kushboo
-
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు
సాధారణంగా సినీ కుటుంబాలకు చెందిన వారసులు చిత్ర పరిశ్రమంలోనే పనిచేయాలని కోరుకుంటుంటారు. ముందు వేరే వృత్తులకు సంబంధించిన చదువులను అభ్యసించినప్పటికీ చివరికి వారి పయనం మాత్రం సినిమానే అవుతుంది. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. కాగా కోలీవుడ్‌లో ప్రముఖ సినిమా జంటల్లో దర్శకుడు సుందర్ సి, నటి, నిర్మాత కుష్బూల జంట ఒకటి. వృత్తిపరంగా విజయ పథంలో దూసుకుపోతున్న ఈ జంట 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ముచ్చటైన జంటకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు అందమైన కూతుర్లు ఉన్నారు. వీరి పేరుతోనే అవ్నీ సినీ మ్యాక్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా విత్తనం ఒకటైతే మొక్క మరొకటి అవుతుందా? అనే సామెత మాదరి దర్శకుడు సుందర్ సి, నటి కుష్బూ వారసులు కూడా వారి బాటలోనే నడుస్తారనిపిస్తోంది. ఎందుకంటే సుందర్ సి, కుష్బూ దంపతుల కుమార్తెలు అవంతిక, ఆనందిత ఇప్పుడు చదువులు పూర్తి చేసుకున్నారు. వీరిలో అవంతిక అచ్చు తన తల్లి కుష్బూ రూపురేఖలనే కలిగి ఉండడంలో అతిశయోక్తి కాదు.. అవంతికను చూస్తుంటే చిన్ననాటి కుష్బూనే స్మరణకు వస్తారు. అవంతిక తాజాగా ప్రత్యేకంగా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఎంతో గ్లామర్‌గా ఉన్న ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తెరపైకి కుష్బూ వారసురాలు రెడీ అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తండ్రి ప్రముఖ దర్శకుడు. తల్లి సంచలన నటి, నిర్మాత. వారికి తోడు సమ్మోహన రూపంతో కనిపించే అవంతికకు కథానాయకి కావడానికి ఇంతకంటే మరేం కావాలి. హీరోయిన్గా ఈ క్యూట్ గర్ల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by avantika (@avantikasundar) -
లవ్, రిలేషన్ షిప్, గొడవలు..ఆసక్తికరంగా ‘ప్రేమిస్తావా’ ట్రైలర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ లాంచ్ వేడుకను మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.ట్రైలర్ విషయానికి వస్తే ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు ఇలా ఎంతో ఆసక్తికరంగా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్‌కు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉందని చెప్పేలా ట్రైలర్ ఉంది. ఆకాష్ మురళి ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తొలి సినిమాతోనే అదరగొట్టాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక అదితి శంకర్ విషయానికి ప్రేమికురాలిగా తనలోని కొత్త కోణాన్ని చూపించారు. శరత్ కుమార్, ఖుష్బూ ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారని తెలుస్తోంది.ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..‘‘ఏడెనిమిదేళ్ల తర్వాత తెలుగువారిని కలుస్తున్నా. నేను తెలుగులో మాట్లాడితే మా అమ్మ సంతోషపడుతుంది. మా సినిమాను సపోర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఆకాష్-అదితి మధ్య ప్రేమ గురించి చెబుతుంది. ప్రస్తుతం సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. అదితి, ఆకాష్ చాలా చక్కగా నటించారు. కొన్ని సీన్స్‌లో వాళ్ల నటన చూసి ఎమోషనల్ అయ్యాను. లవ్ స్టోరీలో సాలిడ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ డ్రామాని సపోర్ట్ చేస్తూ మిగతా క్యారెక్టర్స్ చేసిన శరత్ కుమార్, ఖుష్బూ, ప్రభుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్క్రిప్ట్‌ను నిర్మాతలు ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలి. యువన్ శంకర్ రాజా నా స్కూల్ మేట్. అప్పటి నుంచి అతని సంగీతం తెలుసు. నా సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం చేస్తారు. యువన్ సంగీతం కోసమే సినిమాకు వచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ పని చేశారు. ఎప్పటిలాగే మీ అందరి సపోర్ట్ నాకు, ఈ సినిమాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ఇప్పటికీ అంతే ఎనర్జీతో ఉన్నారు. ఆయన చాలా ఎత్తుకు ఎదుగుతారని పంజా సినిమా టైమ్‌లోనే నాకు అర్థమైంది. ఆయన మనసు నిజంగా చాలా మంచిది. ఆప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పారు.హీరో ఆకాష్ మురళి మాట్లాడుతూ..‘‘నా ఫస్ట్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నిజంగా నా అదృష్టం. ప్రేమిస్తావా సినిమాకు అందరి సపోర్ట్ కావాలి. అదితి నిజంగా బెస్ట్ కోస్టార్. డైరెక్టర్ హర్ష వర్ధన్ గారు ఈ సినిమాను చాలా బాగా తీశారు. అందరూ తప్పకుండా ప్రేమిస్తావా సినిమాను చూడండి’’ అని చెప్పారు.హీరోయిన్ అదితి శంకర్ మాట్లాడుతూ..‘‘ప్రేమిస్తావా సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. ఇందులో లవ్ ఉంది.. యాక్షన్ ఉంది.. రొమాన్స్ ఉంది.. డైరెక్టర్ విష్ణు వర్ధన్ గారి స్టైలిష్ మేకింగ్ ఉంది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి. మా నాన్నగారికి ఇస్తున్న ప్రేమను నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు. -
విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. అసలు విషయం ఇదీ: ఖుష్భూ
కోలీవుడ్ హీరో విశాల్( Vishal) అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘మదగజరాజ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకు ముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడెన్‌గా ఈవెంట్లో కనిపించి.. అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతన్నాడని వైద్యులు చెప్పినప్పటికీ.. విశాల్ హెల్త్‌పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్‌కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ(khushboo sundar) వివరించింది.కంగారు పడాల్సిన అవసరం లేదుతాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విశాల్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్‌కి జ్వరం వచ్చింది. కానీ 12 ఏళ్ల తర్వాత ‘మదగజరాజ’ రిలీజ్ అవుందుని ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్‌కి వచ్చాడు. అప్పటికే విశాల్ డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ‘ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు?’అని అడిగితే.. ‘నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్‌కి కచ్చితంగా రావాలనుకున్నాను. అందుకే బాడీ సహకరించకపోయినా వచ్చేశాను’ అని విశాల్ చెప్పారు. ఈ ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారుపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్ విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి’ అని ఖుష్భూ విజ్ఞప్తి చేశారు.కాగా, విశాల్, ఖుష్భూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా.. చాలా క్లోజ్‌గా ఉంటారు. మదగజరాజు సినిమాకు ఖుష్భూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్‌తో తనకున్న అనుబంధం గురించి ఖుష్భూ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు. కానీ మొదటగా ఇద్దరం కలిసి ఓకే పార్టీలో పని చేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడు’ అని ఖష్భూ చెప్పుకొచ్చింది.12 ఏళ్ల తర్వాత రిలీజ్విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మదగజరాజ’(Madha Gaja Raja). 2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ ఎయిట్ ప్యాక్ చేశాడట. షూటింగ్ ఆసల్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా.. ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ చెప్పారు. అంతేకాదు విశాల్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్‌ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచి వాడనే విషయం తెలిసిందన్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పని చేసినప్పటికీ.. కార్తిక్ తర్వాత విశాల్‌తోనే తను బాగా క్లోజ్ అయ్యానని చెప్పారు. #Vishal na get well soon.. #MadhaGajaRajapic.twitter.com/I2K3lTRR0Q— Tamil Cinema Spot (@tamilcinemaspot) January 5, 2025 -
దూరం పెట్టారంటూ నటి ఖుష్బూ ఆవేదన
తమిళనాడు రాష్ట్ర బీజేపీ వర్గాలు తనను దూరం పెట్టాయని మహిళా నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను ఓ తమిళ మీడియాతో ఆమె పంచుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. సినీ రంగంలో ఖుష్బూకు ఉన్న అభిమానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు గుడి కట్టిన అభిమానులు ఉన్నారు. రాజకీయంగా తన ప్రయాణాన్ని డీఎంకేతో ఆమె శ్రీకారం చుట్టారు. అయితే అక్కడ ఇమడ లేక కాంగ్రెస్‌లో చేరారు. చివరకు బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణం సాగిస్తున్నా ఆశించిన మేరకు ఆమెకు గుర్తింపు అన్నది దక్కడం లేదని అభిమానులు పేర్కొంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఓ నియోజకవర్గం సీటు ఆశించగా, మరో నియోజకవర్గాన్ని బీజేపీ పెద్దలు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికలలో సీటును ఆశించగా నిరాశ తప్పలేదు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవిలో కొంత కాలం పనిచేసినా పూర్తి స్థాయిలో ఆమెకు న్యాయం అన్నది బీజేపీలో దక్కలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేసేవారు. ఈ పరిస్థితులలో తన ఆవేదనను ఆమె ఓ తమిళ మీడియాతో పంచుకున్నారు. తనను రాష్ట్ర బీజేపీ నేతలు దూరం పెట్టి ఉన్నారని, తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, సమాచారం కూడా లేదంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను ప్రశ్నించగా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానాలు అన్నది తాను ఎవ్వరికీ ఇవ్వనని, ఈ వ్యవహారాలను పార్టీ నేత కేశవ వినాయగం చూసుకుంటారని, ఖుష్బూ ఆరోపణల గురించి తనకు తెలియదంటూ దాట వేయడం గమనార్హం. -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
-
'అరణ్మణై 5' ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
హాలీవుడ్ తరహాలో దక్షిణాదిలో ఫ్రాంఛైంజీస్ కథా చిత్రాలు ఎక్కువగా హిట్ అయ్యింది లేదు. అయితే దాన్ని దర్శకుడు సుందర్.సి సాధ్యం చేశారు. ఆయన ఎంచుకున్న హార్రర్ కామెడీ బ్యానర్ బాగా కలిసొచ్చిందని చెప్పక తప్పదు. ఈయన ఈ బ్యానర్లో అరణ్మణై పేరుతో ఇప్పటి వరకూ 4 సీక్వెల్స్ చేశారు. ఇవన్నీ సూపర్ హిట్టే . చివరిగా ఈయన తెరకెక్కించిన అరణ్మణై 4 (బాకు) చిత్రం ఇటీవల విడుదలై రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఇందులో నటి తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా.. సుందర్.సి ప్రధాన పాత్రలో మెప్పించారు. అయితే, అరణ్మణై5 షూటింగ్ ప్రారంభమైందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.అరణ్మణై5 ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్ అని ఆమె చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి తామె ఎలాంటి పోస్టర్స్ విడుదల చేయలేదని ఆమె తెలిపారు. ఇవ్వన్నీ రూమర్సే అంటూ చెప్పుకొచ్చారు. పార్ట్5 గురించి తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అరణ్మణై5 ప్లాన్ చేసినప్పుడు స్వయంగా వెల్లడిస్తామని, అప్పటి వరకు వేచిఉండాలని ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 2014లో విడుదలైన 'అరణ్మణై' మంచి విజయం అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా 2016,2021,2024లో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 'అరణ్మణై4' ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సుందర్.సి డైరెక్టర్‌గా నయనతార ప్రధాన పాత్రలో మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి2) చిత్రాన్ని చేస్తున్నారు. వడివేలుతో కలిసి గ్యాంగ్స్టర్స్ అనే మరో చిత్రాన్ని కూడా ఆయన తెరకెక్కిస్తున్నారు. అలాగే సుందర్.సి హీరోగా నటిస్తున్న ఒన్ 2 ఒన్, వల్లన్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానం: ఖుష్బూ సుందర్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ సుందర్ స్పందించారు. కేవలం 2 నిమిషాల ఫేమ్ కోసం ఎల్లో జర్నలిజంలో మునిగిపోయేవారు మాత్రమే ఇలాంటి భాష మాట్లాడుతారని అన్నారు. మీ మాటలు స్త్రీ తత్వానికి పూర్తి అవమానంగా భావిస్తున్నట్లు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా ఆమె మండిపడ్డారు.ఖుష్బూ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'కొండా సురేఖ గారు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిత్ర పరిశ్రమ గురించి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. కేవలం 2 నిమిషాలు ఫేమ్ కోసం ఆరాటపడేవారే ఇలాంటి భాష మాట్లాడతారని అనుకుంటున్నా. మీ మాటలు స్త్రీ తత్వానికే అవమానంగా భావిస్తున్నా. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని ఊపేక్షించదు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలకు ఒక మహిళగా మొత్తం సినీ పరిశ్రమకు మీరు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు. కానీ మేము మీ స్థాయికి దిగజారలనుకోవడం లేదు' అంటూ పోస్ట్ చేశారు.(ఇది చదవండి: మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఊరుకోం: కొండా సురేఖపై ఎన్టీఆర్ ఆగ్రహం)కాగా.. అంతకుముందు సమంత- నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే నాని, ఎన్టీఆర్ ఆమె వ్యాఖ్యలను ఖండించారు. దీంతో కొండా సురేఖ తన కామెంట్స్‌ను ఉపసంహరించుకుంటున్నా అంటూ ట్వీట్ చేసింది. I thought it was only those who need 2 minute fame and indulge in yellow journalism speak this language. But here, I see an absolute disgrace to womanhood. Konda Surekha garu, I am sure some values were instilled in you. Where have they flown out of the window? A person in a…— KhushbuSundar (@khushsundar) October 2, 2024 -
‘ఉరుకు పటేల’ మూవీ రివ్యూ
‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఖుష్బూ చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. పటేల(తేజస్ కంచర్ల) బాగా ఆస్తి ఉంటుంది. కానీ చదువు అబ్బదు. తరగతిలో తనది చివరి ర్యాంకు. దీంతో తోటి విద్యార్థులు అతన్ని చులకగా చూస్తారు. అమ్మాయిలు అయితే.. తనవైపే చూడడానికి ఇష్టపడరు. దీంతో పెద్దయిన తర్వాత ఎలాగైన బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోతాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదివిన పటేల.. ఊర్లో బార్ నడుపుతూ సర్పంచ్ అయిన తన తండ్రి(గోపరాజు రమణ)కు రాజకీయంగా తోడుగా ఉంటాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటే.. ఆ ఊరివాళ్లు ఎవ్వరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రారు. అయితే పక్క ఊరికి చెందిన డాక్టర్ అక్షర(ఖుష్బూ చౌదరి ) మాత్రం పటేల్‌ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఏడో తరగతి వరకు మాత్రమే చదివి జులాయిగా తిరుగుతున్న పటేలాను డాక్టర్ అయిన అక్షర ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది? నిజంగానే పటేలాను అక్షర ప్రేమించిందా? అక్షర బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం ఆస్పత్రికి వెళ్లిన పటేలాకు ఎదురైన అనుభవం ఏంటి? అక్షర ఫ్యామిలీ చేసిన కుట్ర ఏంటి? అసలు పటేలా ఎందుకు పరుగెత్తాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఈ టెక్నాలజీ యుగంలోనూ మూఢ నమ్మకాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. మంచి జరుగుతుందని నమ్మి నరబలి ఇవ్వడానికి చూడా వెనుకాడడం లేదు. తరచు మనం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. అలాంటి వాటిని బేస్ చేసుకొని తెరకెక్కించిన చిత్రమే ఉరుకు పటేలా. థ్రిల్లర్ కామెడీ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వివేక్ రెడ్డి . ఆయన ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంతో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం నార్మల్‌గా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండాఫ్‌పై ఆస్తకి పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకోవడమే కాదు.. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా చేస్తుంది. అయితే కథనం మొత్తం ఒక ఆస్పత్రి చుట్టే సాగడం.. ఈ కమ్రంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. కథను మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. పటేలా పాత్రలో తేజస్ కంచర్ల ఒదిగిపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో థ్రిల్లర్ జోనర్ లో తను ఇరుక్కుపోయిన ప్లేస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని భయపడే పాత్రలో అదరగొట్టేసాడు. ఉరుకు పటేల సినిమాని తన భుజాలమీదే మొత్తం నడిపించాడు. ఓవైపు భయపడుతూనే... మరోవైపు కామెడీ పండించాడు. డ్యాన్స్ కూడా బాగా చేశాడు. కొన్ని చోట్ల ఆయన పాత్ర డీజే టిల్లుని గుర్తు చేస్తుంది.ఇక డాక్టర్ అక్షరగా కుష్భు చౌదరి తన అందంతో చాలా క్యూట్ గా మెప్పించింది. సెకెండాఫ్ లో వచ్చే ఆమెలోని మరోకోణం నటనతో ఆకట్టుకుంది. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయిలా కనిపించి అలరించింది. ఇక మరో పాత్రలో హీరోయిన్ వదిన పాత్ర వేసిన లావణ్య రెడ్డి కూడా ఆకట్టుకుంటుంది. గ్రామ సర్పంచ్, పటేల తండ్రి పాత్రలో గోపరాజు రమణ ఎప్పటిలాగే తనమార్క్ డైలాగులు, నటనతో మెప్పంచారు. సుదర్శన్ తో డబుల్ మీనింగ్ డైలాగులతో కాస్త శ్రుతిమించే చెప్పించారు. చమ్మక్ చంద్ర పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది.మూఢనమ్మకాలతో జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ ఈ కథను అల్లుకుని... థ్రిల్లర్, కామెడీ జానర్లో చాలా ఆసక్తికరంగా ఎంటర్టైన్మెంట్గా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఈ చిత్రం ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే జత చేసి మొదటి సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వివేక్. మూవీలో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం రాత్రి పూట ఒకే హాస్పిటల్ లో కథ జరగడంతో దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఈ వారం వినాయకచవితి సందర్భంగా వచ్చిన హాలీడేస్ ను ఈ సినిమాతో ఎంజాయ్ చేసేయండి. -
'ఖుష్బు ఇడ్లీ' గురించి విన్నారా..? ఆ పేరు వెనకున్న స్టోరీ ఇదే..!
తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీని పలుచోట్ల వివిధ రకాల పేర్లుతో పిలవడం గురించి విన్నాం. కానీ మరీ ఇలా ఓ ప్రముఖ నటి పేరుమీదుగా బ్రేక్‌ఫాస్ట్‌ని పిలవడం గురించి విని ఉండరు. ఈ ఇడ్లీ తమిళనాట బాగా ఫేమస్. కోలివుడ్ చెందిన ప్రముఖ నటి ఖుష్బు పేరు మీదుగా అక్కడ ఇడ్లీ వంటకం ఉంది. అసలు ఆ బ్రేక్‌ఫాస్ట్‌కి ఆ పేరు ఎలా వచ్చింది..? దీని వెనుక దాగున్న స్టోరీ ఏంటంటే..?.భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి ఇడ్లీలు. ఇవి అత్యంత మృదువుగా మెత్తటి ఇడ్లీలా ఉంటాయి. సింపుల్‌గా చేసే ఈ అల్పాహారాన్ని దక్షిణ భారతదేశంలో ఓ గిన్నె సాంబార్, చట్టితో సర్వ్ చేస్తారు. దక్షిణ భారత సాంప్రదాయ వంటకమే ఈ ఇడ్లీ. అయితే తమిళనాట పేరుగాంచిన 'ఖుష్బూ ఇడ్లీ' తయారీ మాత్ర డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇది మిగతా ఇడ్లీల కంటే పువ్వులా కోమలంగా తెల్లటి మల్లెమొగ్గల్లా అందంగా ఉంటాయి. నోట్లే వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. అంతలా సుకుమారంగా ఉంటాయి ఈ ఇడ్లీలు. అదీగాక తమిళనాడులో ఒకప్పుడూ అత్యంత అందమైన హీరోయిన్గా ఖుష్బు ఓ వెలుగు వెలిగింది. ఆమె కూడా బొద్దుగా అందంగా ఉంటుంది. ఈ ఇడ్లీలు కూడా చక్కగా ప్లవ్వీగా మల్లెపువ్వులా ఆకర్షణీయంగా ఉండటంతో ఆ నటి పేరు మీదగా వాళ్లంతా ఈ ఇడ్లీని పిల్చుకుంటున్నారు. దీన్ని వాళ్లు మల్లిగే ఇడ్లీ లేదా మల్లిగై పూ ఇడ్లీ అని కూడా పిలుస్తారు. తమిళంలో మల్లిగె, మల్లిగై అంటే 'మల్లెపువ్వు' అని అర్థం. మల్లె పువ్వులా చాలా కోమలంగా ఈ ఇడ్లీలు ఉంటాయి. ఐతే ఈ ఇడ్లీ 'ఖుష్బూ ఇడ్లీ' పేరు మీదగానే ఎక్కువ ప్రజాధరణ పొందింది. ఎవరు తయారు చేశారంటే..?నాలుగు దశాబ్దాల క్రితం, ధనభాగ్యం అమ్మ ప్రస్తుత కరుంకలపాళయం ఈ ఖుష్బు ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించిందని చెబుతారు. ఈ అసాధారణమైన మృదువైన ఇడ్లీలు రాను రాను ఆహార ప్రియులకు ప్రీతికరమైనవిగా మారిపోయాయి. పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా ఆమె తన రెసిపీ తయారీ గురించి 20 కుటుంబాలకు తెలియజేసింది. వాళ్లంతా ఆమెకు సహాయం చేయడానికి వీలుకల్పించారు. అలా లగ్జరీ హోటళ్ల నుంచి చెఫ్‌లు కూడా ధనభాగ్యం అమ్మ చేసిన ప్రత్యేక ఇడ్లీల తయారీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా నేడు రోజుకు దాదాపు 10 వేలకు పైగా ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి. ఖుష్బు ఇడ్లీ విలక్షణమైన ఆకృతి దాని పదార్థాల నుంచి వస్తుంది. ముఖ్యంగా సబుదానా, బియ్యం, మినప్పులతో ఈ ఇడ్లీని తయారు చేస్తారు. దీన్ని పులియబెట్టడం వల్ల మృదువుగా స్పాంజ్‌లా వస్తాయి.(చదవండి: ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి) -
నా పెళ్లి విషయం తెలిసి ఆ హీరో ఏడ్చాడు: ఖుష్బూ
ఒకప్పుడు హీరోయిన్గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఖుష్భూ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా,టీవీ యాంకర్‌గా బిజీ అయింది. అప్పట్లో ఖుష్భూకి తమిళ్లోనే కాదు టాలవుడ్లోనూ ఫుల్ ప్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 200పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో తమిళనాడులో అభిమానులు ఖుష్భూకి ఓ గుడినే కట్టించారంటే..ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2000 సంవత్సరంలో డైరెక్టర్ సుందర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుందర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ముఱై మామన్’లో ఖుష్బూ హీరోయిన్. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు.ఈ దంపతులకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ తన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను, సుందర్ ప్రేమలో ఉన్న విషయం చాలా కాలం పాటు ఎవరికి చెప్పలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోబుతున్నామనే విషయం మొదటగా హీరో కార్తీక్‌కి సుందర్ చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే కార్తీక్ నాకు ఫోన్ చేసి సంతోషంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే మా పెళ్లికి కూడా వచ్చాడు. అప్పుడు మేమిద్దరం ఆయన కాళ్లపై నమస్కరించి ఆశిస్సులు తీసుకున్నాం. ఆ సమయంలో కార్తీక్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు’ అని ఖుష్భూ చెప్పుకొచ్చింది. -
అట్టర్ ఫ్లాప్..
-
ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్న ఖుష్బూ.. కారణం ఇదేనా?
బరువెక్కిన హృదయంతో ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సినీ నటి, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ లేఖ రాశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికలలో ఖుష్బూ సీటును ఆశించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారాలకు ఆమె దూరంగా ఉంటూ రావడం చర్చకు దారి తీసింది. దీనికి ముగింపు పలికే విధంగా అధిష్టానం ఆదేశాల మేరకు కొద్దిరోజు క్రితమే ఎన్నికల ప్రచారానికి కుష్భు సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల మమా అనిపించే విధంగా ప్రచారం కూడా చేశారు. శనివారం దక్షిణ చైన్నె అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్‌కు మద్దతుగా కుష్బూ ప్రచారం కూడా చేశారు. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో గానీ ఎన్నికల ప్రచారం నుంచి బరువెక్కిన హృదయంతో తాను తప్పుకుంటున్నట్లు జేపీ నడ్డాకు ఆమె లేఖ రాయడం గమనార్హం. కారణం ఇదేనా..? 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖుష్బూకు సీటు ఇవ్వకుండా బీజేపీ దూరం పెట్టిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో తాజాగా పార్టీలో చేరిన మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు బీజేపీ సీటు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారని తమిళనాట భారీగా ప్రచారం జరుగుతుంది. ఈసారి తప్పకుండా సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఖుష్బూకు సీటు దక్కకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురైయారని వినికిడి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై, ఎల్.మురుగన్, తమిళిసై సౌందర్‌రాజన్, రాధికా శరత్‌కుమార్ వంటి ముఖ్యులకు సీటు కేటాయించిన విషయం తెలిసిందే. పార్టీలో సీనయర్ల అందరికీ సీటు కేటాయించిన బీజేపీ.. ఖుష్బూకు మొండి చేయి చూపించింది. వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేసి ఓడిపోయారనే విషయం తెలిసిందే. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఆమెకు కేటాయిస్తారని అక్కడి నేతలు అందరూ భావించారు. ఖుష్బూకు ఎందకు సీటు దక్కలేదనే విషయంపై తమిళనాడు బీజేపీ నేతలు కూడా పలు కామెంట్లు చేస్తున్నారు. ఖుష్బూకు ఎక్కడ ఏం మాట్లాడాలో ఇంకా తెలియలేదని వారు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1000ను భిక్షగా ఆమె కామెంట్ చేసి తప్పుచేశారని పేర్కొంటున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని చెబుతున్నారు. అది కాస్త అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించాయంటున్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మహిళలు కూడా ఖుష్బూ పట్ల సానుకూలంగా లేరని గుర్తుచేశారు. అందువల్ల ఆమెకు సీటు ఇస్తే ఓడిపోతారన్న భావనతో కేటాయించలేదని బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఫైనల్‌గా ఆమెకు సీటు దక్కకపోవడం.. రీసెంట్గా పార్టీలో చేరిన రాధికా శరత్ కుమార్‌కు ప్రధాన్యత ఇచ్చి సీటు ఇవ్వడంతో ఖుష్బూలో వ్యతిరేఖత వచ్చిందని అందుకే ఇక ఎన్నికల ప్రచారానికి ఆమె గుడ్‌బై చెప్పారని ప్రచారం జరుగుతుంది. -
అత్తమ్మ కల నెరవేర్చిన బీజేపీ నేత ఖుష్బూ
సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన అత్తమ్మ కలను నెరవేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలన్న తన అత్తమ్మ కల నెరవేరిందని ఖుష్బూ సుందర్ ‘ఎక్స్’ ట్విటర్లో తెలిపారు. తను, ఆమె అత్తమ్మ దైవనై చిదంబరం పిళ్లై.. ప్రధాని మోదీతో దిగిన పలు ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పడానికి నా వద్ద తగిన మాటలు లేవు. మా అత్తమ్మ కల నిజం చేసి.. ఆమెలో సంతోషం నింపినందుకు పీఎం మోదీ కృతజ్ఞతలు. 92 ఏళ్లు ఉన్న తన అత్తమ్మ మోదీకి చాలా పెద్ద అభిమాని. జీవితంలో ఒక్కసారైనా ఆమె మోదీని కలవాలని కలలు కనేది. ప్రస్తుతానికి ఆమె కల నిజమైవటం పట్ల అత్తమ్మతో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా’ అని ఖుష్బూ కామెంట్ జత చేశారు No amount of words would suffice to thank our H'ble PM Shri @narendramodi ji for giving so much happiness and joy to my ma-in-law, Smt #DeivanaiChidambaramPillai , who at 92 is a huge Modi follower and a fan. It was a moment of super excitement for her as it was her dream to… pic.twitter.com/5OM4E1Uaad — KhushbuSundar (@khushsundar) January 20, 2024 ‘ప్రధాని మోదీ ప్రపంచంలోనే గొప్ప పేరున్న నేత. చాలా ప్రేమగా, మర్యాదతో మా అత్తమ్మతో మోదీ మాట్లాడారు. ఒక తల్లితో కుమారుడు ఎలా మాట్లాడుతారో.. అచ్చం అలానే తన అత్తమ్మతో ఆప్యాయంగా మాట్లాడారు.అందుకే మోదీని ప్రజలంతా ఇష్టపడటం, అభిమానిస్తారు. దేవుడి ఆశీర్వాదం పొందిన గొప్పమనిషి మోదీ’ అని ఆమె సుదీర్ఘంగా రాసుకోచ్చారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఖుష్బూ కోరిక మేరకు ఆమె అత్తమ్మను కలిసి.. కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఇక.. పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి గొప్ప పేరు సంపాధించుకున్న ఖుష్బూ 2020లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆమె నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. చదవండి: గ్రామాలపై బీజేపీ ఫోకస్.. ప్రచారానికి కొత్త కార్యక్రమం -
త్రిష, చిరంజీవిపై కేసు.. మళ్లీ రచ్చ చేస్తున్న మన్సూర్..!
తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ కొద్దిరోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని తరువాత, నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. 'మహిళలను కించపరిచే విధంగా మన్సూర్ అలీఖాన్ మాట్లాడాడు. ఆయనతో మళ్లీ నటించను. అతనిపై చర్యలు తీసుకోవాలని పోస్ట్ చేశారు. దీని తరువాత, నటి ఖుష్బూ, చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై తమ నిరసనను వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: నటుడు నరేశ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తింపు) అయితే తానేమీ తప్పుగా మాట్లాడలేదని మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. మరోవైపు నటుడు మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు లేఖ పంపింది. దీంతో చెన్నై పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నటుడు మన్సూర్ అలీఖాన్ అదృశ్యమయ్యారనే వార్తల నేపథ్యంలో, దానిని ఖండిస్తూ ఆడియోను విడుదల చేశారు. అనంతరం నవంబర్ 23న మన్సూర్ అలీఖాన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంలో, త్రిష గురించి మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతూ మన్సూర్ అలీఖాన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో, 'నా తోటి నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి' అని చెప్పాడు. ఈ నేపథ్యంలో నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో 'తప్పు చేయడం మానవుడి సహజం, క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది' అని పోస్ట్ చేసింది.దీంతో ఈ గొడవ ముగిసింది అనుకుంటే.. తాజాగా మళ్లీ మన్సూర్ తెరపైకి వచ్చాడు. ఆ ముగ్గురిపై కేసు ఖుష్బు, త్రిష, చిరంజీవిలపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రకటించారు. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా రేపు కోర్టులో కేసు వేయబోతున్నట్లు తెలిపారు. వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని ఆయన ప్రకటించాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ వల్ల రచ్చ.. వనిత విజయ్‌కుమార్‌పై దాడి) నవంబర్ 11న విలేకరుల సమావేశంలో తాను మాట్లాడిన ‘నిజమైన వీడియో’ని వారికి పంపించానని మన్సూర్ తెలిపాడు. సరిగ్గా వారం తర్వాత నవంబర్ 19న జరిగిన ఈ వీడియోనే తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, మరికొన్ని ఆధారాలతో రేపు కేసు నమోదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ముగిసిపోయిన గొడవను మళ్లీ మన్సూర్ తెరపైకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. -
మన్సూర్ అలీఖాన్‌కు సమన్లు.. నేడు విచారణ
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్‌కు థౌజండ్ లైట్స్ పోలీసులు సమన్లు జారీ చేశారు. గురువారం తమ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వివరాలు.. సినీ నటి త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదుతో డీజీపీ శంకర్‌జివ్వాల్ ఆదేశాల మేరకు మన్సూర్‌పై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆయన్ని విచారించేందుకు థౌజండ్ లైట్స్ పోలీసులు సిద్ధమయ్యారు. విచారణకు రావాలని ఆదేశిస్తూ ఆయనకు సమన్లు పంపించారు. ఇదిలా ఉండగా మన్సూర్ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో నటి ఖుష్భు ‘చేరి’(స్లం) భాష గురించి తనకు తెలియదని, తాను మాట్లడలేనని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ చేరి భాష మద్దతు దారులు కుష్భుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పే పనిలో పడ్డాడు. దర్శకుడు పా రంజిత్ , నటి గాయత్రి రఘురాం కుష్భు వ్యాఖ్యలను ఖండించారు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కుష్భుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో స్వరాన్ని పెంచిన వాళ్లు ఎక్కువే. మన్సూర్ వ్యవహారంలో ఆగమేఘాలపై స్పందించిన కుష్భు మణిపూర్ వ్యవహారంలో ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించడం గమనార్హం. -
టీడీపీ సత్యనారాయణపై నటి రాధిక సీరియస్.. మంత్రి రోజాకు మద్దతు
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజాకు సినీనటి రాధికా శరత్‌కుమార్ అండగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా మరో సినీ నటి రాధిక.. మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?. దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. I condemn below the belt hitting , labelling women, objectifying and being unparliamentary, an ex minister #bandarasatyanarayana has no qualms with his language and attitude. I stand for minister /actor amd good friend @RojaSelvamaniRK #women #harassment #politics pic.twitter.com/nmGHyeLgi2 — Radikaa Sarathkumar (@realradikaa) October 6, 2023 బండారు సత్యనారాయణ వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి అని వీడియోలో రాధిక తెలిపారు. మంత్రి రోజాకు నటి కుష్బూ సపోర్ట్.. ఇదిలా ఉండగా, అంతకుముందు.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరు. బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు సీరియస్ అయ్యారు. ఈ విషయంలో మంత్రి రోజా నా మద్దతు ప్రకటిస్తున్నా. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారు. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ నేత బండారు సత్యనారాయణపై కుష్బూ ఆగ్రహం
-
ఆ ఆలయంలో ఒక ప్రత్యేకత.. ఈసారి ఖుష్బూను వరించిన అదృష్టం
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటీమణుల్లో ఖుష్బూ ఒక్కరు. ఎక్కడో ఉత్తరాదిలో పుట్టి పెరిగిన ఈమె దక్షిణాదిలో ప్రముఖ నటిగా రాణిస్తుండటమే కాకుండా, తమిళనాడు రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారడం విశేషం. కుష్బూ ఏ రాజకీయ పార్టీలో ఉన్న తన గళాన్ని గట్టిగా వినిపిస్తారు. ఇదే ఆమె ప్రత్యేకత. నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న కుష్బూకు ఇటీవల ఒక అరుదైన గౌరవం దక్కింది. తిరుచూర్‌లోని విష్ణు మాయ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. (ఇదీ చదవండి: శివాజీ పిచ్చి ప్రవర్తన.. గేమ్‌లో ఏకంగా బెంచ్‌నే తన్నేశాడు!) ఈ ఆలయంలో ఏడాదికోసారి జరిపే ప్రత్యేక నారీ పూజ కార్యక్రమాలకు ఓ మహిళను ఆహ్వానిస్తారు. అలా ఈ ఏడాది ఆ గౌరవం నటి కుష్బూకు దక్కింది. ఆ ఆలయ నిర్వాహకులు నటి కుష్బూను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ పూజా కార్యక్రమం ఎప్పుడు జరిగిందో గానీ, నటి కుష్బూ ఈ విషయాన్ని మంగళవారం తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో విష్ణు మాయ ఆలయంలో నారీ పూజ కోసం తనను ఆహ్వానించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ పూజలో ఎంపిక చేయబడిన వారు మాత్రమే ఆహ్వానితులని చెప్పారు. వారిని ఆ దైవమే ఎంపిక చేస్తుందని ఆలయ నిర్వాహకుల నమ్మకమన్నారు. ఇలాంటి గౌరవాన్ని తనకు కల్పించిన ఆలయ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. నిత్యం ప్రార్థించే వారికి, మనల్ని కాపాడడానికి ఒక సూపర్ శక్తి ఉంటుందని నమ్మేవారికి, పూజ మరింత మంచిని కలగజేస్తుందని తాను నమ్ముతున్నాను అని కుష్బూ పేర్కొన్నారు. ఆమె పూజలో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా నటి కుష్బూ తాజాగా తన భర్త సుందర్ సి దర్శకత్వంలో రూపొందిస్తున్న అరణ్మణై 4 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
ఆ హీరో నా పరువు తీశాడు చాలా బాధేసింది... కానీ..!
-
తన జీవితంలో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి నటి కుష్బూ
-
నటి కుష్బూ కాస్టింగ్ కౌచ్ గురించి ఏమన్నారంటే..!
-
లివింగ్ రిలేషన్ లో ఉండటం తప్పేమీ కాదు : కుష్బూ
-
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటి..? : కుష్బూ
-
నాకు తనకి ఎఫైర్ ఉంది అని అనుకున్నారు కానీ..!
-
నాకు హీరో వెంకటేష్ అంటే చాలా ఇష్టం..!
-
ఇప్పుడున్న హీరోయిన్స్ కి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి
-
స్టాలిన్‌కు భయమెందుకు..?
సాక్షి, చైన్నె : ఇండియా కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థిని ప్రకటించడంలో సీఎం స్టాలిన్‌కు భయం ఎందుకు..? అని బీజేపీ మహిళానేత కుష్భు ప్రశ్నించారు. శనివారం స్థానికంగా ఆమె మాట్లాడుతూ, ఇండియా కూటమి సమావేశంపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అందరూ ఏకం అయ్యారని వివరించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తాజాగా ఆమె గుర్తు చేశారు. ఇప్పడెందుకో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అని ప్రకటించేందుకు స్టాలిన్ భయ పడుతున్నారు? అని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ మాత్రమేనని, అయితే, ఇండియా కూటమిలో రాహుల్, నితీష్, మమత, అఖిలేష్... ఇలా ఎవరో ఆ ప్రధాని అభ్యర్థి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీఎం అభ్యర్థి రాహుల్ అని గతంలో వినిపించిన గళాన్ని ఇప్పుడెందుకు మూసివేశారని ప్రశ్నించారు. ఓడి పాతరనే భయం వారిలో ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతి పది మందిలో ఎనిమిది మంది మళ్లీ ప్రధాని నరేంద్రమోదీ అని స్పష్టం చేస్తున్నారని, దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన తమ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ధీమా వ్యక్తం చేశారు. -
స్టాలిన్ సినిమాలో అక్కగా ఎందుకు చేసానంటే...!
-
కాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పిన కుష్బూ
-
నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిన నటి కుష్బూ. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి, టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విక్టరీ వెంకటేశ్ హీరోగానటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. దాదాపు తమిళ స్టార్స్ అందరితో ఖుష్బూ కలిసి నటించారు. తమిళనాడు అభిమానులు ఆమెకు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్భూకు అక్కడ ఏ స్థాయి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సుందర్‌తో ప్రేమలో పడి 1991లో అతన్ని వివాహం చేసుకుంది.వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పేర్లు అవంతిక, అనంతిక. వీరి పిల్లల గురించి చాలా మందికి తెలియదు. పెద్ద కూతురు అవంతిక ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటుంది. సోషల్ మీడియాలో అవంతిక చాలా ఫాలోయింగ్ ఉంది. తరచు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అవంతికి చూడడానికి అచ్చం సినిమా హీరోయిన్లా చాలా అందంగా ఉంటుంది. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తోంది. లండన్‌లో స్టడీస్ పూర్తయిన వెంటనే ఆమె సినిమాల్లోకి వచ్చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే సినిమాల్లోకి వస్తే మాత్రం తన అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాలను పక్కకి పెట్టి అవంతిక ఫోటోలనే ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by avantika (@avantikasundar) View this post on Instagram A post shared by avantika (@avantikasundar) -
నా భర్తకు నాకంటే సౌందర్య అంటే ఎక్కువ ఇష్టం
-
ఆస్పత్రిలో కుష్బూ
ఫైర్‌బ్రాండ్ నటిగా ముద్ర వేసుకున్న నటి, బీజేపీ అధికార ప్రచారకర్త కుష్బూ గురువారం సాయంత్రం మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఇమె ఇటీవలే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్స పొంది డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. ఈమె ఇటీవల తనను కించపరిచేలా మాట్లాడిన స్థానిక డీఎంకే ప్రచారకర్తపై చెన్నై పోలీస్ కమిÙనర్కు ఫిర్యాదు చేసి ఆయనకు మీడియా ద్వారా స్ట్రాంగ్ వారి్నంగ్ ఇచ్చి వార్తల్లోకెక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో కుష్బూ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వెన్నెముక మళ్లీ నొప్పిగా ఉండడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ సారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. -
కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్
చెన్నై: బీజేపీ నాయకురాలు, తమిళ సీనియర్ నటి కుష్బూపైన, తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుండి ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ వేదిక మీద సీఎం స్టాలిన్ సమక్షంలోనే శివాజీ కృష్ణమూర్తి బీజేపీ నేత కుష్బూ గురించి ప్రస్తావిస్తూ.. నేను నిన్ను చెప్పుతో కొట్టగలను.. కానీ అది చెప్పులకు అవమానమని అన్నారు.. ఇక తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవి ఇటీవల అసెంబ్లీలో అంబేద్కర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా సంకోచిస్తున్నారు.. అలాంటప్పుడు ఆయనపై దాడి చేయడం తప్పే లేదని వెంటనే కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ టెర్రరిస్టులు మీపై తుపాకులు ఎక్కుపెడతారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలైన కుష్బూ తీవ్రంగా స్పందించారు.. ఆయన నన్నే కాదు మీ నాన్నలాంటి గొప్ప నాయకులను కూడా కించపరుస్తున్నారు అర్ధం కావడం లేదా? అని సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. ఆడవాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడొచ్చన్న వారి ధోరణి చూస్తేనే అర్ధమవుతోంది వారి పెంపకం ఎలాంటిదో. నేను దీన్నంత తేలిగ్గా వదలను, IPC సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తానన్నారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినందుకు శివాజీ కృష్ణమూర్తి ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది డీఎంకే పార్టీ. అలాగే ఆయన్ను అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసింది. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
నటి ఖుష్భూ కూతుర్ని చూశారా? గ్లామర్ షోతో రచ్చరచ్చ
ప్రముఖ నటి ఖుష్భూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తుంది. సినిమాల్లోనే బిజీ హీరోయిన్గా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సుందర్‌తో ప్రేమలో పడిన ఖుష్భూ 1991లో అతడిని పెళ్లాడింది. వీరికి అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లండన్‌లో చదువుకుంటున్న అవంతిక ఓ వైపు చదువుకుంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో తరచూ తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా లండన్‌లోని ఓ కాఫీ షాపులో పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ లెవల్లో గ్లామర్ షో చేస్తుందంటే.. త్వరలోనే సినిమాల్లోకి వచ్చేస్తుందేమో అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలాంటి పొట్టి బట్టలు నీకు అవసరమా? అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by avantika (@avantikasundar) View this post on Instagram A post shared by avantika (@avantikasundar) View this post on Instagram A post shared by avantika (@avantikasundar) -
రామబాణంతో ఇన్నాళ్లకు కుష్బూ స్పెషల్ ఇంటర్వ్యూ
-
నా బెడ్ రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ
ఖుష్బూ.. దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన గొప్ప నటి. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్బూకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకొవచ్చు. ఆమెతో కలిసి నటించేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపేవారట. ఖుష్బు కూడా దాదాపు అందరికి స్టార్లలతో కలిసి నటించింది. కానీ తన అభిమాన హీరోతో కలిసి నటించే అవకాశం ఇప్పటికీ రాలేదని తెగ ఫీలవుతుంది. ఇంతకీ ఖుష్బూ అభిమాన హీరో ఎవరో తెలుసా? బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆయన అంటే ఆమెకు చచ్చేంత ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడింది. (చదవండి: ప్రభాస్ ‘ఆదిపురుష్’కు అరుదైన గౌరవం) ‘అమితాబ్ బచ్చన్‌గారికి నేను చాలా పెద్ద అభిమానిని. నా బెడ్ రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి. ఆయనతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. కానీ జోడీగా చేయలేదనే బాధ ఉంది. ‘చీనీ కమ్’ చిత్రంలో అమితాబ్‌గారితో టబు నటించింది. ఆ చాన్స్ నాకు రాలేదని బాధపడ్డాను’అని ఖుష్బూ చెప్పుకొచ్చింది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బు..ఇప్పుడు సహయనటిగా మెప్పిస్తుంది. తాజగా ఆమె గోపిచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’లో కీలక పాత్ర పోషించింది. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
స్టార్ హీరోతో కుష్బూ పెళ్ళి.. నాలుగు నెలలకే విడాకులు
-
నటి ఖుష్బూకు చిరంజీవి శుభాకాంక్షలు
ప్రముఖ నటి, బిజెపి నేత ఖుష్బూకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపికైన తనపై ఈ సందర్భంగా చిరు ప్రశంసలు కురిపించారు. కాగా నటి ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి? ‘మహిళలు, చిన్నారులపై వేధింపుల నివారణతో పాటు వారి ఆత్మగౌవరం కోసం పోరాడుతున్న నాకు అతివల మద్దతుగా గళం విప్పేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌పై చిరంజీవి స్పందిస్తూ ఖచ్చితంగా మీరు ఈ పదవికి అర్హురాలు అని పేర్కొన్నారు. చదవండి: ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్ ‘జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన కుష్బూకు నా శుభాకాంక్షలు. మీరు ఖచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నా. మహిళా సమస్యలపై పోరాడుతున్న మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుంది’ అంటూ ఆమెను చిరు ప్రశంసించారు. Very happy for you @khushsundar ! You most certainly deserve this position. Trust your presence as a member in the @NCWIndia will ensure greater focus on & more efficient redressal of all relevant issues pertaining to women & empower their voice even more.Wishing you the Best! https://t.co/zHT7HILsZz — Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023 -
కూతుళ్లపై అలాంటి కామెంట్స్.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నటి ఖుష్బూ
సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ సుందర్. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదం, విమర్శలతో వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా తన పిల్లలను ట్రోల్ చేసిన వారిని తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా తన కూతుళ్లను టార్గెట్ చేసిన ఓ నెటిజన్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇద్దరు కూతుళ్లు అవంతిక, ఆనందిక ఫొటోను రీసెంట్గా తన ట్విటర్లో ఖాతా ప్రోఫైల్ పిక్‌గా షేర్ చేశారు ఖుష్బూ. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ఈ ఫొటోపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వారు తమ ముక్కుకు సర్జరీ చేసుకున్నారు!’ అని కామెంట్ చేశాడు. దీనిపై ఆమె స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ‘20, 22 ఏళ్ల వయసున్న పిల్లలకు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లల మీద ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటు. కనీసం పిల్లలనైనా వదిలేయండి’ అంటూ ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా ఖుష్బు కూతుళ్లపై ట్రోలింగ్ జరగడం ఇది తొలి సారి కాదు. చదవండి: వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది? గతంలోనూ వారి బరువు, శరీరాకృతిపై కొందరు కామెంట్స్ చేశారు. అలా కూతుళ్లపై ట్రోలింగ్ జరిగిన ప్రతిసారి ఖుష్బు వారికి కౌంటరి ఇస్తూనే వచ్చారు. తాజాగా మరోసారి తన పిల్లల గురించి అసత్య ప్రచారం చేయడంతో ఖుష్బూ ఘాటుగా స్పందించారు. కాగా హీరోయిన్గా కెరీర్ పీక్‌లో ఉండగానే దర్శకుడు సుందర్‌ను ఖుష్బూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి అవంతిక, ఆనందిక అనే ఇద్దరు కూమార్తెలు జన్మించారు. Why would a 20 and a 22 yr old go under a knife?? It’s a shame when children are part of trolling. At least spare the kids. https://t.co/wJ3NSME5aN — KhushbuSundar (@khushsundar) February 13, 2023 #NewProfilePic ❤️ pic.twitter.com/PVAjL5LeBC — KhushbuSundar (@khushsundar) February 13, 2023 -
సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం
సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటారు. ఇటీవల తన కాలుకి గాయమైందని.. అయినా తన ప్రయాణం ఆగదంటూ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అన్నట్టుగానే మంగళవారం ఉదయం కుష్బూ వేరే రాష్ట్రానికి వెళ్లడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థపై ఆమె ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న కుష్బూ గాయమైన కాలితోనే మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. చదవండి: వేణుకి రూ. 20 కోట్ల పైగా ఆస్తులు.. కానీ నేను అద్దే ఇంట్లో ఉంటున్నా: వేణు మాధవ్ తల్లి అయితే అక్కడ ఆమెకు వీల్‌చైర్ అందుబాటులో లేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. అందులో ఎయిర్ ఇండియా సంస్థకు వీల్‌చైర్ ఏర్పాటు చేసే స్థోమత లేదా? అంటూ ప్రశ్నించారు. అందు కోసం తాను అరగంట పాటు కాలి నొప్పితో ఎదురుచూశానన్నారు. ఆ తర్వాత వేరే విమాన సంస్థ నుంచి వీల్‌చైర్ తీసుకొచ్చి తనను పంపించారన్నారు. కాగా ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా విమాన సంస్థ నిర్వాహకులు నటి కుష్బూకు క్షమాపణ తెలుపుతూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామం, ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తా’’మని పేర్కొన్నారు. Dear @airindiain you do not have basic wheelchair to take a passenger with a knee injury. I had to wait for 30mnts at chennai airport with braces for my ligament tear before they could get a wheelchair borrowed from another airline to take me in. I am sure you can do better. — KhushbuSundar (@khushsundar) January 31, 2023 -
ఖుష్బూ కాలికి గాయం.. అయినా ఆపుకోని ప్రయాణం!
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ. ఈ పేరే ఒక సంచలనం. 1990 ప్రాంతంలో అగ్ర కథానాయకిగా రాణించారు. రజినీకాంత్, కమల్ హాసన్, ప్రభు, కార్తీక్ వంటి ప్రముఖ హీరోలతో నటించారు. తెలుగు, హిందీ తదితర భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు సుందర్.సిని ప్రేమ వివాహం చేసుకున్నారు. నటిగా కొనసాగుతూనే ఉన్నారు. అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రంగంలోనూ ఉనికిని చాటుకుంటున్నారు. ఈమెకు ఇద్దరు కూతుర్లు. కాగా బొద్దుగా ముద్దుగా ఉండే ఖుష్బూ ఇటీవల ఎవరూ ఊహించనంతగా స్లిమ్‌గా తయారయ్యారు. అదే విధంగా ఇటీవల విజయ్ కథానాయకుడిగా నటించిన వారిసు చిత్రంలో ఖుష్బూ ముఖ్యపాత్రను పోషించారు. అయితే ఆమె పోర్షన్ పూర్తిగా ఎడిటింగ్ రూమ్‌కే పరిమితం అయిపోయింది. ఇది ఆమె అభిమానులను నిరాశపరిచే విషయమే. తాజాగా ఆమె మరో షాక్ ఇచ్చారు. కుడికాలుకు కట్టు కట్టిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. పక్కన రెండు వీల్ సూట్ కేసు ఫొటోలను కూడా ఉంచారు. అందులో “మీ జీవితంలో విచిత్రమైన విపత్తులు ఎదురై బాధిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు తెలియదు కానీ, తన ప్రయాణం మాత్రం కొనసాగుతుందని, సాధించేవరకూ ఆగదు అని పేర్కొన్నారు. అదే విధంగా కోయంబత్తూర్ టూ ఢిల్లీ, హైదరాబాద్ టూ దుబాయ్ అంటూ తాను ప్రయాణించే ప్రాంతాల పేర్లను కూడా ప్రస్తావించారు. అలా తన కాలుకు దెబ్బ తగిలినా కూడా ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకోలేదు అనే విషయాన్ని తెలియజేశారు. అయితే అసలు ఖుష్బూకు జరిగిన ప్రమాదం ఏమిటి అని ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే తన ప్రయాణం రద్దు కాదు, సాధించేవరకు ఆగదు అని పేర్కొన్నడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
Kushboo: సీనియర్ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..
సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూశారు. ఈ విషయంపై ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్చేసింది. 'మనకు ఇష్టమైన వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉండాలని కోరుకున్నప్పటికీ వోడ్కోలు చెప్పే సమయం స్తుంది. ఈరోజుతో మా అన్నయ్య ప్రయాణం ముగిసింది. ఆయన ప్రేమ,గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అన్నయ్య కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.అన్నయ్య చెప్పినట్లుగా.. జీవిత ప్రయాణాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ ఖుష్బూ భావోద్వేగానికి లోనైంది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ నేడు(శనివారం)తుదిశ్వాస విడిచారు. ఈయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
Rajinikanth- Kushboo: కాస్త నవ్వు.. కప్పు కాఫీ అంతేనా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటుడుగా 50 వసంతాలకు దగ్గరలో ఉన్న నటుడు ఈయన. 1975లో అపూర్వ రాగంగళ్ చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన రజనీకాంత్ ఇప్పటివరకు 168 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం 169వ చిత్రం జైలర్‌లో నటిస్తున్నారు. ఇన్నేళ్ల సినీ జీవితంలో అనేక రకాల పాత్రల్లో, పలు భాషల్లో నటించి సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగారు. నేటికీ ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నారు. మధ్యలో రాజకీయ రంగ ప్రవేశ ప్రస్థానాన్ని తీసుకొచ్చారు. అయితే ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఆయనకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ వల వేస్తూనే ఉంది. ఇకపోతే సంచలన నటి కుష్భు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ మొదట తెలుగులో కలియుగ పాండవులు చిత్రంతో కథానాయికగా పరిచయమైన తరువాత కోలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ తొలి చిత్రంతోనే రజనీకాంత్ సరసన నటించే లక్కీఛాన్స్ అందుకున్నారు. ఆ తరువాత కమలహాసన్, కార్తీక్, ప్రభు వంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించి పాపులర్ అయ్యారు. అలా అభిమానులు గుడి కట్టించే స్థాయికి ఎదిగారు. అంతేకాదు ఉత్తరాదికి చెందిన కుష్భు తమిళనాడు మెట్టినిల్లుగా మార్చుకున్నారు. ఓ పక్క నటిస్తూనే మరో పక్క నిర్మాతగా మారి చిత్రాలను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు. అనూహ్యంగా శనివారం స్థానిక పోయెస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. దీంతో బీజేపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా, రజనీకాంత్‌తో ఆ పార్టీ నాయకురాలు కుష్భు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీని గురించి నటి కుష్భు వివరణ ఇస్తూ తాను తమిళంలో నటించిన తొలి చిత్రం ధర్మత్తిన్ తలైవన్ అని అందులో రజనీకాంత్ సరసన నటించినట్లు గుర్తు చేశారు. ఆ చిత్రం విడుదలై 34 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌ను కలిశానని కాస్తంత నవ్వు, కప్పు కాఫీ వంటి సంతోషకరమైన విషయాలు మినహా ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అన్నట్టు గత ఏడాది విడుదలైన అన్నాల్తై చిత్రంలో తలైవాతో కుష్భు కలిసి నటించారన్నది గమనార్హం. -
డీఎంకే నేత సాధైయ్ సాధిక్ వ్యాఖ్యలపై నటి ఖుష్బు సీరియస్
-
బీజేపీలో రాజ్యసభ ఆశలు.. కుష్బుకు బెర్తు దక్కేనా?
సాక్షి, చెన్నై: రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పదవి కోసం రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందులో సినీ నటి కుష్భు పేరు ప్రథమంగా వినిపిస్తున్నా, తెర మీదకు మరి కొందరు నేతల పేర్లు రావడంతో ఎవరిని అదృష్టం వరిస్తుందోననే చర్చ ప్రారంభమైంది. రాజ్యసభలో ప్రస్తుతం నామినేటెడ్ ఎంపీలుగా వ్యవహరిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి, సురేష్ గోపి, మేరికోం, రూపా గంగూలీ, నరేంద్ర జాదవ్ తదితర ఆరుగురి పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్రం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. సుబ్రహ్మణ్య స్వామికి ఇది వరకు తమిళనాడు నుంచి నామినేటెడ్ ఎంపీ పదవిని కేటాయించారు. ఈసారి ఆయనకు పదవి మళ్లీ దక్కేది అనుమానంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న విమర్శలే ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నా యి. దీంతో తమిళనాడు నుంచి ఈ పదవి సినీనటి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న కుష్బుకు దక్కవచ్చు అనే చర్చ నడుస్తోంది. పార్టీ కోసం ఆమె తీవ్రంగానే శ్రమిస్తున్నా, సరైన గుర్తింపు రావడం లేదని మద్దతుదారులు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అదే సమయంలో గత కొద్దిరోజులుగా మోదీకి మద్దతుగా సంగీత దర్శకుడు ఇలయరాజా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక, రాష్ట్ర బీజేపీలో సీనియర్లు ఉంటూ, ఎలాంటి పదవులు లేకుండా ఉన్న పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్ కూడా రేసులో ఉండటం గమనార్హం. అయితే, కళా రంగం కేటగిరిలో కుష్భుకు లేదా ఇలయరాజాకు పదవీ గ్యారంటీ అన్న ప్రస్తుతం ఊపందుకుంది. -
ఆడవాళ్లెవరూ అలా మాట్లాడరు: దీదీపై కుష్భూ ఫైర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ హన్స్‌ఖలీ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది అధికార టీఎంసీ నేత కొడుకే కారణమంటూ ఆరోపణలు వస్తుండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఐదుగురు సభ్యులతో కూడిన బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(శుక్రవారం) హన్స్‌ఖలీలో పర్యటించింది. బాధిత కుటుంబాన్ని పర్యటించి.. పూర్తి వివరాలను సేకరించింది. చేసిన వ్యాఖ్యలకు సీఎం మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది ఆ కమిటీ డిమాండ్ చేసింది. ఇక ఈ కమిటీలో సభ్యురాలైన బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మాట్లాడుతూ... ఈ హత్యాచారాన్ని పక్కదోవ పట్టించేందుకు మమతా బెనర్జీ దారుణమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆమె అత్యాచారానికి గురయిందా? లేదంటే ప్రేమ వ్యవహారం కారణమా? అనే విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలుసు. ఒకవేళ వారు ప్రేమలో ఉంటే వారిని నేనెలా ఆపగలను?... సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరోవైపు ఒక మహిళ అయివుండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు కుష్భూ. ఆడవాళ్లెవరూ అలా మాట్లాడరని, ఆమె మీద నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజలను చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇద్దరు బిడ్డల తల్లిగా బాధిత కుటుంబం ఆవేదనను, బాధను తాను అర్థం చేసుకోగలనని, మమతా బెనర్జీ చేసిన ప్రకటన పూర్తిగా క్రూరంగా ఉందని, వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కుష్భూ. Mamata Banerjee should show the spine and courage to come out and apologise for the remark she made: BJP's @khushsundar.#NadiaRapeCase #HanskhaliRapecase #WestBengal #ReporterDiary (@RittickMondal) pic.twitter.com/BpKhhSpBbR — IndiaToday (@IndiaToday) April 15, 2022 ఇదిలా ఉండగా.. బెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కుష్భూ అన్నారు. మరోవైపు ఈ ఘటనకు టీఎంసీ నేత కుమారుడే కారణమని భాదితురాలి కుటుంబం అంటోంది. -
వాళ్లతో పనిచేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను : ఖుష్బూ
ఇండస్ట్రీలో ఇకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు కూడా చక్రం తిప్పుతున్నారు. కీలకమైన పాత్రల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ. ఆమె కీలక పాత్రలో నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆడవాళ్లు అంటే ఎక్కువగా గ్లిజరిన్‌తోనే పని ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ సినిమాతో ఆ భావన తప్పు అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆడవాళ్లు నవ్వుతూ, నవ్విస్తూ సందడి చేస్తారు. అలాగే నా పాత్ర ఎలా ఉందన్నది సినిమా చూశాక ఆడియెన్స్ చెప్పాలి. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇక స్క్రిప్ట్ నచ్చితే కొత్త దర్శకులతో పనిచేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. -
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నత్తె’ మూవీ స్టిల్స్
-
ఖుష్బూకు ‘ప్రత్యేక’ పదవి
సాక్షి, చెన్నై: ఎట్టకేలకు బీజేపీలో నటి ఖుష్బూకు ఓ పదవి దక్కింది. ఆ పార్టీ ప్రత్యేక ఆహ్వానితురాలిగా గురువారం ఆమెను నియమించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన ఖుష్బూకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. అయితే ఏళ్ల తరబడి తాను సేవ చేసిన ట్రిప్లికేన్‌లో కాకుండా థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో పోటీ చేయడంతో ఓటమి తప్పలేదు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఎల్. మురుగన్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి, అన్నామలైకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కాయి. దీంతో ఖుష్బూకు కూడా కీలక పదవిని అప్పగిస్తారని మద్దతుదారులు, అభిమానులు ఎదురు చూశారు. అయితే, ఆమెకు పార్టీ ప్రత్యేక ఆహ్వానితురాలు పదవిని అప్పగించారు. అలాగే సీనియర్ నేతలు హెచ్ రాజకు ప్రత్యేక ఆహ్వానితుడిగా, మరో నేత పొన్ రాధాకృష్ణన్‌ను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. కమలం నిరసనల హోరు.. కరోనా దృష్ట్యా, శుక్ర, శని, ఆదివారాల్లో ఆలయాల్లోకి భక్తులకు అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వద్ద గురువారం నిరసనలు జరిగాయి. ముఖ్య నేతల నేతృత్వంలో 12 ప్రసిద్ధి చెందిన ఆలయాల వద్ద పార్టీ వర్గాలు నిప్పుల కుండను చేత బట్టి నిరసన చేపట్టారు. చెన్నై కాళికాంబాల్ ఆలయం వద్ద జరిగిన నిరసనకు హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ, సినిమా థియేటర్లు, టాస్మాక్ మద్యం దుకాణాల్ని తెరిచిన ఈ పాలకులు, ఆలయాల విషయంలో ఏకపక్ష ధోరణి అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఆలయాల్లోకి భక్తుల్ని పూర్తిస్థాయిలో అనుమతించాల్సిందే అని డిమాండ్ చేశారు. -
ఆ విషయం సమంత-నాగ చైతన్యలకే తెలుసు: ఖుష్బూ
Khusbhu Reacts To Samantha Naga Chaitanya Divorce: నాగ చైతన్య-సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చూడముచ్చటైన ఈ జంట విడిపోవడం అక్కినేని అభిమానులే కాక నెటిజన్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సామ్-చై విడాకుల వ్యవహారంపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి ఖుష్బూ ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించింది. చదవండి: ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది: నాగ చైతన్య 'భార్య భర్తల మధ్య ఏం జరిగిందనేది వాళ్లిద్దరికి తప్పా మరెవరికి తెలియదు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికి తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ఈ విషయంపై అనవరసరమైన ఊహాగానాలు, రూమర్స్ సృష్టించవద్దు' అని కోరారు. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన సమంత What happens between a couple,is between them. Nobody knows the actual reason why they part ways, except the two of them. What we can do as human is to respect their privacy n give them space to understand the situation more. Stop assuming, speculating n coming to conclusions. 🙏 — KhushbuSundar (@khushsundar) October 2, 2021 -
న్యూలుక్లో అదరగొట్టిన నటి: గుర్తు పట్టడం కష్టమే!
సాక్షి, హైదరాబాద్: బొద్దుముద్దుగా తెలుగు, తమిళ సినిమాలతో ఆకట్టుకున్న నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ కొత్త అవతారంతో ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. ఐదుపదుల వయసులో 30 ఏళ్ల స్టన్నింగ్ బ్యూటీగా అదరగొట్టడంతో దాదాపు ఎవరూ గుర్తు పట్టలేక పోయారు. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండేందుకు ఇటీవల భారీ కసరత్తులు మొదలు పెట్టిన ఆమె రీసెంట్ ఫోటో షూట్‌తో ఆశ్చర్యంలో ముంచెత్తేసింది. 10 నెలల్లో దాదాపు 12 కిలోల బరువు తగ్గి స్టన్నింగ్ మేకోవర్‌తో ఔరా అనిపించారు. అంతేకాదు ఈ సందర్బంగా నెటిజన్ కొంటె ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై కూడా వైరల్ అయింది. చదవండి : అలా నటిద్దామనుకున్నాడు.. కనీసం మంచం కూడా దిగలేక పాట్లు! ‘‘హార్డ్ వర్క్ ఫలితాలు ఇచ్చినప్పుడు, సంతోషాన్ని వివరించలేము" అంటూ నటి ఖుష్బూ ట్రెండీ డ్రెస్‌లో తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్ ఒకరు..మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని ప్రపోజ్ చేశాడు. దీనికి స్పందించిన ఆమె సారీ నువ్ బాగా లేట్.. 21 ఏళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉండాల్సింది. అయినా సరే ఒకసారి నా భర్తని అడిగి చెబుతా అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. ఇది అక్కడిదే ఆగిపోలేదు.. మీ భర్త నుంచి సమాధానం వచ్చిందా మేడం అంటూ ఆరాతీశాడు. దీంతో ఆయనకు నేను మాత్రమే భార్యని.. కాబట్టి సారీ అని చెప్పామన్నారు. నన్ను వదులుకునేందుకు రెడీగా లేరు' అని ఖుష్బూ సమాధానం ఇచ్చింది. నెటిజన్‌కు ఖుష్బూకి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి : Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్! కాగా తమిళ చిత్ర పరిశ్రమలో రారాణిలా వెలిగిన ఖుష్బూ తాజాగా రజనీకాంత్ రాబోయే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తోంది. ఇక రాజకీయ పరంగా చూస్తే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఇటీవలే బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. చదవండి : Afghanistan: ఆమె భయపడినంతా అయింది! View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
భారీగా బరువు తగ్గిన ఖుష్బూ..! ఫొటో వైరల్
Kushboo Weight Loss : ఖుష్బూ ఆ మధ్య ఓ టార్గెట్ పెట్టుకున్నారు. బరువు తగ్గా లన్న టార్గెట్ అది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీ తీసుకుంటున్న ఓ ఫొటోను షేర్ చేసి, ‘‘బరువు తగ్గాలన్న లక్ష్యంతో చేసిన హార్డ్‌వర్క్‌కి తగ్గ ఫలితం కనబడుతోంది. ఫిట్‌గా ఉండాలనే ఈ హార్డ్‌వర్క్’ అన్నారు ఖుష్బూ. ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్,రష్మిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో ఖుష్బూ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. When hardwork finally starts showing results!! #weightlossgoal #fitnessmotivation pic.twitter.com/PZqh7umsBK — KhushbuSundar (@khushsundar) August 5, 2021 -
అలా చేస్తే కమిట్మెంట్ ఇస్తానని చెప్పా : నటి ఖుష్బూ
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక కోలీవుడ్‌లో ఖుష్బూకున్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఎంతగానో ఆరాధించే అభిమానులు ఖుష్బూ కోసం ఏకంగా గుడి కూడా కట్టించారు. తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్గా ఖుష్బూ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అనూహ్యంగా ఓడిపోయింది. తాజాగా తన సినీ కెరీర్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్గా ఉన్న సమయంలో తెలుగులో ఓ స్టార్ హీరో తనను కమిట్మెంట్ అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరో అయి ఉండి అలా కమిట్మెంట్ అడిగేసరికి చాలా కోపం వచ్చిందని, దాంతో మీ కూతుర్ని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే నేను కూడా కమిట్మెంట్ ఇస్తానని సదరు హీరోకు చెంప చెళ్లుమనిపించే ఆన్సర్ ఇచ్చిందట. ఖుష్బూ చెప్పిన సమాధానం విని ఆ హీరో షాక్ అయ్యాడని, ఇక అప్పటి నుంచి తామిద్దరి మధ్యా మాటలు లేవని ఖుష్బూ పేర్కొంది. అయితే తనను కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ హీరో పేరు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో ఈ స్టార్ హీరో ఎవరు అయ్యింటారా అని నెటిజన్లు సందేహంలో మునిగిపోయారు. ఖుష్బూ తెలుగులో చేసింది కూడా తక్కువ సినిమాలే కావడం, వాటిలో కూతుళ్లు ఉన్న స్టార్ హీరోలు ఎవరుంటారబ్బా అని నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ఖుష్బూ నటించిన చివరి సినిమా అజ్ఞాతవాసి. -
తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..?
చెన్నె: తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు. పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో దూకుడుతో వచ్చిన సినీ నటీనటులకు మాత్రం ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయి. ఒక్క ఉదయనిధి స్టాలిన్ తప్ప అందరూ పరాజయం మూటగట్టుకున్నారు. వారి చరిష్మా వెండితెర వరకే అని ఈ ఎన్నికల తీర్పు చెబుతోంది. తమిళ రాజకీయాలకు సినీ పరిశ్రమకు విడదీయరాని బంధం. కొన్ని దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను సినీ ప్రముఖులు ఏలారు. దాదాపు నలభై ఏళ్లకు పైగా సినీ రంగానికి చెందినవారే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరనట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సినీతారలంతా పరాజయం పాలయ్యారు. గతంలో రాష్ట్రాన్ని శాసించిన సినీనటులు ఇప్పుడు గెలవడమే కష్టంగా మారింది. ఎంజీఆర్ మొదలుకుని జయలలిత, కరుణానిధి వరకు సినీ పరిశ్రమకు చెందిన వారే. రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. ప్రస్తుతం రాజకీయాలకు సినీ పరిశ్రమ దూరం కానుందేమో. ముఖ్యంగా మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి బరిలోకి దిగిన కమల్‌హాసన్‌కు ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. పార్టీ అధినేత, స్టార్ నటుడిగా ఉన్న కమల్ హాసనే గెలవలేకపోయారు. దీంతోపాటు ఆయన పార్టీ అభ్యర్థులంతా కూడా ఓడిపోయారు. ఎంఎన్ఎం పార్టీ సత్తా చాటలేకపోయింది. ఇక ఖుష్బూను కూడా తమిళ ప్రజలు ఓడించారు. సినీనటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ తన సతీమణి ప్రేమలతను విరుదాచలం నుంచి పోటీ చేయించగా ఆమె పరాజయం పొందారు. సినీ నటుడు, దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఈ ఎన్నికల్లో తిరువొత్తియూరు నుంచి ఓడిపోయారు. నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. చెపాక్ నుంచి పోటీచేసిన ఉదయనిధి స్టాలిన్ గెలుపొందాడు. ఈ విధంగా తమిళ ఓటర్లు సినీ పరిశ్రమకు చెందినవారిని విశ్వసించలేదు. ఇక రాజకీయాల్లోకి వస్తానని.. తర్వాత అనారోగ్యంతో దూరమైపోయిన రజనీకాంత్‌కు ఇదే పరిస్థితి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
కమల్, దినకరన్, సీమాన్, కుష్బుకు తప్పని ఓటమి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు, సినీ తారలు చతికిలబడ్డారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా, చివరకు ఓటమి తప్పలేదు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కల్గిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ప్రధాన సమరం నెలకొంది. ఇరు కూటముల్లో ముఖ్య నేతలు, సినీతారలు సైతం పలువురు ఎన్నికల్లో పోటీ చేశారు. అన్నాడీఎంకే తరపున పోటీ చేసిన వారిలో మంత్రులు 12 మంది ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి. పాండియరాజన్, ఎంసీ సంపత్, సీవీ షణ్ముగం, జయకుమార్, కేటి రాజేంద్ర బాలాజీ, బెంజమిన్, ఎంఆర్ విజయభాస్కర్, కామరాజ్, ఓఎస్ మణియన్, రాజలక్ష్మి, వెల్లమండి నటరాజన్, వి.సరోజలు పరాజయం చవిచూశారు. ఈ కూటమి తరపున బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు ముఖ్య నేతలకు కూడా ఓటమి తప్పలేదు. కర్ణాటకలో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి స్వస్థలం కరూర్ జిల్లా అరవకురిచ్చి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నామలై ఓడిపోయారు. దినకరన్, కమల్, సీమాన్‌లకు తప్పని ఓటమి అమ్మమక్కల్ మున్నేట్ర కళగం పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఓటమి తప్పలేదు. కోవిల్ పట్టి నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. మూడో కూటమితో ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ విరుదాచలం నుంచి పరాజయం పాలయ్యారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న నామ్ తమిళర్ కట్చి నేత, సినీ నటుడు, దర్శకుడు సీమాన్ తిరువొత్తియూరు నుంచి ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీ చేసిన మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమలహాసన్ సాయంత్రం వరకు కాస్త మెజారిటీతో ముందుకు సాగారు. ఆ తదుపరి రౌండ్లలో మెజారిటీ తగ్గడంతో ఆయనకు పరాజయం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేశారు. గతంలో డీఎంకే, కాంగ్రెస్‌లలో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని దృష్ట్యా, ఈసారి బీజేపీలో చేరిన ఆమె అతికష్టం మీద సీటు దక్కించుకున్నారు. గెలుపు లక్ష్యంగా థౌజండ్ లైట్స్‌లో శ్రమించినా ఫలితం దక్కలేదు. -
ఐదు రాష్ట్రాల ఫలితాలు : గెలిచిన, ఓడిన నటులు వీరే
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ ఓడిపోయాడు. త్రిస్సూర్ నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. -
దర్శకుడు సుందర్‌కి కరోనా .. వెల్లడించిన ఖుష్బూ
ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నా భర్త సుందర్‌కి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ చేశాం. మా ఇంట్లోవారితో పాటుగా నేను, మా ఆఫీస్ సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందరికీ నెగటివ్ వచ్చింది. గడచిన పది రోజుల్లో మా ఆయన్ను కలిసినవారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ఖుష్బూ పేర్కొన్నారు. గతంలో తమిళంలో బ్లాక్బాస్టర్గా నిలిచిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘అరణ్మనై’కి సుందర్ దర్శకుడనే విషయం తెలిసిందే. All of us at home and our office got our #covid tests done today. All of us are negative. Relieved as my ma in law is 87 n my mom 76. Strong women with stronger minds. #staysafe #WearMask venture out only if necessary. Take care 🙏🙏❤ — KhushbuSundar ❤️ (@khushsundar) April 11, 2021 చదవండి: ఓటీటీలో కాదు థియేటర్స్‌లోనే ‘కోబ్రా’ రియల్ హీరో’ సోనూసూద్‌కి అరుదైన గౌరవం -
ఆశలన్నీ అడియాశలు.. పాపం కుష్బూ!
సాక్షి, చెన్నై: సినీ నటి కుష్బూకు బీజేపీలో కూడా గత అనుభవాలే ఎదురయ్యే పరిస్థితి ఉన్నట్టుంది. ఆరు నెలలుగా తానే ఎమ్మెల్యే అభ్యర్థి అన్నట్టుగా చేపా క్కం–ట్రిప్లికేన్ నియోజకవర్గంలో ఆమె పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఇదే పరిస్థి తి రాజపాళయంలో మరో నటి గౌతమికి తప్పలేదు. కుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే, కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకున్నా, తాజాగా బీజేపీ రూపంలో తనకు ఆ చాన్స్ దక్కుతుందన్న ధీమాతో ఆరు నెలలుగా ఆమె ఉంటూ వచ్చారు. చేపాక్కం–ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేయడం ఖాయం అన్న సంకేతాలు వినిపిస్తూ వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగానే ఆ నియోజకవర్గంలో తిష్ట వేసి, ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాల్లో కుష్బూ చేస్తూ వచ్చారు. ఆ నియోజకవర్గం పరిధిలో సినీ తరహా సెట్టింగ్‌లతో ఎన్నికల కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నాలుగు కంటైనర్లు ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల వసతులతో ఎన్నికల పనుల వేగాన్ని కుష్బూ పెంచారు. నియోజకవర్గ ప్రజల్లో చొచ్చుకెళ్లే విధంగా ప్రతి రోజూ సేవా కార్యక్రమాలు, ప్రచారాలు, ర్యాలీలు అంటూ దూసుకెళ్లారు. ఆరు నెలలుగా ఆమె చేసిన సేవ ప్రస్తుతం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఈ సీటును అన్నాడీఎంకే నుంచి రాబట్టుకోవడంలో బీజేపీ వర్గాలు విఫలమయ్యారు. దీంతో చేపాక్కం–ట్రిప్లికేన్‌లో పోటీ అన్న కుష్బూ ఆశ అడియాసలు కావడం ఆమె అభిమానుల్ని జీర్ణించుకోలేకుండా చేస్తున్నది. గౌతమికి కూడా.... బీజేపీలో గౌతమి సీనియర్. ఆమె తర్వాత గాయత్రి రఘురాం, కుష్బూ, నమిత వంటి మహిళా తారలు బీజేపీలోకి వచ్చారు. కుష్బూను చేపాక్కం ఇన్చార్జ్గా, గౌతమిని విరుదునగర్ జిల్లా రాజ పాళయం ఇన్చార్జ్గా బీజేపీ ప్రకటించింది. దీంతో రాజపాళయం నుంచి గౌతమి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అన్నట్టుగా చర్చ సాగుతూ వచ్చింది. అయితే, ఈ సీటును కూడా అన్నాడీఎంకే నుంచి రాబట్టుకోవడంలో కమలనాథులు విఫలం అయ్యారు. ఇది గౌతమి అభిమానుల్నే కాదు, అక్కడ ఆమెతో పాటు సేవల్లో నిమగ్నమైన వారిని జీరి్ణంచుకోలేకుండా చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో గురువారం గౌతమి ట్వీట్ అందర్నీ ఆలోచనలో పడేసింది. ఐదు నెలలుగా ప్రతి ఇంట్లోనూ తనను ఓ బిడ్డగా, సోదరిగా చూసుకున్నారంటూ రాజపాళయం ప్రజ లకు గౌతమి కృతజ్ఞతలు తెలుపుకోవడం గమనార్హం అలాగే, మైలాపూర్ నుంచి బీజేపీ సీనియర్ కరు నాగరాజన్, తిరుత్తణి నుంచి మరో సీనియర్ చక్రవర్తినాయుడు పోటీ చేయవచ్చన్న చర్చ సాగినా, చివరకు ఆ సీట్లలో అన్నాడీఎంకే అభ్యర్థులు రంగంలోకి దిగడం ఆ నేతల మద్దతుదారుల్ని తీవ్ర నిరాశలోకి నెట్టాయి. కుష్బూ, గౌతమిలకు మరెక్కడైనా పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ వర్గాలు కల్పించేనా లేదా, ఇతర పారీ్టలలో వీరికి ఎదురైన అనుభవాలు ఇక్కడ కూడా పునరావృతం అయ్యేనా వేచి చూడాల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నుంచి బయటకు వచ్చిన సినీ హాస్య నటుడు సెంథిల్ గురువారం కాషాయం కండువా కప్పుకోవడం విశేషం. చదవండి: కాషాయ దళానికి 20 సీట్లు మళ్లీ జంగిల్ రాజ్ దిశగా బిహార్? -
తమిళ నటి ఖుష్బూ కారుకు ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళ నటి, బీజేపీ నేత ఖుష్బూ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మెల్వార్‌వతూర్ సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. కారును ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒకవైపు డోర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, సమయానికి ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందితో కలిసి కడలూర్లో బీజేపీ నిర్వహిస్తున్న వేల్ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వివరాలన్నీ ఆమె ట్విటర్లో వెల్లడించారు. తమ దారిన తాము వెళ్తుంటే ట్యాంకర్ ఢీకొట్టిందని అన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఖుష్బూ పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల తాను క్షేమంగా బయటడ్డానని ఖుష్బూ ట్వీట్ చేశారు. మురుగన్ దేవుడే తమను కాపాడాడని తెలిపిన ఖుష్బూ... తన భర్త దేవుడిపై పెట్టుకున్న నమ్మకం రక్షణగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఏదేమైనా తన ప్రయాణం ఆగదని ఆమె వేరే వాహనంలో కడలూర్‌కు పయనమయ్యారు. ఖుష్బూ కారుకు ప్రమాదం వెనుక కాంగ్రెస్, డీఎంకే పార్టీల హస్తం కూడా అవకాశం ఉందని బీజేపీ మహిళా నేత శోభనన్ గణేషన్ అనుమానం వ్యక్తం చేశారు. -
కుష్బూ అరెస్టు
-
కాంగ్రెస్ మునిగే నౌక అని తెలిసినా.. : కుష్బూ
సాక్షి, చెన్నై: త్వరలో జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా గల్లంతు ఖాయమని బీజేపీ నేత, నటి కుష్బూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మునిగే నౌక అని తెలిసినా, సేవా దృక్పథంతో నాలుగేళ్లు పయనించినట్టు తెలిపారు. బీజేపీలో చేరిన కుష్బూ గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవలేదన్నారు. కొంతమంది నేతలు వారసులు అంటూ ముందుకు సాగుతున్నారే గానీ, ప్రజాహితంపై, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదన్నారు. తానేదో ఆదాయాన్ని ఆర్జించి బీజేపీలో చేరినట్టు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ మునిగే నౌక అని తెలిసినా నాలుగేళ్లు పయనించానని పేర్కొన్నారు. (బాధతోనే అలా అన్నా.. క్షమించండి) ఈ నాలుగేళ్లు సమయం, శ్రమను వృథా చేసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా బలోపేతం నినాదంతోనే తన పయనం ఉంటుందన్నారు. తన రాజకీయ వ్యవహారాల్లో భర్త సుందర్ సీ ఎప్పుడూ జోక్యంచేసుకోలేదన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతోనే బీజేపీలో చేరినట్టు తెలిపారు. కన్యాకుమారి నుంచి తాను పోటీ అనేది ప్రచారం మాత్రమే అని, అక్కడ బీజేపీకి బలమైన నేతగా పొన్‌రాధాకృష్ణన్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
కుష్బూపై 50 పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు
సాక్షి, చెన్నై: ప్రముఖ సనీ నటి కుష్బూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతూ తమిళనాడు దివ్యాంగుల హక్కుల సంఘం ఆమెపై 50 పోలీసు స్టేషన్ల్లో ఫిర్యాదు చేసింది. బుధవారం కుష్భూ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారిన సందర్భంగా ఆమె మీడియాతో సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆమెను వివాదంలోకి నెట్టాయి. కాంగ్రెస్‌కు మేధో వైకల్యం ఏర్పడిందని, ఆ పార్టీ నేతలు మానసిక వికలాంగులంటూ కుష్బూ విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు అసోషియేషన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ కేర్ గివర్స్ అనే దివ్యాంగుల హక్కుల సంఘం మండిపడింది. (చదవండి: బాధతోనే అలా అన్నా.. క్షమించండి) దీనిపై కుష్బూ స్పందిస్తూ.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. బాధలో రెండు తప్పుడు పదాలను వాడానని క్షమాపణలు కోరుతూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఎట్టి పరిస్థిల్లోనూ తన క్షమాపణలు అంగీకరించేది లేదని దివ్యాంగుల హక్కుల సంఘం స్పష్టం చేసింది. అంతేగాక కుష్బూపై రాజీలేని పోరాటానికి దిగుతామంటు తమిళనాడులోని 50 పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కుష్బూ చట్టాన్ని అతిక్రమించారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సంఘం డిమాండ్ చేస్తోంది. చట్టప్రకారం కుష్బూ చేసిన వ్యాఖ్యలకు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: వాళ్లంతా బుర్ర లేనోళ్లు..!) -
బాధతోనే అలా అన్నా.. క్షమించండి
సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌ని మానసిక ఎదుగుదల లేని పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యలకుగాను బీజేపీ మహిళా నేత, నటి కుష్బు క్షమాపణ కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పదబంధాలను తప్పుగా వాడినందుకు క్షమించమని కోరడమే కాక ఇది మరలా జరగకుండా చూస్తానని అన్నారు. కుష్బు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాడులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఆమె మీద ఓ హక్కుల సంస్థ 30 పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. బీజేపీలో చేరిన అనంతరం ఈ నెల 14 న కుష్బు చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: వాళ్లంతా బుర్ర లేనోళ్లు..!) ఇక తన ప్రకటనలో కుష్బు ‘ఆ సమయంలో నేను తీవ్ర దుఖం, వేదనలో ఉన్నాను. ఆ తొందరపాటులో రెండు పదబంధాలను తప్పుగా ఉపయోగించినందుకు నేను బాధపడుతున్నారు. నాకు నేనుగా ఎదిగిన వ్యక్తిని. అలాంటిది నేను వేరే వాళ్ల డైరెక్షన్లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నాను అనడం అభ్యంతరకరమైనది’ అన్నారు. అంతేకాక ‘నా కుటుంబ సభ్యులు కొందరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాకు సమర్థులైన, తెలివైన, డైనమిక్, బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇలా వేర్వేరు రకాల స్నేహితులు ఉన్నారు. వారి స్నేహం, జ్ఞానం నన్ను ధనవంతురాలిని చేసింది’ అన్నారు కుష్బు. -
వాళ్లంతా బుర్ర లేనోళ్లు..!
సాక్షి, చెన్నై : మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ బీజేపీ మహిళా నేత, నటి కుష్బు ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి తన సేవలను వాడుకున్నప్పుడు తానో నటినని తెలియలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘనస్వాగతం.. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన నటి కుష్బుకు చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్‌తో పాటు పలువురు నేతలు ఆమెను పూలమాలతో ముంచెత్తారు. అక్కడి నుంచి నేరుగా కమలాలయం చేరుకున్న కుష్బు మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకే నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆ పార్టీని విమర్శించలేదని, ప్రస్తుతం అదే శైలిలో సాగాలని నిర్ణయించినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వదలిపెట్టేలా లేరన్నారు. తనను విమర్శించ బట్టే, ఇప్పుడు పెదవి విప్పాల్సి వస్తోందన్నారు. విమర్శిస్తే, ఎదురు దాడికి సిద్ధమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తనను అణగదొక్కారని, అక్కడ బుర్ర తక్కువ నాయకులే ఎక్కువని, తనకు తెలివి ఉండబట్టే మేల్కొని బయటకు వచ్చేశానని వ్యాఖ్యానించారు. ఇది వరకు ప్రతి పక్షంలో ఉండబట్టే, అధికార పక్షాన్ని వ్యతిరేకించినట్టు తెలిపారు. ఇప్పుడు తానో నటి అన్న విషయం కాంగ్రెస్ వాళ్లకు గుర్తొచ్చినట్టుందని మండిపడ్డారు. బీజేపీలో చేరడానికి తన భర్త సుందర్ కారణం కాదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు తాను ఆనందంగా ఉన్నానని పేర్కొన్నారు. బీజేపీకి పెరిగిన గ్లామర్ ఇమేజ్ కుష్బు బీజేపీలో చేరడంతో ఆ పార్టీలో సినీనటుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే నమిత, గౌతమి, గాయత్రి రఘురాం, మధువంతి, కుట్టి పద్మిని, నటుడు రాధారవి, సంగీత దర్శకులు గంగై అమరన్, దీనా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. 60 స్థానాలే లక్ష్యం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారు. అన్నాడీఎంకే నుంచి ఆ సీట్లను రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 17న ఆయన చెన్నైకు రానున్నారు. అన్నాడీఎంకే వర్గాలతో భేటీ, బీజేపీలో చేరిక కార్యక్రమాలు అంటూ ముందుకు సాగబోతున్నారు. -
బీజేపీలోకి కుష్బూ
సాక్షి, చెన్నై/ న్యూఢిల్లీ: సినీ నటి కుష్బూ సుందర్ సోమవారం బీజేపీలో చేరారు. పార్టీ ప్రతినిధిగా ఉన్న కుష్బూను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కుష్బూ వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ సోనియాకు పంపించారు. పార్టీలోని కొందరు తనను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యదర్శి రవి, పార్టీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్ నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. తనకు బీజేపీ నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు సిద్ధమని కుష్బూ అన్నారు. కుష్బూతోపాటు జర్నలిస్ట్ మదన్ రవిచంద్రన్, ఐఆర్ఎస్ మాజీ అధికారి శరవణన్ కుమరన్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఏడాదిలోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కుష్బూ వంటి వారి చేరికతో కాషాయ దళానికి కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. కుష్బూ 2014లో డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరారు. -
అందుకే కాంగ్రెస్‌కు గుడ్ బై: కుష్బూ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకంతోనే బీజేపీలో చేరినట్టు సీనియర్ నటి కుష్బూ సుందర్ తెలిపారు. సోమవారం కమలం పార్టీలో చేరిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ..దేశాన్ని ప్రధాని మోదీ సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడానో సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నానని వెల్లడించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ విజయం కోసం పనిచేయలేదన్నారు. తాను టికెట్ కోసం ఎప్పుడూ అడగలేదని, తన రాజీనామాకు అది కారణం కాదన్నారు. తనతో కాంగ్రెస్ నేతలకు ఈగో సమస్యలు ఉన్నాయోమోనని అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే తనలాంటి వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని వాపోయారు. బీజేపీలో తనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధి నాయకత్వం నిర్ణయిస్తుందని కుష్బూ సుందర్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్ సమక్షంలో అంతకుముందు బీజేపీలో కుష్బూ చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో కుష్బూ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ సరిగా వినియోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుష్బూకు బీజేపీ ఎటువంటి బాధ్యతలు కట్టబెడుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తమ పార్టీ నుంచి కుష్బూ వెళ్లిపోయినా నష్టం ఏమీ ఉండబోదని తమిళనాడు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. చదవండి: బీజేపీలో చేరిన సినీనటి కుష్బూ -
బీజేపీలో చేరిన సినీనటి కుష్బూ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నటి కుష్బూ బీజేపీలో చేరారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కీలక బాధ్యతలు సైతం అప్పగించే అవకాశం ఉంది. ఆరేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుష్బూ పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏమాత్రం ప్రజాబలం లేని నాయకుల చేతిలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శించారు. (కాంగ్రెస్‌కు నటి కుష్బూ గుడ్‌బై) అంతేకాకుండా తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపారు. కాగా 2010లో డీఎంకేలో చేరిన కుష్బూ ఆ పార్టీ నేతలతో విభేదించి 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా బీజేపీలో చేరడంతో పదేళ్ల కాలంలోనే మూడు పార్టీలను మారినట్లు అయ్యింది. -
కాంగ్రెస్‌కు కుష్బూ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కుష్బూ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతోందంటూ ఆమెను తొలుత జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి అధిష్టానం తొలగించింది. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కుష్బూ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సోమవారం మధ్యాహ్నం ఆమె కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనికోసం ఆదివారం రాత్రినే హస్తినకు చేరుకోని బీజేపీ పెద్దలతో మంతనాలు సైతం చేశారు. వారి ఆహ్వానం మేరకే పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. 2010లో అప్పటి అధికార పార్టీ డీఎంకేలో చేరిన కుష్బూ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారానికి దూరంగా ఉండటంతో ఆమెకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఈ క్రమంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుపట్టారు. కానీ డీఎంకే-కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో సీట్లు సర్దుబాటు కారణంగా ఆమెకు ఎంపీ టికెట్ దక్కలేదు. అయితే ఆ తరువాత రాజ్యసభకు పంపుతామని అనేకసార్లు హామీ ఇచ్చినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. పురుషాధిక్యత కలిగిన కాంగ్రెస్‌లో ఆత్మాభిమానం మెండుగా కలిగిన కుష్బూ పార్టీలో ఇమడలేని పరిస్థితులు చుట్టుముట్టాయి. అధిష్టానంలో రాహుల్‌గాంధీ ఆశీస్సులు ఉన్నా గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ పొందలేక పోటీచేయలేక పోయారు. కాంగ్రెస్, డీఎంకే కూటమిగా కొనసాగడం, గతంలో డీఎంకేతో విభేదించి కాంగ్రెస్‌లో చేరడం వల్లనే డీఎంకే ముఖ్యనేత ఒకరు కుష్బూకు అడ్డుతగిలినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కుష్బు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అనుచరుల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై సైతం ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అయితే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బలంచాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న కమళం పార్టీ సినీ నటులను పార్టీలో చేర్చుకోవాలని తొలినుంచీ భావిస్తోంది. దీనిలో భాగంగానే సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సైతం ఇదివరకే బీజేపీలోకి ఆహ్వానించింది. దీని కొరకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న కుష్బూను చేర్చుకోవాలని తహతహలాడుతోంది. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
కుష్బూకు చాన్స్ దక్కేనా?
సాక్షి, చెన్నై: సినీ నటి కుష్బూకు కాంగ్రెస్‌లో ప్రమోషన్ కల్పించబోతున్నారు. ఆమెకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు ఏఐసీసీ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సినీ నటి కుష్బూ వాక్ చాతుర్యం, రాజకీయ అడుగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఆమెకు పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కింది. అయితే, కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలు తట్టుకోలేని పరిస్థితి. ఎన్నికల్లో పోటీకి పలుమార్లు ప్రయత్నించినా, సీటు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల రాష్ట్ర బీజేపీలో చేరుతున్న సినీ గ్లామర్‌కు ప్రత్యేక గుర్తింపు కల్పించే రీతిలో పదవుల్ని కట్టబెడుతున్నారు. అయితే, అలాంటి గుర్తింపులు కాంగ్రెస్‌లో కుష్బూకు కరువే అన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కుష్బూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు పది రోజులుగా ఓ ప్రచారం సాగుతోంది. చదవండి: (తలైవి పాత్రలో ఒదిగిపోయిన కంగనా) ఈ సమయంలో కుష్బూ ఢిల్లీ వెళ్లి రావడం ప్రాధాన్యతకు దారి తీసింది. అయితే, కుష్బూ సేవల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌లో అధ్యక్షుడు కేఎస్ అళగిరి తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులుగా విష్ణుప్రసాద్, మయూరా జయకుమార్, మెహనకుమార మంగళం, హెచ్ వసంతకుమార్‌లను ఏఐసీసీ నియమించింది. ఇందులో హెచ్ వసంతకుమార్ మరణించారు. ప్రస్తుతం ఈ పదవీ ఖాళీగా ఉంది. ఈ పదవిని కుష్బూకు ఏఐసీసీ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు తగ్గ అధికార ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్‌లో చర్చ సాగుతోంది. మేనిఫెస్టో కమిటీ సాక్షి, చెన్నై: 2021 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై డీఎంకే దృష్టి పెట్టింది. ఇందుకోసం ఎనిమిది మందితో కమిటీని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదివారం ప్రకటించారు. మరో ఆరు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న విషయం తెలిసిందే. ఇప్పటినుంచి రాజకీయ పక్షాలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇందులో డీఎంకే కాస్త దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో డీఎంకే శ్రేణులు వేగాన్ని పెంచారు. ప్రజల్ని ఆకర్షించే దిశగా ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ పరుగులు తీస్తున్నారు. ఇప్పటివరకు వెలువడ్డ సర్వేలన్నీ డీఎంకేకు అనుకూలంగా ఉండడంతో, ఇది చేజారకుండా మరింత బలాన్ని పెంపొందించుకోవడం లక్ష్యం వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో స్టాలిన్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ప్రకటించారు. స్టాలిన్ ఆదేశాలతో ఎన్నికల మేని ఫెస్టో కమిటీని ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు. ఇందులో పార్టీ కోశాధికారి టీఆర్ బాలు, ఎంపీలు కనిమొళి, రాజా, తిరుచ్చిశివ, టీకేఎస్ ఇళంగోవన్, అందియూరు సెల్వరాజ్, పార్టీ సీనియర్ సుబ్బలక్ష్మి జగదీశన్, ప్రొఫెసర్ రామస్వామి ఉన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి సమస్యలు, చేపట్టాల్సిన పనులకు తగ్గ నివేదికలు రాష్ట్ర కార్యాలయానికి చేరాయి. వీటన్నింటిని పరిశీలించి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటన తర్వాత మేనిఫెస్టోను సిద్ధం చేసి అధ్యక్షుడికి ఈ కమిటీ సమర్పించనుంది. అలాగే, సీట్ల పంపకాలకు సంబంధించి ఓ కమిటీని రంగంలోకి దించేందుకు డీఎంకే సిద్ధమవుతోంది. ఈ సారి ఎన్నికల్లో కనీసం 180 స్థానాల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో డీఎంకే ఉండడంతో మిత్రులకు సింగిల్ డిజిట్ సీట్లే దక్కబోతున్నాయి. -
కాంగ్రెస్‌కు నటి కుష్బూ గుడ్‌బై
చెన్నై : సీనియర్ నటి కుష్బూ ఆదివారం రాత్రి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. రేపు ఉదయం ఆమె బీజేపీలో చేరనున్నారు. కాగా కుష్బూ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా పాలసీని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. కుష్బూ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది.అప్పటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కుష్బూ రేపు మధ్యాహ్నం బీజేపీలో చేరబోతున్నారు. భారత పౌరురాలిగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించించే హాక్కు తనకు ఉందని కుష్బూ తెలిపారు. -
నటి కుష్బూ కంటికి గాయం
చెన్నై : సీనియర్ హీరోయిన్ కుష్బూ బుధవారం ఉదయం కంటి గాయానికి గురయ్యారు. ఈ విషయం ఆమె స్వయంగా తన ట్విటర్లో వెల్లడించారు. 'హాయ్.. ఫ్రెండ్స్.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు నా కంటికి ఆపరేషన్ చేసి కుట్లు వేశారు. కొద్దికాలం ట్విటర్‌కు దూరంగా ఉండబోతున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తా.. అందరూ భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించండి ' అంటూ కుష్బూ ట్వీట్ చేశారు. -
రజనీ రెడీ
మెల్లిగా ఒక్కో సినిమా షూటింగ్‌లు స్టార్ట్ అవుతున్నాయి. రజనీకాంత్ కూడా తన తదుపరి చిత్రం ప్రారంభించడానికి రెడీ అయ్యారని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’’. మీనా, కుష్బూ, కీర్తీ సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో ఎక్కువ షూటింగ్ చేయడం కరెక్ట్ కాదని, చాలా రిస్క్ తో కూడుకున్నదని భావించిన చిత్రబృందం చెన్నైలోనే ఓ భారీ సెట్ ను నిర్మిస్తోందట. మిగతా భాగాన్ని అక్కడే పూర్తి చేయాలన్నది ప్లాన్ . త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కుష్బూకు హైకమాండ్ షోకాజ్ నోటీస్!?
సాక్షి, చెన్నై: నటి కుష్బూకు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. నటి కుష్బూను ఫైర్‌బ్రాండ్‌గా పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారీమె. ఆ మధ్య డీఎంకే నుంచి బయటకు వచ్చిన కుష్బూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివాదాలకు కేంద్ర బిందువుగా మారే కుష్బూ ఆ మధ్య రజనీకాంత్ ఒక వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో రజనీ వివరణ ఇచ్చారు. అప్పుడు కుష్బూ రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా మరో వివాదానికి తెరలేపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ నూతన విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని కాంగ్రెస్ ప్రచార కర్త కుష్బూ స్వాగతిస్తూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతే కాదు కుష్బూ బీజేపీలో ఉన్నత పదవి వస్తుందనే ఆశతో పార్టీని మారడానికి సిద్ధం అవుతున్నారనే ఆరోపణలను చేస్తున్నారు. దీనికి స్పందిచిన కుష్భూ తనకు పార్టీ మారే ఆలోచన లేదని, అదే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉందని పేర్కొన్నారు. (కమలం వైపు కుష్బూ చూపు) అదేవిధంగా తన వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే రాహుల్‌గాందీకి క్షమాపణ చెప్పుకుంటానని, అంతే కానీ తాను తల ఆడించే రోబో బొమ్మగా ఉండలేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన కుష్బూపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు, కుష్బూకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. (కేంద్ర నిర్ణయానికి ఖుష్భూ మద్దతు) -
కమలం వైపు కుష్బూ చూపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రప్రభుత్వ నూతన విద్యా విధానానికి మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, నటి కుష్బూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తమిళనాడు రాజకీయాల్లో సినీగ్లామర్ కొత్తేమీ కాదు. ఆనాటి ఎంజీ రామచంద్రన్ మొదలుకుని జయలలిత, విజయకాంత్, శరత్‌కుమార్, కమల్‌హాసన్, రజనీకాంత్ ఇలా ఎందరెందరో వెండితెరపైనే కాదు రాజకీయ తెరపై కూడా మెరిసారు. డీఎంకే అగ్రనేత దివంగత కరుణానిధి సైతం కథ, మాటల రచయితగా సినిమారంగంతో పెనవేసుకున్నవారే. ఇదేకోవలో డీఎంకేలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటి కుష్బూ కొన్నేళ్లపాటూ కొనసాగి అంతర్గత కారణాల వల్ల ఆ పార్టీని వీడి రాహుల్‌గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో నటుడు శివాజీగణేశన్ తరువాత ఇటీవలి కాలంలో కుష్బూ చేరికతోనే కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామర్ వచ్చింది. హీరోయిన్గా వెలిగిపోతున్న తరుణంలో ఆమెకు తమిళనాడులో ఆలయాలు కూడా కట్టించిన ఖ్యాతి ఉంది. దీంతో పార్టీలోకి వచ్చిందే తడవుగా జాతీయ అధికార ప్రతినిధి పదవి ఆమెను వరించింది. కాంగ్రెస్ తమిళనాడు శాఖలో గుంపుల్లో గోవిందాలా గాక తనకంటూ ప్రత్యేకంగా, స్వతంత్రంగా వ్యవహరించారు. (కేంద్ర నిర్ణయానికి ఖుష్భూ మద్దతు) ఈ శైలి కొందరికి నచ్చలేదు. కాంగ్రెస్ మహిళా విభాగ జాతీయ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా, కుష్బూకు మధ్య పొసగలేదు. నగ్మా హాజరయ్యే చెన్నైలోని కార్యక్రమాలకు కుష్బూ ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యేవారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మారినపుడు కుష్బూ ఏదో ఒక వర్గం వైపు నిలవక తప్పని పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో మరో వర్గానికి ఆమె కంటగింపుగా మారింది. పురుషాధిక్యత కలిగిన కాంగ్రెస్‌లో ఆత్మాభిమానం మెండుగా కలిగిన కుష్బూ పార్టీలో ఇమడలేని పరిస్థితులు చుట్టుముట్టాయి. అధిష్టానంలో రాహుల్‌గాంధీ ఆశీస్సులు ఉన్నా గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ పొందలేక పోటీచేయలేక పోయారు. కాంగ్రెస్, డీఎంకే కూటమిగా కొనసాగడం, గతంలో డీఎంకేతో విభేదించి కాంగ్రెస్‌లో చేరడం వల్లనే డీఎంకే ముఖ్యనేత కుష్బూకు అడ్డుతగిలినట్లు సమాచారం. రాష్ట్రంలో సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి రాహుల్ దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన హామీ దక్కలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాగితే ఇలా అన్నిరకాల నష్టమేనని కుష్బూ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై రాహుల్ అసహాయతను బహిరంగంగానే వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామాతో సచిన్ పైలెట్ పేరు ప్రస్తావనకు వచ్చింది. సచిన్‌పైలెట్‌కు కుష్బూ మద్దతు పలకడంతో రాహుల్‌వైపు నిలిచిన పార్టీలోని యువతరం అగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించింది. మరోసారి కుష్బూ వ్యాఖ్యల కలకలం: ఇక తాజాగా కుష్బూ మరో బాంబు పేల్చారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, కుష్బూ స్వాగతిస్తూ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు మరోసారి కోపంతో భగ్గుమన్నారు. ఇందుకు కుష్బూ స్పందిస్తూ నేను అన్నింటికీ తలాడించే రోబో లేదా ఆట బొమ్మను కాదు, వాస్తవాలను వ్యక్తీకరించాను. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బిల్లులో భిన్నమైన అభిప్రాయాలు ఉండడం సహజం. నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాను. అభిప్రాయబేధాలు ఉండడం మంచిదే. నేను బీజేపీలో చేరుతానని కాంగ్రెస్‌లోకి కొందరు ప్రచారం చేస్తున్న ప్రచారం చూస్తే నవ్వొస్తోంది. కాంగ్రెస్‌ను వీడను. నేను మౌనంగా ఉంటే కయ్యానికి కాలుదువ్వాలనిపిస్తుందని తన ట్విట్టర్ ద్వారా గట్టిగా బదులిచ్చారు. ఈ మాటలు కాంగ్రెస్ నేతల్లో మరింత అగ్గిరాజేసాయి. గతంలో ఈవీకేఎస్ ఇళంగోవన్ టీఎన్‌సీసీ అధ్యక్షులుగా ఉన్నపుడు పార్టీలో కుష్బూ చురుగ్గా వ్యవహరించారు. అయితే కేఎస్ అళగిరి అధ్యక్షులైన తరువాత ఆమెను దూరంగా పెట్టారు. అభిప్రాయ వ్యక్తీకరణకు కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంది, అయితే అది అంతర్గతంగా జరిగే సమావేశాలకే పరిమితమని కుష్బూ వ్యాఖ్యలపై కేఎస్ అళగిరి పరోక్షంగా శుక్రవారం ట్వీట్ చేశారు. బహిరంగంగా మాట్లాడితే దాన్ని రాజకీయ అపరిపక్వత అంటారని విమర్శించారు. ఇదే అదనుగా కాంగ్రెస్‌ను వదిలి రండి అంటూ పలువురు బీజేపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా కుష్బూను ఇప్పటికే ఆహ్వానించారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే ఆమె వైఖరికి కారణమని విశ్వసనీయ సమాచారం. -
కేంద్ర నిర్ణయానికి ఖుష్భూ మద్దతు
చెన్నై : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2020కి కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ మద్దతు తెలిపారు. అయితే తన అభిప్రాయం పార్టీ వైఖరికి భిన్నమైదని కూడా స్పష్టం చేశారు. ఒక సిటిజన్‌గా మాత్రమే ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలిపారు. ‘నూతన విద్యా విధానం-2020పై నా వైఖరి.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం. ఇందుకు రాహుల్ గాంధీకి నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రతిదానికి తలాడించే రోబోలా కాకుండా.. నిజం మాట్లాడాను. ప్రతీది మన నాయకుడి అంగీకారం గురించి కాకూడదు.. పౌరుడిగా మన అభిప్రామాన్ని ధైర్యంగా చెప్పగలగాలి’ అని ఖుష్భూ పేర్కొన్నారు. (ప్రముఖ క్రీడాకారులు.. డిప్యూటీ డైరెక్టర్లుగా నియామకం) అయితే ఆమె ట్వీట్‌పై పలువురు కాంగ్రెస్ సానుభూతిపరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ట్వీట్‌తో తను పెద్ద దుమారాన్నే చూశానని ఖుష్భూ అన్నారు. అంతకు ముందు కూడా సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె మద్దతు తెలిపారు. నూతన విద్యా విధానం-2020 అనేది స్వాగతించదగినదని పేర్కొన్నారు. (రియాపై జేడీయూ నేత సంచలన ఆరోపణలు) -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!
‘‘ప్రతి మనిషి జీవితంలో మానసిక ఒత్తిడి, బాధలు ఉంటాయి. నాకలాంటివి లేవని ఎవరైనా అంటే అబద్ధం చెప్పినట్టే. నేను కూడా చాలా మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ, ఓ సందర్భంలో బాధ, మానసిక ఒత్తిడిలపై పోరాడాలనే కసి ఏర్పడటంతో నా నిర్ణయం మార్చుకున్నా’’ అన్నారు నటి ఖుష్బూ. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ఒకానొక దశలో నా జీవితం ఆగినట్లు అనిపించింది. భయం వేసింది. అప్పుడు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నా. కానీ, నాలోని ధైర్యం నన్ను ఆ నిర్ణయం తీసుకోనివ్వకుండా వెనకడుగు వేసేలా చేసింది. ఆ సమయంలో నా స్నేహితులు దేవదూతల్లా మారారు. నన్ను ఇబ్బంది పెడుతున్న సమస్యల కోసం విలువైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి? అనుకున్నాను. పరాజయాలకు భయపడలేదు. చీకటిని చూసి బెదరలేదు. నన్ను సమస్యలవైపు నడిపిస్తున్న వాటిని చూసి ఏ రోజూ భయపడలేదు. నన్ను ఓడించి, నాశనం చేయాలనుకుంటున్న సమస్యలకంటే నేనే దృఢమైనదాన్ని అని నిరూపించాలని నిర్ణయించుకున్నా. నాలో పోరాడే శక్తి ఉండటంతో ధైర్యంగా ముందడుగు వేశా. పరాజయాల్ని విజయాలుగా మార్చుకోవడం నేర్చుకుని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా’’ అన్నారు ఖుష్బూ. -
నేను కూడా చనిపోవాలనుకున్నా.. కానీ,
చెన్నై: తీవ్రమైన మానసిక ఒత్తిడితో తానుకూడా ఒకానొక సమయంలో జీవితాన్ని ముగించాలనుకున్నానని ప్రముఖ నటి ఖుష్బూ అన్నారు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు, సమస్యలు ఉంటాయని.. వాటిని ధైర్యంగా అధిగమించాలే తప్ప ఆత్మహత్య సరైంది కాదని ట్విటర్లో పేర్కొన్నారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 'జీవితంలో నాకు కూడా సమస్యలు ఎదురయ్యాయి. మానసిక క్షోభ అనుభవించా. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకున్నా' అని కుష్బూ గతాన్ని గుర్తుచేసుకున్నారు. 'ఒకానొక దశలో నా జీవితం స్తంభించిపోయింది. అంతా చీకటిమయంగా తోచింది. భయం, ఆందోళన పెరిగింది. ఈ సమస్యల్ని భరించడం కంటే శాశ్వత నిద్రలోకి వెళ్లడం సులభమైన మార్గం అనుకున్నా. కానీ నాలోని ధైర్యం ఆ ఆలోచనలను అధిగమించేలా చేసింది’అని తెలిపారు. (చదవండి: సుశాంత్ సింగ్ విశేషాలెన్నో!) ప్రతి మనిషిలో బాధ, ఒత్తిడి ఉంటాయని, బాధలు లేవని చెప్పడం అబద్ధమే అవుందని ఖుష్బూ అన్నారు. పోరాడే శక్తి ఉంది కాబట్టే తాను ఇంత దూరం రాగలిగానని, ధైర్యంగా ముందడుగువేసి పరాజయాలను విజయాలుగా మార్చుకోవడం నేర్చుకున్నానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. వరుస ట్వీట్లలో జీవితానుభవాలు పంచుకుని అభిమానుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. (చదవండి: సుశాంత్ 50 కోరికల జాబితా ఇదే!) -
సమస్యను స్వాగతించు!
‘‘జీవితం ఎప్పుడూ పూలపాన్పు మాదిరిగానే ఉండదు. ఒక్కోసారి అది ముళ్లపాన్పుగా కూడా మారుతుంది. అయితే ముళ్లను కూడా మనం స్వీకరించగలగాలి. ఊహించని రీతిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ముందుగుసాగాలి’’ అంటున్నారు నటి ఖుష్బూ. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ –‘‘నీ జీవితంలోకి ఆకస్మాత్తుగా ఓ ఊహించని సమస్య వచ్చిపడింది. అప్పుడు నువ్వు ఏం చేస్తావ్? అధైర్య పడవద్దు. ముందుగా ఆ ప్రతికూల పరిస్థితులను నీ జీవితంలోకి స్వాగతించు. వచ్చిన సమస్యను అర్థం చేసుకో. మానసిక స్థయిర్యం, ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించు. నా జీవన సూత్రం ఇదే’’ అని పేర్కొన్నారు ఖుష్బూ. ఇంకా తన ఫిట్నెస్ గురుంచి ఖుçష్బూ చెబుతూ– ‘‘ఇటీవల నా లుక్ మారింది. ఈ విషయం గురించి నన్ను చాలామంది అడిగారు. ఎవరి సాయం లేకుండా గడిచిన 70 రోజులుగా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. ఇంటిని శుభ్రపరచడం, దుమ్ము దులపడం, గిన్నెలు తోమడం, గార్డెనింగ్ పనులతో పాటుగా టాయిలెట్స్ కూడా కడిగాను’’ అన్నారు. ఇన్ని పనులు చేయడంవల్ల ఖుష్బూ కాస్త సన్నబడ్డారు. నిజానికి బొద్దుగా ఉండే ఖుష్బూ అంత భోజనప్రియురాలు కాదట. ఆ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పారు. -
3 నెలల్లోనే 15 కిలోలు తగ్గారు!
సినిమా: ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక కొత్త ఫొటోలు ఉన్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ఎవరి బ్యూటీ అని ఆశ్చర్యపోతున్నారు. ఆ బ్యూటీ ఒక నాటి ప్రముఖ కథానాయిక కుష్బూ అని తెలియడంతో మరింత షాక్కుకు గురవుతున్నారు. అవును ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నటి కుష్బూ ఫొటోలను చూస్తే ఎవరైనా చదవాల్సింది. అంత స్లిమ్ముగా ఆమె తయారయ్యారు. నిజానికి నటి కుష్బూ ఆరంభంలో సన్నగా నాజూగ్గా ఉండేవారు. అలా తెలుగు తమిళ భాషల్లో కథానాయికగా నటించి ప్రముఖ నటిగా రాణించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కాస్త లావయ్యారు దీంతో ఆమె పేరుతో కుష్బూ ఇడ్లీ కూడా మార్కెట్లోకి వచ్చి పాపులర్ అయింది. అలాంటి కుష్బూ అనంతరం రాజకీయాల్లో కి ప్రవేశించి అక్కడ కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు, టీవీ సీరియల్లో అంటూ బిజీగా ఉన్న కుష్బూ తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న అన్నాత్త చిత్రంలో ఆయనకు జంటగా నటిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. ఈ కాలాన్ని నటి కుష్బూ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఆమె తన భారీ కాయాన్ని కసరత్తులతో 15 కిలోలు బరువు తగ్గి చాలా స్లిమ్‌గా తయారయ్యారు. ఆ ఫొటోలు అనే సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు అవి ఎప్పుడు నెటిజన్లను అప్పుడప్పుడు ఉన్నాయి. నటి కుష్బూ మళ్లీ కథానాయికగా నటిస్తుందా అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో వ్యక్తమవుతోంది. కాగా తాజాగా రజనీకాంత్‌కు జంటగా నటిస్తున్న అన్నాత్త చిత్రం కోసమే పుష్ప బరువు తగ్గి చాలా స్లిమ్‌గా తయారైందని సమాచారం. మన విషయం ఏంటంటే నటి కుష్బూ కూతురు కూడా వర్క్ ఔట్ చేసి స్లిమ్‌గా తయారయ్యారు. దీంతో కుష్బూ తన కూతురుకు పోటీగా తయారైందా అనే అభిప్రాయం ఆమె అభిమానులు భయపడుతున్నారు. కాగా సుమారు మూడు నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గిన కుష్బూను చూసి అందరూ అభినందిస్తున్నారు. నిజంగానే ఆమె మళ్లీ కథానాయికగా నటించాలని ఆకాంక్షిస్తున్నారా. -
కుష్బూపై అనుచిత వ్యాఖ్యలు
చెన్నై : కుష్బూ ఒక బ్రోకర్ అని నటి, నృత్య దర్శకురాలు గాయత్రి రఘురామ్ వ్యాఖ్యానించారు. నటి, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రచారకర్త కుష్బూ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తీరును అవహేళన చేశారు. దీనిపై ఆమె తన ట్విట్టర్లో ప్రధాన మంత్రిపై పలు ఆరోపణలు చేశారు. అందులో ప్రధానమంత్రి హిందీలో మాట్లాడారని, ఇండియాలో ప్రాచీన భాష అయిన తమిళంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కుష్బూ విమర్శలను నటి, బీజేపీ సభ్యురాలు గాయత్రి రఘురామ్ తిప్పికొట్టారు. ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ కుష్బూ ఒక బ్రోకర్ అని అన్నారు. కుష్బూ వ్యాఖ్యలను నెటిజన్లు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. -
అలనాటి తారలతో చిరు స్టెప్పులు.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. నిత్యం తన అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఒకవైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే తన అభిమానులకు కావాల్సినంత ఫన్ అందిస్తున్నాడు. తాజాగా చిరంజీవి అలనాటి హీరోయిన్లు అయిన సుహాసిని, ఖుష్బూ, జయసుధ, రాధ, రాధక, లిజి ప్రియదర్శన్‌లతో కలసి స్టెప్పులేసిన వీడియోను తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. గత ఏడాది చిరంజీవి కొత్త ఇంటిలో ఈ రీయూనియన్ జరిగింది. (చదవండి : మేమంతా మీకు రుణపడి ఉన్నాం : చిరంజీవి) ఈ రియూనియన్ వేడుకకి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటీనటులు ఒక చోట కలిసి సందడి చేశారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్, సురేష్, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో నటీనటులంతా చాలా హ్యాపీగా గడిపారు. ఆటపాటలతో కలసి సందడి చేశారు. ఇందులో సుహాసినితో రాక్షసుడు సినిమాలోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు డాన్స్ చేశాడు. ఆ తర్వాత చిరు.. రాధతో మరణ మృదంగంలోని సరిగమ పదనిస పాటకు చిందేసారు. ఆ తర్వాత కుష్బూతో ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు కాలు కదిపాడు. ఈ పాటకు కుష్బూతో పాటు జయప్రద,జయసుధ తదితరులు స్టెప్పులు వేశారు. (చదవండి : మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా: చిరు) -
కుష్బూ నువ్వు ఎప్పుడైనా నిజాలు మాట్లాడావా?
చెన్నై,పెరంబూరు: నటి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కుష్బూపై బీజేపీ సభ్యురాలు, నటి గాయత్రీరఘురామ్ ఫైర్ అయ్యారు. పౌరసత్వ బిల్లుపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరు చట్ట సభల్లో మాటల దాడి చేస్తుంటే మరి కొందరు మీడియా ద్వారా ఆరోపణలు, ప్రతిఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా కుష్బూ, గాయత్రి రఘరామ్ లాంటి వారు ట్విటర్ వార్‌కు దిగుతున్నారు. నటి కుష్బూ పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్విట్టర్లో రాష్ట్ర బీజేపీ నాయకుడు హెచ్.రాజాపై దాడి చేశారు. దీంతో బిజేపీ నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కుష్బూ ట్వీట్‌పై బీజేపీ సభ్యురాలు, నటి గాయత్రీరఘురామ్ స్పందిస్తూ ట్విటర్లో ఎదురుదాడి చేసింది. అందులో నువ్వు ఎప్పుడైనా నిజాలు మాట్లాడావా? అన్నీ అబద్దాలే అని విమర్శించించారు. నీలాంటి అసత్యవాదులకు,కాంగ్రెస్ నాయకులకు విమర్శించే హక్కులేదని గాయత్రీ రఘురామ్ పేర్కొంది. -
వైరల్ : ఖుష్భూతో చిందేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ రీయూనియన్ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో అలనాటి తారలతో కలిసి చిరంజీవి ఫూల్‌గా ఎంజాయ్ చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగారు కోడిపెట్ట సాంగ్‌కు ఆయన ఖుష్భూతో డ్యాన్స్ చేశారు. మధ్యలో జయప్రద కూడా చిరుతో జత కలిశారు. కాగా, 1980లలో నటించిన స్టార్స్ ప్రతీ ఏడాది సరదాగా కలసి రీయూనియన్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రీయూనియన్‌ను చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో జరిగింది. ఈ వేడుకకు 40మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన నటీనటులున్నారు. -
ప్రధానిపై కుష్బూ ఫైర్
తమిళనాడు, పెరంబూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదిపై నటి కుష్బూఫైర్ అయ్యారు. ఇటీవల మహాత్మాగాంధి 150 జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో హిందీ చిత్ర ప్రముఖులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మన సంస్కృతిని ప్రతిబింబించే ఒక వీడియోనూ ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు షారూఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, నటి సోనంకపూర్, కంగనారనౌత్, రకుల్‌ప్రీత్‌సింగ్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోష్, నిర్మాత ఏక్తాకపూర్, బోనీకపూర్ పాల్గొన్నారు. వారంతా ప్రధానితో ఫొటోలు దిగారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.కాగా ఈ కార్యక్రమంలో దక్షిణాదికి చెందిన ఏ ఒక్క కళాకారుడు లేకపోవడం విశేషం. ఈ విషయంపై తెలుగు నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా తాజాగా నటి కుష్బూ ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఫైర్ అయ్యారు. ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ ఇండియా సినిమా తరఫున ప్రధానమంత్రిని కలిసి అందరికీ తన నమస్కారాలన్నారు. అయితే ప్రధానమంత్రికి ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలచుకున్నానన్నారు. హిందీ చిత్రాలు మాత్రమే మన దేశ ఆర్థికవ్యవస్థలో భాగం కాదన్నారు. దేశానికి ప్రాతినిథ్యం కాదని అన్నారు. దక్షిణాది చిత్రాలే ముఖ్య భాగం అని పేర్కొన్నారు. దక్షిణాది చిత్రాలే దేశానికి జాతీయస్థాయిలో ప్రాధాన్యత వహిస్తున్నాయన్నారు.సూపర్‌స్టార్స్ దక్షిణాది నుంచే వస్తున్నారని, ఇండియాలోని ఉత్తమ నటీనటులు దక్షిణాదికి చెందిన వారేనని పేర్కొన్నారు. ఉత్తమ సాంకేతిక నిఫుణులు దక్షిణాదికి చెందిన వారేనన్నారు. అలాంటిది దక్షిణాది సినిమాకు చెందిన వారిని ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకింత పక్షపాతం అని ప్రశ్నంచారు. దక్షిణాది సినిమాను మన దేశం çగర్వ పడేలా చేసిన మనకు స్ఫూర్తిదాయకులైన వారిని ఆహ్వానించి ఉంటే బాగుండేదని అన్నారు. వారికా అర్హత ఉందని తాను భావిస్తున్నానని కుష్బూ పేర్కొంది. -
నటి ఇంటి సమీపంలో కంటైనర్ కలకలం
టీ.నగర్ : చెన్నై శాంతోమ్‌లోని నటి కుష్బూ ఇంటి ముందు ఒక కంటైనర్ లారీ గత పది రోజులుగా నిలిపి ఉంది. దీనికి నెంబర్ ప్లేట్ కూడా లేదు. ఈ లారీని నటి కుష్బూ ఫొటో తీసి తన ట్విట్టర్ పేజీలో విడుదల చేశారు. తన ఇంటికి వెళ్లే వీధి ముందు నెంబర్ ప్లేట్ లేని కంటైనర్ లారీ గత 10 రోజులుగా నిలిచివుందని, అయితే ప్రజలెవరూ దీన్ని పట్టించుకోవడం లేదని, దీనిపై ఫిర్యాదు చేసే ఆలోచనే ఎవరికీ రావడం లేదని పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేనందున అనుమానించాల్సి వస్తోందని, చెన్నై పోలీసులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఇందుకు ట్విట్టర్లో బదులిచ్చిన కొందరు మీరెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని ప్రశ్నించారు. మరికొందరు హేళనగా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కుష్బూ ప్రతిస్పందిస్తూ సదరు లారీ తన వీధిలో లేదని, అలా ఉన్నట్లయితే తాను ఫిర్యాదు చేసేదాన్నని తెలిపారు. అలా కాకుండా హేళనగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. దీనికి సంబంధించి వరుసగా వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల దృష్టికి ఈ వ్యవహారం రావడంతో వారు కంటైనర్ ఉన్న వీధి వివరాలను కోరారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు కుష్బూ అందచేశారు. -
ఆస్పత్రిలో నటి కుష్బూ
పెరంబూరు: నటి కుష్బూ అనూహ్యంగా అనారోగ్యానికి గురై బుధవారం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నటి కుష్బూ కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కూడా అన్నది తెలిసిందే. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఈమె తన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పదవిలో ఉన్న తాను లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీవీ చర్చల్లో పాల్గొనవలసి ఉండగా ఇలా ఆస్పత్రిలో చేరడం బాధగా ఉందని పేర్కొన్నారు. -
‘ఆమెను చూడడానికి రోడ్డుపై నిలబడేదాన్ని’
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలితను చూడడానికి రోడ్డుపై నిలబడేదాన్నని నటి, కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కుష్బూ తెలిపారు. కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు సి. సుందర్‌ని ప్రేమ వివాహం చేసుకున్న కుష్బూ ఆ తరువాత రాజకీయాలు, సినిమాలు, టీవీ.సీరియళ్లు అంటూ బిజీ అయిపోయారు. ఈ సంచలన నటికి పుట్టినిల్లు ఉత్తరాది, మెట్టినిల్లు దక్షిణాది (చెన్నై) అన్న విషయం తెలిసిందే. కాగా కుష్బూ తన చెన్నై అనుభవాలను ఒక భేటీలో పంచుకున్నారు. అవేంటో చేద్దాం. చెన్నైతో అనుబంధం చెన్నై నాకు కుటుంబాన్ని, పేరుప్రఖ్యాతలను అందించింది, నా మనసులోని వేదనలను తీర్చింది. నా పాస్‌బుక్‌లో ముంబాయి వాసిగా పేర్కొని ఉన్నా, మానసికంగా నేను చెన్నైవాసిగానే భావిస్తున్నాను. అలా ఈ ప్రత్యేకమైన చెన్నై మహానగరానికి రుణపడి ఉన్నాను. చెన్నై కాలానుగుణంగా చాలా మర్పు చెందుతోంది. అయినా ఇక్కడ సంస్కృతి మాత్రం వేళ్లూరిపోయింది. మా పిల్లలు ఇక్కడే పెరగడం సంతోషంగా ఉంది. నిరాశ సంఘటనలు ఇక్కడ నేను నిరాశ పడిన సంఘటనలు ఉన్నాయి. ఒక నటిగా అన్నాశాలై రోడ్డులో సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు చూడలేకపోవడం విచారకరమైన విషయం. ఇంతకు ముందైతే చిత్ర విడుదల సమయాల్లో మౌంట్‌రోడ్డుకు వెళితే భారీ కటౌట్లు, పోస్టర్లు చూసేదాన్ని. నా తొలి తమిళ చిత్రం ధర్మత్తిన్ తలైవన్ విడుదల సమయంలో మౌంట్‌రోడ్డుకు వెళ్లాను. అక్కడ జనాలు భారీగా గుమిగూడి బ్యానర్‌ను చూస్తుంటడం కంటపడింది. అయితే ఆ బ్యానర్లో నటుడు ప్రభు ఫొటో మా త్రమే ఉండటం నాకు కాస్త నిరాశను కలిగించింది. ఆనంద భాష్పాలు నా భర్త నటించిన తలైనగరం చిత్ర బ్యానర్‌ను మౌంట్‌రోడ్డులో చూసినప్పుడు నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. నేను దక్షిణాదిలో మొదటగా తెలుగు చిత్రంలోనే నటించాను. ఆ చిత్రం 1984 జనవరి 1వ తేదీన చెన్నైలోని విజయావాహిని స్టూడియోలోనే ప్రారంభమైంది. ఆ రోజుల్ని నా జీవితంలో మరిచిపోలేను. నటుడు రజనీకాంత్‌కు జంటగా నేను నటించిన పాండియన్ చిత్ర షూటింగ్ ముత్తుక్కాడు ప్రాంతంలో జరుగుతున్నప్పుడు ఆ చుట్టు పక్కల పజలు రోడ్డంతా నిలబడి చూశారు. ఆ సంఘటనను మరిచిపోలేను. కరుణానిధి–జయలలిత ఇక రాజకీయనాయకురాలిగా నాకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వద్ద చాలా గౌరవం లభించింది. అది నాకు దక్కిన సింహాసనంగా భావిస్తాను. చెన్నైలో చాలా కాలంగా నివసిస్తున్న నేను ఎక్కువగా చూసింది డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలనే. జయలలిత చాలా ధైర్యవంతురాలు. అందుకు నేను ఆమెను అభిమానిస్తాను. జయలలిత కారులో బయటకు వెళుతునప్పుడు ఆమెను చూడడానికి ప్రజలు రోడ్డులో నిలబడేవారు. జయలలిత ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి రోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మ్యూజిక్ అకాడమి రోడ్డులో కారులో వెళ్లేవారు. అప్పుడు ప్రజలతో పాటు నేను ఆమెను చూడడానికి రోడ్డుపై నిలబడేదాన్ని. జయలలిత మధ్యాహ్నం భోజనానికి వెళ్లేటప్పుడు నేను ఆమె కారుకు ఎదురుగా నిలబడేదాన్ని. అలా నన్ను పరిశీలించిన జయలలిత తన సెక్యూరిటీని పంపి నా గురించి విచారించారు. నాకు ప్రశాంతత కావాలనుకున్నప్పుడల్లా మెరినా సముద్ర తీరానికి వెళ్లి కూర్చునేదాన్ని. ఇక టీ.నగర్‌లోని బట్టల దుకాణాలకు వెళ్లి షాపింగ్ చే యడం మరచిపోలేని అనుభూతి అని కుష్బూ చెన్నై అనుభవాలను పంచుకున్నారు. -
‘ఆమెకు నోటా కంటే అధిక ఓట్లు రావాలి’
టీ.నగర్: ఐదు నియోజకవర్గాల్లో ఘోర ఓటమి పొందనున్న తమిళిసై సౌందరరాజన్ నోటా కంటే అధిక ఓట్లు సాధించాలని నటి కుష్బూ ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బూ ఆదివారం మాట్లాడుతూ కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణా, ఒడిశా రాష్ట్రాలలో ప్రచారం చేశానని, తదుపరి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కోరిక ప్రజల్లో ఉందన్నారు. అందువల్ల కాంగ్రెస్ విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిపారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకనే చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై పై తనకు గౌరవం ఉందని, ఆమె కూడా ఒక మహిళ అయినందున నోటా కంటే తక్కువ ఓట్లు పొంది ఓడిపోకూడదని అన్నారు. తమిళనాట డీఎంకే–కాంగ్రెస్ కూటమి 35 నుంచి 36 స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు. -
ఈవీఎంలో పామును మోదీ పెట్టారా?
పెరంబూరు: ప్రధాని నరేంద్రమోదీ రాజ్యాం గంలో ఏమైనా జరగవచ్చునని నటి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కుష్భూ పేర్కొన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పలుప్రాంతాల్లో ఈవీఎంల మొరాయిం పు సమస్య తలెత్తుతున్న విషయం తెలిసిందే. మంగళవారం కేరళలో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో కన్నూరు ప్రాతంలో ఈవీఎం యంత్రం లో నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజలు భయపడి పారిపోయారు. పాము బయటకు పోయిన తరువాత ఓటింగ్ యాథావిధిగా జరిగింది. దీనిపై కాంగ్రెస్ మాజీ మంత్రి శశిధరుర్ స్పందిస్తూ ఇలా జరగడం ఇదే ప్రప్రథమం అని పేర్కొన్నారు.నటి కుష్బూ తన ట్విట్టర్లో పేర్కొం టూ.. నరేంద్రమోదీ రాజ్యాంగంలో ఏమైనా జరగవచ్చన్నారు. ఆమె ట్వీట్‌కు నెటిజన్లు కొందరు స్వాగతించినా, మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈవీఎంలను మోదీ తీసుకోచ్చారా, పామును ఆయన ఈవీఎంలలో పెట్టారా? అని రీట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజన్లకు బదులిచ్చే విధంగా నటి కుష్బూ తను డాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. -
యువకుడి చెంప పగలగొట్టిన కుష్బూ
సాక్షి, బెంగళూరు : ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత కుష్బూ తనతో అభ్యంతకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి గూబ గుయ్యిమనిపించారు. సార్వత్రిక ఎన్నికల సందర్బంగా పార్టీ తరపున బుధవారం బెంగళూరులో ఆమె రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్- జేడీఎస్ బెంగళూరు సెంట్రల్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ తరపున ప్రచారం నిర్వహిస్తుండగా కుష్బూ పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన కుష్బూ హఠాత్తుగా వెనక్కి తిరిగి అతగాడి చెంప చెళ్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కిక్కిరిసిన జనం మధ్య ప్రచారం కొనసాగుతుండగా ఒకసారి తాకాడు..వెనక్కి తిరిగి చూసి ప్రచారంలో మునిగిపోయాను..మళ్లీ అదే పని చేశాడు. దాంతో ఒళ్లు మండి ఒక్కటిచ్చానని కుష్పూ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై రిజ్వాన్ మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై నెటిజన్లు ఆమె రియాక్షన్ పట్ల సంతోషం వ్యక్తం చేసి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వారిపట్ల ఇలాగే స్పందించాలని, వారికి గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు. దీన్నే కన్నడలో కపాల మోక్ష అంటారని, వేధింపులకుగురవుతున్న జర్నలిస్టులు కుష్బూ నుంచి నేర్చుకోవాలంటూ ఒక జర్నలిస్టు యూజర్ ట్వీట్ చేయడం విశేషం. మరోవైపు సదరు యువకుడిని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. This is called Kapala Moksha in Kannada. @khushsundar slapped a man who tried to misbehave with her while campaigning for Bengaluru Central Candidate. Even few lady reporters who are subjected to this kind of harassment should learn from Kushboo. #LokSabhaElections2019 pic.twitter.com/v5ZuFDTTZa — Sagay Raj P (@sagayrajp) April 10, 2019 -
ఆయనకు వయసైపోయింది!
పెరంబూరు: సెల్లూర్ రాజుకు వయసైపోయ్యిందని నటి, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్త కుష్బూ అన్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా పాల్గొనడం లేదు. కుష్బూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అని చెప్పుకునే ఏకైన వ్యక్తి ఈవీకే.ఇళంగోవన్. ఆయన కోసం ఆయన పోటీ చేస్తున్న కోవైలో కుష్బూ ప్రచారం చేశారు. అలా ఉచలంపట్టిలో నిర్వహించిన ప్రచారసభలో కుష్బూ ఆన్నాడీఎంకే నాయకులపై ఆరోపణలు గుప్పించారు. దీంతో కుష్బూ ఆరోపణలకు ఎదురుదాడి చేసిన అన్నాడీఎంకే మంత్రి సెల్లూర్ రాజు వైగై నదిలో పెరుమాళ్( వేంకటేశ్వరస్వామి)కి స్నానం చేయించినా జనం వస్తారని అన్నారు. కాగా నటీనటుల ప్రచారానికి వచ్చే జనం ఓట్లుగా మారవని అన్నారు. అదే విధంగా నటి కుష్బూపైనా ఆరోపణలు చేశారు. కుష్బూకు వయసైపోయ్యిందన్నారు, ఆమె ఒంటి రంగు గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ట్విట్టర్లో స్పందించిన నటి కుష్బూ మన అన్నాడీఎంకే జ్ఞాని సెల్లూర్ రాజుకు వయసైపోయ్యిందన్నది బాగా తెలుస్తోందని పేర్కొన్నారు. పాపం ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. అయినా తన ప్రచారానికి వస్తున్న జనం గురించి ఆయన గమనించడం గర్వంగా ఉందన్నారు. 30 ఏళ్ల తరువాత కూడా ఇలా చేయగలుగుతున్నానంటే అది తమి ళ ప్రజల గొప్పేనని నటి కుష్బూ పేర్కొన్నారు. -
తెలంగాణలో కాంగ్రెస్‌కు 9 స్థానాలు
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 లేదా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని చెప్పారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలిసి కుష్బూ సోమవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి గాంధీ భవన్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కుష్బూ ఆరోపించారు. జీఎస్టీతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఉద్యోగాలు, దేశ ప్రగతి కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.72 వేలు ఇస్తాం. ప్రతి నెలా రూ.6 వేల చొప్పున మహిళల అకౌంట్లోనే వేస్తాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామని అంటున్నారు. మరి హైదరాబాద్ బిర్యానీని భాగ్యనగరం బిర్యానీ అనాలా? కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో రుణమాఫీ చేశాం. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశం మొత్తం రుణమాఫీ చేస్తాం. దేశ ప్రగతి ఒక్కటే మా నినాదం. మాకు వేరే ఎజెండాలు లేవు. బీజేపీ మేనిఫెస్టోలో కొత్తగా ఏమి లేదు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్. ఇలాంటి వారిని గెలిపించడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది. చేవెళ్ల ప్రజలకు విశ్వేశ్వర్‌రెడ్డి చాలా అవసరం. అందుకే ఆయనను గెలిపించుకోండి’అని అన్నారు. మహిళలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఒక జోక్‌లాగా మారిపోయిందని విమర్శించారు. -
మీకు వస్తే రక్తం, మాకు వస్తే టమాట చట్నీయా?
చెన్నై ,పెరంబూరు: కంటైనర్‌లో పట్టుబడ్డ ఆ రూ.560 కోట్ల సంగతేంటీ? అది ఎవరి డబ్బు? అంటూ నటి, కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కుష్బూ ప్రశ్నించారు. సోమవారం వేలూరు సమీపం కాట్పాడిలోని డీఎంకే ప్రముఖ నేత శ్రీనివాసన్ ఇంట్లోనూ, గోడౌన్లలోనూ ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించగా కట్ట కట్టలుగా డబ్బు బయటపడింది. ఆ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారితీసింది. ఈ దాడులపై కుష్బూ స్పందిస్తూ ఎన్నికల అధికారులు జరిపిన సోదాల్లో కట్టలు కట్టలు డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారన్నారు. సోదాలు చేయండని, అదే విధంగా అది ఎవరి డబ్బు, ఎంత అన్నది కూడా బయట పెట్టవచ్చు తప్పులేదు అన్నారు. అయితే గత రెండేళ్ల క్రితం కంటైనర్‌తో సహా రూ.560 కోట్లు పట్టుకున్నారుగా, అది ఎవరిదీ, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమయ్యింది? అని ప్రశ్నించారు. అదే విధంగా ఒక మంత్రి ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగానే ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే చేతిలో పత్రంతో పారిపోయారు. ఆ పత్రంలో ఏముందీ? దాని గురించి విచారించారా? ఆ వివరాలు ఏవీ? ఇంత వరకూ చెప్పలేదే అని ప్రశ్నించారు. టమాట చట్నీయా? ఇప్పటివరకు పట్టుబడిన నగదుపై.. జరిగిందేదో జరిగింది. దాన్ని మరచిపోదాం అంటారా? మీకు వస్తే రక్తం, మాకు వస్తే టమాట చట్నీయా? ఎన్నికల ఆధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే తప్పులేదు అని కుష్బూ అన్నారు. -
స్క్రీన్ టెస్ట్
ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఏ నోట విన్నా రాజకీయమే. రచ్చబండ మీద, పొలం గట్ల దగ్గర అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడ చూసినా రాజకీయాలే. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమా సీన్లలో ఉండే రాజకీయాలను కథ నిర్ణయిస్తుంది. ఒకప్పుడు సినిమా, రాజకీయాలు రెండూ రెండు భిన్న కోణాలు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. సినిమాల్లో రాజకీయాలు కాదు, రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. సినిమా వాళ్లల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కు (యం.పి) ఎన్నికైన మొట్టమొదటి తెలుగు నటుడు ఇతను. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు నుంచి గెలుపొందిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఎ) చిత్తూరు నాగయ్య బి) కాంతారావు సి) కొంగర జగ్గయ్య డి) యస్వీ రంగారావు 2. 1989లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నటుడెవరో కనుక్కుందామా? ఎ) కృష్ణ బి) శోభన్‌బాబు సి) హరనాథ్ డి) శరత్‌బాబు 3. ప్రముఖ నటుడు చిరంజీవి 2008లో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు ఏంటో కనుక్కోండి? ఎ) రైలు బి) కారు సి) విమానం డి) స్కూటర్ 4. 2009 ఎలక్షన్స్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరపున యం.ఎల్.ఏ గా గెలిచిన సినీ నటి ఎవరో తెలుసా? ( సికింద్రాబాద్ నియోజకవర్గం) ఎ) కుష్బూ బి) నగ్మా సి) సుహాసిని డి) జయసుధ 5. నటి రోజా వైయస్ఆర్ సీపీ తరపున పోటీ చేసి యం.ఎల్.ఏగా గెలుపొందారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారో తెలుసా? ఎ) నగరి బి) చిత్తూరు సి) పీలేరు డి) తిరుపతి 6. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్‌గా గెలుపొందిన నటి? ఎ) హేమమాలిని బి) జయప్రద సి) జయబాధురి డి) రేఖ 7. ఈయన ప్రముఖ సినిమా రచయిత. తమిళనాట రాజకీయాల్లో చాలా కీలక పాత్రను పోషించారు. ఎవరా రచయిత? ఎ) కరుణానిధి బి) యం.జీ.ఆర్ సి) స్టాలిన్ డి) నెపోలియన్ 8. నటి రాధిక భర్త శరత్‌కుమార్. అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తమిళ రాజకీయల్లో క్రియాశీలక వ్యక్తి. 2007లో ఆయన తన సొంత పొలిటికల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పేరేంటి? ఎ) హిందూ మక్కళ్ కట్చి బి) కొంగునాడు మున్నేట్ర కళగం సి) తమిళ్ మానిల కాంగ్రెస్ డి) ఆల్ ఇండియా సమత్తువ మక్కళ్ కట్చి 9. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ యం.ఎల్.ఏగా గెలుపొందిన తెలుగు సినీ ప్రముఖుడెవరో కనుక్కోండి? ఎ) మురళీమోహన్ బి) ఏవీయస్ సి) అలీ డి) కోట శ్రీనివాసరావు 10. 1995వ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తెలుగు నటుడెవరు? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) బాలకృష్ణ డి) ఏయన్నార్ 11. 2019 కర్ణాటక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఈ మధ్యే ప్రకటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) సాయికుమార్ బి) ప్రకాశ్ రాజ్ సి) అయ్యప్ప.పి.శర్మ డి) యశ్ 12. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి, మెదక్ నియోజక వర్గం నుంచి యం.పీ గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరా నటి? ఎ) శారద బి) కవిత సి) విజయశాంతి డి) విజయనిర్మల 13. ప్రముఖ నటి సౌందర్య ప్రచారానికి వెళ్తూ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ఆమె ఏ సంవత్సరంలో మరణించారు? ఎ) 2000 బి) 2001 సి) 2002 డి) 2004 14. ఈ నటుడు 2017లో కర్ణాటకలోని ఓ పార్టీలో చేరారు. ఐదు నెలల తర్వాత ఆ పార్టీకి తిలోదకాలిచ్చి ప్రజాకీయ అనే సొంత పార్టీని ప్రారంభించారు. ఎవరా నటుడు? ఎ)ఉపేంద్ర బి) పునీత్ రాజ్‌కుమార్ సి) సుదీప్ డి) శివ రాజ్‌కుమార్ 15. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్ర రావు సి) దిలీప్ కుమార్ డి) రాజేష్‌ఖన్నా 16. ‘మక్కళ్ నీది మయం’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన తమిళ నటుడు ఎవరు? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) విశాల్ డి) విజయ్‌కాంత్ 17. ఈయన ప్రముఖ నటుడు. యం.ఎల్.ఏ గా రెండుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఓడిపోయారు. ఆ నటుడెవరు? ఎ) సుమన్ బి) పోసాని కృష్ణమురళీ సి) బాబుమోహన్ డి) విజయ్ చందర్ 18. 1999లో పదమూడవ లోక్‌సభకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల నుంచి యంపీగా పోటీ చేసి గెలుపొందిన తెలుగు నిర్మాత ఎవరు? ఎ) సి.అశ్వనీదత్ బి) మాగంటి బాబు సి) జి.ఆదిశేషగిరిరావు డి) డి.రామానాయుడు 19. కాకినాడ నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రముఖ నటుడు ఎవరు? ఎ) కృష్ణ బి) మురళీమోహన్ సి) కైకాల సత్యనారాయణ డి) కృష్ణంరాజు 20. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆమె మరణానంతరం ఆమెపై 3 బయోపిక్‌లు నిర్మితమవుతున్నాయి. అందులో ఓ చిత్రంలో జయలలిత పాత్రలో నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) హన్సిక డి) త్రిష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (డి) 5) (ఎ) 6) (బి) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (బి) 11) (బి) 12) (సి) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (ఎ) 17) (సి) 18) (డి) 19) (డి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
‘మహిళలకు చోటులేకపోవడం దురదృష్టకరం’
కరీంనగర్ జిల్లా: టీఆర్ఎస్ నాలుగేళ్లలో అవినీతి, అక్రమాలే చేసింది తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీ నటి ఖుష్బూ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఆమె మాట్లాడుతూ..టీఆర్ఎస్ వస్తే ఒక మంచి పని ఐనా జరుగుతుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. తెలంగాణలో కనీసం మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని, మంత్రివర్గంలో మహిళలకు చోటులేకపోవడం దురదృష్టకరమని వ్యాక్యానించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రజల్లోకి రాలేదని అన్నారు. కనీసం సెక్రటేరియట్‌కు కూడా కేసీఆర్ వెళ్లిన దాఖలాలు లేవన్నారు. మహిళల కోసం ఏదైనా చేశారా అంటే కేసీఆర్ కుమార్తె కవితకు మాత్రమే మేలు చేశారని విమర్శించారు. తెలంగాణాలో దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు. మావోయిస్టు సభ్యురాలు శృతిని లైంగికంగా హింసించి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ఆమె ఛాతీపై, కాళ్లపై చిత్రహింసలకు గురి చేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు, మహిళా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్లు లోపాయికారిగా కలిసిపోయాయని ఆరోపించారు.36 లక్షల మంది రైతులకు ఇంకా పాసు బుక్కులే అందలేదని తెలిపారు. గతంలో రేషన్ కార్డులపై ఇచ్చిన 9 రకాల సరుకులను టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ వాటిని ఇస్తామని చెప్పారు. బతుకమ్మ చీరల్లో రూ.220 కోట్ల స్కాం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలోనే అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, డబ్బులీయందే ఇక్కడ ఏ పనీ జరగడం లేదని వ్యాఖ్యానించారు. రూ.25 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణాను రూ.2.2 లక్షల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయేలా చేశారని టీఆర్ఎస్పై మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సీఎం కేసీఆర్‌కు 6 శాతం కమిషన్లు ముట్టాయని ఆరోపించారు. హస్తం గుర్తుకు ఓటేస్తే మీ సమస్యలన్నీ తీరుతాయని అన్నారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లామని తెలిపారు. -
నన్ను నేను కోల్పోయినట్లుగా ఉంది
‘‘స్క్రీన్ నేమ్ ‘రెబల్ స్టార్’. కానీ రియల్‌గా ‘సింపుల్ స్టార్.. హంబుల్ స్టార్’’... ప్రముఖ కన్నడ స్టార్ అంబరీష్ గురించి పలువురు చిత్రరంగ ప్రముఖులు వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది. ‘‘నలుగురూ బాగుండాలని కోరుకునే వ్యక్తి’’ అని కూడా పేర్కొన్నారు. ఇంత మంచి పేరు ఉంది కాబట్టే... తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీవాళ్లు ‘ఇక అంబరీష్ లేరు’ అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని భాషల్లోనూ స్నేహితులను సంపాదించుకున్న అజాతశత్రువు అని అంబరీష్ గురించి వినిపించే మాట. బెంగళూరులో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి వెళ్లిన మోహన్‌బాబు, ఖుష్బూ, సీనియర్ నరేశ్‌లు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► అంబరీష్‌గారితో మీ స్నేహం ఎప్పుడు మొదలైంది? ఎవరు పరిచయం చేశారు అన్నది గుర్తు లేదు కానీ 36 సంవత్సరాల క్రితం మదరాసులో మా ఇంట్లో కలిశాం. ఆ స్నేహం ‘అరేయ్.. ఒరేయ్’ అని పిలుచుకునేంత గాఢమైంది. అప్పట్లో మదరాసులో వాడు హోటల్లో ఉండేవాడు. ఆ సమయంలో మా ఇంటికి వచ్చేవాడు. అప్పటికి అంబరీష్‌కి పెళ్లి కాలేదు. సుమలత, నేను 10–12 సినిమాలు యాక్ట్ చేశాం. చాలా మంచి అమ్మాయి. అంబరీష్, తనూ పెళ్లి చేసుకోవడం.. ఇలా ఆ కుటుంబానికి చెందినవన్నీ మాకు, మా కుటుంబానికి చెందినవన్నీ వాళ్లకూ తెలుసు. నేను బెంగళూర్ వెళితే వాడికి ఫోన్ చేయాల్సిందే. లేకపోతే ఊరుకోడు. గొప్ప స్నేహితుడు, శ్రేయోభిలాషి. ► అంబరీష్‌గారు నటుడి నుంచి రాజకీయ నాయకు డిగా ఎదగడం చూశారు.. ఆయన ఎదుగుదల గురించి? నిజానికి మా ఇద్దరి స్నేహం మొదలైనప్పుడు నేను విలన్‌గా చేస్తున్నాను. అంబరీష్ అప్పటికే మంచి స్టార్. కానీ మా మధ్య ఆ తేడాలేవీ ఉండేవి కాదు. మంచి నటుడు అనిపించుకున్నాడు. యంఎల్‌ఏ అయ్యాడు. అన్నీ కష్టపడి సాధించుకున్నాడు. ఆ ఎదుగుదలలో భాగంగా వాడు ఏ ఫంక్షన్‌కి పిలిచినా వెళ్లేవాడిని. ఒకవేళ ఒకటీ అరా వెళ్లకపోతే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి ‘ఎక్కడ వాడు.. ఆ రాస్కెల్ ఎక్కడ?’ అని అడిగేవాడు. నన్ను తిట్టేవాళ్లలో మొదటి వ్యక్తి వాడే. ‘అరేయ్ ఒరేయ్’ అనే మాటలకన్నా నన్ను ఎక్కువగానే తిట్టేవాడు. అంత చనువుంది. మా స్నేహాన్ని మాటల్లో చెప్పలేం. ► అంబరీష్‌గారు భోజనప్రియుడు అని విన్నాం. ఏది ఇష్టంగా తినేవారు? మదరాసులో హోటల్లో ఉండేవాడని చెప్పాను కదా. హోటల్లో ఉండే అన్ని రకాల వంటకాలు ఇంట్లో లేకపోయినా ఇంట్లో ఉండే ఒకటీ రెండు కూరలు మనకు బ్రహ్మాండంగా అనిపిస్తాయి. అందుకే మా ఇంటి నుంచి క్యారేజీ పంపించేవాళ్లం. చికెన్, మటన్ బాగా ఇష్టపడి తినేవాడు. ఎందుకో కానీ చేపలంటే తనకి ఇష్టం ఉండేది కాదు. నన్ను కూడా తినొద్దనేవాడు. నేను బెంగళూరు వెళితే అప్పుడు కూడా ఫిష్ తప్ప చికెన్, మటన్ వండించేవాడు. ► చివరిసారిగా అంబరీష్‌గారిని మీరెప్పుడు కలిశారు? మా అమ్మగారు చనిపోయిన రోజున (ఈ ఏడాది సెప్టెంబర్ 20) ఫోన్ చేశాడు. ‘కొంచెం ఆరోగ్యం బాగాలేదు.. రాలేకపోతున్నాను. బాధగా ఉంది. కొన్ని రోజుల తర్వాత వచ్చి కలుస్తాను’ అన్నాడు. పది రోజుల ముందు ఫోన్ చేశాడు. నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను. వైకుంఠ ఏకాదశికి కుటుంబంతో తిరుపతి రావాలనుకుంటున్నాను అన్నాడు. అంతకు ముందు సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఫ్యామిలీతో సహా తిరుపతి వచ్చాడు. నేనే దగ్గరుండి తీసుకెళ్లాను. రెండు గంటల పాటు దైవ సన్నిధిలోనే ఉన్నాం. ► స్నేహం ఏమీ ఆశించదంటారు.. మీ ఇద్దరి స్నేహం అలానే సాగిందా? ఈ రోజు వరకూ కూడా వాడు ఫలానాది కావాలి అని అడిగింది లేదు. ఎప్పుడైనా నేనేమైనా అడిగానేమో గుర్తు లేదు. మాది స్వచ్ఛమైన స్నేహం. నా లైఫ్‌లో గొప్ప స్నేహితుడు వాడు. శ్రేయోభిలాషి. అంబరీష్ లేడనే మాట విని బాధపడిపోయాను. మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నాం. అంబరీష్ అంతిమక్రియలు జరిగే వరకూ బెంగళూరులోనే ఉంటాను. నా మిత్రుడికి చివరి వీడ్కోలు ఇచ్చినప్పటికీ నా మనసులో నుంచి ఎప్పటికీ చెరిగిపోడు. నా ఆప్తమిత్రుల్లో ఒకరిని కోల్పోయాను. నన్ను నేను కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ‘అడుగు ఆపకూడదు అనేవారు’ — సీనియర్ నరేశ్ ► చివరిసారిగా అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు? గతేడాది బెంగళూరులో ఆయన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అందర్నీ పిలిచారు. అప్పుడు కలిశాను. ఆ తర్వాత కన్నడ నటీనటుల సంఘం (కళారధి) భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాను. నటీనటుల కోసం బెంగళూరులో అంత పెద్ద బిల్డింగ్ రావడం ఆయన కృషి వల్లే సాధ్యమయింది. నేను చివరిసారిగా అంబీ అన్నను కలిసింది ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడే. దాదాపు 9 నెలలు అవుతుంది అనుకుంటున్నాను. ► అసలు మీరు అంబరీష్‌గారిని ఫస్ట్ ఎక్కడ కలిశారు? 1983–84–85 టైమ్‌లో ఆయన చెన్నైలో ఉండేవారు. ఆ టైమ్‌లో ఫస్ట్ కలిశాను. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. నా కెరీర్ తొలినాళ్లలో ఆయన వందో చిత్రం షూటింగ్ టైమ్‌లో కలిశాను. ఆయన్ను బ్రదర్‌లా అనుకునేవాడిని. ► అంబరీష్గారిలోని నటుడ్ని చూసి మీకేనిపించేది? కన్నడంలో రాజ్‌కుమార్‌గారి తర్వాత మాస్ హీరో అంటే అంబరీష్గారే. ఆయన్ను తొలిసారి బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘అంత’ (తెలుగులో ‘అంతం కాదిది ఆరంభం’)లో వెండితెరపై చూశాను. స్క్రీన్‌పై అంబీ అన్న నటన చూసి, ఆశ్చర్యపోయాను. సౌత్ నుంచి ఓ సినీ దిగ్గజం వెళ్లిపోయింది. ► అంబరీష్‌గారు ఎలాంటి వారు? ఆయనకు వయసు భేదం లేదు. అందరినీ కలుపుకునే పెద్ద మనసు ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇదే చెబుతారు. చాలా ధారాళమైన హృదయం ఉన్న వ్యక్తి. చాలా సరదా మనిషి. అంబరీష్‌గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారా? కలిసి నటించలేదు. కృష్ణగారితో సుమలతగారు సినిమాలు చేశారు. అలా ఆ కుటుంబానికీ, మా కుటుంబానికీ మంచి అనుబంధం ఉంది. ► మీకు ఏమైనా సలహాలు ఇచ్చేవారా? లైఫ్‌లో ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. ఆగకూడదు అనేవారు. చాలా మొండివాడు. ధైర్యవంతుడు. సినిమాల్లో, రాజకీయాల్లోనూ, దానధర్మాల్లోనూ ముందు ఉండేవారు. ► అంబరీష్గారి నుంచి స్ఫూర్తి పొందే విషయాలు చెబుతారా? చాలా ఉన్నాయి. మేజర్‌గా ధైర్యం, కలుపుగోలుతనం, దానగుణం. 'స్థాయిని బట్టి మాట్లాడే వ్యక్తి కాదు' – ఖుష్బూ ► మీ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంబరీష్‌గారు స్టార్. ఆయనతో సినిమా చేసినప్పుడు ఎలా ఉండేది? అంబరీష్‌గారు చాలా కంఫర్ట్బుల్. చాలా ఫ్రెండ్లీ నేచర్. ఆయనతో పని చేయడాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సరే రిపీటెడ్‌గా వర్క్ చేయాలనుకునే స్టార్ అంబరీష్. అంత కంఫర్ట్బుల్. ► ఫస్ట్ టైమ్ అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు? ‘ఒంటి సలగా’ అనే కన్నడ సినిమా సెట్లో మెదటిసారి కలిశాను. నేను సూపర్‌స్టార్‌ని. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను చూసి భయపడాలి అనుకునే మనిషి కాదు అంబరీష్‌గారు. అలాంటివి కోరుకోరు కూడా. చాలా హంబుల్‌గా ఉండేవారు. అందుకని నాకు భయం అనిపించలేదు. ► పవర్ఫుల్ మాస్ రోల్స్ చేయడంవల్ల అంబరీష్గారికి ‘రెబల్‌స్టార్’ ట్యాగ్ ఉంది. లొకేషన్లో అసిస్టెంట్స్‌తో ఎలా ఉండేవారు? స్క్రీన్ మీదే ఆయన రెబల్ స్టార్. బయట అందరినీ సమానంగా చూసేవారు. కెరీర్ చివరి వరకూ కూడా ఆయన అలానే ఉన్నారు. స్థాయిని బట్టి మాట్లాడే గుణం లేదాయనకు. ► 1980లలో నటించిన తారలందరూ ‘రీయూనియన్’ అంటూ ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. అప్పుడు అంబరీష్‌గారు సందడి చేసేవారా? ఈ ఏడాది ఆరోగ్య కారణలతో హాజరు కాలేకపోయారు. కానీ ప్రతీ ఏడాది ఫుల్ హుషారుగా, సరదాగా ఉండేవారు. చాలా సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటారు. కానీ 2015లో మోహన్‌లాల్ ఏర్పాటు చేసిన మీట్లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. శనివారం వెళుతూ వెళుతూ ఓ చేదు వార్త వినేలా చేస్తుందని ఊహించలేదు. మా అందరికీ పెద్ద షాక్. అత్యంత ఆప్తుడిని కోల్పోయాం. -
కేసీఆర్.. ఓ నయా నవాబ్!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖరీదైన కార్లు, రూ.300 కోట్ల విలాసవంతమైన బంగ్లా, రాజభోగాలతో ఓ నయా నవాబ్‌ను తలపిస్తున్నారని ధ్వజమెత్తారు. సచివాలయానికి రాకుండా ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌ల్లో కాలక్షేపం చేసే ఏకైక సీఎం కేసీఆర్ అని విమర్శించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల మధ్యనే ఉంటాననడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. రూ.మూడు వందల కోట్ల విలువైన బంగ్లా కట్టుకున్న కేసీఆర్‌కు పాపం సొంత కారులేదట అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం కాదని.. కమీషన్ మ్యాన్ అని అభివర్ణించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్నది బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో ఆరు శాతం కమీషన్ కాజేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్.శారద, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో అధర్మ పాలన కొనసాగుతోందని, ప్రతిపక్షం అంటే కేసీఆర్‌కు కనీస గౌరవం లేదన్నారు. తెలంగాణ అవినీతిలో రెండు, నిరుద్యోగంలో మూడోస్థానంలో ఉందని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో చెప్పిందొక్కటీ పూర్తి చేయలేదని, దళిత సీఎం హామీని డస్ట్‌బిన్‌లో వేశారని దుయ్యబట్టారు. మహిళా సాధికారతేదీ..? మహిళా సాధికారత గురించి మాట్లాడే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు సీట్లు ఎందుకు కేటాయించలేదని ఖుష్బూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 11 సీట్లిస్తే, టీఆర్ఎస్ కేవలం 4 మాత్రమే ఇచ్చిందన్నారు. నాలుగేళ్లలో ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించలేదని, రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. 14 మంది ఎంపీల్లో ఒకే ఒక మహిళ ఉన్నారని, ఆమె కూడా కేసీఆర్ కూతురేనన్నారు. రాష్ట్రంలో మహిళలంటే కేసీఆర్ కూతురు ఒక్కరేనా? అని ప్రశ్నించారు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా మహిళను పెట్టలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్‌దని దుయ్యబట్టారు. కేసీఆర్‌ది మహిళావ్యతిరేక ప్రభుత్వమని, ఆయన పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై 18 శాతం మేర నేరాలు పెరిగిపోయాయన్నారు. బతుకమ్మ చీరల కొనుగోలులో రూ.220 కోట్ల కుంభకోణం జరిగిందని ఆమె ఆరోపించారు. కల్యాణలక్ష్మీ పథకం కూడా కేవలం టీఆర్ఎస్ సంబంధిత వర్గాలకే అందుతోందని, ఈ పథకానికి ఇచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించలేదని, ఎక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వం బోగస్ ఎన్కౌంటర్లు చేస్తోందని, చిత్రహింసలకు గురి చేసి యాసిడ్ పోసి చంపేసిన శ్రుతి ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఓవైసీ స్థాయి రూ.25 లక్షలేనా.. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్థాయి రూ.25 లక్షలేనా అని ఖుష్బూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకరు తన నియోజకవర్గంలో మజ్లిస్సభ జరగకుండా ఉండేందుకు మధ్యవర్తి ద్వారా రూ.25 లక్షలు ఆఫర్ చేశారని అసద్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. అసదుద్దీన్ తన స్థాయి తక్కువగా దిగజార్చుకున్నారని, నిజంగా ఆఫర్ ఇస్తే నిరూపించాలని సవాల్ చేశారు. అప్పుడు పార్టీ పరంగా చర్యలు తీసుకోవడంపై ఆలోచిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ రద్దు చేసిన పాత పథకాలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హస్తం, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రేమలో ఉన్నాయి.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఒక్కటేనని ఖుష్బూ దుయ్యబట్టారు. ఒకదానికొకటి సహకరించుకుంటూ ప్రేమలో ఉన్నాయన్నారు. కేసీఆర్, మోదీ రిబ్బన్ కటింగ్స్ చేసే సీఎం, పీఎంలుగా వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. గిరిజనుల భూములను కమీషన్లతో అమ్ముకున్నారని, గిరిజనులను చిత్రహింసలు పెట్టిన చరిత్ర కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు. ఇండ్లు ఇస్తానని జర్నలిస్ట్‌లను కూడా కేసీఆర్ మోసం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ జీరో కావడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. -
కేసీఆర్ ఓ నయా నవాబ్
-
కేసీఆర్‌పై మండిపడ్డ ఖుష్బూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ నయా నవాబ్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ ధ్వజమెత్తారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నన్ని రోజులు కనీసం ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల మధ్యనే ఉంటాననడం హస్యాస్పదంగా ఉందన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కేసీఆర్ మహిళలకు సీట్లు మాత్రం కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 11 సీట్లిస్తే.. టీఆర్ఎస్ కేవలం 4 మాత్రమే ఇచ్చిందని, ఒక్కరికి కూడా ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించలేదని మండిపడ్డారు. 14 మంది ఎంపీల్లో ఒకే ఒక మహిళా ఎంపీ ఉన్నారని, ఆమె కూడా కేసీఆర్ కూతురేనన్నారు. మంత్రి వర్గంలో కూడా ఒక్క మహిళకు అవకాశం కల్పించలేదని, మహిళలపై నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మీ పథకం కూడా కేవలం టీఆర్ఎస్ సంబంధిత వర్గాలకే అందుతుందని ఆరోపించారు. ఈ పథకానికి ఇచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించలేదని, ఎక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. -
ఇంట్లో కూర్చునే సీఎం మనకొద్దు
జడ్చర్ల టౌన్: ‘ఇంట్లో కూర్చుని పనిచేసే సీఎం మనకొద్దు.. అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం’అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరఫున రోడ్డు షో ద్వారా ప్రచారం చేశారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ హయాంలో మహిళలకు అన్ని రంగాల్లోనూ అవమానమే జరిగిందని, మహిళామంత్రి లేని కేబినెట్‌గా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మహిళాసంఘాలకు రుణాలివ్వకుండా ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. బతుకమ్మ చీరల పేరుతో రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండాపోయిందని, లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాల్లో దేశం లోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో మహిళా సిబ్బంది కొరత ఉందని, ఆ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నా రని పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న కవిత రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నారని కుష్బూ విమర్శించారు. బీసీలకు తాము టీఆర్ఎస్ కన్నా సముచితస్థానం కల్పించామన్నారు. సమావేశంలో మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా సోషల్ మీడియా అవార్డ్స్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్–2018 కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలు శుక్రవారం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మెన్ గద్దె అనూరాధ, పర్యాటక శాఖ సీఈఓ హిమాన్షు శుక్లాలు పాల్గొన్నారు. మంత్రముగ్ధులను చేసిన ‘మిత్ర’ ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ‘మిత్ర’ రోబోను ఆవిష్కరించారు. ఈ రోబోను 2017 హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు తొలిసారిగా ఆవిష్కరించారు. ఐదడుగులున్న ఈ రోబో తన మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పర్యాటక శాక సీఈఓ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సోషల్ మీడియా రంగంలో అవార్డులను ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తోందన్నారు. సోషల్ మీడియా ద్వారా పర్యటక రంగ అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో సెల్ఫీలు దిగడానికి యువత ఎగబడ్డారు.తరలిరానున్న సినీ తారలు.. శనివారం సోషల్ మీడియా రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటున్న సినీ ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటీ కరీనా కపూర్, టాలీవుడ్ నటీ సమంతా అక్కినేని, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లకు అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో రాణిస్తున్న మరో 40 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. -
అర్జున్ పై నటీమణుల ప్రకటనలు
శాండల్‌వుడ్‌లో మీ టూ ప్రకంపనలు సృష్టిస్తోంది. హీరో అర్జున్ సర్జాను తనను వేధిం చారని హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపించడం, అర్జున్ ఖండించడం జరిగిపోయింది. మేఘనా గాంవ్కర్, అవంతిక షెట్టి శ్రుతికి సోమవారం మద్దతు ప్రకటించగా, ఈ తరుణంలో అర్జున్‌కు అండగా ఖుష్బు, హర్షిక, తార గళమెత్తారు. అర్జున్ జెంటిల్మెన్ అన్నారు. కర్ణాటక, యశవంతపుర: మీటూ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు అర్జున్‌కు పలువురు నటీనటులు అండగా నిలిచారు. అర్జున్‌పై నటి శ్రుతి హరిహరన్ చేసిన మీటూ ఆరోపణలను ఖండిస్తూ ప్రముఖ నటి ఖుష్బూ ఒక వీడియోను విడుదల చేశారు. ‘శ్రుతి ఆరోపించిన విధమైన వ్యక్తి అర్జున్ కాదు. ప్రతి ఒక్కరికీ ఆయన మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. అయన అలా చేయలేదనటానికి నేరు గ్యారంటీ ఇస్తాను. 34 ఏళ్ల నుండి సినిమా రంగంలో నాకు పరిచయం. నేను నటించిన మొదటి సినిమాకు ఆయన హీరో. ఎప్పుడూ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదదు. శ్రుతి హరిహరన్ ఆరోపణలు విని ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. ఒక కుటుంబానికి తండ్రైన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆరోపణలు చేసే ముందు యోచించాలి. ఇప్పుడు అర్జున్‌కు నేను మద్దతు ఇవ్వకుంటే 34 ఏళ్ల స్నేహానికి అవమానం కలుగుతుంది’ అని ఆమె చెప్పారు. అలాంటి వ్యక్తులా మీ టూ అనేది: హర్షిక అర్జున్‌కు అందాల నటీమణి హర్షికా పూణచ్ఛ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రుతి హరిహరన్పై పరోక్షంగా ఆరోపణల వర్షం కురిపించారు. ‘నేడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులే నాడు ప్రముఖు వ్యక్తుల జతలో అర్థనగ్న ప్రదర్శనలు చేశారు’ అని హర్షిక సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్డడం సంచలనం కలిగిస్తోంది. ‘మీటూ ఆరోపణలను గమనిస్తున్నాను. అయితే ఒక మహిళగా నేను చిత్రరంగాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నా. ఒక మహిళను గౌరవించటం ధర్మం. అయితే పబ్లిసిటీ కోసం ఒక కుటుంబాన్ని విడదీసి వారి భార్య, పిల్లలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. దశాబ్దాలుగా చిత్ర రంగంలో ఉంటున్న వ్యక్తుల పేరును ఒక అసత్యం ద్వారా చెడగొట్టవద్దు. అ వ్యక్తి (అర్జున్) ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో గమనించాలి. పేరు రావడానికి ఏం చేసినా సరిపోతుంది. పేరు వచ్చిన తరువాత తను ఏం మాట్లాడినా సరిపోతుందని భావించటం పద్ధతి కాదు’ అని శ్రుతిపై మండిపడ్డారు. పేరున్న నిర్మాత తనకు ఒక వీడియో చూపించారని, మీటూ అంటున్న నటి ఆ వ్యక్తి భుజం మీద నిద్రిస్తున్న వీడియోను చూశానని, అలాంటి మీ టూ అంటుంటే సిగ్గేస్తోందని చెప్పారు. అర్జున్ సర్జా మంచోడు : నటి తార మండ్య: మీటూ ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని బీజేపీ నాయకురాలు, నటి తారా అనురాధ తెలిపారు. ప్రచారంలో ఆమె మాట్లాడారు. బహుభాషా నటుడు అర్జున్ సర్జాపై హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన ఆరోపణల వ్యవహారంలో అర్జున్ సర్జాకే మద్దతు తెలుపుతున్నామన్నారు. అర్జున్‌తో తాము గతంలో పలు చిత్రాల్లో కలసి నటించామని ఎప్పుడూ తమతో అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. అయితే నటి శృతి ఆరోపణలు అవాస్తమనేది తమ ఉద్దేశం కాదన్నారు. అర్జున్‌పై ఎందుకు ఆరోపణలు చేశారో తమకు అంతుచిక్కడం లేదన్నారు. -
వెంకీ... ఖుష్బూ@ 32
వెంకటేశ్ ఐదు పదుల వయసు దాటేసిన విషయం తెలిసిందే. కానీ తన వయసు ఇంకా 32 ఏళ్లే అంటున్నారాయన. వెంకీ అబద్ధం చెప్పడం లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. యాక్టర్‌గా 32 ఇయర్స్ అని ఆయన అంటున్నారు. ‘‘14 ఆగస్టు 1986లో నేను హీరోగా నటించిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలైంది. మంగళవారంతో నాకు ఇండస్ట్రీలో 32 ఏళ్లు ముగిశాయి. ఈ ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేయడంతో పాటు అభిమానించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని వెంకీ అన్నారు. ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యేందుకు వెంకీ ఫొటో షేరింగ్ యాప్ ‘ఇన్స్టాగ్రామ్’లో జాయిన్ అయ్యారు. ‘‘సౌత్‌లో హీరోయిన్గా నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలై అప్పుడే 32 ఏళ్లు కంప్లీట్ అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలాను చూశా. అండగా ఉన్నవారికి థ్యాంక్స్’’ అన్నారు ఖుష్బూ. -
‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో హీరో ఎవరంటే..?
తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. తాజాగా ఈ సినిమాను తమిళ రీమేక్ హక్కులను కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. అత్తారింటికి దారేది తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సుందర్.సి డైరెక్ట్ చేయనున్నాడు. అంతేకాదు తెలుగులో నదియ కనిపించిన అత్త పాత్రను కోలీవుడ్‌లో సుందర్ సతీమణి, ప్రముఖ నటి కుష్బూ పోషించనున్నారు. ఇప్పటికే కన్నడలో రీమేక్ అయిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. -
నగ్మాకు చెక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మహిళా కాంగ్రెస్ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం నగ్మాను తప్పించింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నగ్మాను ఈ బాధ్యతల నుంచి తప్పించడంలో పార్టీ అధికార ప్రతినిధి కుష్బు ప్రమేయం ఉండొచ్చని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ గురించి ఏమైనా చెప్పుకోవాలంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది వర్గ పోరు మాత్రమే. ఆనాటి కామరాజనాడార్ మొదలు ఈనాటి తిరునావుక్కరసర్ వరకు వర్గపోరును భరించినవారే. ఒకరినొకరు బహిరంగా విమర్శించడంలో ఎవరికి వారే సాటిగా వ్యవహరిస్తుంటారు. తమిళనాడు కాంగ్రెస్‌లో తిరునావుక్కరసర్, ఈవీకేఎస్ ఇళంగోవన్, పి.చిదంబరం వర్గాలు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుత విషయానికి నగ్మా, కుష్బు ఇద్దరూ బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దిగుమతైన నటీమణులే. కానీ కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఒకరంటే ఒకరికి పట్టనట్లుగా వ్యవహరిస్తారు. నగ్మా కార్యక్రమాలకు కుష్బు హాజరైన సందర్భాలు లేవు. ఇద్దరికీ కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే కుష్బు తమిళం చక్కగా మాట్లాడతారు. నగ్మాకు తమిళం రాదు. కుష్బులా నగ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీరాణిని లెక్కచేయడం లేదనే విమర్శ ఉంది. ఇటీవల ఒక సమావేశంలో ఝాన్సీరాణిని దూరంగా కూర్చోవాలని నగ్మా ఆదేశించడం కలకలం రేపింది. నగ్మాను వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఫలితమే నగ్మాకు ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ఉద్వాసనగా తెలుస్తోంది. -
రాష్ట్ర కాంగ్రెస్‌కి కొత్త అధ్యక్షుడు!
పెరంబూరు: మరో రెండు నెలల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులవుతారని ఆ పార్టీ ప్రచార కర్త, నటి కుష్భూ పేర్కొన్నారు.ఈమె ఇటీవల ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు, గత ఏడాది డిశంబర్‌లో జాతీయ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలను చేపట్టిన రాహుల్‌గాంధీ ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. తదుపరి తమిళనాడుపై దృష్టి పెట్టనున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో పెను మార్పులు జరగనున్నాయన్నారు. మరో రెండు నెలల్లో కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడు తిరునావుక్కరసన్ పని తీరు బాగాలేదా? అన్న ప్రశ్నకు ఆయన ఇంకా బాగా చేయాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న ప్రశ్నకు అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బదులిచ్చారు. ఆ పదవికి ఎవరెవరు పోటీ పడుతున్నారని అడగ్గా సీనియర్ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని బదులిచ్చారు. తమిళనాడులో కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, దానికి మిమ్మల్ని నాయకురాలిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోందే అని అడగ్గా అవి వదంతులన్నారు. ఆ బాధ్యతను సీనియర్ నాయకుడు చిదంబరం చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతుందే అని అడగ్గా చిదంబరం పార్టీలో చాలాపెద్ద నాయకుడని, ఆయన తమిళ ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి అన్నారు. అయితే ఆయన పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడానికి అంగీకరిస్తారా? అన్నది సందేహమేనన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నా.. పార్టీలో సంతోషంగా ఉన్నారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం కాంగ్రెస్, అంతకు ముందు డీఎంకే లోనూ సంతోషంగా ఉన్నానన్నారు. ఇప్పటికీ కనిమోళి, సెల్వి అక్క తదితరులతో సత్సం బంధాలు కొనసాగిస్తున్నానని చెప్పారు. -
నిరాహార దీక్షలో పుష్టిగా భుజించిన ప్రధాని
పెరంబూరు: నిరాహార దీక్షలోనూ రెండు పూటలా పుష్టిగా భుజించిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీనే అని నటి, రాష్ట్ర కాంగ్రెస్ ప్ర చార కర్త కుష్బూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా గురువారం దేశవ్యాప్తంగా ఒక రోజు నిరా హారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. గురువారం చెన్నైకి వచ్చిన ప్రధాని ఉదయం అల్పాహార సమయం, మధ్యాహ్నం భోజన సమయాన్ని విమానంలోనే గడిపారని కుష్భూ ఆరోపించారు. అలా రెండు పూటలు శుభ్రంగా ఆహారం లాగించి నిరాహారదీక్ష చేసిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలను మోసం చేయడానికే మోదీ నాటకాలాడుతున్నారని, ఆయన డ్రామాలు ఇక సాగవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. గురువారం చెన్నైకి వచ్చిన మోదీ ఆకాశంలోనే చక్కర్లు కొట్టారని.. అలాంటప్పుడు రోడ్లను ఎందుకు నిర్భంధంచేశారని ప్రశ్నించారు. చెన్నైలో ఒక ప్రాతం నుంచి మరో ప్రాంతానికి కారులో ప్రయాణం చేసే ధైర్యం కూడా మోదీకి లేదని కుష్భూ తన ఫేస్బుక్లో పేర్కొన్నారు. -
నటి కుష్బూకు షాక్.. కోర్టు సమన్లు
సాక్షి, చెన్నై : కోర్టుకు నేరుగా హాజరుకావాలంటూ నటి కుష్బూకు మేటూర్ న్యాయస్థానం న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. 2005 నటి కుష్బూ స్త్రీల మానం గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వాప్తంగా పెద్ద దుమారేన్నే రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మేటూర్కు చెందిన మురుగన్ అనే న్యాయవాది మేటూర్ నేరవిభాగ కోర్టులో నటి కుష్బూకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం నటి కుష్బూ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కుష్బూ కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారంట్ జారీ చేసింది. దీంతో ఆమె 2005 నవంబర్ 16వ తేదీన మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. మార్గం మధ్యలో కుష్బూ కారుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఈ వ్యవహారంపై సేలం జిల్లాకు చెందిన పాట్టాళ్ మక్కల్ కట్చి కార్యదర్శి అరివళగన్ తదితర 41 మందిపై మేటూర్ తహసీల్దార్ బోస్ముహమదు మేటూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో నటి కుష్బూ, అప్పటి మేటూర్ సీఐ దినకరన్‌లను కూడా విచారించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి పలుమార్లు విచారణకు వచ్చినా నటి కుష్బూ కోర్టుకు హారజకాలేదు. బుధవారం మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుల తరఫున హాజరైన న్యాయవాది మురుగన్ హాజరై సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అనంతరం న్యాయమూర్తి రాజా కేసు విచారణను వాయిదా వేస్తూ ఆ రోజున నటి కుష్బూ కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
మద్యం మత్తులో సినీతారల డ్యాన్స్ వీడియో హల్ చల్
-
కుష్బూ తప్పక కోర్టుకు హాజరుకావాలి
తమిళసినిమా : నటి కుష్బూకు మేటూర్ కోర్టు ఈ నెల 12వ తేదీన తప్పక హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లితే 2005లో తమిళ మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కుష్బూపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటన తీవ్ర దుమారాన్నే రేపింది. అంతే కాదు మురుగన్ అనే న్యాయవాది మెటూర్ మేజిస్ట్రేట్ నేర విభాగ కోర్టులో కుష్బూపై పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో కేసు విచారణకు కుష్బూ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తరువాత కుష్బూ విచారణకు హాజరుకావడంతో అరెస్ట్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. కుష్బు న్యాయస్థానంలో హాజరవుతున్న సమయంలో కొందరు ఆమె కారుపై టామాటలు, కోడిగుడ్లు విసిరారు. దీనిపై మేటూర్ తాహసీల్దారు పయాస్ అహ్మద్‌ఖాన్, డీఎంకేకు చెందిన అరివళగన్ తదితర 41 మందిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కుష్బూ, అప్పటి పోలీస్‌ఇన్‌స్పెక్టర్ దినకరన్‌లను విచారించాలని కోరుతూ ప్రభుత్వ న్యాయవాది జగన్నాథన్ మేటూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి రాజా సమక్షంలో విచారణలో ఉంది. నిందితుల తరఫున న్యాయవాది మురుగన్ వాదిస్తున్నారు. ఈ కేసు తాజాగా సోమవారం తుది విచారణకు వచ్చింది. న్యాయమూర్తి రాజా ఈ కేసు వ్యవహారంలో నటి కుష్బూ, ఇన్స్పెక్టర్ దినకరన్‌లు ఈ నెల 12వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. -
కుష్బూపై కేసు
సాక్షి, చెన్నై: సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్చిన సమయానికి కంటే ఎక్కువసేపు పార్టీ సమావేశం నిర్వహించినందుకు ఈ చర్య తీసుకున్నారు. నెల్లై జిల్లా, ముక్కూడల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పోలీసులు రాత్రి 10 గంటల వరకే ఈ సమావేశానికి అనుమతి ఇచ్చారు. సమయం ముగిసినా సమావేశం కొనసాగడంతో పోలీసులు కుష్బూ, నేతలపై ఐపీసీ 143, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రసాభాసగా సమావేశం తమకు ఆహ్వానం అందలేదని మాజీ మంత్రి ధనుష్‌కోఠి ఆదిత్య సహా జిల్లా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సీనియర్ నాయకులతో వాగ్వాదానికి దిగడంతో గందరగోళం రేగింది. ఆదిత్యకు నచ్చజెప్పి మొత్తానికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుష్బు మాట్లాడుతూ.. తాను పార్టీ అభివృద్ధికి కష్ట పడుతున్నానని, కొందరు అలా భావించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసి రావాలని కోరారు. -
సూర్యకు క్షమాపణ చెప్పాల్సిందే..
తమిళసినిమా: నటుడు సూర్య ఎత్తు గురించి వ్యంగ్యంగా మాట్లాడిన సన్ టీవీ యాంకర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కోలీవుడ్‌లో అధికం అవుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో సూర్య హీల్స్ వేసుకుని అనుష్కతో నటించా రని, త్వరలో అమితాబ్ బచ్చన్‌తో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో స్టూల్‌పై నిలబడి నటిస్తారా? అని పరిహాసం చేసిన లేడీ యాంకర్ల వ్యవహారం కోలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే దక్షిణ భారత నటీనటుల సంఘం సన్‌టీవీ యాంకర్ల వ్యవహారంపై సీరియస్ అయిన విష యం తెలిసిందే. ఆ మహిళా వ్యా ఖ్యాతలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నటుడు కరుణాస్, దర్శకుడు విఘ్నేశ్‌శివ, నిర్మాత కేఈ. జ్ఞానవేల్‌రాజా వ్యాఖ్యాత తీరును తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి కుష్బూ ఆ యంకర్లు సూర్య కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమె ఆదివారం ట్విట్టర్లో ఈ వ్యవహారంపై స్పందిస్తూ పొడవైన వారు ఎవరూ? పొట్టివా రు ఎవరూ? ఎవరు లావు అయితే వీరికేమిటీ, సన్ననైనే వీరికేమిటీ? అంటూ ప్రశ్నించారు. వీటి వల్ల వారికి కలిగే సంతోషం ఏమిటీ? అన్నారు. సూర్య గురించి మాట్లాడిన వారు సిగ్గు పడాలన్నారు. ఇది అర్ధరహిత చర్చ అన్నారు. ఆ ఇద్దరు మహిళా యాంకర్లు సూర్యకు క్షమాపణ చెప్పాలని కుష్బూ డిమాండ్ చేశారు. -
విశాల్‌కు కుష్బూ శుభాకాంక్షలా?
టీ.నగర్: డీఎంకే అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతిస్తున్న తరుణంలో విశాల్‌కు కుష్బూ శుభాకాంక్షలు తెలపడమేమిటని దక్షిణ చెన్నై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరాటే త్యాగరాజన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. డీఎంకేలో ఉన్న సమయంలో అక్కడున్న నేతలకు సమస్యలను కలిగించి బయటికి పంపిన కుష్బూకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను కల్పించి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా హోదాను కల్పించిందని ఈ పదవిలో హూందాగా నడచుకోవాల్సిన కుష్బు కాంగ్రెస్ పార్టీలోను గందరగోళం సృష్టిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్కేనగర్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న విశాల్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపి గందరగోళం సృష్టించినట్లు కరాటే త్యాగరాజన్ ఆరోపించారు. -
కుష్బుకు కాంగ్రెస్ పగ్గాలు ?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్ష స్థానానికి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, నటి కుష్బు పేరు పరిశీలనలో ఉంది. అదే జరిగితే టీఎన్‌సీసీకి తొలిసారిగా ఒక మహిళ అధ్యక్షురాలు అయిన ఘనత ఆమెకు సొంతం అవుతుంది. తమిళనాడు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు ఇటీవల ముగిశాయి. సుమారు 19 ఏళ్ల విరామం తరువాత సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి కొత్త అధ్యక్షుని ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఇటీవలే తీర్మానం చేశారు. తిరునావుక్కరసర్‌పై ఫిర్యాదులు ప్రస్తుతం తమిళకాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌పై అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో కాంగ్రెస్ ట్రస్టు నిర్వాహకుల మూలంగా పార్టీ కోశాధికారి వోరా విచారణ చేపట్టి టీఎన్‌సీసీకి కొన్ని సూచనలు చేశారు. ట్రస్టు పర్యవేక్షణకు కేరళకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. చెక్ పవర్‌ను సైతం అతని స్వాధీనంలోకే వెళ్లింది. ఈ నేపథ్యంలో తమిళ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకంపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టిపెట్టగా, తన పదవిని కాపాడుకునేందుకు తిరునావుక్కరసర్ ఢిల్లీలో పావులు కదపడం ప్రారంభించారు. రాహుల్‌గాంధీని సైతం ఆయన కలుసుకోగా అది ఎంతవరకు ఫలించిందో తెలియరాలేదు. తిరునావుక్కరసర్‌కు ముందు అధ్యక్షునిగా ఉండిన ఈవీకేఎస్ ఇళంగోవన్, మరికొందరు ముఖ్యులతో రాహుల్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కొత్త అధ్యక్షుని పరిశీలన జాబితాలో కుష్బుతోపాటూ ఇళంగోవన్, కేఎస్ అళగిరి, చెల్లకుమార్, వసంతకుమార్, పీటర్ ఆల్బోన్స్, మాణిక్య ఠాకూర్ తదితర పేర్లున్నాయి. ఏ బాధ్యతలు అప్పగించినా సిద్ధం ఈ సందర్భంగా కుష్బును పలుకరిస్తే అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధమని బదులిచ్చారు. ఇళంగోవన్‌కు కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం మద్దతు పలుకుతున్నారు. ఇళంగోవన్‌ను కాదనుకున్న పక్షంలో తన మద్దతుదారైన కేఎస్ అళగిరికి ఇవ్వాల్సిందిగా ఇళంగోవన్ కోరారు. మాణిక్యఠాకూర్ పార్టీ పరంగా రాహుల్‌తో ప్రత్యక్ష సంబంధాలు, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగి ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో మహిళా అధ్యక్షురాలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి సైతం కుష్బు ఉంటే సమజోడిగా ఉంటుందనే వాదనను ఆమె అభిమానులు అధిష్టానం ముందుంచినట్లు సమాచారం. ఈనెల 21వ తేదీ నుంచి ఢిల్లీలో కార్యవర్గ సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడు కాంగ్రెస్ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళుతాయో తేలిపోగలదని పార్టీ శ్రేణుల అంచనా. -
టార్గెట్ శ్రుతి!?
ప్రముఖ నటి, దర్శకుడు సుందర్. సి సతీమణి ఖుష్బూ టైమ్ చూసి ట్విట్టర్లో పెద్ద బాంబు పేల్చారు. అదీ ఓ రేంజ్లో! ఖుష్బూ బాంబు వేసింది శ్రుతీహాసన్‌పైనే అనేది చాలామందికి అర్థమైంది. కానీ, ఎక్కడా శ్రుతి పేరు లేకుండా ఖుష్బూ బాంబు వేయడం గమనార్హం! మేటర్లోకి వెళితే... బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వని కారణంగా సుందర్. సి తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’ నుంచి తప్పుకున్నానని శ్రుతీ పేర్కొన్న సంగతి తెలిసిందే. శ్రుతీ ఆరోపణలపై చాలా రోజుల తర్వాత ఖుష్బూ స్పందించారు. ‘‘సరైన ప్లానింగ్ లేకుండా ‘సంఘమిత్ర’ వంటి భారీ బడ్జెట్ సినిమా తీయలేం. ఎవరో ‘సంఘమిత్ర’ స్క్రిప్ట్ రెడీ కాలేదంటూ ఆరోపణలు చేయడం విన్నా. గత రెండేళ్లుగా ఈ సినిమా వర్క్ జరుగుతోంది. అన్–ప్రొఫెషనల్స్‌కి అది అర్థం కాదు. ‘సంఘమిత్ర’ వంటి సినిమాలకు షూటింగ్ అనేది 30 శాతం మాత్రమే. షూటింగ్‌కి ముందే 70 శాతం వర్క్ పూర్తవుతుంది’’ అని ఖుష్బూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇవన్నీ శ్రుతీని ఉద్దేశించినవే అని కోలీవుడ్ టాక్! ‘‘ఓ లెగస్సీ (కమల్‌హాసన్ వారసత్వం?) కొనసాగిస్తున్న వారినుంచి కొంచెం ప్రొఫెషనలిజమ్ ఆశించా. నీ (బహుశా శ్రుతీని ఉద్దేశించే అయ్యుంటుంది) తప్పులను హుందాగా అంగీకరిస్తే, ఇంకా ఎంతో దూరం వెళ్తావు’’ అని ఖుష్బూ చురకలు అంటించారు. -
తెర మీదకు మళ్లీ రచ్చ
► నగ్మాతో ఝాన్సీ ఢీ చెన్నై: రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ తెర మీదకు వచ్చింది. మహిళా నేతల మధ్య విభేదాలు వెలుగులోకి రావడంతో శనివారం జరగాల్సిన సమావేశాన్ని సైతం రద్దు చేయడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. అనుబంధ విభాగంలోనూ ఈ గ్రూపుల గొడవ తరచూ వెలుగు చూడడం జరుగుతోంది. మహిళా కాంగ్రెస్‌లో గతంలో చోటు చేసుకున్న విభేదాలు పోలీసుస్టేషన్ వరకు సాగాయి. అప్పటి రాష్ట్రపార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మద్దతుదారులు, మహిళా అధ్యక్షురాలు విజయధరణిల మధ్య ఈ వివాదం సాగింది. చివరకు విజయధరణి పదవి ఊడింది. కొత్త అధ్యక్షురాలుగా ఝాన్సీరాణి పగ్గాలు చేపట్టినా, ఆమెకు కూడా గ్రూపు సెగ తప్పలేదు. అస్సలు ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఆందోళనే సాగింది. ఎట్టకేలకు అధిష్టానం మద్దతు ఝాన్సీకి దక్కడంతో గ్రూపులు వెనక్కు తగ్గాయి. ఝాన్సీ పగ్గాలు చేపట్టినానంతరం రాష్ట్ర విభాగం మీద జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నగ్మా ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళా వార్: ఝాన్సీ పెత్తనం కన్నా, నగ్మా వాయిస్ ఆ విభాగంలో పెరిగిందని చెప్పవచ్చు. దీంతో కొద్ది రోజులుగా నగ్మా చెన్నైకు వస్తున్న సమాచారంతో ఝాన్సీ డుమ్మా కొట్టే పనిలో పడ్డారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఝాన్సీ కుటుంబ వ్యవహారాలు మహిళా విభాగానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయం అన్న ఫిర్యాదులు ఢిల్లీకి పెరగడంతో గత వారం చెన్నైకు వచ్చిన నగ్మా విచారించే పనిలో పడ్డట్టు సమాచారం. నగ్మా ప్రశ్నలకు ఝాన్సీ సమాధానాలు దాటవేసినట్టు, తన మీద పెత్తనం ఏమిటో అన్నట్టుగా ఆమె అసహనం వ్యక్తం చేసినట్టు మహిళా కాంగ్రెస్‌లో చర్చ సాగుతోంది. నగ్మా రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమైనా, అందుకు ఝాన్సీ నుంచి సహకారం కరువుతో ఈ ఇద్దరి మధ్య వివాదం ముదిరినట్టు అయింది. తమిళనాడు మీద నగ్మా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో మహిళా విభాగం అధ్యక్షురాలి నుంచి సహకారం కొరవడడం ఆ విభాగంలోని విభేదాలను మళ్లీ తెర మీదకు తెచ్చాయి. ఎవరికి వారు అధిష్టానంకు ఫిర్యాదులు హోరెత్తించుకునే పనిలో పడడంతో, మరి కొద్ది రోజుల్లో మళ్లీ ఆ విభాగం అధ్యక్షురాలు మార్పు అనివార్యం అయ్యేనా..? అన్న ప్రశ్న తలెత్తింది. ఈ వివాదాల పుణ్యమా శనివారం సత్యమూర్తి భవన్వేదికగా జరగాల్సిన మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం అర్ధాంతరంగా రద్దు కావడం గమనార్హం. అస్సలే, రాష్ట్రంలో కాంగ్రెస్ బలం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో పార్టీలోనే కాదు, మహిళల్లోనూ విభేదాలు రచ్చకెక్కడం ఏఐసీసీ పెద్దలకు శిరోభారంగా మారింది. నగ్మా పెత్తనం పెరగడమో లేదా, మరేదైనా కారణాలో ఏమోగానీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి నటి కుష్బూ సైతం పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం గమనించాల్సిన విషయం. -
రెచ్చగొట్టిన నగ్మా... మౌనంగా కుష్బు
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో ఇద్దరు స్టార్స్ మధ్య వార్ వెలుగులోకి వచ్చింది. వేదికపై పక్క పక్కనే ఒకటిగా కూర్చున్న వాళ్లు, ఆ తర్వాత కయ్యానికి కాలు దువ్వుకోవడం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. ఈ స్టార్స్ ఎవరో కాదు, ఒకరు కుష్బు, మరొకరు నగ్మా. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నగ్మా స్పందిస్తే... కళ్లతో చూడలేదు, చెవులతో వినలేదంటూ కుష్బు దాట వేయడం గమనార్హం. రాష్ట్ర కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతల్ని ఏకం చేసి ఒకే వేదిక మీద కూర్చోబెట్టడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. పార్టీలో సినీ స్టార్స్‌గా, జాతీయస్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నాయకుల్ని సైతం ఆ వేదిక మీదకు ఎక్కించి, ఐక్యత అంటే తమదే అని చాటుకున్నారు. ఉదయం సాగిన ఐక్యత, అదే రోజు సాయంత్రానికి పటాపంచలు అయినట్టుంది. శుక్రవారం ఉదయం నిరసనకు హాజరైన కుష్బు.. సాయంత్రం నగ్మా నేతృత్వంలో సత్యమూర్తి భవన్ వేదికగా సాగిన మహిళా కాంగ్రెస్ సమాలోచనకు గైర్హాజరైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన నగ్మా.. సమాలోచన సమావేశంలో కుష్బును ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడింది. అంతేకాకుండా.. ఉమ్మడి పౌర స్మృతి గురించి కుష్బు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి నగ్మా సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ అధిష్టానం వైఖరికి భిన్నంగా ఉమ్మడి పౌరస్మృతిపై కుష్బు స్పందించిన విషయం తెలిసిందే. స్టార్ వార్: కాంగ్రెస్‌లో వివిధ గ్రూపులుగా ఉన్న నేతలు తాజాగా ఒకే వేదిక మీదకు రాగా.. జాతీయ స్థాయి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళా నేతలు మాత్రం ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకోవడం పార్టీలో కొత్త చర్చకు తెర లేపింది. మహిళా కాంగ్రెస్ సమావేశంలో నగ్మా తీవ్రంగా స్పందించిన వ్యాఖ్యలకు కొన్ని తమిళ పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. సినిమాల్లో బొట్టు పెట్టుకుని నటించవచ్చు కానీ, వాస్తవిక జీవితంలో ఏ ముస్లిం మహిళ అలా చేయదని, అయినా, హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్న వాళ్లకు ముస్లిం చట్టాల గురించి ఏమి తెలుసునంటూ కుష్బును ఉద్దేశించి నగ్మా మండిపడ్డారు. షరియత్ గురించి అసలు ఏమి తెలుసునని, ఉమ్మడి పౌర స్మృతికి మద్దతుగా కుష్బు ఆ వ్యాఖ్యలు చేశారో తెలుపాలంటూ మండిపడ్డారు. ఉదయం జరిగిన నిరసనకు హాజరైన వాళ్లకు , సాయంత్రం జరిగిన సమావేశానికి వచ్చే తీరిక లేదా..? అని కుష్బుపై నగ్మా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వాళ్లకు పదవులు అంటూ తీవ్రంగానే నగ్మా స్పందించినా, కుష్బు మాత్రం కళ్లతో చూడలేదు...చెవులతో వినలేదంటూ ఆమె వ్యాఖ్యలను తోసిపుచ్చడం గమనార్హం. -
ప్రతిష్టంభన
అధ్యక్ష ఎంపికపై మల్లగుల్లాలు తెరపైకి చిదంబరం ఢిల్లీలో నేతలు సోనియా, రాహుల్‌తో కుష్భు భేటీ సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో ప్రతిష్టంభన తొలగడం లేదు. ఎవర్ని ఎంపిక చేయాలో అని ఏఐసీసీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా రాజకీయ అనుభవం కల్గిన చిదంబరం పేరు తెర మీదకు వచ్చింది. ఇక, ఆ పదవిని ఆశిస్తున్న నేతలందరూ ఢిల్లీలో తిష్ట వేశారు. అధికార ప్రతినిధి కుష్భు పెద్దలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ గత నెల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో కొత్త అధ్యక్షుడి ఎంపిక ఏఐసీసీ పెద్దలకు కష్టతరంగా మారింది. తమ కంటే, తమకు ఆ పదవి అప్పగించాలంటూ ఏఐసీసీ వద్దకు పెద్ద సంఖ్యలో నాయకులు క్యూ కట్టే పనిలో పడ్డారు. ఇందులో ప్రధానంగా తిరునావుక్కరసర్, వసంతకుమార్, పీటర్ అల్ఫోన్స్, మాణిక్ ఠాకూర్, సుదర్శన నాచ్చియప్పన్, కరాటే త్యాగరాజన్, విజయధరణి, గోపినాథ్, సెల్వరాజ్ వంటి వారి పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే గట్టి పోటీ మాత్రం తిరునావుక్కరసర్, పీటర్ అల్ఫోన్స్ మధ్య నెలకొని ఉందని చెప్పవచ్చు. ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు అధ్యక్ష పదవి చేపట్టడం ఖాయం అన్న సంకేతాలు వెలువడ్డాయి. మంగళవారం అధికారిక ప్రకటన వెలువడ వచ్చన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పట్లో అధ్యక్ష ఎంపిక సాగేనా అన్న ప్రశ్న కూడా మొదలైంది. ఎవర్ని ఎంపిక చేయాలో అన్న మల్లగుల్లాల్లో ఢిల్లీ పెద్దలు పడ్డారు. దీంతో అధ్యక్ష ఎంపిక ప్రతిష్టంభన నెలకొన్నట్టైంది. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి, రాజకీయ అనుభవం కల్గిన సీనియర్ నేత పి.చిదంబరం పేరు తెర మీదకు వచ్చి ఉండడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో చిదంబరం వర్గీయులు అధికమే. రాష్ట్రంలో తన వ్యక్తిగత బలాన్ని చాటుకోవడంలో ఎప్పడూ చిదంబరం ముందు ఉంటారని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆయన్ను అధ్యక్ష పదవిలో కూర్చొబెట్టే విషయంలో ఏఐసీసీ పెద్దలు పరిశీలన సాగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడి ఉన్నాయి. రాజకీయ అనుభవం కల్గిన చిదంబరం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, అందర్నీ కలుపుకుని ముందుకు సాగడంలో దిట్టగా అధిష్టానం పెద్దలు గుర్తించినట్టు సమాచారం. అయితే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చిదంబరం రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతారా..? అన్న ప్రశ్న కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వాళ్లందరూ ఢిల్లీలో తిష్ట వేసి ఉండడం, మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం మంగళవారం ఢిల్లీకి వెళ్లడం గమనించాల్సిన విషయం. అదే సమయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సమాలోచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం మీడియాతో కుష్భు మాట్లాడుతూ, ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను మళ్లీ అధ్యక్ష పదవిలో కూర్చో బెట్టాలన్న అంశాన్ని తాను పెద్దల వద్ద ప్రస్తావించ లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీ బలోపేతానికి, అందరికి ఆమోద యోగ్యుడిగా, అన్ని అర్హతలు ఉన్న నాయకుడ్ని ఎంపిక చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు. -
నటి కుష్బుకు మొండిచేయి
చెన్నై: డీఎంకే కూటమిలో ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్దుల తుది జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఎన్నికల వాతావరణం మొదలు కాగానే అందరికంటే ముందుగా డీఎంకేతో పొత్తుకు ఉరకలేసిన కాంగ్రెస్ పార్టీ అనేక తర్జన భర్జనల నడుమ 41 సీట్లను దక్కించుకుంది. తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను తీవ్రంగా విభేదించే కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, తదితరులను కాదని 33 మందితో తొలి జాబి తాను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇక మిగిలిన 8 మంది అభ్యర్దుల పేర్లతో కూడిన తుది జాబితా శుక్రవారం విడుదలైంది. కుష్బుకు మొండిచేయి: మైలాపూర్ స్థానం నుండి పోటీచేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు ఎంతగానో ఆశించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై పోటీపెట్టనున్నారని మరికొందరు విశ్వసించారు. ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేయాలనే పట్టుదలతో ఉన్న కుష్బు కాంగ్రెస్ అధిషానాన్ని సైతం కలిసి వచ్చారు. డీఎంకేతో విభేధించి కాంగ్రెస్ పంచన చేరిన రెండేళ్ల తరువాత మరలా కరుణానిధి ఇంటికి వెళ్లారు. మిత్రపక్ష కూటమి నేత హోదాలో కరుణ ఆశీస్సులు పొంది ఎలాగైనా సీటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నమే చేశారు. అయితే కుష్బుకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. ఆమె ఆశిస్తున్న మైలాపూరు నియోజకవర్గానికి కరాటే త్యాగరాజన్ పేరును ఖరారు చేసింది. కుష్బు ఆశించిన మైలాపూరును మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా కూడా ఆశించారు. ఈ విషయంలో ఇద్దరు నటీమణులు పోటీపడగా స్వల్పంగా మనస్పర్దలు చోటుచేసుకున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో అధిష్టానానికి దగ్గరగా ఉన్న నగ్మానే కుష్బు ప్రయత్నాలకు గండికొట్టి ఉంటారని కాంగ్రెస్‌నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. -
కుష్బుపై హిజ్రాల ఆగ్రహం...
చెన్నై : ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కుష్బుపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై హిజ్రాలు పున:పరిశీలన చేసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలను హిజ్రాలు ఖండిస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ జాతీయ సమాచార ప్రతినిధి అయిన కుష్బు ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె రాబోయే ఎన్నికల్లో హిజ్రాలు పోటీ చేయాలని ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అనే విషయంపై వారు ఆలోచించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టుముట్టి సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ ఉత్తర భారతదేశానికి చెందిన కుష్బు గత కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన మహిళల శీలాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇప్పుడు హిజ్రాల విషయంలోనూ అదేవిధంగా మాట్లాడటం ఆవేదన కలిగించిందన్నారు. కుష్బు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకు ఉందని హిజ్రాలు స్పష్టం చేశారు. -
రాజకీయాల్లో రాణించడం తప్పా? : కుష్బూ
టీ నగర్: మహిళలను విమర్శలకు గురిచేస్తూ అడ్డుకుంటున్నారని, రాజకీయాల్లో మహిళలు రాణించడం తప్పా? అంటూ నటి కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అనేక పార్టీలు ఉండగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారని కొందరు ప్రశ్నించగా తనకు చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఏర్పడిందన్నారు. ఇంట్లోవున్న తన గదిలో రాజీవ్ గాంధీ చిత్రాలను అతికించానన్నారు. దేశం పట్ల, ప్రజల పట్ల అధిక శ్రద్ధ కలిగిన పార్టీ కాంగ్రెస్ అని, అందువల్ల ఆ పార్టీలో చేరానని బదులిచ్చారు. డీఎంకే నుంచి వైదొలగిన కారణాన్ని ఇంతవరకు తెలియజేయకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించగా, అది ముగిసిపోయిన వ్యవహారమని, దానిగురించి ప్రస్తుతం ప్రస్తావించదలచుకోలేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని పేర్కొంటున్నారే అని ప్రశ్నించగా ఇప్పుడే దీన్ని నిర్ణయిస్తే ఎన్నికల కమిషన్ ఎందుకు ఎన్నికలు జరపాలంటూ ఎదురు ప్రశ్న వేశారు. మహిళలు రాజకీయంగా ఎదక్కుండా పలువురు అడ్డుపడుతుంటారని, మహిళలు రాజకీయాలలో రాణించడం తప్పా? అని ప్రశ్నించారు. -
నాదంటే నాదంటున్న నగ్మా, కుష్బు
కాంగ్రెస్‌లో కుమ్ములాట ముగిసిన దరఖాస్తుల పర్వం చెన్నై: డీఎంకేతో కూటమి ఖరారైందే అదనుగా ఒకే స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుమ్ములాట మొదలైంది. చెన్నై నగరం మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నాకంటే నాకంటూ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు కుమ్ములాటకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఇద్దరూ వెండితెర వేలుపులే కావడం విచిత్రం. చెన్నై మైలాపూర్ నియోజకవర్గాన్ని కూటమి పార్టీల కేటాయించడం డీఎంకేలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-బీజేపీ కూటమిగా ఏర్పడగా బీజేపీ అభ్యర్థి కేఎన్ లక్ష్మణన్ మైలాపూర్ స్థానం నుంచి గెలుపొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే పొత్తులో మైలాపూర్‌ను కాంగ్రెస్‌కే కేటాయించారు. అయితే ఈ స్థానం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అగ్రనేత తంగబాలు పరాజయం పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్, డీఎంకేల మధ్య పొత్తును ఇటీవలే గులాంనబీ ఆజాద్ ఖరారు చేయడంతో రెండు పార్టీల నేతలు సీట్ల వెతుకులాటలో పడ్డారు. డీఎంకే సిద్ధాంతం ప్రకారం మైలాపూర్ స్థానం కాంగ్రెస్‌కేనని తేలిపోవడంతో ఇద్దరు నటీమణులు కన్నేశారు. నటి కుష్బు ఇల్లు ఇదే నియోజకవర్గ పరిధిలోని శాంతోమ్‌లో ఉంది. తాను నివాసం ఉంటున్న ప్రాం తం, ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తినపుడు సొంత ఖర్చుతో బాధితులకు సాయం చేయడం వంటి అనుకూలమైన అంశాలు ఉన్నందున కుష్బు కోరుతున్నారు. మైలాపూర్ నుండి కుష్బు పోటీచే సినట్లయితే గెలుపు ఖాయమని ఆమె అనుచరులు సైతం ఆశిస్తున్నారు. అంతేగాక మయిలై అశోక్ అనే కుష్బు అభిమాని ఆమె పేరున కాంగ్రెస్‌కు దరఖాస్తు కూడా దాఖలు చేసి ఉన్నా రు. అలాగే నటి నగ్మా సైతం తన లెక్కలు తాను చెబుతున్నారు. నగ్మా సోదరి జ్యోతిక మైలాపూర్ నియోజవర్గం పరిధిలోని బీసెంట్ నగర్లో కాపురం ఉంటున్నారు. చెన్నైకి వచ్చినపుడల్లా సోదరి ఇంటిలోనే ఆమె ఉంటారు. ఈ కారణాన్ని చూపి మైలాపూర్ కోసం నగ్మా కూడా పట్టుదలతో ఉన్నారు. మైలాపూర్ నుంచి పోటీకి అనుమతివ్వాల్సిందిగా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షోబా ఓజాను నగ్మా కోరారు. అయితే ఆమె ఇందుకు తిరస్కరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సోనియా, రాహూల్ వద్దకు తీసుకెళ్లి ఒప్పించాలని నగ్మా ప్రయత్నాల్లో ఉన్నారు. మైలాపూర్ స్థానం కోసం పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు సైతం నగ్మా సిద్ధమయ్యారు. పార్టీ పరంగా చూసుకుంటే కుష్బు కంటే నగ్మా సీనియర్ నేత. ఒకే స్థానానికి ఇద్దరు మహిళా నేతలు, పైగా ఇద్దరూ వెండితెరను ఏలి ప్రజాబాహుళ్యంలో ప్రచారం ఉన్నవారు కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ తలనొప్పిగా మారింది. సత్యమూర్తి భవన్లో సందడి: మైలాపూర్ స్థానానికి పోటీపడుతున్న నగ్మా, కుష్బులు బుధవారం సత్యమూర్తి భవన్లో తమ తమ వర్గంతో సందడి చేశారు. వీరిద్దరితోపాటు టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ కూడా ఉండి కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై అసెంబ్లీకి పోటీచేయగోరు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ఈనెల 10వ తేదీ నుంచి సత్యమూర్తి భవన్లో సాగుతోంది. డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదరగానే దరఖాస్తు చేసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఈనెల 15వ తేదీతో ముగిసిన గడువును బుధవారం (17వ తేదీ)వరకు పొడిగించారు. ఈ లెక్కన బుధవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్యమూర్తి భవన్‌కు చేరుకుని తమ దరఖాస్తులను అందజేశారు. దీంతో దరఖాస్తుల పర్వం ముగిసింది. డీఎంకే అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తానని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నగ్మా ప్రకటించారు. రెండు అవినీతి పార్టీలు ఏకమయ్యాయంటూ డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విమర్శలు గుప్పించారు. అయితే డీఎండీకే తమ కూటిమిలో చేరుతుందని ఇళంగోవన్ విశ్వాసం వెలిబుచ్చారు. ప్రేమలత వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోం, ఎందుకంటే పార్టీ అధినేత విజయకాంత్ మాత్రమే, ఆయన మాతో వస్తారని నమ్మకం ఉందన్నారు. -
జూనియర్‌కి వీరాభిమానిని : కుష్బూ
సాధారణంగా యంగ్ జనరేషన్ హీరోయిన్లు, సీనియర్ హీరోలకు అభిమానులుగా ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అయ్యింది. టాలీవుడ్ యంగ్ జనరేషన్లో టాప్ హీరోగా ఉన్న జూనియర్‌కు, ఓ సీనియర్ హీరోయిన్ 'వీరాభిమానిని', అని తానే స్వయంగా చెప్పటంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. కొద్ది రోజులుగా వివిధ సందర్భాల్లో నాన్నకు ప్రేమతో సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు సీనియర్ నటి కుష్బూ. అయితే అభిమానులు ఈ సినిమా మీద ఎందుకంత ఆసక్తి కనబరుస్తున్నారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీంతో తన అభిమానులకు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చింది కుష్బూ. 'ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి నన్ను అడిగే వారికి చెపుతున్నాను. నేను జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిని, ఏవో కొన్ని తప్ప అతని సినిమాలన్నీ చూస్తాను'. అంటూ ట్వీట్ చేశారు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్, కుష్బూలు కలిసి నటించారు. For all those who ask from AP n Telangana..I m a die hard #Jr.NTR fan..hardly miss his films except a few..watch it as n wen time permits — khushbusundar (@khushsundar) January 5, 2016 -
కుష్బూపై హసీనా ఫైర్
టీనగర్: కాంగ్రెస్ నాయకురాలు కుష్బూపై కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ విమర్శలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. టీఎన్‌సీసీ అధ్యక్షుని మార్చాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలైన పి. చిదంబరం, తంగబాలు, కుమరి అనంతన్ ఢిల్లీలో రాహుల్ గాంధీని సంప్రదించి మొరపెట్టుకున్నారు. దీనికి బదులిస్తూ ఇలంగోవన్ తంగబాలుపై అనేక ఆరోపణలు చేశారు. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నటి కుష్బూ ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలిసి మాట్లాడారు. ఆ సమయంలో ఇలంగోవన్‌కు తన మద్దతు తెలిపారు. అనంతరం కుష్బూ మాట్లాడుతూ పి.చిద ంబరం తనయుడు కార్తి చిదర బరం నటీమణులను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ లేదన్నారని, అదే విధంగా పి.చిదర బరం, కార్తి చిదంబరం, తంగబాలు వంటి వ్యక్తులను నమ్ముకుని పార్టీ లేదని కుష్బూ ప్రతి విమర్శలు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంను విమర్శించే అర్హత కుష్బూకు లేదన్నారు. మీరు ఎవరిని నమ్ముకుని ఉన్నారో ఈ దేశానికే తెలుసని చురకలంటించారు. గతంలో ఉన్న పార్టీ నేతలను విమర్శించడంతో ఆ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన చరిత్ర మీదని విమర్శించారు. -
కుష్బూ కాలికి గాయం
ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ మెట్ల మీద నుంచి దిగుతూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కుష్బూ మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. చెన్నై అభిరామపురంలోని తన సొంతం ఇంట్లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కుష్బూ తన కాలికి కట్టిన కట్టు ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. My leg looks like this.. -
నా మద్దతు విశాల్‌కే
నటుడు విశాల్‌కే నా మద్దతు అంటున్నారు నటి, రాజకీయనాయకురాలు కుష్బు.ఈమె నటుడు విజయకాంత్ దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టిన సమయంలో కార్యవర్గ సభ్యురాలిగా తన వంతు కృషి చేశారు.ఆ తరువాత కుటుంబం, పిల్లల బాధ్యతలు, రాజకీయాలు, బుల్లితెర కార్యక్రమాలు, చిత్ర నిర్మాణం అంటే బిజీ కావడంతో సంఘం బాధ్యతలకు దూరంగా ఉన్నారు. కాగా ప్రస్తుతం నడిగర్‌సంఘం ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న విషయం తెలిసిందే. శరత్‌కుమార్ జట్టు, విశాల్ జట్టు నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీకి బరిలోకి దిగుతున్నాయి. దీంతో సంఘం సభ్యుల్లో ఎవరు ఏ జట్టుకు మద్దతుగా నిలవనున్నారన్న విషయం ఆసక్తిగా మారింది. ఇలాంటి పరిస్థితిలో మీ మద్దతెవరికన్న ప్రశ్నకు నటి సంచలన నటి కుష్బు బదులేమిటో చూద్దాం. నడిగర్‌సంఘంలో మార్పురావాలని ఆశిస్తున్నాను. అందువల్ల నా మద్దతు కచ్చితంగా విశాల్‌కే. శరత్‌కుమార్, రాధారవి నాకు మంచి మిత్రులే. శరత్‌కుమార్ 100వ చిత్రంలో నేను నటించారు. నా తొలి తెలుగు చిత్రంలో రాధారవినే విలన్. అయితే సంఘానికి కొత్త రక్తం రావాలని కోరుకుంటున్నాను. అందుకే నా మద్దతు విశాల్‌కే అంటున్నాను. ఇకపోతే సినిమాల్లో నటించరా? అని అడుగుతున్నారు. తమిళంలో విల్లు, తెలుగులో స్టాలిన్ చిత్రం తరువాత నేను నటించలేదు. కారణం నాకు తగిన పాత్రల అవకాశాలు రాకే. అదే సమయంలో పిల్లల పోషణ, రాజకీయాలు, టీవీ కార్యక్రమాల తో బిజీగా ఉండడం కూడా ఒక కారణం. అందుకే బుల్లి తెర సీరియల్స్‌లో కూడా నటించడం లేదు. -
పేరు, ప్రతిష్టలు ఏనాడో సంపాదించా!
టీనగర్: తాను పేరు, ప్రతిష్టల కోసం రాజకీయాల్లోకి రాలేదని, వాటిని ఏనాడో సంపాదించానని నటి కుష్బు తెలిపారు. కుష్బు అఖిల భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలలో ఉండడంతో సినిమాలకు స్వస్తి చెప్పారు. అయినప్పటికీ చిత్ర నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ‘అరన్మణై’ రెండవ భాగం చిత్ర నిర్మాణంలో ఉన్నారు. తరచుగా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. అనేక మంది వ్యతిరేకతను ఎదుర్కొంటూ కోర్టు కేసులకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎంపికయిన తర్వాత ట్విట్టర్లో తన అభిప్రాయాలు వ్యక్తీకరించడంలో బిజీగా ఉన్నారు. ప్రతిరోజూ అనేక మంది కుష్బూపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అందుకు ఆమె కూడా బదులిస్తున్నారు. ఒకరు కుష్బు రాజకీయ ప్రవేశాన్ని నిరసిస్తూ ప్రశ్నించారు. మీరు రాజకీయాల్లోకి రావడం డబ్బు కోసమా? పేరు ప్రతిష్టల కోసమా? అంటూ ప్రశ్నించాడు. అందుకు కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బదులిచ్చారు. తాను 25 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నానని, విలాసవంతమైన జీవితం కోసం అవసరమైన డబ్బు, హోదాను సంపాదించానని తెలిపారు. -
కుష్భు వైపు చూపు..
సాక్షి, చెన్నై : తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల కోసం పెద్ద సమరమే సాగుతున్నది. మహిళా నాయకులు పలువురు ఆ పదవిని చేజిక్కించుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నా, సినీ గ్లామర్ కుష్భు వైపు ఏఐసీసీ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే, ఈ గ్రూపు రాజకీయాల నడుమ ఆ పదవి ముళ్ల కిరీటంగా మారుతుందేమోనన్న బెంగ కుష్భులో బయలు దేరినట్టు సమాచారం.రాష్ట్రంలోని పలు పార్టీల్లో మహిళా విభాగాలు మెరుగ్గానే ఉన్నాయి. అన్నాడీఎంకేలో సర్వం జయలలిత కాబట్టి ఆమె మాట అందరికీ శిరోధార్యం. ఇక, డీఎంకేలో మహిళా విభాగాన్ని గాడిలో పెట్టే బాధ్యతల్ని కరుణానిధి గారాల పట్టి కనిమొళి తన భుజాన వేసుకుని ఉన్నారు. డీఎండీకే మహిళా విభాగంలో తెర వెనుక నుంచి ఆ పార్టీ అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత అ న్ని వ్యవహారాలు సాగిస్తున్నారు. మిగిలిన పా ర్టీల్లోనూ మహిళా విభాగాలు చురుగ్గా ఉన్నా, కాంగ్రెస్‌లో మాత్రం చతికిల బడి ఉన్నది. ఆది నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం కరువు. ఇందుకు కారణం పార్టీలోని గ్రూపులు అక్కడికి కూడా పాకడమే. ప్రస్తుతం ఆవిభాగం అధ్యక్షురాలుగా సాయిలక్ష్మి వ్యవహరిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు రాష్ట్రంలో మహిళా శక్తిని తమ వైపు కు తిప్పుకునే రీతిలో ఆ విభాగాన్ని పటిష్టవం తం చేయడానికి ఏఐసీసీ నిర్ణయించి ఉన్నది. మహిళా సమరం : మహిళా విభాగం అధ్యక్ష పగ్గాలు మారనున్న సమాచారంతో రంగంలోకి మహిళా నేతలు దిగారు. మాజీ ఎమ్మెల్యేగా , పార్టీలో సీనియర్‌గా ఉన్న యశోధ, మాజీ ఎంపి అన్భరసు కుమార్తె సుమతి, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మద్దతు దారు హసీనా సయ్యద్, మరో నేత వారసురాలు రాణి వెంకటేషన్‌లతో పాటుగా పలువురు ఆ పదవి కోసం రంగంలోకి దిగారు. దీంతో మహిళా సమరం రాజుకున్నట్టు అయింది. ఎవరికి వారు తమ ప్రయత్నాల్ని వేగవంతం చేసి ఉండటంతో మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజాకు శిరోభారం తప్పలేదు. అలాగే, తమ వాళ్లకు పదవులు దక్కేలా చేయడానికి ఆయా మహిళ నేతల మద్దతు నేతలు ఏఐసీసీలో పావులు కదిపే పనిలో పడటం ఆ పదవికి గట్టి పోటీని కల్పించి ఉన్నది. కుష్భు వైపు చూపు : ఆ పదవి కోసం పలువురు పోటీలు పడుతున్నా, ఏఐసీసీ మాత్రం కుష్భు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇటీవల కాలంగా రాష్ట్ర పార్టీలో సీనీ గ్లామర్ కుష్భు కీలక నాయకురాలుగా అవతరిస్తున్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకున్నా, ఆమె సభలకు, ప్రసంగాలకు అనూహ్య స్పందన వస్తున్న విషయం ఏఐసీసీ దృష్టికి చేరి ఉన్నది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆ పదవిని ఆమెకు కట్ట బెట్టాలన్న నిర్ణయంతో ఏఐసీసీ ఉన్నట్టు సంకేతాలు వెలువుడుతున్నాయి. ఇందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కుష్భు కు జోడు పదవులు అప్పగించడం వివాదానికి దారి తీసే అవకాశాలు ఎక్కువే. కొత్తగా వచ్చిన ఆమెను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు పార్టీలో బయలు దేరడం ఖాయం. దీంతో పోటీలో ఉన్న వాళ్లను బుజ్జగించి కుష్భుకు మార్గం సుగమం చేయడానికి ఏఐసీసీ కసరత్తుల్లో నిమగ్నమైనట్టు సమాచారం. ఇందులో భాగంగా మహిళ విభాగం నాయకులతో చర్చించి, వారి అభిప్రాయాల మేరకు తుది నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 29న ఆమె సత్యమూర్తి భవన్లో మహిళా నేతలతో భేటికి నిర్ణయించి ఉన్నారు. కుష్భు పేరును అధిష్టానం ప్రతిపాదించిన పక్షంలో పోటీలో ఉన్న యశోధ, హసీనా సయ్యద్, రాణి వెంకటేషన్ వంటి వారు వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆశీస్సులు కల్గిన సుమతి ఏ నిర్ణయం తీసుకుంటారోనన్నది వేచి చూడాల్సిందే. అయితే, అధిష్టానం నిర్ణయానికే మెజారిటీ శాతం మంది కట్టుబడుతారని, కుష్భును రంగంలోకి దించాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ గ్రూపు రాజకీయాల మధ్య ఆ పదవిని దక్కించుకుని, రాణించ గలనా..? అన్న డైలమాలో కుష్భు ఉన్నట్టు సమాచారం. ఈ విషయంగా ఆమెను ప్రశ్నించగా, అధ్యక్ష పదవి ఎంపిక సమాచారం తన వద్ద కూడా ఉందని, అయితే, అధిష్టానం నిర్ణయం మేరకు తన అభిప్రాయం వ్యక్తం చేస్తానన్నారు. -
ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కుష్బు
కాంగ్రెస్‌లో గ్రూపులు లేవని అందరిదీ ఒకే గ్రూప్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బు అన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటే తనకు ప్రత్యేక గౌరవం, మర్యాద అని వ్యాఖ్యానించారు. పదవి దక్కించుకున్న కుష్బుకు సత్యమూర్తి భవన్లో ఘన స్వాగతం లభించింది. సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఉన్నత పదవిని కుష్బు దక్కించుకున్నారు. ఆ పార్టీలో ప్రత్యేక గ్లామర్‌గా అవతరించిన కుష్బు వాక్ చాతుర్యాన్ని గుర్తించిన అధిష్టానం అందుకు తగ్గ పదవిని అప్పగించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమితులైన కుష్బు బుధవారం సత్యమూర్తి భవన్‌కు వచ్చారు. అధికారిక హోదాతో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టిన ఆమెకు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. నాయకులు చిరంజీవి, రామచంద్రన్, జ్యోతి, తదితరులు పుష్ప గుచ్ఛాలను అందించి ఆహ్వానం పలికారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో సత్యమూర్తి భవన్‌కు రావడం విశేషం. అనంతరం సత్యమూర్తి భవన్లో మీడియాతో కుష్బు మాట్లాడారు. తన మీద నమ్మకంతో అతి పెద్ద బాధ్యతను అప్పగించిన తమ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పరంగా తనను ఉన్నత పదవిలో చూడాలని ఈవీకేఎస్ కాంక్షించే వారని, అందుకు తగ్గట్టుగానే అతి పెద్ద పదవిని పార్టీ అధిష్టానం అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. తాను పార్టీలోకి వచ్చి ఐదు నెలలవుతోందని, ఈ కాలంలో తనను పార్టీలోని నాయకులు అందరూ తమ ఇంట్టి బిడ్డగా ఆదరించారన్నారు. రాష్ట్ర పార్టీలో గ్రూపులు లేవని, అందరిదీ కాంగ్రెస్ అనే ఒకే ఒక గ్రూప్ మాత్రమేనన్నారు. మీడియా మాత్రమే వేర్వేరుగా నాయకుల్ని చూపిస్తూ, గ్రూపుల్ని అంటగట్టుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుంటే, కామరాజర్ లేరని, కామరాజర్ లేకుంటే కాంగ్రెస్ లేరని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడి వీధి పోరాటాల లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటే తనకు ఎంతో గౌరవం అని, ఆయన మీద ప్రత్యేక మర్యాద ఉందని మరో ప్రశ్నకు కుష్బు సమాధానం ఇచ్చారు. -
కుష్భుకు పదవి దక్కేనా!
చెన్నై : మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు నటి కుష్భుకు దక్కనున్నాయన్న ప్రచారంతో రాష్ట్ర పార్టీలోని సీనియర్ మహిళా మణులు కినుకు వహించే పనిలో పడ్డారు. తమను కాదని నిన్నగాక మొన్న వచ్చిన కుష్భుకు ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా, ఆ పదవిని చేజిక్కించుకునేందుకు రాహుల్ మద్దతు దారు జ్యోతి మణి తీవ్రంగానే కుస్తీలు పడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకేకు టాటా చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నటి కుష్భుకు ఆ పార్టీలో ఆదరణ లభిస్తున్నది. ఆమెను తమ ప్రాంతానికి వచ్చి సభల్లో ప్రసంగించాలని కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌లో ప్రత్యేక గ్లామర్‌గా అవతరించిన కుష్భుకు ఇంతవరకు ఎలాంటి పదవి కేటాయించలేదు. అదిగో రాజ్య సభ...ఇదిగో అధికార ప్రతినిధి పదవీ అంటూ ప్రచారాలు మాత్రం తెగ సాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కుష్భుకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని కేటాయించేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. పదవి దక్కేనా : అన్నాడీఎంకేలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత మహిళా గ్లామర్. ఇక, డీఎంకేలో మహిళా విభాగం గ్లామర్‌గా కరుణానిధి గారాల పట్టి కనిమొళి రంగంలోకి దిగారు. డీఎండీకేలో విజయకాంత్ సతీమణి ప్రేమలత మహిళా గ్లామర్. బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్కే సర్వాధికారం. ఇలా మహిళా గ్లామర్, వాక్ ధాటితో ఆయా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగా తాము సైతం బలోపేతం కావాలన్న లక్ష్యంతో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ కుస్తీలు పడుతున్నారు. తమకు సినీ గ్లామర్‌గా దక్కిన కుష్భును పూర్తి స్థాయిలో పార్టీ సేవలకు వినియోగించుకోవాలన్న కాంక్షతో ఆయన పావులు కదుపుతున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట దలచిన నిరసనకు తిరుచ్చి జిల్లా బాధ్యతల్ని కుష్భు భుజాన వేశారు. అయితే, ఆమెకు పార్టీ పరంగా ఎలాంటి పదవీ లేని దృష్ట్యా, మహిళా విభాగం అధ్యక్ష పగ్గాల్ని ఆమెకు అప్పగించే రీతిలో అధిష్టానంకు సిఫారసు చేసినట్టు సమాచారం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌లో ప్రజల్ని ఆకర్షించేంత గ్లామర్ ఎవరికీ లేని దృష్ట్యా, ఆ కొరతను కుష్భు ద్వారా భర్తి చేయడానికి అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. రేసులో జ్యోతిమణి: గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో అడ్డంకుల్ని అధిగమించి కుష్భు పదవి చేజిక్కించుకునేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు కారణంగా కుష్భుకు మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించబోతున్నారన్న సమాచారంతో రేసులో మరికొందరు దిగారు. పార్టీకి ఏళ్ల తరబడి సేవల్ని అందిస్తున్న తమను పక్కన పెట్టి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కుష్భుకు ఆ పదవి ఎలా ఇస్తారని పెదవి విప్పే వాళ్లు బయలు దేరారు. మరి కొందరు సీనియర్ మహిళా నాయకులు అయితే కినుకు వహించే పనిలో పడ్డారు. ఇంకొందరు అయితే, తమ బలాన్ని చాటుకునే రీతిలో ఆ పదవి చేజిక్కించుకునేందుకు అధిష్టానం మీద ఒత్తిడికి సిద్ధం అయ్యారు. వీరిలో జ్యోతిమణి ప్రథమంగా రేసులో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు గల నాయకురాలిగా ఆమెకు రాష్ట్రంలో పేరు ఉంది. అలాగే, జాతీయ స్థాయిలో యువజన విభాగంలో పదవిని సైతం ఆమెకు కట్టబెట్టి ఉన్నారు. తన మాతృ రాష్ట్రంలో సేవల్ని విస్తృతం చేసుకునేందుకు ఆమె కూడా మహిళా పదవి లక్ష్యంగా రాహుల్ ద్వారా ఒత్తిడికి రెడీ అవుతున్నట్టు టీఎన్‌సీసీలో చర్చ సాగుతుండడం గమనార్హం. అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా సీనియర్లుగా ఉన్న యశోధ, ఎమ్మెల్యే విజయ ధరణి, రాణి వెంకటేషన్, హసినా సయ్యద్ సైతం ఆ పదవి కోసం తమ తమ మార్గాల్లో అధిష్టానం మన్ననలను అందుకునేందుకు ఉరకలు పరుగులు తీస్తుండడంతో మహిళా పదవి కుష్భును వరించేనా లేదా, ఆమె మరికొన్నాళ్లు ఎలాంటి పదవీ లేకుండా కాంగ్రెస్‌కు సేవలు అందించేనా...? అన్నది వేచి చూడాల్సిందే. -
కుష్బుకు ఊరట
రుద్రాక్ష వ్యవహారంలో విముక్తి పిటిషన్ తిరస్కరణ రుద్రాక్షతో మంగళ సూత్రం ధరించిన వ్యవహారం నుంచి కాంగ్రెస్ నాయకురాలు, నటి కుష్బుకు విముక్తి కల్గింది. పిటిషన్‌ను తోసి పుచ్చుతూ కుంబకోణం న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో ఆమెకు ఊరట లభించింది. సాక్షి, చెన్నై: కుష్బు వాక్ చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా, పాశ్చాత్య ఒరవడికి అనుగుణంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పాదరక్షలతో ఆలయంలోకి వెళ్లడం తదితర వ్యవహారాలు ఆమెకు కొన్ని సందర్భాల్లో కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ వ్యవహారాల్లో ఆమె మీద కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన సందర్భాలు అనేకం. ఇటీవల ఓ వార పత్రికలో రుద్రాక్షను మంగళ సూత్రంలో కలిపి ఆమె ధరించడం వివాదానికి దారి తీసింది. ఏకంగా ఓ వ్యక్తి కుంబకోణం కోర్టును ఆశ్రయించాడు. వార పత్రికకు కుష్బు ఇచ్చిన ఫోజును చూసిన కుంభకోణం సమీపంలోని ఉమామహేశ్వర పురం శంకర సారంగపాణి పేటకు చెందిన బాల కోర్టును ఆశ్రయించాడు. రుద్రాక్ష అన్నది పవిత్రమైనదని, నిత్యం శివనామస్మరణతో దేవుడ్ని పూజించే వాళ్లు, భక్తులు వాటిని ధరించాలని వివరించారు. రుద్రాక్షలో 24 ముఖాలు ఉన్నాయని వివరిస్తూ, కుష్బు ధరించిన రుద్రాక్ష మూడు ముఖాలుగా ఉందని పేర్కొన్నారు. ఈ రుద్రాక్షను శివుడి మీద భక్తితో నిత్యం పూజాధి కార్యక్రమాలు నిర్వహించే వాళ్లే ధరించాలని, అయితే, హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా కుష్బు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రాక్షను మాంగళ సూత్రంతో కలిపి ధరించడానికి వీలు లేదని పేర్కొన్నారు. సంప్రదాయాల్ని మంట కలిపే విధంగా పలు సందర్భాల్లో ఆమె వ్యవహరించారని ఉదాహరణకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరించారు. తాజాగా రుద్రాక్ష ధరించి శివ భక్తులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కుష్బుపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కుంభకోణం రెండవ అదనపు కోర్టులో న్యాయమూర్తి శరవణభవన్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. మంగళవారం విచారణ సమయంలో పిటిషనర్‌ను న్యాయమూర్తి పలు రకాల ప్రశ్నల్ని సంధించారు. సంప్రదాయాల్ని మంట గలుపుతున్నారని పేర్కొన్నారుగా, ప్రత్యక్షంగా చూశారా? ఆమె రుద్రాక్ష మాలను ధరించి ఉండటాన్ని తమరేమైనా ప్రత్యక్షంగా చూశారా? , ఓ వార పత్రికలో వచ్చిన ఫొటో ఆధారంగా పిటిషన్ వేయడాన్ని ఏకీభవించబోమని స్పష్టం చేశారు. ఆధార రహితంగా ఈ పిటిషన్ దాఖలు చేసిన దృష్ట్యా, విచారణయోగ్యం కాదని పరిగణించి తోసి పుచ్చారు. దీంతో ఈ వ్యవహారం నుంచి కుష్బుకు ఊరట లభించినట్టు అయింది. -
కుష్భు వ్యాఖ్యలపై రచ్చ
సాక్షి, చెన్నై: కుష్భు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలిగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనల్లో కుష్భు బిజీబిజీగా ఉన్నారు. తమ ప్రాంతానికి అంటే తమ ప్రాంతానికి రావాలంటూ కుష్భును ఆహ్వానించే పనిలో కాంగ్రెస్ శ్రేణులు పడ్డారు. ఈ పర్యటనల్లో కుష్భు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎల్టీటీఈల్ని తీవ్రవాదులతో పోల్చుతూ ఆమె ఓ సభలో వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో కుష్భు వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆమె వ్యాఖ్యల్ని తమిళ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో తమిళర్ మున్నేట్ర పడై పేరిట కొన్ని తమిళ సంఘాలు ఏకం అయ్యాయి. ఆమె ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. వివాదం: పట్టినం బాక్కం శాంతోమ్ రోడ్డులో కుష్భు నివాసం వద్ద తమిళ సంఘాలతో ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధం అయ్యారు. రాయపురం మనో, మైలై అశోక్‌ల నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఉదయాన్నే కుష్భు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంటి వైపుగా వచ్చే తమిళ సంఘాలతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవల ఇదే సంఘం సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించడం, కాంగ్రెస్ వర్గాలు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తాజా పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఉద్రిక్తత : తమిళర్ మున్నేట్ర పడై నాయకురాలు వరలక్షి నేతృత్వంలో తమిళాభిమాన సంఘాలు ర్యాలీగా పట్టినం బాక్కం సిగ్నల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు కుష్భు ఇంటి వైపుగా వారిని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ రవి శేఖరన్ నేతృత్వంలోని పోలీసు బృందం కుష్భు ఇంటి వద్దకు చేరుకుని కాంగ్రెస్ నాయకుల్ని బుజ్జగించారు. పట్టినం బాక్కం సిగ్నల్ నుంచి కుష్భు ఇంటి వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేసిన తమిళ సంఘాల నాయకుల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈసందర్భంగా పలువురు కుష్భు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలతో నినదించడం కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహాన్ని రేపింది. చివరకు ఆందోళన కారుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి చక్క బడింది. ఈ మట్టుడి యత్నం సమయంలో కుష్భు ఆ ఇంట్లో లేరన్నది కొసమెరుపు. -
కామరాజర్ బాటలో కాంగ్రెస్
చెన్నై, సాక్షి ప్రతినిధి :మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ బాటలో కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని నటి కుష్బు పేర్కొన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్బు శనివారం తొలిసారిగా చెన్నై సత్యమూర్తి భవన్‌కు చేరుకున్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కుష్బు మీడియాతో మాట్లాడుతూ, పదవుల కోసం పార్టీ మారలేదు, తనకు ఏ పదవి ఇవ్వాలో సోనియా, రాహుల్‌కు తెలుసన్నారు. ముంబైలో పుట్టి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను చూస్తూ పెరిగాను, అందరూ కాంగ్రెస్‌లో చేరుతానని అనుకున్నారు, కానీ మార్గమధ్యంలో దారితప్పి ఐదేళ్ల క్రితం వేరే పార్టీలో చేరానన్నారు. కాంగ్రెస్‌లో చేరిక సొంతింటికి వచ్చినట్లు ఉందని చెప్పారు. డీఎంకే-కాంగ్రెస్‌ల పొత్తు, ఆ పార్టీ నుంచి ఎందుకు వైదొలిగారు అనే ప్రశ్నలు అడగొద్దన్నారు. ఎందుకంటే అదే పార్టీ నుంచి వచ్చాను, ఎందుకు కాంగ్రెస్‌లోకి రావాల్సి వచ్చిందో అందరికీ తెలియాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను మరింత పెంచగలనని నమ్మకం ఉందన్నారు. ఇందుకోసం ఇంటింటా తిరిగి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని తెలిపారు. మూపనార్ ఖ్యాతి ఏమిటి? ఇళంగోవన్ ముఖ్యమంత్రి హోదాలో కామరాజనాడార్ రాష్ట్ర ప్రజలకు చిరస్మరణీయమైన సేవలు చేశారు, అందుకే ఆయన మాకు మార్గదర్శకుడని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ అన్నారు. అయితే జీకే మూపనార్ కాంగ్రెస్ పార్టీకీ, ప్రజలకు ఎటువంటి సేవలు అందించారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కామరాజనాడార్ ఫొటో లేకుండా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగవని, అలాగే మూపనార్ ఫోటో, పేరును ఎటువంటి పరిస్థితిలోనూ వినియోగించుకోమని చెప్పారు. బీజేపీ చురకలు డీఎంకే నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఒక సాధారణ కార్యకర్త కుష్బుకు తమ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ హితవు పలికారు. రాష్ట్రంలో ఒక్కస్థానంలో కూడా గెలవలేని కాంగ్రెస్ నేడు నిట్టనిలువునా చీలిపోగా ఆ పార్టీలో చేరిన కుష్బుకి బీజేపీని విమర్శించే స్థాయి లేదని చురకలంటించారు. -
రజనీ... రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు
చెన్నై: రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదని సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నేత కుష్బూ చురకలంటించారు. ప్రజలకు సేవ చేయాలని ఉంటే రాజకీయాల్లోకి రావాలని రజనీకి ఆమె హితబోధ చేశారు. అంతేకాని కాసేపు వస్తాను, మరి కాసేపు రానంటూ కుప్పిగంతులు వేయొద్దని కుష్బూ ఆయనకు సూచించారు. కుష్బూ శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బాగు చేయాలని అన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం తనకు అప్పగించిందన్నారు. ఆమె రెండు రోజుల క్రితం డీఎంకే పార్టీకి రాజీనామా చేసి.... సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కుష్బూ బీజేపీలో చేరతారని గత కొంత కాలంగా మీడియాలో కథనాలు వెల్లువెత్తతున్నాయి. అయితే ఆమె హస్తం పార్టీలో చేరి ఆ కథనాలకు పుల్ స్టాప్ పెట్టారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: ఖుష్బూ
డీఎంకేను వదిలిపెట్టి దాదాపు ఆరునెలలు గడిచిన తర్వాత ఎట్టకేలకు నటి ఖుష్బూ తన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ విషయం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఢిల్లీలో ఆమె చేరుతారని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు. విశేష ప్రజాదరణ ఉన్న ఖుష్బూ లాంటి వాళ్లు చేరడం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రధానంగా జీకే వాసన్ వెళ్లిపోయిన సమయంలో నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలకు ఇది మంచి ఊతం ఇస్తుందని నాయకులు అంటున్నారు. పెళ్లికి ముందే సెక్స్ లాంటి అంశాల గురించి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బాగా ప్రచారం పొందిన ఖుష్బూ.. డీఎంకే నాయకత్వంపై అసంతృప్తితో జూన్ 16న ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2010లో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఆ పార్టీలో చేరారు. మధ్యలో ఆమె బీజేపీలో చేరుతారన్న కథనాలు వినిపించినా, వాటిని ఖండించారు. -
తమిళ మీడియాపై కుష్బూ ఆగ్రహం!
చెన్నై: బీజేపీలో చేరుతారంటూ మీడియా చేస్తున్న ప్రచారంపై కుష్బూ మండిపడ్డారు. డీఎంకే పార్టీకి సోమవారం కుష్బూ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరేందుకే కుష్బూ డీఎంకే పార్టీని వీడిందంటూ చేస్తున్న వ్యాఖ్యలు సరికావని ఆమె ట్విటర్ లో ట్వీట్ చేసింది. నేను ఎప్పడూ ఏ పార్టీలో చేరడానికి ముందుగాని.. ప్రస్తుతంగాని ప్రయత్నించడం లేదు. తెల్ల కాగితాన్ని నింపేందుకు కష్టపడుతున్న పేపర్లు ఇలాంటి రాతల్ని ఆపితే సంతోషిస్తాను అని ట్విట్ చేశారు. డీఎంకే పార్టీని వీడిన కుష్బూ బీజేపీలో చేరుతారంటూ తమిళ పత్రికలు కథనాలు ప్రచురించడంపై కుష్బూ తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారు. I hve nvr tried to fit in2 any other party before nor now..would appreciate if few papers would stop filling in their blank spaces wid crap. — khushbusundar (@khushsundar) June 17, 2014 -
స్మృతి ఇరానీకి ఖుష్బూ అండ
చెన్నై : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీని సినీనటి, డీఎంకే నాయకురాలు ఖుష్బూ బాసటగా నిలిచారు. కనీస డిగ్రీ కూడా లేని స్మృతి ఇరానీకి కీలక మయిన మానవ వనరుల అభివృద్ధి శాఖను ఎలా కట్టబెడతారంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దానికి ఖుష్బూ అభ్యంతరం తెలిపారు. ఆమె తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. సాధించడానికి విద్య మాత్రమే ముఖ్యం కాదన్నారు. సచిన్ టెండూల్కర్, బిల్‌గేట్స్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందారని, వారంతా పట్టభద్రులు కాదని గుర్తు చేశారు. సాధించడానికి ప్రతిభ ముఖ్యంగానీ విద్యకాదని ఖుష్బూ ట్విట్ చేశారు. అలాగే సుష్మాపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. సుష్మాజీ మీ ధైర్యం అలుపెరగని శ్రమ, ప్రయత్నాల వలన సాధించిన శక్తి ముందు ఎవరూ తోక జాడించలేరు. ప్రజలకు మీరు ఉత్తమ సేవలందించగలరు. మీకు నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. -
స్టాలిన్‌తో ఎలాంటి విబేధాలు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా నటి ఖుష్బు ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి నిర్విరామంగా 17 రోజుల పాటు ఆమె ప్రచారం సాగ నుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం తాను సిద్ధం అయ్యానని, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా తన ప్రచార ప్రసంగాలు ఉంటాయని వివరించారు. అయితే, ప్రచారంలో ఎక్కడా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్‌ను విమర్శించనని ప్రకటించారు. పార్టీ ముఖ్యం: తాను డీఎంకేలో కార్యకర్తను, నాయకురాలిని కావున తనకు పార్టీ ముఖ్యం అని స్పష్టం చేశారు. డీఎంకేకు అనుకూలంగానే తాను వ్యవహరిస్తుంటానని పేర్కొన్నారు. వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుకార్లు పుట్టించే వాళ్లు పుట్టిస్తూనే ఉంటారని, వాటి గురించి ఆలోచించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. పార్టీ వర్గాలతో ఎలాంటి అభిప్రాయ బేధాలు తనకు లేదని స్పష్టం చేశారు. స్టాలిన్‌తో అసలు ఎలాంటి విబేధాలు లేవు అని, అంతా మీడియా సృష్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ పార్టీలో తనకు ఇబ్బందులు కలిగి ఉంటే, ఎప్పుడో పార్టీని వీడేదాన్ని అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పిల్లల కోసం : తన ఇద్దరు పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని, వారితో ఎక్కువ సమయం గడపాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు లేనప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతానని, అంత మాత్రాన పార్టీకి దూరంగా ఉన్నట్టు కాదన్నారు. పార్టీ కోసం కష్టపడేందుకు తాను సిద్ధం అని, తాను సరైన అభ్యర్థి కాదు కాబట్టే, తనకు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన సేవల్ని ప్రచారానికి పార్టీ ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నికల్లో డీఎంకే ప్రగతిని, అన్నాడీఎంకే వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రసంగాలు చేయనున్నానని వివరించారు. డీఎంకే చేసిందేమిటో, అన్నాడీఎంకే చేసిందేమిటో ప్రజలకు వివరించడమే కాదు, ఎవరైనా చర్చకు వచ్చినా తేల్చుకునేందుకు తాను సిద్ధం అని సవాల్ చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయను: ప్రచారంలో ఎవరి మీదా వ్యక్తిగత విమర్శలను తాను చేయనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు డీఎంకే దూరం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువమక్కల్ కట్చినేత శరత్‌కుమార్ రాజకీయ పార్టీలకు అధినాయకులైనా, డీఎంకేకు ప్రత్యర్థులుగా ఉన్నా, వారిని మాత్రం విమర్శించనని స్పష్టం చేశారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లతో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు అని, తామంతా ఒకే కుటుంబం అని, అందువల్లే వారిని మాత్రం విమర్శించనని పేర్కొన్నారు. నటి నగ్మా తన కన్నా సీనియర్ అని, ఆమెను ముద్దాడే విధంగా వ్యవహరించిన నాయకుడి చెంప పగలగొట్టి ఉండాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ స్థానంలో తాను ఉండి ఉంటే, ఆ వ్యక్తి చెంప పగిలి ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి తమకు ఇంత వరకు ఎదురు కాలేదని, ఎదురు కాదు కూడా అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేలో మహిళకు భద్రత, రక్షణ ఉందని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. -
మేమూ రెఢీ!
డీపీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేసేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి, మహిళానేత, సినీ నటి ఖుష్బూ రెడీ అయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో ఖుష్బూ, ఐదో తేదీ నుంచి కనిమొళి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఓపెన్ టాప్ వాహనాలు వీరి కోసం సిద్ధం అవుతున్నారుు. సీఎం జయలిలత వాగ్దాటిని ఢీ కొట్టేందుకు ఈ ఇద్దరు మహిళలు సిద్ధమయ్యారు. సాక్షి, చెన్నై: వీసీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, పీటీలతో కలసి డీఎంకే నేతృత్వంలో డెమాక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్(డీపీఏ) ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పదుచ్చేరితో పాటుగా రాష్ర్టంలోని 40 స్థానాల బరిలో ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారు. వీరికి మద్దతుగా ప్రచార బాటలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. తాను సైతం అంటూ పార్టీ అధినేత ఎం కరుణానిధి ప్రచారానికి సిద్ధం అయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రి సీఎం జయలలిత ఒంటి చేత్తో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తుంటే, ఆమె వాగ్దాటిని ఎదుర్కొనే విధంగా మహిళా నాయకుల్ని ప్రచార కదన రంగంలోకి దించేందుకు డీఎంకే సిద్ధం అయింది. కని, ఖుష్బూ రెడీ జయలలిత తమ మీద విమర్శల వర్షం కురిపిస్తుండటంతో దాన్ని తమ వాగ్దాటితో తిప్పికొట్టే విధంగా ప్రచారంలోకి ఎంపీ కనిమొళి, నటి ఖుష్బూలు రంగంలోకి దిగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ గ్లామర్ ఖుష్బూను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. వాక్ చాతుర్యంతో, చక్కటి ప్రసంగంతో ఓటర్లను ఆమె ఆకర్షించారు. తాజాగా జరగనున్న ఎన్నికల్లో ఆమె సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకునేందుకు డీఎంకే నిర్ణయించింది. ఇది వరకు వేదికలపై నుంచి ప్రసంగాలు ఇచ్చిన కనిమొళి, ఈ పర్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ టాప్ వాహనంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా జయలలిత ప్రసంగాల్ని టార్గెట్ చేసి, ఆమె వ్యాఖల్ని దీటుగా ఎదుర్కొనే రీతిలో ఈ ఇద్దరు మహిళు తర్ఫీదు పొందుతున్నారని సమాచారం. కనిమొళికి చక్కటి ప్రసంగాన్ని ఇవ్వగల సత్తా ఉంది. ఖుష్బూ అనర్గళంగా ప్రసంగించగలరు. అయితే, కొన్ని అంశాల్ని ఎత్తి చూపాల్సిన సమయంలో స్క్రిప్ట్ తప్పని సరి. పర్యటన వివరాలు కనిమొళి పర్యటన వివరాలు సిద్ధం చేసే పనిలో అన్నా అరివాళయం వర్గాలు ఉన్నాయి. ఆమె ఏప్రిల్ 5 తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. స్టాలిన్ కన్యాకుమారి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్న దృష్ట్యా, చెన్నై నుంచి ఆమె ప్రచారం ఆరంభించే రీతిలో పర్యటన వివరాల్ని సిద్ధం చేస్తున్నారు. లేని పక్షంలో కనిమొళి మద్దతుదారులు అత్యధికంగా ఉండే కడలూరు, చిదంబరం నియోజకవర్గాల నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఖుష్బూ పర్యటన వివరాలు సైతం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి పార్టీకి సేవలను అందించేందుకు ఖుష్బూ సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈమె పర్యటన సాగనుంది. వీరు రోడ్ షోలలో కూడా పాల్గొని ప్రచారం చేయనున్నారు. ప్రధాన కూడళ్లల్లో ప్రసంగాలు, అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీరి ప్రచారం కోసం అన్ని వసతులతో కూడిన రెండు ఓపెన్ టాప్ వాహనాలు సిద్ధం అవుతున్నాయి. జయను ఎదుర్కోవడానికే.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సుడిగాలి ప్రచారానికి అనూహ్యస్పందన రావడంతోనే ఈ ఇద్దరినీ రంగంలోకి దించేందుకు కరుణానిధి నిర్ణయించినట్టు అరివాళయం వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్లు చీలడం ఖాయం. ఈ దృష్ట్యా, తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రచారం బరిలోకి అందరినీ దించే పనిలో కరుణానిధి ఉన్నారు.