చైసామ్‌ విడిపోయి నేటికి మూడేళ్లు.. ఇంతలా వాడుకుంటారా? | Chinmayi Fires On Konda Surekha Over Her Derogatory Comments On Samantha Divorce, Post Goes Viral | Sakshi
Sakshi News home page

మీ స్వార్థం కోసం సమంత పేరు వాడతారా? చిన్మయి ఫైర్‌

Published Wed, Oct 2 2024 7:42 PM | Last Updated on Thu, Oct 3 2024 10:55 AM

Chinmayi Fires on Konda Surekha Because Her Derogatory Comments on Samantha

టాలీవుడ్‌ సెలబ్రిటీ జంట సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుని సరిగ్గా నేటికి మూడేళ్లవుతోంది. 2021 అక్టోబర్‌ 2న పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అప్పటినుంచి వీరి విడాకుల గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే నాగచైతన్యకు.. హీరోయిన్‌ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అటు సమంత.. తన వర్క్‌ లైఫ్‌లో మునిగిపోయింది.

దారుణ వ్యాఖ్యలు
ఇలాంటి సమయంలో మంత్రి కొండా సురేఖ.. సామ్‌-చైలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కారణమని ఆరోపించారు. అక్కినేని కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా అనుచిత కామెంట్లు చేశారు. దీంతో నాగ్‌ సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డాడు. మీ రాజకీయాల కోసం సినీప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించాడు. 

ఇంతకు దిగజారుతారా?
తాజాగా సామ్‌ స్నేహితురాలు, సింగర్‌ చిన్మయి ఎక్స్‌ వేదికగా స్పందించింది. 'మీ ఎజెండా కోసం, మైలేజ్‌ కోసం, వ్యూస్‌ కోసం, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా? అందరి దృష్టి మీవైపు మళ్లడం కోసం సమంతను అస్త్రంలా ఉపయోగిస్తున్నారని అర్థమవుతోంది. కానీ మీ అందరికంటే తనెప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తనను కనీసం కలలో కూడా టచ్‌ చేయలేరు. ఈ నవరాత్రికి మీ పాపాలను కడిగేసుకోండి' అని ట్వీట్‌ చేసింది.

 

 

 చదవండి: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement