నాకు వారి సపోర్ట్‌ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత | Actress Samantha reacts on Minister Konda Surekha’s remarks on her divorce from Naga Chaitanya. | Sakshi
Sakshi News home page

నాకు వారి సపోర్ట్‌ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత

Published Thu, Oct 17 2024 9:30 AM | Last Updated on Thu, Oct 17 2024 1:43 PM

Actress Samantha reacts on Minister Konda Surekha’s remarks on her divorce from Naga Chaitanya.

సమంత-  నాగ చైతన్యల విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోవడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్‌ ఆంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు మహిళా తారల జీవితాలను  కేటీఆర్ నాశనం చేశారని కొండా సురేఖ  ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో టాలీవుడ్‌ టాప్‌ హీరోలు అందరూ సమంత, అక్కినేని కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రి చేసిన ఆరోపణలపై వారు భగ్గుమన్నారు. అయితే, ఈ విషయం గురించి మరోసారి సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు బడుతూ.. సౌత్‌ ఇండియాలోని సినీ నటీనటులు చాలామంది సమంతకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ క్రమంలో నెటిజన్లు, ఆమె అభిమానులు కూడా మద్ధతిచ్చారు. అయితే, తనకు అండగా నిలిచిన వారి గురించి సమంత ఇలా చెప్పారు. 'నా గురించి ద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు  సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ  నా పక్షాన నిలబడింది. వారందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే దానికి కారణం ఇండస్ట్రీతో పాటు ఈ  ప్రజలు నన్ను వదులుకోకపోవడమే..  

వారి ప్రేమ, నాపై  ఉన్న విశ్వాసమే ఈ వివాదం నుంచి త్వరగా   బయటకు వచ్చేలా చేసింది. పరిశ్రమ నాకు సాయం చేయకుండా ఉండుంటే.. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. ఇలాంటి సమయంలో వారే లేకుంటే నేను మరింతగా కుంగిపోయేదానిని. అందరి సపోర్ట్‌ వల్లే మళ్లీ నేను ఇక్కడ తిరిగి మీ ముందు కూర్చున్నాను.' అని సమంత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ టాలీవుడ్‌ స్టార్స్‌ చిరంజీవి, ఎన్టీఆర్‌,మహేశ్‌ బాబు, అల్లు అర్జున్, మాజీ మంత్రి ఆర్కే రోజా తదితరులు భగ్గుమన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement