జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
వనస్థలిపురం (హైదరాబాద్): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వనస్థలిపురంలోని సిద్ధార్థ పాఠశాలలో తన కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ అధికార మదంతో లింగోజిగూడ, మన్సూరాబాద్‌లలో కాంగ్రెస్ వారిపై దాడులకు దిగిందని ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడి గెలవాలని చూస్తోందని, అయినా మేయర్ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.