
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా 'రెట్రో' నుంచి తాజాగా మరో సాంగ్ విడుదలైంది. ఇందులో సూర్య, పూజా హెగ్డే పాత కాలం నాటి స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ సాంగ్‌లో చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో కనిపించే ఐకానిక్ స్టెప్స్ కూడా ఉండటంతో కోలీవుడ్‌లో ఈ పాట వైరల్ అవుతుంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెట్రో సినిమాపై హైప్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment