
నా మద్దతు విశాల్‌కే
నటుడు విశాల్‌కే నా మద్దతు అంటున్నారు నటి, రాజకీయనాయకురాలు కుష్బు.ఈమె నటుడు విజయకాంత్ దక్షిణ భారత నటీనటుల సంఘం
నటుడు విశాల్‌కే నా మద్దతు అంటున్నారు నటి, రాజకీయనాయకురాలు కుష్బు.ఈమె నటుడు విజయకాంత్ దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టిన సమయంలో కార్యవర్గ సభ్యురాలిగా తన వంతు కృషి చేశారు.ఆ తరువాత కుటుంబం, పిల్లల బాధ్యతలు, రాజకీయాలు, బుల్లితెర కార్యక్రమాలు, చిత్ర నిర్మాణం అంటే బిజీ కావడంతో సంఘం బాధ్యతలకు దూరంగా ఉన్నారు. కాగా ప్రస్తుతం నడిగర్‌సంఘం ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న విషయం తెలిసిందే. శరత్‌కుమార్ జట్టు, విశాల్ జట్టు నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీకి బరిలోకి దిగుతున్నాయి.
దీంతో సంఘం సభ్యుల్లో ఎవరు ఏ జట్టుకు మద్దతుగా నిలవనున్నారన్న విషయం ఆసక్తిగా మారింది. ఇలాంటి పరిస్థితిలో మీ మద్దతెవరికన్న ప్రశ్నకు నటి సంచలన నటి కుష్బు బదులేమిటో చూద్దాం. నడిగర్‌సంఘంలో మార్పురావాలని ఆశిస్తున్నాను. అందువల్ల నా మద్దతు కచ్చితంగా విశాల్‌కే. శరత్‌కుమార్, రాధారవి నాకు మంచి మిత్రులే. శరత్‌కుమార్ 100వ చిత్రంలో నేను నటించారు. నా తొలి తెలుగు చిత్రంలో రాధారవినే విలన్.
అయితే సంఘానికి కొత్త రక్తం రావాలని కోరుకుంటున్నాను. అందుకే నా మద్దతు విశాల్‌కే అంటున్నాను. ఇకపోతే సినిమాల్లో నటించరా? అని అడుగుతున్నారు. తమిళంలో విల్లు, తెలుగులో స్టాలిన్ చిత్రం తరువాత నేను నటించలేదు. కారణం నాకు తగిన పాత్రల అవకాశాలు రాకే. అదే సమయంలో పిల్లల పోషణ, రాజకీయాలు, టీవీ కార్యక్రమాల తో బిజీగా ఉండడం కూడా ఒక కారణం. అందుకే బుల్లి తెర సీరియల్స్‌లో కూడా నటించడం లేదు.