Devireddy Sudheer Reddy
-
‘బీఆర్ఎస్ నేతలు తొందరపడి ఏం మాట్లాడొద్దు’
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు తొందరపడి ఏం మాట్లాడొద్దని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమిని హుందాగా స్వీకరిద్దామని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అప్పటివరకు తొందరపడ్డి ఏం మాట్లాడొద్దని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్‌పార్టీపై ఒత్తిడి తెద్దామని చెప్పారు. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున గెలుపొదిన ఓ ఎమ్మెల్యేపై కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో సదరు ఎమ్మెల్యే కూడా తనపై అసత్య ప్రచారం జరిగిందని క్లారిటీ ఇచ్చుకున్నారు. -
పొలిటికల్ కారిడార్: ఎల్బీ నగర్లో అన్ని సమస్యలే
-
బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌లా తయారైందని, ఇప్పటికే కోర్టులో నడుస్తున్న కేసు వివరాలతోనే మరోమారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాగంలోని షెడ్యూలు 10 నిబంధనలకు లోబడే తాము గతంలో టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాల యం తెలంగాణభవన్‌లో సుధీర్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ డైరెక్షన్లోనే రేవంత్‌రెడ్డి తమపై ఫిర్యాదు చేశారని, గోవాలో కాంగ్రెస్ పార్టీ శాసనభాపక్షం బీజేపీలో విలీనం కావడం ఆయనకు తప్పుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాజస్తాన్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేలు సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అంశంపై రేవంత్‌రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో ఎన్నడూ లేనంతరీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడగా, బీజేపీని బలోపేతం చేసేందుకు రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. గతంలో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని, ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చిందెవరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే కాంగ్రెస్ ఆనవాయితీని బీజేపీ కూడా కొనసాగిస్తోందన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరినట్లు సుధీర్‌రెడ్డి వెల్లడించారు. -
ఎల్బీనగర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్లో ఉన్నారు. (తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు) ఇక రాష్ర్టంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతుల సంఖ్య 615కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330కు చేరగా.. ప్రస్తుతం ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
టీఆర్ఎస్లో చేరేముందు హామీయిచ్చా..
సాక్షి, హైదరాబాద్: ‘నేను టీఆర్ఎస్లో చేరేముందు బీఎన్‌రెడ్డినగర్ రిజిస్ట్రేషన్స్, ఆస్తిపన్ను తగ్గింపు తదితర సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. లేని పక్షంలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించాను. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాన’ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. జూన్ 7 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సమస్యలపై చర్చించేందుకు వీలుకాలేదన్నారు. కోడ్ ముగిసిన తర్వాత సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచానన్నారు. ఈ ఆరు నెలల్లో సమస్యలు పరిష్కారం కాని పక్షంలో రాజీనామాకు వెనుకాడబోనన్నారు. ఇప్పటికే ఈ సమస్యలపై అధికారులతో పలుసార్లు చర్చించానని, ఈ నెల 16న మంత్రి కేటీఆర్ సమక్షంలో మరోసారి సమీక్ష సమావేశం జరగనుందని చెప్పారు. దాదాపు 90శాతం సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయని పేర్కొన్నారు. -
టీఅర్ఎస్కు పరాభవం తప్పదు
-
మేయర్ స్థానం కాంగ్రెస్‌దే: సుధీర్‌రెడ్డి
వనస్థలిపురం (హైదరాబాద్): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వనస్థలిపురంలోని సిద్ధార్థ పాఠశాలలో తన కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధికార మదంతో లింగోజిగూడ, మన్సూరాబాద్‌లలో కాంగ్రెస్ వారిపై దాడులకు దిగిందని ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడి గెలవాలని చూస్తోందని, అయినా మేయర్ పీఠం కాంగ్రెస్‌కే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
'అలా అయితే నాకు కూడా కష్టమే'
హైదరాబాద్: ఎన్నికలకు ముందు కేసీఆర్ తెలంగాణ వారంతా స్థానికులే అన్నారని, గెలిచిన తర్వాత ఆ హామీని మరిచిపోవడం సమంజం కాదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక సరికాదన్నారు. ఆ ప్రాతిపదికన తన లాంటి వారు కూడా స్థానికతను రుజువు చేసుకోవడానికి కష్టడాల్సిందేనని వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి మార్పులు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయాలని సుధీర్‌రెడ్డి కోరారు. 1956, నవంబర్ 1 నుంచి తెలంగాణలో ఉంటున్న వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.