
హైదరాబాద్: తాను కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ బారిన పడ్డ మహిళనే అన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోసల్ మీడియా ఎఫెక్ట్ను సీఎం రేవంత్ సభలో మాట్లాడటం తమ అందరికీ చాలా రిలీఫ్ గా ఉందన్నారు సీతక్క. ఈరోజు(శనివారం) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి.. మానసిక ఆవేదనకు గురి చేశారు. సోషల్ మీడియా పోస్ట్ లు కొన్ని సార్లు డీమోరల్ చేశాయి. మహిళలు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టం.. అలాంటిది మేము ఈ స్థాయికి వస్తే మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. సోషల్ మీడియాను సోషల్ సర్వీస్ కోసం వాడుకున్న నేను.. అంతే ఇబ్బందులకు గురయ్యాను. సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్ధాలకు వాడుతుంది. సోషల్ మీడియా కుటుంబాలను బజారుకీడుస్తుంది. బాడీ షేమింగ్, ఫోటోలు మార్ఫింగ్, అననివి అన్నట్లుగా చెప్తున్నారు.
గత ఏడాది నుంచి ఇది ఎక్కువ అవుతుంది. అన్న చెల్లెల్లు చేతిలో చెయ్యి వేసుకున్నా.. మరోకరకంగా చూపుతున్నారు. సోషల్ మీడియాను మంచికి వాడాలి.. చెడు కు కాదు. కరోనా సమయంలో ఎంతో సర్విస్ చేసా.. దాన్ని కూడా సోషల్ మీడియాలో నన్ను విమర్శించారు. అబద్దాల పైనే బీఆర్ఎస్ నడుస్తుంది. అబద్ధానికి అర్థం బీఆర్ఎస్. ఏ రోజుకైనా నిజమే గెలుస్తుంది. సోషల్ మీడియా కట్టడి అవసరం. సోషల్ మీడియా ద్వారా మాపై బురద చల్లుతున్నారు....కడుక్కోవడం మా వంతు అవుతుంది’ అని సీతక్క వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment