మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానం: ఖుష్బూ సుందర్ | Actress Kushboo Reacts On Minister Konda Surekha Comments On Samantha And Naga Chaitanya Divorce, Tweet Inside | Sakshi
Sakshi News home page

Konda Surekha Controversy: మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానం: ఖుష్బూ సుందర్

Published Thu, Oct 3 2024 9:07 AM | Last Updated on Thu, Oct 3 2024 10:07 AM

Kushboo Reacts On Minister Konda Surekha Comments On Actress Samantha

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ సుందర్‌ స్పందించారు. కేవలం 2 నిమిషాల ఫేమ్ కోసం ఎల్లో జర్నలిజంలో మునిగిపోయేవారు మాత్రమే ఇలాంటి భాష మాట్లాడుతారని అన్నారు. మీ మాటలు స్త్రీ తత్వానికి పూర్తి అవమానంగా భావిస్తున్నట్లు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా ఆమె మండిపడ్డారు.

ఖుష్బూ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ..'కొండా సురేఖ గారు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిత్ర పరిశ్రమ గురించి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. కేవలం 2 నిమిషాలు ఫేమ్ కోసం ఆరాటపడేవారే ఇలాంటి  భాష మాట్లాడతారని అనుకుంటున్నా. మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానంగా భావిస్తున్నా. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని ఊపేక్షించదు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలకు ఒక మహిళగా మొత్తం సినీ పరిశ్రమకు మీరు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు. కానీ మేము మీ స్థాయికి దిగజారలనుకోవడం లేదు' అంటూ పోస్ట్ చేశారు.

(ఇది చదవండి: మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఊరుకోం: కొండా సురేఖపై ఎన్టీఆర్ ఆగ్రహం)

కాగా.. అంతకుముందు సమంత- నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే నాని, ఎన్టీఆర్ ఆమె వ్యాఖ్యలను ఖండించారు. దీంతో కొండా సురేఖ తన కామెంట్స్‌ను ఉపసంహరించుకుంటున్నా అంటూ ట్వీట్ చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement