
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని కోర్టు తెలిపింది. విజయవాడలో ఎక్కడ ఉంటున్నారో ఇంటి అడ్రస్ కోర్టుకు తెలపాలని, ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు పేర్కొంది. విచారణకు ఏసీబీ ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర ఏ1గా ఉన్నారు.
చదవండి: పాడి రైతులను దగా చేసిన ధూళిపాళ్ల
చంద్రబాబు అండతోనే..
Comments
Please login to add a commentAdd a comment