Konda Sureka
-
‘చెల్లెల్ని చూసి నేర్చుకో’.. కేటీఆర్‌కు కొండా సురేఖ కౌంటర్
సాక్షి, హైదరాబాద్ : సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్, ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి. సర్వే అంటున్న కేటీఆర్.. చెల్లి కవితను చూసి నేర్చుకోవాలి. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలి. ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది నాకు తెలీదు..నేను ఎవరిని ఎంకరేజ్ చేయడంలేదు.దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది.అడ్మినిస్ట్రేషన్‌కు ఇబ్బంది అవుతుంది. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. లీగల్ లిటికేషన్స్లో లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాభిషేకాలు చేయాలో లిస్ట్ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చాం.కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుంది. ఫారెస్ట్‌లలో సర్వేయర్ల ప్రొటెక్షన్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయి. గత ప్రభుత్వంలో నాయకులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్‌పై త్వరలోనే విచారణ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల సర్వేతో మాకు పేరు వస్తుందనే విమర్శలు. బీసీ రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదు. ఉద్యోగాలు,ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. -
మరో వివాదంలో కొండా సురేఖ
-
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన కోర్టు.. ఇవాళ మిగిలిన ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది.కాగా, తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. ఇలా మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు.మరోవైపు హీరో అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యనున్నారు. ఈకేసులో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. -
కేటీఆర్‌పై వ్యాఖ్యలు.. కొండా సురేఖపై కోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెప్పుడూ కేటీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మొట్టికాయలు వేసింది.కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసుపై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు సిటీ సివిల్ కోర్టు మొట్టికాయలు వేసింది. ఇంకెప్పుడూ కేటీఆర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.ఇదే సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు మరోసారి చేయవద్దని హితవు పలికింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని కోర్టు పేర్కొంది. -
కేటీఆర్ 30 నిమిషాల స్టేట్ మెంట్.. కొండా సురేఖకు చురకలు..
-
నాంపల్లి కోర్టులో.. పరువు - ప్రతిష్ఠ
-
కేటీఆర్ పరువునష్టం పిటిషన్: విచారణ ఈ నెల 30కి వాయిదా
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ (బుధవారం) నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిపింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈనెల 30న కౌంటర్ ఫైల్ చేస్తామని మంత్రి కొండా సురేఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం వకాలత్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. మరోవైపు నాగార్జున.. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నాగార్జున స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. చదవండి: కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్ -
కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు
వరంగల్, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా -
కొండా సురేఖ,రఘునందన్ ఫొటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫొటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఎంపీ రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వివాదాస్పద ఫొటోలను మార్పింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న,జగిత్యాల రాయకల్‌కు చెందిన వ్యాపారవేత్త మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కొండా వర్సెస్ రేవూరి..
-
కేటీఆర్ పరువునష్టం పిటిషన్.. విచారణ 18వ తేదీకి వాయిదా
హైదరాబాద్, సాక్షి: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ చేట్టిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నెల 18న పిటిషనర్ కేటీఆర్‌తో పాటు.. నలుగురు సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు వెల్లడించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీర్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరఫు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌లను పటిషన్ సాక్షులుగా చేర్చారు. మంత్రి కొండా సురేఖ తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు
-
కేటీఆర్ పరువు నష్టం దావాపై విచారణ ప్రారంభం
-
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా
సాక్షి,హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ (గురువారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తరఫు న్యాయవాది వినతించారు.బాల్క సుమన్, తుల ఉమ, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా కేటీఆర్ చేర్చారు. కొండా సురేఖ మాట్లాడిన ఆడియో, వీడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. 23 రకాల ఆధారాలను అందజేశారు. తదుపరి విచారణ ఈ నెల 14కు కోర్టు వాయిదా వేసింది. కాగా, ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా, ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఈ క్రమంలో మంత్రి తమ కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేశారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, తాజాగా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. -
కొండా సురేఖ వివాదం.. కోర్టుకు హాజరుకానున్న నాగార్జున
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై తాజాగా కోర్టులో విచారణ జరిగింది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు. అయితే, న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది.మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున్ పిటీషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాటిని పరిశీలించిన కోర్టు.. అక్టోబర్ 8న నాగార్జున వాగ్మూలం రికార్డ్ చేయాలని వాయిదా వేస్తూ కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కోర్ట్‌కు నాగార్జున హాజరుకానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. -
మూసీ కాదు.. రేవంత్, మంత్రుల బుర్రలు ప్రక్షాళన కావాలి: జగదీష్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇదే సమయంలో మంత్రుల వెనుక సీఎం రేవంత్ ఉండి ఇలా వారితో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు విఫలమై హైడ్రా.. అలాగే, హైడ్రా విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థాయిలేని వారికి మంత్రి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎవరో ఆకతాయిలు సోషల్ మీడియాలో చేసిన పనులకు కేటీఆర్‌కు ఏం సంబంధం ఉంది?. రేవంత్ వెనకుండి మంత్రులతో ఇలా మాట్లాడిస్తున్నారు. కొండా సురేఖ మాటలు సొంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయి. హామీల అమలులో విఫలమై కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. హామీలు విఫలమై హైడ్రాను ముందుకు తెచ్చారు. హైడ్రా కూడా విఫలం కావడంతో సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు.రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. కేసీఆర్ కనపడటం లేదంటే కొండా మురళీ కనపడటంలేదని కొందరు మీమ్స్ పెడుతున్నారు. మనుషులను మాయం చేసే చరిత్ర మీది. చిల్లర మాటలు అనడం, అనిపించుకోవడం ఎందుకు. మంత్రి కోమటిరెడ్డి మానసిక స్థితి కూడా సరిగా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో మూసీ పరిస్థితిపై కోమటిరెడ్డి చర్చకు సిద్ధమా?. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే. మూసీ ప్రక్షాళన కాదు సీఎం, మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలి. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మూసీకి కాసులు.. రైతులకు పైసల్లేవా?: రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక -
మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు
‘‘ఒక మహిళా మంత్రి దుష్టశక్తిగా మారి తప్పుడు ఆరోపణలు చేస్తారా? రాజకీయ ప్రయోజనాలకోసం పరువు ప్రతిష్టలతో బతుకుతున్న పౌరులపై బురద చల్లుతారా? సభ్యత లేని వారెవరో నా భర్తపై మీకు పచ్చి అబద్ధాలు చెబితే ఆవగింజంత వాస్తవం లేకపోయినా ఆరోపణలు చేస్తారా? ఇది నిజంగా సిగ్గు చేటైన విషయం’’ - ఇదీ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అమల ఆవేదనతో చేసిన వ్యాఖ్య. నాగార్జునపైన పిచ్చి ఆరోపణలు , కేటీఆర్ కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై అమల ఘాటుగా స్పందించారు.అనేక మంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ విషయంలో కొండా సురేఖ తీరును ఖండించిన ప్రకటనలు ఎలా వున్నా.. అమల ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆమె కొండా సురేఖ వైనాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికి ఎక్కడా వెనుకాడ లేదు. నాయకులు తమ స్థాయిని తామే తగ్గించుకొని క్రిమినల్స్ మాదిరి వ్యవహరిస్తే ఈ దేశం ఏమైపోతుంది అంటూ అమల ఆవేశంగా ప్రశ్నించారు. మీ రాజకీయాల కోసం బలి చేస్తారా అని అమల అన్నారు. ఆమె ఏఐసిసి నేత రాహుల్ గాంధీకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ప్రజల గౌరవ మర్యాదలపై ఏమాత్రం నమ్మకమున్నా ఇలాంటి నేతలను నియంత్రించాలని, దేశ పౌరులను రక్షించాలని కోరారు.అమల ఆవేదనలో నిజంగానే అర్థముంది. భర్త నాగార్జునను టార్గెట్ చేశారన్న బాధ కనిపించింది. ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అనండి, లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనండి, అవసరం, అర్జెన్సీ లేక పోయినా నాగార్జున ఎన్ కన్వన్షన్ ను కూల్చి వేసింది. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వంలోని మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియాలో విస్తారంగా రావడంతో అవన్ని నాగార్జున కుటుంబానికి తీవ్రమైన ఆవేదన మిగిల్చాయి. ఆ తర్వాత కొండా సురేఖ సారీ చెప్పి వివరణ ఇచ్చినా అదంత సంతృప్తికరంగా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై వెంటనే స్పందించి ఉంటే బాగుండేది.అసలు స్పందించకపోవడం ఇంకా అధ్వాన్నం.నాగార్జున తన ప్రకటనలో ప్రత్యర్థులను విమర్శించేందుకు, రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని కోరారు. సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధమని స్పష్టం చేశారు. నాగచైతన్య తన ప్రకటనలో కేవలం మీడియాలో హెడ్‌లైన్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలపై మాట్లాడడం సిగ్గుచేటని, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. సమంతతో విడాకుల నిర్ణయం పూర్తిగా పరస్పర అవగాహనతో జరిగిందని తమకు వేరు, వేరు జీవిత లక్ష్యాలు ఉండడంవల్లే పరిపూర్ణత కలిగిన వ్యక్తులుగా తామిద్దరం గౌరవించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాగార్జున మరొక కుమారుడు అఖిల్ తన ప్రకటనలో తల్లి అమల చేసిన వ్యాఖ్యలో ప్రతి పదాన్ని సమర్థిస్తున్నట్టు తెలిపారు.ఇక ఈ ఘటనలో బాధిత మహిళ అయిన ప్రముఖ నటి సమంత ఓ ప్రకటన చేస్తూ, విడాకులు తన వ్యక్తిగత విషయమని, సినీ పరిశ్రమలో ఉండడానికి, బైటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలని, సురేఖ ఆ విషయాన్ని గుర్తించాలని అన్నారు. దయచేసి చిన్నచూపు చూడవద్దని విజ్ఞప్తి చేశారు. తమ విడాకుల విషయంలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని స్పష్టం చేశారు.అంటే దీనర్థం సమంతపై కేవలం కొందరు ప్రచారం చేసే అసత్యపు గాసిప్స్‌నే మంత్రి వాడారని అర్థమవుతోంది. ఒకప్పుడు హిందూ నేషన్ అనే ఒక పత్రిక ఉండేది. అందులో సినిమావాళ్లకు సంబంధించిన పిచ్చి పిచ్చి గాసిప్స్ రాసేవారు. వాటిని జనం చదివి నవ్వుకొని వదిలేసేవారు. కొందరు తిట్టేవారు. అంతవరకే అవి పనికొచ్చేవి. కాలక్రమంలో సమాజం నుంచి నిరాదరణ రావడంతో ఆ పత్రిక నిలిచిపోయింది. ఇప్పుడు ఆ గాసిప్ప్ పత్రిక పాత్రను సురేఖవంటి రాజకీయ నేతలు తీసుకున్నట్టయింది.నాగార్జున కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. వారిలో కొందరు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రకాష్ రాజ్ ''ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు ...సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా'' అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే సినీ పరిశ్రమలోని వారిపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోజాలమని అన్నారు. ఎలాంటి చెత్త మాట్లాడినా చెల్లిపోతుందని రాజకీయ నేతలు కొందరు భావిస్తున్నారని మరొక నటుడు నాని ధ్వజమెత్తారు.మెగాస్టర్ చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్ ,మహేశ్ బాబు తదితరులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి పదవిలో ఉండి నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని చిరంజీవి అన్నారు. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడినట్లు కనిపించలేదు.ఒకవైపు హైడ్రా వ్యవహారంలో చికాకుపడుతున్న రేవంత్ ప్రభుత్వానికి కొండా సురేఖ కొత్త చిక్కులను తెచ్చిపెట్టారు. సురేఖ దీనిపై వివరణ ఇస్తూ తన వ్యాఖ్యల ఉద్దేశం, ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని, ఆమెపై అభిమానం ఉందని, ఆమె తనకు ఆదర్శమని వ్యాఖ్యానించారు. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్థాపానికి గురయితే బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహించుకుంటున్నానని ప్రకటించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కోపంతో సురేఖ ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక ప్రతిష్ట కలిగిన కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చినట్టయింది. పైగా సమంత మనస్థాపానికి గురయితే.. అని ముక్తాయించి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాను అనడంలో కూడా కచ్చితంగా అధికార అహంకారం కనిపిస్తోంది. సురేఖ బేషరతుగా, బహిరంగంగా క్షమాపణలు కోరి ఉండాల్సింది. సినిమా వారికి, రాజకీయాల్లోని వారికి మధ్య సంబంధ, బాంధవ్యాలు ఉండడం ఈనాటిది కాదు. ఎన్నికల సమయంలో సినీ నటుల ప్రచారాన్ని నేతలు కోరుకుంటుంటారు. కొందరు సినీ ప్రముఖులు రాజకీయాల్లో కూడా రాణించారు.కాని ఒక సినీమా స్టార్ పై ఈ రకమైన నీచవ్యాఖ్య చేయడం మాత్రం దారుణం.సినీ రంగంలో మహిళలు ఎన్నో కష్టనష్టాలకు, అపవాదులను ఓర్చుకునే పరిస్థితి సభ్య సమాజానికే అవమానం. సురేఖ అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ద్వారా ఆమె నాగార్జున కుటుంబానికి, సమంతకు తీరని నష్టం చేశారు. సినీ పరిశ్రమకు అక్కినేని నాగాశ్వరరావు గానీ, ఆయన కుమారుడు నాగార్జున గానీ ఎనలేని సేవలు అందించారు.కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డిలాంటివారు అక్కినేనిని చాలా గౌరవించి ఆయన్ని హైదరాబాద్ కు రప్పించి సినీ పరిశ్రమ ఇక్కడకు రావడానికి సహకారం తీసుకున్నారు. ఎన్టీఆర్ సమకాలీనుడైన నాగేశ్వరరావును రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు గౌరవిస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కాకుండా ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్, వైఎస్ జగన్ ల కు కూడా అక్కినేని కుటుంబంతో సత్ సంబంధాలున్నాయి. అక్కినేని కుటుంబం వారెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ కారణం ఏమో తెలయదు గానీ నాగార్జునను గురి పెట్టినట్టుగా ఇటీవలి కాలంలో రేవంత్ ప్రభుత్వంలోని వారు వ్యవహరిస్తున్నారు.కొండా సురేఖ విషయానికి వస్తే ఆమె దుందుడుకుగా మాట్లాడడం కొత్త కాదు. ఆమె కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. . వైఎస్ఆర్ టైమ్‌లో మంత్రిగా ఉన్నారు. తిరిగి ఇప్పుడు మంత్రి కాగలిగారు. గతంలో జగన్‌కు మద్దతిచ్చి రోశయ్య ప్రభుత్వంపై అనవసరమైన కొన్ని వ్యాఖ్యలు చేసి మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో వైఎస్సార్ సీపీకి దూరమై జగన్ పై అభ్యంతకరమైన రీతిలో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా ఆమె తీవ్రమైన భాషనే ప్రయోగించారు.సినీ ప్రముఖుల జీవితాల సంగతి ఎలా ఉన్నా అనేక మంది రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించి కూడా ఎన్నో కల్పిత కథలు ప్రచారం అవుతుంటాయి. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే చాలా మంది నేతలు రాజకీయాలకు అర్హులే కాకుండా పోతారు. ఇక్కడ కొండా సురేఖ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లజాలం.ఆమెపై బీఆర్ఎస్ వారు గానీ, మరెవరో గానీ చేసిన ట్రోలింగ్స్‌ను సమర్థించజాలం. బీజేపీ ఎంపీ రఘునందన్ ఆమెకు నూలు దండ వేస్తే దానిపై పిచ్చివాళ్లు కొందరు అభ్యంతరకర పోస్టింగులు పెట్టారు. దానిపై కేటీఆర్ స్పందించిన తీరు కూడా బాగాలేదు.ఆమెను ఉద్దేశించి దొంగ ఏడుపులు అనడం పద్ధతిగా లేదు. తదుపరి సురేఖ మరింత జుగుప్సాకరంగా , మంత్రి హోదాను మర్చిపోయి అక్కినేని నాగార్జున కుటుంబాన్ని వాళ్ల రొంపిలోకి లాగడం ఏమాత్రం సభ్యత కాదు. కేటీఆర్ పై రాజకీయ విమర్శలు చేసుకోవచ్చుగానీ మధ్యలో నాగార్జున, నాగచైతన్య, సమంత ఏం చేశారు? వారిని అన్యాయంగా సమాజంలో బలి చేయడం తప్ప, సాధించింది ఏముంది? నిజానికి ఇంత తీవ్రమైన హేయమైన వ్యాఖ్యలు చేసిన సురేఖ మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హులవుతారా? కాదా? అనేది ఆలోచించుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని అనడం సులువే కానీ, అక్కినేని నాగార్జునకు జరిగిన డ్యామేజీని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పలేకపోయారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనంతకుమార్ హెగ్డే వివాదస్పద వ్యాఖ్యలు చేసి మంత్రి పదవి కోల్పోయారు.గతంలో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకే చెందిన అప్పటి మంత్రి గోకా రామస్వామి రాజకీయంగా కొన్ని విమర్శలు చేసి పదవి కోల్పోయారు. ప్రముఖ నటి జయప్రద యూపీలో కొందరు రాజకీయ నేతల వల్ల ఇబ్బంది పడ్డారు. నాగార్జున కుటుంబానికి ఆవేదన మిగిలి ఉండవచ్చు కాని, ఈ మొత్తం ఉదంతంలో కొండా సురేఖే సమాజం దృష్టిలో దోషిగా నిలబడ్డారని చెప్పాలి. ఈ నేపథ్యంలో నాగార్జున మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు పెట్టి పరువు నష్టం దావా వేయడం సముచితమే. సురేఖపై అభ్యంతర ట్రోలింగ్స్ చేయించారని కేటీఆర్, హరీష్ రావులపై కేసులు పెట్టారట. ఒకే. కానీ మరి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి పై కేసులు ఎందుకు పెట్టలేదు?నాగార్జున మంత్రిపై కేసు పెట్టించడానికి ఎంతగా కష్టపడాల్సి ఉంటుందో తెలియదు.మహిళానేత సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో, ఒక మహిళా మంత్రి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తప్పుడు సంకేతాన్ని ఇచ్చినట్టవుతుంది. ఏపీలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా లడ్డూ రాజకీయాన్ని తీసుకొచ్చినట్టుగా ఇక్కడ తెలంగాణలో హైడ్రాతో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి సురేఖ వంటివారు ఇలాంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కు, రేవంత్ కు ఎలాంటి ప్రయోజనం వుండకపోగా మరింత నష్టమన్న సంగతి తెలుసుకోవాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కోక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే, తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. నటి సమంత, నాగార్జున కుటుంబంతో పాటు రకుల్ పేరును కూడా కొండ సురేఖ తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. సాటి మహిళ అని కూడా చూడకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఆమె చేయడం చాలా బాధాకరమని రకుల్ పేర్కొంది.'తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు ఉంది. ఎంతో అందమైన ఈ చిత్రపరిశ్రమలో నేను గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. సాటి సోదరిగా చూడాల్సిన వారే ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చెందడం బాధాకరం. ఇక్కడ మమ్మల్ని మరింత బాధపెట్టే విషయం ఏమిటంటే.. సమాజంలో ఎంతో బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. మా గౌరవం కోసం మేము మౌనంగా ఉండాలని కోరుకుంటాం. అది మా బలహీనత మాత్రమే, కానీ, దానిని తప్పుగా అనుకుంటే పొరపాటు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పార్టీలతో కానీ నాకు ఎటువంటి సంబంధాలు లేవు. నా పేరును తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. అలాంటి రీతిలో నా పేరు ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను. మీరు పూర్తిగా రాజకీయ మైలేజీని పొందేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కళాకారులు, సృజనాత్మక వ్యక్తులను రాజకీయ కోణం నుండి దూరంగా ఉంచండి. వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టడం ఇక నుంచి అయినా మానేయండి. అని రకుల్ పేర్కొన్నారు.తెలంగాణ మంత్రి కొండా సురేఖ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్‌తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.Telugu Film Industry is known worldwide for its creativity and professionalism. I've had a great journey in this beautiful industry and still very much connected.It pains to hear such baseless and vicious rumours being spread about the women of this fraternity. What's more…— Rakul Singh (@Rakulpreet) October 3, 2024 -
ఇలాంటి రాజకీయ నేతలను బహిష్కరించాలి
-
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన మా అధ్యక్షుడు విష్ణు
-
కొండా కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు.మంత్రి సురేఖ భేషరతుగా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఇరు వైపులా మహిళలు ఉన్నారు..కావునా ఈ విషయాన్ని ఇంతటితో ముగింపు పలకాలని అన్నారు. మహిళల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశం కాదు.కొండా సురేఖ ట్వీట్లో వారు హీరోయిన్గా ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే కాదు నాకు ఆదర్శమని స్పష్టం చేశారు. ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేసిన ట్రోల్ చూశాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని సూచించారు. -
‘మహిళల గురించి మాట్లాడటం.. ఆ రెండు పార్టీలకు అలవాటే’
హైదరాబాద్, సాక్షి: కుటుంబాలు, మహిళలు గురించి అనుచితంగా మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అలవాటు అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని బహిష్కరించాలి. ఇలా మాట్లాడటం కేసీఆర్ మొదలు పెట్టారు. దాన్ని కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. సీఎం రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు. మార్పు రావాల్సి ఉంది. కుటుంబ వ్యక్తిగత విషయాలు ఫోన్ ట్యాప్ చేసి విని బ్లాక్ మెయిల్‌తో డబ్బులు వసూలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు విన్నరనీ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. రెండు పార్టీలు కూడా ఇలాంటి భాషతో తెలంగాణ రాజకీయాలను దిగజార్చూతున్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి...ఏకపక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లు కూల్చడం ఏ మాత్రం న్యాయం కాదు. ఈ కూల్చివేతల విధ్వంసాన్ని ఆపాలని ఇదివరకే సీఎంకు లేఖ రాశా. గతంలో కేసీఆర్ కూడా మూసి బ్యూటీఫికేషన్ అంటూ మార్కింగ్ చేశారు. దాన్నే ఇప్పుడు సీఎం రేవంత్ తలకెత్తుకున్నారు. పేదల ఇళ్ళ కూల్చివేతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచకుండా మూసి సుందరీకరణ ఎవరికి కావాలి?. లక్షన్నర కోట్లల్లో సగం పెట్టీ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సెట్ చేయండి. డ్రైనేజీ, వరద నీటి డ్రైన్ల మీద శ్రద్ద పెట్టండి. మూసి సుందరీకరణ అంటే ముందు రిటైనింగ్ వాల్ కట్టండి. పేదలకు నిర్మిస్తామన్న ఇళ్లు ఏమైయ్యాయి. హామీలు పక్కదోవ పట్టించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోవలోనే సీఎం రేవంత్ వెళ్తున్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ దొందూ దొందే. దొంగల పార్టీలు.. దోపిడీ పార్టీలు.హైడ్రా అంటే రేవంత్. రేవంత్ అంటేనే హైడ్రా. హైడ్రాను పుట్టించిన రేవంత్ బాధ్యుడు. ధైర్యం ఉంటే ఫాం హౌజ్‌లు, బడా బిల్డింగ్లు కట్టిన వాళ్ళవి కుల్చండి. ఓవైసీ ఫాతిమ కాలేజీ ఎందుకు కూల్చడం లేదు? పెద్ద పెద్ద కంపెనీలను పిలిచి ఆర్జీ, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. పేదల ఇళ్లను కులిస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. పేదల ఇళ్ళ కూల్చివేతలను సహించేది లేదు. కూల్చివేతలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి అన్నారు.చదవండి: Konda Surekha Controversy: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. సమంతకు కొండా సురేఖ క్షమాపణలు -
బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర వివాదం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానంటూ మంత్రి కొండా సురేఖ.. సమంతకు క్షమాపణలు చెప్పారు. ‘‘మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం. మీ మనోభావాలు దెబ్బ తీయాలని కాదు. స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అంటూ కొండా సురేఖ ట్వీట్ చేశారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు.— Konda surekha (@iamkondasurekha) October 2, 2024అసలేమైందంటే...! ఈ మొత్తం వివాదం వెనుక ఇటీవల మంత్రి కొండా సురేఖ మెదక్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన, దానిపై బీఆర్ఎస్ పేరిట సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌తో బీజం పడింది. అక్కడ జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఒక నూలు దండను మంత్రి సురేఖ మెడలో వేశారు. కొందరు ఈ ఫోటోను పెట్టి అసభ్య భావంతో ట్రోలింగ్ చేశారు. దీనిపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖపై ట్రోలింగ్‌కు నిరసనగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, చేనేత కార్మీకులు తెలంగాణ భవన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేస్తూ కొండా సురేఖను విమర్శించారు. తనను ట్రోల్ చేశారంటూ సురేఖ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం కొండా సురేఖ తీవ్రంగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ.. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళులర్పించిన అనంతరం బాపూఘాట్ వద్ద, గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని హత్య చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని.. అలాంటప్పుడు తాను దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తానని ప్రశ్నించారు. సినీ నటి సమంత, నాగార్జున కుమారుడు నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణమని.. ఆయన చాలా మంది హీరోయిన్లను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుని త్వరగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడి, వాళ్లకూ డ్రగ్స్ అలవాటు చేశారు. వాళ్ల జీవితాలతో ఆడుకునేలా బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెట్టారు. వాళ్లను డ్రగ్స్ కేసులో ఇరికించి ఆయన తప్పుకున్నారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి, రహస్యంగా మాట్లాడుకున్న విషయాలను రికార్డు చేసి వాళ్లకు వినిపించేవారు. కేటీఆర్‌పై ఆరోపణలుఆ రికార్డులను అడ్డుపెట్టుకుని బెదిరించేవారు’’ అని కొండా సురేఖ ఆరోపించారు. నిజానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తనను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురించి, మంత్రి సీతక్క గురించి కూడా గతంలో ఇలాంటి పోస్టులే పెట్టారని.. ఇప్పుడు తనపై పెడుతున్నారని మండిపడ్డారు. తనపై ట్రోలింగ్ చేసినవారు, వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారిపై కేసులు పెడుతున్నామని చెప్పారు. దుమారం రేపిన కొండా సురేఖ వ్యాఖ్యలుఅయితే, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయాల్లో ఇటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కొండా సురేఖ బుధవారం అర్ధరాత్రి సమంతకు ట్వీట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగినట్లైంది.👉చదవండి : చౌకబారు రాజకీయం -
మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు..
-
మీలాంటి వారిని చూస్తుంటే అసహ్యమేస్తోంది: కొండా సురేఖపై నాని ఫైర్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు ఉండడం దురదృష్టకరం అన్నారు. ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చవనుకోవడం చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. మీ మాటలు చాలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు.. మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివితక్కువ పని ట్వీట్ చేశారు.(ఇది చదవండి: మీ హెడ్‌లైన్స్ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య)నాని తన ట్వీట్లో రాస్తూ..'ఇది కేవలం నటులు, సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనందరం ఖండించాలి.' అంటూ నాని పోస్ట్ చేశారు. కాగా.. సమంత-నాగచైతన్య విడాకులను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సినీ ప్రముఖులంతా మండిపడుతున్నారు. Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…— Nani (@NameisNani) October 2, 2024 -
‘‘కొండా సురేఖా.. నోరు అదుపులో పెట్టుకో’’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరు అదుపులోకి పెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు.ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను షేర్ చేశారు. I condemn the derogatory statements made by Minister @IKondaSurekha garu and demand an unconditional apology. pic.twitter.com/YLtMQV70QY— Harish Rao Thanneeru (@BRSHarish) October 2, 2024 కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ..‘కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను శిఖండి లాగా పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి. కొండా సురేఖ బజారు మాటలను అందరూ అసహ్యించుకుంటున్నారు. ఖబడ్ధార్.. నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతా అంటే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు.కొండా సురేఖ బజారు మాటలకు అందరూ అసహ్యించుకుంటున్నారు.ఖబడ్ధార్.. నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతా అంటే ఊరుకునేది లేదు.- మాజీ మంత్రి, ఎమ్మెల్సీ @Satyavathi_BRS 🔥 pic.twitter.com/x4wb40Q4hl— BRS Party (@BRSparty) October 2, 2024సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..‘బాధ్యతగల మంత్రిగా దిగజారి మాట్లాడటం మంచిది కాదు. కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా ఖండించాం. కానీ, ఇవాళ సినీ పరిశ్రమలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఒక మహిళగా మరో మహిళను కించపరిచేలా మాట్లాడడం బాధాకరం. తనపై ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్‌కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరైంది కాదు. సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని కామెంట్ చేసినప్పుడు తాము మహిళలమన్న విషయాన్ని కొండా సురేఖ మరిచారా’అని ప్రశ్నించారు.మాజీ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. అనవసరంగా కేటీఆర్ గారి పరువుకు నష్టం కలిగే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. కొండా సురేఖ నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే నాలుక చీరుతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అనవసరంగా కేటీఆర్ గారి పరువుకు నష్టం కలిగే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు.కొండా సురేఖ నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే నాలుక చీరుతాం.- బీఆర్ఎస్ మాజీ ఎంపీ @BRSKavitha pic.twitter.com/Z5p3F7HKY5— BRS Party (@BRSparty) October 2, 2024బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కొండా సురేఖతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. మేం పాటించే సంయమనం మా బలహీనత కాదు.. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి జరిగి 26 గంటలు అయినా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు?. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొతా రోహిత్ అనే అతను కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నట్లు అతని ట్విట్టర్లో పెట్టుకున్నాడు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీదే దాడులు జరుగుతుంటే మీరు ప్రజలకేం రక్షణ కల్పిస్తారు అని ప్రశ్నించారు. కొండా సురేఖతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారు.బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారు.మేం పాటించే సంయమనం మా బలహీనత కాదు.. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. - బీఆర్ఎస్ నాయకులు @RSPraveenSwaero pic.twitter.com/F1mjDV7e6N— BRS TechCell (@BRSTechCell) October 2, 2024ఇది కూడా చదవండి: సినీ నటులంటే అంత చిన్న చూపా.. కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ -
బీఆర్ఎస్ నేతలు సురేఖకు క్షమాపణలు చెప్పాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కొండా సురేఖపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ హితవు పలికారు.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖను రెచ్చగొట్టి కేసీఆర్, కేటీఆర్‌లు విమర్శలు చేయించుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి విమర్శలు చేసుకోవడం పద్దతి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు దండలు వేసిన వాళ్లందరినీ అలానే అనుకుంటారా?. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొండా సురేఖకు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి.. ఇప్పటికైనా ఈ వివాదాన్ని బీఆర్ఎస్ ఆపాలి.తెలంగాణలో రుణమాఫీ 18వేల కోట్లు మాఫీ చేశాం. డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ చేయలేకపోయాం. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కేసీఆర్ వదిలి వెళ్లారు. తెలంగాణ బీజేపీకి పట్టు లేదు. కాబట్టి ఉనికి కోసం బీజేపీ రైతు దీక్షతో ప్రయత్నాలు చేసింది. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. ప్రధాని మోదీ ప్రతీ పేద వాడి అకౌంట్లో 2లక్షలు వేస్తా అన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉండి ఎందుకు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. చేయలేదు. రైతుల ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు, చేశారా?. రైతు నల్ల చట్టాలు తెచ్చింది మీరు కదా?.రైతుల మీదకు వెహికల్తో చంపింది మీరు కదా.. ఎప్పుడు ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడలేదు. ధరలు పెరిగినా ప్రజలు ఓట్లు వేసి 8 సీట్లు ఇచ్చేసరికి.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు కళ్ళు నెత్తికి ఎక్కాయి. బీజేపీ నేతలు నటిస్తున్నారు.. డ్రామా ఆర్టిస్టులు. తెలంగాణ రైతులకు మా విజ్ఞప్తి. రేవంత్ సర్కార్ చేసే ప్రయత్నాలకు అండగా ఉండండి. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కుటుంబం గురించి తెలుసు. దేశాన్ని 52 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ కుటుంబం పాలించింది. మీ మాదిరి రాహుల్ గాంధీ కుటుంబం అని భావించకండి. గాంధీ కుటుంబం మీద పగా పట్టిన మోదీ.. సభ్యత్వం రద్దు చేసి ఆయన ఉండే బంగ్లా ఖాళీ చేయించారు. రాహుల్ గాంధీ చరిత్ర తెలుసుకో.. ఎందుకు నోరు పారేసుకుంటున్నావు కేటీఆర్. మూసీ సుందరీకరణ డబ్బుతో రాహుల్ గాంధీ బతుకుతాడా?. దీంతో, ఏమైనా అర్థం ఉందా?’ అని ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్ -
వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కౌంటరిచ్చారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి.@IKondaSurekha సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. @KTRBRS గారి గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. Cont— Sabitha Reddy (@BrsSabithaIndra) October 2, 2024మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరం.— Sabitha Reddy (@BrsSabithaIndra) October 2, 2024ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపించి మాట్లాడితే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ గతంలో అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుంది. పెట్టుబడులు రావాలి.. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అని సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా పనిచేయలేదా?. పనికి రానీ మాటలు మాట్లాడుతున్నారు. బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారు.గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు అన్ని బోగస్ కంపెనీలే. ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీనే. వాణిజ్య ఒప్పందాల మేరకు అవకతవకలు చేశారనే దానికి నిదర్శనం ఈ ఒప్పందాలు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని స్కామ్‌లే. లక్షల కోట్లు దోచుకున్నారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని బాగుచేయాలని పనిచేస్తున్నారు. కేటీఆర్ ఇలా మాట్లాడితే ఎలా?. రుజువులతో మాట్లాడితే మంచిది.. అడ్డగోలుగా మాట్లాడ్డం మంచిది కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం! మంత్రి కొండా సురేఖ
వరంగల్: బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీగార్డెన్, రైల్వే గేట్ శాంతినగర్‌లోని రాజశ్రీగార్డెన్‌లో రెవెన్యూశాఖ, సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, విద్యార్థికి 4జీ మొబైల్, దివ్యాంగులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాల ప్రజల మొహా ల్లో చిరునవ్వులు చూడటమే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు ఇక్బాల్ అహ్మద్, బండి నాగేశ్వర్రావు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, కార్పొరేటర్లు, నేతలు కొత్తపెల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రులు, అప్రూవల్, మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ రిపోర్ట్‌పై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతృ, శిశుమరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణులు ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న వెంటనే వారికి నిరంతరం సేవలందించాలని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్‌రావు, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ నిర్మల పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆ రెండింటి డీఎన్ఏ ఒక్కటే -
కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమే: కొండ సురేఖ
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఆంధ్ర వ్యక్తిని నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టులను పెంచి పోషించినది కేసీఆరేనని అన్నారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ పాలనలో డీజీపీగా ఎందుకు పెట్టారు? అని నిలదీశారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు కానీ బీఆర్ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు.. తాము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని కొండ సురేఖ అన్నారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావ్.. లెక్కలు తీయాలా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఇదీ చదవండి: ‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’ -
TS: కొండా సురేఖ, పల్లా వాగ్వాదం... ఎందుకంటే
సాక్షి,సిద్దిపేట: మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను స్టేజిపైకి పిలవడమేంటని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో అలిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. సంప్రదాయాలకు , ఆచారాలకు వ్యతిరేకంగా మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం పెట్టడం ఏంటని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజి మీదకు పిలవడం చాలా దురదృష్టకరం అన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారు. 30 ఏండ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్లో పెట్టలేదని, ఈ సమావేశాన్ని తాను బహిష్కరించానని పల్లా చెప్పారు. పల్లా వ్యాఖ్యలపై మంతత్రి కొండా సురేఖ స్పందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ఉండలేక సమావేశం నుంచి వెళ్లి పోయారన్నారు. తమకు ఎవరినైనా ప్రత్యేకంగా పిలుచుకునే అధికారం ఉంటుందన్నారు. పల్లా ప్రోటోకాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇదీచదవండి..భట్టి పదే పదే అదే చెప్తున్నారు..జగదీష్‌రెడ్డి -
‘పార్లమెంట్’పై కాంగ్రెస్ గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా..
సాక్షిప్రతినిధి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ గురి పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో వరించిన విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న ఆ పార్టీ దూకుడుగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్‌పై వేగంగా పావులు కదుపుతోంది. 12 అసెంబ్లీ స్థానాలకు పదింటిలో గెలిచిన కాంగ్రెస్ వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల ను గెలుచుకోవాలని కుతూహలపడుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించిన ఆ పార్టీ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్‌కు సైతం నియమించింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్‌కు ఖమ్మం జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ధనసరి సీతక్కను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్గా నియమించింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ లోక్‌సభ స్థానం పరిధి ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాలు, మండలాల నేతలతో సమన్వయం చేయనున్నారు. పీఏసీలో ఓరుగల్లు ప్రస్తావన.. వరంగల్, మహబూబాబాద్.. పార్లమెంట్ స్థానాలను గెలవడం కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇదే అంశాన్ని సూచించడం గమనార్హం. 12 స్థానాలకు 10 అసెంబ్లీ సీట్లను గెలిచామన్న భావనతో పార్లమెంట్ ఎన్నికలను నిర్లక్ష్యం చేయరాదని ఈ కమిటీలో సూచించినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ 131 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 28న నాగ్‌పూర్‌లో జరిగే వేడుకలకు వరంగల్, మహబూబాబాద్ నుంచి పదివేలకు తగ్గకుండా మందిని రైలుమార్గంలో తరలించాలన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకంటే ముందుగానే అసెంబ్లీ టికెట్లను వదులుకున్న వారిని నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేయాలని, అందుకు సంబంధించిన ఉమ్మడి జిల్లా జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రతీ కార్యకర్త అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పట్టుదల, తెగువ, కృషి.. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపుగా చూపాలని సూచించింది. పోటాపోటీగా ఆశావహులు.. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. మాజీ ఎంపీలు, సీనియర్లు, టీపీసీసీ, ఏఐసీసీ నేతలను సంప్రదిస్తున్నారు. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి, కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శనిగపురం ఇందిర పేరు కూడా వినిపిస్తున్నది. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, నెహ్రూనాయక్, బెల్లయ్యనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నలుగురు సీనియర్లు కూడా వరంగల్, మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ల కోసం లోపాయికారిగా మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 17 స్థానాల్లో దాదాపు 15–16 స్థానాలు కై వసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్ ఎంపీలను గెలిపించుకోవడానికి పావులు కదుపుతోంది. ఇవి కూడా చదవండి: మెదక్‌కు దామోదర.. జహీరాబాద్‌కు సుదర్శన్‌రెడ్డి -
ఒక్క అవకాశం ఇవ్వండి.. బెల్ట్ తీస్తా: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్ట్ షాపులు కేసీఆర్ తీసుకొచ్చారు. అందుకే అక్కల బాధలను అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామాల్లో బెల్ట్ షాపులుంటే బట్టలూడదీసి కొట్టి బొక్కలో వేయిస్తా’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ రైతు బజార్లను తెరిపిస్తే.. ఈనాడు బెల్ట్ షాపులు తెరిచారని, వీటిని కాంగ్రెస్ రాగానే రద్దు చేస్తుందని ప్రకటించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ తెచ్చామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. అదే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘10 ఎకరాల్లో పంజాగుట్ట చౌరస్తాలో గడీ నిర్మించుకున్నాడు. సచివాలయం, ప్రగతి భవన్లో విలాసవంత జీవనం ఉంది. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్, కొడుకు కేటీఆర్ 500 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. కానీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు’అని ఆయన మండిపడ్డారు. కొండా మీద కోపంతో వరంగల్‌ను చెత్త కుప్పలా తయారు చేశారు ’’దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వరంగల్‌కు 2014లో గ్రహణం పట్టింది. ప్రజలపై ఆధిపత్యం చెలాయించే ప్రతీ సందర్భంలోనూ కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు స్పందించారు. కానీ ఈ వర్సిటీలో నియామకాలు లేవు. బోధనా సిబ్బంది లేరు. ఉన్నవాళ్లకు జీతాలు లేవు. విద్యార్థులకు వసతుల్లేవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. మొన్న సునీల్‌నాయక్ పీజీ చదివి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్‌లో నామీద కోపం ఉండి అభివృద్ధి చేయలేదు. కొండా దంపతుల మీద కోపం ఉండి వరంగల్‌ను చెత్త కుప్పలా తయారు చేసింది ఈ దండుపాళ్యం ముఠా’’అని రేవంత్ విమర్శించారు. వరంగల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలకు గంజాయి అలవాటు చేశారు. ఇక్కడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సహా వరంగల్ ఎమ్మెల్యేలు అంతా కబ్జాలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపించారు. ’’దాడులే ప్రాతిపదికగా రాజకీయం చేద్దామంటే కేసీఆర్.. తేదీ, స్థలం ప్రకటించండి. కేసీఆర్ ఫామ్‌హౌస్ అయినా, వరంగల్ హంటర్ రోడ్డు అయినా ఎక్కడైనా సిద్ధం’’అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సమావేశంలో మాజీ మంత్రి కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, వరంగల్ ఇన్చార్జ్ అంజన్‌కుమార్ యాదవ్, కొండా మురళి, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాయి పల్లవికి రెడ్కార్పె ట్ వేసి.. రేవంత్‌రెడ్డి ఆపారు : సుష్మితాపటేల్ ఫైర్
సాక్షి, హన్మకొండ అర్బన్: ‘చదువురానోడికి మంత్రి పదవి ఉన్నది కాబట్టి సినిమా ఫంక్షన్ వేడుకలకు అనుమతి ఇవ్వలేదు. అదే చదువుకున్న కడియం శ్రీహరి మంత్రిగా ఉంటే అనుమతి వచ్చేది’ అని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి అన్నారు. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ నిర్మించిన కొండా సినిమా ప్రీరిలీజ్ వేడుకను శనివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఆ చదువు రానోడి పేరు చెప్పనని, అతని గురించి సినిమాలో ఆర్జీవీ బాగా చూపించాడన్నారు. మురళి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మెడ కోసుకుంటాడన్నారు. (చదవండి: గద్దర్ పాటకి ఆర్జీవీ స్టెప్పులు.. వీడియో వైరల్) సురేఖ మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసే ప్రభుత్వాలను గద్దెదించాలని, అందుకు ఈ సినిమా స్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు. అణచి వేతలనుంచి పైకివచ్చామని, కష్టాలు తెలిసిన వారిగా ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. సినిమా నిర్మాత, కొండా దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ మాట్లాడుతూ ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు నీ బతుకుమారదా..? నీ బతుకంతా భయంతోనేనా ... సాయి పల్లవికి రెడ్కార్పె ట్ వేశావు, నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవత్‌రెడ్డి వస్తుంటే భయపడి ఆపేశావు. ఇంకా ఎంతకాలం భయపడతావు.. ఎన్నికలు రానియ్ నీ సంగతి చెబుతా’ అంటూ ఫైర్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో అతడిని చూస్తారు. 'గాయం'లో 'చెలి మీద చిటికెడు దయ రాదా...' అని రొమాంటిక్ సాంగ్ తీశా. ఊర్మిళపై తీసిన ఆ పాటకు సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. అప్పట్నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. గొప్ప గేయ రచయితల్లో ఒకరైన చంద్రబోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన 'సురేఖమ్మ' పాట రాశారు. సుచిత్ర 'తెలంగాణ పోరి' పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు' అని అన్నారు. చిత్రంలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఈరామోర్ నటించారు. ఈ సినిమాకు సుస్మితాపటేల్ నిర్మాతగా ఉండగా, శ్రేష్టపటేల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లానుంచి కొండా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేడుకలో దర్శకుడు ఆర్జీవీ, సినిమా తారాగణం పాల్గొన్నారు. -
గద్దర్ పాటకి ఆర్జీవీ స్టెప్పులు .. వీడియో వైరల్
సినిమా ప్రమోషన్ విషయంలో నలుగురు నడిచే దారిలో కాకుండా.. కాస్త భిన్నంగా వ్యవహరించడం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలవాటు. ఆయన తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం రకరకాల పాట్లు పడతాడు. ఏదో ఒకటి చేసి మొత్తానికి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. తాజాగా తన కొత్త సినిమా ‘కొండా’ ప్రమోషన్స్ కోసం ఏకండా స్టేజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆర్జీవి. (చదవండి: మీరు లేకుండా నేను లేను నాన్నా..మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్) కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.ఈ ఈవెంట్లో ఆర్జీవి తొలిసారి స్టేజ్‌పై డాన్స్ చేశాడు. గద్దరన్న పాటకు తనదైన శైలీలో స్టెప్పులేసి మెప్పించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న వర్మ, కొండా సురేఖ
సాక్షి, విజయవాడ: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా చిత్ర యూనిట్ సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. 'విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దుర్గమ్మ దర్శనానికి రాలేదు. కొండా సురేఖ దంపతుల వలన అమ్మవారిని దర్శించుకున్నాను. కొండా దంపతుల భక్తి పారవశ్యం నన్ను ఆకర్షించింది. కొండా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నాను. సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నాను' అని తెలిపారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. 'ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి మా బయోపిక్ తీశారు. మా బయోపిక్ సినిమాలో కేవలం 10 శాతం మాత్రమే ఉంది. కానీ మా బయోపిక్ తీయాలంటే వెబ్ సిరీస్ సరిపోదు. ఏ శత్రువుకి రాని అనుభవాలు మేము భరించాము. నా పాత్ర చేయడానికి హీరోయిన్ బాగా కష్టపడింది. కొండా మూవీ బయటకు వచ్చాక మీరే చెప్తారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తాం' అని పేర్కొన్నారు. KONDA family moolaana idhee naa paristhithi 😳😳😳 pic.twitter.com/rqN9a18nWc — Ram Gopal Varma (@RGVzoomin) June 13, 2022 చదవండి: మహారాష్ట్ర సీఎంను కలిసిన మేజర్ టీమ్ బస్ దిగేలోగా నా బ్యాగులోని డబ్బు, కార్డులు, వస్తువులు మాయమయ్యాయి -
‘చల్లా ఆస్పత్రి పాలు కావడం ఖాయం’
హన్మకొండ: గత ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆస్పత్రిలో చేరి సానుభూతి పొంది గెలిచారని, ఈసారి నిజంగానే ఆయన ఆస్పత్రి పాలు కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. బుధవారం హనుమకొండలో కొండా చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిశ్శబ్ధంగా ఉంటే తట్టి లేపారని, ఇకనుంచి ప్రజల్లో తిరుగుతానని చెప్పారు. కొన్నేళ్ల కిందట తనపై కాల్పులు జరిపారని, 47 బుల్లెట్లు దూసుకొచ్చాయని గుర్తుచేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డానన్నారు. వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పునుంచి పోటీ చేస్తుందని, త్వరలో డివిజన్లవారీగా పాదయాత్ర చేపడుతామని ప్రకటించారు. వరంగల్ నగరంలో ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే బాధితులు తన దృష్టికి తీసుకొస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. -
కొండా సురేఖ కండిషన్స్
-
కేసీఆర్‌వి దొరహంకార పోకడలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. భార్య కొండా సురేఖతో కలసి శనివారం ఉదయం శాసనమండలికి వచ్చిన ఆయన మండలి చైర్మన్ వి. స్వామిగౌడ్‌కు రాజీనామా లేఖ అందజేశారు. ఆ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. కొండా మురళి 2015 డిసెంబర్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండా దంపతులు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరగా ఎన్నికల ఫలితాల అనంతరం కొండా మురళి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో మండలి చైర్మన్ కొండా మురళికి నోటీసు జారీ చేశారు. నోటీసు గడువు ఉండగానే కొండా మురళి రాజీనామా చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో భార్యతో కలసి కొండా మురళి విలేకరులతో మాట్లాడారు. ‘వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన నాపై బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఆ పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన మొదటి వ్యక్తిని నేనే. విలువలు పాటిస్తున్నా కాబట్టే రాజీనామా చేశా. సీఎం కేసీఆర్ దొరహంకార పోకడలతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత మూడు నెలలకు సురేఖ మంత్రి పదవికి, ఆ తర్వాత నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాం. మాకు పదవులు కాదు... ఆత్మాభిమానం ముఖ్యం. ఆత్మాభిమానం చంపుకున్నోళ్లే టీఆర్ఎస్లో చేరతారు. మొదట మంచిగా మాట్లాడతరు. భోజనం పెడతరు. తర్వాత నాలుగేళ్లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. 30 ఏళ్లుగా మాకు శత్రువుగా ఉన్న దయాకర్‌రావును టీఆర్ఎస్లో చేర్చుకోవడం మాకు నచ్చలేదు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు. దొరల పాలనను ప్రతిఘటించి ప్రజల మధ్య ఉంటం’అని మురళి అన్నారు. టీఆర్ఎస్ది అధికార దుర్వినియోగం: సురేఖ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ముందే అనుకున్నామని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ‘ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన బీ ఫారంతో మురళిధర్‌రావు ఎమ్మెల్సీగా గెలవలేదు. ప్రజల అండతోనే గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మాట్లాడే వాళ్లను కేసీఆర్ అసెంబ్లీలోకి రాకుండా చేశారు. మాలాంటి వాళ్లు పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. శాసనమండలిలో ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. మేము పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదు. దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇచ్చేందుకు జూపల్లిని ఓడగొట్టారు. గతంలో పార్టీలు మారిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్లది అనుకున్న పదవి మాకు అవసరం లేదు కాబట్టి రాజీనామా చేశాం. ఏదైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం’ అని కొండా సురేఖ పేర్కొన్నారు. -
హనుమాన్ దేవాలయం 'కొండా' నమ్మకం
సాక్షి,పరకాల రూరల్: వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా పనిచేసిన కొండా సురేఖకు పరకాల మండలం కామారెడ్డిపల్లిలోని హనుమాన్ దేవాలయం నమ్మకంగా మారింది. కామారెడ్డిపల్లిలోని హనుమాన్ దేవాలయం నుంచే కొండా సురేఖ ప్రతి ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 1999లో అప్పటి శాయంపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసిన సురేఖ ఈ ఆలయం నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవు సాంబయ్యపై గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని ఈ ఆలయం నుంచే ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిపై 50వేల మెజార్టీని సాధించి రికార్డు సృష్టించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పరకాల నియోజకవర్గం నుంచి 2009లో సురేఖ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఇదే దేవాలయంలో పూజలు చేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ ఫలితాల్లో సురేఖ 13వేల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో సురేఖ ఇక్కడి దేవాలయంలో పూజలతో ప్రచారం ప్రారంభించారు. అనంతరం 2014లో పరకాల నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మారిన సురేఖ ప్రస్తుత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం కామారెడ్డిపల్లిలోని హనుమాన్ దేవాలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొండా సురేఖకు కామారెడ్డిపల్లి హనుమాన్ దేవాలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం కొండంత సెంటిమెంట్‌గా మారింది. -
కేసీఆర్ విచక్షణ కోల్పోయి విమర్శిస్తున్నారు : బట్టి
లండన్ : లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా ఎన్నారైలు చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విచక్షణ కోల్పోయి విమర్శిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు. కన్వీనర్ గంప వేణుగోపాల్, కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీధర్ నీలా, జయంత్లను బట్టి అభినందించారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు అగ్రభాగాన నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కార్యకర్తలకు నూతనోత్సహాన్నిస్తుందని తెలిపారు. వరంగల్ పూర్వ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. శ్రీధర్, వారి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీధర్ నీలా మాట్లాడుతూ కొండా దంపతుల మార్గదర్శకంలో వారి బాటలో నడవాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు. జయంత్ వద్దిరాజు, కొప్పుల శశిధర్, గుండు రజిత, మధు, దీక్షిత్ పోలిపాక, మేరీ, ప్రకాష్, రూపేష్ భారతి కొప్పుల, గోవర్ధన్ రెడ్డి బొంత, కార్తిక్ తోట, మహేష్ ఎనపోతులతోపాటూ 20 మంది ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్, కోకన్వీనర్ సుధాకర్ గౌడ్, బిక్కుమండ్ల రాకేష్, శ్రీధర్ మంగళరపు, యువజన విభాగం నాయకులు బాలకృష్ణ రెడ్డి, మాడెలవిడు, సీనియర్ నాయకులు మెరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మధు గట్టాలు పాల్గొన్నారు. -
మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జి ఆర్సీ కుంతియా, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ కొండా దంపతులకు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ దంపతులు, మైనారిటీ నేత పాషా కూడా రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమారు గంట పాటు నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. అందరూ కలసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొండా దంపతులు, రమేశ్ రాథోడ్ దంపతులు కాంగ్రెస్‌లో చేరడంపై రాహుల్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వీరి చేరికలపై ఆయన సానుకూలంగా ఉన్నారని, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ రెండు జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో మెజారీటీ స్థానాల్లో గెలుపొందేందుకు వీరి చేరికలు దోహదపడతాయని రాహుల్ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. బలహీనవర్గాల్లో బలమైన కుటుంబంగా కొండా కుటుంబాన్ని రాహుల్ పరిగణిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రమేశ్ రాథోడ్ చేరిక ప్రభావం చూపుతుందని రాహుల్ చెప్పినట్లు తెలిపారు. బేషరతుగా చేరిక.. ఎన్నికల్లో పోటీపై రాహుల్‌తో భేటీ సందర్భంగా ఎలాంటి చర్చ జరగలేదని, ఎలాంటి షరతుల్లేకుండా కొండా దంపతులు పార్టీలో చేరినట్లు ఉత్తమ్ చెప్పారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం టికెట్ల విషయంలో నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. కొండా సురేఖను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి పంపుతామని చెప్పారు. మా ప్రభావమేంటో చూపిస్తాం: కొండా సురేఖ ‘ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు మాపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఇప్పుడు మేం కాంగ్రెస్‌లో చేరాం. ఇక నుంచి కొండా దంపతుల ప్రభావమేంటో చూపిస్తాం. మాలాంటి వారందరి సహకారంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కన పెట్టి కుటుంబ లాభాపేక్ష కోసమే పనిచేశారు. టీఆర్ఎస్లో జరుగుతున్న అన్యాయంపై మాలాంటి వారు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో మమ్మల్ని బయటకు పంపేలా చేశారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో భేషరతుగా పార్టీలో చేరాం. మా లక్ష్యం టికెట్లు కాదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సేవలందిస్తాం. వరంగల్ తూర్పుతో పాటు 5 నుంచి 6 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాకే మళ్లీ వచ్చి కలుస్తానని రాహుల్‌కు హామీ ఇచ్చాం’అని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల టీఆర్ఎస్లో చేరామని, తమను వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు కొండా మురళి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రమేశ్ రాథోడ్, సుమన్ రాథోడ్ దంపతులు పేర్కొన్నారు. -
కేసీఆర్, కేటీఆర్‌లకు అహంభావం ఎక్కువ
-
మళ్లీ కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ??
-
ఆ ఐదింటిలో ఎవరు..?
-
లండన్‌లో తెరాస సభ్యుల మీట్ అండ్ గ్రీట్
లండన్: కేటీఎస్‌యూకే(కేసీఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే) ‘చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం’ అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులోని భాగంగా కేటీఎస్‌యూకే ఆధ్వర్యంలో తెరాస సభ్యుల మీట్ అండ్ గ్రీట్ పేరుతో కార్యక్రమాన్ని లండన్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కొండా సురేఖ(టీఆర్ఎస్ ఎమ్మెల్యే), కొండా మురళి, టి. ప్రకాష్ గౌడ్(ఎమ్మెల్సీ), గుండవరపు దేవీప్రసాద్( తెలంగాణ రాష్ట్ర బివరేజేస్ కార్పొరేషన్ చైర్మన్), తెరాస యుజన నాయకులు అరవింద్ గౌడ్లు విచ్చేశారు. నగేష్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.‘చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం’ అనే నినాదంతో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నేతన్నకు భరోసా కల్పించడానికి తమ వంతు సాయంగా చేస్తున్న కేటీఎస్‌యూకే ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, అతిథులకు వివరించారు. కేటీఎస్‌యూకే అధ్యక్షులు సిక్కా చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్నా సమయం వేచించి కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు వివిధ దేశాల్లో ఉన్న తెరాస ఎన్నారై టీ సభ్యులకు ఇస్తున్న ప్రోత్సాహనికి ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బంగారు తెలంగాణ కోసం తాము వారి వెంట ఉంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చేనేత ప్రమోషన్‌కు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నారైల అండదండాలు ఎప్పుడూ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత పరిశ్రమ బాగుకోసం వినూత్న పథకాలతో తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఆలోచనలు ఎవరికి అందనంతా ఎత్తులో ఉన్నాయని, ఆయనతో పోటీ పడేవారు ఎవరూ లేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనాధ పిల్లల కోసం చదువు, వసతి తదితర అంశాలపై సీఎం చొరవ అభినందనీయమన్నారు. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ కోసం ఎన్నారైలు అందరూ ఎలాంటి సలహాలు, సందేహలు ఉన్న తెలపాలన్నారు. స్వచ్చ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా చేయడానికి మాత్రమే సీఎం పరిమితం కాలేదు. ప్రతి బస్తీలో ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చదిద్దే క్రమంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కన్నా తల్లిని ఎలా మర్చిపోమో, పుట్టిన ఊరుకి వీలైనంత సహాయం చేయాలని కొండామురళి పిలుపునిచ్చారు. ప్రపంచలో ఎక్కడ లేని విధంగా టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపు అనుమతి లభిస్తోందన్నారు. మిషన్ కాకతీయ మంచి ఫలితాలిస్తుందని, పునరుద్దరణ చేసిన చెరువులు నిండుకుండల్లా మరాయని చెప్పారు. ముఖ్య అతిథి, ఎమ్మెల్యే కొండా సురేఖ ఈ కార్యక్రమంలో తాను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చానని గుర్తు చేసుకున్నారు. చేనేత పరిశ్రమ ప్రత్యేకించి చేనేత రంగంలో తీసుకున్న నిర్ణయాలు- విధానాల గురించి సభకు వివరించారు. భవిష్యత్తులో వరంగల్‌లో రాబోయే చేనేత పరిశ్రమలు అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నామని, అందరూ సహకరించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి మూడేళ్లలో టీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. కార్యక్రమం అనంతరం ఎన్నారై.టి.ఆర్.ఎస్ ప్రతినిధులు ముఖ్య అతినిధులను ఘనంగా సన్మానించారు. బావార్చి రెస్టారంట్ అధినేత కిషోర్ కుమార్ మునుగంటి,శశి కొప్పుల, మహిళా విభాగం నందిని మొట్ట, రజిత నీల ,వర్ష కారిక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నాయకులు అధ్యక్షులు రామ్ చెప్యాల ,శ్రీనివాస్ రెడ్డి పింగళి ,గౌడ్ బాయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సంస్థ సభ్యులు, తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
విపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేఖ, సురేఖ, లక్ష్మి, శోభ హైదరాబాద్: ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే కృషిలో కలసి రావాలని టీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు అజ్మీరా రేఖ, కొండా సురేఖ, బొడిగె శోభ, కోవ లక్ష్మి విపక్షాలను కోరారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించిందని పేర్కొన్నారు. రుణాల రీషెడ్యూలు, ఫీజు రీయింబర్స్మెంట్లపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారని, ఈ అంశాలపై విపక్షాలు గందరగోళం సృష్టించవద్దని సూచించారు. సాహసోపేత నిర్ణయం: జూపల్లి, రవీందర్‌రెడ్డి 20 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించడం సాహసోపేతమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. బంగారు ఆభరణాలమీద తీసుకున్న రుణాలకు కూడా మాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో విపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఎదురయ్యిందన్నారు. రుణమాఫీపై కొన్నిపార్టీలు రైతులను తప్పుదోవ పట్టించాయన్నారు. ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని వారు కోరారు. రిజర్వేషన్ల హామీపై అనుమానాలు: జీవన్‌రెడ్డి శాసనసభలో ముఖ్యమంత్రి మాటలను వింటే ముస్లిం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటారా అన్న సందేహం కలుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ముస్లింల కు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నం చేస్తామనడం బాధ్యతారాహిత్యమేనన్నా రు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులను స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రకటించడం సాధ్యం కాదని చెప్పడం ఉద్యమకారులను అవమానించడమేనన్నారు. ఏపీ సచివాలయం ఎల్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని ఎల్ బ్లాక్ మూడో అంతస్తులో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. స్విచ్‌బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు రేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. ఇదే ఎల్ బ్లాక్‌లోని 8వ అంతస్తులో ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండడం తెలిసిందే. -
మహిళా మంత్రి లేని కేసీఆర్ కేబినెట్
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన11 మందిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. మహిళా కోటాలో కొండా సురేఖ లేదా పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సామాజిక కోణంలోనే మహిళలకు పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా మహిళలకు కేసీఆర్ ప్రాతినిథ్యం కల్పిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఉద్యోగ సంఘాల నేతలకు కేసీఆర్ నిరాశ మిగిల్చారు. స్వామిగౌడ్ కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు మొండిచేయి చూపారు. అలాగే మంత్రి పదవులు దక్కుతాయని ఎదురుచూసిన మరి కొంతమందికి నిరాశే ఎదురయింది. కొప్పుల ఈశ్వర్, సి.లక్ష్మారెడ్డి కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించారు. అయితే వీరిద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మంత్రివర్గంలో మిగిలిన ఖాళీలను రాబోయే నాలుగైదు రోజుల్లోనే భర్తీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల ఆశలు మళ్లీ చిగురించాయి. -
కేసీఆర్‌ను అపార్థం చేసుకున్నా: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు దంపతులు మంగళవారం ఉదయం టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ఆయన నివాసంలో సమావేశమై సుమారు గంటన్నరపాటు చర్చించారు. వరంగల్ జిల్లా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, వరంగల్ తూర్పు నియోజకవర్గం కేటాయింపు వంటి అంశాలపై కేసీఆర్‌తో వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అపార్థం చేసుకున్నానని, ఇప్పటిదాకా ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ విధానాలకు అనుగుణంగానే పనిచేయా ల్సి ఉంటుందని, అందులో భాగంగానే మహబూబాబాద్‌లో ఘటన జరిగిందని వివరణనిచ్చారు. మానుకోటలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఓదార్పు యాత్రలో భాగంగానే వచ్చారని, సమైక్య నినాదంతో కాదని తెలిపారు. వరంగల్ తూర్పు నుంచి సురేఖ పోటీ: కేటీఆర్ కొండా దంపతుల చేరికతో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ బలపడిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చేదాకా విడిగా ఉన్న వివిధ పార్టీల్లోని నేతలు పునర్నిర్మాణంలో అయినా కలసిరావాలని పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా సురేఖ పోటీచేస్తారని వెల్లడించారు. -
ఆంధ్రాతో పంచాయితీ అయిపోలేదు: కేసీఆర్
* సంపూర్ణ తెలంగాణ సాధించాల్సి ఉంది: కేసీఆర్ * భద్రాచలంలోని ఏడు మండలాలూ తెలంగాణకే * ‘మన రాష్ట్రం-మన పార్టీ’ నినాదంతో 17 పార్లమెంటు సీట్లు గెలవాలి * బలహీనవర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాం * తెలంగాణ ప్రభుత్వంలో కులరహిత రెసిడెన్షియల్ పాఠశాలలు * ఐదేళ్లు దాటిన పిల్లగాడు బడికి పోకుంటే ఎస్ఐ ఉద్యోగం తీసేస్తాం * టీఆర్ఎస్లో చేరిన కొండా దంపతులు, రిటైర్డు డీజీ జయచంద్ర, వనపర్తికి చెందిన వివిధ పార్టీల నేతలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రాతో పంచాయితీ పూర్తిగా అయిపోలేదని, చాలా అంశాల్లో ఇంకా పోరాడి సంపూర్ణ తెలంగాణ సాధించుకోవాల్సి ఉందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రిటైర్డు డీజీ ఎస్.కె.జయచంద్ర, మాజీమంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు, వనపర్తి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కేసీఆర్ సమక్షంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని చెప్పారు. వీటిలో పంపిణీ పూర్తయ్యేదాకా ఆంధ్రాతో పంచాయతీ పూర్తయినట్టు కాదన్నారు. భద్రాచలంలోని ఏడు మండలాలు కూడా తెలంగాణలో కలపాలని ఆయన డిమాం డు చేశారు. వనపర్తి నియోజకవర్గానికి ఎస్.నిరంజన్ రెడ్డి పేరు ఖరారు అయిందని, ఆయనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆత్మగా నిలిచిన టీఆర్ఎస్ కోరుకున్న బంగారు, ఆకుపచ్చ తెలంగాణకోసం కేంద్రం నుండి చాలా ప్రాజెక్టులు, నిధులు తెచ్చుకోవాల్సి ఉంది. ‘మన రాష్ట్రం-మన పార్టీ’ నినాదంతో 16-17 పార్లమెంటు సీట్లు గెలిస్తే కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అవసరమైన శక్తి ఉంటుంది. తెలంగాణ యాస మాట్లాడితే మోటు అనుకునే సమయం నుండి ఇప్పటిదాకా తెలంగాణకోసం 14 ఏళ్లు జరిగిన ఉద్యమంలో చూసిన ప్రజల గోస, బాధలు, ఆత్మలను చూసిన పార్టీగా ఎన్నో కలలు ఉన్నాయి. తెలంగాణలో 85 శాతం బలహీనవర్గాలే ఉన్నాయి. వారికోసం పనిచేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్పై ఉంది. టీఆర్ఎస్ ఎందుకు విలీనం కాకుండా ఉన్నదో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. ఇప్పటిదాకా సమైక్యరాష్ట్రంలోని సకల బాధలను పరిష్కరించే విధంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుంది. మహిళలు, మైనారిటీలు, బీసీలు, దళితులకు సంబంధించిన కార్యక్రమాలను మేనిఫెస్టోలో చేరుస్తాం. వచ్చే ప్రభుత్వంలో పూర్తిచేస్తామని చెప్పిన కొన్ని హామీలు బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణం అంటూ ఒక గదిని కట్టిస్తున్నారు. ఒకటే గదిలో భార్యాభర్తలు, పిల్లలు, కొత్తగా ఎవరైనా చుట్టం వస్తే దానిలోనే. ఇంట్లో ఆడపిల్ల స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవాలంటే ఎట్లా? గ్రామాల్లో గొడ్డుగోదా, గొర్రెపిల్లో, మేకపిల్లో ఉంటే కూడా అదే గదిలో ఉంటయి. పందిగూడులాగా ఒకటే గదిని కట్టించి ఇచ్చి బలహీనవర్గాలకు ఇళ్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నరు. తెలంగాణ రాష్ట్రంలో రెండు బెడ్రూములు, ఒక హాలు, కిచెన్, బాత్రూములు, మరుగుదొడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. పూర్తిగా ప్రభుత్వమే ఈ ఖర్చును ఉచితంగా భరిస్తుంది. కుల రహిత వ్యవస్థ ఉండాలని చెబుతున్న ప్రభుత్వమే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను ఎందుకు పెడుతోంది? తెలంగాణ ప్రభుత్వంలో కులరహిత రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తం. అటెండరు నుండి ఐఏఎస్‌దాకా, రిక్షా కార్మికుని నుండి మంత్రుల పిల్లల దాకా అదే హాస్టళ్లలో ఉంటరు. స్విమ్మింగ్‌పూల్, విశాలమైన ఆట మైదానంతో పాటు భోజనం వంటి అన్ని వసతులను ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. వీటిని మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కూడా క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తరు. పోలీసులకు సామాజిక బాధ్యత ఉంటది. గ్రామాల వారీగా ఐదేళ్లు దాటిన పిల్లల జాబితాను రెవెన్యూ శాఖ ద్వారా పోలీసులకు వెళ్తుంది. ఐదేళ్లు దాటిన పిల్లగాడు బడికి పోకుంటే అక్కడ ఉన్న పోలీసు సబ్ ఇన్స్పెక్టరు ఉద్యోగం పోతుంది. దీనివల్ల ఉచిత నిర్బంధ విద్య కచ్చితంగా అమలు అవుతుంది. ఒక తరం విద్యను పొందితే, ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దితే ఆ కుటుంబాల స్థితిగతులే మారిపోతాయి. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను పట్టణాలు, నీటి సౌకర్యం ఉన్న నియోజకవర్గాలు పోగా 72 నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఉన్న జిల్లాలకు తోడుగా కొత్తగా మరో 14 జిల్లాలను ఏర్పాటు చేస్తాం. కేసీఆర్‌ను కలసి టికెట్లు కోరిన న్యాయవాదులు టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వాలని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ నేతలు సి.ఉపేందర్, గోవర్ధన్ రెడ్డి కేసీఆర్‌ను కలసి వినతిపత్రాన్ని అందించారు. హూజూర్‌నగర్ టికెట్‌కోసం ఉపేందర్ దరఖాస్తు చేయగా, దేవరకద్రను ఇవ్వాలని గోవర్ధన్ రెడ్డి కోరారు. -
వైఎస్ మాట తప్పేవారు కాదు: కొండా సురేఖ
హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాట ఇస్తే తప్పేవారు కాదని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా బుధవారం ఆమె బంజారాహిల్స్ రోడ్డునెం10 చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణపై వైఎస్సార్ సీపీ మాట తప్పడం వల్లనే ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు ఆ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. జగన్మోహన్రె డ్డి తండ్రి మాటకు కట్టుబడి నడుచుకోవడం లేదన్నారు. వైఎస్‌ను దూషించేవారే పార్టీలో చలామణి అవుతున్నారని, ఒకప్పుడు రాష్ట్ర నేతలుగా ఉన్న తాము ఇటీవలి పరిణామాలతో కార్యకర్తలుగా మారాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోవాలని ఆమె సూచించారు. వైఎస్ పేరిట సృ్మతివనం నిర్మించాలని సురేఖ డిమాండ్ చేశారు.