మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఊరుకోం: కొండా సురేఖపై ఎన్టీఆర్ ఆగ్రహం | Jr Ntr Fire On Minister Konda Surekha Comments Against Samantha And Naga Chaitanya Divorce, Tweet Inside | Sakshi
Sakshi News home page

Jr Ntr: ఇలాంటి ప్రవర్తన దిగజారుడుకు నిదర్శనం: కొండా సురేఖ కామెంట్స్‌పై ఎన్టీఆర్ ఫైర్

Published Thu, Oct 3 2024 7:27 AM | Last Updated on Thu, Oct 3 2024 9:14 AM

Jr Ntr Fire On Minister Konda Surekha Comments Against Samantha Issue

సమంత-నాగచైతన్య విడాకులను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. క్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదన్నారు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాతనం, ఇతరుల గోప్యతను గౌరవించాలన్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ల గురించి నిర్లక్ష్యంగా కామెంట్స్ చేయడం చూస్తుంటే నిజంగా బాధాకరమని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్‌ తన ట్వీట్‌లో రాస్తూ..'కొండా సురేఖ గారూ.. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా ఉండాలి. సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యంగా నిరాధారమైన కామెంట్స్ చేయడం చూస్తుంటే బాధగా ఉంది.  మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. ఒకరినొకరు గౌరవించుకావాలి.. పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సమాజం ఏమాత్రం హర్షించదు' అంటూ పోస్ట్ చేశారు.

(ఇది చదవండి: మీలాంటి వారిని చూస్తుంటే అసహ్యమేస్తోంది: కొండా సురేఖపై నాని ఫైర్)

కాగా.. అంతకుముందు సమంత-నాగ చైతన్య విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ ప్రముఖులు అంతా ఖండించారు. రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాలను లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement