Nassar
-
లైంగిక దాడులు చేసేవారిపై తీవ్రమైన చర్యలు: విశాల్
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 68వ వార్షిక సర్వసభ్య సమావేశం చెన్నైలో జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడుల గురించి హీరో విశాల్ రియాక్ట్ అయ్యారు. నటీమణలకు రక్షణగా నడిగర్ సంఘం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ జనరల్ కమిటీ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పూచీ మురుగన్, కరుణాస్, ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు.తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు ఒడిగట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తెలిపారు. మహిళ రక్షణ కోసం విశాఖ కమిషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. లైంగిక వేధింపులకు ఎవరైన గురైనట్లు ఫిర్యాదు వస్తే.. తప్పు చేసినవారిపై తీవ్రమైన చర్యలుంటాయని విశాల్ హెచ్చరించారు. ఈమేరకు ఒక తీర్మానం కూడా చేశామని ఆయన అన్నారు. బాధితులు నేరుగా తమకే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికైతే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.అనంతరం విలేకరులతో అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ.. '68వ వార్షిక సభను అద్భుతంగా పూర్తి చేశాం. ప్రతి కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులను అభినందించి వారిని సత్కరిస్తున్నాం. జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తాం. నటీనటుల సంఘం పొడిగింపును సభ్యులందరూ అంగీకరించారు.' అని అన్నారు. -
లైంగిక వేధింపులుంటే ఫిర్యాదు చేయండి: నాజర్
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. తాజాగా నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ మహిళల రక్షణ కోసం పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని కూడా నడిగర్ సంఘం నియమించింది.తమిళ చిత్రపరిశ్రమలో విశాఖ కమిటీ వేశామని, ఇప్పటికే కొన్ని సమస్యలను కూడా పరిష్కరించామని నాజర్ తెలిపారు. పరిశ్రమలోని మహిళలకు లైంగిక వేధింపులుంటే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, పరిష్కారాలు చూపుతామని నాజర్ అన్నారు.మహిళలపై లైంగిక వేధింపులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయని నాజర్ గుర్తుచేశారు. అయితే, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా సరే.. సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని ఆయన అన్నారు. మహిళల రక్షణకు నడిగర్ సంఘం అండగా ఉంటుందని తెలిపారు. -
ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
త్రిష జీవితంలో సమస్యలు అనేవి కొత్తేమీ కాదు. ఈమె ఒక్కో స్టేజ్‌లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని ఎదురొడ్డి ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ చైన్నె సుందరి ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ తరువాత లియో చిత్రంలో విజయ్‌తో జతకట్టి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రం, కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్ వంటి భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (ఇదీ చదవండి: జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?) తాజాగా టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తి గత ఆరోపణలకు గురవుతున్నారు. అన్నాడీఎంకే బహిష్కరణ కార్యనిర్వాహకుడు ఏవీ రాజు త్రిషను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది త్రిషను మానసిక క్షోభకు గురి చేసిన విషయం తెలిసిందే. కూవత్తూర్ సంఘటన సమయంలో నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్, నటి త్రిషతో పాటు మరికొందరిని గెస్ట్ హౌస్‌కి పంపారన్నదే ఏవీ.రాజు వేసిన నింద. దీన్ని తీవ్రంగా ఖండించిన త్రిష అతనిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ త్రిషపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనికి స్పందించిన త్రిష తనకు సపోర్ట్‌గా నిలిచిన ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు. -
హీరో కార్తీకి రూ. కోటి చెక్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం ప్రముఖ హీరో విశాల్ తీవ్రంగానే కష్టపడుతున్నారు. 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరగగా వాటి ఫలితాలను 2022లో ప్రకటించారు. అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. అసోసియేషన్ భవనం నిర్మించడం కోసం నిధుల కొరత ఉందని గతంలో విశాల్ తెలిపాడు. నిర్మాణ విషయంలో మూడేళ్లు ఆలస్యమవ్వడం వల్ల 25 శాతం పనులు పెరిగాయని అందుకు బడ్జెట్ కూడా పెరిగిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విశాల్ కోరాడు. భవన నిర్మాణ కోసం అవసరమైతే భిక్షాటన కూడా చేస్తానని ఆయన అన్నారు. తాజాగా నటీనటుల సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ. కోటి నిధలు మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో తీర్మానం చేయగా.. మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి ఆర్థిక సాయం చేశారు. కోశాధికారి కార్తీకి ఉదయనిధి స్టాలిన్ ఆ చెక్‌ను అందజేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ప్రియమైన ఉదయ, మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్మాణ ప్రయత్నాలకు మీ సహకారం అందించడమే కాకుండా ఇలా వీలైనంతలో సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు స్నేహితుడిగా, నిర్మాతగా, నటుడుగా, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అని ఆయన తెలిపాడు. Dear Udhaya, I sincerely thank u as a friend, producer, actor and now sports minister of Tamil Nadu govt for your contribution to our South Indian artistes association building efforts and your willingness to finish it as early as possible and also coming forward to help in any… pic.twitter.com/H40q6HAzvo — Vishal (@VishalKOfficial) February 15, 2024 -
విజయకాంత్ ఆరోగ్యంపై ప్రకటన చేసిన నాజర్
జలుబు, దగ్గు, గొంతునొప్పితో డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ చికిత్స పొందుతున్నారు. నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని నవంబర్ 23న మయత్ ఆసుపత్రి యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ కొన్ని రోజుల తర్వాత, అకస్మాత్తుగా మరోక ప్రకటన విడుదల చేసి అతని పరిస్థితి గత 24 గంటల నుంచి నిలకడగా లేదు అంటూనే పల్మనరీ చికిత్స అవసరం ఉందని తెలిపి విజయకాంత్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పింది. ఆయనకు మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. దీంతో ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యంపై ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. 'కెప్టెన్ ఆరోగ్యంపై ఆసుపత్రి యాజమాన్యం రెగ్యులర్‌గా నివేదిక ఇస్తుంది. ఆయన ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు, నర్సులు, నేను అతనిని బాగా చూసుకుంటున్నాం.' అని తెలిపింది. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి అందరినీ కలుస్తారని ఆమె తెలిపారు. ఆమె ప్రకటనతో అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. విజయకాంత్ ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్లారు. విజయకాంత్ ఆరోగ్యం గురించి వైద్యుల ద్వారా పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయనపై వస్తున్న వార్తలు నమ్మెద్దు. విజయకాంత్ త్వరలో అభిమానులను కలుస్తారు. అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ICU వార్డులో అతను ఉన్నందున మేము చూడలేకపోయాం. కానీ విజయకాంత్ ఆరోగ్యంపై తమకు వైద్యులు సమాచారం అందించారు. వైద్య భద్రత దృష్ట్యా ఆయన్ను చూసేందుకు అనుమతించలేదు.' అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. -
బాహుబలి నటుడి ఇంట్లో తీవ్ర విషాదం..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నాజర్ తండ్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్దాప్యంతో బాధపడుతున్న మహబూబ్ బాషా (94) తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్‌మలైలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నాజర్‌ను పరామర్శించారు. (ఇది చదవండి: దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం) నాజర్ తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. బాహబలి చిత్రంలో కీలక పాత్ర పోషించారు. విభిన్నమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించారు. ప్రస్తుతం ఆయన ధనుశ్ నటిస్తోన్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కనిపించనున్నారు. నటించిన కాగా.. సోమవారం రాత్రి టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ విషాదం నెలకొంది. (ఇది చదవండి: హమాస్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బుల్లితెర నటి వీడియో!) -
హీరో అవ్వాల్సిన ఆ స్టార్ కొడుకు.. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమై!
తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. అయితే అందరూ తెలుగువాళ్లేనా అంటే కాదు. పరభాషల నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడివాళ్ల కంటే బోలెడంత క్రేజ్ సంపాదించిన నటులు చాలా అంటే చాలామంది. వాళ్లలో నాజర్ ఎప్పుడూ టాప్‌లో ఉంటాడు. పుట్టిపెరిగింది తమిళనాడులో అయినా దాదాపు ఆరు భాషల్లో కలిపి 600 వరకు సినిమాల్లో నటించారు. తెరపై అంరినీ అలరిస్తున్న ఈయన.. కొడుకు విషయంలో తీరని కష్టాన్ని దిగమింగుతున్నాడని మీలో ఎవరికైనా తెలుసా? 1985లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాజర్.. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ప్రాంతీయ భాషా చిత్రాల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు ఈయన ఉండాల్సిందే. సినిమాల పరంగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించిన ఈయన.. తన వారసుల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. రెండో కొడుకు ప్రస్తుతం నటుడిగా ఉన్నప్పటికీ.. పెద్ద కొడుకు విషయం మాత్రం ఈయన్ని ఎప్పుడూ కృంగదీస్తూనే ఉంటుంది. (ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!) నాజర్‌కి ముగ్గురు కొడుకులు. అందులో పెద్దోడి పేరు అబ్దుల్ ఫైజల్ హాసన్. తండ్రిలానే నటుడు కావాలనుకున్నాడు. నాజర్‌కు ఈ విషయం తెలిసి, హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసి సన్నాహాలు చేశాడు. అంతలోనే పెద్ద కుదుపు. నాజర్ పెద్ద కొడుకు ప్రయాణిస్తున్న కారు ఘోరమైన ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ పూర్తిగా వీల్ ఛైర్ లేదా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా మరికొన్ని రోజుల్లో హీరో అవుతాడనుకున్న పెద్ద కొడుకు.. జీవచ్ఛవంలా మంచానికే పరిమితమయ్యేసరికి నాజర్ మానసికంగా కృంగిపోయాడు. ఇదే పెద్ద బాధ అనుకుంటే పూర్తిగా గతాన్ని మర్చిపోవడం నాజర్ని మరింత వేదనకు గురిచేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. నాజర్ కొడుకు వాళ్ల ఫ్యామిలీని మర్చిపోయాడు గానీ హీరో విజయ్‌ని గుర్తుపెట్టుకున్నాడు. టీవీలో అతడి పాట వచ్చినా, సినిమా వచ్చినా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయం తెలిసి విజయ్.. ఈ ఏడాది నాజర్ పెద్ద కొడుకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఇలా తెరపై అద్భుతమైన నటనతో అలరిస్తున్న నాజర్ జీవితంలో ఇంత విషాదం ఉందని బహుశా మీలో చాలామందికి తెలిసుండకపోవచ్చేమో! (ఇదీ చదవండి: టాలీవుడ్లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!) -
పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చిన నాజర్
హైదరాబాద్‌లో జరిగిన 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ తమిళ చిత్ర పరిశ్రమపై పలు వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి కోలీవుడ్ పరిశ్రమ చాలా నేర్చుకోవాలని ఆయన కామెంట్ చేశారు. తమిళ పరిశ్రమలో తమిళులు మాత్రమే నటించాలనే ధోరణి నుంచి బయటకు రావాలని అక్కడి పరిశ్రమ పెద్దలకు సూచించారు. నేడు తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుంది. అలాగా అందరినీ అక్కున చేర్చుకుంటుందని పవన్ అన్నారు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో కూడా మార్పు రావాలని ఆయన సూచించారు. (ఇదీ చదవండి: ఏంటి పవన్ 'బ్రో' ఇన్ని సినిమాలు ఉన్నాయా ఆ లిస్ట్‌లో..!) ఇతర భాషలకు చెందిన నటులను కూడా కోలీవుడ్‌లో తీసుకోవాలని ఆయన ఇలా తెలిపారు. 'కేవలం మన భాషా, మనవాళ్లే ఉండాలంటే కుచించుకుపోతాం. తమిళ చిత్ర పరిశ్రమలో కేవలం తమిళవాళ్లే ఉండాలనే భావన ఆ చిత్ర పరిశ్రమ పెద్దలకు ఉందని నేను బయట విన్నాను. అలాంటి చిన్న స్వభావం నుంచి బయటికి వచ్చి, విస్తృత పరిధిలో మీరు కూడా RRR లాంటి సినిమాలు, ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రావాలని కోరుకుంటున్నాను' అని తమిళ పరిశ్రమపై పవన్ కల్యాణ్ కామెంట్ చేశారు. పవన్ వ్యాఖ్యలకు నాజర్ కౌంటర్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను నడిగర్ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటులు నాజర్ తాజాగా ఖండించారు. 'తమిళ చిత్ర పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని ఖండిస్తాను. దాన్ని వ్యతిరేకిస్తాను. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల రక్షణ కోసం సెల్వమణి కొన్ని సూచనలు చేశారు. తమిళ సినిమా పరిధిలో మాత్రమే మూవీ చేస్తున్నప్పుడు ఇక్కడి టెక్నీషియన్లను మాత్రమే కొంత వరకు ఎంకరేజ్ చేయండి అన్నారు. అంతే కానీ ఇతర భాషల నటులను వద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు అయ్యాయి. దీంతో పాటుగా ఓటీటీ వినియోగం ఎక్కువైంది. ఇలాంటి సమయంలో అటువంటి నిబంధనలను ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. వారిని ఆదరించింది. ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారు, వాణీ శ్రీ గారు, శారద అమ్మ గారు ఇలా చాలా మంది తమిళులే అని అనుకున్నాను. చాలా కాలం తరువాత నాకు వాళ్లది ఆంధ్రప్రదేశ్ అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం.' అని నాజర్ అన్నారు. Nadigar Sangam (SIAA) President, actor #Nasser, from Hyderabad, clarifies on some misrepresented news doing rounds in media.@johnsoncinepro pic.twitter.com/Q61BuUYgB6 — Ramesh Bala (@rameshlaus) July 27, 2023 -
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు !
Popular Actor Nassar Wounded In Cinema Shooting: టాలీవుడ్ స్టార్ యాక్టర్స్‌లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. అయితే తాజాగా ఆయనకు గాయాలయ్యాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో బుధవారం (ఆగస్టు 17) ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న నాజర్ గాయాలపాలయ్యారని సమాచారం. నాజర్‌కు గాయాలు కాగా వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నాజర్ స్వయంగా నిర్ణయించుకున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగిన విషయం తెలిసిందే. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చదవండి: నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! 50 థియేటర్లని సరదాగా అనుకుంటే, ఇప్పుడేమో..: అల్లు అరవింద్ -
సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా?
టాలీవుడ్ స్టార్ యాక్టర్స్‌లో నటుడు నాజర్ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. త్వరలోనే ఆయన నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. చదవండి: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయనే స్వయంగా నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. అప్పటి నుంచే ఆయన పలు సెలక్టెడ్ చిత్రాలనే చేస్తున్నారు. ఇక శాశ్వతంగా నటనకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందుకే యాక్టింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన అనుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై నాజర్ నుంచి కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే కాగా ‘కళ్యాణ అగత్తిగళ్’ చిత్రంతో నాజర్ నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ గొప్ప నటుడిగా ఎదిగారు. ఆయన సౌత్‌లోనే కాదు హిందీలో కూడా పలు చిత్రాలు చేశారు. ఇక బాహుబలిలో ఆయన పోషించిన బిజ్జలదేవ పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఇది మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇక సినిమాల్లో కనిపించరంటే ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే సినీ పరిశ్రమ మరో గోప్ప నటుడిని మిస్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అలా చేస్తే చిరంజీవి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు: నటుడు
పాత్ర ఏదైనా సరే, దానికి ప్రాణం పోసే నటుడు నాజర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాజర్ తాజాగా చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఓ రోజు ఫిల్మ్ చాంబర్లో షూటింగ్ జరుగుతోంది. నేను హోటల్ నుంచి అక్కడికి వెళ్లి చిరంజీవి యాక్టింగ్ చూశాను. అక్కడి నుంచి తిరిగి వెళ్దామనుకునేలోపు చిరంజీవి చూసి నన్ను పిలిచారు. ఏంట్రా? ఏం చేస్తున్నావ్? అని అడిగారు. నేను హోటల్లో పని చేస్తున్నానని చెప్పాను. దానికాయన అదేంట్రా? ఇంత మంచి నటుడివి, నువ్వు హోటల్లో పని చేయడమేంటి? నెక్స్ట్ డే నువ్వు నన్ను కలవాలి అన్నాడు. కానీ నేను వెళ్లలేదు. ఆ సమయంలో నాకు సినిమా మీద పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే నెల తిరిగేకల్లా చేతికి డబ్బులిచ్చే ఉద్యోగం బెటర్ అనుకున్నాను. అందుకే సినిమాను సెకండరీగా పెట్టాను. తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యాడు. బాలచందర్ గారి వల్ల నేను విలన్ అయ్యాను. కానీ మేమిద్దరం కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మేము ఒకరి నుంచి మరొకరం ఏదీ ఆశించము. అయితే ఖైదీ నంబర్ 150లో ఇద్దరం కలిశాం. అప్పుడు చిరంజీవి.. నేను రికమెండ్ చేస్తే నీకు నచ్చదని తెలుసు అంటూనే మనం కలవడానికి ఇంత సమయం పట్టిందా? అన్నాడు. అప్పుడు మా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పట్లో చెంగల్పట్టు నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి యాక్టింగ్ స్కూల్‌కు వచ్చేవాడిని. ఉదయం ఆరు గంటలకే లంచ్ బాక్స్ తీసుకుని వచ్చేవాడిని. అంత పొద్దున అమ్మ అన్నం మాత్రమే వండేది. చిరంజీవి, ఇతర స్నేహితులు ఆంధ్ర మెస్ నుంచి భోజనాలు తెచ్చుకునేవారు. నేను అన్నం మాత్రమే తెచ్చుకోవడాన్ని ఓసారి చిరంజీవి చూశాడు. రేపటినుంచి మీ అమ్మను వంట చేయమని బాధపెట్టావంటే చంపేస్తా, ఇకపై మాతోనే కలిసి తినాలి అని చెప్పాడు. చిరంజీవిది చాలా మంచి మనసు' అని చెప్పుకొచ్చాడు నాజర్. చదవండి: విక్రమ్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే.. కమల్ హాసన్ 'విక్రమ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
ముసలోడికి దసరా పండగ ట్రైలర్ వచ్చేసింది..
నాజర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. డి. మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాజీనాయుడు, సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణ వాళ్లె నిర్మించారు. తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను నాజర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు. రమణ వాళ్లె మాట్లాడుతూ– ‘‘రెండు గంటలపాటు హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది. త్వరలో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నాకు తండ్రి సమానులైన దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణగారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు. చదవండి 👇 నటుడిని పెళ్లాడనున్న బాలీవుడ్ హీరోయిన్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
కమలహాసన్‌తో నడిగర్ సంఘ నాయకుల భేటీ
సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నాయకులు సోమవారం స్థానిక ఆళ్వార్‌పేటలో ని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. గత మూడేళ్ల క్రితం వివాదాల మధ్య జరిగిన ఈ సంఘం ఎన్నికల ఫలితాలను చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన పాండవర్ జట్టు.. తమ సంఘం ట్రస్టీ సభ్యుడిగా కమలహాసన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్ మర్యాదపూర్వకంగా కమలహాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు కమలహాసన్‌ను సంఘం ట్రస్టీ సభ్యునిగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు కమలహాసన్ కూడా అంగీకరించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటన లో నటీనటుల సంఘం నాయకులు తెలిపారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎట్టకేలకు 'నడిగర్' ఫలితాలు విడుదల, గెలిచిందెవరంటే?
చెన్నై (తమిళనాడు): దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి విజయఢంకా మోగించగా ప్రధాన కార్యదర్శిగా విశాల్ రెండోసారి గెలుపొందాడు. నడిగర్ సంఘం ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించాడు. కాగా 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. ఇందులో నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా ఒక ప్యానల్ నుంచి కె. భాగ్యరాజ్ అధ్యక్షుడిగా, గణేశన్ సెక్రటరీగా మరో ప్యానల్ నుంచి పోటీ చేశారు. ఓటింగ్‌లో హీరో విశాల్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందడంతో మద్రాస్ కోర్టు కౌంటింగ్‌ను ఆపేసింది. తాజాగా రిటైర్డ్ జడ్జి సమక్షంలో కౌంటింగ్ జరపగా మరోసారి నాజర్ ప్యానెల్ గెలుపొందింది. చదవండి: Sarkaru Vaari Paata: పెన్నీ ఫుల్ సాంగ్ వచ్చేసింది -
క్లైమాక్స్ లేకుండా రిలీజైన రానా మూవీ, ప్రేక్షకుల అసహనం..
Rana Daggubati 1945 Movie Released Without Climax: స్టార్ హీరో రానా ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు సత్య శివ 2016లో తెరకెక్కించిన చిత్రం 1945. బ్రిటీష్ పాలన నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇందులో హీరోయిన్గా రెజీన నటించగా.. నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాహుబలి సినిమా సమయంలో రానా ఈ మూవీకి కమిట్మెంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో షూటింగ్ చివరి దశలో ఉందనగా ఈ మూవీ నిర్మాత సి. కల్యాన్, దర్శకుడు సత్య శివ, రానాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రానా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో 90 శాతం పూర్తయిన షూటింగ్ ఆగిపోయింది. చదవండి: Sukumar: మణిరత్నం గారంటే అభిమానం, కానీ కలిసేందుకు వెళ్లిన నాతో సీరియస్‌గా.. ఇదిలా ఉంటే నాలుగేళ్ల తర్వాత ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్టుగానే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ ఈ మూవీని జనవరి 7న థియేటర్లో విడుదల చేశారు మేకర్స్. అయితే 1945 చూసిన వాళ్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు క్లైమాక్స్ లేదని, ఎడింగ్ కూడా సరిగా లేదు. సినిమా అంతా అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రుకటించిన వెంటనే రానా స్పందిస్తూ ట్వీట్ చేశాడు. చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్ ‘సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరగలేదు. అలాగే నిర్మాత నుంచి నాకు రావాల్సిన రెమ్యునరేషన్ అందలేదు. డబ్బుల కోసమే పూర్తికాని సినిమాను విడుదల చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు’ అంటూ రాసుకొచ్చాడు. ఇక రానా ట్వీట్ నిర్మాతలు రిప్లై ఇస్తూ.. ‘సినిమా పూర్తి అయ్యిందా లేదా అనేది దర్శకులది తుది నిర్ణయం’ అంటూ అనడంతో రానా ఒకే అన్నట్లుగా థంమ్స్ప్ ఎమోజీనితో స్పందించాడు. కాగా ఈ సినిమా సుభాశ్ చంద్రబోస్ జీవిత కథ, ఆయన మరణం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ మూవీ ఆన్లైన్ వెబ్సైట్లో లీకైంది. మూవీరూల్స్, తమిళరాక్స్ వంటి వెబ్సైట్లలోకి అందుబాటులో ఉంది. -
అక్షయ్ కుమార్ సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్!
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదిచుకున్న సత్యదేవ్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామ్‌సేతు' లో సత్యదేవ్‌కు అవకాశం వచ్చినట్లు బీటౌన్ టాక్. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుష్రత్ భారుష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావిస్తోందట చిత్ర బృందం. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి సీనియర్ నటుడు నాజర్, తెలుగు నుంచి సత్యదేవ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ చిత్ర షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రారంభమయినా కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. చదవండి :నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేసిన 'జాంబిరెడ్డి' డైరెక్టర్ -
మేము మళ్లీ పోటీ చేయడానికి రెడీ!
మేము మళ్లీ పోటీ చేయడానికి రెడీ అని తెలిపారు ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌సంఘం) కార్యవర్గం. ఈ సంఘానికి మూడేళ్లకొకసారి ఎన్నికలు జరగడం ఆనవాయితీ. గత 2015లో జరిగిన ఎన్నికల్లో నటుడు శరత్‌కుమార్, రాధారవి జట్టుపై, నటుడు నాజర్, విశాల్, కార్తీల జట్టు పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ కార్యవర్గం పదవీ కాలం గత ఏడాది అక్టోబరుతోనే ముగిసింది. అయితే సంఘ నూతన భవన నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉండడంతో ఎన్నికలను 6 నెలల పాటు వాయిదా వేశారు. అయితే ఇలా వాయిదా వేయడంపై వ్యతిరేక వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. ఇప్పటికే ఒకసారి అత్యవసరం సమావేశం నిర్వహించిన ప్రస్తుత కార్యవర్గం తాజాగా మంగళవారం సాయంత్రం మరోసారి స్థానిక టీనగర్‌లోని ఓ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసే విషయం, పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సమావేశ అనంతరం సంఘం అధ్యక్షుడు నాజర్ మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు మళ్లీ పోటీ చేస్తుందని వెల్లడించారు. కాగా ఈ ఎన్నికలను మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి పద్మనాభన్ పర్యవేక్షణలో జరగనున్నట్లు తెలిపారు. సంఘం ఎన్నికలు ఎప్పుడు? ఎక్కడ నిర్వహించాలనన్నది పద్మనాభన్ నిర్ణయం తీసుకుంటారని నాజర్ తెలిపారు. ఈ సమావేశంలో నడిగర్ సంఘ కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పొన్వన్నన్, పూచీ.మురుగన్ పాల్గొన్నారు. -
‘నోటా’ మూవీ రివ్యూ
టైటిల్ : నోటా జానర్ : పొలిటికల్ డ్రామా తారాగణం : విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్, మెహరీన్ సంగీతం : సామ్ సీయస్ దర్శకత్వం : ఆనంద్ శంకర్ నిర్మాత : జ్ఞానవేల్ రాజా అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నోటా. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. అరిమనంభి, ఇరుముగన్ సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్‌కు కూడా పరిచయం అవుతుండటంతో నోటా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల నోటా అందుకుందా..? ఈ సినిమాతో విజయ్ తన హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..? కథ ; వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్(నాజర్) కొడుకు. రాజకీయాలంటే గిట్టని వరుణ్ లండన్‌లో వీడియో గేమ్ డిజైనర్ గా పనిచేస్తుంటాడు. ఇండియాలోని కొన్ని అనాథాశ్రమాలకు మహేంద్ర (సత్యరాజ్) సహకారంతో సాయం చేస్తుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసే వరుణ్ అనుకోకుండా సీఎం కుర్చీలో కూర్చోవాల్సి వస్తోంది. తండ్రి వాసుదేవ్ ఓ కేసు విషయంలో విచారణ ఎదుర్కోవాల్సి రావటంతో రాజకీయాలతో సంబంధంలేని వరుణ్ ని అధికార పీఠం మీద కూర్చోపెట్టి వెనకుండి అంతా నడిపించాలని భావిస్తాడు వాసుదేవ్. కానీ ఆ కేసులో వాసుదేవ్‌కు శిక్షపడటం, బెయిల్‌పై తిరిగి వస్తుండగా వాసుదేవ్ మీద హత్యా ప్రయత్నం జరగటంతో వరుణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రి మీద జరిగినట్టుగానే తన మీద ఇతర కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని వెనుక వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ వర్గాలు చెపుతాయి. అదే సమయంలో కోలుకున్న వాసుదేవ్.. వరుణ్ అధికారంలో ఉండేందుకు తనను మోసం చేస్తున్నాడని భావించి పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వరుణ్ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు.? మాజీ ముఖ్యమంత్రి వాసుదేవ్ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు.? చివరకు వరుణ్ రాజకీయ నాయకుడిగానే కొనసాగాడా.. లేదా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్‌తో అభిమానులకు షాక్ ఇస్తున్నాడు విజయ్. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్, క్యారెక్టరైజేషన్‌తో మెప్పించాడు. రౌడీ సీఎం పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌లో విజయ్ నటన సూపర్బ్. మరో ప్రధాన పాత్రలో సత్యరాజ్ ఆకట్టుకున్నాడు. హీరోకు ప్రతీ విషయంలో సాయం చేసే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. మరో కీలక పాత్రలో నాజర్ జీవించారు. పార్టీ నాయకుడిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాజర్ నటన సినిమాకు మరో బలం. హీరోయిన్ మెహరీన్‌ది దాదాపు అతిధి పాత్రే. ఇతర పాత్రల్లో సంచన నటరాజన్, ప్రియదర్శి, ఎంఎస్ భాస్కర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : ఓ పొలిటికల్ డ్రామాకు విజయ్ దేవరకొండ లాంటి నటుణ్ని ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే దర్శక నిర్మాతలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకున్నాడు. తానే ప్రధాన బలంగా మారి సినిమాను నడిపించాడు. హీరోను ప్లేబాయ్‌ల పరిచయం చేస్తూ సినిమాలు మొదలు పెట్టిన దర్శకుడు ఆనంద్ శంకర్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథ ప్రారంభించాడు. వెంటనే వరుణ్ పాత్ర సీఎం కావటం తరువాత రాజకీయ పరిణామాలతో ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. విజయ్ నటన, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌ను అదే స్థాయిలో తెరకెక్కించటంలో దర్శకుడు తడబడ్డాడు. ద్వితీయార్థంలో అక్కడక్కడ కథనం నెమ్మదించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇటీవల కాలంలో తమిళ రాజకీయల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. భారీ థ్రిల్స్‌ను ఆశించిన ప్రేక్షకులను క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తుంది. సినిమాకు ప్రధాన బలం సామ్ సీయస్ మ్యూజిక్. పాటలు పరవాలేదనిపించినా సామ్ అందించిన నేపథ్య సంగీతం ప్రతీ సీన్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ దేవరకొండ నటన నేపథ్య సంగీతం డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; క్లైమాక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కేసీఆర్ బయోపిక్ ప్రారంభం
-
నేనొక్కసారి స్కెచ్ వేస్తే...
చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకునే అన్నయ్య... ఆ చెల్లి కోసం ఎంత దుర్మార్గానికైనా తెగించే అన్నయ్యగా ‘చంటి’ సినిమాలో కనిపించినా, ప్రత్యర్థి కోసం ఆకలాకలిగా ఎదురుచూసే ప్రతినాయకుడిగా ‘దమ్ము’లో కనిపించినా, బిజ్జలదేవునిగా శకుని తరహా విలనిజంతో ‘బాహుబలి’లో భయపెట్టినా... తనదైన విలనిజాన్ని చాటుకుంటున్నారు నాజర్. ‘‘నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను’’ అనగానే... ‘‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా సినిమాలేమిటి?’’ అనే తల్లిదండ్రులనే చూస్తుంటాం. నాజర్ విషయంలో మాత్రం సీన్ రివర్స్.కడుపులో చల్ల కదలకుండా, డబ్బులకు ఇబ్బంది పడకుండా ఉండే ఉద్యోగం చేయాలనేది నాజర్ కల. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం ద్వారా తన కలను నెరవేర్చుకున్నాడు నాజర్. అయితే నాజర్ ఉద్యోగం చేయడం తండ్రికి నచ్చలేదు. కొడుకును నటుడిగా చూడాలనేది ఆయన కల. అయితే నాజర్‌కు మాత్రం ఎప్పుడూ నటన మీద ఆసక్తి లేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు పండగల సందర్భాల్లో నాటకాల్లో నటించడం తప్ప... నటన గురించి నాజర్‌కు పెద్దగా తెలియదు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనకు ఒక స్థిరమైన ఉద్యోగం అవసరం అనుకున్నారు నాజర్. అందుకే ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగంలో చేరినప్పుడు చాలా సంతోష పడ్డారు. కానీ నాన్న ఆలోచన వేరుగా ఉంది. ‘‘నీ గురించి ఎన్నో కలలు కంటే ఇలా చేస్తావా!’’ అన్నారు ఆయన బాధ పడిపోతూ. ఇక చేసేదేమి లేక ఉద్యోగానికి రాజీనామా చేశారు నాజర్. ‘‘సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తాను’’ అన్నారు తండ్రితో. ‘‘అలా ఎలా కుదురుతుంది. శిక్షణ తీసుకోకుండా సినిమాల్లో ఎలా నటిస్తావు? నువ్వు నటనలో తప్పకుండా శిక్షణ తీసుకోవాల్సిందే’’ అని కాస్త గట్టిగానే చెప్పారు తండ్రి. అప్పుడుగానీ అర్థం కాలేదు. తన తండ్రి తన విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నాడో. ఎలాగైనా సరే, తండ్రి కలను నిజం చేయాలనుకున్నారు. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. కె.బాలచందర్ ‘కళ్యాణ అగతిగల్’ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం కాస్త నిరాశకు గురైనా అంతలోనే తేరుకున్నారు. ‘కళ్యాణ అగతిగల్’ సినిమా ఫెయిల్యూర్ నాజర్ కెరీర్‌కు అడ్డంకేమీ కాలేదు. ఈ సినిమా తరువాత విలనీ ఛాయలు ఉన్న పాత్రలు చేసి శబ్భాష్ అనిపించుకున్నారు. మణిరత్నం సినిమా ‘నాయకన్’తో నాజర్‌కు మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ‘విలన్ లేనిది హీరో లేడు’ అని చెప్పే నాజర్ ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు. -
హాలీవుడ్లో...
తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటిస్తూ జాతీయ స్థాయి నటుడిగా అందరికీ సుపరిచితుడైన నాజర్ మళ్లీ ఓ హాలీవుడ్ చిత్రంలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన ‘ఫెయిర్ గేమ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. ‘సోలార్ ఎక్లిప్స్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ హాలీవుడ్ చిత్రం భారత స్వాతంత్య్ర పోరాట కాలం నేపథ్యంలో సాగుతుందట. అశోక్ అనే పోలీసాఫీసర్‌గా ఈ చిత్రంలో నటించనున్నానని నాజర్ తెలిపారు. -
కావ్య తలైవన్ చిత్రంలో సిద్దార్థ గెటప్స్
-
విభిన్నపాత్రలతో ఆలరించిన సిద్ధార్థ్
గతంలో లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితులైలన సిద్ధార్థ్ ప్రస్తుతం విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నారు. జిగర్ తాండ్ (చిక్కడు దొరకడు) చిత్రంతో ఓ డిఫరెంట్ లుక్, విభిన్నమైన పాత్రను పోషించి వరుస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. జిగర్ తాండ తర్వాత కావ్య తలైవన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కావ్య తలైవన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. కావ్య తలైవన్ ఆడియో ఆవిష్కరణ నేపథ్యంలో ఆ చిత్రంలోని కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కావ్య తలైవన్ చిత్రంలోని సిద్దార్థ గెటప్స్ చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. వివిధ గెటప్ లో ఉన్న స్టిల్స్ నటుడిగా సిద్ధార్థను కొత్త ఆవిష్కరించే విధంగా ఉన్నాయి. వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రహ్మన్ అందిస్తున్నారు. సిద్ధార్థ తోపాటు పృథ్వీరాజ్, నాజర్, వేదిక, అనైక సోటిలు నటిస్తున్నారు. -
శైవం మూవీ ఆడియో ఆవిష్కరణ
-
'యామిని చంద్రశేఖర్' మూవీ స్టిల్స్