ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ బీజేపీ అభ్యర్థి సమీప బంధువు ఒకరు పోలీసులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్: ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ బీజేపీ అభ్యర్థి సమీప బంధువు ఒకరు పోలీసులకు పట్టుబడ్డారు. నగరంలోని హయత్‌నగర్ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కల్లెం రవీందర్‌రెడ్డి అల్లుడు విజయేందర్‌రెడ్డి ఎన్వలప్ కవర్లలో నోట్లు పెట్టి పంపిణీ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 4 లక్షలు, ఎన్వలప్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.