హైదరాబాద్, సాక్షి: అబద్దాలకు అంబాసిడర్‌గా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మారారని మంత్రి సీతక్క అన్నారు. ఆమె బుధవారం కేటీఆర్ ‘ఎక్స్’లో పెట్టిన ట్వీట్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం విషయంలో అవాకులు చవాకులు పేల్చుతున్నారని మండిపడ్డారు.
‘‘ సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను ఫాల్స్‌గా మార్చిందే మీరు(బీఆర్‌ఎస్). అల్పహార పథకాన్ని ఆరంభ శూరత్వం చేశారు. మీ నిర్వాకంతోనే 34వ స్థానంలో తెలంగాణ విద్యారంగం ఉంది. ఏజెన్సీలకు గత ప్రభుత్వం పడ్డ రూ.3.5 కోట్లను మా ప్రజా ప్రభుత్వం చెల్లించింది. తెలంగాణ ఏర్పడే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 24.85 లక్షల మంది విద్యార్దులుంటే.. మీరు దిగి పోయే నాటికి 18.06 లక్షలకు విద్యార్దుల సంఖ్య పడిపోయింది’’ అని అన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో అమలైన “సీఎం బ్రేక్ ఫాస్ స్కీమ్”ను అర్ధాంతరంగా బొందపెట్టి.. ఇప్పుడు కేంద్రం ఈ పథకాన్ని మొదలుపెట్టాలని మొరపెట్టుకోవడం విడ్డూరం.. హాస్యాస్పదం..
నాడు తెలంగాణలో విజయవంతంగా నడిచిన ఈ పథకం ఊపిరితీసి.. రాష్ట్రంలోని సుమారు 28 వేల పాఠశాలల్లోని లక్షలాది మంది విద్యార్థుల… pic.twitter.com/WJXk7hJgas— KTR (@KTRBRS) September 11, 2024
చదవండి: మహిళలను అడ్డుపెట్టుకొనే గెలిచావ్.. కౌశిక్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment