దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 68వ వార్షిక సర్వసభ్య సమావేశం చెన్నైలో జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడుల గురించి హీరో విశాల్ రియాక్ట్ అయ్యారు. నటీమణలకు రక్షణగా నడిగర్ సంఘం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ జనరల్ కమిటీ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచీ మురుగన్, కరుణాస్, ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు ఒడిగట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తెలిపారు. మహిళ రక్షణ కోసం విశాఖ కమిషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. లైంగిక వేధింపులకు ఎవరైన గురైనట్లు ఫిర్యాదు వస్తే.. తప్పు చేసినవారిపై తీవ్రమైన చర్యలుంటాయని విశాల్ హెచ్చరించారు. ఈమేరకు ఒక తీర్మానం కూడా చేశామని ఆయన అన్నారు. బాధితులు నేరుగా తమకే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికైతే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
అనంతరం విలేకరులతో అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ.. '68వ వార్షిక సభను అద్భుతంగా పూర్తి చేశాం. ప్రతి కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులను అభినందించి వారిని సత్కరిస్తున్నాం. జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాం. నటీనటుల సంఘం పొడిగింపును సభ్యులందరూ అంగీకరించారు.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment