల్లి సర్పంచ్ ముసులూరి రాము, నర్సన్నపాలెం సర్పంచ్ కూరపాటి వెంకటేశ్వర్లు తమ గ్రామాల పరిధిలో పాలను సేకరించి సంగం డెయిరీకి సరఫరా చేస్తున్నారు. 14 శాతం బోనస్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతులందరి నుంచి గ్రామాల్లో పాలు సేకరించి సంగం డెయిరీకి చేర్చేవారు. అయితే రైతుల దగ్గర పాలుపోయించుకుని కేవలం నాలుగుశాతం మాత్రమే బోనస్ ఇస్తామని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అడ్డం తిరిగారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఏలూరు జిల్లాకు చెందిన రైతులంతా సంగం డెయిరీకి వచ్చారు. రైతులు సంగం డెయిరీకి వచ్చి కార్లు దిగారో లేదో... ధూళిపాళ్ల నరేంద్ర కిరాయి సైన్యం ఒక్కసారిగా తమపై దాడికి దిగారని రైతులు ఆరోపిస్తున్నారు. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా బాదిపడేశారని అంటున్నారు. రైతులు తీసుకొచ్చిన కార్లను కూడా ధ్వంసం చేశారని విమర్శించారు. తాము డెయిరీకి పాలుపోసిన రైతులమని చెప్పినా కూడా కనికరం చూపించలేదని ఆక్రోశించారు. నరేంద్ర కిరాయి రౌడీల దాడిలో పదిహేను మంది రైతులు గాయపడ్డారు. ఈ దాడిపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్రతోపాటు మరో పద్నాలుమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న ధూళిపాళ్ల నరేంద్ర, అతని అనుచరులు వారం రోజులపాటు పరారయ్యారు. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన నరేంద్ర రైతులను కిరాయి మూకలని అడ్డగోలు దబాయించాడు. అంతేకాదు ప్రభుత్వమే ఈ పని చేయించిందంటూ దుష్ప్రచారం చేశాడు. వాస్తవానికి వేములపల్లి సర్పంచ్ ముసులూరి రాము కరడుగట్టిన తెలుగుదేశం నాయకుడు. 2015నుంచి 2019వరకూ లింగయపాలెం మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. రెండేళ్లక్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతో ముసులూరి రాము భార్య సర్పంచ్ గా గెలిచింది. చంద్రబాబు, లోకేష్‌తో కూడా ముసులూరి రాముకు పరిచయాలున్నాయి. లోకేష్ పాదయాత్రకు కూడా లక్షలు ఖర్చుపెట్టాడు. టీడీపీకి చెందిన ముసులూరి రామును వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ధూళిపాళ్ల నరేంద్ర నిజస్వరూపాన్ని చూసిన ఏలూరు జిల్లా రైతులు చీదరించుకుంటున్నారు. తమ కష్టాన్ని దొగింలించిన నరేంద్ర తమను కిరాయి వ్యక్తులుగా చిత్రీకరించడం దారుణమంటున్నారు. ఎప్పటినుంచో టీడీపీలో ఉన్న తమకు సొంత పార్టీ నేతే మోసం చేసి, దాడి చెయ్యడం... ఇప్పుడు తమను వైసీపీ నాయకులనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదీచదవండి..అమరావతిపై బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రశ్నలు -
పాల రైతులపై దాడి కేసులో ట్విస్ట్...టీడీపీ నేత ధూళిపాళ్లపై కేసు
-
ఇంకా పరారీలోనే ధూళిపాళ్ల నరేంద్ర
సాక్షి, గుంటూరు: సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ ధూళిపాళ్ల నరేంద్ర మోసానికి తెరతీసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో ఎనిమిది రోజుల నుంచి ధూళ్లిపాళ నరేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. ధూళిపాళ్లతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉండగా, ఎనిమిది రోజుల నుంచి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైతులపై దాడి చేసిన ధూళ్లిపాళ్ల అనుచరులు సంగం డెయిరీలో దాక్కున్నారన్న సమాచారంతో డెయిరీకి పోలీసులు వెళ్లగా, లోపలికి రానివ్వకుండా ధూళ్లిపాళ్ల అనుచరులు డెయిరీ గేట్లు మూసివేశారు. చదవండి: ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం -
పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
సాక్షి, గుంటూరు: నాలుగు రోజుల క్రితం ఏలూరుకు చెందిన రైతులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుల దాడి చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ ధూళిపాళ్ల మోసానికి తెరతీశాడు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు పోలీసులు .. వారిని పట్టుకోవడానికి మూడు స్పెషల్ టీంలుగా రంగంలోకి దిగారు.. నిన్న రాత్రి నుంచి నరేంద్రతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉన్నారు. నరేంద్ర ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. చదవండి: పెత్తందార్ల పెద్దా.. ఇదేనా మీ బాధ! -
బరితెగించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు
-
బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు.. రైతులపై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు బరితెగించారు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ సంగం డెయిరీ యాజమాన్యం మోసానికి తెరతీసింది. ఇది అన్యాయం అంటూ అడగడానికి వచ్చిన ఏలూరు జిల్లా రైతులపై దాడికి పాల్పడ్డారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!
తెలుగుదేశం పార్టీలో ఎన్ఆర్ఐల హవా ఎక్కువైంది. అమెరికాలో బాగా సంపాదించి ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. నియోజకవర్గం నేతలకు టెన్షన్ పెడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఐదుసార్లు గెలిచిన ఓ నేతను ఎన్ఆర్ఐ వెంటాడుతున్నాడు. గత ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన ఆ నేత ఎప్పటికీ ఆ సీటు తనదే అనుకుంటున్నారు. ఇంతలో ఎన్ఆర్ఐ రంగ ప్రవేశంతో కంగారుపడుతున్నారట. ధూళిపాళ్లకు ఎన్నారై సెగ ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో పొన్నూరు ఓటర్లు ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా పొన్నూరు ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉందో మొన్నటివరకూ అలాగే ఉంది. ధూళిపాళ్ల నరేంద్ర, అతని తమ్ముడు సురేంద్రలు నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల ద్వారా వందల కోట్లు సంపాదించారు. సెకండ్ లెవెల్ క్యాడర్ ను ఎక్కడా ఎదగనివ్వలేదు. దీంతో ధూళిపాళ్లపై నియోజకవర్గంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. కానీ నరేంద్ర మాత్రం పొన్నూరు సీటు తనకు కాదని మరెవరికీ ఇవ్వరనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే పార్టీలోని నరేంద్ర వ్యతిరేకులు ఆయనకు సీటు ఇవ్వొద్దని చంద్రబాబు వద్ద కుండబద్దలు కొట్టారట. తెనాలి దత్త పార్టీకి నరేంద్రకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపధ్యంలోనే ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఉయ్యూరు శ్రీనివాసరావు గుంటూరు వెస్ట్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఉయ్యూరు శ్రీనివాస్ మంచి దోస్తులు. స్నేహాన్ని ఆసరాగా చేసుకుని ఆలపాటి తనకు నష్టం జరగకుండా వ్యూహం పన్నారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఆలపాటి రాజా ఇన్ ఛార్జిగా ఉన్న తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆలపాటి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారట. ఈ ఆలోచనతోనే స్నేహితుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావుకు నువ్వు పొన్నూరులో పోటీ చేస్తే బెటర్ అని కన్విన్స్ చేశారట. ఆలపాటి రాజా ఎన్నారైకి ఈ సలహా ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్ ఉందంటున్నారు. టీడీపీలో కీలక నేతలుగా ఉన్న ధూళిపాళ్ల, ఆలపాటికి మొదటినుంచి ఒకరంటే ఒకరికి గిట్టదు. సంగం డైరి కొట్టెయ్యాలని ఆలపాటి భావిస్తే నరేంద్ర హస్తగతం చేసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది పరిస్థితి. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోంది. చదవండి: (టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం) గుంటూరు తొక్కిసలాట పాపం బాబు ఆలపాటి రాజా తన వ్యూహంలో భాగంగానే ఉయ్యూరు శ్రీనివాసరావును ధూళిపాళ్ల నరేంద్రపైకి వదిలారు. ఆలపాటి సలహాతో శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు చెప్పారట. ధూళిపాళ్ల నరేంద్ర ఖర్చు పెట్టేదానికంటే రెండింతలు ఎక్కువ ఖర్చుపెడతానని, ఈసారి పొన్నూరు సీటు మాత్రం తనకు ఇవ్వాల్సిందేనని ఎన్నారై విభాగం ద్వారా చంద్రబాబుపై వత్తిడి తీసుకొస్తున్నారు. వీరికి ఆలపాటి రాజా కూడా తోడయ్యాడు. అందులో భాగంగానే జనవరి 1న ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుక సభను నిర్వహించారు. ఈ సభకు చంద్రబాబును చీఫ్ గెస్ట్ గా పిలవడం వెనుక కూడా అసలు స్కెచ్ పొన్నూరు సీటేనని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సభ వ్యవహారాలన్నీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి చూసుకున్నారట. ఉయ్యూరు శ్రీనివాసరావు ఆలపాటి రాజా మినహా మరే ఇతర టీడీపీ నేతకు ప్రాధాన్యత ఇవ్వలేదట. పొన్నూరు ఉయ్యూరుకేనా? పొన్నూరు సీటు ఉయ్యూరు శ్రీనివాసరావుకు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండడంతో నరేంద్రకు టెన్షన్ పట్టుకుంది. పొన్నూరు సీటు తనకు కేటాయిస్తే లోకేష్ పాదయాత్రకు భారీస్థాయిలో స్పాన్సర్ చేస్తానని కూడా చంద్రబాబుకు ఉయ్యూరు శ్రీనివాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్. ఇలా ఖర్చు భరిస్తానంటే చంద్రబాబుకు కూడా సంతోషమే కదా? ఎగురుకుంటూ వచ్చిన వారికే పచ్చ పార్టీలో సీటు అనే ప్రచారం మరోచోట కూడా నిజం కాబోతోందని టాక్. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
-
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం
-
వైఎస్సార్సీపీ సవాల్,తోక ముడిచి పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
-
వారం రోజులే టైం
-
రూ.100 కోట్ల భూమి ‘ధూళి’.. పాలు!
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా 80 ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది. పాత తేదీలతో తప్పుడు పత్రాలు సృష్టించి మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.100 కోట్ల విలువైన సర్కారు భూమిని తమ కుటుంబం ఆధీనంలోని ప్రైవేట్ ట్రస్ట్‌కు బదలాయించుకుంది. డెయిరీ న్యాయాధికారి వంగల వేణుగోపాలం, అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి గురునాథం ద్వారా ఈ వ్యవహారం నడిపించినట్లు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. వేణుగోపాలాన్ని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేసి విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా ఈ నెల 23 వరకు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పాత తేదీతో తప్పుడు సర్టిఫికెట్.. సంగం డెయిరీ ఆస్తులను స్వాహా చేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం పక్కా ప్రణాళిక రచించింది. నరేంద్ర భార్య జ్యోతిర్మయి చైర్మన్‌గా ఉన్న ట్రస్ట్‌కు ఆస్తులను బదలాయించి కాజేయాలని పథకం వేశారు. 2012 సెప్టెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం సహకార సొసైటీల ఆస్తుల బదలాయింపుపై కొత్త మార్గదర్శకాలను జారీ చేయడం ధూళిపాళ్ల కుటుంబానికి అడ్డంకిగా మారింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సొసైటీ ఆస్తులతో కొత్తగా ప్రొడ్యూసర్ కంపెనీ (ట్రస్ట్గానీ మరేదైనాగానీ) ఏర్పాటు చేయాలంటే జిల్లా సహకార శాఖ రిజిస్ట్రార్ నుంచి ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) పొందడం తప్పనిసరి. డెయిరీ ఆస్తులను తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ ట్రస్ట్‌కు బదలాయించేందుకు 2012 సెప్టెంబర్‌లో ధూళిపాళ్ల కుటుంబం ప్రయత్నించగా అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి శ్రీకాంత్ అంగీకరించలేదు. ఇందులో ఏదో మతలబు ఉందని గుర్తించి ఫైల్ పెండింగ్‌లో పెట్టారు. ఇది బెడిసికొట్టడంతో ధూళిపాళ్ల కుటుంబం మరో ఎత్తుగడ వేసింది. గుంటూరు జిల్లా సహకార శాఖ అధికారిగా రిటైరైన గురునాథం పేరుతో కథ నడిపించింది. ఇందుకోసం సంగం డెయిరీ న్యాయాధికారి వంగల వేణుగోపాలాన్ని వినియోగించుకుంది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులు ఏవీ లేవని 2011 ఫిబ్రవరి 26వ తేదీతో ఓ తప్పుడు సర్టిఫికెట్ తయారు చేశారు. దానిపై ఫిబ్రవరి 28న రిటైరైన గురునాథం సంతకం ఉంది. తప్పుడు మార్గంలో సృష్టించిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించి ప్రభుత్వానికి చెందిన 80 ఎకరాలను ధూళిపాళ్ల కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు బదిలీ చేసింది. తీగ లాగితే కదిలిన డొంక... సంగం డెయిరీ అక్రమాలపై ఏసీబీ అధికారులు చేపట్టిన విచారణలో ఈ బాగోతం బట్టబయలైంది. డెయిరీ ఆస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయడంలో నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని ఏసీబీ గుర్తించింది. ఆస్తుల బదిలీకి ఎన్వోసీ ఎలా వచ్చిందనే అంశంపై కూపీ లాగడంతో డొంక కదిలింది. అంతకుముందు డెయిరీ ఆస్తుల జాబితాలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా... ట్రస్ట్‌కు బదిలీ చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వ ఆస్తులు లేవని సర్టిఫికెట్ జారీ చేసిన విషయాన్ని గుర్తించారు. ఈ అంశంపై లోతుగా విచారించడంతో అసలు వ్యవహారం బహిర్గతమైంది. గుంటూరు జిల్లా సహకార శాఖ కార్యాలయంలో ఎన్వోసీ జారీకి ముందు ఎలాంటి రిఫరెన్స్ ఫైళ్లు తయారు చేసినట్లు రికార్డుల్లో లేవు. ఇన్వర్డ్, అవుట్ వర్డ్ ఫైళ్ల రికార్డులు లేవు. పాత తేదీతో వంగల వేణుగోపాలం తయారు చేసిన సర్టిఫికెట్‌పై అప్పటికే రిటైరైన గురునాథం సంతకం చేశారని వెల్లడైంది. ఈ మేరకు సంగం డెయిరీ రికార్డులను పూర్తి ఆధారాలుగా ఏసీబీ అధికారులు సేకరించారు. -
వెలుగులోకి ధూళిపాళ్ల ట్రస్ట్ అక్రమాలు
-
‘ఆ ఇద్దరి బెయిల్ రద్దు చేయండి’
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో ఆ కంపెనీ చైర్మన్, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాలకృష్ణన్‌లకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది. కోవిడ్‌ను సాకుగా చూపి బెయిల్‌పై బయటకు వచ్చిన వారు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను, దర్యాప్తులో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దన్న ఆదేశాలను ఉల్లంఘించారని నివేదించింది. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు. నరేంద్రకుమార్ న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు కోరారు. న్యాయమూర్తి వారం మాత్రమే గడువు ఇస్తానన్నారు. ఈ సమయంలో ఏసీబీ న్యాయవాది ఎ.గాయత్రీరెడ్డి విచారణను ఈ నెల 23కు వాయిదా వేయాలని కోరగా అంగీకరించిన న్యాయమూర్తి ఆ మేరకు వాయిదా వేశారు. డైరెక్టర్లతో భేటీ దర్యాప్తును ప్రభావితం చేయడమే.. బెయిల్‌పై బయటకు వచ్చిన నరేంద్రకుమార్ ఇటీవల సంగం బోర్డు డైరెక్టర్లతో పాటు, ఇతర కీలక అధికారులను గుంటూరు నుంచి విజయవాడకు పిలిపించి వారితో నోవాటెల్ హోటల్లో సమావేశం నిర్వహించారని, రెండో నిందితుడైన గోపాలకృష్ణన్‌తో పాటు 25 మంది వరకు పాల్గొన్నారని ఏసీబీ పిటిషన్లో తెలిపింది. దర్యాప్తునకు ఎలా ఆటంకం కలిగించాలి, సహాయ నిరాకరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో నరేంద్రకుమార్ మిగిలిన డైరెక్టర్లకు సూచనలిచ్చారని తెలిపింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురిని గతంలో విచారించామని, ఇప్పుడు వారందరితో సమావేశం నిర్వహించడమంటే దర్యాప్తులో జోక్యం చేసుకోవడమేనంది. నోటీసులకు స్పందించడం లేదు.. సమావేశం నిర్వహించిన తరువాత ఈ కేసులో సాక్షులుగా ఉన్న పలువురు డైరెక్టర్లకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారి నోటీసులు ఇచ్చినా.. అనారోగ్య కారణాలు సాకుగా చూపి విచారణకు రాలేదని తెలిపింది. నరేంద్రకుమార్‌కు రెండుసార్లు నోటీసులు జారీచేసి విచారణకు రావాలని కోరగా.. ఆయన కూడా అనారోగ్య కారణాలు సాకుగా చూపారని తెలిపింది. వారంతా ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని పేర్కొంది. సాక్షులను దారిలోకి తెచ్చుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, నాశనం చేయడం వంటి ఉద్దేశాలతో నరేంద్ర వ్యవహరిస్తున్నారని, ఇది దర్యాప్తులో జోక్యం చేసుకోడమేనని తెలిపింది. దర్యాప్తు అధికారి సీఆర్పీసీ సెక్షన్ 91 కింద నరేంద్రకుమార్‌కు నోటీసు ఇచ్చి కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని కోరారని, ఇలా కోరే అధికారం దర్యాప్తు అధికారికి లేదంటూ ఆయన సమాధానం ఇచ్చారని తెలిపింది. సంగం అక్రమాలకు సంబంధించి నరేంద్రకుమార్ వద్ద ఉన్న డాక్యుమెంట్లు దర్యాప్తునకు ఎంతో కీలకమైనవని పేర్కొంది. సంగం డెయిరీలో జరిగిన పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తులో రాబట్టాలని, వాటి ఆధారాలను తమముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. నరేంద్రకుమార్ మాత్రం దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపింది. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్ -
సంగం డెయిరీ కేసు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని కోర్టు తెలిపింది. విజయవాడలో ఎక్కడ ఉంటున్నారో ఇంటి అడ్రస్ కోర్టుకు తెలపాలని, ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు పేర్కొంది. విచారణకు ఏసీబీ ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర ఏ1గా ఉన్నారు. చదవండి: పాడి రైతులను దగా చేసిన ధూళిపాళ్ల చంద్రబాబు అండతోనే.. -
రైతులకు లాభం రావడం టీడీపీకి ఇష్టం లేదు
తాడేపల్లి: టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సంగం డెయిరీ రైతులను నిలువు దోపిడీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఆయనపై ధ్వజమెత్తారు. మూత పడిన డైరీలను తెరిపించే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంటే అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తున్నారు. అసలు డైరీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. బషీర్ బాగ్ ఘటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు, అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. రైతు భరోసాతో రైతులను అదుకుంటున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. ఆముల్ సంస్థకు కట్టబెడుతున్నాం అంటున్నారు... కానీ సంగం డెయిరీలో ఎమీ జరిగిందో మాత్రం బయటికి చెప్పరు. రైతులు స్థాపించిన సంగం డెయిరీకి దొడ్డి దారిన ధూళిపాళ్ల చైర్మన్ అయిన సంగతి అందరికీ తెలుసు. దాన్ని సొంత వ్యాపార సంస్థగా మార్చుకున్నారు...వచ్చిన లాభాలను రైతులకు చెందకుండా కాజేస్తున్న వ్యక్తి ధూళిపాళ్ల. డెయిరీలను నాశనం చేసింది మీరు కదా.. చిత్తూరు డెయిరీ నాశనం చేసి హెరిటేజ్ స్థాపించలేదా? అన్నారు. టీడీపీ అధినేత బాటలోనే ధూళిపాళ్ల నడిచారు. సంగం డెయిరీకి వచ్చిన లాభాలను ధూళిపాళ్ల వీరయ్య చౌదరీ ట్రస్ట్ కి బదిలీ చేసుకున్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఒక్కో సొసైటీకి 40 వేలు లాభం వస్తే లక్షల రూపాయలు ట్రస్ట్ కి డొనేట్ చేస్తున్నారు. ట్రస్ట్ కింద ఒక కార్పొరేట్ ఆస్పత్రి కట్టి దానికి ట్రస్టీగా నరేంద్ర ఉన్నారు. డెయిరీ సొమ్ముతో ఆస్పత్రి కట్టి దానికి ట్రస్టీగా ఎలా ఉంటావ్ చెప్పాలని ప్రశ్నించారు. సంగం డెయిరీ పాలరైతులు నిలువున దోపిడీకి గురయ్యారు. వైఎస్ జగన్ రైతులకు రూ.4 ధర పెంచి మేలు చేశారు. నరేంద్ర, చంద్రబాబు లాంటి వాళ్ళు ఉంటే ఆముల్ సంస్థ ఆ స్థాయికి ఎదిగేది కాదు అని విమర్శించారు. అందుకే అక్కడ జరిగిన అక్రమాలను ఏసీబీ దృష్టికి తీసుకొచ్చా రైతులకు మేలు జరగాలని ఆముల్ తో ఒప్పందం చేసుకుంటే ఏదేదో మాట్లాడతారు. పాడి రైతుల లాభాల కోసం మూతపడిన వాటిని ఆముల్ కి అప్పజెప్తున్నాం. రైతులకు లాభం రావడం, మూతపడిన వాటిని తెరిపించడం టీడీపీ వారికి ఇష్టం లేదు అని మండిపడ్డారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: దిక్కుతోచని స్థితిలో టీడీపీ.. -
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడీకి హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి : సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆయనను మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. సంగం డెయిరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరుతూ ఏసీబీ హై కోర్టును ఆశ్రయించారు. ధూళిపాళ్ల నరేంద్రను కోర్టు మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటుగా ఏ2 గోపాలకృష్ణను రెండురోజులపాటు, ఏ3 గురునాథంను ఒకరోజు పాటు హైకోర్టు కస్టడీకి అప్పగించింది. చదవండి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ -
ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆయనను విచారించాలని కోర్టు ఆదేశించింది. మే 5లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో పలు అక్రమాలు, అవినీతి కేసులో ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంగం డెయిరీ అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కస్టడీకి కోరనుంది. ధూళిపాళ్ల నరేంద్ర అక్రమాల చిట్టా ఇదీ.. ♦సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన పదెకరాల భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ఉన్న ట్రస్ట్‌కు నరేంద్ర బదలాయించారు. అప్పటి డెయిరీ ఎండీగా ఉన్న గోపాలకృష్ణ ఆ పదెకరాలను ట్రస్టుకు బదలాయించినట్టు తీర్మానం చేయడం, మేనేజింగ్ ట్రస్టీగా నరేంద్ర వాటిని తీసేసుకోవడం జరిగిపోయాయి. ఇది బైలా నంబర్ 439 ప్రకారం ఉల్లంఘన. ♦ప్రభుత్వ భూమిలో వీరయ్య చౌదరి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ నిర్మించుకున్నారు. ఈ ఆస్పత్రికి నరేంద్ర భార్య జ్యోతిర్మయి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ♦ఏదైనా సహకార సంఘాన్ని కంపెనీగా మార్చుకోవాలంటే ప్రభుత్వానికి బకాయిలు చెల్లించి, భూములు అప్పగించి జిల్లా కోఆపరేటివ్ అధికారి నుంచి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) తెచ్చుకోవాలి. 2011 ఫిబ్రవరి 28న రిటైర్ అయిన డీసీవో గురునాథం నుంచి ఆయన రిటైర్మెంట్కు రెండు రోజుల ముందు తేదీతో ఎన్వోసీ తెచ్చి.. సంగం డెయిరీని కంపెనీ చట్టం కిందకు తెచ్చుకున్నారు. ఫలితంగా తన సొంత కంపెనీగా నరేంద్ర డెయిరీని మార్చేశారు. ♦దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ అధికారి కార్యాలయంలో తనిఖీలు చేసిన ఏసీబీ.. ఎన్వోసీకి సంబంధించిన దరఖాస్తు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలు లేవని నిర్ధారించింది. అక్రమ పద్దతుల్లో ఎన్వోసీని సృష్టించినట్టు తేలింది. మరోవైపు ఏపీడీడీసీ కమిషనర్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి వాటిని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)లో తనఖా పెట్టి 2013లో ధూళిపాళ్ల నరేంద్ర రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణానికి, నిర్వహణకు మళ్లించారు. ♦సంగం డెయిరీ లాభాలు, ప్రభుత్వ నిధులతో 1973, 1976, 1977, 1978లో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలకు చెందిన 51 డాక్యుమెంట్లను కూడా ఏసీబీ సేకరించింది. ఈ భూములను కొట్టేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారు. ♦ప్రభుత్వం 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఒక సహకార సంఘాన్ని మ్యాక్స్ పరిధిలోకి తేవాలంటే ప్రభుత్వానికి చెందిన భూములు తిరిగి అప్పగించడంతోపాటు బకాయిలను చెల్లించాలి. అలా చేయకుండానే 1997 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని మాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. నరేంద్ర సంగం డెయిరీ నిర్వహణ చూస్తునే మరోవైపు సొంతంగా మిల్క్‌లైన్ అనే ప్రయివేటు పాల సేకరణ కంపెనీని నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. తర్వాత మిల్క్‌లైన్ కంపెనీకి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేశారు. చదవండి: చంద్రబాబు అండతోనే.. Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ -
ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ
సాక్షి అమరావతి/సాక్షి, గుంటూరు/చేబ్రోలు (పొన్నూరు): టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆస్తుల యాజమాన్య హక్కులను ప్రభుత్వం ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాల ఉత్పత్తిదారులు, డెయిరీ ఉద్యోగులు, వినియోగదారుల విస్తృత ప్రయోజనాలు, డెయిరీ ఆస్తుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గతంలో డెయిరీ ఆస్తులను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి లీజుకు ఇస్తూ జారీ చేసిన జీవో నంబర్ 515ను సర్కార్ ఉపసంహరించింది. పాడి రైతుల నుంచి పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుతం ఉన్న అధికారులు, ఉద్యోగులతో నిర్వహించేందుకు పర్యవేక్షణ బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు అప్పగించింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయనకు కల్పించింది. ఐదో రోజూ ఏసీబీ సోదాలు సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, జిల్లా కో–ఆపరేటివ్ మాజీ ఉద్యోగి ఎం.గురునాథంలను గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసు విచారణలో భాగంగా డెయిరీలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. వరుసగా ఐదో రోజు మంగళవారం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్డులను, కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రభుత్వానికి ఏసీబీ నివేదన ప్రభుత్వం గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి ఇచ్చిన భూముల నుంచి 10 ఎకరాల భూమిని తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరిట ఉన్న ట్రస్టుకు అక్రమంగా ధూళిపాళ్ల నరేంద్ర బదలాయించినట్టు ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. పైగా నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత ట్రస్టీ కమ్ ఎండీగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తనకు తానుగా ప్రకటించుకున్నారని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం పేరున ఉన్న ఆస్తులను తనఖా పెట్టి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నుంచి రూ.115 కోట్లను నరేంద్ర రుణాలుగా పొందినట్టు తెలిపింది. పశు ప్రదర్శనలు, విద్య, శిక్షణ కార్యక్రమాల కోసం బదలాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్టు పేర్కొంది. లీజు హక్కులను ఉపసంహరించిన ప్రభుత్వం ప్రస్తుతం డెయిరీ ఆస్తుల యాజమాన్య హక్కులు గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఆ సంస్థకు ఇచ్చిన లీజు హక్కులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ ఆస్తులపై ఇక నుంచి పాలకవర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేసింది. డెయిరీకి ఉన్న రూ.కోట్ల విలువైన ఇతర ఆస్తులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది. ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు అప్పగించింది. ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇతర కార్యకలాపాలన్నీ ఇప్పుడున్న అధికారులు, ఉద్యోగుల ద్వారా యధావిధిగా జరిగేలా ఆయన పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు మయూర్ అశోక్ బాధ్యతలు స్వీకరించి రికార్డులను పరిశీలించారు. -
‘ధూళిపాళ్ల నరేంద్ర జైల్లో ఉంటేనే అది సాధ్యమవుతుంది’
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ కార్యాలయాల్లో విచారణ నిమిత్తం ఇంకా సోదాలు నిర్వహించాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. చాలా మంది సాక్షులను విచారించి, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని ఆయన తెలిపారు. సంగం డెయిరీ అక్రమాల కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ తమ వాదనలు వినిపించారు. సంగం డెయిరీలో అక్రమాల గురించి ఎవరిని ప్రశ్నించినా అంతా చైర్మన్‌కే తెలుసు అంటున్నారని, ఏ1 ముద్దాయి ధూళిపాళ్ల నరేంద్ర జైల్లో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని కోర్టుకు తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఇవ్వమని కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసిందని, ఈ సందర్భంలో రిమాండ్ కొట్టివేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. సంగం డైయిరీ లో 74 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ప్రభుత్వం యాజమాన్యాన్ని మార్చిదే తప్పా.. భూమిపై హక్కులు వదులుకోలేదని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టుకు విన్నపించారు. కాగా 2010 నుంచి ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీకి ఛైర్మన్‌గా ఉన్నారు. సంగం డైయిరీలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీలో ఎండీ గోపాలకృష్ణ, ప్రకాశం జిల్లా సహకార శాఖలో రిజిస్ట్రార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మేళం గురునాథంను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు పూర్తి అదనపు ఇన్చార్జి న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల అరెస్ట్ -
రాజమండ్రి సెంట్రల్ జైలుకు ధూళిపాళ్ల
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో పలు అక్రమాలు, అవినీతికి పాల్పడటంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ధూళిపాళ్లతోపాటు డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణ, రిటైర్డ్ జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం.గురునాథంలకు విజయవాడలో శుక్రవారం రాత్రి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు రావాల్సి ఉండటంతో కృష్ణా జిల్లా కోవిడ్ జైలుగా కేటాయించిన మచిలీపట్నం జైలులో వారిని ఉంచారు. ముగ్గురికి కోవిడ్ నెగెటివ్ అని శనివారం ఫలితం రావడంతో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ధూళిపాళ్ల నరేంద్ర అక్రమాల చిట్టా ఇదీ.. ► సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన పదెకరాల భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ఉన్న ట్రస్ట్‌కు నరేంద్ర బదలాయించారు. అప్పటి డెయిరీ ఎండీగా ఉన్న గోపాలకృష్ణ ఆ పదెకరాలను ట్రస్టుకు బదలాయించినట్టు తీర్మానం చేయడం, మేనేజింగ్ ట్రస్టీగా నరేంద్ర వాటిని తీసేసుకోవడం జరిగిపోయాయి. ఇది బైలా నంబర్ 439 ప్రకారం ఉల్లంఘన. ► ప్రభుత్వ భూమిలో వీరయ్య చౌదరి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ నిర్మించుకున్నారు. ఈ ఆస్పత్రికి నరేంద్ర భార్య జ్యోతిర్మయి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ► ఏదైనా సహకార సంఘాన్ని కంపెనీగా మార్చుకోవాలంటే ప్రభుత్వానికి బకాయిలు చెల్లించి, భూములు అప్పగించి జిల్లా కోఆపరేటివ్ అధికారి నుంచి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) తెచ్చుకోవాలి. 2011 ఫిబ్రవరి 28న రిటైర్ అయిన డీసీవో గురునాథం నుంచి ఆయన రిటైర్మెంట్కు రెండు రోజుల ముందు తేదీతో ఎన్వోసీ తెచ్చి.. సంగం డెయిరీని కంపెనీ చట్టం కిందకు తెచ్చుకున్నారు. ఫలితంగా తన సొంత కంపెనీగా నరేంద్ర డెయిరీని మార్చేశారు. ► దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ అధికారి కార్యాలయంలో తనిఖీలు చేసిన ఏసీబీ.. ఎన్వోసీకి సంబంధించిన దరఖాస్తు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలు లేవని నిర్ధారించింది. అక్రమ పద్దతుల్లో ఎన్వోసీని సృష్టించినట్టు తేలింది. మరోవైపు ఏపీడీడీసీ కమిషనర్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి వాటిని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)లో తనఖా పెట్టి 2013లో ధూళిపాళ్ల నరేంద్ర రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణానికి, నిర్వహణకు మళ్లించారు. ► సంగం డెయిరీ లాభాలు, ప్రభుత్వ నిధులతో 1973, 1976, 1977, 1978లో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలకు చెందిన 51 డాక్యుమెంట్లను కూడా ఏసీబీ సేకరించింది. ఈ భూములను కొట్టేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారు. ► ప్రభుత్వం 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఒక సహకార సంఘాన్ని మ్యాక్స్ పరిధిలోకి తేవాలంటే ప్రభుత్వానికి చెందిన భూములు తిరిగి అప్పగించడంతోపాటు బకాయిలను చెల్లించాలి. అలా చేయకుండానే 1997 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని మాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. నరేంద్ర సంగం డెయిరీ నిర్వహణ చూస్తునే మరోవైపు సొంతంగా మిల్క్‌లైన్ అనే ప్రయివేటు పాల సేకరణ కంపెనీని నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. తర్వాత మిల్క్‌లైన్ కంపెనీకి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేశారు. సంగం డెయిరీలో రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు చేబ్రోలు (పొన్నూరు): సంగం డెయిరీ, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు రెండో రోజు శనివారం కూడా సోదాలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ఏఎస్పీ సురేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. -
చంద్రబాబు అండతోనే..
సాక్షి, గుంటూరు: పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన సహకార రంగంలోని సంగం డెయిరీని చంద్రబాబు హయాంలో ధూళిపాళ్ల నరేంద్ర కంపెనీ చట్టంలోకి అక్రమంగా మార్చారు. డెయిరీ చైర్మన్‌గా చలామణి అవుతూ పాడి రైతులను నిలువుదోపిడీ చేశారు. కడుపు మండిన పాడి రైతులు న్యాయ పోరాటానికి దిగితే వారిని వేధించారు. చంద్రబాబు అండదండలతో పేట్రేగిపోయా రు. డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడం, తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో ఉన్న ట్రస్టుకు బదలాయించడం, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రుణాలు పొందడం వంటి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కారు. ట్రస్ట్ పేరుతో డెయిరీ ఆస్తుల దోపిడీ.. 1994లో ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వీరయ్య చౌదరి పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టుకు సంగం డెయిరీకి చెందిన పదెకరాలను నిబంధన లకు విరుద్ధంగా బదలాయించారు. ఆ భూమిలో వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఆస్పత్రి నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరు గుతోందని 2016లో తొమ్మిదిమంది పాడి రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆస్పత్రి నిర్మాణం నిలిపివేయాలని న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో సంగం డెయిరీ పాడి రైతుల ప్రయోజ నాల కోసం నిర్మాణాలు చేపడతానని కోర్టులో నరేంద్ర అఫిడవిట్ దాఖలు చేశారు. స్టే కొనసాగు తుండగానే ఆస్పత్రి భవనాన్ని 2018 ఆగస్టు 28న అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బోనస్‌లోనూ మాయే ఏటా పాడి రైతులకు లీటరుకు బోనస్ ప్రకటిస్తారు. ప్రకటించిన బోనస్ సొమ్మును రైతులకు అందజేయడంలోనూ బడా స్కామ్ జరిగిందని ఆరోపణలున్నాయి. ఈ బోనస్ పంపకాలపై విచారణ జరిగితే భారీ స్కామ్ బయటపడనుంది. -
పాడి రైతులను దగా చేసిన ధూళిపాళ్ల
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సంగం డెయిరీ రైతులను నిలువు దోపిడీ చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య ధ్వజమెత్తారు. ధూళిపాళ్ల అక్రమాలకు ఆధారాలు ఉండబట్టే ఆయనను పోలీసులు అరెస్టు చేశారని స్పష్టం చేశారు. దీనికి చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా పాల రైతులను మోసం చేసే వేల కోట్లు కూడబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో సహకార డెయిరీలన్నింటినీ టీడీపీ నేతలకు కట్టబెట్టిన చరిత్ర ఆయనదేనని మండిపడ్డారు. ఇందులో ఆయన వాటా ఎంతో తెలియాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం కిలారు రోశయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాడి రైతులకు మేలు చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రోశయ్య ఇంకేమన్నారంటే.. చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు.. 77 ఎకరాల్లో ఉన్న సంగం డెయిరీ ఆస్తులపై ధూళిపాళ్ల నరేంద్ర దొంగ సర్టిఫికెట్లు సృష్టించి బ్యాంకు లోన్లు తీసుకున్నారు. అంతేకాకుండా తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ట్రస్టు పెట్టి డెయిరీకి చెందిన 10 ఎకరాల భూమిని దానికి బదలాయించారు. ఎన్నికలకు ముందు డెయిరీ లాభాల్లోంచి లీటర్‌కు రూ.6.50 చొప్పున రైతులకు బోనస్‌గా ఇస్తామని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇందులో రూ.1.50 ట్రస్టుకు మళ్లించారు. ధూళిపాళ్ల ఎన్నికల చందా మరో రూ.1.50. ఇంకో రూ.2 సిబ్బంది, ఏజెంట్లకు బోనస్ అట. ఇవన్నీ పోగా రైతుకు మిగిలింది కేవలం రూ.1.50 మాత్రమే. ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ కాదా? దీనిపై విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పేముంది? తన హయాంలో అక్రమాలు బయటపడతాయనే చంద్రబాబు.. నరేంద్రను వెనకేసుకొస్తున్నారా? బాబుకు కూడా ఇందులో వాటాలున్నాయా? సంగం డెయిరీ ద్వారా నరేంద్ర వేల కోట్లు కూడబెట్టారు. బాబు పాలనలో సహకార డెయిరీలు నాశనం చంద్రబాబు తన హయాంలో సహకార డెయిరీలను సర్వనాశనం చేశారు. తన హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు డెయిరీని మూసేశారు. రైతులపై చంద్రబాబు, లోకేష్‌కు ఏ మాత్రం ప్రేమ లేదు. రైతన్నకు నష్టం రాకుండా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. అమూల్ మూడు జిల్లాల్లో పాల సేకరణ చేస్తోంది. ప్రైవేటు డెయిరీల కంటే లీటరుకు రూ.5 నుంచి రూ.10 వరకూ అధికంగా చెల్లిస్తోంది. దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్న అమూల్‌కు రైతులే యజమానులు. ఏపీలోనూ లాభాలను రైతులకే పంచాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టీడీపీ దీన్ని పక్కదారి పట్టించేలా తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల అరెస్ట్
సాక్షి, గుంటూరు/ఒంగోలు/సాక్షి, అమరావతి/చేబ్రోలు/విజయవాడ లీగల్: టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పొన్నూరు మండలం చింతలపూడిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న సంగం డెయిరీ చైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర కొనసాగుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సంగం సొసైటీలో భారీ మొత్తం రుణం తీసుకోవడంతోపాటు డెయిరీలో పలు అక్రమాలు, అవినీతికి సంబంధించిన ఫిర్యాదులపై ఆయనను ఏసీబీ అరెస్టు చేసింది. ఆయనపై అవినీతి నిరోధక చట్టం–1988లోని 13(1)(సీ)(డీ), ఐపీసీ సెక్షన్లు 408, 409, 418, 420, 465, 471, 120బి రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. సంగం డెయిరీ ఎండీ కూడా అరెస్ట్ కాగా, సంగం డెయిరీలో ఎండీ గోపాలకృష్ణను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం డెయిరీ పరిపాలన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే డెయిరీ ఉద్యోగులు సోదాలకు సహకరించలేదు. కొన్ని గదుల తాళాలు తీయకపోవడం, సంబంధిత ఉద్యోగులు అందుబాటులో లేకుండా పోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం చేసినట్టు సమాచారం. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు డెయిరీలోనే ఏసీబీ అధికారులు వేచి ఉన్నారు. అందుబాటులో ఉన్నవాటిని పరిశీలించి, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సహకార శాఖ మాజీ రిజిస్ట్రార్ కూడా.. కాగా, ప్రకాశం జిల్లా సహకార శాఖలో రిజిస్ట్రార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మేళం గురునాథంను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. శుక్రవారం ఉదయం ఒంగోలు ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన కేసులోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా సహకార శాఖ రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో సొసైటీ చట్టాన్ని దుర్వినియోగపరిచారనే అభియోగంపై ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో నరేంద్రను ఏ1గా, డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణను ఏ2గా, గురునాథంను ఏ3గా ఏసీబీ చేర్చింది. వీరిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు పూర్తి అదనపు ఇన్చార్జి న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను కోవిడ్ పరీక్షల నిమిత్తం విజయవాడలోని ఈఎస్ఐ కోవిడ్ సెంటర్‌కు తీసుకెళ్లగా గురునాథంకు పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. ప్రాథమిక ఆధారాలతోనే అరెస్టు చేశాం: ఏసీబీ కాగా, ధూళిపాళ్ల నరేంద్రను ప్రాథమిక ఆధారాలతోనే అరెస్టు చేశామని ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని కోర్టుకు సమర్పించిన రిపోర్టులోనూ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఎ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధూళిపాళ్లను అరెస్టు చేసినట్టు తెలిపింది. ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణ, రిటైర్డ్ జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎం.గురునాథం, గతంలో ఎండీగా పనిచేసిన కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు సహా మరికొందరిపై కేసు నమోదు చేశామని వివరించింది. అక్రమాలకు, అవకతవకలకు అడ్డాగా మార్చేశారు.. గుంటూరు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ (జీడీఎంపీసీయూఎల్), గుంటూరు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్(జీడీఎంపీఎంఎసీయూఎల్), సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఎంపీసీఎల్)గా రూపాంతరం చెందుతూ వచ్చిన సంగం డెయిరీని అక్రమాలు, అవకతవకలకు నిలయంగా మార్చేశారని ఏసీబీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన చట్టాలను, నిబంధనలను ఇష్టానుసారం ఉల్లంఘించారని తెలిపింది. సంగం డెయిరీకి కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా బదలాయించారంది. 1992, ఫిబ్రవరి 8న ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జీడీఎంపీసీయూఎల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994 మార్చిలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా ఉండేందుకు తీర్మానం చేయించుకుని అక్రమాలకు తెరలేపారని ఏసీబీ పేర్కొంది. ఆ తర్వాత సంగం డెయిరీకి చెందిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్‌కు బదలాయించారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆ భూములను బదలాయించినట్టు ఆధారాలు ఉన్నాయని ఏసీబీ పేర్కొంది. పలు సంస్థలు ఏర్పాటు చేసి సంగం డెయిరీ ఆదాయాన్ని, ఆస్తులను అడ్డగోలుగా మళ్లించారని వివరించింది. -
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
-
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. పొన్నూరు మండలం చింతలపూడిలో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయనను గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు.. సంఘం డెయిరీలో అవకతవకల ఆరోపణలపై విచారిస్తున్నారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. చదవండి: అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని... -
లోకేష్‌ను కలిసిన ధూళిపాళ్ల
అమరావతి: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కలుసుకున్నారు. మంత్రివర్గంలో చేరిక, కీలక శాఖలు దక్కడంపై లోకేష్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్రకు మంత్రి పదవి దక్కని అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రిపదవి పొందేందుకు మీకు పూర్తి అర్హత ఉంది, కానీ సమీకరణల్లో సాధ్యపడలేదు అని ధూళిపాళ్లతో వ్యాఖ్యానించినట్లు, ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. -
ధూళిపాళ్ల, చాంద్‌బాషాకు ఘోర పరాభవం!
విజయవాడ: కేబినెట్లో చోటుదక్కని టీడీపీ నేతలకు అవమానాలు, పరాభవాలే మిగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఆ పార్టీ అనుచితంగా ప్రవర్తించింది. మంత్రి పదవి రాలేదని తీవ్ర నిర్వేదంలో ఉన్న ఆయనతో కనీసం మాట్లాడేందుకు కూడా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. ఇతర అసంతృప్తులను పిలిచి మాడ్లుతున్నా...ధూళ్లిపాళ్లను మాత్రం సీఎం ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా...బుజ్జగించేందుకు కూడా యత్నించలేదు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని, పార్టీ అధికారంలో లేనప్పుడు తాను చేసిన సేవను ధూళిపాళ్ల గుర్తు చేసినప్పటికీ చంద్రబాబు నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు.ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డవారిని పక్కనబెట్టి.. పక్కపార్టీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయడంపై ఆయన అలకబూనారు. ఓ వైపు అధినేత చంద్రబాబు, మరోవైపు నారా లోకేశ్ వైఖరితో ధూళిపాళ్ల కుమిలిపోతున్నట్లు సమాచారం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చాంద్ బాషాకు ఘోర పరాభవం ఎదురైంది. మంత్రి పదవిని ఆశించిన ఆయన సీఎంను కలిసేందుకు సోమవారం యత్నించారు. అయితే చంద్రబాబు మాత్రం.. చాంద్ బాషాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మైనార్టీకోటాలో చివరి నిమిషం వరకూ చాంద్‌బాషాకు మంత్రి పదవిని ఊరించినా, చివరికి నిరాశే మిగిలింది. దీంతో సీఎం ఇంటికొచ్చినా ముఖ్యమంత్రిని కలవకుండానే చాంద్‌బాషా వెనుదిరిగారు. -
'భవిష్యత్తు తరాల కోసమే భూములు తీసుకుంటున్నాం'
హైదరాబాద్:భవిష్యత్తు తరాల కోసమే రైతుల నుంచి భూములు తీసుకుంటున్నామని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మాట్లాడిన ధూళిపాళ్ల.. ల్యాండ్ పూలింగ్ తో రైతులకు మేలు జరుగుతుందన్నారు. 365 రోజులు రైతులకు పని కల్పించే పద్దతిని కల్పించామన్నారు.ప్రతిపక్షం మాయలో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాల కోసమే భూములు తీసుకుంటున్నామన్నారు. నిర్మాణాత్మక సూచనలు ప్రతిపక్షం నుంచి ఏమీ లేవని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
అధికార పక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వండి
హైదరాబాద్ : అసెంబ్లీలో తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని మరోవైపు అధికార పక్షం కోరింది. సంఖ్యా బలానికి అనుగుణంగా తమకూ మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కోరారు. ప్రధాన ప్రతిపక్షం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదన్న ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా బడ్జెట్‌పై మాట్లాడేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న ప్రధాన ప్రతిపక్ష డిమాండ్‌ను శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు విభేదించారు. ఇప్పటికే నిర్ణీత సమయం కంటే.. ఎక్కువే ప్రధాన ప్రతిపక్షం మాట్లాడిందని ఆయన చెప్పారు. వీలుంటే తన సమాధానికి ముందు కాస్త సమయం ఇవ్వొచ్చని సూచించారు. అసెంబ్లీ తొలిసారి పది నిమిషాలు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం కాగానే.. బడ్జెట్‌పై చర్చ మొదలు పెట్టారు. మాట్లాడాల్సిందిగా గొల్లపల్లి సూర్యారావును కోరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాన ప్రతిపక్షం.. నిన్నటి తమ ప్రసంగం ఇంకా పూర్తి కాలేదని.. కాబట్టి ఆ ప్రసంగాన్ని పూర్తి చేసేందుకు కాసేపు టైమ్ ఇవ్వాలని కోరారు. అయితే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇచ్చేందుకు స్పీకర్ తిరస్కరించారు. -
'అవును.. కిరణ్ సర్కార్ ను కాపాడాం'
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన మాట వాస్తమేనని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఒప్పుకున్నారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశామని శాసనసభలో చెప్పారు. తమ పార్టీ గుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలకే విప్ జారీ చేశామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు విప్ జారీచేసి మరీ కాంగ్రెస్ సర్కారును కాపాడిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. దీనిపై ధూళిపాళ్ల స్పందిస్తూ వైఎస్ఆర్ సీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వటం ఇష్టంలేకే కిరణ్ సర్కారును కాపాడామని వెల్లడించారు. సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకే విప్ జారీ చేశామని, మీకేంటి నొప్పి అని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు. మీకేంటి నొప్పి అంటూ రెట్టించడంతో సభలో గందరగోళం రేగింది. స్పీకర్ జోక్యంతో సభ సద్దుమణిగింది. -
అజ్ఞాతం వీడని ధూళిపాళ్ల!
తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉండి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు తెలుగు తమ్ముళ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. కేబినెట్లో చోటుదక్కిని తమ్ముళ్లు కొంతమంది అలకబూనితే,మరి కొందరు అధినేతకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో గెలుపొందినవారంతా ఎవరికివారే మంత్రి పదవులు వస్తాయని అంచనా వేసుకున్నారు. అయితే ఆశలన్నీ తలకిందలయ్యే సరికి వారిలో అసంతృప్తి నెలకొంది. దాంతో బెర్త్ దక్కక భంగపడిన తమ్ముళ్లలో ఒకరు ఆస్పత్రి పాలైతే...మరొకరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. దాంతో పదవుల పందారంపై టీడీపీలో రేగిన అసంతృప్తులు ఇంకా చల్లారడం లేదు. అటువంటి వారిలో గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఉన్నారు. అయిదో సారి విజయం సాధించి...మంత్రివర్గంలో ఈసారి తనకు సీటు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయిన ఆయనకు అవకాశం దక్కలేదు. దాంతో మనస్తాపానికి గురైన ధూళిపాళ్ల ఇప్పటికీ పార్టీకి అందుబాటులోకి రాలేదు. అవకాశం దొరికినప్పుడల్లా మైక్ దొరికితే వదలి పెట్టని ఆయన ఇప్పుడు అజ్ఞాతంలో కొనసాగుతున్నారు. బాబు ప్రమాణ స్వీకారానికి కూడా ధూళిపాళ్ల డుమ్మా కొట్టారు. అంతకు ముందు ఆయనను బుజ్జగించేందుకు పలువురు పార్టీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు ఎవరితోనూ అందుబాటులోకి రాలేదు. ఆయన ఇప్పటికి కూడా కూడా స్విచ్చాఫ్ చేసి ఉంచటంతో ఇంకా అలక కొనసాగిస్తున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మరోవైపు ధూళిపాళ్లకు మంత్రి పదవి రాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసన కూడా తెలిపారు. ఓ దశలో బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు యత్నించిన ఆయనను కార్యకర్తలే అడ్డుకోవటం విశేషం. అయితే మంత్రివర్గంలో చోటు దక్కనివారి సేవలను పార్టీ, ప్రభుత్వంలో వివిధ రూపాలలో ఉపయోగించుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
మలిదశ పరిషత్తుపోరు నేడే
గుంటూరు, గురజాల డివిజన్లలో పోలింగ్ ఓటర్ల సంఖ్య 11,30,634, పోలిగ్ స్టేషన్లు 1,470 పతాక స్థాయికి చేరిన టీడీపీ ప్రలోభాల పర్వం ‘సంగం’ ఉద్యోగులతో ఓటుకు నోటు పంపకాలు సాక్షి, గుంటూరు : జిల్లాలో మలిదశ పరిషత్తు పోరు శుక్రవారం జరగనుంది. ఈ దశలో గుంటూరు, గురజాల డివిజన్ల పరిధిలోని 28 మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, మాచర్ల, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లోని 28 జడ్పీటీసీ స్థానాలకు 105 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 443 ఎంపీటీసీ స్థానాలుండగా, 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 432స్థానాలకు 1,182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల జరిగే రెండు డివిజన్లలో మొత్తం 696 చోట్ల 1,470 పోలింగ్ స్టేషన్లున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 71 చోట్ల 136 పోలింగ్ స్టేషన్లు, 715 అత్యంత సమస్యాత్మక, 417 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. 202 సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు డివిజన్‌కు 2,041, గురజాల డివిజన్‌కు 983 బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. 119 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 175 కేంద్రాలకు వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేశారు. 304 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మలిదశలోనూ మహిళలే కీలకం.. రెండు డివిజన్లలో జరిగే ఎన్నికల్లో 11,30,634 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓట్లు 5,58,979 మంది కాగా, మహిళా ఓట్లు 5,71,657 ఉన్నాయి. రెండు డివిజన్లలోనూ మహిళా ఓట్లే కీలకం కానున్నాయి. గుంటూరు డివిజన్లో పురుష ఓటర్లు 3,76,457 మంది కాగా, మహిళా ఓటర్లు 3,86,098 మంది ఉన్నారు. గురజాల డివిజన్‌లోనూ పురుష ఓటర్లు 1,82,522 మంది కాగా, మహిళా ఓటర్లు 1,85,559 మంది ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు మహిళా ఓట్ల కోసం ప్రచారంలో నానా పాట్లు పడ్డాయి. అధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ పోటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల్ని పోటీలో నిలపలేదు. 16 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంది. ఈ స్థానాల్లో టీడీపీకి బహిరంగంగానే మద్దతు పలికింది. 28 జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 27 స్థానాల్లోనూ, తాడేపల్లిలో సీపీఎంకు మద్దతిచ్చి బరిలో నిలిపింది. తాడేపల్లిలో కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మద్దతిచ్చినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కమల ప్రకటించడం గమనార్హం. సైకిల్ గుర్తుతో నోట్ల పంపిణీ.. మరికొద్ది గంటల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండటంతో టీడీపీ పతాక స్థాయిలో ప్రలోభాలు కొనసాగించింది. గురువారం వేకువజామున పెదకాకానిలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సంగం డెయిరీ ఉద్యోగులతో డబ్బు పంపిణీ చేయించారు. ఏకంగా రూ.500 నోట్లపై సైకిల్ బొమ్మ ముద్రించి మరీ ఓటర్లకు పంపిణీ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సంగం ఉద్యోగులనుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి టీడీపీ శ్రేణులు పట్టుబడ్డాయి. పోలింగ్ రోజున వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలిదశలోనూ టీడీపీ నేతలకు పోలీసులు సహకారం అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రొంపిచర్ల, నకరికల్లు మండలాల్లో మహిళలపై కూడా దాడులకు దిగడం తెలిసిందే. -
టీడీపీ నేత ధూళిపాళ్ల నోటు రాజకీయాలు
-
టీడీపీ నేత ధూళిపాళ్ల నోటు రాజకీయాలు
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటినుంచే డబ్బు రాజకీయాలకు తెరదీశారు. పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన కొంతమంది మనుషులు డబ్బు పంచుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సంగం డెయిరీకి చెందిన నలుగురు ఉద్యోగులు డబ్బు పంపిణీ చేయిస్తుండగా గ్రామస్థులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్వయంగా సంగం డెయిరీ ఛైర్మన్ అయిన ఎమ్మెల్యే నరేంద్ర పంపిన డబ్బును వీళ్లు పంచుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో 'ఆంధ్రజ్యోతి' విలేకరి సాయంతో డబ్బులు పంచుతుండగా పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం నాటి సంఘటనలో డబ్బు పంచతున్నవాళ్లు ఓ ఘనకార్యం కూడా చేశారు. 500 రూపాయల నోటు మీద సైకిల్ గుర్తు రబ్బరు స్టాంపు వేసి మరీ పంపిణీ చేశారు. కేసు నమోదు చేయకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే వీరిని అదుపులోకి తీసుకున్నా, ఇంతవరకు అరెస్టు చూపించలేదు. మీడియాను కూడా పోలీసు స్టేషన్ లోపలికి రానివ్వలేదు. -
మైక్ కనిపిస్తేచాలు ఏకదాటి ప్రసంగాలు
-
టి.బిల్లుపై ప్రభుత్వం ఎందుకు స్పందించదు: ధూళిపాళ్ల
కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన టి.బిల్లుపై ఎందుకు స్పందించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అత్యంత ప్రధానమైన అంశమని, అయితే ఆ అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. టి.బిల్లుపై సభలో ఓటింగ్ ద్వారా సభ్యుల అభిప్రాయాలు వెల్లడవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని ధూళిపాళ్ల నరేంద్ర తప్పు పట్టారు. బీఏసీ సమావేశంలో సీఎం ఒకటి చెబుతారు, బయటకు వచ్చి మరోకటి మాట్లాడతారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. -
బహిరంగ చర్చకు సిద్ధం
సాక్షి, గుంటూరు :గుంటూరు మిర్చియార్డు అగ్నిప్రమాదానికి గురైనపుడు రైతులకు నష్టపరిహారం పంపిణీలో అక్రమాలు జరిగాయనీ, అందులో తన పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేసిన ఆరోపణల్ని యార్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. తాను ప్రజల మధ్య నుంచి రాజకీయాల్లోకి వచ్చాననీ, తండ్రుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదని ధ్వజమెత్తారు. తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే నరేంద్ర ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా బహిరంగ చర్చకు రావచ్చని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు చేయొద్దని హితవు పలికారు. ఏం ఆధారముందని నరేంద్ర ఆరోపణలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విలువలు పాటించాలన్న విషయాన్ని మర్చిపోకూడదని అప్పిరెడ్డి హితవు పలికారు. 2007 జూన్ నుంచి 2010 జూన్ వరకూ యార్డు చైర్మన్‌గా తాను వ్యవహరించాననీ, ఆ కాలంలో ఎలాంటి అక్రమాలు జరగలేదనీ, ఫైళ్లు కూడా మాయం కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన బాధిత రైతులకు నేరుగా చెక్కుల పంపిణీ జరగలేదనీ, ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే రెవెన్యూ సిబ్బంది రైతులకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఒకవేళ యార్డులో అధికారులెవ్వరైనా అక్రమాలకు పాల్పడి ఉంటే కచ్చితంగా శిక్షకు గురవుతారన్నారు. అప్పటి యార్డు పాలకవర్గం తప్పు చేసిందని భావిస్తే ఐదేళ్లుగా అడగని టీడీపీ నాయకులు ఇప్పుడెందుకు ఆరోపణలు సంధిస్తున్నారని అప్పిరెడ్డి ప్రశ్నించారు. తాను చైర్మన్‌గా ఏ ఒక్కరి వ్యాపారికి కూడాను ఒక్క లై సెన్సు కూడా ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పాలకవర్గం ఎప్పుడూ తప్పు చేయలేదని మనసా, వాచా నమ్ముతున్నామని స్పష్టం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2010లోనే తాను తనపైనే విజిలెన్సు విచారణ జరపాలని అధికారుల్ని కోరానన్నారు. ఇది అర్థం చేసుకోలేక కొందరు నాయకులు అర్థం లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. దీనివెనుక ఎన్నో రాజకీయ కోణాలు ఉన్నాయనీ, వాటన్నింటి పైనా మరో సందర్భంలో మాట్లాడతానని అప్పిరెడ్డి పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు కూడా పాల్గొన్నారు.