నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్‌ | Ram Gopal Varma Fires On Konda Surekha | Sakshi
Sakshi News home page

నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్‌

Oct 3 2024 10:45 AM | Updated on Oct 3 2024 1:28 PM

Ram Gopal Varma Fires On Konda Surekha

అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మంత్రి హోదాలో ఉండి అలాంటి ఆరోపణలు చేయడంపై టాలీవుడ్‌ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాగర్జున, అమల, నాగచైతన్య, సమంత, ప్రకాశ్‌ రాజ్‌, ఎన్టీఆర్‌, నాని, అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. మంత్రి చేసిన వాఖ్యలను తప్పుపట్టారు. ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా  కొండా సురేఖ వ్యాఖ్యల పై మండిపడుతూ వరుస ట్వీట్స్‌ చేశాడు.

(చదవండి: మంత్రి మాటలు విని చాలా బాధపడ్డా: మెగాస్టార్‌ చిరంజీవి)

నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ  కామెంట్లకి  నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద  పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. కేటీఆర్‌ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో  నాకర్ధమవ్వటంలేదు ? తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో  ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని  అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం.

 

(చదవండి: ఇలాంటి ప్రవర్తన మన తెలుగు సంస్కృతికి విరుద్ధం: అల్లు అర్జున్, వెంకటేశ్)

 ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే  కలుగజేసుకొని ఇకపై  ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము’ అని ఆర్జీవీ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు. కాగా, కొండా సురేఖ ఫ్యామిలీతో ఆర్జీవీకి మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో కొండా సురేఖ దంపతులపై ‘కొండా’ అనే సినిమాను తెరకెక్కించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement