కొన్నిరోజుల క్రితం అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త పెద్ద రచ్చకు కారణమయ్యాయి. ఒకరిపై ఒకరు పిటిషన్లు వేసుకునేంత వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా పిటిషన్ విషయమై నాంపల్లి కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. ఈ క్రమంలోనే న్యాయస్థానానికి నేరుగా తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. సాక్షులుగా యార్లగడ్డ సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నాగచైతన్య, అమల, సుశీల కూడా కోర్టుకు వచ్చారు.
(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్)
నాగ్ ఏం చెప్పారంటే?
ఈ పిటిషన్ ఎందుకోసం ఫైల్ చేసారని కోర్ట్ ప్రశ్నించగా.. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద పూర్వక వాఖ్యలు చేశారని, తద్వారా మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని చెప్పారు. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని నాగార్జున అన్నారు.
సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని చెప్పిన నాగార్జున.. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల మా కొడుకు విడాకులు తీసుకున్నాడని మంత్రి అసభ్యంగా మాట్లాడారని, అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని అన్నారు. బీఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని నాగార్జున కోరారు.
విచారణ వాయిదా
సాక్షిగా వచ్చిన సుప్రియ స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం షాక్ గురయ్యము. ఇలా మా కుటుంబం గురించి ఎందుకు ఇలా మాట్లాడారో అర్ధం కాలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాం. మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్‌ని 10వ తేదీన రికార్డ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందని హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment