అక్కినేని హీరో నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లిలో పాల్గొన్నారు. దీంతో అక్కినేని వారి ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నాగచైతన్య-శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టడంతో అందరిదృష్టి చైతూ మాజీ భార్య సమంతపై పడింది. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. కొత్త జంటకు విషెస్ చెబుతుందా? మరేదైనా ఉంటుందా? చాలామంది నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సామ్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఫైట్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్‌తో ఓ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఓ రెజ్లింగ్ పోటీలో బాలిక, బాలుడు తలపడుతున్న వీడియోను పంచుకుంది. ఇందులో బాలుడిని ఒక్క పట్టుతో కిందపడేస్తుంది.. అంటే బాలిక పట్టుదల ముందు బాలుడి తలవంచాల్సిందే అన్న అర్థం వచ్చే విధంగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ నాగచైతన్య- శోభిత పెళ్లి రోజే చేయడంతో మరింత ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment