
టీ.నగర్: డీఎంకే అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతిస్తున్న తరుణంలో విశాల్‌కు కుష్బూ శుభాకాంక్షలు తెలపడమేమిటని దక్షిణ చెన్నై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరాటే త్యాగరాజన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. డీఎంకేలో ఉన్న సమయంలో అక్కడున్న నేతలకు సమస్యలను కలిగించి బయటికి పంపిన కుష్బూకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను కల్పించి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా హోదాను కల్పించిందని ఈ పదవిలో హూందాగా నడచుకోవాల్సిన కుష్బు కాంగ్రెస్ పార్టీలోను గందరగోళం సృష్టిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్కేనగర్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న విశాల్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపి గందరగోళం సృష్టించినట్లు కరాటే త్యాగరాజన్ ఆరోపించారు.