
కోలీవుడ్ హీరో విశాల్ చెల్లెలు ఐశ్వర్య కుటుంబం చిక్కుల్లో పడింది. చెన్నైలోని ప్రముఖ నగల వ్యాపారి ఉమ్మిడి ఉదయ్‌కుమార్, జయంతి దంపతుల కుమారుడు ఉమ్మిడి క్రితీష్‌తో 2017లో వివాహం జరిగింది. చాలు ఏళ్లుగా క్రితీస్ నగల వ్యాపారం చేస్తున్నాడు. విశాల్ చెల్లెలి భర్త క్రితీష్, ఆయన నిర్వహిస్తున్న నగల షాపుపైనా సీబీఐ అధికారులు తాజాగా కేసు పెట్టారు. వివరాలు చూస్తే స్థానిక అయ్యప్పన్ తంగల్‌లోని ఒక బ్యాంకులో నకిలీ పత్రాలతో రూ.5.5 కోట్ల రుణం తీసుకున్న కేసులో, ఆ మోసానికి సహకరించి రూ.2.5 కోట్లు లబ్ధి పొందినట్లు క్రితీష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఈ కేసులో క్రితీష్‌తో పాటు, మోసం వెనుక భూ యజమాని, నిర్మాణ సంస్థ, బ్యాంకు అధికారులు, బ్యాంకు రుణగ్రహీతలు తదితరలు ఈ స్కామ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వారందరూ తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి ప్రముఖ బ్యాంకు నుంచి ఐదున్నర కోట్ల రూపాయల రుణం పొందినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ఏడుగురిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment