మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు ఉండడం దురదృష్టకరం అన్నారు. ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చవనుకోవడం చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. మీ మాటలు చాలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు.. మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివితక్కువ పని ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: మీ హెడ్‌లైన్స్ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య)
నాని తన ట్వీట్‌లో రాస్తూ..'ఇది కేవలం నటులు, సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనందరం ఖండించాలి.' అంటూ నాని పోస్ట్ చేశారు. కాగా.. సమంత-నాగచైతన్య విడాకులను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సినీ ప్రముఖులంతా మండిపడుతున్నారు.
Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…
— Nani (@NameisNani) October 2, 2024
Comments
Please login to add a commentAdd a comment