
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ నేతలు తొందరపడి ఏం మాట్లాడొద్దని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఓటమిని హుందాగా స్వీకరిద్దామని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అప్పటివరకు తొందరపడ్డి ఏం మాట్లాడొద్దని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్‌పార్టీపై ఒత్తిడి తెద్దామని చెప్పారు.
తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే బీఆర్‌ఎస్ తరఫున గెలుపొదిన ఓ ఎమ్మెల్యేపై కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో సదరు ఎమ్మెల్యే కూడా తనపై అసత్య ప్రచారం జరిగిందని క్లారిటీ ఇచ్చుకున్నారు.