
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన కోర్టు.. ఇవాళ మిగిలిన ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనుంది.
కాగా, తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. ఇలా మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు.
మరోవైపు హీరో అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యనున్నారు. ఈకేసులో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment