
లండన్ : లండన్‌లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా ఎన్నారైలు చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విచక్షణ కోల్పోయి విమర్శిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి టీఆర్‌ఎస్ పార్టీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు. కన్వీనర్ గంప వేణుగోపాల్, కో కన్వీనర్ సుధాకర్ గౌడ్‌ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీధర్ నీలా, జయంత్‌లను బట్టి అభినందించారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎన్నారైలు అగ్రభాగాన నిలవాలని పిలుపునిచ్చారు.
అలాగే తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కార్యకర్తలకు నూతనోత్సహాన్నిస్తుందని తెలిపారు. వరంగల్ పూర్వ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు.
శ్రీధర్, వారి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీధర్ నీలా మాట్లాడుతూ కొండా దంపతుల మార్గదర్శకంలో వారి బాటలో నడవాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు.
జయంత్ వద్దిరాజు, కొప్పుల శశిధర్, గుండు రజిత, మధు, దీక్షిత్ పోలిపాక, మేరీ, ప్రకాష్, రూపేష్ భారతి కొప్పుల, గోవర్ధన్ రెడ్డి బొంత, కార్తిక్ తోట, మహేష్ ఎనపోతులతోపాటూ 20 మంది ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్, కోకన్వీనర్ సుధాకర్ గౌడ్, బిక్కుమండ్ల రాకేష్, శ్రీధర్ మంగళరపు, యువజన విభాగం నాయకులు బాలకృష్ణ రెడ్డి, మాడెలవిడు, సీనియర్ నాయకులు మెరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మధు గట్టాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment