Greater elections
-
గ్రేటర్ ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
-
గ్రేటర్ వార్ 27 Nov 2020
-
‘రుచి’ చూపిస్తున్న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ దెబ్బతో ఆర్నెళ్లుగా విలవిల్లాడిన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రస్తుతం కస్టమర్లతో కళకళ్లాడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పుణ్యమాని రాష్ట్రం నలమూలల నుంచి ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలంతా వచ్చి ఇక్కడే తిష్టవేయడంతో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 80 శాతం హోటళ్లు తెరుచుకోగా, మునుపటిగా భోజనం ఆరంగించేందుకు వస్తున్న కస్టమర్లు 75 శాతానికి చేరుకున్నారు. ఇక కార్యకర్తల కోసం పార్టీలు బల్క్‌గా ఇస్తున్న ఫుడ్ ఆర్డర్ల సంఖ్య పెరగ్గా, మరోపక్క హోమ్ డెలివరీలు పెరుగుతున్నాయని ఈ–కామర్స్ సంస్థలు చెబుతున్నాయి. (జీహెచ్ఎంసీ ఎన్నికలు: రచ్చ రంబోలా) హోటళ్లకు ఎన్నికల జోష్ రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ దెబ్బ తగిలింది. పూర్తిగా మూసివేయాల్సి రావడంతో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక యజమానులు నష్టపోయారు. తిరిగి జూన్ రెండో వారంలో వీటిని తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. సామాజిక దూరం పాటించేలా, ‘కోవిడ్’ జాగ్రత్తలు పాటిస్తూ రెస్టారెంట్లలో మార్పుచేర్పులు చేసినా కరోనా కేసుల నేపథ్యంలో వినియోగదారులు పెద్దగా అటు వెళ్లలేదు. దీనికి తోడు చాలా రెస్టారెంట్లలో నిష్ణాతులైన వంటగాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోయారు. వారిని తిరిగి రప్పించడం యజమానులకు కష్టమైంది. కొన్ని రెస్టారెంట్లను లాభాలను పక్కనపెట్టి నడిపించినా, వినియోగదారులు రాక, అద్దెలు కట్టలేక వాటిని మూసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ‘ఆగస్టు వరకు 79 శాతం రెస్టారెంట్లు మూతబడ్డాయి. అనంతరం 21 శాతం మేరకు తెరుచుకున్నా, అవి హోమ్ డెలివరీలకే ప్రాధాన్యమిచ్చాయి. ఇందులోనూ 17% తక్కువ సామర్థ్యంతో నడిచాయి. అక్టోబర్, నవంబర్లలో పరిస్థితి మెరుగైంది. మూతపడిన రెస్టారెంట్లలోని 52% తిరిగి తెరుచుకున్నాయి’ అని ఇటీవలి సర్వేలు వెల్లడించాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికలు రావడంతో తెరుచుకున్న హోటళ్లకు కస్టమర్ల రాక రెట్టింపైంది. పెరిగిన బిర్యానీ ఆర్డర్లు నగరంలోని 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని ప్రధాన పార్టీల నేతలు వచ్చి ఇక్కడే మకాం వేశారు. పొరుగు జిల్లాల నుంచి ఆయా పార్టీలకు చెందిన కనీసం 5 వేల మంది చోటామోటా నాయకులు మందిమార్బలంతో హోటళ్లలో దిగారు. వీరందరికీ ఆయా పార్టీలు డివిజన్ల వారీగా హోటళ్లలో వసతి కల్పించడంతో అవన్నీ కళకళ్లాడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలతో కస్టమర్ల తాకిడి పెరిగిందని, సీటింగ్ సామర్థ్యం సైతం 50 నుంచి 75 శాతానికి పెరిగిందని గచ్చిబౌలిలోని హోటల్ యజమాని ఒకరు తెలిపారు. వారం రోజులుగా బల్క్‌గా రోజుకు రెండు నుంచి మూడు ఆర్డర్లు ఉంటున్నాయని కూకట్‌పల్లికి చెందిన మరో రెస్టారెంట్ యజమాని తెలిపారు. (‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం) ఇక ఆగస్టు, సెప్టెంబర్లలో వివిధ వెరైటీల వంటకాల మెనూని కుదించి, డిమాండ్ ఉన్న వాటినే కస్టమర్లకు అందించగా, ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో అన్ని వెరైటీలను అందిస్టున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక గత 15 రోజులుగా గ్రేటర్ పరిధిలో హోమ్ డెలివరీలు పెరిగాయని జొమాటో తన సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా చికెన్, మటన్ బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని, ఒకే ఆర్డర్‌పై ఎక్కువ మందికి సరిపోయే భోజనం ఆర్డర్లు ఇస్తున్న వారి సంఖ్య సైతం పెరిగిందని డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. -
ఐటీ రంగం కావాలంటే మేము రావాలి : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో భాగ్యనగరం బాగా రాణించాలంటే తమకే పట్టం కట్టాలని ఓటర్లను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందడంతో స్థానిక సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కేటీఆర్ ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికరమైన విషయం తెలియజేశారు. ఐటీ ఉద్యోగి గర్వపడేలా భాగ్యనగరంలో ఐటీ రంగం వృద్ధి రెట్టింపు వేగంతో జరుగుతోందని తెలిపారు. 2014 సంవత్సరంలో రూ. 57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ప్రస్తుతం లక్షా 29 వేల కోట్లకు చేరుకున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. ప్రఖ్యాత సంస్థలు కోలువుదీరేలా హైదరాబాద్ ఎదిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. రాబోయే కాలంలో ఐటీ రంగం మరింత వృద్ధి సాధించాలంటే డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి మద్ధతుగా నిలవాలని అభ్యర్థించారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో 150 డివిజన్లకు గాను మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. 149 స్థానాల్లో బీజేపీ బరిలో ఉంది. 146 స్థానాలలో కాంగ్రెస్ పోటి చేస్తుంది. సీపీఐ 17 స్థానాలు, సీపీఎం 12 స్థానాలలో, 51 ఎంఐఎం డివిజన్లలో అభ్యర్థలను రంగంలోదించారు. TRS Govt led IT Exports & Employment to double in the last six years in Hyderabad. Let's multiply this growth in coming years. Be a proud techie of Hyderabad! Vote for Car symbol on Dec 1st. #HyderabadWithTRS pic.twitter.com/RjQi5PQZL1 — KTR (@KTRTRS) November 24, 2020 -
గ్రేటర్ వార్ 21 Nov 2020
-
గ్రేటర్ వార్ 19 Nov 2020
-
గ్రేటర్ వార్
-
బీరు, బిరియానీ ప్లేస్‌లో మాస్క్, శానిటైజర్..!
హైదరాబాద్: ఎన్నికలొస్తున్నాయంటే చాలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు నానా హడావిడి చేస్తుంటాయి. ఓటుకింత ముట్టజెప్పడమే కాకుండా బీరు.. బిరియానీ.. ఖరీదైన బహుమతులతో ‘ప్రచారం’ చేస్తుంటాయి. అతిత్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు. అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అప్పుడే ప్రచారాన్ని కూడా షురూ చేసేశాయి. కానీ.. ఇది ‘కరోనా సీజన్’ కావడంతో కాస్త ప్లాన్ మార్చారు ఆయా పార్టీల నేతలు. బీరు, బిరియానీల స్థానంలో మాస్క్, శానిటైజర్లను ఉచితంగా అందజేస్తూ ఓటర్ల ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ వలంటీర్లను ఓటర్ల ఇళ్లకు పంపించి తమకు చేతనైనంతలో బహుమతులు ఇవ్వడం తమకు అలవాటని టికెట్ ఆశిస్తున్న ఓ అభ్యర్థి చెప్పారు. ఈసారి ఆ వలంటీర్లతోనే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు, విటమిన్ గోళీలను ఇంటింటికీ పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతల పంపిణీ ముగిసిందని, ఎన్నికలు పూర్తయ్యేలోపు మరోసారి పంపిస్తామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారీ అభ్యర్థులు. మాస్కులు, శాటిటైజర్లు, మందులతోపాటు వలంటీర్లకు కూడా రాజకీయ పార్టీలు భారీగా ఖర్చుపెడుతున్నాయి. ఒక్కో వలంటీర్‌కు 6 గంటలు పనిచేస్తే 600.. 12 గంటలు పనిచేస్తే 1200 ముట్టుజెపుతున్నారట పోటీలో ఉన్న అభ్యర్థులు. (చదవండి: అమాంతం పెరిగిన చికెన్ ధర) -
గ్రేటర్ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తాం
-
ఇన్చార్జి పదవా.. మాకొద్దు
► అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జీలు లేని దుస్థితి ► బాధ్యతలు తీసుకునేందుకు ముందుకురాని నేతలు ► గ్రేటర్లో సైతం అధ్యక్ష పదవి ఖాళీ ► దయనీయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ సాక్షి ప్రతినిధి, వరంగల్ : దశాబ్దకాలం అధికారంలో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు నాయకులు దొరకని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం వరకు పార్టీ బాధ్యతల కోసం పోటీ పడిన నేతలు ఇప్పుడు బాధ్యతలు తీసుకోవాలంటే జంకుతున్నారు. ఫలితంగా ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో అంతా తామై వ్యవహరించిన నేతలు ఇప్పుడు జిల్లాలో కనిపించడం చాలా అరుదు. పదవులు అనుభవించి, ఆర్థికంగా స్థిరపడిన వారు కష్టకాలంలో పార్టీని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నారుు. పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసే తరహాలో నియోజకవర్గ స్థాయి నేతలు లేకపోవడంతో అధికార పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కింది స్థాయి నేతలు స్పందించాలని చెబుతున్నా పెద్ద నాయకులు మాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పార్టీలో నెలకొంది. నియోజకవర్గ ఇంచార్జిల నిర్లిప్త వైఖరితో పార్టీ పరంగా పూర్తిగా స్తబ్ధత నెలకొంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో పార్టీకి నష్టం చేకూరుస్తుందనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు నాయకత్వంలేని దుస్థితి నెలకొందనే చర్చ జరుగుతోంది. వాస్తవ పరిస్థితులు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన బస్వరాజు సారయ్య ఇటీవల గ్రేటర్ ఎన్నికలకు ముందు అధికార పార్టీలో చేరారు. పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సారయ్యతోపాటే టీఆర్ఎస్లోకి మారారు. సారయ్య కాంగ్రెస్‌ను వీడడంతో ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ లేకుండాపోయారు. 2014 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఒక్క డోర్నకల్ స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మారిన పరిణామాలతో డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరారు. రెడ్యానాయక్ 2014 నవంబరులో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఆ నియోజకర్గానికి కాంగ్రెస్ తరుపున నాయకత్వం లేని పరిస్థితి ఉంది. మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాలోత్ కవిత సైతం ఆమె తండ్రి డి.ఎస్.రెడ్యానాయక్ బాటలోనే నడిచారు. 16 నెలల క్రితం అధికార పార్టీలోకి మారారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్‌కు పూర్తి స్థాయి ఇంచార్జి లేరు. కొత్తగా బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఎస్టీ కేటగి రీకి కేటాయించిన ఈ నియోజకవర్గం బాధ్యతను తాత్కాలికంగా ఇతరవర్గానికి చెందిననేతకు అప్పగించారు. దీం తో పార్టీ పరంగా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జి.విజయరామారావు పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనడం లేదు. రాష్ట్ర నేతలు పాల్గొనే సభలకు వచ్చి వెళ్లడంతో సరిపెడుతున్నారు. నియోజకవర్గ నేతలతో ఎలాంటి సంబంధాలూ కలిగి ఉండడం లేదు. దీంతో ఈ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులే నెలకొన్నాయి. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ముందు నగరంలో కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ టీఆర్ఎస్లో చేరి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. గ్రేటర్ అధ్యక్షుడు పార్టీ మారడంతో ఎన్నికల సమయంలో పార్టీలో అయోమయం నెలకొంది. కాంగ్రెస్‌లో పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉండేది. ఇప్పుడు మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై నగరంలోని నేతలు ఎవరూ ఆసక్తి చూపడంలేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. -
రాష్ట్ర రెండవ రాజధానిగా వరంగల్
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మడికొండ : రాష్ట్ర రెండవ రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మడికొండలో కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, అరూరి రమేశ్, దాస్యం వినయ్ భాస్కర్, 33,34,53 డివిజన్ల ఇన్చార్జిలు ముత్తిరెడ్డి యాదవరెడ్డి, రాజారపు ప్రతాప్ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షో గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.300 కోట్లను ప్రకటించారన్నారు. వరంగల్‌ను విద్యకేంద్రంగా అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని కేసీఆర్ 20 నెలల్లోనే చేసి నిరూపించారని పేర్కొన్నారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్‌లో తాగునీరు, రోడ్లు, అండర్ డ్రైనేజీ, ఔటర్‌రింగ్ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 33,34,53 డివిజన్ల అభ్యర్థులు ఇండ్ల నాగేశ్వర్రావు, జోరిక రమేశ్, ఆవాల రాధికరెడ్డి, ఊకంటివనంరెడ్డి, మేరుగు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మరో కానుక ఇవ్వాలి కాజీపేట / కాజీపేట రూరల్ : వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలిపించినట్లుగానే టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులను గె లిపించి సీఎం కేసీఆర్‌కు మరో కానుక అందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు ఆవాల రాధికారెడ్డి, నార్లగరి రాజమణి, అబూబక్కర్, సంకు రేణుక గెలుపు కోసం సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మడికొండ. బాపూజీనగర్, డీజిల్కాలనీల్లో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్‌తో పాటు రాజారపు ప్రతాప్‌తో కలిసి డిప్యూటీ సీఎం ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి తెలంగాణలో ఉనికి లేకుండా పోయినా డిపాజిట్లు గల్లంతు చేసుకునేందుకే పోటీకి దిగాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రప్రభుత్వం నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ సందర్భంగా భాపూజీనగర్లో టీఆర్ఎస్ కార్యాలయూన్ని కడియం శ్రీహరి ప్రారంభించారు. -
..ఎందుకిలా!
గ్రేటర్ ఎన్నికలకు దూరంగా మంత్రి చందూలాల్ - సమన్వయ కమిటీలో దక్కని చోటు -పక్కన పెట్టిన టీఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ మంత్రి చందూలాల్ ను గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలోకి తీసుకోకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ ఒక మంత్రిని జిల్లా కేంద్రంలో జరగుతున్న ఎన్నికలకు దూరంగా పెట్టడం అంటే పెద్ద విషయమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ కు టీఆర్ఎస్ లో పార్టీ పరంగా సరైన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీకి సంబంధించిన కీలక కార్యక్రమాలకు చందూలాల్ ను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నికల కార్యక్రమాల్లో చందులాల్‌కు ప్రత్యేకంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించ లేదు. తాజాగా గ్రేటర్ వరంగల్‌కు జరుగుతున్న ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)లోని 58 డివిజన్లలో భారీ అధిక్యం లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను టీఆర్ఎస్ అధిష్టానం పూర్తిగా జిల్లా నేతలకే అప్పగించింది. అన్ని డివిజిన్లలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, ప్రచార వ్యూహాలు, రెబల్ అభ్యర్థులకు సర్దిచెప్పడం.. వంటి కీలక వ్యవహారాలను చక్కబెట్టేందుకు టీఆర్ఎస్ తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని నియమించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ కమిటీలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితోపాటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులను సభ్యులుగా నియమించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్‌లో జరుగుతున్న ఎన్నికల కోసం నియమించిన కమిటీలో చందులాల్‌కు చోటు కల్పించలేదు. రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న చందూలాల్‌ను గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలో నియమించకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ ఒక మంత్రిని జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎన్నికకు దూరంగా పెట్టడం అంటే పెద్ద విషయమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు నెలల క్రితం టీఆర్ఎస్లో చేరిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీలో సభ్యురాలిగా నియమించి... రాష్ట్ర మంత్రిని పక్కనబెట్టడం ఏమిటని చందూలాల్ అనుచరుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్లో, ప్రభుత్వంలో చందులాల్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని, తాజాగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో ఇదే స్పష్టమైందని మంత్రి వ్యతిరేకులు అంటున్నారు. చందూలాల్ సన్నిహితులు, వ్యతిరేకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా... రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తిని ఎన్నికల కార్యక్రమాలకు దూరం పెట్టడం మాత్రం టీఆర్ఎస్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. టీఆర్ఎస్లో సీనియర్ నేతగా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా అజ్మీరా చందూలాల్‌కు గుర్తింపు ఉంది. గిరిజనుల కోటాలో 2014 డిసెంబర్లో ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో చందులాల్‌కు గతంలో ఉన్న ప్రాధాన్యత లేదని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగానే చందులాల్‌ను గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీకి దూరం పెట్టారని తెలుస్తోంది. ‘గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలో తొమ్మిది మంది ఉన్నారు. ఎస్సీ, బీసీ, ఓసీ... అన్ని వర్గాల వారికి చోటు కల్పించారు. తొమ్మిది మందిలో ఒక్క ఎస్టీ నేత లేరు. ప్రత్యేక రాష్ట్రంలో ఎస్టీలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రకటనకు తాజా కమిటీ తీరు విరుద్ధంగా ఉంది’ అని టీఆర్ఎస్లోని ఎస్టీ నేతలు అంటున్నారు. మేడారం జాతర వల్లే : డిప్యూటీ సీఎం కడియం మేడారం జాతర నిర్వహణలో బిజీగా ఉండడం వల్లే చందూలాల్‌కు గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమన్వయ కమిటీలో చోటు కల్పించలేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వరంగల్ నగరంలో ఓటు హక్కు ఉన్న వారికి కమిటీలో చోటు కల్పించినట్లు వివరించారు. సోమవారం హన్మకొండలోని ఓ హోట ల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా కడియం ఈ వివరణ ఇచ్చారు. -
న్యాయపోరాటం చేస్తాం: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఈ విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపిస్తామని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శనివారం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై శాస్త్రీయంగా చెబుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. నారాయణఖేడ్‌లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినా నిర్లక్ష్యం చేసిందన్నారు. నోటా ఆప్షన్ తొలగించడం, ఈవీఎంలకు ప్రింటర్లు లేకుండా ఎన్నికలను నిర్వహించడం, పేపర్ బ్యాలెట్‌ను నిర్వహించాలని కోరినా పట్టించుకోకపోవడం వంటి అంశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, సిద్దిపేట పురపాలక ఎన్నికలనైనా పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. -
ఆజ్ఞాపన మీద అస్పష్ట ముద్ర
తెలుగు రాష్ర్ట కృత్రిమ విభజనకు దారి తీసిన కారణాలు, పలు రకాల ఉద్రేకాలు కూడా నగర ఓటింగ్ సరళిపైన ప్రభావం చూపినట్టు వెల్లడైంది. విభజనకు ముందు ఆ తరువాత సెటిలర్స్ పేరిట వెలువడిన అనూహ్యమైన ప్రకటనలు, నివాసానికి సంబంధించిన అర్హతలకు కొందరు నాయకులు పెట్టిన కొలతల ప్రభావమూ ఈ ఎన్నికల ఓటింగ్ సరళి మీద పడిందని, తగ్గిన శాతమే రుజువు చేస్తున్నది. ఈ అర్హతలు, కొలతల వల్లనే ఎన్నికలలో అధికార పార్టీ ప్రచారంలో వాణీ బాణీలు కూడా అకస్మాత్తుగా మారిపోయాయి. ‘గదిలో పన్నిన తెర వెనుక (బ్యాక్ రూం) వ్యూహంతో పకడ్బందీ రూపకల్పనతో, బడుగు బలహీన వర్గాలకు గుప్పించిన హామీల పరంపరతో హైదరాబాద్ మహానగర్ మున్సిపల్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఘన విజయం సాధించింది. నగరంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన హామీల పరంపరను నమ్మినందునే ఈ విజయం సాధ్యమైంది.’ - ది హిందూ (6-2-2016)నివేదిక ‘జంటనగరాలలోని అన్ని ప్రాంతాల ప్రజలు టీఆర్ఎస్కి చరిత్రాత్మకమైన ఆజ్ఞాపన పత్రం అందచేశారు. దీంతో నగరవాసులందరి సంక్షేమానికీ, వారి సంరక్షణకూ మాపై బాధ్యత పెరిగింది.’ - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (6-2-2016) ‘ఇక్కడొక సత్యాన్ని మరచిపోరాదు. టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో తిరుగుతూ తమ అభ్యర్థులు ఈ ఎన్నికలలో గెలుపొందకపోతే అందుకు ప్రతీకారం తీర్చుకుంటాం సుమా అని హెచ్చరికలు జారీ చేశారు.’ - మల్లు భట్టివిక్రమార్క(టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, 5-2-2016) గ్రేటర్ ఎన్నికల పూర్వాపరాల గురించిన ఈ వ్యాఖ్యలలో పత్రికా వాణి ఉంది. అధికార పార్టీ గొంతు వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం స్పందన ఉంది. కానీ జంటనగరాలలో 8-9 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి కనుమరుగయినాయి. లేదా గల్లంతైనాయి. వీరి గొంతు మాత్రం వినిపించలేదు. ఇంకా, పోలింగ్ శాతం తగ్గడానికి వెనుక కారణాలను తెలుసుకోవలసి ఉంది. అలాగే సాధారణ ఎన్నికల పోలింగ్‌లో, అభ్యర్థుల జాబితాలో ప్రవేశపెట్టిన ‘నోటా’ (ఎవరూ నచ్చలేదన్న ముద్రకు కొట్టే ఓటరు హక్కు, దానికి మీట)ను తప్పించడానికి గల కారణాలను కూడా అన్వేషించవలసి ఉంది. తెలుగు జాతిని చీల్చడానికి వేరువేరు కారణాల మీద, రాజకీయ ప్రయోజనాలపైన ఉద్యమించిన చంద్రబాబు, కేసీఆర్‌లు రెండు తెలుగు రాష్ట్రాల జల, విద్యుత్, విద్య, ఉపాధి, అధికార గణాల పంపిణీ, ఆస్తుల పంపిణీ, ప్రత్యేక ప్రతిపత్తుల సమస్యలు, ఉద్యోగుల పంపిణీ వంటి సమస్యలు ఒక కొలిక్కి రాకుండానే మొత్తం తెలుగు ప్రజలను రొంపిలోకి దింపారు. ప్రజా సంబంధాలను తీర్చి దిద్దడానికి ఉభయ రాష్ట్రాల నాయకులు ఆధారపడుతున్న యంత్రాంగం, మంత్రాంగం ఎక్కడుంది? ఆచరణకు దూరమైన నేతలు లెక్కకు మిక్కిలిగా దొర్లిస్తున్న హామీల పరంపర దగ్గర ఉంది. పోలింగ్ శాతం తగ్గడం మన ప్రజాస్వామ్యం బలుపా, వాపా అన్న ప్రశ్న క్రమంగా జనంలోకి శరవేగంగా దూసుకు వస్తున్న సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. గుర్తించాల్సిన అంశాలు మన కుహనా ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు ఓట్ల కోసం ఎరగా వేస్తున్న హామీలకు పెద్దగా విలువ లేదని ప్రజాబాహుళ్యం పూర్తిగా అవగాహన చేసుకుని చైతన్యం పొందితే తమ అధికార స్థానాలకు చేటు తప్పదని భావించి వారి దృష్టిని మళ్లించే వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే రాజ్యాంగ విరుద్ధంగా కూడా వెళుతున్నారు. పాలనకు సంబంధించిన బాధ్యతల అధ్యాయంలోని కీలకమైన లక్ష్యానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. మూఢ విశ్వాసాలను తుంచి వేసి ప్రజానీకంలో శాస్త్రీయ, హేతుబద్ధ దృక్పథాన్ని పెంచాలన్న రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధంగా తార్కిక పునాదులు లేని యజ్ఞ యాగాదులను కేంద్రంలోను, రాష్ట్రాలలోను పాలకులే ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికలకు కొలది రోజుల ముందు కేసీఆర్ ఓటర్ల మీద సంధించిన బ్రహ్మాస్త్రం అదే. అందుకే ఓ తెలుగు కవి, ఏనాడో, ‘ఓ మూఢ లోకమా! దినమెల్ల ముగియలేదు/ దీపమున్నది నీ హృదయంబు దిద్దుకొనుము’ అని మోసపోతున్న పేద, బడుగు వర్గాల, మధ్య తరగతి ప్రజలను హెచ్చరించి, మేల్కొల్పడానికి సిద్ధమయ్యాడు. అధికారానికి వచ్చే ముందు టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను పరిశీలిస్తే ఈ సత్యం బోధపడుతుంది. ఇక సత్తా ఉడిగిపోయిన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు మిగిలి ఉన్న ఆ కాస్త ఊపిరిని కూడా తోడేస్తే తప్ప తమ పార్టీ ఉనికికి శాశ్వత రక్షణ ఉండదని భావించిన కేసీఆర్ సూదంటు రాయి ప్రయోగంతో టీఆర్ఎస్ వైపునకు గుంజుకున్నారు. ఆయా పార్టీ శాసనసభ్యులను కూడా పదవులు, ప్రలోభాలతో ఆకర్షించారు. ఇదంతా ఒక సాంకేతిక విద్యగానే భావించారు. ఇది క్రమంగా నోటుకు ఓటు మహా ప్రయోగంగా టీడీపీ-టీఆర్ఎస్ల మధ్య గుట్టుగా సాగిన ప్రయోగంగా ప్రజలు చెప్పుకునే స్థాయిలో సాగింది. చివరికి దీనిని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రాజీ బేరాలతో ముగిసిన చిదంబర రహస్యంగా ప్రజలు సరిపెట్టుకున్నారు. ఇంతకూ ఆ కేసులో దొర ఎవరు, దొంగ ఎవరు అన్న అంశం ఇప్పటికీ తేలలేదు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థలోని పాలకులకూ, సమాజాలకూ మాత్రం నిత్యం కట్టుకథలు వినిపించే అవసరం ఉంటుంది’ అంటాడు ప్రసిద్ధ ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ విశ్లేషకుడు నికోలె ఆస్కాఫ్. అలాంటి కథలలో హామీలు ఒక భాగం. మొదట్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు కొన్ని ప్రజల జ్ఞాపకాల నుంచి నిష్ర్కమించినా, ఇప్పుడు ఆయన ఇచ్చినవి- బడుగు వర్గాల ప్రజలందరికీ రెండు లేక మూడు బెడరూమ్ల ఇళ్లు కట్టించడం (చాపలే గతిగా ఒక్క కుక్కి మంచానికి కూడా చోటు లేని స్థితిలో ఒక్క బెడ్రూమ్కు కూడా చోటు లేని చోట); జలాశయాలకు (వాటర్ బాడీస్) రక్షణ; ప్రైవేట్ విద్యా సంస్థల స్థానే ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తానని చెప్పడం; ఇరవైనాలుగు గంటలు విద్యుత్, నీటి సరఫరాలకు హామీ. కాళ్లు గడప దాటకున్నా, మాటలు కోటలు దాటినట్టు గ్రేటర్ రాజధానిలో మౌలిక వసతులన్నీ కల్పిస్తానని చెప్పడం, వరసపెట్టి ఆకాశ హర్మ్యాలు , ఆకాశ మార్గాలు నిర్మిస్తానని చెప్పడం. ప్రతిపక్షాలన్నీ చిత్తు అయితే వ్యూహ రచనకు సంబంధించి అన్ని ప్రతిపక్షాలను పల్టీ కొట్టించడంలో, డీలా పడిపోయేటట్టు చేయడంలో కేసీఆర్ చతురత, ఘనత గురించి అంతా ఒప్పుకోవాలి. నిర్దిష్టమైన ఎజెండా ఏదీ లేకుండా, ప్రతి వ్యూహం లేకుండా, నైపుణ్యం లేకుండా ఉన్న విపక్షాలను మూలను కూర్చోబెట్టడంలో కేసీఆర్ ఘనత చెప్పుకోదగినది. ఇవన్నీ ఎలా ఉన్నా జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటింగ్ శాతం కుదించుకుపోవడం మన కుహనా ప్రజాస్వామ్య పరిమితులను కూడా స్పష్టంగా వెల్లడైనాయి. నగరంలోని మేధావులు, మధ్య తరగతి, పేద వర్గాలు క్రమేణా ఓటింగ్ నుంచి గైర్హాజరు కావడానికి కారణాలు కూడా ప్రశ్నించుకోవలసిన స్థాయిలోనే ఉన్నాయి. ఎలాగంటే- తెలుగు రాష్ర్ట కృత్రిమ విభజనకు దారి తీసిన కారణాలు, పలు రకాల ఉద్రేకాలు కూడా నగర ఓటింగ్ సరళిపైన ప్రభావం చూపినట్టు వెల్లడైంది. విభజనకు ముందు ఆ తరువాత సెటిలర్స్ పేరిట వెలువడిన అనూహ్యమైన ప్రకటనలు, నివాసానికి సంబంధించిన అర్హతలకు కొందరు నాయకులు పెట్టిన కొలతల ప్రభావమూ ఈ ఎన్నికల ఓటింగ్ సరళి మీద పడిందని, తగ్గిన శాతమే రుజువు చేస్తున్నది. ఈ అర్హతలు, కొలతల వల్లనే ఎన్నికలలో అధికార పార్టీ ప్రచారంలో వాణీ బాణీలు కూడా అకస్మాత్తుగా మారిపోయాయి. ‘మనమందరమూ సెటిలర్లమే’ అన్న కొత్త ఒరవడి చిగుళ్లు తొడిగింది. మంచి పరిణామం ఇది మంచి పరిణామమనే చెప్పాలి. బహుశా దాని ఫలితమే అయి ఉంటుంది, అంతవరకు సెటిలర్స్గా కొందరు భావిస్తున్న సొంత తెలుగు వారి నుంచే మచ్చుకు ముగ్గురు నలుగురిని అవసరం కొద్దీ టీఆర్ఎస్ అభ్యర్థులుగా తీసుకువచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకునే కొత్త సంస్కృతికి టీఆర్ఎస్ తలుపులు తెరిచింది. విభజన గందరగోళం మధ్య అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణలో నివాసార్హత, విద్య ఉద్యోగాలలో చేరేవారి అర్హతకు పెట్టిన షరతులలో భాగంగా ఆగమేఘాల మీద జరిపిన రెండు రకాల (ఒకటి ఇంటింటి సమగ్ర సర్వే) సర్వేలను హైకోర్టు ఎందుకు నిలిపివేయవలసి వచ్చిందో, ఏ నినాదాల ఉధృతిలో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవలసి వచ్చిందో అందరికి తెలిసినదే. ఈ పూర్వ రంగం ఎలా ఉన్నా మన తెలుగు వాళ్లమంతా ఎక్కడ ఉన్నా రాహుల్ సాంకృత్యాన్ చెప్పినట్టు (ఓల్గా సె గంగా) ‘మానవ వలసలన్నీ చారిత్రక విభాత సంధ్యలలో తెరలు తెరలుగా జరిగిన మానవ వికాస కథలలో అంతర్భాగమే’నని గుర్తిస్తే చాలు. abkprasad2006@yahoo.co.in - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
టీడీపీకి ‘గ్రేటర్’ పంచ్‌లు!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇవన్నీ వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. 150 స్థానాలకు గాను ఒకే ఒక్క డివిజన్‌ను గెలవడంపై నెటిజన్లు ‘పంచ్’లు విసురుతున్నారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
కార్పొరేటర్లతో మంత్రి మహేందర్‌రెడ్డి: మంత్రిని కలిసిన శివారు కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించిన మహేందర్‌రెడ్డిఅభివృద్ధిపై దిశానిర్దేశం రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కనీవినీ ఎరుగని రీతిలో మెజార్టీ కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పి.మహేందర్ రెడ్డి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు సూచించారు. శనివారం పలువురు కార్పొరేటర్లు మంత్రిని కలిసి తమ గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కార్పొరేటర్ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తమ పరిధిలో రోడ్ల నిర్మాణం, తాగునీటి ఎద్దడి నివారణ, మురుగు కాల్వల నిర్మాణంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు కనీస సౌకర్యాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయసాధన కోసం అందరూ కంకణబద్ధులు కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చంపాపేట, శేరిలింగంపల్లి, చందానగర్, మైలార్ దేవ్‌పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్ కార్పొరేటర్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర సందడే సందడి
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో క్యాంప్ కార్యాలయంలో శనివారం కళకళలాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ... కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఈ నెల 11న మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించారు. మేయర్, డిప్యూటీ మేయర్ రేసులో ఉన్న పలువురు కార్పొరేటర్లో ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందరి అభిప్రాయలు తెలుసుకున్న తరువాతే ఈ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 9న కార్పొరేటర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి భేటీ కానున్నారు. గ్రేటర్లో పార్టీ బలోపేతంపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రజల నుంచి డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ పథకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే కేసీఆర్ కార్పొరేటర్లకు స్పష్టం చేశారు. -
అభివృద్ధితోనే ‘గ్రేటర్’ విజయం : నరేందర్‌రెడ్డి
నల్లగొండ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి ని చూసి గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను ఆదరించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పాతబస్తీ కూడా గులాబీ మయమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక విజన్‌తో ముందుకు వెళ్లడం వలనే గ్రేటర్ ప్రజలు బ్రహ్మరథం పట్టార న్నారు. ఈ ఎన్నికల విజయంతో పార్టీపైన గురుతరమైన బాధ్యత పెరిగిందని చెప్పారు. అంతకు ముందు టీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణ సంచా కాల్చి, స్వీట్లు పంచారు. స్థానిక క్లాక్‌టవర్ సెంట ర్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బక్క పిచ్చ య్య, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీని వాస్, సుంకరి మల్లేశ్‌గౌడ్, రేకల భద్రాద్రి, బొర్ర సుధాకర్, మాలే శరణ్యారెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున, మహేందర్, రామేశ్వరిు పాల్గొన్నారు. -
‘నోటా’పై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో నోటాకు స్థానం కల్పించని వ్యవహారంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు పిటిషనర్‌కు తేల్చిచెప్పింది. అంతేకాక తదుపరి వచ్చే ప్రతీ ఎన్నికలో నోటాకు తప్పనిసరిగా స్థానం కల్పించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించేందుకు సైతం హైకోర్టు అంగీకరించలేదు. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలు ముగిసినందున ఈ వ్యాజ్యంలో విచారించడానికి ఏమీ లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికలు ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించి నోటా ఉత్తర్వులు పొందవచ్చునని, ఎన్నికలు లేని సమయంలో తాము ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటాకు స్థానం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎన్నికల సంఘం, గ్రేటర్ ఎన్నికల్లో పట్టించుకోలేదని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో నోటాకు స్థానం కల్పించేటట్లు ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన లుబ్నాసార్వత్ హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. -
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పాతబస్తీ పురానాపూల్ 52వ డివిజన్లో రీ పోలింగ్ వల్ల కౌంటింగ్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్- ఎంఐఎం పార్టీల మధ్య ఘర్షణల కారణంగా పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 నుంచి ప్రారంభం కానుంది. మరికాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు రీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పురానాపూల్‌లోని 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది. -
ఉత్తమ్, షబ్బీర్‌పై దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు కశ్యప్, అబేద్, మసియుద్దీన్లను బుధవారం డీసీపీ కార్యాలయానికి తరలించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు... మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నాకు దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై దాడి చేయడంతో పాటు ఉత్తమ్ కారు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే -
ఉత్తమ్ పై దాడికి యత్నించిన ఇద్దరు లొంగుబాటు
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తో పాటు షబ్బీర్ అలీపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. పాతబస్తీలో పోలింగ్ సందర్భంగా భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లుగా మాట్లాడటం వల్ల కోపోద్రిక్తులైన మహమ్మద్ ఆబిద్, మహమ్మద్ కశాప్ అనే ఇద్దరు వ్యక్తులు టీపీసీసీ అధ్యక్షుడిపై దాడికి యత్నించారు. ఎంఐఎం రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించడంతోనే ఇలా చేసామని నిందితులు సౌత్ జోన్ డీసీపీ ఎదుట లొంగిపోయారు. -
ముగిసిన సమరం
♦ ప్రశాంతంగా ‘గ్రేటర్’ ఎన్నికలు ♦ జిల్లా పరిధిలోని 63 ♦ జీహెచ్ఎంసీ వార్డులకు ఓటింగ్ పూర్తి ♦ ఈనెల 5న ఓట్ల లెక్కింపు ♦ ఫలితాలపై పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీహెచ్ఎంసీ (హైదరాబాద్ మహానగర పాలక సంస్థ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీలోని 63 డివిజన్లున్నాయి. ఈ డివిజన్లలో పోలింగ్ పక్రియ పకడ్బందీగా సాగేందుకు 16వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలవరకు సాగింది. సమయం ముగిసేలోపు పోలింగ్ స్టేషన్లో ఉన్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ డివిజన్లలో మొత్తంగా 45శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. కీలక సీట్లలో గెలుపు కోసం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 150 డివిజన్లుండగా.. ఇందులో 63 డివిజన్లు జిల్లాలోనే ఉన్నాయి. 42 శాతం జిల్లా ఓటర్లే కావడంతో మేయర్ పీఠాన్ని జిల్లా ప్రజలు ప్రభావితం చేస్తున్నారు. నగరంలో మజ్లిస్ సిట్టింగ్ సీట్లు మినహాయిస్తే మేయర్ గెలుపునకు జిల్లా సీట్లే కీలకం. దీంతో అన్నిపార్టీలు జిల్లా డివిజన్లపైనే గంపెడాశలు పెట్టుకుని పోరుకు దిగాయి. ఈ క్రమంలో అన్నిరకాల అస్త్ర, శస్త్రాలను ప్రయోగించిన అభ్యర్థులు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషిచేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 5న ఫలితాలు.. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈనెల 5న ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించనుంది. ఇప్పటివరకు గెలుపుకోసం కృషి చేసిన అభ్యర్థులు.. ఇక ఓటింగ్ సరళిని విశ్లేషించుకుని గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. ఇదిలావుండగా.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంకోసం నగరానికి తరలిన జిల్లా రాజకీయ నేతలు, కార్యకర్తలు సొంత ప్రాంతాలకు తిరుగుముఖం పట్టారు. శివారు ప్రాంతాల్లో స్థానిక నేతలకే ప్రచార బాధ్యతల్ని అప్పగించడంతో జిల్లాకు చెందిన నేతలంతా పక్షం రోజులపాటు నగరంలో తిష్టవేశారు. తాజాగా ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో తిరుగుపయనమయ్యారు. -
మేయర్ స్థానం కాంగ్రెస్‌దే: సుధీర్‌రెడ్డి
వనస్థలిపురం (హైదరాబాద్): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వనస్థలిపురంలోని సిద్ధార్థ పాఠశాలలో తన కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధికార మదంతో లింగోజిగూడ, మన్సూరాబాద్‌లలో కాంగ్రెస్ వారిపై దాడులకు దిగిందని ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడి గెలవాలని చూస్తోందని, అయినా మేయర్ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
విశ్వనగరమే నినాదంగా
♦ గ్రేటర్ ఎన్నికల్లో ఆది నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ ♦ తొలిసారి 150 డివిజన్లలో పోటీ ♦ అభివృద్ధి కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం ♦ గతంలో పాలించిన పార్టీలు చేసిందేమీ లేదంటూ విమర్శనాస్త్రాలు ♦ బల్దియాపై తమ జెండా ఎగురుతుందని ధీమా సాక్షి, హైదరాబాద్: విశ్వనగరమే నినాదంగా తొలిసారి గ్రేటర్ ఎన్నికల బరిలో దిగిన అధికార టీఆర్ఎస్.. మేయర్ పీఠంపై జెండా ఎగ రేసేందుకు ఆది నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆరేళ్ల కిందట జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క డివిజన్‌లోనూ పోటీ చేయని గులాబీ పార్టీ ఈసారి మొత్తం 150 డివిజన్లలో తలపడుతోంది. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకుని ‘జీరో టు హండ్రెడ్’ నినాదంతో పార్టీ శ్రేణులను మోహరించింది. గులాబీ నేతలు, కార్యకర్తలంతా మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఓటరు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విసృ్తతంగా ప్రచారం.. రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణలో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. రాజధాని నగరంలోనూ తమ పాలనే ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఒకటికి రెండుసార్లు మందలించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు ఏ కార్యక్రమాలు చేపట్టనున్నారో ప్రచారం చేశారు. జంట నగరాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలకు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి హోంవర్క్‌గా ప్లాన్ చేసింది. అభ్యర్థుల ఖరారు తర్వాత రాష్ట్ర మంత్రివర్గం మొత్తాన్ని రంగంలోకి దించి, ఏ ఒక్క బూత్‌ను వదలకుండా ప్రచారం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లు, నగరానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న కార్యక్రమాలతోపాటు, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న అంశంపై ఎక్కువగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. విపక్షాలపై వినూత్న దాడి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. విమర్శనాస్త్రాలతో ప్రతిపక్ష పార్టీలను గుక్కతిప్పుకోనీయకుండా చేసింది. ఆరు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో పాలన చేసింది కాంగ్రెస్, టీడీపీలే అని, వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎండగట్టింది. టీడీపీతో కలసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ పడుతున్న బీజేపీపై మరో రకంగా విరుచుకుపడింది. కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపిం చింది. నగరంలో నివసిస్తున్న వారంతా ఇక్కడి వారేనన్న ధీమా కల్పించేలా ప్రచారం చే సింది. ఎన్నికల ప్రచార బాధ్యతను మంత్రి కేటీఆర్ తన భుజాలపై వేసుకున్నారు. 9 రోజుల పాటు 120 డివిజన్లలో ప్రచారం చేసిన ఆయన.. 135 చోట్ల ప్రసంగించారు. కుల సంఘాలు, న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ నిపుణులతో సమావేశమయ్యారు. తమతోనే నగరాభివృద్ధి సాధ్యమంటూ ముమ్మరంగా ప్రచారం చేసిన అధికార పార్టీ.. బల్దియాపై తమ జెండా ఎగరడం ఖాయమన్న నమ్మకంతో ఉంది. -
'గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రూ.2.58 కోట్లు స్వాధీనం'
హైదరాబాద్: నగరంలో రేపు(మంగళవారం) జీహెచ్ఎంసీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అంధులు ఓటు వేసేందుకు వీలుగా బ్రెయిలి లిపి బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 2.58 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.1.5 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. -
నేడు ఈవీఎంల పంపిణీ
గచ్చిబౌలి: గ్రేటర్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, సోమవారం ఈవీఎంలు పంపిణీ చేయనున్నట్లు ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సర్కిల్-11, 12 డివిజన్ల ఎన్నికల ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎంలు, ఇతర మెటీరియల్ పంపిణీ చేస్తామన్నారు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆయా రూట్ల వారీగా పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6.30 లక్షల మంది ఓటర్ స్లిప్పులు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేందుకు ఇది సంకేతమన్నారు. ఇప్పటికే 80 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని, నేడు, రేపు వార్డు కార్యాలయాల్లో స్లిప్పులు అందిస్తారని తెలిపారు. ఓటర్ స్లిప్పులు తప్పనిసరేం కాద ని చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. శేరిలింగంపల్లి ఆర్ఓ మనోహర్ మెటీరియల్ పంపిణీ గురించి కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి, సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ మమత తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ ప్రచారానికి తెర
ఆఖరి రోజు నేతల సుడిగాలి పర్యటనలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన పార్టీల ముఖ్య నేతలు ర్యాలీలు, ప్రదర్శనలు, సభలతో హోరెత్తిపోయిన నగరం 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల పోటీ.. రేపే ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 15 రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆఖరి రోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. నగరమంతటా ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు హోరెత్తించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకొని గత నెలరోజులుగా విస్తృతంగా పర్యటనలు, సభల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆదివారం కూకట్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాంనగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర చోట్ల జరిగిన సభల్లో పాల్గొన్నారు. నగరాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, కేంద్రం భాగస్వామ్యం లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. మౌలాలీలో చేపట్టిన ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే హైదరాబాద్ నగర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మల్కాజిగిరిలో టీడీపీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 1,200 మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, ఈ రాష్ట్రం కేసీఆర్ జాగీరు కాదని అన్నారు. కూకట్పల్లి, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభల్లో టీడీపీ నాయకుడు నారా లోకేశ్ పాల్గొన్నారు. అడుగడుగునా ర్యాలీలు, ప్రదర్శనలు దారుస్సలాంలోని పార్టీ కార్యాలయం నుంచి పాతబస్తీలోని వివిధ డివిజన్ల మీదుగా చార్మినార్ వరకు ఎంఐఎం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. టీఆర్ఎస్ బేగంబజార్, గోషామహల్ తదితర చోట్ల ర్యాలీలు నిర్వహించింది. గన్‌ఫౌండ్రీలో బీజేపీ చేపట్టిన ప్రచారంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గం, యాప్రాల్‌లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. టీఆర్ఎస్ మాటల గారడీలకు మోసపోవద్దని ఓటర్లకు చెప్పారు. బేగంపేట్‌లో కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి, మర్రి శశిధర్‌రెడ్డిలు పర్యటించారు. గచ్చిబౌలిలో చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ పాల్గొన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మంత్రి తలసాని ప్రచారం నిర్వహించారు. గౌలిపురాలో సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ నేత నారాయణ పాల్గొన్నారు. ఫిబ్రవరి ఐదో తేదీనే తాను సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానమిస్తానన్నారు. అడ్డగుట్టలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చర్లపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. కొత్తపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. మొత్తమ్మీద గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో పోటీకి దిగిన 1,333 మంది అభ్యర్థుల భవిత్యాన్ని తేల్చే ఎన్నికల గడువు సమీపించడంతో ప్రచారానికి ఆఖరి రోజైన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు అన్ని పార్టీలూ పోటీ పడ్డాయి. మంగళవారం జరిగే పోలింగ్‌లో ఓటరు మహాశయులు ఏ మీట నొక్కుతారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. -
విశ్వనగరంగా చేసి చూపిస్తా..
► ‘సాక్షి’తో గ్రేటర్ ఎన్నికల టీఆర్ఎస్ ప్రచార రథసారథి కేటీఆర్ ► ఐదేళ్లలో అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్ ► దత్తత అంటే రంగులు, రోడ్లు వేయడమే కాదు.. అన్నివిధాలా అభివృద్ధి ► ముఖ్యమంత్రి నాకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తా ► అధికారులు, కార్పొరేటర్, స్థానిక సంక్షేమ సంఘాలతో వాట్సప్ గ్రూపులు ► ఎక్కడ ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగం ► ప్రజలకు కావాల్సిన అవసరాలను ఆన్లైన్ చేసి అవినీతిని అరికడతామని వెల్లడి ► జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఊరిని దత్తత తీసుకోవడం అంటే జేబులో నుంచి డబ్బులు తీసి రంగులు పూసి, రోడ్లు వేసి వెళ్లిపోవడం కాదని ఓ సినిమాలో డైలాగ్... అది నిజమే, అభివృద్ధి అంటే రంగులు, రోడ్లు మాత్రమే కాదు. అన్ని విధాలుగా బాగు చేస్తేనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ బాధ్యత తీసుకున్నప్పుడు దీనిని అన్ని విధాలుగా బాగు చేసినప్పుడే విశ్వనగరం అవుతుంది. ఓ డాలస్ కావాలన్నా, ఒక షాంఘైలా ఉండాలన్నా, న్యూయార్క్‌లా కనిపించాలన్నా దానికి తగ్గట్టు ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికను అమలు చేయడానికి కనీసం నాలుగైదేళ్లు పడుతుంది. మొదలుపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోను. అన్నిటికీ మించి ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడి సమస్యలపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఘంటాపథంగా చెపుతున్నా.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తా’ అని జీహెచ్ఎంసీ ఎన్నికల టీఆర్ఎస్ ప్రచార సారథి, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఆదివారం చివరిరోజు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన మధ్యలో కొద్దిసేపు సాక్షి ప్రత్యేక ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా జంట నగరాల అభివృద్ధికి తాను చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ‘‘పూర్తిగా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అమల్లోకి వస్తేనే విశ్వనగరం కల సాకారమవుతుంది.. అప్పుడు ఎవరు కాదన్నా ఇది విశ్వనగరం అవుతుంది. మాటలు చెప్పడంతోనే కాదు ఆచరణలో పెట్టడానికి అవసరమైన అంకితభావంతో పనిచేస్తా..’’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహా నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కమ్యూనికేషన్ సదుపాయాలను వినియోగించుకుంటామన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... విశ్వనగరంగా హైదరాబాద్ బాధ్యతలను ముఖ్యమంత్రి మీపై పెట్టారు. ఈ యజ్ఞంలో సఫలమవుతారా? కేటీఆర్: నాకైతే పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడి సమస్యలపై అవగాహన ఉంది. అదే విధంగా విశ్వనగరంగా గుర్తింపు ఎలా తీసుకురావాలన్నదానిపైనా అవగాహన ఉంది. అమెరికాలో కొంతకాలం ఉద్యోగం చేశాను. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరాలు చూశా. వాటికి అంత పేరు రావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై అవగాహన ఉంది. అందువల్ల నాకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తానన్న నమ్మకం ఉంది. మున్సిపల్ బాధ్యతలు చేపట్టాక మీ మొదటి ప్రాధాన్యత? కేటీఆర్: ముఖ్యమంత్రి నా మీద గురుతరమైన బాధ్యత పెట్టారు. వారి నమ్మకాన్ని నిలబెడతా. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడం నా మొదటి కర్తవ్యం. దీనికి అవసరమైన వారందరి సహకారం తీసుకుంటా. ముఖ్యంగా రాజధానిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఏదవసరమో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తా. ప్రజలకు ఏం చేయబోతున్నారు? కేటీఆర్: గత ఆర్నెల్లలో హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించాను. సమస్యలపై అవగాహన ఉంది. రెప్పపాటు కరెంట్ పోకుండా సఫలమయ్యాం. తెలంగాణ వస్తే చీకట్లే అన్న వారికి ఇదో గుణపాఠం. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను హైదరాబాద్‌తో అనుసంధానించబోతున్నాం. ఎక్కడ సమస్య వచ్చినా కరెంట్ సరఫరాకు ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం. మంచినీటికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు రూ.6,700 కోట్లతో నగరానికి ఇరువైపులా శామీర్‌పేట్, రాచకొండలో రెండు రిజర్వాయర్లు నిర్మించబోతున్నాం. మిగులు విద్యుత్ లాగా మిగులు మంచినీరు కోసం మా ప్రయత్నం. పౌరులకు ఎలాంటి కొత్త సదుపాయాలు అందిస్తారు? కేటీఆర్: పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆన్లైన్ వ్యవస్థ ప్రవేశపెడతాం. ఎవరైనా ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలన్నా.. నివాస యోగ్యత అనుమతి అవసరమైనా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఏ ఇతర అవసరం వచ్చినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని తీసుకువస్తాం. దరఖాస్తులు పరిష్కారమయ్యేదాకా ఎప్పటికప్పుడు పురోగతి తెలుసుకోవచ్చు. ఏయే పని ఎప్పటిలోగా పరిష్కారించాలన్న గడువు నిర్దేశిస్తాం. నిర్దేశిత గడువులో పని చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా చట్టాలు సవరిస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు సొంతంగా మెజారిటీ సాధిస్తారా? కేటీఆర్: కచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది. గత 18 నెలల్లో మా ప్రభుత్వం హామీలిచ్చినవే కాదు.. ఇవ్వనివాటిని కూడా అమలు చేసింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ. దీనిని ఎంత అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రజలకు ఫలాలు అంతగా ఉంటాయి. మేం మేయర్ పీఠం గెలవడమే కాదు మా గెలుపునకు దోహదపడిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఆయా డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాలనీలు, అపార్టుమెంట్ల అసోసియేషన్లు అందరినీ సమన్వయం చేసుకునేందుకు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా ఎలాంటి సమాచారం వస్తుందో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం బాధ్యులైన అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. నేనూ స్వయంగా ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తా. స్థానిక సంస్థల్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తారనే ఆరోపణలున్నాయి. వాటిపై ఏ చర్యలు తీసుకుంటారు? కేటీఆర్: నిజమే. ఇకపై ఇలాంటి ఆరోపణలకు తావు లేకుండా చర్యలు తీసుకోబోతున్నాం. అవినీతిని అరికట్టడంతో పాటు ప్రజల నుంచి పన్నుల రూపేణా వచ్చిన ప్రతీ పైసా వారి అభివృద్ధికి ఉపయోగపడాలి. దానికోసం జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవడం ద్వారా అన్నీ పారదర్శకంగా ఉండేలా చూస్తాం. తరచుగా హైదరాబాద్ విశ్వనగరం అంటున్నారు.. విశ్వనగరం అంటే స్పష్టత ఇస్తారా? కేటీఆర్: ప్రపంచంలో వందల కొద్దీ నగరాలు ఉన్నాయి. కానీ విశ్వనగరాలంటే మనకు న్యూయార్క్, డాలస్, షాంఘై, లండన్, శాన్ఫ్రాన్సిస్కో ఇలా ఓ పది, పదిహేను గుర్తుకు వస్తాయి. హైదరాబాద్‌ను ఆ స్థాయికి తీసుకుపోవడానికి అవసరమైన అన్ని హంగులు ఉన్నాయి. గత ప్రభుత్వాలు, ఇప్పటిదాకా జీహెచ్ఎంసీని పాలించిన వారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేం ఓ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు పోతున్నాం. దానికి తగ్గట్లు మా పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. విశ్వనగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకురావడానికి అవసరమైన అధునాతన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. రహదారులు, రవాణా, మురుగునీటి పారుదల వ్యవస్థ, స్వచ్ఛమైన మంచినీరు అన్నిటికీ మించి పరిశుభ్రత ఉట్టిపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతాం. ప్రపంచశ్రేణి వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా చూడడం, నిర్మాణ రంగంలో ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంస్కరణలు అమలు చేయడం వంటివన్నీ విశ్వనగరం కావడానికి దోహదపడతాయి. నేను ఐటీ మంత్రి అయ్యాక అమెరికా వెళ్లి ప్రముఖ ఐటీ కంపెనీలను కలిశాను. గూగుల్ త్వరలోనే పెద్ద క్యాంపస్‌ను ఇక్కడ నెలకొల్పబోతోంది. ఫేస్బుక్ కూడా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకోబోతోంది. ఇంకా అనేక కంపెనీలు వస్తాయి. -
We Want డెవలప్ మెంట్
♦ అభివృద్ధికే ఓటు అంటున్న సిటీజనులు ♦ ఆశలు..ఆకాంక్షలు నెరవేర్చే వారికే మద్దతని స్పష్టీకరణ ♦ చల్లారిన భావోద్వేగాలు..వ్యక్తం కాని భయాందోళనలు ♦ 2014తో పోలిస్తే.. మారిన ఓటరు ప్రాధాన్యతలు ♦ రాజకీయ చిత్రపటంపై..సరికొత్త ఆవిష్కరణలకు ఛాన్స్ ‘కొత్త రాష్ట్రం, సరికొత్త ఆశలు, అనేకానేక ఆకాంక్షలు..అన్నీ నెరవేరుస్తాం లేదంటే..వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం..’ అంటూ అధికార టీఆర్ఎస్ సర్కార్ స్పష్టమైన హామీలు ఒకవైపు., ఏడాదిన్నర గా ఏమీ చేయలేదు. మాటలు కోటలు దాటాయ్..చేతలు గడప దాటలేదంటూ విపక్షాల విసుర్లు మరో వైపు. ఏదైతే నేం మహానగర పాలకమండలికి రేపు జరిగే పోలింగ్‌లో ఓటరు ఎవరి పక్షం వహించబోతున్నాడు? మమ్మల్ని నమ్మండి..చెప్పింది చేసి చూపిస్తా మంటున్న టీఆర్ఎస్ను బలపరుస్తారా? చెప్పింది సక్రమంగా చేయటం లేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఓటరు నాడిని పట్టి చూసే ప్రయత్నం చేసింది. ఇందులో శివార్లు మొదలుకుని మిగిలిన ప్రాంతాల్లో మెజారిటీ నగర ప్రజలు ‘అభివృదే’్ధ తమకు ముఖ్యమని, దాన్ని కొనసాగించటమే తమ తొలి ప్రాధాన్యం అంటూ మనోగతాన్ని బయటపెట్టారు. ఇక పాతబస్తీ ఓటరు సైద్ధాంతికంగా తమ మనసుకు దగ్గరైన పార్టీలు, అభ్యర్థులకు ఓటేస్తామంటున్నారు. - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మహానగర రాజకీయ ముఖచిత్రమూ మారింది. పార్టీల ప్రాధాన్యతలతోపాటు ప్రజల దృక్పథంలోనూ మార్పు కనిపిస్తోంది. వాస్తవంగా 2014లో రాష్ట్ర విభజనఅనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో నగరంలో పాతబస్తీ ఎంఐఎంకు అనుకూలంగా స్పందించగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక్క సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పటాన్చెరు(టీఆర్ఎస్) తప్ప మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీస్తూ బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌లలో భారీ మెజారిటీలు సొంతం చేసుకున్నారు. అయితే 2014 ఎన్నికలు రాష్ట్ర విభజన, అనంతరం వెల్లువెత్తిన భావోద్వేగాల వేడిలోనే జరగటంతో నగరంలో స్థిరపడ్డ వివిధ ప్రాంతాల వాసులంతా బీజేపీ, దేశం కూటమిని బలపర్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి స్థానిక సర్టిఫికెట్ల వివాదం, 26 కులాలను బీసీ జాబితా నుండి తొలగించడం, సామాజిక సర్వే, గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరితో వివిధ వర్గాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. కాలక్రమేణా భావోద్వేగాల స్థానంలో అందరికీ సరైన భద్రత, అభివృద్ధి అంశం ముందుకు వచ్చింది. అధికార టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ తీరులోనూ స్పష్టమైన మార్పు కనబడుతోంది. దీంతో ఓటర్లలోనూ మార్పు వస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై హైదర్‌నగర్ డివిజన్లో స్థిరపడ్డ గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌రెడ్డి అనే వ్యాపారిని ప్రశ్నిస్తే..‘నగరంలో 19 నెలల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు..హైదరాబాద్ అభివృద్ధికి కొనసాగింపుగానే ఓటేయాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. కొత్త రాజకీయ సమీకరణలకు ఛాన్స్ గ్రేటర్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో విజయం కోసం అన్ని పార్టీలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్లో మూడు స్థానాల్లోనే విజయం సాధించి, మిగిలిన అన్ని చోట్ల రెండవ స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా లాభపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమ అభ్యర్థుల ఎంపికలో నగరంలో స్ధిరపడ్డ వారికి ప్రాధాన్యతనివ్వటంతో పాటు అనేక మంది ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరిపోవటం వంటి అంశాలు ఈ పార్టీకి కలిసిరానున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర నియోజకవర్గాల్లో మెజారిటీ డివిజన్లలో ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సింగిల్ డిజిట్‌కు పరిమితం కాగా, వచ్చే ఎన్నికల్లో గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం దిగజారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 2009 ఎన్నికల్లో 45 డివిజన్లలో విజయం సాధించిన టీడీపీ ఈ ఎన్నికల్లో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదనే చెపాల్పి. బలహీన ప్రత్యర్థులు ఉన్న ప్రాంతాల్లో, బలమైన అభ్యర్థులు నిలిపిన అతి కొద్ది ప్రాంతాల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఎన్నికలు గ్రేటర్లో సరికొత్త రాజకీయ సమీకరణలకు వేదిక అవుతాయనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఎంతో మార్పు వచ్చింది... 2014 ఎన్నికలకు.. ప్రస్తుతం ఎన్నికలకు ఎంతో మార్పు ఉంది. రాష్ట్ర విభజన కోపంతో సీమాంధ్రులంతా కాంగ్రెస్, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా టీడీపీ,బీజేపీలకు ఓటు వేశారు. కానీ కాలం గడిచిపోయిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. అంతే కాకుండా అధికారంలో ఉన్న పార్టీలు మెజారిటీ స్థానాలు గెలుచుకోవటం ఓ సంప్రదాయంగా వస్తుంది. మారిన రాజకీయ పరిస్థితులకు తోడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్కు ఇది అనుకూలం కావచ్చు. - ప్రొఫెసర్ హరగోపాల్ ఫలితాలు పునరావృతం కావు 2014 - 2016 ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి ఒక విధంగా, ఎమ్మెల్యే అభ్యర్థికి మరో విధంగా ఓట్లు వేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అలాగే ప్రస్తుతం జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2014 ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కావు. ఓటింగ్‌లో తప్పక చేంజ్ ఉంటుంది. అయితే అది ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. - ప్రొఫెసర్ నాగేశ్వర్ అభ్యర్థులే కొత్త.. ఎజెండాలు ‘పాత’వే.. పాతబస్తీలో గ్రేటర్ ఎన్నికల్లోనూ పాత అంశాలే ప్రధాన ఎజెండాలయ్యాయి. బలమైన క్యాడర్, నినాదం ఉన్న ఎంఐఎం తమ సిద్ధాంత బలంతో ఈ ఎన్నికల్లోనూ జనంలోకి దూసుకుపోయింది. కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ మేనిఫేస్టోలు పక్కనబెడితే గ్రేటర్లో 60 స్థానాలకే పోటీ చేస్తున్నప్పటికి పార్టీ అధినేత అసదుద్దీన్, అక్బరుద్దీన్లు ‘షహర్ హమారా..మేయర్ హమారా’ నినాదాంతో జెట్ స్పీడ్‌తో తమకు బలమైన ప్రాంతాలన్నింటిని చుట్టేయగలిగారు. ఇక బీజేపీ సైతం తన బలాన్ని నిరూపించుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేయగా, 2009లో గౌలీపురా, ఘాన్సీబజార్ స్థానాల్లోనే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ మారు చార్మినార్ నియోజకవర్గంలో శాలిబండ, పురానాపూల్, ఘాన్సీబజార్లలో ఎంఐఎంకు గట్టిపోటీ విసురుతోంది. ఎంబీటీ ఈ మారు చంద్రాయణగుట్ట, యాకుత్‌పుర నియోజకవర్గాల్లో ఉనికి కోసం పోరాడుతుండగా, బీజేపీ గోషామహల్, యాకుత్‌పురా, కార్వాన్ నియోజకవర్గాల్లో భారీ ఆశలు పెట్టుకుంది. -
కొబ్బరికాయల దుకాణం పెట్టుకో, లోన్ ఇప్పిస్తా: రేవంత్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నేతల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో ఆదివారం అన్ని పార్టీలు పోటాపోటీగా ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా, మల్కాజ్ గిరిలో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 'విజయవాడలో కొబ్బరికాయల దుకాణం పెట్టుకో, పర్సనల్ లోన్ ఇప్పిస్తా' అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అంతకముందు మల్కాజ్‌గిరిలో తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ నిర్వహిస్తున్న ర్యాలీకి ముందస్తు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అధికార పార్టీ ఆదేశాల మేరకే పోలీసులు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. -
నువ్వో దోపిడీదారుడివి!
గ్రేటర్ ఎన్నికల సభలో చంద్రబాబుపై సీఎం కేసీఆర్ నిప్పులు పెట్టుబడిదారులకు కొమ్ముకాసి.. కార్మికుల కడుపులు కొట్టావు హైదరాబాద్‌లో నీ ముద్రలున్నాయా? అవును.. బషీర్‌బాగ్‌లో రక్తపు ముద్రలు ఉన్నాయి.. అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన ముద్రలున్నాయి హైదరాబాద్‌ను వదల బొమ్మాళీ.. వదల అంటున్నాడు మా వదిన భువనేశ్వరి టీఆర్ఎస్కే ఓటేస్తానన్నది ఏపీలో మీ పని మీరు చేసుకోండి.. ఇక్కడ మా పని మేం చేసుకుంటాం డబుల్ బెడ్రూంపై దత్తాత్రేయవి అబద్ధాలు నారాయణ గారూ.. 5న హైదరాబాద్‌లో ఉండకండి మంత్రి కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘చంద్రబాబు నాయుడూ... నువ్వో దోపిడీదారుడివి. కార్మికుల శ్రమను దోచుకున్నవ్. పెట్టుబడిదారుల కొమ్ముకాసినవ్. హైదరాబాద్‌లో నా ముద్రలు ఉన్నయని గొప్పలు చెబుతున్నవ్. బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి నలుగురిని పొట్టన పెట్టుకున్న రక్తపు ముద్రలు ఉన్నయ్. అసెంబ్లీ ముందు అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ముద్రలు ఉన్నయ్. మూసీ మురికిలో నీ అడుగు ఉంది. కార్మికుల కడుపులు గొట్టినవ్. దేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను సృష్టించిన ముద్రలు నీవే. మేం వారిని పర్మనెంట్ చేసే ముద్రలు వేస్తున్నం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు మళ్లీ మాయో పాయాలు చేస్తున్నాడని, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాడని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించారు. వదల బొమ్మాళీ.. వదల అంటుండు బహిరంగ సభలో సరిగ్గా 30 నిమిషాలపాటు మాట్లాడిన కేసీఆర్ టీడీపీ అధినేతపై విమర్శల దాడి చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం ఏర్పాటైందని, తెలంగాణ ప్రజలు తనను ఇక్కడ పనిచేయాల్సిందిగా తీర్పిచ్చారని, ఏపీ ప్రజలు అక్కడ పనిచేయాల్సిందిగా చంద్రబాబుకు తీర్పు ఇచ్చారని చెప్పారు. ‘‘ఆయన అక్కడ చేసుకోవడానికి కావాల్సినంత పని ఉంది. మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటం. హైదరాబాద్ బజార్లు మేమే ఊడ్చుకుంటం. చంద్రబాబు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా చాలా బజార్లు ఉన్నాయి. కానీ చంద్రబాబు వదల బొమ్మాళీ.. వదల అంటూ హైదరాబాద్‌ను వదల అంటుండు.. అయినా ఎవడు పొమ్మన్నడు? కావాలంటే మరో 25 హెరిటేజ్ దుకాణాలు పెట్టుకో. పర్మిషన్లు ఇప్పిస్తం. 15 రోజులకో సారి వచ్చిపో..’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు ఏమీ చేయలేదని, వంద శాతం పనిచేసే పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు. ‘‘చంద్రబాబూ.. వాస్తవం తెలియక మాట్లాడుతున్నావు. నేను అమరావతిలో ఉంటానంటే కుదురుద్దా? ఒక ఊరి పటేల్ మరో ఊరికి మస్కూరు. విజయవాడకు పోయి హైదరాబాద్‌లో ఉండబుద్ది కావడం లేదంటవు. హైదరాబాద్‌లో ఉండి పనిచేయాలంటే విదేశంలో ఉండి పనిచేస్తున్నట్టు ఉందంటవు. వీసా కావాలంటవు. హైదరాబాద్ మీద ప్రేమ ఉంది.. విజయవాడ నుంచి అరగంటలో వస్తనంటవు. కృష్ణా, గోదావరి నుంచి తాగునీరు తెస్తమంటే మాత్రం పంచాయితీ పెడతవ్..’’ అని విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రచారానికి వచ్చి చంద్రబాబు చక్కిలిగింతలు పెట్టాలని చూస్తున్నాడని, ఆయన చేతిలో నెత్తి ఉందా.. కత్తి ఉందా.. ఏమన్నా చేయడానికి అంటూ ఎద్దేవా చేశారు. దత్తాత్రేయ అబద్ధాలాడుతున్నారు ‘‘బీజేపీ, టీడీపీ నేతలు కలసి ప్రచారంలో అవాకులు చవాకులు పేలుతున్నారు. దత్తాత్రేయ అబద్ధాలు అడుతున్నాడు. కేంద్రం ఇచ్చే నిధులతో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నారని అంటున్నాడు. దేశంలో ఎక్కడన్నా ఈ స్కీమ్ ఉందా? బీజేపీ పాలిత గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఉందా..? ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పాలి. నగరంలో నువ్వు కలసి తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న ఏపీలో ఈ స్కీమ్ ఉందా..?’’ అని సీఎం ప్రశ్నించారు. ఇవన్నీ చేస్తామని 2014 ఎన్నికల ముందే మేనిఫెస్టోలో చెప్పామని గుర్తుచేశారు. నారాయణ గారూ.. 5న హైదరాబాద్‌లో ఉండకండి ‘‘నాకో మంచి దోస్తు ఉన్నడు. సీపీఐ నారాయణ. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఒంటరిగా మేయర్ పీఠం గెలుచుకుంటే చెవులు కోసుంటా అన్నారు. నారాయణ గారూ.. మీరు ఐదో తేదీన హైదరాబాద్‌లో ఉండకండి. ఎవరన్నా చెవులు కోస్తే మళ్లీ మేమే ఈఎన్టీలో ఆపరేషన్ చేయించాలి. ఇదివరకే ఓసారి గాంధీ జయంతిన చికెన్ తిని, తప్పు ఒప్పుకుని ఏడాది పాటు చికెన్‌కు దూరం అయ్యిండు. చెవులు కోసుకోవడం ఏమిటి.. బేల మాటలు కాకుంటే..’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే ముఠా వరంగల్‌కు వచ్చి తొడలు కోసుకుంటా, మెడలు కోసుకుంటా అని సవాలు విసిరారని, కానీ వరంగల్ ప్రజలు దంచుడు దంచితే అడ్రస్ లేకుండా అయ్యారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఎవరిది కోయాలో.. ఏం కోయాలో ప్రజలు ఫిబ్రవరి 2వ తేదీన డిసైడ్ చేస్తరు..’’ అని వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు, బీజేపీ కలిసి ఏం చేశాయి? రాష్ట్రం ఏర్పడగానే, ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు గుంజుకున్నరు. అందుకోసం ఓటేయాలా? గుంజుకుంది చంద్రబాబు నాయుడైతే, గుంజిచ్చింది వెంకయ్యనాయుడు...’ అంటూ సీఎం చురకలేశారు. మా వదిన భువనేశ్వరి ఓటు మాకే.. ‘‘చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండడం లేదు. పాపం.. విజయవాడలో ఉంటండు. ఆయన వ్యాపారమంతా, ఆయన భార్య, మా వదిన భువనేశ్వరి చూస్తంది. ఈయన కంటే ఆమె నయం. ఆమె మంచిగనే చూస్తంది. బాబూ.. నీకు హైదరాబాద్ వదలబుద్ది కాకుంటే పదిహేను రోజులకోసారి రా.. హిస్సాబ్ కింద మూసుకోని పో. ఎవరు వద్దంటరు నిన్ను? నేను గ్యారెంటీగా చెబుతున్న భువనేశ్వరి గారు ఇక్కడనే ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి ఆమె గ్యారెంటీగా మాకే ఓటేస్తది. మా కార్యకకర్త పోయి అడిగితే.. ‘నాకు తెలుసు. నేను హైదరాబాద్‌లో మీకే ఓటేస్తానంది’. నువ్వు ఉంటలేవు కాబట్టి నీకు తెలియడం లేదు. మా ఒదిన మాత్రం మాకే ఓటేస్తది..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ గెలిస్తేనే పనులు జరుగుతాయి.. రాష్ట్రానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌కు ఎన్నికలు జరుగుతున్నాయని, ఇక్కడ ఉండే అనేక మంది మేధావులు, విద్యావేత్తలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ కోరారు. మన రాష్ట్రం మనకుంటే.. మన నిధులు మనమే వాడుకుని అభివృద్ధి చెందవచ్చని చెప్పాననని, ఈ 18 నెలల కాలంలో అదే రుజువైందని పేర్కొన్నారు. ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తోందని, ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.51 వేలు ఇస్తున్నామని, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని వివరించారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు డబ్బాలాంటి ఇళ్లు కాకుండా, డబుల్ బెడ్రూం ఇళ్లను దేశంలో ఎక్కడా లేని విధంగా కట్టిస్తున్నామన్నారు. ‘‘హైదరాబాద్‌లో పేదలందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది. కేసీఆర్‌గా, మీ బిడ్డగా చెబుతున్నా. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. బల్దియాలో కాంగ్రెస్, టీడీపీలు అరవై ఏళ్లు ఉన్నాయి. కొత్త పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేస్తా. హైదరాబాద్‌ను బ్రహ్మాండగా చేస్తా. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తేనే పనులు జరుగుతాయి..’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కలసి పనిచేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. 18 నెలల కాలంలో వివిధ వర్గాల కోసం 190 సంక్షేమం కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ బాధ్యతలు ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతా. కేసీఆర్ మొండోడు. ప్రాణం పోయినా అన్న మాట నెరవేరుస్తా. వంద శాతం అవినీతి లేని, ప్రజలకు దగ్గరగా ఉండే, ప్రజల్లో ఉండి పని చేసే మా అభ్యర్థులను గెలిపించండి ’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నా కొడుకు, మంత్రి కేటీఆర్ ప్రచారాన్ని భుజానికెత్తుకుండు. బాగా తిరిగిండు. సమస్యలను ఆకళింపు చేసుకున్నడు. మున్సిపల్ శాఖ నా దగ్గరే ఉంది. ఆ శాఖను ఆయనకే ఇస్తా. బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం’’ అని అన్నారు. నా బాధ్యత మరింత పెరుగుతుంది: కేటీఆర్ మున్సిపల్ శాఖ బాధ్యతను తనకు ఇస్తానని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను సవినయంగా స్వీకరిస్తున్నాని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గురుతర బాధ్యత అప్పజెప్పిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వాసిగా, ఓ పౌరుడిగా ఈ శాఖ తన బాధ్యతను మరింతగా పెంచుతుందని అన్నారు. ప్రచారంలో భాగంగా గత మూడు నెలల కాలంలో నగరంలో విస్తృతంగా పర్యటించిన తనకు ప్రజల సమస్యలు, ఆకాంక్షలు తెలిశాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. -
వన్ కూటమితోనే పారదర్శక పాలన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మియాపూర్: నైతిక విలువలు, ఆదర్శ భావాలున్న వన్ కూటమితోనే పారదర్శక పాలన సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మియాపూర్ జేపీనగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ధన, అధికార బలంతో విర్రవీగుతున్న టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పే సత్తా వన్ కూటమికే ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులు, అబద్ధపు ప్రచారాలు, ఆర్భాటపు పథకాలతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్న టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి, వన్ కూటమిని గెలి పించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేసినా కోట్ల మీదే తప్ప నేలమీద నిలిచేలా ఉండవని విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు అన్ని ఎమ్మెల్సీ సీట్లు ఎలా వచ్చాయో ప్రజలకు తెలుసునన్నారు. విశ్వనగరం మాట దేవుడెరుగు.. పేదవాడి ప్రాథమిక అవసరాలు తీర్చితే అదే పదివేలన్నారు. లోక్‌సత్తా తెలంగాణ కార్యదర్శి ఎం.పాండు రంగారావు మాట్లాడుతూ చండీయాగాలు, చైనా యాత్రలతో ప్రజల సమస్యలు తీరవని, హైదరాబాద్ అకస్మాత్తుగా విశ్వనగరంగా మారిపోదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం నేలవిడిచి సాము చేయకుండా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వన్ కూటమి ఓట్లను అడుగుతుందే తప్ప.. అధికార పార్టీలా మార్కెట్లో సరుకులా కొనుక్కోదన్నారు. వనం సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారావు, కూటమి మియాపూర్ డివిజన్ అభ్యర్థి తాండ్ర కుమార్, ఎండీ గౌస్, శోభన్ పాల్గొన్నారు. -
సెంచరీ కొడతాం
* గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై మంత్రుల ధీమా * టీఆర్ఎస్ బహిరంగ సభలో ఉత్సాహభరిత ప్రసంగాలు * 100 స్థానాల్లో విజయం ఖాయమని వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తు వంద సీట్లు గెలవబోతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం పరేడ్‌గ్రౌండ్స్ మైదానంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. గ్రేటర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు అహ ర్నిషలు కృషిచేస్తున్నారని చెప్పారు. గ్రేటర్లో 1.08 లక్షలమంది పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. పట్టుదల, సంకల్పబలం ఉన్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నగరంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. నగరానికి కృష్ణా, గోదావరి జలాల తరలింపు, 24 గంటల కరెంటు సరఫరా ఇచ్చారని గుర్తుచేశారు. ఇవేవీ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు. టీఆర్ఎస్తోనే నగరాభివృద్ధి: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బల్దియా పీఠంపై టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరితేనే నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రస్తుతం నిధులు, విధులు, అధికారాలున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదలకు రూపాయికి కిలోబియ్యం, ఆసరా పింఛన్లు అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణా మహాత్మ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నగరం దేశంలో నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. విశ్వనగరం ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమన్నారు. తప్పకుండా మెజార్టీ స్థానాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండా దూసుకుపోతోంది: మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయం వైపు దూసుకుపోతోందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ సంకల్పబలంతో చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాలు నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాయన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నేడు విజన్ ఉన్న సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారని తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి నగరంలో సమస్యల పరిష్కారానికి కృషిచేశారన్నారు. హుస్సేన్‌సాగర్, మూసీ నదులను కాలుష్య కాసారంగా మార్చిన ఘనత విపక్షాలదేనని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి కేంద్రం సహకారం అందిస్తోందని చెప్పిన బీజేపీ నేతలు...బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జైళ్లకు వెళ్లొచ్చిన కొందరు ఛోటా నేతలు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారన్నారు. గత పాలకుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్కరు చాలన్నారు. ఇతర ప్రాంతాల వారిని కడుపులో పెట్టుకుంటాం: మైనంపల్లి హన్మంతరావు తెలంగాణా రాష్ట్రం సాధించగానే ఇతర ప్రాంతాల వారిని ఇక్కడ నుంచి పంపిస్తారని విపక్షాలు దుష్ర్పచారం చేశాయని గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర ప్రాంతాల వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా హైదరాబాదీయులే. రెండు రాష్ట్రాలు ఏర్పడడంతోనే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈవిషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మైనంపల్లి విజ్ఞప్తి చేశారు. సైడ్‌లైట్స్ ⇒ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఆశీనులు కాగా, మధ్యలో ఏర్పాటు చేసిన రెండో వేదికపై గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు కేటాయించారు. మూడో వేదిక కళాకారులకు కేటాయించారు. ⇒ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన టీఆర్ఎస్ సభ సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని కళాకారుల బృందం సుమారు గంటన్నర పాటు తమ ఆటాపాటలతో సభికులను ఉర్రూతలూగించారు. ⇒ ‘దేఖో హైదరాబాద్... అందమైన సికింద్రాబాద్’ అంటూ హైదరాబాద్ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట అందరినీ ఉత్సాహ పరిచింది. బోనాల జాతర గొప్పతనాన్ని వివరిస్తూ ‘రామా రామా ఎల్లమ్మలో...’ అంటూ పాడిన పాటకు సభకు హాజరైన మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో చిందేశారు. కొంతమంది పూనకంతో శివసత్తులు ఆడారు. ‘వీర తెలంగాణమా.. తిరుగబడ్డ గానమా...,ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా...’వంటి పాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. ⇒ సభా ప్రాంగణానికి నాలుగు వైపులా కారు బెలూన్లను గాల్లో ఎగరేశారు. అవి సభికులను ఆకర్షించాయి. ⇒ ఎంపీ బాల్కా సుమన్ సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు. పరేడ్‌గ్రౌండ్ బయట ఉన్న కార్యకర్తలను లోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆయన పదేపదే విజ్ఞప్తి చేయడం కన్పించింది. కార్యకర్తలను అడ్డుకోవద్దని పదేపదే పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ⇒ పాతబస్తీ నుంచి వచ్చిన ఓ అభిమాని టీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు, కేసీఆర్ ఫొటోతో తయారు చేసిన హెల్మెట్‌ను తలకు ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రాత్రి 7.55 నిమిషాలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సీఎం కేసీఆర్ సభా వేదికపైకి వస్తున్న సమయంలో మరో అభిమాని శంఖం పూరించి ఎన్నికల సమరానికి సిద్ధం అంటూ ప్రకటించాడు. ⇒ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర ఏమున్నది? నెత్తున్నదా...? కత్తిన్నదా..? ఆయనకు ఓటేస్తే హైదరాబాద్‌కు ఏమీ చేయలేడు’ అని చెప్పడంతో వేదికపై ఆశీనులైన సభికులతో పాటు అభిమానులు, కార్యకర్తలు ఘొల్లున నవ్వుకున్నారు. -
మాది ప్రజల పక్షం
మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యం మేయర్ పీఠంపై ఫలితాల అనంతరమే నిర్ణయం గతంలో భాగస్వామ్య పద్ధతిలో అధికారం చేపట్టాం బీఫ్‌తో మతానికి ముడి పెట్టొద్దు పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం ‘సాక్షి’తో ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ జాఫ్రీ ‘మేం ప్రజల పక్షం..ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే మా పార్టీ లక్ష్యం. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తాం. మేయర్ పీఠం విషయంలో మాకు స్పష్టత ఉంది. భాగస్వామ్య పద్ధతిలోనే ముందుకు వెళ్తాం..దీనిపై ఎన్నికల ఫలితాల అనంతరమే నిర్ణయం ఉంటుంది’ అంటున్నారు ఎంఐఎం పార్టీలో కీలక నేత, ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ. మజ్లిస్ పార్టీలో తెరవెనుక వ్యూహకర్తగా...పార్టీ అధినేతకు విధేయుడిగా గుర్తింపు పొందిన జాఫ్రీ వృత్తిరీత్యా జర్నలిస్టు. పార్టీ పెద్దలకు సలహాలు, సూచనలు ఇవ్వడం... ఎత్తుగడలు, వ్యూహ ప్రతి వ్యూహాలు నెరప డంలో ఆయన దిట్ట. ఎన్నికల సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తీసుకునే నిర్ణయాల్లో ముఖ్య భూమిక పోషించే జాఫ్రీ.. గ్రేటర్ ఎన్నికల వేళ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు... - సాక్షి, సిటీబ్యూరో మజ్లిస్ పార్టీ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పలు హామీలు గుప్పించింది...కారణమేంటి? మజ్లిస్ పార్టీ ‘మా పనే- మాకు గుర్తింపు’ అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రూపొందించలేదు. కానీ మేనిఫెస్టో విడుదల చేయడం కొత్తేమీ కాదు. 2002 మున్సిపల్ ఎన్నికల్లో దివంగత నేత సలావుద్దీన్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ పేరిట డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం గ్రేటర్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. ఈసారి విడుదల చేసిన డాక్యుమెంట్లో ప్రజలకు మౌలిక సదుపాయల కల్పన, స్వచ్ఛమైన తాగు నీరు. రోడ్డు, రవాణ సౌకర్యాలపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాం. అదేవిధంగా గత మూడేళ్ల కాలంలో మజ్లిస్ హయాంలో చేపట్టిన అభివృద్ధిపై సైతం ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. ‘షహర్ హమారా.. మేయర్ హమారా’ అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగారు. కేవలం 60 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మేయర్ పీఠం ఎలా సాధ్యం? జీహెచ్ఎంసీలో పరిమితమైన స్ధానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ అన్నింటిలో విజయం సాధిస్తాం. గతంలో మూడు పర్యాయాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మజ్లిస్ పార్టీయే. 1986లో 100 డివిజన్లకు గాను 38 స్థానాల్లో విజయం సాధించాం. మెజార్టీ లేకున్నా ఐదేళ్లపాటు అధికార పగ్గాలు చేపట్టాం. 2002లో పాలక పగ్గాలు చేపట్టకున్నా.. స్టాండింగ్ కమిటీ ద్వారా పాలనను కంట్రోల్ చేయగలిగాం. గత పర్యాయం కూడా మెజార్టీ లేకున్నా మూడేళ్ల పాటు పరిపాలించాం. మేయర్ పీఠం అనేది సింగిల్ పార్టీతో సాధ్యం కాదు. రెండు పార్టీల భాగస్వామ్యం తప్పనిసరి. ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాం. మా వ్యూహాలు మాకున్నాయి. ‘జై భీమ్.. జైమీమ్’ అనే నినాదంతో ఈ ఎన్నికల బరిలో దిగారు. కానీ...బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన సీట్లు కేటాయించలేదు. గత 2009 ఎన్నికల్లో 20 సీట్లు కేటాయిస్తే ఈసారి 10 సీట్లు మాత్రమే కేటాయించారు... కారణం? పరిమిత స్థానాల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం కల్పించాం. జనరల్ స్థానాలు, పాతబస్తీలో సైతం మైనార్టీయేతరులకు సీట్లు కేటాయించాం. మహిళలకు కూడా పెద్దపీట వేశాం. దళితుడిని మేయర్‌ను చేసిన ఘనత మజ్లిస్ పార్టీదే. ఈసారి సిట్టింగ్ కార్పొరేటర్లకు చాలా వరకు సీట్లు కేటాయించలేదు. అభ్యర్థుల ఎంపిక చాలా రహస్యంగా జరిగింది. కనీసం మీడియాకు సైతం వెల్లడించలేదు. కారణం? డివిజన్ల డీలిమిటేషన్, రిజర్వేషన్ల తారుమారు, మహిళలకు 50 శాతం సీట్ల కేటాయింపు తదితర అంశాలతో కొందరు సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వలేకపోయాం. కేవలం 9 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు, ఒక మాజీ కార్పొరేటర్, ఒక కో-ఆప్షన్ సభ్యురాలికి మాత్రమే తిరిగి అవకాశం కల్పించాం. మా పార్టీలో అసంతృప్తి అనేది ఉండదు. పరిస్థితులను బట్టి అవకాశాలు ఇవ్వడం ఆనవాయితీ. సమయాభావంతో ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశాం. కాంగ్రెస్, టీడీపీతో సహా అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్‌ను మతతత్వ పార్టీగా అభివర్ణిస్తోంది. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత మీ పార్టీని విమర్శిస్తుండగా.. సీఎం కేసీఆర్ మాత్రం ‘ఎంఐఎం మాకు మిత్రపక్షమే’ అంటున్నారు.. దీనిపై మీ పార్టీ వైఖరేంటి? మజ్లిస్ సెక్యులర్ పార్టీ. మైనార్టీలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కుల కోసం గళం విప్పుతుంది. కాంగ్రెస్, టీడీపీ పక్షాలు గతంలో మజ్లిస్ పార్టీతో కలిసి పనిచేసినప్పుడు మతతత్వం కనిపించలేదా? పొత్తు లేనప్పుడే మతతత్వం కనిపిస్తోందా.? బీజేపీ మాదిరిగా సంఘ్ పరివార్ అనుబంధాలు మా పార్టీకి లేవు. 2014 ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ వాష్ ఔట్ ఆయింది. టీడీపీ-బీజేపీ కూటమి పూర్తిగా బలహీన పడింది. టీఆర్ఎస్తో వైరం లేకున్నా..తాము పోటీ చేసే స్థానాల్లో విన్నర్‌గా మజ్లిస్, రన్నర్‌గా టీఆర్ఎస్ నిలవడం ఖాయం. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీఫ్ ప్రస్తావన తేవడానికి కారణమేంటి ? ప్రస్తుతం గోవధ నిషేధ చట్టం అమల్లో ఉంది. మహారాష్ట్రలో బీజేపీ- శివసేనలు అధికారంలో ఉన్నకారణంగా స్థానిక సంస్థల జనరల్ బాడీ సమావేశాల్లో సైతం తీర్మానాలు చేసి బీఫ్‌పై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.. కొన్ని పండుగల సందర్భంగా బీఫ్ విక్రయాలను నిషేధిస్తున్నారు. బీఫ్‌తో మతానికి ముడి పెట్టొద్దు. బీఫ్ తినేవాళ్లలో ముస్లింలతో పాటు హిందువులూ ఉన్నారు. ఒకవేళ జీహెచ్ఎంసీలో టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే బీఫ్‌పై తీర్మానాలుచేసే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రచారంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మీ వైఖరి ఏమిటి? టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి. కొంత సమయం పట్టవచ్చు. అభివృద్ధికి పూర్తి స్థాయి సహకారాలు అందిస్తాం. ముఖ్యంగా ప్రజలకు మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. కేంద్ర ప్రభుత్వ పనితీరు.. మోదీ విదేశీ పర్యటన లపై మీ కామెంట్..? కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవతి తండ్రి ప్రేమను చూపిస్తోంది. కేంద్ర పథకాలలో నిధుల వాటా తగ్గించింది. ఐసీడీఎస్, సర్వశిక్షా అభ్యాస్ తదితర పథకాలకు పూర్తిస్థాయిలో నిధులు నిలిపివేసి రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపింది. పన్నుల వాటా పెంచింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారు. అభివృద్ధి కాగితాలపై తప్ప ఆచరణలో కనిపించడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారు.? మేయర్ పీఠం విషయంలో ఏ పార్టీకి మద్దతిస్తారు? జీహెచ్ఎంసీలో గట్టి పట్టు ఉన్న డివిజన్లలో పోటీకి దిగాం. అన్నింటిలో విజయం సాధిస్తాం. ఫలితాల అనంతరం ఎవరేమిటో స్పష్టమవుతుంది. ఫలితాల అనంతరం ఏర్పడే రాజకీయ పరిణామాలను బట్టే మేయర్ పీఠంపై నిర్ణయం ఉంటుంది. మెజార్టీ లేకుండా ఇతరుల మద్దతుతో పాలక పగ్గాలు చేపట్టిన చరిత్ర మజ్లిస్‌కు ఉంది. అదే పునరావృతం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. -
ఎన్డీఏతోనే గ్రేటర్ అభివృద్ధి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అల్వాల్ : బీజేపి, టీడీపీతోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ది సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని వెంకటాపురం డివిజన్లో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్డీఏ హయాంలోనే నగర అభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ది కన్నా ప్రచారంపైనే అధికంగా దృష్టి సారించిందన్నారు. ప్రతిపక్షాలు మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. నగరంలో ఐఎస్ఐఎస్ కదలికలు అధికమయ్యాయన్నారు. సెంట్రల్ యూనివర్సిటిలో జరిగిన సంఘటనను ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రేటర్ మరింత అభివృద్ది చెందడానికి అవకాశం ఉందన్నారు. ఇందుకు గ్రేటర్లో బీజేపీ మిత్రపక్షాల కూటమి విజయం సాధించాల్సిన అవసరముందన్నారు. మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ధూంధాం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మచ్చబొల్లారం అభ్యర్ధి చిట్టిబాబు, వెంకటాపురం అభ్యర్ధి జగదీష్, అల్వాల్ అభ్యర్ధి తాళ్ల సౌజన్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
క్యా బాత్ హై
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బీజేపీ-టీడీపీతోనే సాధ్యమవుతుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేసిన పనుల కంటే ప్రచారం ఎక్కువగా ఉంది. ఉత్తుత్తి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. - వెంకటాపురం డివిజన్ ఎన్నికల సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణపై మాటకు కట్టుబడింది ఒక్క సోనియా గాంధీనే. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆమె ఎన్నో అడ్డంకులను అధిగమించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేయాలి. - కార్వాన్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ‘గద’! టీపీసీసీ సారథి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నిర్విరామంగా పాల్గొంటున్నారు. రోడ్డు షోలు, పాదయాత్రలు, ప్రచార సభలతో దాదాపు డివిజన్లన్నీ చుట్టేస్తున్నారు. కార్వాన్లో శనివారం పార్టీ కార్యకర్తలు బహూకరించిన గదను ధరించి రోడ్డు షోలో పాల్గొన్నారు. ఉత్తేజభరిత ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. - కార్వాన్ -
ఈవీఎంలు సిద్ధం
కుషాయిగూడ: గ్రేటర్ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్(ఈవీఎం)లను సిద్ధం చేసినట్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్న విషయం విదితమే. 7,790 పోలింగ్ కేంద్రాలకు గాను 9,370 ఈవీఎంలు సిద్ధం చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల పరీక్షలు ఇప్పటికే పూర్తైట్లు తెలిపారు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఆపేక్స్ లెవల్ అధికారితో పాటు అనుభవం ఉన్న ఆఫీసర్, ఐదు సర్కిళ్ల చొప్పున ఒక సీనియర్ అధికారి, ప్రతి డివిజన్‌కు అనుభవజ్ఞులైన ఇద్దరు ఇంజినీర్లను నియమించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఈసీఐఎల్ ప్రస్థానంలో ఈవీఎంల రూపకల్పన మైలురాయిగా మిగిలిపోతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
గులాబీ జోష్..!
* పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ విజయవంతం * సీఎం హామీలతో టీఆర్ఎస్ శ్రేణుల ఖుషీ సాక్షి, సిటీబ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీ పరేడ్ గ్రౌండ్స్లోనిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం గ్రేటర్ గులాబీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. సీఎం కేసీఆర్ పాల్గొన్న ఈ సభకు నగరంలోని 150 డివిజన్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు వేలాది జనాన్ని తరలించారు. నగరాభివృద్ధిపై సీఎం చేసిన ప్రసంగం తమకు కలిసి వస్తుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ అభ్యర్థులను సీఎం ప్రజలకు పరిచయం చేస్తూ అవినీతి రహితంగా పాలన అందిస్తామని..పైసా లంచం ఇవ్వకుండా ప్రజలు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు కృషి చేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయిస్తున్నానని ప్రకటించడంతో కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, వరద కాల్వల ప్రక్షాళన, ముంపు సమస్యల పరిష్కారానికి సుమారు రూ.30 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని హామీ ఇవ్వడంపై కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్‌గా మారిన విషయం విదితమే. శనివారం సభతో ముఖ్యమంత్రి స్వయంగా నగర అభివృద్ధిపై విజన్ ఆవిష్కరించడంతో పాటు గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేయడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. అంచనాలకు మించి అన్నివర్గాల జనం తరలిరావడంతో బల్దియా ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాలపై విశ్వాసం పెరిగిం దన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహా రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి, డివిజన్ల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు మెహిదీపట్నం: రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, దానికి చరమగీతం పాడాల్సిన రోజు ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని టీఆర్ఎస్ చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్వాన్ నియోజకవర్గంలో లక్ష్మీనగర్ చౌరస్తా, మొగల్‌కా నాలా, బాలాజీనగర్, గుడి మల్కాపూర్, విశ్వేశ్వరనగర్, జాఫర్‌గూడలో నిర్వహించిన రోడ్‌షోల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. అనంతరం రాంసింగ్‌పురా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సోనియాగాంధీ మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని, కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మెట్రో రైలు, ఔటర్ రింగ్‌రోడ్, కొత్త ఎయిర్‌పోర్టు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఫార్మా సిటీ, ఐటీ క్యాపిటల్ అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. దళితుణ్ని సీఎం చేస్తానని ప్రకటించిన కే సీఆర్ అనంతరం ఆయనే పదవి చేపట్టి వారిని మోసం చేశారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణాల మాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, డ్వాక్రా మహిళలకు అభయహస్తం, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు అందజేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు దానం నాగేందర్, కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి రూప్సింగ్, పార్టీ అభ్యర్థులు బల్వీర్‌సింగ్, చంద్రకాంత్రావ్, ఎన్నికల పరిశీలకులు లక్ష్మణ్‌కుమార్, సీనియర్ నాయకులు ప్రహ్లాద్ యాదవ్, అఫ్సర్ యూసుఫ్ జావెద్, సుభాష్ సింగ్, పురుషోత్తం సింగ్, శంకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
48 గంటలు
సాక్షి, సిటీబ్యూరో: టిక్...టిక్...టిక్... మరో 48 గంటలు. ఇదీ గ్రేటర్ ఎన్నికలకు మిగిలిన సమయం. 150 డివిజన్లలో వెయ్యికి పైగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటరు మహాశయుడి తీర్పు కోసం ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. సగటు ఓటరును తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారం శనివారం నాటికి కీలక దశకు చేరుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు... తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉంది. దీంతో అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. మొత్తంగా బస్తీలను, కాలనీలను తమకు అనుకూలంగా మలచుకొని గంపగుత్తగా ఓట్లను కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా మహిళా సంఘాలపైదృష్టి సారించాయి. మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకుంటే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు సభలు, సమావేశాలు, రోడ్ షోలలో నిమగ్నమైన నాయకులు ప్రస్తుతం పూర్తిగా మహిళా సంఘాలను, బస్తీ, కాలనీ సంఘాలను, అపార్ట్మెంట్ అసోసియేషన్లను కలవడంలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వరకూ మంతనాలు సాగిస్తున్నారు. ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. నిన్నటి వరకు పాటలు, నినాదాలు, కరపత్రాలు, మైకులతో హోరెత్తిన ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఫలానా పార్టీ వాళ్లు వచ్చి వెళ్లారని తెలియగానే ప్రత్యర్ధి పార్టీ నాయకులు అదే బస్తీకి పరుగులు తీస్తున్నారు. దీంతో రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా బస్తీల్లో వాహనాలు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు ఒక్కొక్క ఓటరును కలవడం కంటే సంఘాలను కలిసి తమవైపు తిప్పుకోవడం పైనే నాయకులు ప్రధానంగా దృష్టి సారించారు. పోటా పోటీ... నిన్న మొన్నటి వరకు పార్టీలు.. అభ్యర్థులు తమను తాము అభివృద్ధికి పర్యాయపదంగా నిర్వచించుకున్నారు. ఒక్కో డివిజన్లో పోటీకి దిగిన ముగ్గురు, నలుగురు అభ్యర్ధులు ఆ డివిజన్లోని ప్రతి పనిని తామే చేశామంటూ బీరాలు పలికారు. ఒకవైపు అభివృద్ధి చేశామని చెబుతూనే మరోవైపు తమను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని పోటాపోటీగా హామీల వర్షం గుప్పించారు. ఎన్నికల గడువు సమీపించడంతో బస్తీలు, కాలనీ నాయకుల చేతుల్లోనే తమ భవితవ్యం ఉందంటూ బేరసారాలు మొదలెట్టారు. శనివారం నుంచి ఈ దిశగా ప్రచారం మలుపు తిరిగింది. డబ్బు, మద్యం పంపిణీ మొదలైంది. గెలుపు ఎవరిదో.... మహానగర ఓటర్లు గత వారం, పది రోజులుగా అన్ని రాజకీయ పార్టీల మాటలు విన్నారు. నేతల హామీలు తెలుసుకున్నారు. అభ్యర్ధుల ఆకర్షణలు,తాయిలాలు తెలిశాయి. గుంభనంగా కనిపిస్తున్న సగటు ఓటర్లు తమవిలువైన ఓటు అస్త్రాన్ని సంధించే సమయం ఆసన్నమైంది. వారి ఆశీస్సులు ఎవరిని లభిస్తాయనే ఉత్కంఠ మొదలైంది. -
కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఓటేసేందుకు గంట సడలింపు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరిగే ఫిబ్రవరి 2వ తేదీన స్థానికంగా ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. పోలింగ్ రోజు ఓటేసేందుకు తమ ఉద్యోగులు ఉదయం లేదా మధ్యాహ్నపు పని వేళల్లో అర్థగంట/గంట పాటు సడలింపు తీసుకోవచ్చని తెలిపింది. పోలింగ్ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని కోరుతూ రాసిన లేఖకు స్పందనగా కేంద్రం నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మకు సమాధానం అందింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థల కార్యాలయాల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు పోలింగ్ రోజు విధులకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు ఉద్యోగులకు 2న సెలవు.. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజు ఫిబ్రవరి 2న స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదే విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో నివాసం ఉంటూ ఇతరాత్ర ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం పోలింగ్ రోజు సెలవును వర్తింపజేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం మెమో జారీ చేశారు. అదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్‌కు మరుసటి రోజు ఫిబ్రవరి 3న ఆన్‌డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పిస్తూ మరో మెమో జారీ చేశారు. -
హయత్‌నగర్ లో డబ్బు పంపిణీ: ఒకరి అరెస్టు
హైదరాబాద్: ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ బీజేపీ అభ్యర్థి సమీప బంధువు ఒకరు పోలీసులకు పట్టుబడ్డారు. నగరంలోని హయత్‌నగర్ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కల్లెం రవీందర్‌రెడ్డి అల్లుడు విజయేందర్‌రెడ్డి ఎన్వలప్ కవర్లలో నోట్లు పెట్టి పంపిణీ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 4 లక్షలు, ఎన్వలప్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. -
మతోన్మాద పార్టీలకు బుద్ధి చెప్పాలి
కమ్యూనిస్టు నేతలు నారాయణ, రాఘవులు లాలాపేట: మతోన్మాద, అధికార దాహంతో విర్రవీగుతున్న పార్టీలకు గ్రేటర్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ తార్నాక డివిజన్ అభ్యర్థి రాపోలు శోభారాణి తరఫున శుక్రవారం వారు లాలాపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పేద ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీలేనన్నారు. కార్యక్రమంలో సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి అన్నం వీరేష్ ముదిరాజ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్: చాడ చాంద్రాయణగుట్ట: టీఆర్ఎస్.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ గౌలిపురా డివిజన్ అభ్యర్థి వి.అన్నపూర్ణాదేవితో కలిసి శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతోందని, పాతబస్తీకి మెట్రోరైలు రాకుండా ఎంఐఎం అడ్డుకుంటోందని ఆరోపించారు. మతతత్వ పార్టీలకు చెక్ పెట్టాలంటే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ సీఎం కేసీఆర్ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బి.రాములు యాదవ్, జి.చంద్రమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎన్నికల మద్యం స్వాధీనం
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నిలకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గ్రేటర్ పీఠం తమదంటే తమదేనని పలుపార్టీలు ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే జోరుగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల మద్యం ఏరులైపారుతోంది. నగరంలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల 15 లక్షల 28 వేల 200 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 86వేల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. -
అబిడ్స్ లో తనిఖీలు: రూ. 35 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆబిడ్స్ జీపీవో ఎదురుగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు హోండా యాక్టీవాలో తరలిస్తున్న రూ. 35 లక్షలను గుర్తించారు. దీంతో వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు చూపకపోవడంతో సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
కుటుంబ పాలనకు స్వస్తి పలుకుదాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేటీఆర్ ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తామని ఇప్పుడు చెబుతున్నాడు. కానీ అతను పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ప్రజలు నల్లా నీళ్లు తాగుతున్నారు. దిల్సుఖ్నగర్: సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నగరాన్ని రెండు కుటుంబాల (కేసీఆర్, ఓవైసీ) పాలన నుంచి కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్కేపురం డివిజన్లో సీనియర్ సిటిజన్స్ కాలనీ అసోసియేషన్ సమావేశం గురువారం స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. దీనికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబాలే బాగుపడ్డాయని విమర్శించారు. ఈ కుటుంబాల పాలనకు స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ రాలేదు కానీ, కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారమైందన్నారు. బీజేపీని గెలిపిస్తే ఈ రెండు కుటుంబాల పాలన నుంచి ప్రజలకు, హైదరాబాద్‌కు రక్షణ కల్పిస్తామన్నారు. ‘కేటీఆర్ ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తామని ఇప్పుడు చెబుతుండు. అతను పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ప్రజలు నల్లా నీరు తాగుతున్నార’ని కిషన్‌రెడ్డి కేటీఆర్‌కు కౌంటర్ వేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామంటూ, ఒక ఇల్లు కట్టించి గ్రాఫిక్స్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రంలో ఏ పథకాలు అమలు కావని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో 90 శాతం కార్పొరేషన్లను బీజేపీ పాలిస్తోందని, నగరంలో కూడా మిత్రపక్షాలను గెలిపిస్తే ఉగ్రవాదం, వినాశక శక్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకుంటామన్నారు. మంచికి మారుపేరుగా నిలిచిన ఆర్కేపురం డివిజన్ అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కిషన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ నాయకులు పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బొక్క నర్సింహారెడ్డి, పిట్ట ఉపేందర్ రెడ్డి, ధీరజ్ రెడ్డి, జంగయ్య యాదవ్, ప్రభాకర్జీ, కార్నాటి ధనుంజయతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలకు ఓటేస్తే మిగిలేది బూడిదే..
రోడ్ షోలో మంత్రి కేటీఆర్ కాచిగూడ: జోగిజోగి రాసుకుంటే బూడిద రాలినట్లే.. కాంగ్రెస్, టీడీపీ-బీజేపీలను గెలిపిస్తే బూడిదే మిగులుతుందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన అంబర్‌పేట నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. అభ్యర్థులు చైతన్య కన్నాయాదవ్(కాచిగూడ), కాలేరు పద్మా వెంకటేష్(గోల్నాక), పులిజగన్(అంబర్‌పేట), పద్మిని డిపిరెడ్డి(బాగ్‌అంబర్‌పేట), గరిగంటి శ్రీదేవి రమేష్(నల్లకుంట)ల తరఫున ఆయా డివిజన్లలో కేటీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేసి, కేసీఆర్‌తో పనిచేయించుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు.70 స్మార్ట్ సిటీలు ఎంపిక చేస్తే అందులో తెలంగాణ నుంచి ఒక్కటి కూడా లేకపోవడం దారుణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఐదు పైసల పని కూడా చేయని బీజేపీకి ఓట్లు ఎలా వేస్తారని, కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఓట్లు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయని టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రశ్నిస్తున్నాయని.. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న వారికి గుర్తుకురాని రోడ్లు, ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గుర్తొచ్చాయా అన్నారు. 65 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 18 నెలల్లో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, పైలా శేఖర్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, నియోజకవర్గ ఇంచార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, నేతలు ఎక్కాల కన్నా, దుర్గాప్రసాద్‌రెడ్డి, సి.కృష్ణయాదవ్, దిడ్డి రాంబాబు, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్, ఒవైసీలది కపట నాటకం : భట్టి విక్రమార్క
కేసీఆర్, ఓవైసీలది కపట నాటకం.. * టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నాంపల్లి/విజయనగర్‌కాలనీ: సీఎం కేసీఆర్, ఎంఐఎం అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు కపట నాటకం ఆడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దళితులు, మైనార్టీలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఎంఐఎం ఎందుకు మద్దతు తెలుపుతోందని, 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు. ముస్లింలపై ఎంఐఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. అబద్ధపు హామీలతో ఇద్దరూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్, విజయనగర్ కాలనీ ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభల్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాల పేరు మార్చి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రవేశపెట్టినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. టీడీపీ, బీజేపీ కూటమి, టీఆర్ఎస్, ఇతర పార్టీలకు ఓటేస్తే ప్రజలు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు దానం నాగేందర్, ఉపాధ్యక్షులు ముక్రం అలీ సిద్దిఖీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, వినోద్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 18 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపాం * డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఖైరతాబాద్: 18 నెలల్లోనే నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. టీఆర్ఎస్ పేదల పార్టీ అని పేర్కొన్నారు. ఎంఎస్ మక్తాలో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ ఖైరతాబాద్ అభ్యర్థి పి.విజయారెడ్డి, సోమాజిగూడ అభ్యర్థి అత్తలూరి విజయలక్ష్మిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల రెగ్యులరైజేషన్, హైటెన్షన్ వైర్ల తొలగింపు తదితర సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ 18 నెలల్లోనే చేసి చూపిందన్నారు. రాత్రికి రాత్రే పార్టీలు మారేందుకు ప్రయత్నించిన వారికి టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
72 మంది నేర చరితులు
నివేదిక విడుదల చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో 72 మంది నేర చరితులు పోటీ చేస్తున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ మేరకు పార్టీల వారీగా నేర చరితుల వివరాలతో గురువారం నివేదిక విడుదల చేసింది. వీరిపై నమోదైన కేసుల వివరాలను లక్డీకాపూల్‌లోని సంస్థ కార్యాలయంలో ఉపాధ్యక్షుడు రావు చెలికాని, కార్యదర్శి పద్మనాభరెడ్డిలు వెల్లడించారు. ఈ కేసుల్లో కొన్ని పోలీస్ స్టేషన్లు, మరికొన్ని కోర్టు విచారణల్లో ఉన్నట్లు తెలిపారు. 14 మంది నేర చరిత ఉన్న అభ్యర్థులతో అధికార పార్టీ టీఆర్ఎస్ తొలి స్థానంలో నిలిచింది. కాగా కాంగ్రెస్, టీడీపీల నుంచి చెరో 13 మంది, ఎంఐఎం నుంచి 11 మంది బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నలుగురికి, ఎంబీటీ ఇద్దరికి, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, బీఎస్పీ ఒక్కో అభ్యర్థికి టికెట్లు ఇచ్చాయి. మరో వైపు 11 మంది స్వతంత్య్ర అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. అభ్యర్థుల గుణగణాల గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ నివేదిక విడుదల చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వొద్దని ఆయా పార్టీలకు లేఖలు రాశామని పేర్కొన్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో జత చేసిన అఫిడవిట్లలో సమర్పించిన వివరాలను రిటర్నింగ్ అధికారులు మీడియాకు వెల్లడించి ఉంటే తమకు ఈ పని ఉండేదే కాదన్నారు. తమ సంస్థ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను సేకరించిందని తెలిపారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా అందుబాటులో ఉంచిన ఎలక్షన్ కమిషన్.. ఈ దఫా ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. త్వరలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
...కాదేదీ ప్రచారానికనర్హం!
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ... బడి, గుడి.. పార్కు, పాలకేంద్రం.. బారు, బస్టాండ్.. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు మన ‘మహా’నాయకులు... ఓటే ముఖ్యంగా.. గెలుపే లక్ష్యంగా ‘మీరు ఏడికెళ్తే ఆడికొస్తా ఓటరూ..’ అంటూ.. వేదిక ఏదైనా.. ఎక్కడైనా.. ప్రచార హోరుతో దూసుకుపోతున్నారు గ్రేట్..ర్ నేతలు. సాక్షి,సిటీబ్యూరో: బల్దియా ప్రచారంలో నయా ట్రెండ్ జోరందుకుంది. వేదిక ఏదైనా సరే ప్రచార పదనిసలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నాయకగణం. పాఠశాలలు, కళాశాలలు. దేవాలయాలు, పార్కులు, పాలకేంద్రాలు, టీకొట్టు, ఇడ్లీ బండి, కూరగాయల మార్కెట్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకప్పటిలా గడగడపకూ వెళ్లి సంప్రదాయ పద్ధతిలో ప్రచారం చేస్తే లాభం లేదని.. ఇప్పుడు ప్రతి అడ్డానూ ప్రచారానికి వేదికగా వినియోగించుకుంటున్నారు నేతలు. దీనికి ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేదు. జెండాలు, అజెండాలు, హామీలతో పనిలేదు. ఎవరైనా.. ఎక్కడైనా.. ప్రచార ట్రెండ్ మాత్రం ఇదే. అభ్యర్థుల ఉత్సాహానికి చిన్నారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న పాఠశాలలు సైతం ప్రచార హోరులో తడిసి ముద్దవుతున్నాయి. ఓటర్లతోపాటు వారి పిల్లలనూ ప్రభావితం చేసేందుకు చిన్నారుల చేతుల్లో కరపత్రాలు పెడుతూ.. మీ తల్లిదండ్రులను ఓటు మాకే వేయాలని చెప్పమంటున్నారు. అంతటా అభ్యర్థులే... మార్నింగ్ వాక్కు వె ళ్లే ఉద్యోగులు, వృద్ధులు, మహిళల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు ఉదయం 5 గంటల నుంచే పార్కుల వద్ద తిష్ట వేస్తున్నారు అభ్యర్థులు. ఇక ‘స్వామి కార్యం.. స్వకార్యం’ అన్నట్లు కాలనీలు, బస్తీల్లో ఉన్న దేవాలయాలు కూడా పార్టీల ప్రచారంతో సందడిగా మారుతున్నాయి. గుడికి వచ్చిపోయే వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇక్కడా మకాం వేస్తున్నారు. దైవ సాక్షిగా మీ ఓటు మాకే అంటూ భక్తులతో చేతిలో చేయి వేయించుకుంటున్నారు. ఇక టీకొట్టు, టిఫిన్ బండి, కిరాణా దుకాణాల వద్దకు వచ్చిపోయే వారి చేతిలో కరపత్రం పెట్టి.. వంగి, వంగి దండాలు పెడుతున్నారు. గడ్డాలు, చేతులు పట్టుకొని బతిమిలాడుతున్నారు. ‘మీరు ఏడికెళ్తే ఆడికొస్తాం.. మీ ఓటు మాత్రం మాకే సుమా’ అంటూ సెలవిస్తున్న అభ్యర్థులను చూసి ఓటర్లు విస్తుపోతున్నారు. బార్లకు వచ్చే మందుబాబులకు మందు, విందులతో పసందు చేస్తూ వారి ఓట్లనూ ఒడిసి పట్టేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. బార్లలో ‘మీ ఓటు ఎవరికి..?’ అన్నదే టేబుల్ అజెండాగా మారుతోంది ఇప్పుడు. ఇక దీనికి ఇంటింటీ ప్రచారం అదనం. ఇన్ని రకాలుగా ప్రచారం చేసినా ఓటర్లు తమ వైపు ఉంటారో లేదో తెలియక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ చూసినా ‘మీ ఓటు ఎవరికి..?’ అన్నదే హాట్ టాపిక్‌గా మారింది. ‘ఎవరికి ఓటేస్తే మాకేంటీ లాభమం’టూ జనం బేరీజు వేసుకుంటున్నారు. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు జెండా, అజెండా మార్చేసుకొని ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలవడంతో.. గతంలో వారు చేసిన అభివృద్ధి, స్పందించిన తీరుపై ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ఫీట్లు చేస్తున్న అభ్యర్థులు వారి అంతరంగం తెలియక తికమకపడుతున్నారు. -
ట్రా‘వెల్’ బిజినెస్!
* ప్రచారంలో రోజుకు వేల సంఖ్యలో అద్దె వాహనాలు * గత వారం రోజులుగా భారీగా పెరిగిన వినియోగం సాక్షి, సిటీబ్యూరో: ఇంటిల్లిపాదీ కలసి ఇన్నోవా, టవేరా వంటి వాహనాలను అద్దెకు తీసుకొని తిరుమలేశుని దర్శనానికో... బంధువుల ఇళ్లకో వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మరో వారం రోజులు ఓపిక పట్టాల్సిందే. అవును... ప్రస్తుతం నగరంలోని అద్దె వాహనాలన్నీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు వాహనాలు సమకూర్చడంలో ట్రావెల్స్ కంపెనీలు బిజీబిజీగా ఉన్నాయి. గత వారం రోజులుగా నగరంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచార రథాలు, అభ్యర్థుల పర్యటనలకు వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఇండికా వంటి చిన్నవి మొదలుకొని.. క్వాలిస్, స్విఫ్ట్‌డిజైర్, ఫార్చునర్, ఎర్టిగా, గ్జైలో తదితర వాహనాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ట్రావె ల్స్ కంపెనీల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో ట్రావెల్స్ కంపెనీలు సైతం బాగానే డిమాండ్ చేస్తున్నాయి. వాహనం సామర్థ్యాన్ని బట్టి రోజుకు రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నాయి. చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 100కు పైగా ట్రావెల్స్ కంపెనీలకు ఎన్నికల కాలం బాగా కలసి వస్తోంది. నగరంలో ప్రస్తుతం 1,333 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు నిత్యం 10 వేల వరకు వాహనాలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ వాహనాలపై రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారానికి నాయకులు, కార్యకర్తలను బస్తీలకు, కాలనీలకు తరలించడంలోనూ, ముఖ్యమైన నాయకుల రోడ్‌షోలకు వాహనాల వినియోగం తప్పనిసరి కావడంతో చాలా మంది అభ్యర్థులు సగటున 5 నుంచి 10 వాహనాలు అద్దెకు తీసుకుంటున్నారు. నగరంలోని ట్రావెల్స్‌కు డిమాండ్ ఉండడంతో వరంగల్, నల్లగొండ, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల నుంచీ వాహనాలను తీసుకొస్తున్నారు. ఆటోలకూ గిరాకీ... చిన్న చిన్న బస్తీలు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఆటోలను వినియోగిస్తున్నా రు. దీంతో వీటికీ డిమాండ్ పెరిగింది. పార్టీ బ్యానర్లు, అభ్యర్థుల నిలువెత్తు చిత్రాలు, ప్రచార సామగ్రి, మైక్సెట్లతో హోరెత్తించే ఆటోరిక్షాలు నగరంలో విరివిగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఐదారు వేలకు పైగా ఆటోలు ప్రచార రథాల అవతారమెత్తాయి. వీటికి ఏ రోజుకు ఆ రోజు వారు తిరిగిన దూరం మేరకు రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లిస్తున్నారు. ‘అధికార’ ఒత్తిడి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల కోసం తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు కొన్ని ట్రావెల్స్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అతి కష్టంగా వాహనాలను సమకూర్చినప్పటికీ డబ్బులు చెల్లించడం లేదని కొందరు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాల్సి వస్తోందని... ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. -
క్యా బాత్ హై
ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజలకు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. - అడిక్‌మెట్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ గత పాలకులు నగరాన్ని ‘ఊపర్ షేర్వానీ- అందర్ పరేషానీ’ చందంగా మార్చేశారు. నగర సమస్యలకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలే కారణం. ఈ పార్టీలకు ఓటేస్తే మోరీలో వేసినట్లే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. - జాంబాగ్ డివిజన్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ ఎవరెన్ని చెప్పినా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఘనతే. మేం చేసిన అభివృద్ధి పనులను టీఆర్ఎస్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కాలని చూస్తున్న టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధిచెబుతారు. - రామంతాపూర్ ప్రచార ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి -
మెహిదీపట్నం... పోరు రసవత్తరం!
* బరిలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ * గెలుపుకోసం టీఆర్ఎస్ పోరాటం * రెండోసారి విజేతగా నిలిచేందుకు బీజేపీ ఆరాటం మెహిదీపట్నం: మెహిదీపట్నం డివిజన్లో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థిగా మాజీ మేయర్ మాజిద్ రంగంలో ఉన్నారు. ఎలాగైనా గెలుపు సాధించి తన రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలని ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక రెండవసారి గెలిచేందుకు బీజేపీ, ఎలాగైనా పాగా వేయాలని టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా పట్టుదలతో ముందుకు సాగుతుండడంతో ఎన్నికల వేడి పుంజుకుంది. బలమైన క్యాడర్..టీడీపీ అండదండలతో విజయం సాధించడానికి బీజేపీ అభ్యర్థి భుజేందర్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు, సెంటిమెంట్, కేసీఆర్ ఇమేజ్‌తో ప్రజల మధ్యకు వె ళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి అశోక్‌కుమార్ సైతం ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెహిదీపట్నం డివిజన్లో పోరు రసవత్తరంగా మారింది. డివిజన్లో ప్రధాన సమస్యలివీ.... మెహిదీపట్నం డివిజన్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా తాగునీరు మురికిగా వస్తుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో పలు అవస్థలు ఎదురవుతున్నాయి. రాత్రి వేళ వీధి దీపాలు వెలగకపోవడంతో మహిళలు తిరగలేని పరిస్థితి నెలకొంది. హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి రేతిబౌలి చౌరస్తా వరకు నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాజిద్ హుస్సేన్ - ఎంఐఎం ప్రచార సరళి: ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించి కొంత వెనుకంజలో ఉన్నారు. ఇంటింటి ప్రచారం ఇప్పటి వరకు నిర్వహించ లేదు. కేవలం మైక్‌ల ద్వారానే ప్రచారం చేస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తుండడంతో అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బలాలు(+): గతంలో మేయర్‌గా పని చేసిన అనుభవం, తన హయాంలో జరిగిన సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి తదితర అంశాలు కలిసొచ్చే అవకాశం ఉంది. పార్టీకి బలమైన క్యాడర్ ఉండడం..అగ్రనేతల మద్దతు, ఓటు బ్యాంకు కూడా మాజిద్‌కు ప్లస్‌గా చెప్పొచ్చు. సెలైంట్‌గా దూసుకెళ్లి విజయాన్ని మూటకట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. బలహీనతలు(-): మేయర్‌గా ఉన్న సమయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు విమర్శలు రావడం. ఒకే వర్గానికి ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారనే అపవాదు మూటకట్టుకోవడం మాజిద్‌కు మైనస్ అనొచ్చు. వి.భుజేందర్‌కుమార్ - బీజేపీ ప్రచార సరళి: టికెట్ వస్తుందో రాదో అనే సందేహంతో ఉన్న భుజేందర్‌కుమార్...చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇవ్వడంతో పోటీకి సిద్ధమయ్యారు. ప్రచారాన్ని ప్రారంభించడంలో కొంత జాప్యం జరిగినా.... క్రమంగా ముమ్మరం చేస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ నేతల సహకారంతో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బలాలు(+): గతంలో మెహిదీపట్నం డివిజన్ నుంచే కార్పొరేటర్‌గా ఉండడం, బీజేపీ, టీడీపీ పొత్తు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. స్థానికంగా నివాసం ఉంటూ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి కావడం వల్ల ఒకింత బలం చేకూరే అవకాశముంది. బలహీనతలు(-): ప్రజలతో అంతగా సంబంధాలు లేవనే ప్రచారం ఉండడం మైనస్‌గా చెపొచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున్నా అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొనక పోవడం క్యాడర్‌ను నిరాశపరుస్తోంది. సి.అశోక్‌కుమార్ - టీఆర్ఎస్ ప్రచార సరళి: పార్టీలోకి ఆరునెలల ముందు వచ్చిన అశోక్‌కుమార్ మొదటి నుంచే టీఆర్ఎస్ పార్టీ ప్రథకాలను వివరిస్తూ ప్రచారం ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి గడపగడపకు తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తల సహకారం తీసుకుంటున్నారు. బలాలు(+): స్థానికంగా ఉండడం, తాత వెంకన్న పోలీస్ పటేల్‌గా పని చేసి మంచి పేరు కలిగి ఉండడం కలిసొచ్చే అంశం. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సహాయ సహకారాలు ఉండడం ప్లస్‌గా చెప్పొచ్చు. బలహీనతలు(-): కొత్తగా పార్టీలోకి వచ్చిన అశోక్‌కుమార్‌కు అధిష్టానం టికెట్ ఇవ్వడంతో సీనియర్ నాయకుల్లో అసంతృప్తి. రాజకీయ అనుభవం లేకపోవడం, నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతరావు సహకారం లేకపోవడం, ప్రజా సమస్యలు అంతగా తెలవకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. -
సెంటిమెంట్ కాదు... డెవలప్మెంట్
నాయిని నర్సింహారెడ్డి.. సామ్యవాదాన్ని ఎంచుకున్న సొక్కం తెలంగాణ వాది. ముక్కుసూటి తనం, మాయామర్మం లేని భోళాతనం ఆయనకు ఆభరణం. నగర రాజకీయాలతో ఆయనది ఐదు దశాబ్దాల విడదీయలేని అనుబంధం. టి.అంజయ్య, సంజీవరెడ్డి లాంటి ఉద్దండుల్ని మట్టి కరిపించి చట్టసభలకు ఎన్నికైన నాయిని ప్రస్తుతం టీ క్యాబినెట్లో హోంమంత్రిగా, నగర ఇన్చార్జి మంత్రిగా... నగర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. ఏడుపదులు దాటిన వయసులోనూ గల్లీ గల్లీ తిరుగుతూ అభివృద్ధి చేసే పార్టీనే గెలిపించమని కోరుతున్నారు. ప్రస్తుతం తాము సెంటిమెంట్ కాకుండా..డెవలప్మెంట్ నినాదంతో ముందుకు వెళుతున్నామని, చెప్పిన మాటను నెరవేర్చకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓట్లే అడగమని తేల్చి చెబుతున్న నాయినితో... సాక్షి ఇంటర్వ్యూ - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ ... ఇప్పుడు ఇదే మా నినాదం * విశ్వ నగర ఆవిష్కరణే సీఎం ఏకైక లక్ష్యం * అన్ని విధాలుగా అర్హులకే టికెట్లు ఇచ్చాం * 100కు పైగా సీట్లు సాధిస్తాం * టీడీపీ, బీజేపీతోనే మా పోటీ.. * హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలువబోతున్నారా.. ఎలా సాధ్యం? అవును..ఢంకా భజాయించి చెబుతున్నా.. 100 స్థానాల్లో గెలువబోతున్నాం. నేను 1962 నుండి నగర రాజకీయాల్లో ఉన్నా.. ఏ ప్రభుత్వం ఇంతగా ప్రభావితం చేసిన సందర్భాలు లేవు. సీఎంగా కేసీఆర్ ఉద్యమ సమయంలో తన దృష్టికి వచ్చిన అనుభవాలను ప్రత్యేక పథకాలుగా మార్చి జనంలోకి తీసుకువెళుతున్నారు. కేసీఆర్ చెప్పింది.. వాస్తవమేనని -అవన్నీ అమలు సాధ్యమేనని ప్రజలు నేడు విశ్వసిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేసి చూపిస్తున్నాం. ముఖ్యంగా వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500, గూడులేని వాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు, వచ్చే మూడేళ్లలో 24 గంటల మంచినీటి సరఫరా, నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ, వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యం, అన్ని మతాలు, కులాలకు గౌరవం ఇచ్చాం. దీంతో నగర ప్రజలంతా ఈ ఎన్నికల్లో పార్టీ రహితంగా టీఆర్ఎస్ కు ఓటేయాలని నిర్ణయించారు. అందుకే 100పైగా స్థానాల్లో గెలువబోతున్నాం. అభ్యర్థుల ఎంపికలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, ఫిరాయింపుదారులకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి కదా..! అందులో వాస్తవం లేదు. టీ ఉద్యమంలో ఉన్న వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నం. అర్హులైన ఉద్యమకారులందరికీ సీట్లు ఇచ్చాం. ముఖ్యంగా సర్వేల ఆధారంగా అన్ని కులాలు, మతాలను సమతూకం చేస్తూ టికెట్లు ఇచ్చాం. ఒకటి అరా చోట్ల కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇవ్వక తప్పలేదు. అక్కడి స్థానిక పరిస్థితుల మేరకు సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఓ పద్ధతి ప్రకారం ఎంపిక చేశాం. ఎవరైనా ఉద్యమకారులకు న్యాయం జరగకపోతే వారి సేవలను వేరే రూపంలో వాడుకుంటాం. ప్రచార తీరు ఎలా ఉంది.. మంత్రులంతా పాల్గొంటున్నారు.. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? అవును మేం చేసింది..చేయబోయే కార్యక్రమాల గురించి మరింత వివరంగా ప్రజలకు వివరించేందుకు మంత్రులు ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల సమస్యలను స్వయంగా మంత్రులే పరిశీలిస్తున్నారు. ఎన్నికల అనంతరం వారే వాటి పరిష్కారానికి చొరవ చూపనున్నారు. ప్రచారంలో మా స్పీడును ఎవరూ అందుకోలేరు. మా అభ్యర్థులను గెలిపించాలని కాలనీలు, బస్తీలు ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మా ప్రధాన ప్రత్యర్థి టీడీపీ-బీజేపీ కూటమికి మెజారిటీ చోట్ల డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సీమాంధ్రులు ఎవరి వైపున్నారు.. కేటీఆర్ క్షమాపణతో వారంతా శాంతించినట్టేనా? మేమెప్పుడూ వ్యక్తులకు వ్యతిరేకంగా పోలేదు. ఉద్యమ సమయంలో కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించలేదు. పొట్టకూటికోసం వచ్చిన వారితో కాదు.. పొట్టగొట్టేవారితోనే మా పోరాటం అని చెప్పినం. సీమాంధ్ర రాజకీయనాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవపట్టించారు. ఇప్పుడు అంతా హైదరాబాదీలే. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల సీమాంధ్రకు చెందిన వివిధ కులాల వారికి టికెట్లు ఇచ్చాం. వారంతా మా వెంటే ఉన్నారు. చంద్రబాబు జీహెచ్ఎంసీ ఎన్నికలను అంతగా సీరియస్‌గా తీసుకోకపోవడానికి ఓటుకు నోటు కేసే కారణమని వస్తున్న వార్తలపై మీరేమంటారు..? ఈ కేసును ఏసీబీ పర్యవేక్షిస్తుంది. ఎప్పుడు ఏం, ఎలా చేయాలో వారే నిర్ణయిస్తారు. అంతకు మించి ఏమీ వ్యాఖ్యానించలేను. దళిత విద్యార్థి రోహిత్ ఘటనకు బాధ్యత ఎవరిది. మీ సర్కార్ తరపున కనీస స్పందన కూడా లేదు..ఎందుకని? ఈ విషయంలో మేం ఎంత వరకు వ్యవహరించాలో అలానే వ్యవహరిస్తున్నాం. అది కేంద్ర పరిధిలోని యూనివర్సిటీ కావటంతో మా ప్రమేయం తక్కువ ఉంటేనే మంచిదనుకున్నాం. రోహిత్ మరణం మాకు బాధాకరమే. ఘటన జరిగిన రోజే మా ఎంపీ కవిత స్పందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఇక రోహిత్ కులానికి సంబంధించిన వివాదం వస్తోంది. ఏది ఎలా ఉన్నా, నిజానిజాలు తెలియకుండా ప్రభుత్వాలు స్పందించటం సరికాదేమోనని మేము భావించాం. 19 నెలల కాలంలో నగరానికి మీరు ప్రత్యేకంగా చేసిందేమిటి.. గత ప్రభుత్వాలు ప్రారంభించినవి కాకుండా.. అరవై ఏళ్ల విముక్తి తర్వాత ‘మన నగరం - మన ప్రజలు - మన పాలన కోసం’ సీఎం ప్రత్యేక ప్రణాళికలు రచించారు. వాటికి అనుగుణంగా ఆయన 30 ఏళ్ల ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. మంచినీళ్లు, రహదారులు, ప్రజాభద్రత, డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ, సంక్షేమం, క్లీన్ హైదరాబాద్, అవినీతి లేని పాలనలు మా ప్రాధాన్యతలు. ఆ దిశగా వచ్చే రెండేళ్లలో నగరంతో పాటు శివారు ప్రాంతాలకు నిరంతరం కృష్ణా, గోదావరి మంచినీళ్లవ్వనున్నాం. రాచకొండ, శామీర్పేటల్లో 60 టీఎంసీల నీటి నిల్వ ఉండే రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. నగరంలో నూతన మంచినీటి పైప్లైన్లు, డ్రైనేజీ, వరద నీటి కాల్వలకు కొత్త రూపు ఇవ్వబోతున్నాం. సుమారు 20 వేల కోట్లతో సిగ్నల్ ఫ్రీ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పోలీస్ శాఖను అన్ని విధాలుగా పటిష్టం చేసి నేర నివారణ, నియంత్రణకు ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మహిళల భద్రత కోసం ‘షీ’ టీం ఏర్పాటు చేశాం. అన్నింటికంటే ముఖ్యమైనది కనురెప్పపాటు కూడా కోతల్లేని విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ఇవన్నీ మా సీఎం కేసీఆర్ హృదయం నుండి వచ్చినవే. -
పోరు కత్తులా... పూల గుత్తులా...
-
పోరు కత్తులా... పూల గుత్తులా...
ఎన్నికల బరిలోకి నేటి నుంచి ఇద్దరు సీఎంలు వేడెక్కనున్న గ్రేటర్ ఎన్నికల పోరు ‘మీట్ ది ప్రెస్’ ద్వారా ప్రజల్లోకి సీఎం కేసీఆర్ నేడు, రేపు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ‘ఓటుకు కోట్లు’లో నాటి విమర్శలకు కట్టుబడతారా? రాజకీయ అవసరాల కోసం రాజీపడ్డారన్న జనం అభిప్రాయానికి బలం చేకూరుస్తారా? ఆసక్తి రేపుతున్న ముఖ్యమంత్రుల ప్రచారం 30న పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ సాక్షి, హైదరాబాద్: బల్దియా బరి వేడెక్కబోతోంది.. ఇద్దరు చంద్రులు రంగంలోకి దిగనున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ‘గ్రేటర్’ ఫైట్‌కు కదలనున్నారు. ఒక నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇద్దరు సీఎంలు ప్రచారానికి తరలిరానుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ‘ఓటుకు కోట్లు’ కేసు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఇద్దరు సీఎంలు ఇప్పుడేం మాట్లాడతారు? ఇద్దరి మధ్య మళ్లీ మాటల తూటాలు పేలుతాయా? ఒకరిపై ఒకరు కాలు దువ్వుతారా? లేక పైపై విమర్శలతో సరిపెడతారా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే!! నాడు కత్తులు.. మరి నేడు? గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ టీడీపీ అడ్డంగా దొరికింది. స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ చంద్రబాబు స్వయంగా మాట్లాడిన ఆడియో టేపులు బయటపడడంతో వివాదం తారస్థాయికి చేరింది. ‘నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.. నగ్నంగా పట్టపగలే దొరికిన దొంగవు నువ్వు.. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది..’ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. అటు ఏపీలో కేసీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది.‘ఖబడ్దార్.. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం మీకెవరిచ్చారు.. నాకూ ఏసీబీ ఉంది.. వాళ్లూ హైదరాబాద్‌లోనే ఉన్నారు’ అంటూ బాబు మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో ఇక చంద్రబాబు రాజీనామా చేయకతప్పదేమోనని అంతా భావించారు. అటు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కూడా ఇరుక్కున్నారని అనుకున్నారు. ఇంతలో వారిమధ్య ‘స్నేహం’ చిగురించింది. అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఇరువురు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. బాబు ఆహ్వానం మేరకు కేసీఆర్ అమరావతి వెళ్లొచ్చారు. అనంతరం అయుత చండీమహాయాగానికి రావాల్సిందిగా కేసీఆర్ కూడా బాబు నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడంతో కేసుల కథ కంచి చేరింది. ఇద్దరు నేతలు రాజీ పడ్డారని, అందుకే ఓటుకు కోట్లు కేసు, ట్యాపింగ్ కేసు అటకెక్కాయన్న అభిప్రాయం కూడా జనంలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ మళ్లీ పాత కేసులను ప్రస్తావిస్తూ పరస్పర విమర్శలకు దిగుతారా లేదా అభివృద్ధి నినాదానికే పరిమితమై లాలూచీ కుస్తీకి దిగుతారా? అన్న ఆసక్తి నెలకొంది. పైపై విమర్శలకే పరిమితమైతే తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఇరువురు నేతలు పక్కా ఆధారాలు లభించిన ఇంతటి కీలకమైన కేసులను పక్కనపెట్టారన్న అభిప్రాయానికి మరింత బలం చేకూరినట్టవుతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. లాలూచీ పడడం వల్లే ఏపీ సచివాలయం, అధికార యంత్రాంగాన్ని హుటాహుటిన అమరావతికి తరలించేందుకు బాబు యత్నిస్తున్నారని, అలాగే తెలంగాణలో కేవలం టీడీపీ కేడర్‌ను సంతృప్తి పరిచేందుకే గ్రేటర్లో పోటీకి దిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుందని వారు చెబుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఏమంటారు? హైదరాబాద్ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, హైటెక్ సిటీ నిర్మాణం తన గొప్పేనని ఇప్పటికే పలుమార్లు ఏపీ సీఎం చెప్పుకోవడాన్ని కేసీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన హామీగా ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్.. ఏపీ సీఎంకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అన్న అంశంపై చర్చ జరుగుతోంది. అటు టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో న లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. తమ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకుంటూ నగరంలో పార్టీ ఉనికే లేకుండా ప్రణాళికలు రచిస్తున్న టీఆర్ఎస్పై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న అంశం కూడా ఆసక్తిగా మారింది. మొత్తంగా ఇప్పుడు గ్రేటర్ ప్రచారంలో ‘ఇద్దరు చంద్రులు’ ఎలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తారన్న దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇదీ నేతల ప్రచార షెడ్యూల్.. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ప్రచార షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ గురువారం ‘మీట్ ది ప్రెస్ ’ ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. 30వ తేదీ (శనివారం)న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. చంద్రబాబు గురుువారం మధ్యాహ్నం 2.30కు మెదక్ జిల్లా పటాన్చెరు బస్టాండ్‌లో బహిరంగ సభ ద్వారా ప్రచారం మొదలుపెట్టనున్నారు. అక్కడ్నుంచి రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్ సర్కిల్, చందానగర్, కూకట్పల్లి, బాలానగర్ క్రాస్‌రోడ్స్, ఎర్రగడ్డ ఫ్లైఓవర్, కృష్ణకాంత్ పార్క్, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్, హైటెక్‌సిటీ, శిల్పారామం వరకు రోడ్‌షో సాగనుంది. రాత్రి 9 గంటల వరకు సాగే ఈ ప్రచారం పూర్తిగా శివార్లు, సీమాంధ్ర ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలకే పరిమితం కావడం గమనార్హం. 2014 ఏప్రిల్ సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లకే పరిమితం కాగా.. వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు విడతల వారీగా టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల కిక్కు!
15 రోజుల్లో రూ.247 కోట్ల మద్యం అమ్మకాలు మరో మూడు రోజుల్లో భారీగా పెరిగే అవకాశం అక్రమ అమ్మకాలపై ఆబ్కారీ శాఖ నిఘా సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అదే తరహాలో మద్యం అమ్మకాలూ పెరిగాయి. ‘మూడు ఫుల్లు.. ఆరు క్వార్టర్లు’ అన్న చందంగా సిటీలో లిక్కర్ సేల్స్ జోరందుకున్నాయి. ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి 15 రోజుల్లో సుమారు రూ.247 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. ఇక మరో నాలుగు రోజుల్లో అమ్మకాలు మరింత ఊపందుకోనున్నట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలక్షన్ జోష్‌లో సిటీలోని వైన్స్, బార్లు, రెస్టారెంట్లకు గిరాకీ అమాంతంగా పెరిగింది. మందు.. చిందు ఓట్ల కోసం కోటి తిప్పలు పడుతున్న అభ్యర్థులు.. మందు కోసం మంచినీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ప్రచార పర్వంలో చుక్క లేనిదే జోష్ రాదని భావిస్తున్న అభ్యర్థులు.. మందును ‘ఫుల్లు’ కొనుగోలు చేసి కార్యకర్తలను ఖుషీ చేస్తున్నారు. 15 రోజుల్లో ఐఎంఎల్ మద్యం ఐదు లక్షల లీటర్లు, నాలుగు లక్షల లీటర్ల బీరు తాగేశారు మందుబాబులు. చలికాలం కావడంతో ఐఎంఎల్ మద్యానికే మందుబాబులు ఓటేస్తున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమ్మకాల్లో మరింత వృద్ధి ఖాయమని వ్యాపారులు, ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రోజు వారీగా గ్రేటర్లో సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు రూ.15 కోట్లకు పైగానే జరుగుతున్నట్లు అంచనా. రానున్న మూడు రోజుల్లో రోజు వారీ అమ్మకాలు రూ.25 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ మద్యంపై నజర్ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నకిలీ మద్యం, చీప్ లిక్కర్ దిగుమతి అయ్యే అవకాశముంది. దీనిపై ఆబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు గుడంబా అడ్డాలపై నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అక్రమ మద్యం విక్రయించే అవకాశమున్న ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మోత.. రోత ఎన్నికల ఎస్సెమ్మెస్‌లతో సిటీజనుల ఫోన్లు మోత మోగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని అభ్యర్థులు బల్క్ ఎస్సెమ్మెస్‌లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్ఎస్) కాల్స్‌ను తెగ వినియోగించుకుంటున్నారు. ఈ న్యూసెన్స్‌తో సిటీజనులు విసిగిపోతున్నారు. మరో పక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి రోమింగ్‌తో ఆర్థికంగానూ భారం పడుతోంది. మొన్నటి వరకు ‘మీ డివిజన్లో మా పార్టీ తరఫున ఏ అభ్యర్థిని బలపరుస్తారం’టూ ఎస్సెమ్మెస్‌ల పర్వం కొనసాగించిన పార్టీలు.. ఇప్పుడు ‘మా పార్టీకే ఓటేయండి’ అంటూ అభ్యర్థిస్తున్నాయి. ఓ పక్క ఎస్సెమ్మెస్‌లు.. మరోపక్క కాల్స్‌తో సిటీజనులు తలలు పట్టుకుంటున్నారు. కొందరికి వారి డివిజన్ పరిధి అభ్యర్థులవే వస్తుండగా.. మరికొందరికి సంబంధం లేని డివిజన్ల అభ్యర్థుల నుంచీ వస్తున్నాయి. రోమింగ్‌లో ఉన్న వారికి కాల్స్‌తో ఆర్థిక భారం తప్పట్లేదు. -
పగలూ తనిఖీలు!
ప్రారంభించిన జంట కమిషనరేట్లు లో-క్లాస్ లాడ్జీలపై ప్రధాన దృష్టి పోలింగ్ ఏజెంట్ల వివరాలపై ఆరా రౌడీషీటర్లపై నిఘా ముమ్మరం సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జంట కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమవుతున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తనిఖీల విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాత్రి వేళల్లో మాత్రమే సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఇకపై పగటి పూట కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, ఎస్ఓటీ బలగాలు ఇప్పటికే వీటిని ప్రారంభించాయి. రానున్న రోజుల్లో ఇతర బృందాలు కూడా ఈ సోదాలు నిర్వహించనున్నాయి. నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రాత్రి పూట లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించేవారు. ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక శక్తులు, ఇతర ప్రాంతాల నుంచి ‘ప్రత్యేక పనుల’పై వచ్చే వారు వీటిలో తలదాచుకుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ విధానాన్ని తెరపైకి తెచ్చారు. సాధారణంగా పొరుగు జిల్లాల నుంచి ‘ఎన్నికల’ కోసం వచ్చే వాళ్లు లో-క్లాస్ లాడ్జీల్లో బస చేసేందుకే మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో పోలీసులు వీటిపై ప్రధానంగా దృష్టి సారించారు. తరచూ ఆకస్మిక తనిఖీలు చే యాలని నిర్ణయించారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా... హైదరాబాద్‌కు ఇతర జిల్లాల నుంచి అనేక మంది వస్తుంటారు. విద్యా, వైద్య, వ్యాపార పనులతో పాటు విహారం కోసం వచ్చే వారు లాడ్జీలనే ఆశ్రయిస్తుంటారు. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకున్న అధికారులు తమ తనిఖీల వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోదాల నేపథ్యంలో ప్రజలతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, వృద్ధులతో పాటు కుటుంబ సమేతంగా ఉండే వారితో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏజెంట్లు, రౌడీషీటర్లపై డేగకన్ను ధన, బల ప్రయోగాలతో ఓటర్లను ప్రభావితం చేయగలిగే వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడానికి కొందరు అభ్యర్థులు పథకం వేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ఏజెంట్లపై డేగకన్ను వేశారు. వారి వివరాలు ఆరా తీయాలని నిర్ణయించారు. అభ్యర్థి తన తరఫున ప్రతి పోలింగ్ బూత్‌లో ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. అయితే నేర చరితులను ఏజెంట్‌గా నియమించకూడదనే నిబంధన ప్రస్తుతం అమలులో లేకపోవడంతో.. అసాంఘిక శక్తుల్ని తమ ఏజెంట్‌గా పెట్టుకునే అవకాశం అభ్యర్థులకు లాభిస్తోంది. నేరచరితులు ఏజెంట్లుగా ఉండటం వల్ల ఓటర్లు భయభ్రాంతులకు లోనై ప్రభావితులయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఏజెంట్ల వివరాలు కూపీ లాగుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇక రౌడీ షీటర్లు తమ హవా చూపడం ప్రారంభిస్తారు. కొన్ని పార్టీల తరఫున రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేసే అవకాశం ఉంది. ఈసారి చాలా మంది రౌడీషీటర్లు పీడీ యాక్ట్ కింద జైల్లోనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు ఈ కోణంలో ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు వారితో పాటు వారి అనుచరుల కదలికలపై నిఘా వేశారు. ఓ పక్క బైండోవర్ కాని వారి కోసం గాలిస్తూనే.. మరోపక్క బైండోవర్ అయిన వారి వ్యవహారాలు అనునిత్యం ఆరా తీస్తున్నారు. -
తెలంగాణ తెచ్చింది.. ఇచ్చింది మేమే
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాలానగర్: ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చింది మేమే.. ఇచ్చింది మేమే’నని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం కూకట్పల్లి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు. బాలానగర్, ఫతేనగర్ అభ్యర్థులు భండారి ప్రకాష్‌గౌడ్, కె.రాజు ముదిరాజ్‌ల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ పాలనలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ఆ రోజు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకపోతే అది కలగానే మిగిలేదన్నారు. సోనియాగాంధీ ధైర్యం చేసి ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే.. తమవల్లే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని టీఆర్ఎస్ చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికలతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందన్నారు. టీఆర్ఎస్, టీడీపీలకు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని విమర్శించారు. ప్రజలు ఆలోచించి ఉన్నతమైన నాయకులకే పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి నగరాభివృద్ధికి బాటలు వేయాలన్నారు. -
అదృశ్యం కాదిక!
♦ ఎన్నికల కార్యకలాపాలపై పోలీసుల డేగ కన్ను ♦ కీలక ఘట్టాలన్నీ వీడియో రికార్డింగ్ ♦ ‘ఫీడ్’తో పక్కా ఆధారాల సేకరణ ♦ ఉల్లంఘనులపై చర్యలకు ఉపయుక్తంగా పోలీసుల ప్రణాళిక ప్రతి దృశ్యం నిక్షిప్తం. కాదిక అ‘దృశ్యం’. ఎన్నికల కార్యకలాపాల్లోని ప్రతి ఘట్టాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. జీపీఎస్, సర్వైలెన్స్ కెమెరాలతో కమాండ్ అండ్ కంట్రోల్ రూం అభ్యర్థులను అనునిత్యం ‘వాచ్’ చేస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే ఊచలు లెక్కింపజేసేందుకు పక్కా ఆధారాలు సేకరిస్తోంది. - సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జంట కమిషనరేట్ల పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్, అటు సైబరాబాద్ పోలీసులు ఈ కోణంలోనే దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా హైటెక్ పద్ధతిలో జీపీఎస్, సర్వైలెన్స్ కెమెరాలతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ కెమెరాలనూ అద్దెకు తీసుకోవాలని నిర్ణరుుంచారు. పాతబస్తీతో పాటు కొన్ని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క స్పెషల్ బ్రాంచ్‌లకు చెందిన సిబ్బంది సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి, నివేదికలు తయూరు చేస్తున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసిన యంత్రాంగం పక్కా రక్షణ చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. వీటిలో భాగంగా అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వీటిలో పోలింగ్ పూర్తయ్యే వరకు అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఘట్టమూ రికార్డు.. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) వాహనాలను విసృ్తతంగా వినియోగించాలని నిర్ణరుుంచారు. మరోపక్క ప్రస్తుతం పోలీసు, కమ్యూనిటీల అధీనంలో ఉన్న సర్వైలెన్స్ కెమెరాలు వినియోగించి కార్యకర్తలు, అభ్యర్థుల కదలికలను గమనించడానికి సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. దీనిని ప్రధాన కమిషరేట్లలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లలో రికార్డు చేస్తున్నారు. ప్రచార సరళి ప్రభావం ట్రాఫిక్‌పై పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. జంట కమిషనరేట్లలోని శాంతి భద్రతల, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలోని డిజిటల్, వీడియో కెమెరాలు కొన్ని అందుబాటులో ఉన్నారుు. వీటిని వినియోగించి ఎన్నికల్లోని ప్రతి ఘట్టాన్ని రికార్డు చేయూలని నిర్ణరుుంచారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారం మొదలుకొని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దృశ్యాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. ఏ దశలోనూ ఉల్లంఘనలకు తావు లేకుండా, అలాంటి వాటికి పాల్పడిన వారిని గుర్తించడం, చర్యలు తీసుకోవడానికి ఆధారాలుగా వినియోగించడం కోసం ఈ ఫీడ్‌ను వాడనున్నారు. ‘ముద్ర’లుండాల్సిందే.. ఈసీ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్న పోలీసులు ప్రింటింగ్ ప్రెస్‌లపైనా దృష్టి పెట్టారు. జోన్లు, డివిజన్ల వారీగా ఆయా ప్రెస్‌ల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల ముద్రణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దృష్టి పెట్టాల్సిన అంశాలను వారికి వివరిస్తున్నారు. ముద్రించే ప్రతి దానిపైనా ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ పేరు, ఏ పార్టీ/అభ్యర్థి కోసం ముద్రిస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పక ముద్రించాలని స్పష్టం చే శారు. ప్రతి ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఓ రికార్డు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయూలన్నారు. వీటిని ఉల్లంఘించే ప్రింటింగ్ ప్రెస్ యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ‘హద్దులు’ తేలుస్తున్న ఎలక్షన్ సెల్... జంట కమిషనరేట్లలో పనిచేస్తున్న ప్రత్యేక ఎలక్షన్ సెల్‌కు ఇప్పుడు ఓ చిక్కు వచ్చి పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతల సమస్యలకు తావు లేకుండా అన్ని పోలింగ్ బూత్‌ల్లో బందోబస్తు ఏర్పాటు చేయడానికి ఇది కసరత్తు చేస్తోంది. అరుుతే వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్ బూత్‌లతోనే ఇప్పుడు సమస్య. ఇవి తమ పరిధిలోకి రావంటే తమ పరిధిలోకి రావంటూ ఎవరికి వారు చేతులు దులుపుకుంటున్నారు. సమస్యాత్మక బూత్‌లు ఉన్న చోట్ల ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ సెల్ జోన్ల వారీగా పోలీసుస్టేషన్ల పరిధులు, వాటిలో ఉన్న పోలింగ్ బూత్‌లను గుర్తించే పనిలో పడింది. దీని కోసం పోలీసు అధికారులను పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్ బూత్‌లకు పంపిస్తూ అవి ఏ స్టేషన్ కిందికి వస్తాయో తేలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాతే పూర్తిస్థారుు బందోబస్తు స్కీమ్‌లు రూపొందించనున్నారు. -
గ్రేటర్ షో
మా హయాంలోనే అభివృద్ధి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆల్విన్‌కాలనీ: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కూకట్పల్లి, వివేకానందనగర్, ఆల్విన్‌కాలనీ, గౌలిపురా డివిజన్లలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే టీఆర్ఎస్ నాయకులు వారు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలు చేసేవారికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కూకట్పల్లి డివిజన్ అభ్యర్థి కూన అమ్రేష్గౌడ్, వివేకానందనగర్ డివిజన్ అభ్యర్థి విద్యాకల్పన, ఆల్విన్‌కాలనీ అభ్యర్థి నర్సింహా యాదవ్‌లను గెలిపించాలని కోరారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, రవికుమార్ పాల్గొన్నారు. అభివృద్ధిలో సగం వాటా మాదే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చంపాపేట: టీఆర్ఎస్ చేసిన నగరాభివృద్ధిలో సగం వాటా తమకే దక్కుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా సగం ఉందని పేర్కొన్నారు. చంపాపేట చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. 2020 నాటికి అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. భాగ్యనగర అభివృద్ధికి మజ్లిస్ అరాచక శక్తులు అడ్డుతగులుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు, దానికి మద్దతిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇతర పార్టీల ప్రగల్భాలు, ప్రచార ఆర్భాటాలకు లొంగకుండా స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న చంపాపేట బీజేపీ అభ్యర్థి వంగా మధుసూధన్రెడ్డికే ఓటేయాలని కోరారు. భాగ్యనగర అభివృద్ధికి మజ్లిస్ అరాచక శక్తులు అడ్డుతగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు, వారికి మద్దతిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి అభివృద్ధి చేశాం.. ఇంకా చేస్తాం మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్జోన్ బృందం: టీఆర్ఎస్ ప్రభుత్వం 18 నెలల్లోనే నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, ఎన్నో విదేశీ పెట్టుబడులను తెచ్చిందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్లో అధికారం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. నాగోలు, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ, గడ్డిఅన్నారం డివిజన్లలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. నగరాభివృద్ధికి తమకు ఒక్క అవకాశమివ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పడి ఏడాది కాకుండానే విద్యుత్ కోతలు లేకుండా చేశామని, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పేదలందరికీ ఇళ్లు హైదరాబాద్‌లోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, ఈ ఏడాది 10 వేలు, 2017లో 25వేలు, 2018లో 50వేల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే సెటిలర్స్‌పై దాడులు చేస్తారని అప్పటి ప్రభుత్వ పెద్దలు, సమైక్య పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. 18 నెలల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టడం కాదు కదా.. కనీసం గిల్లిన సందర్భాలు కూడా లేవన్నారు. సీమాంధ్రులు ఆలోచించి ఓటేయాలి.. బీఎన్‌రెడ్డి నగర్ కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య, సచివాలయనగర్లోని భూమి సమస్యలు పరిష్కారం కావాలంటే అధికార పార్టీకే ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వనస్థలిపురం రైతుబజార్ వద్ద ఆయన మాట్లాడుతూ సీమాంధ్రులు ఆలోచించి ఓటేయాలని కోరారు. సీమాంధ్రులంతా తెలంగాణ వాదులేనని పేర్కొన్నారు. విడిపోవడం వల్ల రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకూ 85వేల పట్టాలిచ్చామని, వనస్థలిపురం రైతుబజార్ వద్ద గుడిసెవాసులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని, ఆటోనగర్ ఇసుక లారీల అడ్డాను తొలగిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచామని, కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’లా మారిందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి దోహదం చేస్తాయన్నారు. ప్రచారంలో మంత్రి జగదీష్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఇంచార్జి రాంమోహన్‌గౌడ్, నాగోలు, కొత్తపేట, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ డివిజన్ల అభ్యర్థులు చెరుకు సంగీత, జీ.వి.సాగర్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీప్రసన్న, పద్మానాయక్, సామ రమణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. సెటిలర్స్‌పై దాడులు చేస్తామని సమైక్యవాదులు తప్పుడు ప్రచారం చేశారు. 18 నెలల కాలంలో కొట్టడం కాదు కదా.. కనీసం గిల్లిన సందర్భాలు కూడా లేవు నగరాభివృద్ధి తాత, నాన్న చలవే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది మా తాత, నాన్నలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ సర్కిల్లోని డివిజన్లలో ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు. కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, ఐడీపీఎల్ చౌరస్తాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు. సైకిల్ జోరందుకుందని.. టీఆర్‌ఎ్‌స్ కారు టైరు పంక్చర్ అయిందని ఎద్దేవా చేశారు. మేయర్ పీఠాన్ని తామే దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాయమాటలతో 70 ఎం.ఎం. సినిమా చూపిస్తున్నారని, సీఎం అయ్యాక 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, టీడీపీ అభ్యర్థులు గడ్డం స్వాతికా రెడ్డి, బొడ్డు కామేశ్వరి, మన్నెరాజు, మెటె శ్రీనివాస్, కొట్టె రాధిక, సుజాతలు పాల్గొన్నారు. అధికారమిస్తే మరింత అభివృద్ధి... టీడీపీ, బీజేపీకి పట్టం కడితే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని లోకేష్ అన్నారు. మల్కాజిగిరి సర్కిల్లోని ఆరు డివిజన్లలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ‘గూగుల్‌లో హైదరాబాద్‌ను వెతికితే కనిపించే చార్మినార్, బుద్ధుడు, హైటెక్ సిటీల్లో.. రెండింటిని టీడీపీనే ఏర్పాటు చేసింద’ని లోకేష్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు మాట్లాడితే 400 ఏళ్ల చరిత్ర అంటున్నారని, కానీ 40 ఏళ్ల చరిత్ర తిరిగేస్తే టీడీపీ అభివృద్ధి తెలుస్తుందన్నారు. కేసీఆర్‌కు ముఖం చెల్లక కేటీఆర్‌ను ప్రచారానికి పంపించారని విమర్శించారు. తెలంగాణకు తక్కువ ఇల్లు కేటాయిస్తే చంద్రబాబునాయుడు ప్రధానితో మాట్లాడి 50 వేల ఇల్లు మంజూరు చేయించారని పేర్కొన్నారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. 100 సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరి మాటమార్చారని విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కేటీఆర్ రాజీనామా చేయించి.. ఆయన వారిని తిరిగి గెలిపించుకుంటే, తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. టీడీపీ, బీజేపీ కూటమితోనే నగరాభివృద్ధి జరిగిందని ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావులు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులు మండలి విజయ్‌కుమార్ యాదవ్(మల్కాజిగిరి), శ్యామల (గౌతంనగర్), పిట్టల రేణుక(వినాయకనగర్), బీజేపీ అభ్యర్థులు బాబూసింగ్(ఈస్ట్ ఆనంద్‌బాగ్), సునీత(మౌలాలి), ప్రసన్న నాయుడు(నేరెడ్మెట్)లను లోకేష్ పరిచయం చేశారు. ప్రచారంలో సీతక్క, మండలి రాధాకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. హైదరాబాద్‌ను గూగుల్‌లో వెతికితే కనిపించే చార్మినార్, బుద్ధుడు, హైటెక్ సిటీల్లో రెండింటిని టీడీపీనే ఏర్పాటు చేసింది -
'స్టేట్ ఫైటే కానీ.. స్ర్టీట్ ఫైట్ కాదు'
హైదరాబాద్: ఎన్నికల కోసం మాట మార్చే నైజం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది కాదని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ కొంతమంది నాయకులు రాజకీయ విలువలను పడగొడుతున్నారని విమర్శించారు. అయ్యప్ప సొసైటీ భూముల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించామని ఆయన తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు స్టేట్ ఫైటే కానీ.. స్ర్టీట్ ఫైట్ కాదని కేటీఆర్ వెల్లడించారు. -
టీఆర్ఎస్కు ఎర్రబెల్లి సవాల్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని తెలంగాణ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. సోమవారం కూకట్పల్లి వివేకానంద నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ టీడీపీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరందరూ టీఆర్ఎస్ అభ్యర్థులుగా మళ్లీ పోటీచేయాలని, 6 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. -
రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2వ తేదీన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
రేవంత్ ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
-
చైతన్యపురిలో రూ.12.40 లక్షల స్వాధీనం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.12.40 లక్షల నగదు పట్టుబడింది. ఈ మేరకు కారును సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
‘సంపన్నుల హృదయం’లో స్థానమెవరికో?
♦ బంజారాహిల్స్ బరిలో పోటీ రసవత్తరం ♦ విజయం కోసం ప్రధాన పార్టీల హోరాహోరి ♦ ముఖ్య నేతల వారసులతో హీటెక్కిన పోరు మొత్తం ఓట్లు 48,450 పురుషులు 26,279 మహిళలు 22,162 ఇతరులు 9 గ్రేటర్ ఎన్నికల పర్వం మాంచి రసపట్టులో ఉంది. ప్రచారానికి సరిగ్గా వారం రోజుల వ్యవధి మిగిలింది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గల్లీ గల్లీ..ఇల్లిల్లూ తిరుగుతూ ఎవరికి వారు గెలుపు వ్యూహాలతో సాగుతున్నారు. ఇక ప్రతి పార్టీలోనూ మేయర్ అభ్యర్థులు అంటూ కొందరు నేతలు ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఈ నేపథ్యంలో హాట్ సీట్‌గా మారిన ‘మేయర్ అభ్యర్థుల’ డివిజన్లలో ప్రస్తుత పరిస్థితి, నేతల బలాబలాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రభావిత బస్తీలు, గెలుపు అవకాశాలపై ‘సాక్షి’ ఫోకస్.. హాట్‌సీట్... సాక్షి, సిటీబ్యూరో సకల సంపన్నులు, భిన్న సామాజికవర్గాలు, విభిన్నమైన వృత్తుల వారితో నిరంతరం కళకళలాడే బంజారాహిల్స్‌లో ప్రస్తుతం ఏ కాలనీ, బస్తీ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం నుంచి గెలిచేందుకు మూడు ప్రధాన పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి. ఒకరిని మించి మరొకరు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో పాదయాత్రలు, ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మురం చేశారు. ఈ డివిజన్లో మొత్తం పదకొండు మంది పోటీలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీ అభ్యర్థుల మధ్యే నెలకొంది. పోటీ చేస్తున్న వారిలో ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మీ (టీఆర్ఎస్), మాజీ మంత్రి మేచినేని కిషన్‌రావు కుమారుడు శ్రీనివాసరావు(బీజేపీ), మాజీ కార్పోరేటర్ రాజు యాదవ్(కాంగ్రెస్) ఉన్నారు. నగర్లే.. గెలుపోటముల నిర్ణేతలు బంజారాహిల్స్ డివిజన్లో రోడ్ 12, 13లలోని ఎమ్మెల్యే కాలనీ, మినిస్టర్ క్వార్టర్స్, మిథిలా, దుర్గానగర్లు, గ్రీన్ బంజారా కాలనీలతో పాటు ఎన్బీటీనగర్, ఎన్బీనగర్, ఖాజానగర్, ప్రేమ్‌నగర్, బోలానగర్, ఇబ్రహీంనగర్, అంబేద్కర్‌నగర్, ఉదయ్‌నగర్ బస్తీలూ ఉన్నాయి. ఇక్కడ సంపన్నులు నివసించే కాలనీల్లో పోలింగ్ 30 శాతమే నమోదవుతుండగా, మధ్య తరగతి,ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాసులు నివసించే ప్రాంతాల్లో 80 శాతం పోలింగ్ జరగనుంది. దీంతో ఎవరు గెలువాలన్న నగర్ల ఓట్లే కీలకం కానున్నాయి. గద్వాల్ విజయలక్ష్మి - టీఆర్ఎస్ ప్రచార సరళి: ఇప్పటికే డివిజన్ మొత్తాన్ని ఒక రౌండ్ చుట్టేశారు. పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం, స్వయం సంఘాలు, ముస్లిం, క్రిష్టియన్ సామూహిక వర్గాలకు తోడు కిట్టీ క్లబ్‌లతో వెరైటీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బలాలు(+): ఎంపీ కేశవరావు కూతురు కావటం, గెలిస్తే మేయర్ పీఠం వరించే అవకాశం. ఎం.ఏ ఎల్ఎల్బీ చదువుకున్న విద్యాధికురాలే కాకుండా విజయలక్ష్మి అందరికంటే ముందుగానే ప్రచారం చేపట్టారు, ఆర్థికంగా బాగా ఉండటం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం. గెలిస్తే అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆసరా ఫించన్లు ఇతర సంక్షేమ,అభివృద్ధి పథకాలు మరిన్ని అమలు చేస్తామన్న హామీలివ్వటం ఈమె బలాలుగా చెప్పొచ్చు. బలహీనతలు(-): ముప్పై ఏళ్లు అమెరికాలో ఉండి రావటంతో స్థానికులతో అంత సులువుగా కలిసిపోలేకపోవటం. డివిజన్లో జీఒ 58 కింద ఉచిత పట్టాలు ఇంకా ఇవ్వకపోటం, మంచినీటి సమస్యలకు తోడు డ్రైనేజీ లీకేజీలు, ఓపెన్ నాలాల సమస్యలు పరిష్కారం కాకపోవటం ఇబ్బందికరం. బి.రాజుయాదవ్ - కాంగ్రెస్ ప్రచార సరళి: అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా మూడేళ్ల క్రితమే బీకాం దూర విద్య డిగ్రీ పొందిన 47 ఏళ్ల రాజుయాదవ్ డివిజన్లో విస్తృతంగా పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో తమను బలపరచమంటూ ప్రజలకు విన్నవిస్తున్నారు. పిలిస్తే పలికేవాడనని, 24 గంటలు అందుబాటులో ఉంటానంటూ ఇంటింటికి వ్యక్తిగతంగా వెళ్లి వేడుకోవటం ఆయనకు కొంత కలిసి వస్తోంది. బలాలు(+): గత ఎన్నికల్లో పంజాగుట్ట డివిజన్ నుండి కార్పొరేటర్‌గా పనిచేయటం. భౌగోళికంగా డివిజన్ సమస్యలు, బస్తీవాసులతో నేరుగా పరిచయటం ఉండటం. మాస్ జనాల్లో ఇట్టే కలిసిపోయే మనస్తత్వం ఉండటం. మంత్రిగా నాగేందర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రచారం చేయటం ఆయన బలాలుగా చెప్పొచ్చు. బలహీనతలు(-): అభ్యర్థిత్వం లేటుగా ఖరారు కావటంతో ఇంకా అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించకపోవటం. రాష్ర్టంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవటం. మేచినేని శ్రీనివాసరావు - బీజేపీ ప్రచార సరళి: అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసి, అక్కడే వ్యాపారాలు నిర్వహించిన మేచినేని శ్రీనివాసరావు ఎక్కువ సోషల్ మీడియా, సామూహిక సమావేశాల ద్వారా ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రచార వ్యూహాన్ని రూపొందించి ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే డివిజన్లో 80 శాతం ప్రాంతాలు చుట్టేసి వచ్చారు. బలాలు(+): మాజీ మంత్రి మేచినేని కిషన్‌రావు కుమారుడు కావటం, ఆర్థికంగా బలంగా ఉండ టం. కేంద్రంలో అధికారంలో ఉండటానికి తోడు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డిలు ఈ డివి జన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం. డివిజన్లో స్థిరపడ్డ విద్యావంతులు, వ్యాపారులు, ఇతర రాష్ట్రాల వారు ఉండటం. బలహీనతలు(-): స్థానికంగా పెద్దగా పరి చయాలు లేకపోవటం. ఎమ్మెల్యేగా చింతల ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేకపోవటం. టీడీపీ నుండి పూర్తి సహకారం లభించకపోవటం. గెలిస్తే స్థానికులకు అందుబాటులో ఉండరన్న ప్రచారం. -
గ్రేటర్ ఎన్నికల్లో మాకు సరి లేరు: తలసాని
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమతో పోటీ పడే స్థాయిలో ఎవరూ లేరని రెండు, మూడు స్థానాలు ఎవరివో తేల్చుకోవాల్సింది టీడీపీ, కాంగ్రెస్‌లేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన మీట్ ది మీడియాలో తలసాని మాట్లాడారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే అమలు చేసిందన్నారు. కల్యాణలక్ష్మి, పెన్షన్లు, నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ తదితర పథకాల అమలుతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రూ.25 వేల కోట్లతో ఫ్లైఓవర్లు వంటి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. పేదవారు గొప్పగా బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో నివసించే వారంతా హైదరాబాదీయులేనని, నగరంలో గత 19 మాసాలుగా అన్ని ప్రాంతాలవారు సామరస్యంగా జీవిస్తున్నారన్నారు. గ్రేటర్లో వంద సీట్లు గెలుస్తామని, ఎంఐఎంతో ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదని స్పష్టం చేశారు. -
అత్యధిక పోలింగే లక్ష్యం...
♦ ఓటర్లలో చైతన్యానికి జీహెచ్ఎంసీ వినూత్న ప్రచారం ♦ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, ప్రదర్శనలు సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అత్యధిక పోలింగే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా సర్కిల్ కార్యాలయాల పరిధిలోని విద్యార్థులతో ర్యాలీలు చేపట్టనున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఓటర్ చైతన్యంపై పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. సర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియల్ వెల్పేర్ అసోసియేషన్ల సమావేశాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా స్లైడ్ ద్వారా థియేటర్లలోనూ ప్రదర్శన నిర్వహించనున్నారు. -
ప్రతినిధీ... ఇదీ మీ విధి
నీళ్లు, రోడ్లు, మురుగు సమస్యలే మా ఎజెండా ♦ వీటిని పరిష్కరించే వారికే ఓటేస్తాం ♦ నినదిస్తున్న నగర ఓటర్లు ♦ ఆవాజ్‌దో సంస్థ ఓటింగ్ క్యాంపెయిన్‌కు వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులు ♦ సమర్థులకు ఓటేస్తామన్న 68.4 శాతం మంది ♦ ఓటుతోనే స్థానిక సమస్యల పరిష్కారం సాధ్యమన్న 83.2 శాతం ఓటర్లు బల్దియా పోరులో స్థానిక సమస్యల పరిష్కారమేగ్రేటర్ జనం జెండా..ఎజెండాలుగా మారాయి. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు..హంగు..ఆర్భాటాల కన్నా నిత్య జీవితంలో తాము ఎదుర్కొంటున్న రోడ్లు, తాగునీరు, మురుగు నీటి సమస్యలను పరిష్కరించే వారికే తమ ఓటు అని మహానగర ఓటర్లు ఎలుగెత్తి చాటుతున్నారు. మౌలిక వసతులు లేకుండా...మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, మల్టీప్లెక్స్‌లు, హైటెక్ హంగులు అక్కర్లేదని స్పష్టంచేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంతోపాటు జనాన్ని చైతన్యం చేసేందుకు ‘ప్రామాణ్య స్ట్రాటజీ’ అనే రాజకీయ పరిశోధన సంస్థ ప్రారంభించిన ‘ఆవాజ్ దో హైదరాబాద్’ ఓటింగ్ క్యాంపెయిన్‌లో వేలాది మంది ఓటర్లు పాల్గొని తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రామాణ్య స్ట్రాటజీ సంస్థ ఆధ్వర్యంలో గత పదిరోజులుగా నగర వ్యాప్తంగా సుమారు 12 వేల మంది ఓటర్ల నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్సైట్లు, టెలీకాలింగ్ వంటి మాధ్యమాలు, నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా సేకరించిన అభిప్రాయాలను ఈ సర్వేలో క్రోడీకరించారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సింహభాగం ఓటర్లు స్థానిక సమస్యలు పరిష్కరించేవారికే తమ ఓటు అని స్పష్టం చేయడం విశేషం. ఈ సర్వేలో తేలిన పలు అంశాలు మహానగర ఓటర్ల మనోగతానికి అద్దం పడుతున్నాయి. సర్వే వివరాలివే... మా సమస్యలు పరిష్కరించేవారికే ఓటేస్తాం మా వీధి, వార్డులో పేరుకుపోయిన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేవారికి, నిత్యజీవితంలో మేము పడుతున్న అవ స్థలకు శాశ్వతంగా చరమగీతం పాడే అభ్యర్థికే ఓటేస్తామని ఈ సర్వేలో సుమారు 68.4 శాతం మంది ప్రజలు తెలిపారు. మరో 24.9 శాతం మంది మాత్రం అభ్యర్థులతో పనిలేకుండా తమకు నచ్చిన రాజకీయ పార్టీ గుర్తుకే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇక 3.7 శాతం మంది ఎవరికీ ఓటు వేయమన్నారు. మరో 3 శాతం మంది ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ గడపకూడా తొక్కబోమని తెలపడం గమనార్హం. సర్వత్రా.. మంచినీటి కటకట ఇక నగరవ్యాప్తంగా జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాగు నీటి ఎద్దడి. వారం, పదిరోజులకోమారు జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామని..గొంతు తడుపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. నల్లా నీళ్లు రాకపోవడం, బోరుబావులు వట్టిపోవడంతో ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ఫిల్టర్‌ప్లాంట్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నామని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీరు, డ్రైనేజి పైపులైన్లు పక్కపక్కనే ఉన్నచోట రంగుమారి దుర్వాసన వెదజల్లుతున్న కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం రహదారులను తవ్వి వదిలేస్తుండడంతో గతుకుల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక మురుగు నీటి పైపులైన్లకు ఏర్పడుతున్న లీకేజీలతో మురుగు నీరు రహదారులను ముంచెత్తుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని, వీటికి నిర్దిష్ట పరిష్కారాలు చూపి, వాటిని పరిష్కరిస్తామని విస్పష్టమైన హామీ ఇచ్చినవారికే తాము ఓటేస్తామని స్పష్టం చేశారు. అయినా ఓటేస్తాం.. చరిత్రను మార్చేస్తాం.. తెలంగాణా రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న బల్దియా ఎన్నికల్లో తాము ఓటేస్తామని..ఓటేసేందుకు ఆసక్తిగా ఉన్నామని..సమస్యల పరిష్కారానికి ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేస్తామని మెజార్టీ సిటీజనులు పేర్కొనడం కొసమెరుపు. తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలివే.. భోలక్‌పూర్,మల్లాపూర్,చాంద్రాయణగుట్ట,,లాల్‌దర్వాజ,కార్వాన్,మాసాబ్‌ట్యాంక్,మియాపూర్,మెహిదీపట్నం,సైదాబాద్,మొఘల్‌పురా,ఫలక్‌నుమా,ముషీరాబాద్,మీర్పేట్,నాచారం,పత్తర్‌ఘట్టీ,కుత్భుల్లాపూర్,ఈసీఐఎల్,ఆర్కెపురం,రాజేంద్రనగర్,సంతోష్‌నగర్,హిమాయత్‌నగర్,సీతాఫల్మండి,లింగోజిగూడా,వెంకటాపురం,మల్కాజ్‌గిరీ,బాలాపూర్,సికింద్రాబాద్,బాపూనగర్,లంగర్‌హౌజ్,దోమల్‌గూడ, జగద్గిరిగుట్ట,సరూర్‌నగర్‌లలో నీటి ఎద్దడి ఉన్నట్లు ఓటర్లు పేర్కొన్నారు. మంచినీరు, రహదారులు, మురుగు సమస్యలకే అధిక ప్రాధాన్యం ప్రజల ఎజెండాలో అరకొర నీటి సరఫరా, కలుషిత జలాల నివారణ, అధ్వాన్న రహదారులు..ఈ మూడు సమస్యలేతొలి ప్రాధాన్యాలుగా నిలిచాయి. ఈ సమస్యల నుంచి తమకు విముక్తి కల్పిస్తామని గట్టిగా హామీ ఇచ్చిన వారికే ఓటు వేస్తామని జనం స్పష్టం చేశారు. జనం ఎజెండాలో 34 శాతం మంది మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరగా..మరో 22.7 శాతం మంది అధ్వాన్న, గతుకుల రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని కోరారు. మరో 18.6 శాతం మంది కాలనీలు, బస్తీలు, వీధుల్లో పొంగిపొర్లుతున్న మురుగు ప్రవాహంతో తాము పడుతున్న అవస్థలను పరిష్కరించే పార్టీలు, అభ్యర్థులకే ఓటు వేస్తామని స్పష్టంచేశారు. మరో 5.7 శాతం మంది చెత్త సమస్యతో బాధపడుతున్నట్లు వివరించారు. ఇక మరో 19 శాతం మంది విద్యుత్ కట్ కట, వీధి దీపాలు లేక అలుముకుంటున్న చీకట్లు, ట్రాఫిక్ రద్దీ, ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, చాలినన్ని బస్సులు లేకపోవడంతో తాము పడుతున్న అవస్థలు, వీధికుక్కల బెడద, మూతలు లేని మ్యాన్‌హోళ్లు, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. వీటిని పరిష్కరించేవారికే ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. ఓటు వజ్రాయుధమే... అవును..మేము దైనందిన జీవితంలో ఎదుర్కొంటు న్న సమస్యలను ఓటు అనే వజ్రాయుధంతో పరిష్కరించుకుంటామని సర్వేలో 83.2 శాతం మంది గ్రేటర్ ఓటర్లు అభిప్రాయపడ్డారు. 10.8 శాతం మంది రాజకీయ పార్టీల మేనిఫెస్టో చూసి ఓటేస్తామని చెప్పగా.. మరో 6 శాతం మంది ఏదీ చెప్పలేమన్నారు. అయితే ఓటేయాలన్న కోరిక తమలో బలంగా ఉన్నప్పటికీ తమ నిరాసక్తతకు పలు కారణాలు వివరించారు. వివిధ రాజకీయ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు బాగాలేదని, ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం, డబ్బు, మద్యం పంపిణీతో పలు పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడం చూసి విసిగిపోయామని, ఒక వేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఓటేసినా మా సమస్యలను తీర్చే నిధులు, విధులు, అధికారాలు బల్దియాకు లేవని, అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కార్పొరేటర్ల పనితీరు.... గత బల్దియా ఎన్నికల్లో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు తమ సమస్యల పరిష్కారం విషయంలో, నిత్యం అందుబాటులో ఉండే విషయంలో తమను నిరాశ పరిచినట్లు పలువురు సిటీజనులు తెలిపారు. తమ ఫిర్యాదులపై తక్షణం కార్పొరేటర్లు స్పందించారని 39.8 శాతం మంది తెలపగా..అంతగా చొరవచూపలేదని, ముభావంగా స్పందించారని, చూద్దాం..చేద్దాం అన్న ధోరణితో వ్యవహరించారని 25.3 శాతం మంది తెలిపారు. ఇక 34.9 శాతం మంది మాత్రం అసలు తాము ఎనుకున్న కార్పొరేటర్లు సమస్యల వైపు కన్నెత్తి చూడలేదని కుండబద్దలు కొట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులపై ఎక్కువ మంది తమ అసంతృప్తిని తె లియజేయడం విశేషం. ట్రాఫిక్ జాంఝాటం... అల్వాల్, నల్లకుంట, చైతన్యపురి ఓటర్ల ఫిర్యాదులు ఇక్కడి నుంచే... అధ్వాన రహదారులు.. బహదూర్‌పురా, మల్కాజ్‌గిరీ, బండ్లగూడ, కాచిగూడా, బోయిన్పల్లి, చార్మినార్, ఘానీభాగ్, మలక్‌పేట్, గోల్కొండ, తలాబ్‌కట్ట, హైదర్గూడా,లంగర్‌హౌజ్, జియాగూడా, బోరబండ, మణికొండ, యాకుత్‌పురా, మేడ్చల్, ఎల్బీనగర్, ఓల్డ్‌బోయిన్‌పల్లి, సరూర్‌నగర్, ఎల్లారెడ్డిగూడా, ముషీరాబాద్, జీడిమెట్ల, కూకట్పల్లి, సనత్‌నగర్, ఉప్పుగూడా, మోతీనగర్, ఈసీఐఎల్, రాజేంద్రనగర్, హిమాయత్‌నగర్, లింగోజిగూడ. మురుగు అవస్థలు... బంజారాహిల్స్, ఎల్భీనగర్, చిక్కడపల్లి, మలక్‌పేట్, శివరాంపల్లి, తలాబ్‌కట్ట, బేగంబజార్, లంగర్‌హౌజ్, బేగంపేట్, బోరబండ, చంపాపేట్, కార్వాన్, చింతల్, మియాపూర్, ఐఎస్‌సదన్, యూసుఫ్‌గూడా, కొత్తపేట్, కూకట్పల్లి, కృష్ణానగర్, మైలార్‌దేవ్‌పల్లి, దిల్సుఖ్నగర్, చార్మినార్, కాచిగూడా, సైదాబాద్, ఫలక్‌నుమా, మీర్పేట్, మోతీనగర్ విద్యుత్ కట్‌కట.. ఆజంపురా, ఛత్రినాక , కుర్మగూడా, మదీనా, ఉప్పుగూడా, యూసుఫ్‌గూడా, యాకుత్‌పురా చెత్త సమస్యలిక్కడే.. కర్మన్‌ఘాట్, పంజాగుట్ట, రామ్‌కోఠి, ఈస్ట్ఆనంద్బాగ్, హాజిపురా, యాకుత్‌పురా, పత్తర్‌ఘట్టీ, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, మల్కాజ్గిరి. వీధికుక్కలు, అపరిశుభ్రత సికింద్రాబాద్, హయత్‌నగర్, అంబర్పేట్, పద్మారావునగర్, మన్సూరాబాద్,ముషీరాబాద్. -
గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలెందుకు..?
గ్రేటర్ ఎన్నిక ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ నుంచి పెద్ద నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయించాలని కొందరు నాయకులు పట్టుపడుతుండగా, ఎందుకు అనవసర ప్రయాస అని మరికొందరు దానిని కొట్టిపారేస్తున్నారు. మొన్ననే కదా వరంగల్ ఎంపీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో .పెద్దనాయకులను తీసుకొచ్చి తలబొప్పికట్టించుకున్న సంగతిని అప్పుడే మరిచిపోయారా అని ఈ ఎన్నికల్లో హైకమాండ్ నేతల ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్న నేతలు అంటున్నారట. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మొదలుకుని, కేంద్ర మాజీ మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, సచిన్‌పెలైట్ వంటి వారిని తీసుకొచ్చినా వరంగల్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదని వారు వాపోతున్నారట. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ వంటి గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలెందుకు, వారొచ్చినా జాతీయసమస్యలు, అంశాలపై మాట్లాడగలరు కాని గల్లీ పాలిటిక్స్‌పై ఏమి చెప్పగలరని ప్రశ్నిస్తున్నారట. ఈ ఎన్నికలకు కూడా జాతీయనాయకులను తీసుకొచ్చినా తగినన్ని సీట్లు రాకపోతే పార్టీ గాలిపోతుందని, అందువల్ల హైకమాండ్ నేతల ప్రచారం వద్దే వద్దని వారు భీష్మించుకుని కూర్చున్నారట. అయితే గులాంనబీఆజాద్, ఇతర నాయకుల అనుయాయులు, అనుచరులు మాత్రం, హైకమాండ్ ప్రతినిధులు వచ్చి ప్రచారం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారట. తమ నేతలను ప్రచారానికి తీసుకొచ్చి తమ పట్టును చూపించుకోవాల్సిందేనని చెబుతున్నారట. మళ్లీ ఢిల్లీలో హైకమాండ్ నేతల హవా పెరిగితే ఏదో ఒక పదవో, ఎన్నికల్లో టికెట్టో దొరకకపోతుందా అన్నదే ఈ నాయకుల ధ్యాసంతా అని ఢిల్లీనేతల ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్న వారు గొణుక్కుంటున్నారట. -
అంతర్జాతీయ నేరగాళ్లకు స్థావరంగా నగరం
టీఆర్ఎస్ను గెలిపిస్తే సిద్దిపేటకు గ్రేటర్ ఆదాయం: రావుల, ఒంటేరు సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు అభివృద్ధి పథంలో నడిచిన హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ నేరగాళ్లకు స్థావరంగా, గొలుసు దొంగల అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. గ్రేటర్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే నగర ఆదాయాన్ని కూడా సిద్ధిపేటకు తరలించుకోపోతారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, గజ్వేల్ ఇన్చార్జ్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ హయంలో అభివృద్ధికి ఆనవాలుగా నిలిచిందని.. కేసీఆర్ సీఎం అయ్యాక దొంగతనాలు, దోపిడీలతోపాటు అంతర్జాతీయ నేరగాళ్లు సంచరించే కేంద్రంమైందని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ముఖచిత్రం మీద కేసీఆర్ మెడలో బంగారు గొలుసు భద్రంగా ఉందని, మహిళల గొలుసులకు మాత్రం హైదరాబాద్‌లో రక్షణ లేదని అన్నారు. నారాయణఖేడ్‌లో టీడీపీ అభ్యర్థి విజయపాల్‌రెడ్డి విజయంపై టీడీపీ ధీమాతో ఉందని, ఇక్కడ మంత్రి హరీశ్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలితం ఉండదన్నారు. సిద్దిపేటకే న్యాయం చేయని హరీశ్ నారాయణఖేడ్‌కు ఏం చేస్తారని రావుల, ఒంటేరు ప్రశ్నించారు. -
షెహర్ హమారా.. ఓట్ హమారా!!
సుల్తాన్‌బజార్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ-ప్రచారం నిర్వహించనున్నట్లు రీఫార్మర్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మహ్మద్ ఇలియాస్ శాంషీ తెలిపారు. ఇందుకోసం ఓటు ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ‘షెహర్ హమారా.. ఓట్ హమారా’ పేరుతో సోషల్ మీడియాలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన అభ్యర్థులను ఎన్నుకోవడంలో ప్రజలు తప్పటడుగు వేస్తున్నారని, ఈసారి ఉత్తమ నాయకులను ఎన్నుకునేలా సోషల్ మీడియా ద్వారా తమ వంతు కృషి చేస్తామన్నారు. 30 వరకు ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు అసీర్ సుల్తాన్ , అక్తర్ పర్వీన్ పాల్గొన్నారు. -
‘కోటి’ రూట్లు
సేవ ప్రశ్నార్థకం.. ఇప్పుడు భారీ మొత్తంలో ఖర్చు చేసి ఎన్నికయ్యే కార్పొరేటర్లు ఎంతమేరకు అందుబాటులో ఉంటారనేది ప్రశ్నార్థకం. తమ వ్యాపారాల్లో కార్పొరే షన్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కొంతమంది అభ్యర్థులు ఎన్నికలను వినియోగించు కుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. అనేక మంది మాజీలు, తాజాలు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పోటీలో నిలుస్తున్నారు. * గెలుపు కోసం పాట్లు * విచ్చల విడిగా ధన ప్రవాహం * శివాలెత్తుతున్న శివారులు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు ‘కోటి’మార్గాలు వెదుకుతున్నారు. డబ్బును విచ్చల విడిగా వెదజల్లుతున్నారు. ఖర్చెంతైనా ఫర్వాలేదు..గెలిస్తే చాలునన్న ధోరణిలో ముందుకెళుతున్నారు. ఈ విషయంలో నగరం కంటే శివారు ప్రాంతాలే ముందున్నాయి. ఉప్పల్, హయత్‌నగర్, నాచారం, మాదాపూర్ డివిజన్లలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించిన పలువురు అభ్యర్థులు ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. బౌద్ధనగర్, బేగంపేట, తార్నాక, అమీర్‌పేట, కూకట్పల్లి వంటి చోట్ల కూడా ఒక్కో డివిజన్‌కు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు వెచ్చించడానికి వెనుకాడడం లేదు. వందలాది మంది కిరాయి కార్యకర్తలు, వాహనాలు, బాజాభజంత్రీలకు రోజూవారీ కూలీ, భోజనం, ప్రచార సామగ్రి ఖర్చు రోజుకు రూ.6-10 లక్షలకు మించిపోతోంది. ప్రచారం సంగతి పక్కన పెడితే... ఎన్నికల పుణ్యమా అని అడ్డాకూలీలకు ఆధారం దొరికింది. నిత్యం పక్కాగా కూలీ గిట్టుబాటవుతుండటంతో యువకులతో పాటు మహిళలు, వృద్ధులు సైతం ప్రచారంలో పాల్గొని నాలుగురాళ్లు సంపాదించుకుంటున్నారు. ‘మొత్తం’ తేడా! గ్రేటర్ హైదరాబాద్ వుున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అసెంబ్లీని తలపిస్తున్నాయి. 150 వార్డులకు మొత్తం 1,333 వుంది పోటీ పడుతున్నారు. నువ్వా...నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలను అన్ని పార్టీల కార్పొరేటర్అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ గెలిచి తీరాలనే పట్టుదలతో పరిమితులను అతిక్రమిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం రూ.ఐదు లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ఈ ‘మొత్తం’ ఏ మూలకూ సరిపోదని స్వయుంగా అభ్యర్థులే వెల్లడిస్తున్నారు. పార్టీల కార్యాలయాల్లో బీ ఫారాలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయుతిస్తే... వారు చెబుతున్నదానికీ...వాస్తవానికీ మధ్య ఎంత తేడా ఉందో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు వుంచినీళ్ల ప్రాయుంగా డబ్బు ఖర్చు చేస్తున్నారనే విషయుం అందరికీ తెలిసిందే. వివిధ ప్రాంతాలు, పార్టీల బలాబలాలు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభావితం చేస్తున్నారుు. ఉ దాహరణకు పాతబస్తీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అటు ఇటుగా ఖర్చవుతుండగా... మిగిలిన వార్డుల్లో ఈ మొత్తం రూ.రెండు నుంచి మూడు కోట్లకు పైనే ఉంటుందని అంచనా. -
ఇవీ ఇండిపెండెంట్ల గుర్తులు
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలపడుతున్నఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 81 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. వాటిలో దాదాపు 65 గుర్తులను అభ్యర్థులు ఎంచుకున్నారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో వీరు ఎంపిక చేసుకున్న గుర్తులు ఇవీ... ఎయిర్ కండిషనర్, బీరువా, బెలూన్, మర్రిచెట్టు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాట్స్‌మన్, టార్చి, బెల్ట్, సైకిల్, నల్లబల్ల, సీసా, బ్రెడ్, బ్రీఫ్‌కేస్, బకెట్, కేక్, కాలిక్యులేటర్, కెమెరా, కొవ్వొత్తులు, క్యారంబోర్డు, క్యారట్, కాలిఫ్లవర్, చెస్ బోర్డు, కొబ్బరికాయ, కప్పు-సాసర్, గ్యాస్ సిలిండర్, డిష్ యాంటెనా, పల్లకి, విద్యుత్ స్తంభం, కవరు, ఫ్లూట్, గౌను, గ్యాస్ స్టవ్, టోపీ, హెల్మెట్, గరాటా, హాకీ అండ్ బాల్, ఇస్త్రీపెట్టె, లేడీ పర్సు, ల్యాంప్, పోస్డుడబ్బా, సింహం, మిక్సీ, నెక్ టై, పెన్‌స్టాండ్, కుండ, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రంపం, కత్తెర, కుట్టుమెషిన్, షటిల్, స్టెతస్కోప్, టేబుల్ ల్యాంప్, టెలిఫోన్, టీవీ, టెంట్, టూత్‌బ్రష్, టార్చి, ట్రంపెట్, గొడుగు, వయోలిన్, విజిల్, నీటిపంపు, ప్రెషర్ కుక్కర్. -
టీఆర్ఎస్లోకి జోరుగా వలసలు
సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు జోరుగా సాగుతున్నాయి. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్‌తో పాటు కొలను శ్రీనివాస్‌రెడ్డి, బండి రమేష్, శంకర్ యాదవ్, అశోక్ గౌడ్, విమల్ కుమార్, నార్నే శ్రీనివాస్‌రావు, రాఘవరావు తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమైందని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్లోకి నైషధం టీడీపీకి రాజీనామా చేసిన ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన నైషధం సత్యనారాయణ మూర్తి శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హోమ్‌మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసిన అనంతరం.. తన అనుచరులతో కలసి టీఆర్ఎస్లో చేరారు. గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీ తీరుపై నిరసన ప్రదర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఓటుతోనే సమాజంలో మార్పు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మణికొండ: మనతో పాటు చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి చెందాలంటే మనమంతా ఓటు వేయాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాలలో ‘లెట్స్ ఓట్’ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఓటర్ల జాగృతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందమైన సమాజం, మానవవిలువలు, హక్కులు, ఆనందాలు, సుఖమయ జీవనం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారన్నారు. అలాంటి పౌర సమాజాన్ని నిర్మించుకునేందుకు ఉన్నత విలువలు, సమస్యల నివారణకు కృషి చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మార్పులు తెచ్చే పనిలో భాగమైన ఓటు వేయడాన్ని పక్కనపెట్టి మారిపోవాలని ఆశించటం అతిశయోక్తే అవుతుందన్నారు. ఓటింగ్‌లో అందరూ పాల్గొంటే భిన్నమైన ఫలితం వస్తుందని చెప్పారు. అరోరా కళాశాల విద్యార్థులు ‘కౌన్‌బనేగా కార్పొరేటర్?’ అనే కాన్సెప్ట్‌తో వెబ్సైట్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారని తెలిపారు. శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిలు ఇంటింటికీ తిరిగి ఓటు హక్కు విలువను చెప్పేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. అలా వెళ్లే వారి బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తామని వారరు ప్రతినబూనారు. ఓటు హక్కుపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘లెట్స్‌ఓట్’ సంస్థ ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, సుబ్బరంగయ్య, కళాశాల ప్రిన్సిపాల్ మల్లీశ్వరి, విద్యార్థినిలు పాల్గొన్నారు. -
ఐదేళ్లలో రూపురేఖలు మార్చేస్తాం
* నగరంలో కేటీఆర్ రోడ్‌షో * రాయదుర్గం నుంచి ప్రారంభం రాయదుర్గం: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో నగర రూపురేఖలు మార్చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నగరంలో ఆరు రోజులపాటు నిర్వహించే రోడ్‌షో కార్యక్రమాన్ని శనివారం గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం నుంచి ప్రారంభించారు. అనంతరం శేరిలింగంపలి గుల్మొహర్పార్క్ కాలనీ, తారానగర్ మెయిన్‌రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా మజిస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు గ్రేటర్ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు, వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీఆర్ఎస్ అధికారంలో వస్తే సీమాంధ్రులపై దాడులు జరుగుతాయని భయపెట్టారని, అయితే తమ హయాంలో ఒక్క ఘటన కూడా జరగలేదన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 25 వేల కోట్లు కేటాయించామన్నారు. గత ఆరునెలల్లో నగరానికి రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు రాగా, 70 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నామని, ఈ ఏడాది 10 వేలు, వచ్చే ఏడాది 20 వేల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రూ. 4,500 కోట్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మీ, ఆరు కిలోల బియ్యం, ఆటో డ్రైవర్లకు బీమా తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘన త ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. విదేశాలకు వెళ్తున్న ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హైదరాబాద్ ముఖం చూడలేదని, బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారన్నారు. గ్రేటర్లో టీఆర్ఎస్కు పట్టం కట్టాలని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, దీంతో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రు లు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండావిశ్వేశ్వరరెడ్డి, జితేందర్‌రెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డి, పార్టీ అభ్యర్థులు కొమిరిశెట్టి సాయిబాబా, హమీద్‌పటేల్, రాగం నాగేందర్‌యాదవ్, నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, బండిరమేష్, శంకర్‌గౌడ్, నర్సింగ్‌రావులు పాల్గొన్నారు. సీఎం డిజిటల్ ప్రసంగం నగరంలో ఆరు రోజుల పాటు నిర్వహించే రోడ్ షోను రాయదుర్గంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉం ది. అయితే మూడు గంటలు ఆలస్యం గా సాయంత్రం 6 గంటలకు మంత్రి రావడంతో ప్రజలు, నాయకులు నిరసించిపోయారు. కాగా మంత్రి వచ్చే వరకు డిజిటల్ స్క్రీన్ల ద్వారా సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినిపించారు. -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శాలిబండ: ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి మోసం చేసిన టీఆర్ఎస్కు ముస్లిం మైనార్టీలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్‌తో కలిసి పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకు ఓటు వేయాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ నాయకులు కళ్లబొల్లి మాటలతో ముస్లిం మైనార్టీలను దగా చేస్తున్నారన్నారు. మజ్లీస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న బీజేపీ దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా చేస్తుందన్నారు. మైనార్టీ యువకులను ఎన్కౌంటర్ పేరుతో హతమారుస్తున్నా మజ్లిస్ నేతలు నోరు మెదపడం లే దన్నారు. పాతబస్తీలోని 12 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలో తమ ప్రచారానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక మజ్లీస్ నేతలు తమ కార్యకర్తలు, నాయకులను బెదిరిస్తున్నారన్నారు. తమ కార్యకర్తలకు హాని జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్ మాట్లాడుతూ... హైదరాబాద్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రౌడీలతో కలిసి పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు తన కార్యకర్తలపై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామని బెదిరించడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమను ఎన్నికల్లో ఎదుర్కోవాలన్నారు.