విభిన్నపాత్రలతో ఆలరించిన సిద్ధార్థ్
గతంలో లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితులైలన సిద్ధార్థ్ ప్రస్తుతం విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నారు.
గతంలో లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితులైలన సిద్ధార్థ్ ప్రస్తుతం విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నారు. జిగర్ తాండ్ (చిక్కడు దొరకడు) చిత్రంతో ఓ డిఫరెంట్ లుక్, విభిన్నమైన పాత్రను పోషించి వరుస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. జిగర్ తాండ తర్వాత కావ్య తలైవన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
కావ్య తలైవన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. కావ్య తలైవన్ ఆడియో ఆవిష్కరణ నేపథ్యంలో ఆ చిత్రంలోని కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కావ్య తలైవన్ చిత్రంలోని సిద్దార్థ గెటప్స్ చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. వివిధ గెటప్ లో ఉన్న స్టిల్స్ నటుడిగా సిద్ధార్థను కొత్త ఆవిష్కరించే విధంగా ఉన్నాయి. వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రహ్మన్ అందిస్తున్నారు. సిద్ధార్థ తోపాటు పృథ్వీరాజ్, నాజర్, వేదిక, అనైక సోటిలు నటిస్తున్నారు.