![Naga Chaitanya Furious on Konda Surekha Comments](/styles/webp/s3/article_images/2024/10/2/chau.jpg.webp?itok=uRO2D1xA)
తన విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాగచైతన్య స్పందించాడు. జీవితంలో అత్యంత బాధాకరమై, దురదృష్టకరమైన నిర్ణయాల్లో విడాకులు ఒకటి. ఎంతగానో ఆలోచించిన తర్వాతే నేను, నా మాజీ భాగస్వామి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది శాంతియుతంగా తీసుకున్న నిర్ణయం.
మౌనంగా ఉన్నా..
అయితే మా విడాకుల గురించి ఇప్పటివరకు నానారకాలుగా ప్రచారం చేశారు. నా మాజీ భాగస్వామితో పాటు నా కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇంతకాలం మౌనంగానే ఉన్నాను. కానీ ఈ రోజు మంత్రి కొండా సురేఖగారు అబద్ధపు ప్రచారానికి పూనుకున్నారు. ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారు. మీడియా హెడ్‌లైన్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని ఓ నోట్ విడుదల చేశాడు.
చదవండి: మీ స్వార్థం కోసం సమంత పేరు వాడతారా? చిన్మయి ఫైర్
మంత్రి అనుచిత వ్యాఖ్యలు
ఇకపోతే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే చైసామ్ విడిపోయారని కొండా సురేఖ మాట్లాడారు. ఇందులో నాగార్జున హస్తం కూడా ఉందంటూ అతడి కుటుంబంపై హీనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబంతో పాటు సమంత సైతం ఆమె వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండిస్తున్నారు.
చదవండి: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత.. బాధ్యతగా మెదులుకోండి..
Comments
Please login to add a commentAdd a comment