టీడీపీ నేత ధూళిపాళ్ల నోటు రాజకీయాలు | four men caught while distributing money in guntur district | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ధూళిపాళ్ల నోటు రాజకీయాలు

Published Thu, Apr 10 2014 12:50 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

టీడీపీ నేత ధూళిపాళ్ల నోటు రాజకీయాలు - Sakshi

టీడీపీ నేత ధూళిపాళ్ల నోటు రాజకీయాలు

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటినుంచే డబ్బు రాజకీయాలకు తెరదీశారు. పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన కొంతమంది మనుషులు డబ్బు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సంగం డెయిరీకి చెందిన నలుగురు ఉద్యోగులు డబ్బు పంపిణీ చేయిస్తుండగా గ్రామస్థులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్వయంగా సంగం డెయిరీ ఛైర్మన్ అయిన ఎమ్మెల్యే నరేంద్ర పంపిన డబ్బును వీళ్లు పంచుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు.

ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో 'ఆంధ్రజ్యోతి' విలేకరి సాయంతో డబ్బులు పంచుతుండగా పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం నాటి సంఘటనలో డబ్బు పంచతున్నవాళ్లు ఓ ఘనకార్యం కూడా చేశారు. 500 రూపాయల నోటు మీద సైకిల్ గుర్తు రబ్బరు స్టాంపు వేసి మరీ పంపిణీ చేశారు. కేసు నమోదు చేయకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే వీరిని అదుపులోకి తీసుకున్నా, ఇంతవరకు అరెస్టు చూపించలేదు. మీడియాను కూడా పోలీసు స్టేషన్ లోపలికి రానివ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement