ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్ | Allu Arjun and Venkatesh Reacts On Minister Konda Surekha Comments | Sakshi
Sakshi News home page

Allu Arjun- Venkatesh: ఇలాంటి ప్రవర్తన మన తెలుగు సంస్కృతికి విరుద్ధం: అల్లు అర్జున్, వెంకటేశ్

Published Thu, Oct 3 2024 10:40 AM | Last Updated on Thu, Oct 3 2024 11:09 AM

Allu Arjun and Venkatesh Reacts On Minister Konda Surekha Comments

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నాని. చిరంజీవి, సుధీర్ బాబు ఆమె కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందించారు. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విటర్ వేదికగా నోట్ రిలీజ్ చేశారు.

అల్లు అర్జున్ తన నోట్‌లో ప్రస్తావిస్తూ..' సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె ప్రవర్తన చాలా అగౌరవంగా ఉంది. ఇలా మాట్లాడడం మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. 

(ఇది చదవండి: రాజకీయాల కోసం ఇంతలా దిగజారకూడదు: కొండా సురేఖ కామెంట్స్‌పై మెగాస్టార్‌)

చాలా బాధ కలిగించింది: వెంకటేశ్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేశ్ స్పందించారు.  వ్యక్తిగత విషయాలను రాజకీయాల కోసం వాడుకోవడం చాలా బాధ కలిగించిందని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను టార్గెట్‌ చేయడం దురదృష్టకరమన్నారు. మా సినిమా కుటుంబం పరస్పర గౌరవం, కృషితో వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకితభావంతో నిర్మించబడిందని ట్వీట్ చేశారు. బహిరంగ ప్రసంగంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. వ్యక్తుల జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం వల్ల ఎవరికీ ఉపయోగముండదని.. అది వారికి బాధను మాత్రమే పెంచుతుందన్నారు. ప్రజలకు నాయకత్వం వహించే స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలని నేను కోరుతున్నానని' వెంకటేశ్ పోస్ట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement