money distribution
-
బ్యాంకుల నిండా పింఛనుదారులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శనివారం పలుచోట్ల పింఛను డబ్బులు తీసుకునేందుకు వచ్చిన అవ్వాతాతలతో బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,838 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1,939.35 కోట్లు విడుదల విషయం చేసిన విషయం తెలిసిందే. మొత్తంలో లబ్ధిదారుల్లో 47,74,733 మందికి ప్రభుత్వం డీబీటీ రూపంలో శనివారం ఉదయమే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసింది. డబ్బు బ్యాంకుల్లో జమ అయినట్లు శనివారం సాయంత్రానికి 44,54,243 (93.29 శాతం) లక్షల మంది మొబైల్ నంబర్లకు సమాచారం కూడా చేరినట్టు అధికారులు తెలిపారు. శనివారమే 14.33 లక్షల మందికి ఇంటివద్దే అందిన పింఛను డీబీటీ రూపంలో బ్యాంకులో జమచేసినవారు పోను మిగిలిన 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమై ఉండే 17,56,105 మంది లబ్ధిదారులకు ఒకటోతేదీ నుంచి ఐదోతేదీ మధ్య గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా వారి ఇంటివద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరిలో 14,33,709 మందికి శనివారమే వారి ఇళ్లవద్ద పింఛను డబ్బు పంపిణీ చేశారు. ఇంటివద్ద పింఛన్ల పంపిణీ 81.64 శాతం పూర్తయిందని, మిగిలిన వారికోసం మరో నాలుగు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
టీడీపీ జనసేన మధ్య డబ్బు గొడవ
-
కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
-
డబ్బు పంపిణి చేస్తూ అడ్డంగా దొరికిన టీడీపీ...సాక్షి చేతిలో సంచలనం వీడియో
-
వెలుగులోకి ఎమ్మెల్యే సాంబశివరావు నిర్వాకాలు
-
కిరాయి కూలీలు..అడ్డంగా దొరికిన లోకేష్
-
ఈసీ అసహనం.. దర్యాప్తు సంస్థలపై సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల వైఫల్యంతోనే మునుగోడు ఉపఎన్నికలో భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలిసింది. ఇలా అయితే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో దర్యాప్తు సంస్థలన్నీ సమన్వయంతో వ్యవహరిస్తేనే ఎన్నికల్లో అక్రమాలను నిర్మూలించగలమని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం మంగళవారం హైదరాబాద్‌లో 27 కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర పోలీసు, ఆబ్కారీ శాఖలపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఆబ్కారీ శాఖ పట్టుకున్న మద్యాన్నే పోలీసు శాఖ పట్టుకున్నట్లు చూపడంపట్ల అభ్యంతరం తెలిపింది. మద్యం, గంజాయి అక్రమ రవాణా నియంత్రణలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది. చదవండి: స్వేచ్ఛాయుత ఎన్నికలకు వీలేది? ఈసీని నిలదీసిన విపక్షాలు ఇకపై గట్టి నిఘా పెట్టాలి: ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ కట్టడికి గట్టి నిఘా పెట్టాలని ఐటీ శాఖ, స్టేట్ జీఎస్టీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలకు ఈసీ బృందం సూచించింది. డిజిటల్ లావాదేవీలను ఐటీ పరిధిలోకి తేవాలని...ఈ–వే బిల్లుల ఆధారంగా సరుకు రవాణాపై నిఘా పెట్టి కానుకల పంపిణీని అడ్డుకోవాలని, కాలం చెల్లిన వాహనాలు సీజ్ చేయాలని కోరింది. ఈ భేటీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తోపాటు రాష్ట్ర పోలీసు శాఖ, కేంద్ర సాయుధ బలగాల నోడ ల్ అధికారి, ఆబ్కారీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, ఆర్బీఐ, కస్టమ్స్, ఎస్జీఎస్టీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్సీబీ, ఈడీ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు. -
KNR: దళితబంధు కోసం కొత్త షరతులు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో అధికారులు కొత్త షరతు విధించారు. నిధులు దుర్వినియోగం కాకుండా కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రెండో విడత దళితబంధు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా కొటేషన్, వ్యాపారి జారీచేసే అఫిడవిట్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. హుజూరాబాద్‌లో లబ్ధిదారులకు నిధుల మంజూరులో సమస్యలు తలెత్తాయన్న విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారని సమాచారం. అందుకే, యూనిట్లకు సంబంధించి విస్తరణ, వ్యాపారవృద్ధిలో పారదర్శకతను మరింత పెంచేలా చర్యలు చేపట్టారు. ఇకపై రెండో విడత కోసం దరఖాస్తు చేసుకునే ప్రతీ లబ్ధిదారుడు తాను సామగ్రి తీసుకునే వ్యాపారి నిజాయితీని చాటేలా అఫిడవిట్ ఇవ్వాల్సిందేనన్న రూల్ అమల్లోకి తీసుకువచ్చారు. క్షేత్రస్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం అమలులో కొందరు నేతలు కమీషన్లు తీసుకుంటున్నారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కలెక్టర్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నేపథ్యమిదీ.. హుజరాబాద్ ఉప ఎన్నికకు ముందు దళితుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రారంభించింది. పథకంలో భాగంగా అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. ఆర్థిక అసమానతలను రూపుమాపడం ద్వారా దళితులంతా సామాజిక సమానత్వం సాధించాలన్న లక్ష్యంతో ఈ పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా పథకాన్ని ముఖ్యమంత్రి లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసి ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు రెండేళ్లకాలంలో హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ (హన్మకొండ జిల్లా) మండలాల్లో లబ్ధిదారులను గుర్తించి మొత్తం 18,021 దళిత కుటుంబాలకు యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో 14,080 కుటుంబాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా.. మిగిలిన 3,941 కుటుంబాలు కమలాపూర్ మండలంలో ఉన్నాయి. గోల్‌మాల్‌కు యత్నం? జిల్లాలో మొత్తం 18,021 మంది దళితబంధు కోసం దరఖాస్తు చేసుకోగా 14,080 మంది అర్హులని అధికారులు తేల్చారు. వీరిలో 10,970 కుటుంబాలకు పూర్తిస్థాయిలో రూ.10 లక్షల (రూ.9.80 లక్షల, రూ. 20 వేలు బీమా) మేర ఆర్థిక సాయం అందించారు. ఇందులో వివిధ వ్యాపారాలతోపాటు, తయారీ, ఉత్పత్తి, డెయిరీ, పౌల్ట్రీ మోటారు వాహనయూనిట్లు , మిగిలిన 3,100 మంది మాత్రం రిటైల్ యూనిట్లు ఎంచుకున్నారు. తొలివిడతగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నిధులు డ్రాచేసుకుని వ్యాపారాలు ప్రారంభించారు. వీరిలో కొందరు రెండో విడత కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా యూనిట్‌కు సంబంధించిన సామగ్రి కొటేషన్ కూడా దళితబంధు యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు గుర్తింపులేని సంస్థల నుంచి కొటేషన్స్ తీసుకున్న విషయాన్ని మండలాల్లోని క్లస్టర్ ఆఫీసర్లు గుర్తించారు. అలాంటి కొటేషన్లు మంజూరు చేస్తే.. నిధులు దారి మళ్లే ప్రమాదముంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అనుమానాస్పద దరఖాస్తులను తిరస్కరించారు. దీనికితోడు కొందరు దళారులు తాము కొటేషన్లు ఇస్తామంటూ నిరక్షరాస్యులైన లబ్ధిదారుల వద్ద డబ్బులు కూడా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోయాయి. మరోవైపు గుర్తింపులేని చాలా సంస్థల వద్ద సరుకు కోసం డబ్బులు కట్టినవారు మోసపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ లీగల్ అఫిడవిట్ నిబంధనను ప్రవేశపెట్టారు. ఇవీ నిబంధనలు ♦ అఫిడవిట్ జారీ చేసే వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నెంబరును కలిగి ఉండాలి. ♦ సదరు జీఎస్టీ నెంబరు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే తీసుకున్నది అయి ఉండాలి. తద్వారా నకిలీ ఇన్వాయిస్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ♦ లబ్ధిదారులు హుజూరాబాద్ మండలాలైన హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట వ్యాపారుల నుంచి రా మెటీరియల్ సప్లై కోసం ఇచ్చే కొటేషన్లు ♦ తీసుకోరు. ఇటీవల ములుగు నుంచి గుర్తింపు లేని ఓ సంస్థ కొటేషన్‌ను అధికారులు గుర్తించడమే ఇందుకు కారణం. ♦ లీగల్ అఫిడవిట్ మీద వ్యాపారి వివరాలు, దళితబంధు లబ్ధిదారులకు సరఫరా చేసే సామాగ్రి వివరాలు పొందుపరిచి ఉండాలి. అంతేకాదు, తానేమైనా తప్పుడు ♦ సమాచారం ఇచ్చి ఉంటే కలెక్టర్ తీసుకునే చట్టపరమైన చర్యలకు బద్ధుడినై ఉంటానంటూ సంతకం కూడా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ♦ లబ్ధిదారులు హుజూరాబాద్ కాకుండా హైదరాబాద్, కరీంనగర్, రాష్ట్రంలో జీఎస్టీ గుర్తింపు పొందిన ఏ వ్యాపారి వద్ద నుంచైనా కొటేషన్ తీసుకురావచ్చు. వాటిని ఎంపీడీవోలు వెరిఫై చేసి, ఉన్నతాధికారులకు పంపుతారు. పారదర్శకత కోసమే దళితబంధు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం. నిధుల మంజూరులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కొత్తగా లీగల్ అఫిడవిట్ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీంతో లబ్ధిదారులకు నాణ్యమైన ముడిసరుకు లభిస్తుంది. తప్పుడు కొటేషన్లతో అటు ప్రభుత్వ అధికారులు, ఇటు లబ్ధిదారులను మోసం చేసే వీలు లేకుండా ఉంటుంది. దళారీ వ్యవస్థకు చెక్ పడనుంది. పథకం అమలులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకత అమలు అయ్యేలా చూడటమే ప్రభుత్వ బాధ్యత. – ఆర్వీ కర్ణన్, కలెక్టర్, కరీంనగర్ -
ప్రచార గడువు ముగిసిన మునుగోడులోనే తిష్టవేసిన నాన్ లోకల్స్
-
మునుగోడులో రోడ్డెక్కిన ఓటర్లు.. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి ..
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.ఎన్నికకు(నవంబర్3) ఒకరోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు, తమ మద్దతురాలు ఓటర్లకు జోరుగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. అయితే తమకు డబ్బులు ఇందలేదని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. రూ. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి తక్కువ ఇచ్చారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు చెప్పిన విధంగా డబ్బులు పంచాలని మహిళా ఓటర్లు రోడ్డెక్కారు. ఇదిలా ఉండగా ప్రచారం గడువు ముగిసినా మునుగోడులో నాన్ లోకల్స్ తిష్ట వేశారు. మునుగోడు మండలం కోతులారంలో 30 మంది నాన్ లోకల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నిస్తే భోజనాల కోసం ఆగమంటూ తలా తోక లేని సమాధానాలు చెబుతున్నారు. ఇలా నియోజకవర్గంలోని చాలాచోట్ల ఇతర జిల్లాల నేతలు మకాం వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు! -
Munugode Bypoll: తగ్గేదేలే..!.. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆరు నూరైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రెండు పార్టీల అభ్యర్థులు మాత్రం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బుల పంపిణీ జోరందుకుంది. మద్యం విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. కుల, మహిళా, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు అడిగినంత ముట్టచెబుతున్నాయి. మరోవైపు విందులు, వినోదాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఇస్తున్న తాయిలాలు ఓటర్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల ఖర్చు రూ.150 కోట్లు దాటిందని ఓ సర్వే లెక్క కట్టింది. అయితే ధన ప్రవాహాన్ని అదుపు చేయాల్సిన ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బతుకమ్మ పండగకు భారీ ఖర్చు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి బతుకమ్మ పండగ కోసం మహిళలను సమీకరించారు. చౌటుప్పల్, మునుగోడులో జరిగిన బతుకమ్మ పండగ కోసం వచ్చిన మహిళలు ఒక్కొక్కరికి రూ.500 చెల్లించారు. ఒక్కో చోట సుమారు 4 వేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించారు. మున్సిపాలిటీలు, మండలాల్లో టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రతి చోట సుమారు 8వేల మందికి విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేశారు. చండూరులో నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రూ.500, బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ లిక్కర్ కోసం లక్షల్లో ఖర్చు చేశారు. ఇలా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు చేరో రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. నామమాత్రంగా ఎన్నికల పరిశీలకులు ఎన్నికల కమిషన్ పరిశీలకులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని, కోట్లలో డబ్బు ఖర్చు అవుతున్నా ఎక్కడా పట్టుకున్న జాడలు కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మొక్కుబడిగా లెక్కలు రాస్తున్నారని విమర్శిస్తున్నారు. రూ. కోట్లలో మద్యం అమ్మకాలు ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు తారాస్థాయికి చేరాయి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రూ. కోట్లల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చే చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట మండలాల్లోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 10 వరకు రూ.44,54,01,197 కోట్ల లిక్కర్, బీర్ల అమ్మకాలు జరిగాయి. మీటింగులకే కోట్లలో ఖర్చు మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీల సభలకే కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. సెప్టెంబర్ 20న మునుగోడులో కేసీఆర్, 21 అమిత్‌షా సభల కోసం దాదాపు రూ.60 కోట్లకుపైగా ఖర్చయినట్లు సమాచారం. అలాగే చేరికల కోసం ఒక్కో సర్పంచ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దసరా పండుగ రోజు నియోజవకర్గంలోని 298 బూత్‌లకు బీజేపీ ప్రతి బూత్‌కు రూ.20 నుంచి 20 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రతి బూత్‌కు రూ.10 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యే స్థాయినుంచి మంత్రి వరకు ఇన్చార్జ్ లను నియమించింది. అయితే ఒక్కొక్కరి వెంట 25 మంది నుంచి 30 మంది వచ్చి ఆ పరిధిలో ప్రచారం చేస్తున్నారు. వీరికి భోజనాలు, రవాణ ఖర్చులు భారీగానే అవుతున్నాయి. కుల సంఘాల సమావేశాలకు అంచనాలకు మించి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలను మున్సిపాలిటీలు, మండలాల వారీగా లక్షలు ఖర్చు చేశారు. -
అక్కడ బటన్ నొక్కితే చాలు డబ్బులు టంగ్ టంగ్ అని పడ్డాయి..
-
కోట్లు పట్టుకుని.. మళ్లీ ఇచ్చేశారు!: విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో దొరికిన డబ్బునంతా దాదాపు తిరిగి ఇచ్చేశారు. నమోదు చేసిన పోలీస్ కేసుల పరిస్థితి సైతం బుట్టదాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ – కేసుల నమోదు తదితర అంశాలపై సుపరిపాలనా వేదిక సేకరించిన సమాచారంలో విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడైయ్యాయి. ఈ మేరకు ఫోరం కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కు లేఖ రాస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైన తీరుపై తీవ్ర అంసతృప్తిని వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికను ఒక కేస్ స్టడీగా తీసుకుని ఎన్నికల్లో డబ్బు పాత్రను పూర్తిగా తగ్గించేందుకు వెంటనే తగు మార్గదర్శకాలు విడుదల చేయాలని పద్మనాభ రెడ్డి కోరారు. 94 కేసులు నమోదు... హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అక్టోబర్1 నుంచి నవంబర్ 2 వరకు వివిధ ప్రాంతాల్లో రశీదులు లేని రూ.3.80 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 94 కేసులు నమోదు చేశారు. ఇందులో కేవలం 18 లక్షలే కోర్టుకు సమర్పించి, మిగిలిన కేసుల్లో డబ్బంతా వాపస్ ఇచ్చేశారు. 94 కేసుల్లో కేవలం ఐదు కేసుల్లోనే అభియోగాలు నమోదు చేయగా, అందులో రెండు కేసులు పేకాటకు సంబంధిం చినవి కాగా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన డబ్బు పంపిణీకి సంబంధించి మూడు కేసుల్లో మాత్రమే అభియోగాలు నమోదు చేశారు. చదవండి: మోదీ జీ... ప్లీజ్ పెంచండి.. పోస్ట్‌కార్డ్ సందేశాల పవర్ ఇది! -
కుప్పం ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ డబ్బులు పంచుతోంది
-
హుజురాబాద్ లో గందరగోళం
-
YSR Asara: ‘వైఎస్సార్ ఆసరా’పై విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు అక్టోబర్ 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా’ రెండో విడత డబ్బుల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందే మహిళలు తమ జీవనోపాధులు పెంపొందించుకునేందుకు మందుకొస్తే అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించేలా సెర్ప్ సిబ్బంది తోడ్పాటు అందిస్తారని వివరించారు. పాదయాత్ర హామీ మేరకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకం అమలుకు సిద్ధమైన విషయం తెలిసిందే. పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 87 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.6,470 కోట్లు మేర ప్రయోజనం చేకూరనుంది. వలంటీర్లు, వీవోఏ, ఆర్పీలు ఇప్పటికే తమ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సమాచారం అందిస్తున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ నెల 24వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు సెర్ప్, మెప్మా కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు నాలుగు రోజులు పాటు సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. అక్టోబరు 3, 4, 5, 6వ తేదీలలో సెర్ప్, మెప్మా అధికారులు గ్రామాలు, వార్డులవారీగా సమావేశాలు నిర్వహించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా సంఘాలకు ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు చెల్లిస్తుందన్న వివరాలను తెలియజేస్తారు. అక్టోబరు 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పది రోజుల పాటు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక మండలంలో వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి నిర్వహిస్తారు. -
పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?
పాట్నా: త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ గ్రామంలో పర్యటించాడు. అక్కడి గ్రామస్తులకు రూ.500 నోట్లు ఇస్తూ వీడియోకు చిక్కాడు. ప్రస్తుతం ఆ వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పట్టపగలు నగదు రాజకీయం జరగడంపై అధికార పార్టీ గుర్రుమంది. ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్‌కుమార్ శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) యువ నాయకుడు, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతూ కనిపించారు. తన కాన్వాయ్‌లో కూర్చుని అక్కడకు వచ్చిన మహిళలకు బహిరంగంగా రూ.500 నోట్లు ఇస్తున్నాడు. ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్’ అని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోపై అధికారులకు అధికార పార్టీ జేడీయూ ఫిర్యాదు చేసింది. దీంతో గోపాల్‌గంజ్ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. బైకుంత్‌పుర్ సమీపంలో తేజస్వి డబ్బులు పంచాడని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు, బీడీఓను విచారించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ డబ్బు పంపిణీ అధికార పార్టీ, ఆర్జేడీ మధ్య వాగ్వాదం మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి कोई जानता नहीं-पहचानता नहीं कौन है ये राजकुमार जिसने आंचल में रुपया गिराया है घमंड का खुमार इस कुमार पर इतना छाया, अमीरी-गरीबी का फ़र्क़ बताया कोई पीछे से लालू का लाल है बताता भूत के वर्तमान का हाल दिखाता जाओ बबुआ अपनी पहचान बनाओ आर्थिक लुटेरे होने का दाग़ मिटाओ pic.twitter.com/lUgV3Hxl11 — Neeraj kumar (@neerajkumarmlc) September 10, 2021 -
అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు డబ్బు పంచుతూ.. అడ్డంగా బుక్కయ్యారు. వైఎస్సార్ జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కారు. జిల్లాలో ఇప్పటికే చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. ఈ క్రమంలో తెలుగుదేశం నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కాజీపేట మండలం దుంపల గట్టు గ్రామంలో టీడీపీ తమ మద్దతుదారుడిని బరిలో నిలపడమే కాక అతడిని గెలిపించాలంటూ డబ్బు పంచుతూ గ్రామస్తులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. (చదవండి: పట్టాభి ఇంట్లో పచ్చ డ్రామా!) టీడీపీ నాయకుల చర్యల గురించి గ్రామస్తులే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. వారు రంగంలోకి దిగారు. పలువురు టీడీపీ నాయకులను అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరి వద్ద నుంచి 50 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. -
బీజేపీవి చిల్లర ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో నాలుగు ఓట్లు సంపాదించేందుకు భారతీయ జనతా పార్టీ చిల్లర ప్రయత్నాలన్నీ చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమ ర్శించారు. ఇప్పటికే డబ్బుల డ్రామా ఫెయిలైందని, సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం, మితిమీరిన అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల దృష్టిని మళ్లించేం దుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలే దన్నారు. దీంతో చివరగా హైదరాబాద్‌లో కార్యకర్త లను రెచ్చగొట్టి చివరి దశ డ్రామాకు తెరలేపుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కార్యక్రమాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తది తరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ప్రచారం దారుణం..: దుబ్బాక సెగ్మెంట్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయని, కానీ కేవలం బీజేపీ నేతల ఇళ్లపైనే దాడులు జరుగుతున్నాయనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు దొరకడం వాస్తవమని, ఆ ఇంటి ఆడపడుచులే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారన్నారు. తాజాగా హైదరాబాద్‌లో రూ.కోటి నగదు పట్టుబడిందని వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడిపై దాడి జరిపినట్లు, ఎమ్మెల్యే అభ్యర్థి చెయ్యి విరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరగడం సహజమని, కానీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు తప్పుదారి పట్టడం సరికాదని హితవు పలికారు. బీజేపీదీ హింసాత్మక మార్గం.. ప్రజల మద్దతు సాధించేలా కార్యక్రమాలు ఉండాలని, బీజేపీ అలాంటి దారి కాకుండా హింసాత్మక మార్గాన్ని ఎంచుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు. బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టినట్లు తమకు సమాచారం ఉందని, దీన్ని ఆసరాగా చేసుకుని సోమవారం హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కార్యక్రమాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే కార్యకర్తలకు సమాచారాన్ని చేరవేశారన్నారు. సోమవారం నాటి కుట్రకు సంబంధించిన సమాచారం బీజేపీ క్యాంపు నుంచే తమకు లీకైందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయం లేదా ప్రగతిభవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో బీజేపీ సోమవారం కార్యచరణకు సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లాఠీచార్జ్ జరిగేలా అవసరమైతే ఫైరింగ్ జరిగేలా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారన్నారు. దీంతో వచ్చే సానుభూతిని దుబ్బాక ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు చూస్తోందని విమర్శించారు. కార్యకర్తల ప్రాణాలను పణంగా పెట్టి ఓట్లు రాబట్టాలనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఆ కుట్రలను టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది.. బీజేపీ చేసే కుట్రలను టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎదుర్కొంటోందని, ఈ అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ బాధ్యులు, ప్రచారకర్తలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించే ఏ కార్యక్రమాన్ని ఉపేక్షించొద్దని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. బీజేపీ చేసే కుట్రను భగ్నం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇటు డీజీపీకి తమ పార్టీ తరఫున వినతిపత్రాన్ని కూడా ఇచ్చామన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సైతం వినతి పత్రం ఇస్తామని తెలిపారు. బీజేపీలాంటి రాజకీయ శక్తి పట్ల దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆనంద్, వెంకటేశ్, గోపీనాథ్ తదితరులున్నారు. -
నగదు బదిలీ షురూ
సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం తెల్ల రేషన్ కార్డున్న ప్రతీ కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదును బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. అందరికీ డబ్బులు చేరతాయి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘రేషన్ షాపుల ద్వారా నియం త్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలి’అని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. వారి కుటుంబసభ్యులు, వారు కలసిన వారిని కూడా గుర్తించి క్వారం టైన్ చేసినట్లు తెలిపారు. పాజిటివ్ కేసులు ఎక్కువైనప్పటికీ అందరికీ చికి త్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి ని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు. వరి కోత లు, ధాన్యం ఇతర పంటల కొను గో ళ్లు యథావిధిగా జరపాలని చెప్పా రు. ఇక శనివారం ప్రధాని నరేంద్రమోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణ రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు చేసిన సూచనలివే.. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి. దేశంలో, రాష్ట్రంలో లాక్డౌన్ అమలు కావడం వల్లనే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదు. ఈ సత్యాన్ని గ్రహించి ప్రజలు సహకరించాలి. లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలి. పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ షాపుల వద్ద జనం ఒకే దగ్గర పోగవ్వకుండా దూరం పాటించాలి. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను సరిగ్గా నిర్వహించాలి. రైతులు చెప్పిన సమయానికే వచ్చి, తమ ధాన్యం అమ్ముకుని పోవాలి. పట్టణ ప్రాంతాలు, ఇతర చోట్ల వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను, సహాయ కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించాలి. -
పేదలకు తోడుగా సీఎం వైఎస్ జగన్
-
ఏపీవ్యాప్తంగా పేదలకు ఆర్ధిక సహాయం
-
‘కట్ట’లు తెంచుకున్నాయ్!
సాక్షి నెట్వర్క్,నల్లగొండ : ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు చివరి అస్త్రంగా అడ్డూఅదుపు లేకుండా తాయిలాలు చెల్లించేశారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఎన్నికల్లో ఓటర్లకు నగదు, మద్యం, బియ్యం, కిరాణ సరుకులు వెండి, బంగారు ఆభరణాలు పంపిణీ చేశారు. సోమ, మంగళవారాల్లో పోటీపోటాగా నగదు పంపిణీ చేయగా, బుధవారం కూడా ఈ ‘పంచు డు’ కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కొన్ని మున్సిపాలిటీల్లో గంటగంటకూ ఓటు రేటు పెంచుకుంటూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక పార్టీ అభ్యర్థి ఓ టుకు ఇంత అని ఇస్తే.. మరో పార్టీ అభ్యర్థి దానికి కొంత కలిపి ఎక్కువ ముట్టజెబుతున్నాడు. చండూరులోని ఓ వార్డులో ఓటుకు ఏకంగా రూ.15వేల దాకా చెల్లిస్తుండడం గమనార్హం. ♦ నీలగిరి మున్సిపాలిటీలో అభ్యర్థులు పోటా, పోటీగా డబ్బుల పంపిణీ చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు బీజేపీలోని కొంత మంది అభ్యర్థులు ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చారు. వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి.. ప్రత్యర్థికి చెందిన అనుకూల ఓటర్లకు రూ.1500 చొప్పున పంపిణీ చేసినట్లు ఓటర్లే చెబుతున్నారు. టూటౌన్ ప్రాంతంలోని ఓ వార్డులో రూ.1500 నుంచి రూ.2 వేలు, ఆఫ్ బాటిల్ మందు పంపిణీ చేసినట్లు తెలిసింది. ♦ మిర్యాలగూడలో కొన్ని వార్డులలో ఓటు రేటు అమాంతం పెరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటుకు వెయ్యి రూపాయలు పంచాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అనుకున్నారు. కానీ గెలుపే లక్ష్యంగా ఒక్కసారిగా రేటు పెంచారు. పట్టణంలోని ప్రధానంగా పోటీ ఉన్న వార్డులలో ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసినవి కాకుండా పోలింగ్‌కు వెళ్లే ముందు కూడా మళ్లీ ఇస్తామని హామీ ఇస్తున్నారు. ♦ దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈసారి ఓటుకు రేటు బాగా పెరిగింది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా మరీ కీలక వార్డుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట ర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు వెదజల్లుతున్నా రు. మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో ఓటుకి సు మారు రూ.7వేల వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. సోమవారం నాటికే ఎక్కువ శాతం ఓటర్లకు డబ్బులు చేరాయి. ♦ చండూరు మున్సిపల్ ఎన్నికలు మరీ కాస్ట్లీ అయ్యాయి. ఇక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.10వేల వరకు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు అడుగు ముందుకేసీ ఓటుకు రూ.15వేలకు పైగా ఇస్తున్నా రు. ఇవేగాకుండా బియ్యం బస్తాలు, మద్యం, మహిళలకు చీరలు తదితర వస్తువులు అందించినట్లు తెలుస్తోంది. ♦ హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఓటు విలువను రూ. 7వేల వరకు పెంచారు. మంగళవారం పలు వార్డుల్లో ఓటుకు రూ.2వేలు, మరికొందరికి రూ. 2500 నుంచి రూ. 7వేల వరకు డబ్బులు పంపిణీ చేశారు. వీటితోపాటు చీరలు, మద్యాన్ని క్వార్టర్‌నుంచి పుల్ బాటిల్ వరకు మద్యం పంపిణీ చేశారు. ♦ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో ఓటరుకు రూ. 2వేల నుంచి రూ. 5వేల వరకు పంపిణీ చేయడంతో పాటు చీరలు, మద్యాన్ని ముట్టజెప్పారు. -
తాగినంత మద్యం.. జేబునిండా డబ్బు
గద్వాల: మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని ఓటర్లకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తాగినంత మద్యం పోస్తూ.. ఆడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటరు చొప్పున విడదీస్తూ రూ.500 నుంచి రూ.2 వేల ముట్టజెప్పుతూ.. వారి ఓట్లను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా వార్డుల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు, అభ్యర్థులు పడరాని పాట్లుపడుతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్ల కోసం ఆయా పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు మంతనాలు సాగిస్తూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రాత్రికి రాత్రే వార్డుల్లో రహస్యంగా పర్యటిస్తూ మద్యం, డబ్బులను విచ్చలవిడిగా ఓటర్లకు అందిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ఓటర్లు సైతం నాయకులు, కార్యకర్తలను తమ ఇష్టాలకు ఉపయోగించుకుంటున్నారు. తమ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ అభ్యర్థులను నమ్మిస్తూ డబ్బులు ఆశిస్తున్నారు. అభ్యర్థులు సైతం అడిగిందే తడవుగా రూ.వేలు ఇచ్చేస్తున్నారు. డబ్బులు, మద్యంతోపాటు కాలనీల్లో యువకులకు అవసరమయ్యే క్రికెట్ కిట్లు, ఇతర వస్తు సామగ్రిని అభ్యర్థుల నుంచి బలవంతంగా అడిగి పుచ్చుకుంటున్నారు. మహిళలకు ఇంటికి వెళ్లి చీరలను అందజేశారు. ఓట్లను ఆశిస్తున్న అభ్యర్థులు సైతం కాదనకుండా అందిస్తున్నారు. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో భారీగా ఓటర్లకు మద్యం అందజేసేందుకు.. రహస్యంగా మద్యం నిల్వలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వారి అనుచరుల ద్వారా డబ్బులు సైతం ఇప్పటికే వార్డుల్లోని బలమైన ఓటర్లుకు, వివిధ సంఘాలకు అందజేశారు. మరి కొంత నగదు అభ్యర్థులకు ఇచ్చి రాత్రివేళల్లో పంచడానికి ప్రణాళిక రూపొందించారు. దాదాపు అన్ని వార్డుల్లో ‘ఓటుకు నోటు’ అనే సంప్రదాయం కొనసాగుతోంది. డబ్బులు, మద్యాన్ని వివిధ పార్టీల అభ్యర్థులు ఎర చూపుతుండటంతో కార్యకర్తల్లో కూడా డబ్బుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది. గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లోని 77 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు, మద్యం, చీరలు పంచడానికి నిమగ్నమయ్యారు. ఇప్పటికే సగానికిపైగా వార్డుల్లో డబ్బులు పంపిణీ చేశారు. ‘మూడు నోట్లు.. ఆరు బాటిళ్లు’ అన్న చందంగా అభ్యర్థులు ఓటర్లను ఆకర్శిస్తున్నారు. ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి.. ఇదిలా ఉండగా నాయకుల ఫోన్లు బిజీగా మారాయి. ఒక్కొక్క వార్డు నుంచి చోటామోటా నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకుల నుంచి వచ్చే ఫోన్లతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘అన్నా ఇప్పుడే అవతలి పార్టీ వారు వచ్చి ఇక్కడ డబ్బు పంచారు..’ ‘అన్నా ఫలానా వారికి మందు సీసాలు సప్లయ్ చేయాలి..’ అన్న మాటలతో నేతల ఫోన్లు నిర్విరామంగా మోగాయి. ఎప్పటికప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ గెలుపే లక్ష్యంగా తొక్కాల్సిన దొడ్డి దార్లన్నీ అభ్యర్థులు తొక్కేశారు. -
ఇంటికొస్తాం..ఇచ్చిపోతాం!
సాక్షి, మేడ్చల్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. ఇక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెరవెనుక రాజకీయాలు..తాయిలాల జోరు ఊపందుకుంది. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చివరి నిమిషం తతంగాలకు తెరలేపారు. పట్టణాలు, కాలనీల్లో మద్యం, డబ్బు పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తైతే..పోలింగ్‌కు ముందు రోజు...పోలింగ్ రోజువ్యవహరించాల్సిన తీరుపై అభ్యర్థులు అలర్ట్ అయ్యారు. కాగా, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో ఆరు రోజుల పాటు ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారం, రోడ్‌షోలు, ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాన పార్టీల నేతలు పాల్గొన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం టీఆర్ఎస్ మంత్రులు మల్లారెడ్డి ,సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మహామూద్ అలీ తదితరులు చారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు రోడ్‌షోలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ అధ్యక్షుడు టి.లక్ష్మణ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి , ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు తదితరులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాయిలాలతో ఎర రెండు జిల్లాల్లోని 631 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 2,501 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. వీరంతా గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చివరి రోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పెద్దఎత్తున తాయిలాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. బంధువులు, మిత్రులు, పార్టీ ముఖ్యులను రంగంలోకి దింపి..గుట్టుగా తాయిలాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నుంచి ప్రారంభించారని తెలిసింది. కొన్నిచోట్ల గంప గుత్తగా కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీకి సిద్ధమవుతున్నారు. కొన్ని వార్డుల్లోనైతే కుటుంబానికి అర తులం బంగారం అందజేయటానికి హామీలు ఇస్తున్నారు. అలాగే జనరల్ వార్డుల్లో ఓటుకు రూ.5 వేలు పలుకుతుండగా, బీసీ రిజర్వుడ్ వార్డుల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు పంపిణీ చేస్తున్నారని తెలిసింది. అలాగే, మద్యం బాటిళ్లు పంపిణీ చేసేందుకు వీలుగా ప్రత్యేక ప్రాంతాలు, కాలనీల్లో మద్యం డంపింగ్ చేసినట్లు తెలుస్తున్నది. వార్డుల్లోని కుల సంఘాలు, కాలనీలు, అపార్టుమెంట్లు, అసోసియేషన్లకు మాత్రం ఓట్ల సంఖ్యను బట్టి హామీలిస్తున్నారని తెలుస్తోంది. -
పోస్టాఫీస్‌లో సొత్తు స్వాహా..!
సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారే జిల్లా స్థాయి అధికారుల కళ్లు కప్పి రూ.33లక్షల లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. చింతపల్లి మండల తపాలా కార్యాలయం పరిధిలోని చింతపల్లి, నసర్లపల్లి, గడియగౌరారం, వింజమూరు, కుర్రంపల్లి, మధనాపురం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో తపాలా సేవలు అందుతున్నాయి. ఇటీవల మండల కేంద్రానికి ఎస్పీఎంగా వచ్చిన ఓ ఉద్యోగి గ్రామాల్లోని బీపీఎంలకు తక్కువ నగదు ఇచ్చి ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో బీపీఎంలు ఉపాధి హామీ, పెన్షన్ తదితర సేవలు అందిస్తుంటారు. అయితే వీరికి మండల కేంద్రంలోని తపాలా కార్యాలయం నుంచి నిత్యం లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన తపాలా కార్యాలయం ఎస్పీఎం, బిపిఎంలకు ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి బీపీఎంలకు మాత్రం తక్కువ నగదు ఇచ్చి జిల్లా అధికారులకు ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి అధికారులు కూడా గ్రామ బీపీఎంలు ఇచ్చే రికార్డులను సరిపోల్చుతారు. దీంతో రూ.33లక్షల సొమ్ము తేడా రావడంతో తీరా ఎస్పీఎం సొమ్ము స్వాహా చేసినట్లు గుర్తించారు. చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారి రూ.33లక్షల సొమ్మును స్వాహా చేయగా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టడమే కాకుండా అధికారులు అక్రమార్కున్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటకు చెప్పకుండా విచారణ చేసి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారిని కాపాడే ప్రయత్నంలో జిల్లా అధికారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగిన ఆసరా పెన్షన్లు గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ను తపాలా కార్యాలయం నుంచి పంపిణీ చేస్తోంది. చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఈనెల మొదటి వారం నుంచే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా కార్యాలయానికి రావాల్సిన పెన్షన్ ఇప్పటికీ జమ కాలేదు. దీంతో దసరా పండుగ సందర్భంగా ఆసరా అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. సెలవుల్లో ఎస్పీఎం తపాలా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన సంబంధిత అధికారి గత వారం రోజుల నుంచి సెలవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన అధికారిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే తేల్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా జిల్లా అధికారులు జాగ్రత పడుతున్నట్లు సమాచారం. అధికారుల సూచన మేరకే సదరు ఉద్యోగి సెలవుల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
డబ్బుల్ ధమాకా
తొలకరి జల్లులు కురిసింది మొదలు దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం ఇలా అన్నదాతకు ఎన్నో రకాల ఖర్చులుంటాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగుబాట పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా.. వర్షాభావం, కరువు కాటకాలతో పెట్టుబడి చేతికి రాకపోగా చివరికి చేసిన అప్పులే మిగులుతున్నాయి. మరోపని చేయలేక ఉన్న భూమిని నమ్ముకుని కష్టాల సాగు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. వారి కష్టాలను దూరం చేసేందుకు.. మొహాల్లో చిరునవ్వును చిందించేందేకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పీఎం కిసాన్ పథకంలో ప్రతిరైతుకు రూ.6వేల చొప్పున అందిస్తోంది. వారి వివరాలు కూడా కలిపితే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సాక్షి, మెదక్ : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్సమ్మన్ నిధి పథకం కింద ప్రతిరైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకంలో ఐదెకరాల లోపు ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా పేర్కొంది. జిల్లాలో ఐదెకరాల లోపు 1,18,386 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఏడాదికి ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.71కోట్ల 30 లక్షల 16వేలు అవుతోంది. వీటిని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఇంకా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు రాని వారు చాలా మంది ఉన్నారు. రైతుబంధుతో రూ.372 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున అందించేది. దానిని ప్రస్తుతం రూ.5 వేలకు పెంచింది. ఖరీఫ్, రబీసీజన్ కలిపి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇవ్వనుంది. జల్లాలోని 2,11,104 మంది లబ్ధిదారులలు 3.70 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి రూ.372 కోట్లను ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించనుంది. ఎకరం భూమి ఉన్న రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. రెండు ప్రభుత్వాలు కలిపి ఏడాదికి రూ.16 వేల చొప్పున అందిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జిల్లా రైతులకు రూ.443 కోట్ల 30 లక్షల 16వేలను అందిస్తున్నాయి. ‘రైతుబంధు’ అందింది ప్రభుత్వం రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం అన్నదాతలకు గొప్పవరం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత మంచి పథకాన్ని తీసుకురాలేదు. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం హర్షించదగిన విషయం. నాకు ఉన్న రెండన్నర ఎకరాలకు సంబంధించి రూ.12,500 వచ్చింది. దీంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేదు. – కొమ్మాట బాబు, రైతు, నిజాంపేట -
‘రైతుబంధు’వు రూ.88.81 కోట్లు
హన్మకొండ: వాన చినుకు పడింది మొదలు పొలం, సాగు పనులే లోకంగా అన్నదాతలు జీవనం సాగిస్తారు.. అయితే, అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇంకా చెబితే చీడపీడల కారణంగా అన్నదాతకు పంటలపై వచ్చే ఆదాయం ఏ మూలకు సరిపోవడం లేదు.. ఫలితంగా ఎప్పటికప్పుడు పెట్టుబడి సాయం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.4వేల చొప్పున సాయం అందించేందుకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున నగదు అందజేశారు. అయితే, గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టుబడి సాయాన్ని రూ.5వేలకు పెంచనున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ హామీని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ నగదును ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రణాళికాయుతంగా.. గత వానాకాలం, యాసంగి సీజన్లో రైతుబంధు కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఇప్పుడు మూడో సారి ప్రస్తుత వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.5 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెలలో రైతులకు రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. జిల్లా నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. రబీలో రైతుబంధు అందించే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నగదు రూపంలో కాకుండా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. దీంతో అదే విధానాన్ని ఈ ఖరీఫ్‌లోనూ అమలు చేయనున్నారు. ఇప్పటికే వివరాలన్నీ సిద్ధం కాగా.. ఈనెలలోనే రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందజేయనున్నారు. 11 మండలాలు... 77,079 మంది రైతులు వరంగల్ అర్బన్ జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 77,079 మంది రైతులు, 1,77,619.2 ఎకరాల సాగు భూమి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు ఎకరాకు రూ.5వేల చొప్పున జిల్లాలోని రైతులకు రూ.88,81,25,992.5 పెట్టుబడి సాయం అందనుంది. -
రైతుబంధుకు సన్నద్ధం
మహబూబ్‌నగర్ రూరల్: ఖరీఫ్‌లో పంటల సాగుకు రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు వ్యవసాయశాఖ అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ఉండటంతో ఆ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఈ–కుబేర్ ద్వారా ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేని రైతులకు ఈ పథకం వరంగా మారింది. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు రబీ, ఖరీఫ్ సీజన్లలో పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఖరీఫ్ సీజన్లో రైతులకు చెక్కుల రూపంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. రబీలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈసారి వానాకాలం పంట (ఖరీఫ్) కోసం కూడా రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈసారి ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇవ్వనుండటంతో రైతాంగంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పెట్టుబడి సాయం పెంపు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.2 వేలు పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో రెండు పంటలకు కలిపి రూ.8 వేలు ఉన్న సహాయాన్ని ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లించనున్నారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు తమ వ్యవసాయ పంట క్షేత్రాల్లో పంటల సాగుకు పెట్టుబడి కోసం గతంలో బ్యాంకుల ముందు నిరీక్షించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అధికారులు రుణాల కోసం సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసేవారు. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులకు ఆ ఇబ్బందులన్నీ తప్పినట్లయింది. వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పు రైతులకు భారంగా మారి ఆత్మహత్యలు చేసుకునేవారు. వ్యాపారుల వడ్డీ కిందకే పండించిన పంట ఇవ్వాల్సి వచ్చేది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసి సాయం చేసింది. గత ఖరీఫ్ సీజన్లో.. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం అమలులో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని 3,35,252 మంది రైతులకు రూ.355.21 కోట్లు మంజూరు చేయగా రూ.219.67 కోట్ల పెట్టుబడి సాయం కింద 2,87,128 మంది రైతులకు అందింది. వివిధ కారణాలతో రూ.136.21 కోట్లు రైతులకు అందలేదు. రబీ సీజన్లో రూ.342.12 కోట్లు జిల్లాకు విడుదల కాగా అందులో రూ.307.7 కోట్లు పెట్టుబడి కింద 2,62,612 మంది రైతులకు పంపిణీ చేశారు. పలు కారణాల వల్ల పంపిణీకి నోచుకోని రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఆనాడు నిలిచిపోయిన పెట్టుబడి పంపిణీపై వ్యవసాయ శాఖాధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయడం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలన్లి రైతులు కోరుతున్నారు. గతేడాది రూ.697.33 కోట్లు 2018–19 ఖరీఫ్‌లో 2,82,783 మంది రైతులకు రూ.219.67 కోట్లు అందించారు. అలాగే రబీ సీజన్లో 2,62,612 మంది రైతులకు రూ.307.7 కోట్లు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింద జిల్లాకు రూ.697.33 కోట్లు కేటాయించినా రూ.526.33 కోట్లు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడం గమనార్హం. సమస్యలు అధిగమించేనా..? గతేడాది ఖరీఫ్ నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టారు. కొంతమంది భూస్వాములు, విదేశాల్లో ఉన్న వారు చెక్కులు తీసుకోలేదు. రెవెన్యూ రికార్డుల్లో తలెత్తిన గందరగోళంతో పలువురు చెక్కులు వచ్చినా తక్కువ భూమికి వచ్చాయని తీసుకోలేదు. దీంతో భారీగా చెక్కులు మిగిలిపోయాయి. యాసంగి సమయంలో ఎన్నికల కోడ్ వల్ల చెక్కుల పంపిణీపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ ముద్రించిన చెక్కులను పక్కన పెట్టి రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసింది. అయితే ఇతర దేశాలు, పట్టణాల్లో ఉన్న వారు బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో వారికి పెట్టుబడి సాయం అందలేదు. దీంతో 88,738 మంది రైతులు రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందుకోలేకపోయారు. ఇటీవల యాసంగికి సంబంధించిన చెల్లింపులన్నీ పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించారు. నేరుగా ఖాతాల్లో జమ ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుబంధు పథకం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెట్టుబడి సాయం పంపిణీ కొంత ఆలస్యమైంది. జిల్లా రైతులకు రైతుబంధు సాయం పంపిణీపై చర్యలు చేపడతాం. ప్రస్తుత సీజన్ నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తాం. జిల్లాలో ఇంకా కొంత మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించాల్సి ఉంది. ఏఈఓల ద్వారా వారి ఖాతా నంబర్లు సేకరిస్తాం. – సుచరిత, జేడీఏ, మహబూబ్‌నగర్ -
ఏపీలోనే అ'ధనం'
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఆదివారంతో ముగిసింది. మొత్తం ఏడు దశల్లో రూ.2,628 కోట్ల ధనం, మద్యం, బంగారం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పట్టుబడిన వాటి విలువ రూ.216.34 కోట్లు. అంటే దేశవ్యాప్తంగా పట్టుబడిన మొత్తం విలువలో ఇది పది శాతం. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఏ మేరకు ధనం, మద్యం ఏరులై పారిందో.. ఓటర్లను ఎంతగా ప్రలోభాలకు గురి చేశారో స్పష్టమౌతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందే దేశంలో అత్యంత అధికంగా ధన ప్రభావం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అధికార పార్టీ భారీ ఎత్తున ధనం, మద్యాన్ని పారించేందుకు సిద్ధమైన నేపధ్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా వేలాది కోట్ల రూపాయలను, లక్షలాది కేసుల మద్యాన్ని నియోజకవర్గాలకు తరలించారు. ఇందులో పది శాతం మాత్రమే పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుతో పోటీ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడుతో పోటీగా ఏపీలో భారీగా సొమ్ము పట్టుబడింది. తమిళనాడులో రూ.514 కోట్లు పట్టుబడగా, ఏపీలో రూ.216.34 కోట్లు సీజ్ చేశారు. తెలంగాణలో అన్నీ కలిపి రూ.77.49 కోట్లు సీజ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో రూ.141.13 కోట్ల ధనం, మద్యం, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. ఇప్పుడు రూ.216.34 కోట్ల విలువైన ధనం, వస్తువులు సీజ్ చేయడం గమనార్హం. ఏరులై పారిన మద్యం ఈ ఎన్నికల్లో ఊరూ వాడల్లో మద్యాన్ని ఏరులై పారించారు. గత ఎన్నికల్లో రూ.12.92 కోట్ల విలువైన మద్యం పట్టుబడగా.. ఈ దఫా రూ.26.31 కోట్ల విలువైన 6.70 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
కొంప ముంచారు!
‘నగర టీడీపీ నేతలు నా కొంప ముంచారు.. ఓటర్లకు ఇవ్వాల్సిన నగదులో కొంత నాయకులు మింగేశారు.. మనం వేసుకున్న ప్రణాళిక విధంగా ఓటర్లకు నగదు చేరలేదు.. నేను నమ్మిన నాయకులే నాకు వెన్నుపోటు పొడిచారు.. నేతల స్వార్థంతో నా కొంప మునిగేలా ఉంది’ అని మంత్రి నారాయణ నెల్లూరు పోలింగ్ సరళిపై తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కాగా టీడీపీ నాయకులు మంత్రి నారాయణ వ్యవహార శైలిపై స్పందిస్తూ ఏరు దాటాకతెప్ప తగలేసినట్లుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికలయ్యేంత వరకు తమతో పనిచేయించుకుని, ఇప్పుడు నగదు మింగేశామని నిందలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సాక్షి, నెల్లూరు: నెల్లూరుసిటీలో ఓటర్లకు నగదు పంపిణీ విషయంలో టీడీపీ నేతలు మోసం చేసి తన కొంప ముంచారని మంత్రి నారాయణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓటింగ్ అయిపోయిన తర్వాత తమను అవమానించడం ఎంతవరకు సబబు? అని నగర టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ, టీడీపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు. ఎన్నికల అనంతరం పోలింగ్ సరళిపై అంతర్గత సమావేశంలో మంత్రి నారాయణ అయన సన్నిహితుల వద్ద నగర టీడీపీలో ఉన్న కీలక నాయకులపై చిందులు తొక్కినట్లు సమాచారం. 70 వేల మంది నగదు అందలేదని సర్వేలో వెల్లడి తన కంటే తన డబ్బును చూసి నేతలు పనిచేశారని, ఓటుకు నోటు పంపిణీలో కొందరు నాయకుల ప్రమేయం పెట్టడంతో కొంత భాగం పంపకాలు చేయకుండా నిధులు మింగేశారంటూ నేతల తీరుపై మంత్రి నారాయణ మండిపడినట్లు సమాచారం. నగర నియోజకవర్గంలో సుమారు లక్షా యాభై వేల మంది ఓటర్లకు గాను ఒక్కో ఓటర్‌కు రూ.2 వేలు వంతున పంపకాలు చేసేందుకు మంత్రి నారాయణ నగదు సమకూర్చినట్లు తెలిసింది. అయితే అందులో సుమారు 70 వేల మంది ఓటర్లకు సక్రమంగా నగదు అందలేదని మంత్రి చేయించిన అంతర్గత సర్వేలో వెల్లడి కావడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ఓటర్లకు నగదు పంపిణీ వ్యవహారంలో ఎన్నో జాగ్రతలు తీసుకుని తమ విద్యాసంస్థల ఉద్యోగుల చేత పంపిణీ చేయించాలని చూసినా కీలక నేతలు నగదు పంపిణీ వ్యవహారంలో దూరి నగదు కాజేశారని ఆయన వాపోయినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో కీలకమైన ముగ్గురు నేతలతోపాటు టీడీపీ కార్పొరేటర్లకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చానని అవి కూడా చాలదన్నట్లుగా ఓటర్లకు నగదు పంపకాల విషయంలో కూడా దూరి అందులో నగదు కూడా కాజేయడంపై ఆయన నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ కీలక నేతలను నమ్మి నట్టేట మునిగేలా ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సహకరించిన వారిపై నిందలా? ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేని మంత్రి నారాయణ ఎన్నికల బరిలో దిగినప్పుడు అన్ని విధాలా సహకరించిన తమపై నగదు కాజేశారంటూ నిందలు మోపడంపై టీడీపీ కీలక నేతలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లగా పార్టీని నమ్ముకుని ఉన్న వారిని మంత్రి నారాయణ నమ్మకుండా ఓటుకు నోటు పంపిణీ వ్యవహారంలో ఆయన విద్యాసంస్థల ఉద్యోగుల చేత పంపకాలు చేయించుకుని తమపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలోమంత్రికి సహకరించినందుకు మమ్మల్ని దొంగలుగా ముద్రవేయడంపై వారు మండిపడుతున్నట్లు తెలిసింది. మంత్రి నారాయణ వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. -
వైఎస్సార్ సీపీ ఏజెంట్లే టార్గెట్!
సాక్షి, విజయవాడ : ఎన్నికల రోజు ఏజెంట్లే కీలకం. పోలింగ్ బూత్‌లో కూర్చుని దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటి ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసో, వారిపై తప్పుడు కేసులు పెట్టించో ఎన్నికల రోజు వారు మౌనంగా ఉండేలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లనే టార్గెట్ చేసి వార్ని పోలింగ్ బూత్‌లకు దూరంగా ఉంచేందుకు అనేక వ్యూహాలు పన్నుతున్నారు. డబ్బులు పంచుతున్నారంటూ ఫిర్యాదు.... వాస్తవంగా పార్టీలో దీర్ఘకాలంగా పని చేసేవారిని.. అభ్యర్థికి నమ్మకమైన వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటారు. డివిజన్ స్థాయిలో కీలకంగా ఉన్న వారిని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తమ ఏజెంట్లుగా నియమించుకున్నారు. దీంతో వీరిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు దృష్టి సారించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 20 మంది వైఎస్సార్ సీపీ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై గురువారం ఎన్నికలు పూర్తయ్యే వరకు నిఘా ఉంచాలంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇందులో ఎక్కువ మంది ఏజెంట్లుగా ఉన్నవారేనని సమాచారం. మైలవరం, గుడివాడల్లోనూ అదే తీరు.... మైలవరం, గుడివాడ నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రతిపక్ష ఏజెంట్లపై దృష్టి సారించారని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రెండు రోజుల నుంచి నిఘా పెట్టారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డబ్బులు పంచుతున్నారంటూ వారిని బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రానికి ఏ విధమైన కేసులు లేకుండా పంపేయాలని జిల్లా మంత్రి నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని సమాచారం. ఎదురు తిరిగే ఏజెంట్లపై కేసులు పెట్టి కోర్టుకు పంపుతామని బెదిరించి స్టేషన్లోంచి కదలకుండా ఉంచేందుకు కుట్ర పన్నుతున్నారు. మైలవరం, గుడివాడలో దొంగ ఓట్లు వేయించడానికి విజయవాడ నుంచి యువతను తరలించి గుడివాడలోని పార్టీ నేతల ఇళ్లలో ఉంచారని తెలిసింది. మద్యం వ్యాపారస్తుల సంఘంలో కీలకపాత్ర వహించే ఓ వ్యక్తి కన్నుసన్నల్లో ఈ తతంగమంతా జరుగుతోంది. లొంగదీసుకునేందుకు యత్నాలు... కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో విజయవాడ గుణదలలో ఇదే తరహాలో కొంతమంది వ్యతిరేక పార్టీల ఏజెంట్లను లొంగదీసుకుని తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు. ఏజెంట్లను బెదిరించో. భయపెట్టో, డబ్బులకు కొనుగోలు చేశో తమ పని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లతో బంధుత్వాలు కూడా కలుపుకుని ఎన్నికల్లో సహాయం చేయమని కోరుతున్నారు. ముఖ్యంగా గన్నవరం, నందిగామ, నూజివీడు, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే, ఈ విషయంలో వైఎస్సార్ సీపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు తగిన ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లుగా నియమించిన వారు ఏ విధమైన కేసుల్లోనూ ఇరుక్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ ముగిసే వరకు బూత్ వదిలిపెట్టి రాకుండా ఏజెంట్లకు తగిన సూచనలు చేస్తున్నారు. -
ఓటమి భయంతో టీడీపీ దాడులు
సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరిన వేళ టీడీపీ నేతలు అక్రమాలకు, దౌర్జన్యాలకు తెరలేపారు. ఓటర్లకు మద్యం, డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అడ్డుకున్నవారిపై వీధి రౌడీల్లా రెచ్చిపోతూ దాడులకు పాల్పడున్నారు. లోలోపల దాగి ఉన్న ఓటమి భయంతో విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు వీధి రౌడీల్లా రెచ్చిపోయారు. శ్రీరామ్ నగర్ కాలనిలో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నలుగురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని వాహనంలో పీఎస్ కు తరలించారు. సమాచారం తెలుకున్న టీడీపీ నేతలు వాహనాన్ని మార్గ మధ్యలో అడ్డుకోని పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసు వాహనంలో ఉన్న తమ కార్యకర్తలను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల మీద టీడీపీ నేతలు దాడి చేశారు.తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లోని వలసపాకల పద్మానగర్ లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత సానబాలను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి రూ.75 వేల నగదు, ఓటర్ లిస్ట్, స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. -
పచ్చనేతల.. ప్రలోభాలు..
ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మద్యం, నగదు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ ఓటర్లకు నగదు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ అభ్యర్థుల తరఫున మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి నారాయణకు చెందిన విద్యాసంస్థల సిబ్బంది, పార్టీ నాయకులు నగదు పంచుతుండగా ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు, పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట చిన్నబాలయ్యనగర్లో ఆదివారం నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన కె.రమేష్‌బాబు, భాస్కర్, మల్లేష్, నరసింహారావు, పుండరీకాక్షయ్యలు ఓటర్లకు నగదు పంపిణీ చేయసాగారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారి దామోదర్, నవాబుపేట ఇన్స్పెక్టర్ కట్టా శ్రీనివాసులు, ఎస్సై వీరప్రతాప్‌లు తమ సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నారాయణకు సంబంధించిన కరపత్రాలు, ఓటరు స్లిప్పులు, రూ.2.74 లక్షల నగదును స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారి ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నగదు పట్టుకున్న విషయంపై సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నేతలు స్టేషన్‌కు చేరుకుని తమ వారిని వదిలిపెట్టాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం మీడియాకు తెలియడంతో కనీసం తమవారిని మీడియాలో రాకుండా చూడాలని కోరారు. దీంతో అధికారులు వారిని మీడియా కంటపడకుండా లోపల కూర్చోబెట్టారు. మరో రెండుచోట్ల.. నెల్లూరులోని రంగనాయకులపేట రైలువీధిలో ఆదివారం రాత్రి జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన టీడీపీ నాయకులు ఎస్కే లుక్మాన్ తన అనుచరులతో కలిసి ఓటర్లకు నగదు పంపిణీ చేయసాగాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.10 వేల నగదు, ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి ఆదివారం ఎన్టీఆర్ నగర్లో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్లయింగ్‌స్క్వాడ్ ఇన్చార్జి జీబీపీ ప్రవీణ తన సిబ్బందితో కలిసి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వర్లు నుంచి రూ.36 వేల నగదు, తెలుగుదేశం పార్టీ కరపత్రాలు, ఓటరు స్లిప్పులను వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర్లును బాలాజీనగర్ పోలీసులకు అప్పగించారు. మద్యం తరలిస్తుండగా.. సంగం: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తరలిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను శనివారం అర్ధరాత్రి రెండు చోట్ల పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు.. సంగం మండలంలోని పడమటి అరవపాళెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పర్వతాల వెంకటరత్నం, తాండ్ర రాము, పర్వతాల అశోక్‌లతోపాటు మరికొందరు శనివారం అర్ధరాత్రి మండల కేంద్రమైన సంగంకు వచ్చారు. అక్కడ ఓ బ్రాందీలో 1,959 క్వార్టర్ మద్యం బాటిళ్లను బస్తాల్లో కట్టుకుని ట్రక్కు ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో సంగం ఎస్సై గోపాల్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులను చూసి కొందరు పారిపోగా వెంకటరత్నం, రాము, అశోక్‌లను అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారికి సంబంధించిన 11 మోటార్‌బైక్‌లను, ట్రక్కు ఆటోను స్టేషన్‌కు తరలించారు. అలాగే మండలంలోని పడమటిపాళెం, పల్లిపాళెంలో రెండు బైక్‌లపై మద్యం తరలిస్తున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పఠాన్, షేక్ రసూల్, ఫయాజ్ బాషా, తమలపాకుల ప్రశాంత్, పర్సుబోయిన పెంచలప్రసాద్, ప్రసాద్‌లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 154 క్వార్టర్ బాటిళ్లను, రెండు మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు మాఫీకి విఫలయత్నాలు తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకులు భారీ ఎత్తున మద్యం తరలిస్తూ పట్టుబడడంతో ఆ పార్టీ మండల నాయకులు ఆదివారం పోలీసు స్టేషన్‌కు పరుగులు తీశారు. వారిని వదిలేయాలంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు చేశారు. కేసు నమోదు చేశామని బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్‌బాబు, ఎస్సై గోపాల్ వారికి చెప్పారు. ఎలాగైనా కేసు లేకుండా చూడాలని కొందరు నాయకులు మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలతో ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. అయితే పోలీసులు వారి పట్టించుకోలేదు. ఈ దాడుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రమేష్, సిబ్బంది రవీంద్రబాబు, శంకరయ్య, హరిబాబు, ఎస్సై గోపాల్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు సంగం వచ్చి మద్యం బాటిళ్లను పట్టుకున్న పోలీసులను అభినందించారు. టీడీపీ నాయకులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. గూడూరులో 371 బాటిళ్ల స్వాధీనం గూడూరు రూరల్: రూరల్ మండలంలోని చెంబడిపాళెం గ్రామంలో ఓటర్లకు పంచేందుకు టీడీపీకి చెందిన కట్టా శివయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 371 మద్యం బాటిళ్లను ఆదివారం గూడూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూరల్ ఎస్సై శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. బోగోలు మండలంలో భారీగా మద్యం పంపిణీ బిట్రగుంట: బోగోలు మండలంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐదురోజుల నుంచి గ్రామాలకు పెద్దఎత్తున చీప్‌లిక్కర్ తరలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పోలీసులు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నా తరలింపు మాత్రం ఆగడం లేదు. దగదర్తి మండలం ఉలవపాళ్లలోని ఒక మద్యం దుకాణం, బోగోలులోని మరో మద్యం దుకాణం, ఇస్కపల్లిలోని మద్యం దుకాణాల ద్వారా గ్రామాలకు భారీ స్థాయిలో మద్యం చేరవేస్తున్నారు. బోగోలులోని టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి స్లిప్పులు రాసిస్తే ఆయా దుకాణాల్లో మద్యం కేసులు అందజేస్తున్నారు. కేసుల కొద్దీ మద్యాన్ని గ్రామాలకు తరలించడంతోపాటు ఓటర్లకు నేరుగా మద్యం స్లిప్పులు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో మూడురోజులు మాత్రమే గడువుండటంతో ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఈ చౌకబారు పనులపై మహిళలు మండిపడుతున్నారు. టీడీపీ నాయకులు భారీ స్థాయిలో మద్యం పంపిణీ చేస్తున్నా పోలీసులు, ఎన్నికల నిఘా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. మర్రిపాడులో రూ.10 లక్షల పట్టివేత మర్రిపాడు: మండలంలో టీడీపీ నాయకులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.10 లక్షల నగదును ఆదివారం ఫ్లయింగ్‌స్క్వా డ్ అధికారులు, మర్రిపాడు పోలీసులు పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు.. కంపసముద్రం గ్రామంలో టీడీపీ నేత మల్లు రమణారెడ్డి ఇంట్లో రూ.10 లక్షలు నగదు నిల్వ చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో కలిసి నాయకుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. నగదుకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ నగదును ఉంచినట్లు చెబుతున్నారు. నగదును ట్రెజరీలో జమ చేస్తామని మర్రిపాడు ఎస్సై కొండపనాయుడు పేర్కొన్నారు. కాగా మండలంలో రెండురోజుల నుంచి టీడీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, నగదు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో కాలనీకి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. -
ఏం చేద్దాం! ఓటర్లకు గాలం వేద్దాం?
పాలమూరు: పోలింగ్‌కు గడువు సమీపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. తక్కువ వ్యవధిలో వీలైనన్ని ఎక్కువ ఓట్లను కొల్లగొట్టాలనే పంథాను ఆచరణలో పెడుతున్నారు. ఊరూరా తిరగడం కష్టమని భావించి గంపగుత్తగా ఓట్లను రాబట్టేందుకు పార్టీలో సీనియర్ల సలహాలు, సహకారం తీసుకుని కుల సంఘాల మద్దతును కోరుతూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పగలు ప్రచారం నిర్వహిస్తూనే తీరిక వేళల్లో కులపెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో సుమారు 15 లక్షలకు పైగా ఓటర్లు ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో ఈ తరహా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిఘా ఉన్నా.. కానరాని నియంత్రణ నిబంధనల ప్రకారం కుల సంఘాలతో నిర్వహించే సమావేశాల నిర్వహణ విషయమై ఎన్నికల పరిశీలకులు ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇటీవల ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులను మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారనే నెపంతో వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో ఆయా పార్టీలు ఏ రకంగా ఓటర్లకు చేరువవుతున్నాయనే విషయమై మరింత నిశితంగా పరిశీలనలు పెంచాల్సి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిఘా తీరుని పటిష్టపరిస్తే ప్రజాస్వామ్యంలో ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వేయించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు ఓటర్లను అందించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు తీసుకొచ్చిన తాయిలాలను, నజరానాలను పలుచోట్ల పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో ఈ ఎన్నికల్లోనూ మరింత పకడ్బందీగా తనిఖీలను చేపట్టడంతో పాటు అభ్యర్థుల ప్రచారాల తీరుతెన్నులపై వారు చేస్తున్న ఖర్చులపై పరిశీలకులు దృష్టిసారించాల్సి ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి మరింత పక్కాగా నిఘాను పెంచాల్సిన అవసరముంది. అదే పద్ధతి గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కొన్ని పార్టీలు సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మండలం, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థిత్వానికి బలం చేకూరేలా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో అభ్యర్థుల అనుచరులు నేరుగా కుల సంఘాలను కలుస్తూ బేరాలు మాట్లాడుకుంటున్నారు. మూడు నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ పద్ధతి అనుకూలించిన విషయం తెలిసిందే. దాన్నే కొనసాగిస్తూ గంపగుత్తగా ఓట్లకు తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెబితే ఓట్లు ఎక్కువగా పడతాయో వారిని గుర్తించి వ్యూహరచన చేస్తున్నారు. పడే ఓట్లకే డబ్బుల పంపిణీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రతి గ్రామానికి వెళ్లే అవకాశం, సమయం ఉండదు. ఈ క్రమంలో గ్రామానికి ఒకరిద్దరు రెండో కేడర్ నాయకులకు డబ్బులు పంచే బాధ్యతలు ఇస్తున్నట్లు తెలిసింది. మరికొందరు పార్టీ నుంచి డబ్బులు తక్కువగా వస్తాయి.. భవిష్యత్‌లో మీకు అధికారం, ఉన్నత అవకాశాలు.. చేసుకోవడానికి పనులు కావాలంటే ఖర్చు పెట్టండి అంటూ ఆఫర్లు ఇస్తే వారితోనే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పోలింగ్ బూత్‌లపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయక గణంలో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. డబ్బులు తీసుకున్నవారు ఓటు వేయకపోతే ఎవరు బాధ్యులన్న ప్రశ్నలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాఇ. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల దిగులు గుబులు వెంటాడుతోంది. -
‘పచ్చ’ నగదు తరలింపునకు పోలీసుల ఎస్కార్ట్
అధికార పార్టీ అభ్యర్థులతో కొందరు పోలీసు అధికారులు రహస్య డీల్ కుదుర్చుకున్నారా? ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అవసరమైన కోట్లాది నగదు తరలింపు బాధ్యతను తీసుకున్నారా? అందుకు ఖాకీ విధులను ఫణంగా పెట్టారా? కోట్లాది రూపాయాల డీల్‌తో నగదు తరలింపు వాహనాలకు ఎస్కార్ట్‌గా వెళ్తున్నారా? కాసుల మత్తులో ఎన్నికల చెక్‌పోస్టుల వద్ద తనిఖీ టీమ్‌లను సైతం బెదిరిస్తున్నారా? వీటన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు జిల్లా ప్రజలు. పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలిపోతున్నారు కొందరు పోలీసు అధికారులు. నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు పని చేయాల్సిన పోలీసులు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం, ధర్మాన్ని విస్మరించి కుదుర్చుకున్న కోట్లాది రూపాయల డీల్‌తో కాసుల మత్తులో జోగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తిరుపతి రూరల్: ఓ వైపు ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు నిష్పక్షపాతంగా విధులను నిర్వర్తిస్తున్నారు. తనిఖీలను సైతం ముమ్మరంగా చేస్తున్నారు. కొందరు ఎన్నికల కోడ్‌కు ముందే నగదును సిద్ధం చేసుకుంటే, మరికొందరు అభ్యర్థిగా ప్రకటించాక హడావుడిగా ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టులు దాటుకుని అక్రమ నగదును జిల్లాలోకి తీసుకురావడం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కష్టంగా మారింది. దీంతో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోయే కొందరు పోలీసు అధికారులకు కాసులను ఎరగా వేశారు. కోట్లలో డీల్ కుదుర్చుకున్నారు. పచ్చ నగదు తరలింపునకు పోలీసు వాహనాలనే వాడుకుంటున్నారు. 36 చెక్ పోస్టులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు రవా ణాను, మద్యంను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 36 చెక్ పోస్టులను ఏర్పాటుచేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులతో పాటు జిల్లా నలుమూలల ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల తీరును వీడియోలు సైతం తీస్తున్నారు. ఇలా తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.11.02 కోట్ల నగదు, రూ.2.55 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నారు. ఎస్కార్ట్‌గా పోలీసు అధికారులు కోట్లలో కుదుర్చుకున్న డీల్‌తో పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారు. కనిపించని నాలుగో సింహాన్ని కాసుల వేటకు బలిచేస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్న వాహనానికి పోలీసు కారులోనే ఎస్కార్ట్‌గా వెళ్తున్నారు. ముందుగా పోలీసు అధికారి వాహనం వెళ్తుంటే వెనుక నగదు వాహనం వస్తుంటుంది. చెక్‌పోస్టుల వద్ద ఆపితే.. ‘మా బంధువులు వాహనాన్నే ఆపుతారా?’ అంటూ కంత్రీ అధికారి కన్నెర్ర చేస్తుంటాడు. ఇదంతా కూడా ఎన్నికల సంఘం నియమించిన వీడియోల్లో సైతం రికార్డు అవుతుంది. కుప్పం, నగరి, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లో ఇలా బరితెగిస్తున్న అధికారులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే చంద్రగిరి, కుప్పం, చిత్తూరు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారుల వ్యవహారశైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. ఆ సీఐ తీరుపై సర్వత్రా విమర్శలు భాకరాపేట కేంద్రంగా పనిచేస్తున్న పీలేరు రూరల్ సీఐ నరసింహమూర్తి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నగదు తరలింపునకు ఎస్కార్ట్‌గా వెళ్లలేదని కిందిస్థాయి సిబ్బందిని వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలోనే ఎర్రావారిపాళెం ఎస్ఐ కృష్ణయ్యకు సీఐకి మధ్య వాగ్వాదం జరగడం, ఎస్ఐని బలవంతంగా బదిలీ చేయడం, ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడం, తిరిగి ఎస్ఐ విధుల్లోకి రావడం అన్ని జరిగిపోయాయి. సీఐ వ్యవహారశైలి వల్ల చిత్తూరు ఎస్పీ విక్రాంత్‌పాటిల్ సైతం సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పోలీసు అధికారులే మండిపడుతున్నారు. ఇంత జరిగినా సీఐ తీరు మారలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. తాజాగా..నగదు వాహనాన్ని విడిపించుకున్న వైనం మంగళవారం చంద్రగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఆ సభ హడావుడిలో పోలీసులు ఉండగానే చిన్నగొట్టిగల్లుకు చెందిన టీడీపీ జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి వాహనంలో తిరుపతి నుంచి నగదును తీసుకువస్తున్నారని ఎంసీసీ టీమ్‌కు సమాచారం అందింది. సాయంత్రం 6–7 గంటల సమయంలో ఎంసీసీ టీమ్ కన్వీనర్ ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లారు. దీంతో టీమ్ సభ్యులు భాకరాపేట చెక్‌పోస్టు వద్ద వీడియోగ్రాఫర్ సహా నిఘా ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారి అక్కడికి వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వాహనాన్ని చెక్ చేసేందుకు ఎంసీసీ టీమ్ ప్రయత్నించగా తనిఖీ చేయకుండానే పంపించాలని పోలీసు అధికారి హుకుం జారీ చేశారు. దగ్గరుండి సదరు ప్రజాప్రతినిధి వాహనాన్ని చెకింగ్ లేకుండానే విడిపించుకు వెళ్లాడు. ఆ అధికారి వీరంగం మొత్తం వీడియోలో రికార్డు అయింది. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. -
హవాలా రాకెట్ గుట్టు రట్టు
సాక్షి,సిటీబ్యూరో: ఎన్నికల వేళ పోలీసులు చేస్తున్నతనిఖీల్లో ‘కట్టల’కొద్దీ తరలిస్తున్న డబ్బు పట్టుబడుతోంది. బుధవారం పోలీసులు వివిధ ప్రాంతాల్లో సుమారు రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం పరిధిలో నగదు తరలిస్తున్న రెండు ముఠాల నుంచి రూ.41లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారులో రూ.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్లో జయభేరి ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మురళీమోహన్ కోడలు మాగంటి రూప రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమెకు అందించేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. రాంగోపాల్‌పేట్: గుట్టు చప్పుడు కాకుండా పెద్దమొత్తంలో నగదు తరలిస్తున్న రెండు ముఠాల గుట్టును ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టయలు చేశారు. ఈ సందర్భంగా 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.41లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గౌలిగూడ చమాన్‌కు చెందిన అభిషేక్ రాఠి ఎలక్ట్రికల్ వస్తువుల వ్యాపారం చేసేవాడు. అతను బేగంబజార్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కమల్ శర్మ, ఇసామియాబజార్‌కు చెందిన హవాలా వ్యాపారి సుభాష్‌శర్మ, అదే ప్రాంతానికి చెందిన శ్యామ్ సుందర్, మల్లేపల్లికి చెందిన మహేష్‌కుమార్ పాండేతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు నగదు అవసరమైన వారి హవాలా ద్వారా కమీషన్ ప్రాతిపదికన నగదు చేరవేసేవారు. ఇందుకు గాను 8 నంచి 10శాతం కమీషన్‌గా తీసుకునేవారు. ఈ నేపథ్యలో బుధవారం అభిషేక్ రాఠి, కమల్ శర్మ పెద్ద మొత్తంలో నగదు సేకరించి సుభాష్‌శర్మ, శ్యామ్ సుందర్ ద్వారా దిల్‌సుక్‌నగర్‌లో స్క్రాప్ వ్యాపారం చేసే వీరబొమ్మల శ్రీశైలంకు అందించేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా షాహినాయత్‌గంజ్‌లోని గోషా మహాల్‌రోడ్‌లో తచ్చాడుతుండగా సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఉత్తర మండలం ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో సిబ్బంది దాడి చేసి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద రూ.15 లక్షలు స్వాధీనం రాజస్థాన్‌కు చెందిన శ్రవణ్‌సింగ్ రాజ్‌పుత్ హవాలా డెలివరీ ఏజెంట్‌గా పనిచేసేవాడు. బుధవారం సాయంత్రం అతను గచ్చిబోలికి చెందిన తమ్మినీడి వెంకటేశ్వరరావుకు హవాలా రూపంలో రూ.15లక్షల నగదు తీసుకుని మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు వచ్చారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావు రాజమండ్రికి చెందిన వ్యక్తి కావడంతో సదరు నగదును ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో వినియోగించేందుకు తీసుకెళుతున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. విజయవాడ జాతీయ రహదారిపై..రూ. 48 లక్షలు స్వాధీనం పెద్దఅంబర్‌పేట: కారులో రూ.48లక్షల నగదును తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రాచకొండ ఎస్ఓటీ, స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారులో రూ.48లక్షలు గుర్తించారు. కారు డ్రైవర్ కె.సత్యపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నగదును నల్లగొండకు తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు. నగదు బాటసింగారంలోని వివేకానంద ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి చెందినదిగా చెప్పినట్లు సీఐ దేవేందర్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని నగదును రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మరో కారులో రూ.4.23లక్షలు.. కొత్తగూడెం చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన శ్రీనివాస్‌రావు అనే వ్యాపారి నుంచి రూ.4,23,830 నగదును స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రూ.1.98 లక్షలు స్వాధీనం చాంద్రాయణగుట్ట: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1.98 లక్షల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం....బిస్మిల్లా కాలనీకి చెందిన అనీస్ బుధవారం కారులో రూ.1.98 లక్షల నగదు తీసుకెళుతుండగా చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారుల అప్పగించారు. -
గెలవాలనే దుస్సంకల్పంతో సభ్య సమాజం సిగ్గుపడేలా..
సాక్షి, తిరుపతి : సొంత జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే దుస్సంకల్పంతో సభ్య సమాజం సిగ్గుపడే అక్రమాలకు సైతం తెరలేపేందుకు వెనుకాడడం లేదు. నోట్లతో ఓట్లను కొని అందలమెక్కాలనే ఆరాటంలో ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. చిత్తూరు పార్టీ కార్యాలయం వేదికగానే చంద్రబాబు ఓటర్ల కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. జిల్లా పార్టీ కార్యాలయంలోనే సోమవారం రాత్రి బసచేసి, వేకువ జామునే అభ్యర్థులతో సమావేశమయ్యారు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం మదనపల్లి, తంబళ్లపల్లి, నగరి, సత్యవేడు అభ్యర్థులను పిలిపించుకుని దిశానిర్ధేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రూ.30 కోట్లు తగ్గకుండా ఖర్చు పెట్టాలని చంద్రబాబు అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లోని మండలాల బాధ్యతలను టీడీపీలోని ముఖ్య నాయకులకు అప్పగించారు. ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, డ్వాక్రా మహిళలు, మెఫ్మా, ఆర్పీ, సేవా మిత్రలను వాడుకోమని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. కాంట్రాక్టు పనులు చేసిన వారి నుంచి భారీ ఎత్తున వసూళ్లు చేసుకోమని తేల్చిచెప్పారు. పోలీసులు, ఇంటెలిజెన్స్, ఎస్బీఐ అధికారులనువినియోగించుకోమని, అందుకు కొంతమంది పేర్లు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్సార్సీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను టార్గెట్ చెయ్యమని ఆదేశించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఈ ఎన్నికల్లో అమలు చెయ్యాలని సూచించారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు మద్యం, బహుమతులు ఇవ్వాలని చెప్పారు. అదే విధంగా ఓటు బ్యాంక్ ఉన్న తటస్తులను గుర్తించి వారికి కార్లు, ట్రాక్టర్లు మరేదైనా కావాలన్నా కొనుగోలు చేసి బహుమతులుగా ఇవ్వాలని అభ్యర్థులకు చెప్పినట్లు తెలిసింది. -
నంద్యాలలో డబ్బు పంచుతున్న టీడీపీ నేతలు
-
డబ్బులు పంచుతూ దొరికిపోయిన కానిస్టేబుళ్లు
-
డబ్బు పంచుతూ దొరికిపోయిన ‘నారాయణ’ సిబ్బంది
సాక్షి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలిచేందుకు మంత్రి నారాయణ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని చిన్న బజార్లో ‘నారాయణ’ విద్యాసంస్థల సిబ్బంది, టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానికులు వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరి వద్ద భారీ నగదు ఉన్నట్లు తెలిసింది. ఇక, నారాయణ విద్యాసంస్థ ఏజీఎం రమణారెడ్డి, మరో జూనియర్ లెక్చరర్ ఓటర్లకు నగదు పంపిణి చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వారి నుంచి సుమారు రు. 15 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. రమణా రెడ్డి నేతృత్వంలోనే నగదు పంపిణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైఎస్సార్సీపీ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో డబ్బుతో ఓట్లను కొనేందుకు నారాయణ ప్రయత్నిస్తున్నారని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులతో ఈ విధంగా డబ్బును పంపిణీ చేయిస్తున్నారన్నారని ఆయన అన్నారు. దీనిపై వెంటనే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ధన ప్రవాహం @110
సాక్షి, ఎలక్షన్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో ధన ప్రభావం ప్రబలంగా ఉండే 110 నియోజకవర్గాలను ఎన్నికల సంఘం గుర్తించింది. ఇక్కడ రాజకీయ పార్టీలు డబ్బులు పంచడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తమిళనాడులోని మొత్తం లోక్‌సభ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సగానికిపైగా నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం బలంగా ఉందని ఎన్నికల సంఘం వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం కోసం ఎన్నికల సంఘం ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు నిపుణులను పంపుతోంది. ఈ నిపుణులు ఏర్పాటు చేసే ప్రత్యేక బృందాలు ఆయా నియోజకవర్గాల్లో నగదు రవాణాపై నిఘా పెడతారు. అక్రమంగా రవాణా అయ్యే నగదును స్వాధీనం చేసుకుంటారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులు పంపిన సమాచారం ఆధారంగా ఎన్నికల సంఘం ఈ 110 నియోజకవర్గాలను గుర్తించింది. అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం అందితే ఈ సంఖ్య 150 దాటవచ్చని ఆ పత్రిక పేర్కొంది. ఎన్నికల సంఘం కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీ డిపార్ట్మెంట్ ఎలక్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ (ఎండీఐసీ) ఈ నియోజకవర్గాలపై పటిష్టమైన నిఘా పెట్టి అక్రమ నగదును స్వాధీనం చేసుకుంటుంది. ఉత్తరప్రదేశ్, అసోం, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చండీగఢ్‌లో ఇలాంటి నియోజకవర్గాలను ఇంకా గుర్తించ లేదని ఆ పత్రిక తెలిపింది. -
116 నియోజకవర్గాల్లో ధన ప్రవాహం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉన్న 116 అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించామని, ఆ నియోజకవర్గాల్లో బ్యాంకు కార్యకలాపాలపై నిఘా ఉంచామని ఏపీ శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కేంద్ర బలగాలు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లలో లక్షా ఆరు వేల మంది అవసరమన్నారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాల నుంచి 392 కంపెనీలు కోరామన్నారు. ఇప్పటికే 90 కేంద్ర బలగాలు ఏపీకి చేరుకున్నాయని, మిగిలినవి కూడా వస్తాయని వివరించారు. 45 కంపెనీల ఏపీపీఎస్ ఫోర్సు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌లో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారులు ఉంటారన్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిఘాకు డ్రోన్లు, హెలికాప్టర్లును వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 121 డ్రోన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని, సోషల్ మీడియాపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘా పెట్టినట్టు చెప్పారు. సోషల్ మీడియాపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా పరిశీలిస్తామన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనే పోలీస్ సిబ్బంది పక్షపాత ధోరణి అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 39,591 మందిని గుర్తించి వారిలో కొంతమందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఏపీలో 9,363 లైసెన్సులతో 10,116 ఆయుధాలున్నాయని, వాటిలో 8,500 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇతర భద్రత సంస్థల వద్ద మరో 1,485 ఆయుధాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 6,357 నాన్ బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ)లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 336 వారెంట్లను అమలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 1,484 గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించామని, స్థానిక పరిస్థితులను బట్టి ఆయా గ్రామాల్లో ముందు జాగ్రత్తగా 99,225 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బు వ్యయంపై నిఘా ఉంచేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు రాష్ట్రంలో 45,920 పోలింగ్ కేంద్రాలున్నాయని, వాటిలో 17,671 కేంద్రాలను సాధారణమైనవి గాను, 9,345 కేంద్రాలను సమస్యాత్మకమైనవి గాను గుర్తించినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మూడు రకాలుగా విభజించి వాటి వద్ద కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఒక ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌తో పాటు కేంద్ర సాయుధ బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. సీఐ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒకటి చొప్పున 940 స్ట్రైకింగ్ ఫోర్సు టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో శాంతిభధ్రతల సమస్య ఏర్పడితే వెంటనే అక్కడికి చేరుకునేలా 249 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. డబ్బు వ్యయంపై నిఘా ఉంచేందుకు 660 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 494 తనిఖీ కేంద్రాలు, 616 మొబైల్ తనిఖీ కేంద్రాల ద్వారా డబ్బు పంపిణీ, అక్రమ రవాణా తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
తేలిన.. లెక్క!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రైతాంగానికి హెక్టార్‌కు రూ.6వేల పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్రం చేసిన ప్రకటన జిల్లా రైతాంగంలో ఆనందం నింపుతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద ఈసాయం అందివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. దీనికి సంబంధించి విధివిధానాలు సిద్ధమవుతున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది. హెక్టారుకు రూ.6వేల ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి విధి విధానాలు తమకు అందలేదని, ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో ఈ మొత్తాన్ని మినహాయిస్తారా..? లేదా అన్న విషయంలో స్పష్టత కానరావడం లేదని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకంతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం మొత్తాన్ని జమ చేస్తామని కేంద్రం ప్రకటించిందని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో రాష్ట్రం ప్రభుత్వం అందించే సాయం, కేంద్రం కొత్తగా ప్రకటించిన సాయం వేర్వేరుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని పేర్కొంటున్నారు. కాగా, జిల్లాలో ఐదు ఎకరాలలోపు ఎంతమంది రైతులు (ఖాతాలు) ఉన్నారు..? మొత్తంగా ఐదు ఎకరాలలోపు కమతాల్లో ఎంత విస్తీర్ణంలో సాగుభూమి ఉంది..? అన్న వివరాలను జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది. ఆర్థిక సాయంగా రూ.295.60కోట్లు ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాల మేరకు 6,80,915 ఎకరాల భూమి (5ఎకరాల లోపు) ఉంది. ఈ మొత్తం భూమి 3,46,442 రైతుల (ఖాతాలు) చేతుల్లో ఉంది. అయితే.. అధికారులు ఈ ఖాతాలను కూడా రెండు విభాగాలుగా విభజించారు. దీంతో రైతులకు అందనున్న ఆర్థిక సాయం కూడా వేర్వేరుగానే అందనుంది. ఒక ఎకరా నుంచి 2.46 ఎకరాల భూమి ఉన్న రైతులు 2,31,153 మంది ఉన్నారు. వీరి చేతిలో 2,77,947 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రూ.6వేల చొప్పున వీరికి రూ.75,80,38,390 ఆర్థిక సాయం అందనుంది. కాగా, 2.47 ఎకరాల నుంచి 4.93 ఎకరాల మధ్యలో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి 4,02,967 ఎకరాలు. ఈ భూమి 1,15,289 మంది రైతుల చేతుల్లో ఉంది. ఈ మొత్తం భూమికి రూ.219,80,07,109 ఆర్థిక సాయం రైతులకు అందనుంది. అంటే.. ఒక ఎకరానుంచి 5 ఎకరాలలోపు ఉన్న 3,46,442 మంది రైతులకు ఏటా 295 కోట్ల 60 లక్షల 45వేల 499 రూపాయల సాయం అందనుందని చెబుతున్నారు. అయితే, పూర్తి లెక్కలు తేలాక అటు వ్యవసాయ భూమి, రైతుల సంఖ్యలో కొద్దిగా తేడాలు ఉండొచ్చని, దీంతో కేంద్రం నుంచి అందే పెట్టుబడి సాయంలో కొంత వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఏటా రూ.295.60కోట్ల దాకా రైతులకు పెట్టుబడి సాయంగా అందనుంది. -
పంచాయతీ @రూ.105 కోట్లు
ఎన్నడూ లేని విధంగా ఈసారి పంచాయతీ ఎన్నికలు చాలా హాట్‌హాట్‌గా మారాయి. రాజకీయాలకు తొలిమెట్టు అయిన పంచాయతీల్లో గెలుపొందేందుకు సర్పంచ్ అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదులుకోలేదు. రిజర్వేషన్లు ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల రోజు వరకు కులసంఘాలు, యువకులను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఎన్నికల మధ్యలోనే వచ్చిన సంక్రాంతి పండుగను కూడా వదలలేదు. సర్పంచ్, వార్డుమెంబర్‌గా బరిలో ఉన్న వారు నేరుగా ఇళ్లకే మద్యం, మాంసం ఇస్తూ తమను ‘గుర్తు’ంచుకునేలా చేశారు. ఇలా రాజన్నసిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 210 గ్రామాల్లో దాదాపు రూ.105 కోట్ల వరకు వెచ్చించారు. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటుండగా.. ఓడిన వారు ఎలా జరిగిందనేదానిపై సమీక్షించుకుంటున్నారు. సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు విడతలుగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామాలు ఉండగా రెండు గ్రామాలు మినహా 253 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 43 గ్రామాల్లో ఏకగ్రీవంకాగా.. 210 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో జిల్లావ్యాప్తంగా 1,056 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీపడ్డారు. రాజకీయాల్లో తొలిమెట్టుగా భావించే గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార, ప్రలోభపర్వాలకు తెరలేపారు. 210 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ఖర్చు రూ.105 కోట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగాయి. పంచాయతీకి ఎమ్మెల్యేలు దూరం జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగగా స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోలేదు. మానకొండూరు, వేములవాడ, చొప్ప దండి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్ ఒకటి, రెండుసార్లు నియోజకవర్గం లోని ముఖ్య గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారు. మిగతా గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేలు దూ రంగా ఉన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పంచాయతీ ఎన్నికలకు దూ రంగా ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు గ్రామస్తులు ఐక్యంగా చేసుకుంటేఎమ్మెల్యే కోటాలో రూ.15లక్షలు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. అంతకుమించి ఆయన ఎవరు గెలిచినా నా వాళ్లే అంటూ కార్యకర్తల సమావేశంలో బాహాటంగానే ప్రకటించారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం పంచాయతీ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. పంచాయతీ ఖరీదు రూ.105 కోట్లు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు చాలా ఖరీదయ్యాయి. గ్రామ పంచాయతీల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రలోభాలపర్వం జోరుగా సాగింది. జిల్లాలోని 210 గ్రామపంచాయతీల్లో 1,056 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేయగా.. వారంతా పోటాపోటీగా ఖర్చుపెట్టారు. సగటున చిన్న గ్రామాల్లో రూ.3లక్షలు వెచ్చించగా.. పెద్ద పంచాయతీలు, పోటీ ఎక్కువగా నెలకొన్న గ్రామాల్లో రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చీరలు పంచుతూ, సెల్ఫోన్లు కొనిస్తూ.. నేరుగా డబ్బులిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలోపడ్డారు. ఎన్నికల సమయంలోనే సంక్రాంతి పండుగ రావడంతో.. సందర్భాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు నూనెప్యాకెట్లు, చికెన్, మద్యం బాటిళ్లను నేరుగా ఇళ్లకే పంపుతూ ఓటర్లకు అభ్యర్థులు ‘గుర్తు’ండిపోయేలా ప్రలోభాలకు గురిచేశారు. మరోవైపు యువకులకు క్రికెట్కిట్లు, టీషర్ట్స్, కులసంఘాలకు, ఆలయాలకు మైక్సెట్లు ఇస్తూ ప్రచారం సాగించారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రూ.105 కోట్ల వరకు వెచ్చించినట్లు ప్రాథమిక అంచనా.. చిలుము వదిలింది ! ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్ని లక్షలు వెచ్చించాం.. ఎన్ని ఓట్లు వచ్చాయని లెక్కలేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు పూర్తవగా విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికలకు చేసిన ఖర్చులను లెక్కలేస్తుండగా ఓడిన అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు, వచ్చిన ఓట్లను లెక్కిస్తూ నారాజవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడంలో ప్రత్యర్థులు అనుసరించిన వ్యూహాలను సమీక్షించుకుంటున్నారు. డబ్బులతోపాటు లోపాయికారీగా జరిగిన ఒప్పందాలు, జరిగిన పొరపాట్లను సమీక్షించుకుంటూ పరాజితులు ఆలోచనలో పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వార్డుమెంబర్ సభ్యులు సైతం ఎన్నికల్లో చేసిన ఖర్చులను లెక్కలేస్తూ అయోమయానికి గురవుతున్నారు. వార్డుసభ్యులు సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీని ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల వ్యవధిలో గ్రామపంచాయతీ ఎన్నికల ఖరీదు రూ.వంద కోట్ల మైలురాయిని దా టడం జిల్లా చరిత్రలో తొలిసారి కావడం విశేషం. నేతల మద్దతు కోసం విజేతలు జిల్లాలో విజయం సాధించిన సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అధికార పార్టీ మద్దతుతో విజయం సాధించినవారు ఇప్పటికే ఎమ్మెల్యేలను కలిశారు. ఇక.. స్వతంత్రంగా బరిలోకి దిగి గెలిచిన సర్పంచులు, ఇతర పార్టీల నాయకులు ఐదేళ్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేనిదే వచ్చే ఐదేళ్లు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం అసాధ్యమని భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. -
ఇదేం తిర‘కాసు’!
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు సాయం..ఈ యాసంగి(రబీ) సీజన్లో ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. ఖజానాలో నగదు లేని కారణంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో పూర్తిస్థాయిలో డబ్బులు జమ కాలేదు. ఖరీఫ్, రబీ ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.4వేలను పెట్టుబడిగా అందించాలనేది లక్ష్యం. జిల్లాలోని 20వేల మంది రైతులకు పలు కారణాలతో ఈ పథకం వర్తించలేదు. రబీలో కూడా ఖరీఫ్ మాదిరిగానే చెక్కుల విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ..ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కారణంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఆన్లైన్ విధానంలో నగదు జమ చేశారు. జిల్లాలో రబీ సీజన్‌కు 2,69,438 మంది రైతులను రైతుబంధు పథకానికి వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరికి ఉన్న భూముల ఆధారంగా రూ.266.13కోట్ల పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 2,69,438 మంది రైతులు ఉండగా, వీరిలో 2,47,154 మంది బ్యాంక్ ఖాతాలను వ్యవసాయ విస్తరణాధికారులు ఆన్లైన్ చేశారు. వీరిలో 2,42,574 మంది రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు ట్రెజరీకి చేరాయి. 1.84లక్షల మందికి అందిన సాయం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ రైతుబంధు పథకం లబ్ధిదారుల వివరాలను, వారి బ్యాంక్ ఖాతాలను ట్రెజరీలకు అందించగా వీరిలో 1,84,806 మందికి లబ్ధి చేకూరింది. రైతుల ఖాతాల్లో రూ.185.48కోట్ల నగదును మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో ఇంకా 84,632 మంది రైతులకు రైతుబంధు పథకం కింద రూ.80.65కోట్లు అందాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటినా ఇంతవరకు రైతుబంధు పథకం ఊసే లేదు. ఖజానాలో నిధులు లేకనే లబ్ధిదారులకు పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించలేకపోతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీజన్ సగానికి వచ్చినా.. అక్టోబర్ నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాలో అపరాలు, నూనె గింజల పంటలతోపాటు వరి నాట్లు వేశారు. వాటి సాగు కాలం కూడా సగానికి చేరింది. అపరాల పంటలు మరికొద్దిరోజుల్లో చేతికందనున్నాయి. ఖరీఫ్‌లో పంటల సాగుకు ముందుస్తుగా పెట్టుబడి సహాయం అందించిన ప్రభుత్వం..రబీలో బాగా వెనకబడిందని రైతులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడి సహాయం అందకపోవడంతో గతంలో మాదిరిగానే వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం రైతుబంధు పథకం నగదును తమ ఖాతాల్లో జమ చేసిందేమోననే ఆశతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఆపుజేయడంతో వీరు బ్యాంకులతోపాటు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పెట్టుబడి డబ్బులు రాలేదు.. రబీలో అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఇంకా ఇవ్వలేదు. బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. వెంటనే అందజేస్తే ఉపయోగపడతాయి. ఖరీఫ్‌లో వేసిన పత్తి పంట దిగుబడి రాలేదు. మొక్కజొన్న, అపరాల పంటలు అప్పు చేసి వేసిన. రెండెకరాలకు అందే రూ.8వేల పెట్టుబడి సహాయం కోసం చూస్తున్నా. – భూక్య వీరన్న, బాలాజీనగర్ తండా, తిరుమలాయపాలెం మండలం కొందరికి జమ కావాల్సి ఉంది.. రైతుబంధు పథకం కింద రబీలో జిల్లాలోని కొందరు రైతులకు నగదు అందాల్సి ఉంది. ఈ ప్రక్రియను నిర్వహిస్తూనే ఉన్నాం. ఆన్లైన్లో అర్హులైన రైతుల వివరాలన్నీ రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపించాం. కొందరి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయింది. ఆన్లైన్ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు పడుతోంది. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
ఓట్లపై నోట్ల వర్షం!
ఏం చేస్తారో, ఎంత పంచుతారో తెలీదు.. నేను గెలవాలంతే! తన అనుచరులకు ఓ అభ్యర్థి ఆదేశం..అవతలి పార్టీ పంచినదానికి మరో వెయ్యి ఎక్కువే ఇవ్వండి.. ఎక్కడా తగ్గొద్దు. నేను గెలవాలంతే! మరో అభ్యర్థి తన మనుషులకు చేసిన సూచన.. ఇదీ తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న అభ్యర్థులు వ్యవహరించిన తీరు. ఏం చేసైనా గెలవాలన్న కసితో వీరు లెక్కలేకుండా డబ్బు పంచారు. ప్రచారం ముగిసేంత వరకు అయిన ఖర్చుతో సంబంధం లేకుండా.. పోలింగ్‌కు చివరి 36 గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా నోట్ల పంపిణీ వెయ్యికోట్లను దాటడం ఆశ్చర్యపరుస్తోంది. నువ్వెంతంటే నువ్వెంతనే రేంజ్లో ఒకరిని మించి మరొకరు ఖర్చుపెట్టారు. ఏరులై పారిన మద్యానికైతే లెక్కే లేదు. కేంద్ర పరిశీలకులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వర్లు, స్క్వాడ్లు ఎందరున్నా యథేచ్ఛగా కోట్లకు కోట్లు రాత్రికి రాత్రే పంపిణీ అయ్యాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇలా జరుగుతున్న పంపిణీ మొత్తాన్ని చూసి.. పలుచోట్ల కొందరు అభ్యర్థులు ఏడ్వటమొక్కటే తక్కువైంది. అప్పటికే రూ.10 కోట్ల వరకు ఖర్చుపెట్టిన గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి.. తన అనుచరులతో ‘నా రక్తం తాగండ్రా’ అన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా డబ్బులను మంచినీళ్ల ప్రాయంగా పంచిపెట్టారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులందరూ.. పోలింగ్‌కు 36 గంటల ముందు నోట్లతో ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. దీంతో ఒక్కో నియోజకవర్గంలో కనిష్టంగా రూ. 10కోట్లు మొదలుకుని.. రూ.45–50 కోట్ల వరకు ఖర్చులు దాటాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఆర్థిక స్థోమతను బట్టి కొన్ని చోట్ల ఓటుకు రూ.5 వేలు, అంతకంటే ఎక్కువ ఖర్చు చేశారు. కొన్నిచోట్ల ఓటుకు రూ.2,000 ఇస్తే.. మరికొన్ని చోట్ల రూ.500, రూ.300 కూడా పంచారు. పోలింగ్‌కు 36 గంటల ముందు తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయల కుపైగా పంపిణీ జరిగినట్లు ఓ అంచనా. అంతకు ముందు ప్రచార సమయంలో ఖర్చు చేసిన రూ.750 కోట్లు కలుపుకుంటే దాదాపుగా రూ.1,750 కోట్లు ఖర్చయినట్లు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఖర్చు చేసిన మొత్తం దీనికి అదనం. మూడు వారాల పాటు సోషల్ మీడియా, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు కలుపుకుంటే మొత్తం రూ.2 వేల కోట్లు దాటే ఉంటుందని.. ఎన్నికలను దగ్గర నుంచి పర్యవేక్షిం చిన ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి వెల్లడించారు. విచ్చలవిడిగా డబ్బుల ఖర్చును నియంత్రించేందుకు నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ప్రేక్షక పాత్ర పోషించారని, స్వతంత్ర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా.. ఈసారి ఖర్చుపె ట్టారని, రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీల మధ్య పోటీగా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందునే అభ్య ర్థులు డబ్బు వెదజల్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో సామాన్యు లెవ్వరూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని, ఇది ప్రజాస్వా మ్యానికి ద్రోహం చేయడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన ఎల్బీనగర్ నియోజకరవ్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో రూ. 100 కోట్లు మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. పోలింగ్‌కు ముందే 110 నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరిగినట్లు సమాచారం. వీటిలో 30కి పైగా నియోజకవర్గాల్లో ఓటర్లకు రూ.300 నుంచి రూ. 500 వరకు అందజేశారు. మరో 40 నియోజకవర్గాల్లో అటు కూటమి, ఇటు టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడి డబ్బు పంచారు. రూ.500 నుంచి రూ.1,000 పంపిణీ చేశారు. మరో 20 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, తీవ్రమైన పోటీ కారణంగా ఓటుకు రూ.2,000 నుంచి రూ.3,000 దాకా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 20 నియోజకవర్గాల్లో ఓటుకు రూ.5 వేలు అంతకంటే ఎక్కువే పంపిణీ జరిగింది. ‘నేను ప్రచారం ముగించుకుని కాసేపు సేద తీరాలనుకునేలోపే నా ప్రత్యర్థి రూ.2 కోట్లు పంపిణీ చేశారు. అప్పటిదాకా నాతోనే తిరిగి ప్రచారం చేసిన పది మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చి ఆయన పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకున్నారు. నేను తేరుకుని రంగంలోకి దిగి ఓటుకు రూ.3వేల చొప్పున పంచాలని ఏర్పాట్లు చేసుకున్నాను. తెల్లారేసరికి మూడు మండలాల్లో పంచేయగానే.. నా ప్రత్యర్థి అవే ప్రాంతాల్లో తను ఓటుకు రూ.2 వేలు పంచడం మొదలుపెట్టారు. తప్పని పరిస్థితిలో నేను ఓటుకు అదనంగా మరో రూ.2 వేలు ఇవ్వాల్సి వచ్చింది’ అని ఓ దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన ఓ ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి తన అనుభవాన్ని పంచు కున్నారు. ఆ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే టప్పటికీ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ‘నా రెండు దశాబ్దాల రాజకీయ అనుభవంలో చెపుతున్నా, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఇందులో నాలుగో వంతు కూడా ఖర్చు కాదు. కానీ, ప్రత్యర్థి నా ఓటమి లక్ష్యంగా పన్నుతున్న పన్నాగాలు చూసి ఒక దశలో రాజకీయాలపైనే అసహ్యం కలి గింది. కానీ ఏం చేస్తాం..బరిలో దిగాను కాబట్టి నేనూ అదేస్థాయిలో పంచక తప్పలేదు’ అని ఆ అభ్యర్థి వాపోయారు. ఖమ్మం ఫస్ట్ తెలంగాణలోని పాత పది జిల్లాల్లో భారీగా డబ్బు పంపిణీ చేసిన వాటిలో ఖమ్మం జిల్లాలోని 4 నియోజకవర్గాలు మొదటి స్థానంలో.. పాలమూ రు జిల్లాలోని 4 నియోజక వర్గాలు రెండో స్థానం లో నిలుస్తాయి. ఈ 2 జిల్లాలకు పోటీగా నల్లగొం డ, వరంగల్ జిల్లాలోని చాలా నియోజక వర్గాల్లో డబ్బు పంపిణీ జరిగింది. ఖమ్మం జిల్లాలోని 2 నియోజక వర్గాల్లో పోలింగ్‌కు ఒకరోజు ముందు రూ.30 కోట్ల చొప్పున ఖర్చు చేయగా, మిగిలిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖర్చు రూ.25 కోట్లు దాటింది. నల్లగొండ జిల్లాలోని ఓ నియోజక వర్గంలో ఒక అభ్యర్థి రూ.40 కోట్లు, ప్రత్యర్థి రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. అదే జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో అభ్యర్థి ఖర్చు సగటు రూ.20 కోట్లు దాటిం ది. పాలమూరు జిల్లాలోని 3 నియోజక వర్గాల్లో అభ్యర్థి రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు, చివరి రెండ్రోజుల్లోనే ఈ 3స్థానాల్లో ఖర్చు రూ. 120 కోట్లు దాటిందని ఆ జిల్లాలో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి చెప్పారు. వరంగల్ జిల్లాలోని ఓ నియోజక వర్గంలో అభ్యర్థులు సగటున రూ.30 కోట్లు ఖర్చు చేస్తే ఈ జిల్లాలోని మరో 4 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఖర్చు సగటున రూ.25 కోట్లుగా ఉండొచ్చని భావిస్తున్నారు. -
తెలంగాణలో ప్రలోభాలకు తెరతీసిన టీడీపీ
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా టీడీపీ ధన ప్రలోభాలకు తెరతీసింది. ఖమ్మం మహాకూటమి అభ్యర్థి తరఫున ఓటుకు నోటు స్కీంతో టీడీపీ శ్రేణులు రంగంలో దిగాయి. వారు ఇందుకోసం సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా జనాలకు ఓటరు స్లిప్‌తో పాటు 10 రూపాయల నోటు జతచేసి అందజేస్తున్నారు. ఆ నోట్ తిరిగి ఇస్తే రెండువేల రూపాయలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఓటర్ స్లిప్‌తో పాటు అందజేసే 10 రూపాయల నోట్‌పై ప్రత్యేక నంబర్ సిరీస్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రలోభాలకు పాల్పడుతున్న మహాకూటమి శ్రేణులను టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై సాక్ష్యాధారాలతో టీఆర్ఎస్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మహాకూటమి అభ్యర్థుల ప్రలోభాలను అడ్డుకుని తీరుతామని తెలిపారు. ప్రజా బలంతో గెలవడానికి ప్రయత్నించాలని మహాకూటమి అభ్యర్థులకు సూచించారు. నంద్యాలలో మాదిరి ఇక్కడ రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. -
ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కలకలం
-
ఆర్కేనగర్లో అరటి పళ్లలో డబ్బు పంపిణీ
-
ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కలకలం
చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికలో మరోసారి డబ్బు పంపిణీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 లక్షలను వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొరుక్కుపేట్‌లోని ఓ సైకోథెరపీ సెంటర్లో డబ్బు దాచారన్న సమచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరికి డబ్బులు ఇస్తున్నప్పుడు పట్టుకున్నారు. ఇక ఇది దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీ ఆరోపణలు దిగటం.. ఇరు వర్గాల ఘర్షణకు దారితీయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు ఏప్రిల్ 12న జరగాల్సిన ఎన్నిక ఓటుకు నోటు నేపథ్యంలోనే రద్దైన విషయం తెలిసిందే. ఆ సమయంలో దినకరన్ పై తీవ్ర ఆరోపణలు రాగా, ఆ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల దాకా డబ్బు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, డిసెంబర్ 21న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. 59 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. -
మద్యం-మనీ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే
-
నంద్యాలపై టీడీపీ వింత లెక్కలు!
♦ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఖర్చు రూ.300 కోట్లు! ♦ అధికారులు నమోదు చేసింది రూ.16.60 లక్షలు మాత్రమే ♦ అభ్యర్థి చూపిస్తున్న ఎన్నికల వ్యయం రూ.6.49 లక్షలు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాలలో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల వ్యయానికి సంబంధించి చూపుతున్న లెక్కలు విస్తుగొలుపుతున్నాయి. ఎన్నికల్లో నెగ్గేందుకు కోట్లాది రూపాయలను వెదజల్లిన టీడీపీ తమ అభ్యర్థి ఖర్చు కేవలం రూ.6.49 లక్షలే అని పేర్కొనటంపై జనం నివ్వెరపోతున్నారు. ఉప ఎన్నికలో ఎలాగైనా నెగ్గేందుకు టీడీపీ డబ్బులు పారించిందనేది బహిరంగ సత్యం. నియోజకవర్గం మొత్తమ్మీద దాదాపు రూ.300 కోట్లు కుమ్మరించినట్లు అంచనా. టీడీపీ నేతల డబ్బు పంపిణీపై ‘సాక్షి’లో సాక్ష్యాలతో సహా కథనాలు ప్రచురితమయ్యాయి. చంద్రబాబు పర్యటన ఖర్చే రోజుకు రూ.కోటి ఉపఎన్నికల్లో అధికార పార్టీ మద్యాన్ని ఏరులై పారించింది. మద్యం ఖర్చే రూ.కోట్లలో ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి చూపిన ఖర్చు అక్షరాలా కేవలం 6 లక్షల 49 వేల రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ అభ్యర్థి కంటే దాదాపు రూ.20 వేలు ఎక్కువగా చూపారు. నామినేషన్ రోజు నుంచి పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు టీడీపీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.6.49 లక్షలేనట. నంద్యాలలో 20 మందికి పైగా మంత్రులు తిష్టవేశారు. నామినేషన్ దాఖలైన తర్వాత సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించారు. ఈ పర్యటన ఖర్చే రోజుకు రూ.కోటి వరకు ఉంటుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పర్యటించారు. టీడీపీ తరఫున బీజేపీ నేతలూ ప్రచారం చేశారు. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.6.49 లక్షలే అని చూపడం గమనార్హం. అభ్యర్థులు చేసిన ఖర్చును ఎన్నికల అధికారులు పరిశీలించి షాడో అబ్జర్వేషన్ రికార్డులో నమోదు చేస్తారు. దాని ప్రకారం కూడా టీడీపీ అభ్యర్థి చేసిన ఎన్నికల ఖర్చు రూ.16.60 లక్షలు అని చూపిస్తుండటంతో జనం నివ్వెరపోతున్నారు. ఇక వైఎస్సార్ సీపీ అభ్యర్థి రూ.17.50 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి రూ.6.59 లక్షలు ఖర్చు చేసినట్లు షాడో అబ్జర్వేషన్ రికార్డులో నమోదు చేశారు. కాగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రూ.10.39 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి రూ.6.67 లక్షలు ఎన్నికల ఖర్చుగా చూపారు. -
బాలకృష్ణ డబ్బు పంపిణీపై పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు?
ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్, వైఎస్సార్ సీపీ నేత శివకుమార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కేసు నమోదు విషయంలో ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు వినియోగించుకోకుండా కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్నే ఎలా కోరతారని ప్రశ్నించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. -
నంద్యాల:33వ వార్డులోడబ్బుల పంపిణీ
-
పోలింగ్ ప్రశాంతం
►ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు ►ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 91.97 శాతం పోలింగ్ ►పట్టభద్రుల ఎమ్మెల్సీకి 71.43 శాతం నమోదు ►పీడీఎఫ్, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ►ఓటుకు నోటు ఎరజూపిన అధికార పార్టీ ►మధ్యాహ్నం తర్వాత జోరుగా డబ్బు పంపిణీ ►గిద్దలూరులో ఓటుకు రూ.300 ►పలుచోట్ల రూ.500 నుంచి రూ.1000 వరకు.. ►చీరాలలో ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు అంటూ ప్రచారం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పెరిగింది. మొత్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 91.97 శాతం పోలింగ్ నమోదు కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీకి 71.43 శాతం పోలింగ్ నమోదైంది. 77,124 పట్టభద్రుల ఓటర్లకుగాను 55,090 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 5,557 ఉపాధ్యాయ ఓటర్లకుగాను 5,111 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కందుకూరులో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, సీపీఎం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దివి శివరాం పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడంతో సీపీఎం నేతలు అడ్డుకున్నారు. ఈ ఘటన తప్ప మిగిలిన చోట్ల ఘర్షణలేవీ చోటు చేసుకోలేదు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లను ప్రలోభపెట్టిన అధికార పార్టీ..: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓటర్లు ఆశించిన స్థాయిలో పోలింగ్ బూత్‌లకు రాకపోవడంతో అధికార పార్టీ ప్రలో భాల పర్వానికి తెరలేపింది. మధ్యాహ్నం నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్లతో పాటు అధ్యాపక ఓటర్లకు సైతం డబ్బులు పంపిణీ చేశారు. గిద్దలూరులో అధికార పార్టీ నేతలు ఓటుకు రూ.300 చొప్పున పంపిణీ చేశారు. దర్శి, కందుకూరు, అద్దంకి, చీరాల, గిద్దలూరు, సంతనూతలపాడు, కొండపి తదితర ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.1,000 వరకు పంపిణీ చేశారు. చీరాలలో అధికార పార్టీ నేతలు ఓటర్లకు ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు ఇస్తామంటూ తొలుత ప్రచారం చేశారు. ఉదయం పూట ఇవేమీ ఇవ్వకపోవడంతో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రాలేదు. దీంతో పోలింగ్ ఓటర్లు లేక బూత్‌లు వెలవెలబోయాయి. పరిస్థితి గమనించిన అధికార పార్టీ నాయకులు ఓటర్లను వాహనాలు పెట్టి వారి ఇళ్ల వద్ద నుంచి పోలింగ్ బూత్‌లకు తరలించారు. రూ.500 నుంచి రూ.1,000 వరకు డబ్బులు పంపిణీ చేశారు. అధికార పార్టీ నేతలు నియోజకవర్గ కేంద్రాలతో పాటు ప్రధానంగా పోలింగ్ కేంద్రాల పరిధిలో మకాం వేసి డబ్బు పంపిణీ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం పెరిగింది. చివరి రెండు గంటల్లో దర్శి, అద్దంకి, చీమకుర్తి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైంది. దర్శిలో చివరి రెండు గంటల్లో 836 ఓట్లు నమోదు కావడం గమనార్హం. కొన్ని చోట్ల ఓటర్లకు సకాలంలో డబ్బులందకపోవడంతో చాలా మంది ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. అధికార పార్టీ పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుందని ముందస్తు ప్రచారం చివరి నిమిషంలో చాలా మందికి డబ్బులు చేరలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీ పీడీఎఫ్, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రధానంగా ఉన్నా... ఓటర్లు పెద్ద సంఖ్యలో పీడీఎఫ్ అభ్యర్థులకు ఓటేసేందుకు మొగ్గుచూపినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారులు, పోలీసులు కృషి చేశారు. నిబంధనల మేరకు పోలింగ్ బూత్‌ల్లోకి ఓటర్లు మినహా ప్రజాప్రతినిధులు, మీడియాను సైతం అనుమతించలేదు. -
ఎన్నికలకు ముందే ఓటర్లకు డబ్బుల వరద!
వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ పార్టీలన్నీ వాటి కోసం ఇబ్బడి ముబ్బడిగా నిధులు సమీకరించుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఒక్కసారిగా ఉరుము లేని పిడుగులా పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చింది. దాంతో ఈ డబ్బునంతా ఏం చేయాలో అర్థం కాక రాజకీయ పార్టీలు సతమతం అవుతున్నాయి. అయితే ఇందుకు ఒక తరుణోపాయాన్ని కూడా వాళ్లు కనుగొంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ముందస్తు గానే గ్రామీణ ఓటర్లకు డబ్బులు పంచేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకళ్ల దగ్గరే ఎక్కువ మొత్తం ఉంటే దాన్ని మార్చుకోవడం కష్టం అవుతుంది గానీ, డిసెంబర్ నెలాఖరులోపు వాటిని గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్ల వద్దకు చేరిస్తే.. వాళ్లు బ్యాంకులలో మార్చుకుని వినియోగించుకుంటారని, చివరి నిమిషంలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బు పంపిణీపై ఉండే నిఘానుంచి కూడా తప్పించుకోవచ్చని సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు. యూపీలో త్రికోణ పోటీ తథ్యం కావడంతో అక్కడి పార్టీలన్నీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా సమాజ్‌వాదీ, బీఎస్పీ, బీజేపీ.. ఈ మూడు పార్టీల మధ్య పోరు చాలా గట్టిగా ఉంటుందని, ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఇప్పటివరకు వెల్లడైన ఎన్నికల సర్వేలలో తేలింది. దాంతో అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకున్నాయి. అందులో భాగంగానే డబ్బులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద మొత్తంలో ఉన్న డబ్బును డిసెంబర్ నెలాఖరు తర్వాత ఏమీ చేయలేం కాబట్టి.. ఈలోపే ఓటర్ల వద్దకు చేరిస్తే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, చిట్టచివరి నిమిషంలో ఎవరు డబ్బులిస్తారన్నదే ఎన్నికల్లో ఓట్ల తీరును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దాంతో ఒకవేళ ఇప్పుడు ఓటు కాంట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో డబ్బులు పంపిణీ చేసినా.. అది ఎంతమేరకు ప్రభావం చూపిస్తుందన్నది అనుమానంగానే ఉంది. కానీ దగ్గరే ఉంచుకుంటే మాత్రం డిసెంబర్ నెలాఖరు తర్వాత అవి చిత్తుకాగితాలతో సమానం అవుతాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి ఈ షాక్ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు పార్టీలో అంతర్గత తగాదాలు దాదాపు ప్రతిరోజూ పత్రికల ప్రధాన శీర్షికలలోనే ఉండేవి. కానీ, పెద్దనోట్ల రద్దు అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత.. అసలు ఆ పార్టీ విషయాలేవీ అసలు చర్చకే రావడం లేదు. పంజాబ్‌లో మాత్రం ప్రస్తుతం నదీజలాల వ్యవహారం నడుస్తోంది కాబట్టి కాస్తంత రాజకీయ వేడి కనిపిస్తోంది. మొత్తమ్మీద ముందస్తు డబ్బు పంపిణీ అనేది ఇప్పటివరకు భారతదేశ ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేదు. ఈసారి జరుగుతుందేమో చూడాలి. -
హయత్‌నగర్ లో డబ్బు పంపిణీ: ఒకరి అరెస్టు
హైదరాబాద్: ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ బీజేపీ అభ్యర్థి సమీప బంధువు ఒకరు పోలీసులకు పట్టుబడ్డారు. నగరంలోని హయత్‌నగర్ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కల్లెం రవీందర్‌రెడ్డి అల్లుడు విజయేందర్‌రెడ్డి ఎన్వలప్ కవర్లలో నోట్లు పెట్టి పంపిణీ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 4 లక్షలు, ఎన్వలప్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఓటుకు కార్పొరేటు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో దాదాపు అన్ని స్థానాల్లో వెనకబడిపోయామన్న భయంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి బాగోలేదని గ్రహించి తన కోటరీలో ఉన్న కార్పొరేట్ సంస్థల యజమానులను, పక్క జిల్లాల నేతలను డబ్బు సంచులతో ఇక్కడికి పంపించారు. తెలంగాణ నేతలతో పాటు పొరుగు జిల్లా నేతలను ఇక్కడికి తరలించి, నియోజకవర్గాల్లో తిష్ట వేయించారు. డబ్బు తో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడే కొద్దీ టీడీపీ నేతలను ఓటమి భయం వెంటాడుతోంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మద్యం, డబ్బు పంపిణీ చేసినా మార్పు కన్పించకపోవ డంతో కలత చెందుతున్నారు. ఇవన్నీ చంద్రబాబు దృష్టికెళ్లాయి. దీంతో ఆందోళన చెందిన ఆయన నేతలను తరలించారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గానికి ముగ్గురేసి చొప్పున పంపించారు. తెలంగాణలో ఎన్నికలైపోవడంతో అక్కడి నేతలను దాదాపు ఇక్కడికి పంపించారు. నామా నాగేశ్వరరావు, ఓ విద్యా సంస్థల అధినేత, విశాఖ జిల్లాకు చెందిన ఓ పారిశ్రామిక వేత్త నేతృత్వంలో వీరంతా పనిచేస్తున్నారని సమాచారం. ఆయా నియోజకవర్గాల పరిధిలోని లాడ్జీల్లో కాకుండా ఇళ్లను అద్దెకు తీసుకుని తిష్ఠవేశారు. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికీ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా సమాచారమివ్వకుండా గోప్యతను పాటిస్తున్నారు. ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో టీడీపీ నేతలంతా ఓటూ...నోటు జపం చేస్తున్నారు. ఈక్రమంలో ఓట్ల కోసం బేరసారాలు సాగిస్తున్నారు. స్థానిక నాయకులను వెంటబెట్టుకుని రాయబారాలు నెరుపుతున్నారు. గ్రూపుగా ఓటర్లతో ఒప్పందాలు చేయిస్తూ డబ్బు మూటలు అందజేస్తున్నట్టు తెలిసింది. ఓటుకు నోటు అంటూ విస్తృతంగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో మద్యం కేసులను చోటా నాయకులకు అందించి ఓటర్లకు పూటుగా పట్టించడం ద్వారా తమ వైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారు.అధికారులు షాడో టీంలు ఏర్పాటు చేయడంతో డబ్బు, మద్యం పంపిణీ బాధ్యతలను కొంతమందికి ప్రత్యేకంగా అప్పగించారు. వీరికి బ్యాంకు ఖాతాల ద్వారా నగదు సరఫరా చేస్తున్నారు. వీరి ద్వారా వార్డుల్లోనూ, గ్రామాల్లోనూ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అలాగే, మద్యం కూడా ఇప్పుడున్న లెసైన్సు షాపుల ద్వారానే సరఫరా చేయిస్తున్నారు. డబ్బు విచ్చలవిడిగా పంచుతున్నా తమ పార్టీకే ఓట్లు పడతాయన్న నమ్మకం టీడీపీ నేతల్లో కలగడంలేదు. దీంతో వారు నైరాశ్యంలో ఉన్నారు. -
స్వయంగా డబ్బును పంచుతున్న శత్రుచర్ల
-
కులాల మధ్య పితాని చిచ్చు
సాక్షి, ఏలూరు :పదేళ్లు పదవిని అనుభవించి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి మళ్లీ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నైతికంగా దిగజారి కుటిల రాజకీయాలు చేస్తూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, ఆచంట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ. 2004లో పెనుగొండ నుంచి, 2009లో ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొందిన పితాని అంతకుముందు వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గానీ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. అనంతరం కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో భాగమయ్యారు. ఆ పార్టీ రాష్ర్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన ఆయన కొద్దిరోజులకే టీడీపీలో చేరారు. సొంత బావ, ఆచంట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గుబ్బల తమ్మయ్యకు వెన్నుపోటు పొడిచి ఆ సీటును తన్నుకుపోయారు. ఇంతచేసినా వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజును ఎదుర్కోలేకపోతున్నారు. వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు పితాని అధర్మ యుద్ధానికి దిగారు. పదవిలో ఉండి వెనకేసుకున్న అక్రమ సొమ్మును ఎన్నికల కోసం ఆయన వెదజల్లుతూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. రహస్య మంతనాలు జరుపుతూ మాట వినని వారి సామాజిక వర్గాల మధ్య చీలికలు తెస్తున్నారు. వైఎస్సార్ సీపీని ఓడించేందుకు ఆయన చేస్తున్న అత్యంత నీచమైన ప్రయత్నాలను జనం అసహ్యించుకుంటున్నారు. తెలుగుతల్లిని ముక్కలు చేస్తుంటే కళ్లు మూసుకుని, చివరి వరకూ పదవిని పట్టుకుని వేలాడిన ఆయనకు ఓటు వేసేదే లేదంటూ తెగేసిచెబుతున్నారు. అయితే పితాని మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు కొనాలని చూస్తున్నారు. దాని కోసం సొత్తు ఇప్పటికే సిద్ధం చేశారు. బూత్ స్థాయికి ఆ సొమ్మును తరలించారు. అన్నేళ్లు పదవిలో ఉండి కూడా నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకోని పితాని కుటిల పన్నాగాలకు ఓటుతో బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
‘పచ్చ’ నేతల పందేరాలు
సాక్షి, గుంటూరు :ఓట్ల కోసం టీడీపీ నేతలు పన్నుతున్న కుయుక్తులు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. గెలుపు కోసం అన్ని అడ్డదారులు తొక్కుతూ ఓటర్లను నానా రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల నిబంధనల్ని తోసిరాజని సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమి తప్పదని తెలుస్తున్నా.. పైకి బీరాలు పలుకుతూ లోపల సొంత పార్టీ నేతలతో బేరాలు కుదుర్చుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏమిచ్చైనా ఓట్లను కొనేందుకు టీడీపీ నేతలు ప్రలోభాల్ని పదునెక్కిస్తున్నారు. ఓటుకు నోటు, మద్యం పంపిణీ, అనేక రకాల తాయిలాలు ఎర వేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో పట్టపగలే నోట్ల కట్టల పాములు బుసలు కొడుతున్నాయి. ఓటర్లకు ఇన్వర్టర్లను పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున లోడ్ పట్టణంలో నిల్వ ఉంచారు. ఎండాకాలం కావడంతో కరెంటు కోతలతో సతమతమవుతున్న పట్టణ వాసులకు బ్యాటరీలతో పాటు ఇన్వర్టర్లను పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఇందుకు ఎన్నికల్లో పోటీచేస్తున్న బ్యాటరీ కంపెనీ అధినేత ఎలాగైనా సరే మంగళగిరిలో వైఎస్సార్సీపీ హవాను నిలువరించేందుకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. ఈ ప్రలోభాలపై జిల్లా ఎన్నికల అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పక్కా సమాచారం అందించినా పట్టుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంగళగిరి పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీచేసిన వ్యాపారికి సంబంధించిన గోడౌన్లలో బహుమతులు దాచి ప్రలోభ పెడుతున్నట్లు సమాచారం. భారీగా నగదు పంపిణీ పట్ట పగలే జరుగుతున్నా అధికారులు ఏ మాత్రం కన్నెత్తి చూడటం లేదు. ‘సామాజిక’ సమావేశాలు మంగళగిరి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవికి మద్దతుగా అతని సామాజిక వర్గానికి చెందిన కొందరు ఏర్పాటు చేస్తున్న సమావేశాలు బెడిసికొడుతున్నాయి. గురువారం మంగళగిరిలోని ఓ కళ్యాణమండపంలో ఎన్నికల కోడ్ అతిక్రమించి చిరంజీవి వర్గీయులు నిర్వహించిన సమావేశం రసాభాసగా ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా కులాల నడుమ చిచ్చు పెట్టి ఓట్లు బావుకునేందుకు టీడీపీ చేస్తున్న కుటిల రాజకీయాలపై విశ్లేషకులు ఏవగించుకుంటున్నారు. సమావేశంపై సమాచారమిచ్చినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశంలో గంజి చిరంజీవికి మద్దతిచ్చే విషయంపై విభిన్న వాదనలు జరిగినట్లు సమాచారం. మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవి చేనేత వర్గానికే ఇచ్చేలా టీడీపీ అధినేత చంద్రబాబుతో హామీ ఇప్పించాలని కొందరు డిమాండ్ చేయడంతో ఖిన్నులవడం టీడీపీ నేతల వంతైంది. మరోవైపు బీసీల్లో ఓ ప్రధాన వర్గం టీడీపీని ఓడించాలంటూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయడం పట్టణంలో కలకలం రేపింది. తమ వర్గానికి జిల్లాలో ఒక్క సీటు కూడా కేటాయించని టీడీపీని ఎన్నికల్లో మట్టి కరిపించాలని బీసీ సామాజిక వర్గ ముఖ్య నేత మాగంటి సుధాకర్ యాదవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరినే వేదికగా చేసుకుని సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నారు. దీంతో గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, మంగళగిరి అభ్యర్థి గంజి చిరంజీవిల్లో గుబులు రేగింది. -
ఫలితమిచ్చిన ప్రజాసైన్యం
ప్రచారం గడువు ముగిసిపోతోంది. మరికొన్ని గంటల్లో మైకులన్నీ మూగపోతాయి. ఎక్కడికక్కడ అంతా గప్‌చుప్. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. దాంతో సోమవారం సాయంత్రం 4 గంటలకల్లా ప్రచారాల గడువు ముగిసిపోతుంది. దీంతో అభ్యర్థులంతా ఒకవైపు ముమ్మరంగా ప్రచారం చేసుకుంటూనే మరోవైపు సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయంలోపు చేయాల్సిన 'ఇతర' కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నారు. మరోవైపు వాళ్లకు దీటుగా అధికార యంత్రాంగం కూడా అంతేస్థాయిలో పటిష్ఠమైన నిఘా ఏర్పాటుచేయడంతో ఎక్కడికక్కడ డ బ్బు, మద్యం పట్టుబడుతున్నాయి. ఈసారి ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించాలనే గట్టి ఉద్దేశంతో ఉన్న ఎన్నికల అధికారులు.. ఎన్నడూ లేనంత స్థాయిలో నిఘా పెంచడంతో దేశం మొత్తంలో ఎక్కడా లేనంతగా భారీమొత్తంలో నగదు, బంగారం, మద్యం అన్నీ మన రాష్ట్రంలోనే పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 125 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం, ఆన్లైన్ లావాదేవీలపై కన్నేసి ఉంచడం, హవాలా సెంటర్లపై నజర్ పెట్టడం లాంటివి ఈసారి కొత్తగా చేస్తున్నారు. దీనివల్ల ఏ మార్గంలో అభ్యర్థులు నగదు పంపుతున్నదీ ఇట్టే తెలుసుకుని ఎక్కడపడితే అక్కడ స్వాధీనం చేసుకుంటున్నారు. బ్యాంకుల ద్వారా భారీమొత్తంలో జరిగే లావాదేవీల విషయంలో కూడా అధికారులు పటిష్ఠ నిఘా ఏర్పాటుచేశారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి ఎన్నికల అధికారులు ఓ సరికొత్త ప్రయోగం చేశారు. ప్రజాసైన్యం ఒకదాన్ని అధికారులు తయారుచేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న యువకులు, విద్యాధికులు, ఉత్సాహవంతులు, నిజాయితీపరులు, ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే వారితో ఒక సైన్యం ఏర్పాటుచేశారు. వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఎక్కడ డబ్బు తరలుతున్నా, పంపకాలు సాగుతున్నా ఎన్నికల నిఘా అధికారులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. అది అందిన క్షణాల్లోనే అధికారులు అక్కడ దాడులు చేసి భారీ మొత్తాలను పట్టుకుంటున్నారు. ఈ ప్రజాసైన్యం విషయం దాదాపు ఎవరికీ తెలియదు. దేశం పట్ల అభిమానం, ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే చిత్తశుద్ధి ఉండటంతో తామెవరన్న విషయాన్ని కూడా ఎవరికీ తెలియనివ్వకుండా, తమ పేర్లు ఎక్కడా బయటకు రానీయకుండా ఈ సైన్యం నిశ్శబ్దంగా పని చేసుకుపోతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. ప్రచారం అయిపోయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో అభ్యర్థులు నగదు, చీరలు, మద్యం.. ఇలా రకరకాల ప్రలోభాలతో తమవాళ్లను రంగంలోకి దింపుతారు. వాళ్లను ప్రజాసైన్యం సమర్థంగా అడ్డుకోగలిగితే ఈసారి ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టినట్లే. -
టీడీపీ నేత ధూళిపాళ్ల నోటు రాజకీయాలు
-
టీడీపీ నేత ధూళిపాళ్ల నోటు రాజకీయాలు
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటినుంచే డబ్బు రాజకీయాలకు తెరదీశారు. పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన కొంతమంది మనుషులు డబ్బు పంచుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సంగం డెయిరీకి చెందిన నలుగురు ఉద్యోగులు డబ్బు పంపిణీ చేయిస్తుండగా గ్రామస్థులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్వయంగా సంగం డెయిరీ ఛైర్మన్ అయిన ఎమ్మెల్యే నరేంద్ర పంపిన డబ్బును వీళ్లు పంచుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో 'ఆంధ్రజ్యోతి' విలేకరి సాయంతో డబ్బులు పంచుతుండగా పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం నాటి సంఘటనలో డబ్బు పంచతున్నవాళ్లు ఓ ఘనకార్యం కూడా చేశారు. 500 రూపాయల నోటు మీద సైకిల్ గుర్తు రబ్బరు స్టాంపు వేసి మరీ పంపిణీ చేశారు. కేసు నమోదు చేయకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే వీరిని అదుపులోకి తీసుకున్నా, ఇంతవరకు అరెస్టు చూపించలేదు. మీడియాను కూడా పోలీసు స్టేషన్ లోపలికి రానివ్వలేదు. -
మద్యం, డబ్బు పంపిణీ పై అధికారులు నిర్లక్ష్యం
ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు డ బ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల సం ఘం నియమించిన నిఘా విభాగం నిద్రావస్థలో ఉం ది. మద్యం, డబ్బు పంపిణీ ప్రవహాన్ని అడ్డుకోవడం లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎన్నికల ఖర్చును నియంత్రించడానికి ఏర్పాటు చేసిన నిఘా విభాగం అభ్యర్థుల సొమ్మును స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఇప్పటివరకు మండలంలో అమాయకుల సొమ్మును స్వాధీనం చేసుకున్నా నిఘా విభాగం అధికారులు అ భ్యర్థులు తరలిస్తున్న సొమ్ముపై దృష్టి సారించడం లే దనే విమర్శలున్నాయి. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మండలాల వారీగా అధికారులున్నా.. జిల్లాలో ఈ నెల 6, 11వ తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఖర్చుపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేసినా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునేందుకు మండలాల వా రీగా ఆర్వోలను నియమించింది. దీంతోపాటు ఎన్నిక ల యంత్రాంగం నియోజకవర్గ, మండల స్థాయి నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ స్థాయిలో సహాయ వ్యయ పరిశీలకులు(ఏఈవో), వీడియో సర్వైవల్ టీం, వీడియో వ్యూయింగ్ టీం, అ కౌంటింగ్ టీం, మండల స్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్(ఎఫ్ఎస్), స్టాటిక్ సర్వైలెన్స్ టీం(ఎస్ఎస్టీ), మోడ ల్ కోడ్ టీం, సెక్టోరల్ టీం పనిచేస్తున్నాయి. వీటిలో వీడియో వీడియో వ్యూయింగ్ టీం, అకౌంట్ టీంలు కార్యాలయంలోనే పనిచేస్తాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, సెక్టోరల్, వీడియో సర్వైవల్ టీంలు అభ్యర్థుల క దలికలపై నిఘా వేస్తుంటాయి. అభ్యర్థులు ఓట్ల వేట లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. కనిపించిన వారినల్లా ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు. జోరుగా మద్యం .. మందు మద్యం నిల్వ చేసి కొందరికి ఎర చూపి తమ వెంట ప్రచారంలో తిప్పుకుంటున్నారు. అయినా అభ్యర్థుల కదలికలపై నిఘా పెట్టాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు గురిచేస్తే చర్యలుంటాయాని ఎన్నికల అధికారులు గ్రామాల్లో ఓటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నారు. అవేమీ పట్టన్నట్లుగా రాజకీయ నాయకులు, అభ్యర్థులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లను పంచేందుకు వివిధ మార్గాల ద్వారా ఇప్పటికే అవసరమైన డబ్బు సమాకుర్చుకున్నట్లు తెలుస్తోంది. కొందరు మద్యం బాటిళ్ల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా నిఘా విభాగం అధికారులు నిద్రమత్తు వీడి ప్రలోభాలకు గురిచేసే అభ్యర్థులపై నిఘా వేయాల్సి ఉంది.