Prithviraj
-
మెరిసిన పృథ్వీరాజ్
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పుదుచ్చేరితో జరుగుతున్న పోరులో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 209/5తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పుదుచ్చేరి జట్టు 79 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆంధ్ర జట్టుకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పుదుచ్చేరి బ్యాటర్ అమాన్ ఖాన్ (50) అర్ధశతకం సాధించాడు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 5 వికెట్లు పడగొట్టగా... విజయ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొహమ్మద్ రఫీ, శశికాంత్, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కరణ్ షిండే (136 బంతుల్లో 86 బ్యాటింగ్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో సత్తా చాటగా... శ్రీకర్ భరత్ (41; 7 ఫోర్లు), షేక్ రషీద్ (26; 3 ఫోర్లు), రికీ భుయ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్), శశికాంత్ (39 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు ఓవరాల్‌గా 291 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 303; పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్: శ్రీధర్ రాజు (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 0; జయ్ పాండే (బి) పృథ్వీరాజ్ 3; పారస్ (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 39; ఆకాశ్ (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 7; మోహిత్ కాలె (సి) రషీద్ (బి) పృథ్వీరాజ్ 60; అరుణ్ కార్తీక్ (సి) రికీ భుయ్ (బి) పృథ్వీరాజ్ 59; అమాన్ ఖాన్ (సి) రికీ భుయ్ (బి) లలిత్ మోహన్ 50; అంకిత్ శర్మ (సి) శ్రీకర్ భరత్ (బి) విజయ్ 13; సాగర్ (సి) రషీద్ (బి) విజయ్ 0; అబిన్ మాథ్యూ (నాటౌట్) 4; గౌరవ్ యాదవ్ (సి) అభిషేక్ రెడ్డి (బి) రఫీ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (79 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–20, 4–84, 5–148, 6–225, 7–237, 8–238, 9–241, 10–260, బౌలింగ్: పృథ్వీరాజ్ 23–5–64–5; మొహమ్మద్ రఫీ17–1–53–1; శశికాంత్ 15–0–57–1; లలిత్ మోహన్ 16–2–42–1; విజయ్ 8–0–36–2. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) గౌరవ్ యాదవ్ 15; శ్రీకర్ భరత్ (ఎల్బీ) (బి) అంకిత్ శర్మ 41; షేక్ రషీద్ (రనౌట్) 26; కరణ్ షిండే (బ్యాటింగ్) 86; రికీ భుయ్ (సి) (సబ్) సీజీడీ శాస్త్రి (బి) అమన్ ఖాన్ 32; హనుమ విహారి (సి) శ్రీధర్ రాజు (బి) అంకిత్ శర్మ 0; శశికాంత్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (69 ఓవర్లలో 5 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–24, 2–81, 3–82, 4–141, 5–142, బౌలింగ్: గౌరవ్ యాదవ్ 10–1–49–1; అబిన్ మాథ్యూ 11–3–34–0; సాగర్ 21–3–72–0; అంకిత్ శర్మ 22–3–56–2; అమాన్ ఖాన్ 3–0–25–1; ఆకాశ్ 2–1–11–0. -
డేంజర్ జోన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అతడి ఎలిమినేషన్ పక్కా?
తెలుగు బిగ్‌బాస్ షోలో 12వ వారం చివరకొచ్చేసింది. లెక్క ప్రకారం గతవారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. ఇక అయిపోతుంది అనుకునేలోపు నబీల్.. తన దగ్గరున్న ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించడంతో బతికిపోయారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చిన.. ఈ వారం నామినేషన్స్ పూర్తిచేశారు. అలా అందరూ కన్నడ బ్యాచ్‌ని టార్గెట్ చేసి వాళ్లందరూ నామినేషన్స్‌లో ఉండేలా చేశారు. మరి ఈసారి వీళ్లలో ఎవరు బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది?12వ వారం నామినేషన్స్‌లో కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ, నిఖిల్, యష్మి, పృథ్వీ ఉన్నారు. వీళ్లతో పాటు నబీల్ కూడా ఉన్నాడు. వీళ్లలో ప్రస్తుతం ప్రేరణ.. ఓటింగ్‌లో టాప్‌లో కొనసాగుతోంది. దాదాపు 26 శాతం ఓట్లతో ఈమె లీడింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడట. అలా వీళ్లిద్దరూ టాప్ ప్లేయర్స్ అనిపించుకున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)వీళ్ల తర్వాత అంటే మూడో స్థానంలో యష్మి, నాలుగో స్థానంలో నబీల్ ఉన్నట్లు సమాచారం. చిట్టచివరగా పృథ్వీ ఉన్నాడట. చివరి రెండు స్థానాల్లో ఉన్న నబీల్, పృథ్వీ మధ్య ఓటింగ్ పరంగా 3 శాతం మాత్రమే వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. అంటే పృథ్వీతో పాటు నబీల్ డేంజర్ జోన్లో ఉన్నట్లేగా!ఈ సీజన్లో వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు పృథ్వీ. కానీ నామినేట్ అయిన ప్రతిసారి ఎలాగోలా తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం ఎలిమినేషన్ గ్యారంటీ అనిపిస్తుంది. ఒకవేళ ఇతడు సేవ్ అయితే మాత్రం నబీల్ బయటకెళ్లిపోతాడు. మరి ఈవారం ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ) -
తుదిదశలో ఎంపురాన్
మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘లూసిఫర్’ (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కూడా మోహన్‌లాల్ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మేజర్ పార్టు చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ‘ఎల్ 2 :ఎంపురాన్’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, ఫైనల్ షెడ్యూల్ మొదలైందని పృథ్వీరాజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ప్యాచ్ వర్క్స్‌తో సహా డిసెంబరులోపే మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలన్నది పృథ్వీరాజ్ టార్గెట్ అని మాలీవుడ్ సమాచారం. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తున్న ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా 2025 మార్చి 25న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. -
పృథ్వీ వంకర చూపులు.. బిగ్‌బాస్‌లో గలీజు ప్రవర్తన!
నలుగురు చూసే షోలో ఉన్నప్పుడు కాస్త ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఆడుతున్న పృథ్వీకి అలాంటి లక్షణాలు అసలు లేవనిపిస్తుంది. ఎందుకంటే గతవారం అవినాష్ భార్య గురించి చీప్ కామెంట్స్ చేశాడు. నామినేషన్స్‌లో ప్రేరణని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రోహిణితో గలీజుగా ప్రవర్తించాడు.(ఇదీ చదవండి: ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా)ఏడో వారం మణికంఠ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఎప్పటిలానే ఎనిమిదో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. దిష్టిబొమ్మకు కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. మణికంఠ విషయంలో మెహబూబ్‌కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సిందనే కారణంతో విష్ణుప్రియ.. నిఖిల్‌ని నామినేట్ చేసింది. ఫుడ్ విషయంలో ప్రేరణని కూడా నామినేట్ చేసింది. అనంతరం పృథ్వీని నామినేట్ చేసిన రోహిణి.. రూల్స్ అసలు వినట్లేదని, చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావని కారణాలు చెప్పింది. గతవారం జరిగిన ఓవర్ స్మార్ట్ గేమ్ గురించి ప్రస్తావించి కేబుల్ మొదట్లోనే మడతపెట్టి జేబులో పెట్టేస్తా ఎలా? అని ప్రశ్నించింది. అది నా స్ట్రాటజీ అని పృథ్వీ చెప్పడంతో.. అలాంటప్పుడు గేమ్ ఎక్కడ మొదలవుతుంది, గేమ్ ఆడకుండా స్ట్రాటజీ అంటే ఎలా? అని వరసగా సరైన కౌంటర్లు వేసేసరికి పృథ్వీ సైలెంట్ అయిపోయాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)తనవంతు వచ్చేసరికి రోహిణిని పృథ్వీ నామినేట్ చేశాడు. ఆటలో మీరు జీరో అనిపిస్తున్నారని కారణం చెప్పాడు. ఆటలో ఎఫర్ట్స్ పెట్టట్లేదా? అని రోహిణి అడిగితే.. అలా కాదని అన్నాడు. ఇదంతా చూస్తుంటే పృథ్వీ పగతో చేసిన నామినేషన్లా అనిపించింది తప్పితే సరైన కారణమే కనిపించలేదు. చివర్లో మాటామాటా పెరిగిన టైంలో రోహిణిని పై నుంచి కిందవరకు పృథ్వీ ఆదో రకంగా చూశాడు. అలా చూడటం నాకు నచ్చలేదని చెప్పి రోహిణి పెద్ద గొడవే పెట్టుకుంది.బిగ్‌బాస్ షోలో పృథ్వీ ప్రవర్తన రోజురోజుకీ దిగజారుతోంది. గతవారం అవినాష్‌తో మాట్లాడుతూ మీ భార్యనే షోకి పంపాల్సింది అనడం గానీ.. తను నామినేట్ అయ్యేలా చేసిందని చెప్పి ప్రేరణని మానసికంగా వేధించడం గానీ చూస్తుంటే పృథ్వీకి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనిపిస్తుంది. అసలు ఇతడిని బిగ్‌బాస్ నిర్వహకులు ఇన్నాళ్లు ఎందుకు భరిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?) -
Bigg Boss 8: పదమూడో వారం పృథ్వీ ఎలిమినేట్
పృథ్వీరాజ్ సీరియల్ నటుడు. నాగపంచమి సీరియల్‌తో బుల్లితెర హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ రియాలిటీ షో గురించి మాట్లాడుతూ.. ఎక్స్పీరియన్స్ కోసం బిగ్‌బాస్ వస్తున్నానంటున్నాడు. అలాగే డబ్బు, పేరు కూడా ముఖ్యమేనని చెప్తున్నాడు. ప్రస్తుతం తాను సింగిల్ అని చెప్పాడు.టాస్కుల్లో తనకు తిరుగులేదన్నట్లుగా ఆడిన పృథ్వీ ఫినాలేకు రెండడగుల దూరంలో ఆగిపోయాడు. పదమూడోవారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా తేజతో పాటు హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు. -
పృథ్వీరాజ్ కు బిగ్ షాక్
-
కల్లర్ మ్యాజిక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్‌గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్‌గా, ట్యాన్ అయిన స్కిన్‌తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్‌పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్‌లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్‌లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్‌లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్‌లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ అంతా బ్లాక్‌గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్‌లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్‌లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్‌హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్‌లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్‌లో కనిపిస్తారు. -
సాలార్ ట్రైలర్ పై మిక్స్ రియాక్షన్ కి కారణం ఇదే..
-
'డిప్రెషన్లోకి వెళ్లిపోయా.. రెండో భార్య వచ్చాక లైఫ్ మారిపోయింది'
సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకంటే వయసులో చాలా చిన్నదైనా శీతల్‌ను ఆయన పెళ్లాడిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: సెన్సార్ బోర్డుకు లంచం.. విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు!) పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. 'లైఫ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. బీనా, నేను ఎప్పుడు వాదనకు దిగేవాళ్లం. ఫస్ట్ తాను నా బెస్ట్ ఫ్రెండ్. వైఫ్ అయిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా ఇద్దరి మధ్య ఆర్గుమెంట్స్ ఎక్కువ జరిగేవి. అంతే కాకుండా నా కుమారుడికి ఆటిజం ఉంది. కొడుకుతో నేను ఎక్కువ సమయం కేటాయించేవాడిని. నాతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు. నన్ను బాగా అర్థం చేసుకునేవాడు. నేను ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు కుమారుడిని చూస్తే చాలు. ఒక్కోసారి దేవుడు నా ఇలాంటి కొడుకును ఇచ్చాడే అని బాధపడేవాణ్ని. డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయా. చాలా కోపంగా కూడా ఉండేది. కానీ శీతల్‌తో నా కుమారుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.' అని అన్నారు. (ఇది చదవండి: ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్) రెండో భార్య శీతల్ గురించి మాట్లాడుతూ..'శీతల్ వచ్చాక నా లైఫ్ మారిపోయింది. ఆ అమ్మాయికి దైవభక్తి ఎక్కువ. చిన్న వయసే అయినప్పటికీ ఫుల్ మెచ్యూరిటీ మైండ్. తనకు బాగా క్లారిటీ ఉంది. ఆమె వచ్చాకే నా కెరియర్, లైఫ్ పూర్తిగా మారిపోయింది. అని అన్నారు. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్లి కాగా, కొంతకాలం క్రితమే విడాకులు తీసుకున్నారు. -
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్‌కు అస్వస్థత
-
ISSF Shotgun World Cup 2023 Doha: పృథ్వీరాజ్‌కు కాంస్యం
దోహాలో జరుగుతున్న వరల్డ్ కప్ షాట్‌గన్ షూటింగ్లో భారత ఆటగాడు పృథ్వీరాజ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో అతను 20 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఒగుజాన్ టుజున్ (టర్కీ–33 పాయింట్లు), కోవార్డ్ హాలీ (బ్రిటన్–30 పాయింట్లు)కు స్వర్ణ, రజతాలు దక్కాయి. మరో వైపు మహిళల విభాగంలో శ్రేయాన్షి సింగ్ పతకావకాశాలు కోల్పోయింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించిన శ్రేయాన్షియ ఆపై ముందంజ వేయడంలో విఫలమైంది. -
ప్రేక్షకుల్లేక స్టార్ హీరో మూవీ రద్దు!
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పృథ్వీరాజ్’. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడదలైన ఈ మూవీ వారానికే బాక్సాఫీసు వద్ద బోల్తా పడిందిన వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లో ప్రేక్షకులు లేకపోవడంతో మూవీ ప్రదర్శనను నిలిపివేసినట్లు బి-టౌన్ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిం నిర్మించాయి. భారీ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ సినిమాను రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. చదవండి: పాన్ ఇండియా చిత్రాలకు ఎందుకన్ని వందల కోట్లు?: తమ్మారెడ్డి భరద్వాజ్ పలు వాయిదాల అనంతరం రిలీజ్ అయిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల అనంతరం ఈ చిత్రం ఆశించిన స్థాయితో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ మూవీకి ఇప్పటి వరకు రూ. 55 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక మూవీపై పెద్దగా టాక్ లేని నేపథ్యంలో నేటి షో చూసేందుకు ఒక్కరు కూడా రాకపోవడంతో ఓ థియేటర్లో షోని రద్దు చేశారట. ఇక మరికొన్ని చోట్ల థియేటర్లో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా ఉండటంతో ఇక ‘పృథ్వీరాజ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేశారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా జూన్ 3న ఈ మూవీ హిందీ, తమిళంతో పాటు తెలుగులో విడుదలైన సంగతి తెలిసిందే. చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ -
మొదటిసారి విన్నప్పుడే ప్రేమలో పడ్డాను: అక్షయ్ కుమార్
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం "పృథ్వీరాజ్". ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. ఢిల్లీ సామ్రాజ్యంపై క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుంచి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో నుంచి "హరి హర్" అనే మొదటి సాంగ్‌ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "హరి హర్ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది. మహమ్మద్ ఘోరీతో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పృధ్వీరాజ్ చౌహాన్‌కి నా వందనం. దేశాన్ని రక్షించాలనే పృధ్వీరాజ్ బలమైన పట్టుదల ఈ పాటలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పాట నా మనుసుకి లోతుగా హత్తుకుంది. మొదట సారి విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డాను" అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ "చాణక్య"ని తెరకెక్కించిన డా. చంద్రప్రకాష్ ద్వివేది "పృథ్వీరాజ్" సినిమాకి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ భార్య సంయోగిత పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన హిందీ, తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్, సర్కారువారి పాటపై ప్రేక్షకుల రివ్యూ -
వివాదంలో అక్షయ్ కుమార్ చిత్రం.. దిష్టిబొమ్మ దహనం
బాలీవుడ్ కిలాడి హీరో అక్షయ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పృథ్వీరాజ్ సినిమాకు వ్యతిరేకంగా చంఢీగఢ్‌లో ఆందోళనలు చేపట్టారు. గతంలో జోధా అక్భర్, పద్మావతి సినిమాలు వివాదంలో చిక్కుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. కొంచెం అలాంటి వివాదమే ఇప్పుడు పృథ్వీరాజ్‌ను చుట్టుముట్టింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ మార్చాలని కోరుతూ అఖిల భారతీయ క్షత్రియ మహాసభ నేతృత్వంలోని నాయకులు నిరసనలు చేపట్టారు. అంతేగాక అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘంలోని వ్యక్తులు మాట్లాడుతూ.. సినిమా పేరు కేవలం పృథ్వీరాజ్‌గా ఉండకూడదని.. పూర్తి పేరు ‘హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ లేదా ‘చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహన్’గా ఉండాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహన్ చివరి హిందూ చక్రవర్తి అని, అలాంటి సందర్భంలో ఈ చిత్రం పేరు అతని పేరుకు పూర్తి గౌరవం ఇవ్వాలని కోరారు. అదే విధంగా సినిమా విడుదలకు ముందే దీనిని క్షత్రియ, రాజ్‌పుత్ సమాజ ప్రతినిధులకు చూపించాలని కోరారు. అందువల్ల ఈ చిత్రంలో ఏదైనా వివాదం ఉందా అని, చిత్రం చరిత్రను దెబ్బతీస్తుందా అనే విషయం తెలుస్తుందని, అప్పుడే ఆ సన్నివేశాలను తొలగించేదుకు కోరవచ్చని అన్నారు. అయితే పృథ్వీరాజ్ సినిమా నిర్మాత, దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన అన్న వివాదాలను తొలగించాలని, లేకపోతే క్షత్రియ సమాజ్.. పద్మావతి, జోధా అక్బర్ సినిమాలకు ఎదురైన పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చిత్ర నిర్మాత, దర్శకుడితోపాటు స్టార్ అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. చదవండి: ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను: అక్షయ్ కుమార్ -
కురుడన్ ట్యూన్!
ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘అంధా ధున్’. హిందీలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోంది. తమిళ రీమేక్‌లో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మలయాళంలోనూ రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ మలయాళ రీమేక్‌లో ఆయుష్మాన్ పాత్రను పృథ్వీరాజ్ చేయనున్నారట. ఆయుష్మాన్ సినిమాలో అంధుడిగా నటించారు. అంధుడు అంటే మలయాళంలో కురుడన్. ‘అంధా ధున్’ అంటే ‘బ్లైండ్ ట్యూన్’ అని అర్థం. సో.. మలయాళంలో ‘కురుడన్ ట్యూన్’ అన్నమాట. ఇక హిందీలో టబు పోషించిన పాత్రలో మమతా మోహన్‌దాస్ కనిపిస్తారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. -
నాన్‌స్టాప్ కుమార్
లాక్డౌన్లో సినిమాల చిత్రీకరణను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేయాలా? అని చాలామంది ఆలోచిస్తుంటే ‘బెల్ బాటమ్’ సినిమాను ప్రారంభించారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ప్రారంభించడమే కాదు లాక్డౌన్లో పూర్తి చేసేశారు కూడా. తాజాగా ‘పృథ్వీరాజ్’ సినిమా సెట్లో జాయిన్ అయ్యారు. అక్షయ్ కుమార్, సోనూ సూద్, మనూషీ చిల్లర్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్న పీరియాడికల్ చిత్రం ఇది. యశ్ రాజ్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ప్రారంభం అయింది. సోనూ సూద్, అక్షయ్ కుమార్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల్లో మనూషీ కూడా సెట్లో జాయిన్ అవ్వనున్నారు. సినిమా పూర్తయ్యే వరకూ నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ కొనసాగనుంది. ఇలా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్న అక్షయ్ కుమార్‌ని కొందరు ‘నాన్‌స్టాప్ కుమార్’ అంటున్నారు. -
ఆ కాల్ వస్తుందని ఊహించలేదు..
క్రికెట్ కిక్.. ఐపీఎల్ ఉత్కంఠ కొనసాగుతోంది. జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రత్యేక్షంగా చాలా మంది ప్రత్యేక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. అయినా పిల్లల నుంచి పెద్దల వరకు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ టోర్నీలో కుర్రోళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఆంధ్రా కుర్రోడు పృథ్వీరాజ్‌కి సన్‌రైజర్స్ జట్లులో ఆడే అదృష్టం దక్కింది. సాక్షి, తెనాలి: యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్–2020లో పేసర్ భువనేశ్వర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంపికైన యర్రా పృథ్వీరాజ్ తెనాలి కుర్రోడు. తొడ కండరాల గాయంతో భువనేశ్వర్ ప్రసాద్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించగా, అతడి స్థానంలో 22 ఏళ్ల ఎడమచేతి వాటం పేస్ బౌలర్ పృథ్వీరాజ్‌కు అవకాశం లభించింది. గతేడాది ఐపీఎల్‌కు ఆడిన అనుభవం, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న అతడిని భువికి సరైన ప్రత్యామ్నాయంగా జట్టు భావించింది. కరోనా కారణంగా జట్టుతో పాటే ‘బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్’ (బయో బబుల్)లో ఉంటున్నందున క్వారంటైన్‌తో పని లేకుండానే పృథ్వీరాజ్ జట్టులో ఆడనున్నాడు. చదవండి: (భువీ స్థానంలో పృథ్వీ రాజ్ యర్రా) ఎడమ చేతివాటం పేసర్‌గా.. దక్షిణ భారతదేశం నుంచి ఏకైక ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ అయిన పృథ్వీరాజ్ స్వస్థలం తెనాలి సమీపంలోని దుగ్గిరాల. తల్లి జంపాల కృష్ణకుమారి. విశాఖపట్టణంలో ఏపీ ఈడీపీసీఎల్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా చేస్తున్నారు. తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్ ఇంజినీరు/ ప్రభుత్వ కాంట్రాక్టరు. తల్లి ఉద్యోగం కారణంగా విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్ ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. తండ్రికి కజిన్ అయిన ఆంధ్రా యూనివర్సిటీ హెచ్ఓడీ, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్.విజయమోహన్ తొలి గురువుగా క్రికెట్ సాధన చేశాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి అండర్–14 నుంచి ఆంధ్రా జట్టుకు వివిధ వయసు విభాగాల్లో ఆడుతూ వచ్చాడు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్ జాతీయ పోటీలకు ఆడిన జట్టును కెప్టెన్‌గా నడిపించాడు. 19 ఏళ్లకే రంజీ ట్రోఫీకి.. 2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. చిదంబరం స్టేడియంలో తమిళనాడుతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై మరో ఆరు వికెట్లు తీశాడు. 2018 జూలైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్వహించిన స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ క్యాంప్‌కు దేశవ్యాప్తంగా ఏడుగురు ఎంపిక కాగా, అందులో పృథ్వీరాజ్ ఒకరు. శిక్షణ అనంతరం ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో ఇండియా రెడ్ టీమ్‌కు ఆడాడు. అదే ఏడాది బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్ ఫైనల్‌కి ఆడాడు. ఐపీఎల్‌కు.. ఆ క్రమంలోనే పృథ్వీరాజ్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. గతేడాది ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసినా, తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్ మ్యాచ్‌లో జట్టులో బెర్త్ దక్కటంతో, అదే మ్యాచ్‌లో మెయిడన్ వికెట్‌గా వార్నర్‌ను బౌల్డ్ చేసి వార్తల్లో నిలిచాడు. అంతకుముందు మూలపాడులో నిర్వహించిన బీసీసీఐ సయ్యద్ ముస్తాఫ్ ఆలీ టీ20 టోర్నమెంటులో జార్ఖండ్‌పై నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మొత్తం ఇప్పటి వరకు 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీశాడు. టోర్నీ ఆసాంతం 140–150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయటం, రెండువైపులా స్వింగ్ చేయటం, మెరుపుల్లాంటి బౌన్సర్లు వేయగల నేర్పు పృథ్వీరాజ్‌కు ఉన్నాయి. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆ కాల్ వస్తోందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ ప్రతిభతోనే టీమిండియా ప్రాతినిధ్యం వహించి ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలవాలన్నది అతడి లక్ష్యమని తండ్రి శ్రీనివాసరావు ‘సాక్షి’కి ఫోనులో చెప్పారు. -
పృథ్వీరాజ్ ‘ 81
ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు మలయాళ నటుడు పృథ్వీరాజ్. తాజాగా ఆయన ‘కరాచీ 81’ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో ఐదారు గెటప్స్‌లో కనిపిస్తారట. కేయస్ బావ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 1971 ఇండియా–పాకిస్థాన్ యుద్ధం తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో పృథ్వీరాజ్ రా ఏజెంట్ పాత్రలో నటించనున్నారు. సినిమాలో కొంత భాగం వరకూ 81 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారు. ఆయన లుక్‌ను కూడా విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా
తిరుపతి సెంట్రల్/సాక్షి, హైదరాబాద్: శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఓ మహిళతో పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు రావడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సదరు ఆడియో టేపుల్లోని వాయిస్ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో అనుచిత ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీవారి క్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పృథ్వీరాజ్‌ను రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిసింది. తప్పు చేశానని తెలిస్తే చెప్పుతో కొట్టండి: పృథ్వీ తనపై వచ్చిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీ చెప్పారు. తప్పు చేశానని తెలిస్తే తన చెప్పుతో తనను కొట్టండని అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మహిళా ఉద్యోగితో తాను అసభ్యంగా మాట్లాడినట్టుగా ప్రచారమవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. శ్రీవారిపై ఒట్టేసి చెపుతున్నానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన వాయిస్ లేకుండా చేయాలనే ఇంత పెద్ద కుట్రపన్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై తానే విజిలెన్స్ విచారణ వేసుకున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ సిద్ధాంతాలకు కట్టుబడి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గౌరవించి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజధాని రైతులను ఉద్దేశించి తాను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదన్నారు. తన వ్యాఖ్యలు రైతుల మనస్సులను నొప్పించి ఉంటే క్షమాపణ చెçపుతున్నానని అన్నారు. -
ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే తెలియదు?
సాక్షి, కాకినాడ: తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తాము ఒట్టు పెట్టుకున్నట్టు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. రాజకీయాల విషయంలో సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి కానీ, వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే మంచి సీఎంగా వైఎస్ జగన్ పేరు తెచ్చుకుంటున్నారుని కొనియాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడకెళ్ళినా ప్రజలు జగన్ పరిపాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాకినాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ళలో ఎందుకు ప్రశ్నించలేదు? వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా ఒప్పుకోనని పవన్ కళ్యాణ్ అనడాన్ని తప్పుబట్టారు. ప్రజలు 150కిపైగా సీట్లతో వైఎస్ జగన్‌ను సీఎంను చేశారని, ఇంకా పవన్ ఒప్పుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానంటున్నా పవన్.. గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఒక్కసారి కూడా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. హిందు దేవాలయాల్లో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం జరగడంలేదని, ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. దిశ అత్యాచారం కేసులో నిందితులను నడిరోడ్డుపై తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాము వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం లేదని, అయినా మిగతా పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రానున్న 30 ఏళ్ళలోనూ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. -
దోపిడీని భరించలేకే 23 సీట్లు: పృథ్వీరాజ్
సాక్షి, విజయవాడ: వరద ఉధృతి కారణంగానే ఇసుక అందుబాటులో లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అన్నారు. ఇసుక రీచ్‌లో ఉన్న వాస్తవ పరిస్థితులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలను అతిక్రమించి టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా దోచేశారని విమర్శించారు. 90 రోజుల నుంచి కృష్ణానది వరద ప్రవహిస్తోందన్నారు. ‘పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్, చంద్రబాబు దీక్షలో కేవలం రాజకీయం కోణమే ఉందని’ పృథ్వీరాజ్ ఆరోపించారు. ఇసుకపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వరదల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని ప్రజలందరికీ తెలుసునన్నారు. దీనిపై చంద్రబాబు, పవన్ రాద్ధాంతం చేయటం పద్ధతి కాదని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ర్యాంప్‌లకు రోడ్లు వేసారు కానీ, గ్రామాల్లో ప్రజల కోసం రోడ్లు వేయలేదని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతకు గత ప్రభుత్వమే కారణమని.. ఈ దోపిడీని భరించలేకే ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. -
ఇండస్ట్రీలో నాపై కక్షసాధింపులు మొదలయ్యాయి: పృథ్వీరాజ్
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీరాజ్ తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో రాఘవేందర్‌రావుతోపాటు పలువురు ఎస్వీబీసీ చైర్మన్లుగా ఉన్నారని, వారి హయాంలో ఏమైనా అక్రమాలు జరిగితే.. విచారణ తప్పదని పృథ్వీ స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎస్వీబీసీ కోసం నిబద్ధతతో పనిచేస్తానని, రాఘవేందర్రావుతో ఈ విషయంలో తనకు ఎలాంటి పోటీలేదని తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాక చిత్ర పరిశ్రమలో తనపై కక్షసాధింపులు మొదలయ్యాయని, సినిమాల కోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లు కొంతమంది వెనక్కి తీసుకున్నారని పృథ్వీరాజ్ వెల్లడించారు. ఈ పదవి రావడం పూర్వజన్మ సుకృతం ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులవ్వడం తన పూర్వజన్మ సుకృతమని పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారికి ఇలా సేవ చేసుకుంటానని తాను కలలో కూడా అనుకోలేదని పేర్కొన్నారు. జులై 28వ తేదీన ఎస్వీబీసీ చైర్మన్‌గా పదవీ స్వీకారా ప్రమాణం చేశానని తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపారు. ఎస్వీబీసీ చానల్ ఆధ్యాత్మికతను కాపాడుతానని, చానెల్‌ను దేశంలో నంబర్ వన్ చానల్‌గా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ చానెల్‌ను నిబద్ధతతో నడిపిస్తానని తెలిపారు. ఈ పదవి తనకు అప్పగించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన పోసాని కృష్ణమురళి తనకు అన్నయ్య లాంటి వారని అన్నారు. పోసాని నిజాయితీ గల వ్యక్తి అని కొనియాడారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడను! ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, అమరావతిలోనే రాజకీయాలు మాట్లాడుతానని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా రాజకీయలకు అతీతంగా పనిచేస్తానని, భక్తుల మనోభావాలను కాపాడుతానని తెలిపారు. నటుడు శివాజీ చంద్రబాబుకు భజన చేశాడని, ఆయనకు మాట మీద నిలకడ లేదని పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ వైస్సార్సీపీ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
త్వరలో పేదవాడి రాజ్యం
తిరుమల: పేదవాడి రాజ్యం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ పృథ్వీరాజ్ తిరుమలేశునికి బుధవారం తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అత్యధిక స్థానాలు రావాలని, జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. జగన్ సీఎం అయితే ప్రజారంజక పాలన, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. టీడీపీ కథ ముగిసిందని అన్నారు. టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఒక్కరూ గెలవరని పృథ్వీరాజ్ చెప్పారు. కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా బుధవారం తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
నటులంతా ఒకటవుదాం.. జగన్‌ను సీఎం చేద్దాం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సినీ కళాకారులంతా ఒక్కటవుదాం..జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలన్నా..కళాకారుల జీవితాలు బాగుండాలన్నా అది జగన్మోహన్రెడ్డితోనే ముడిపడి ఉందని చెప్పారు. వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణ, దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్‌ను గెలిపిం చాలంటూ..విశాఖ సినీకళాకారుల ఆత్మీయ సదస్సు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. సినీ నటుడు పృథ్వీ మాట్లాడుతూ వైఎస్సార్ అంటే ప్రాణమని..జగన్ అంటే పంచ ప్రాణాలని తెలిపారు. 2014 ఎన్నికల్లో ఓ పక్క పవన్..మరో పక్క మోదీని పట్టుకుని లేనిపోని వాగ్ధానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం యువభేరీలు, ఆమరణదీక్షలు చేసిన మహోన్నత వ్యక్తి జగన్ అని చెప్పారు. ప్రత్యేక హోదా అనేవారిని అరెస్టులు చేయ్యాలన్న చంద్రబాబుకు..ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం తెలిసినట్టుందన్నారు. సింహాచలం స్వామి సాక్షిగా సినీ కళాకారులకు ఇచ్చిన హామీ అమలు కాకపోతే తనను నిలబెట్టాలని తెలిపారు. పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎంవీ వీ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినా సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉండిపోయిందని, అక్కడి నుంచి విశాఖకు తరలించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సినీ పరిశ్రమ ఇక్కడకు తరలిం చేందుకు కృషి చేస్తామని చెప్పారు. పరిశ్రమ ఇక్కడకు వస్తే సినీ కళాకారులకు 365 రోజుల పని దొరుకుతుందని, గుర్తింపు కార్డు ఉన్న కళా కారులందరికీ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇస్తామని హామీ నిచ్చారు. అంతేగాక స్టూడియోలు ఏ ర్పాటు చేసేందుకు ముం దుకు వచ్చే వారికి స్థలాలు, కళాకారులకు ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. సినీ కార్మికుడిగా తనను(ఎంవీవీ సత్యనారాయణ), దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి ద్రో ణంరాజు శ్రీనివాస్‌ను గెలిపిం చాలని కోరారు. జగన్‌ను సీఎం చేయడానికి ప్రజలు సిద్ధం ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయానికి వచ్చేశారన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పూర్తయిన వెంటనే ఇంటిలిజెన్స్ నివేదికల్లో టీడీపీ ఓడిపోతుందని రావడంతో..అప్పటికప్పుడే పసుపు కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలను మభ్యపెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు అవకాశమిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంటక్ మాట్లాడుతూ నటులందరిదీ ఒకటే కుటుం బం అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చాలా చేయాల్సి ఉందని, జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుని మన సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు కృష్ణుడు, జోగినాయుడు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
పేదవాడి రాజ్యం కోసం ప్రార్థించా: పృధ్వీరాజ్
ఇంద్రకీలాద్రి: పేద వాడి రాజ్యం రావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సినీ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. దసరా ఉత్సవాలలో రెండో రోజైన గురువారం శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారిని పృధ్వీరాజ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉన్నా ఆలయ అధికారులు ప్రవర్తించిన తీరు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనానికి వచ్చిన తనను ఆలయ అధికారులు పట్టించుకోకపోయినా వలంటరీలు, సేవా సిబ్బంది తనను గుర్తించడం చాలా సంతోషమని చెప్పారు. తాను 2012 నుంచి రాజశేఖరరెడ్డి అభిమానినని వివరించారు. రాబోయే ఎన్నికలలో పేదవాడి రాజ్యం రావాలని, అధికార దాహం ఉన్న వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే క్యూలైన్ మార్గాలలో ఏర్పాట్లు బాగున్నాయని పేర్కొన్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో పలువురు భక్తులు ఫృద్వీరాజ్‌తో ఫొటోలు దిగేందుకు ఉత్సాహాన్ని చూపించారు. -
మూడోసారి
మలయాళ హీరో పృథ్వీరాజ్ ప్రొడక్షన్లో ఆయనే హీరోగా రూపొందుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘9’. ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఫేమ్ జీనస్ మొహమద్ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి మమతా మోహన్‌దాస్ కూడా యాడ్ అయ్యారు. ‘అన్నీ’ అనే కీలక పాత్రలో మమతా మోహన్‌దాస్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. పృథ్వీరాజ్‌తో మమత యాక్ట్ చేయడం ఇది మూడోసారి. ఆల్రెడీ ‘అన్వర్, సెల్యులాయిడ్’ సినిమాల్లో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. ప్రస్తుతం హిమాలయాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
పల్లెటూరి నేపథ్యంలో...
హాస్యనటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో రామకృష్ణ, అవంతికా జంటగా నటించిన చిత్రం ‘ఆనందం అంబరమైతే’. ఈరంకి సుబ్బుని దర్శకునిగా పరిచయం చేస్తూ బుద్దాల సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈరంకి సుబ్బు మాట్లాడుతూ– ‘‘మనిషి జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. అనుకున్నది సాధించినప్పుడు ఆనందం అంబరాన్ని తాకడం సహజం. ఈ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో ఉంటుంది. గోదావరి తీరంలో ఎప్పుడూ చూడని లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. శ్రీకృష్ణ సంగీతం సినిమాకు హైలెట్’’ అన్నారు బుద్దాల సత్యనారాయణ. ఈ చిత్రానికి కెమెరా: చైతన్య వనపల్లె, సహనిర్మాత: బుద్దాల హైమావతి. -
ఎన్టీఆర్‌కు సవాల్ విసిరిన సూపర్‌స్టార్!
సాక్షి, హైదరాబాద్ : జిమ్‌లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కసరత్తులు చేస్తున్నారు. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ లో భాగంగా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఫిట్నెస్ ఛాలెంజ్‌కు స్పందించారు. తాను కసరత్తులు చేసి ఫిట్నెస్ నిరూపించుకోవడంతో పాటు మరికొందరు స్టార్ హీరోలను ఎన్టీఆర్, సూర్య శివకుమార్, పృథ్వీ సుకుమారన్‌కు ఫిట్నెస్ సవాలు విసిరారు. ఈ మేరకు వారి పేర్లను ట్యాగ్ చేస్తూ మోహన్‌లాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మోహన్‌లాల్, ఎన్టీఆర్‌లు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్‌లో కలిసి నటించారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్న సినిమాలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇదివరకే రాజ్యవర్థన్ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించిన క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు తమ ఫిట్నెస్ వీడియోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌ను ఇటీవల నాగ చైతన్య-సమంత, విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు స్వీకరించి మరికొందరిని సవాల్ స్వీకరించాలని ఆహ్వానించారు. టాలీవుడ్ హీరోయిన్లు ప్రగ్యా జైశ్వాల్, లావణ్య త్రిపాఠి సహా పలువురు ఫిట్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. తమ స్నేహితులు, సన్నిహితులకు ఫిట్నెస్ సవాళ్లు విసురుతున్నారు. Accepting #FitnessChallenge from @Ra_THORe for #HumFitTohIndiaFit. I invite @Suriya_offl @tarak9999 @PrithviOfficial to join #NewIndia - a healthy India. pic.twitter.com/CVcK2VFArf — Mohanlal (@Mohanlal) 30 May 2018 -
ఏదీ అసాధ్యం కాదు
.. అంటున్నారు పృథ్వీరాజ్. ప్రేమను గెలిపించుకోవడం కోసం అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటా అంటున్నారాయన. పృథ్వీరాజ్‌కి పెళ్లయిన విషయం, ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. మరి.. ప్రేమ కోసం ఇప్పుడు పోరాటం ఏంటి? అంటే.. ‘మీటర్ గాజ్ 1904’ అనే సినిమాలో ఆయన నటించనున్నారు. ‘మేక్ ది ఇంపాజిబుల్.. పాజిబుల్’ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో పృథ్వీరాజ్ తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశాడు? అనేది మెయిన్ థీమ్. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కేరళలోని కురువిల్లాకి చెందిన ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నారు. -
పోలీస్‌రాజ్యంలో ఓవియ
మిళసినిమా: బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తరువాత నటి ఓవియకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. తను ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ గేమ్ షో రేటింగ్ పడిపోయిందనే ప్రచారం జరుగుతుందటే ఓవియ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు నటిగానూ ఇంతకు ముందు కంటే ఓవియ క్రేజ్ పెరిగింది. తాజాగా తన నటుడు పృథ్వీరాజ్‌కు జంటగా నటించిన పోలీస్‌రాజ్యం చిత్రానికి వ్యాపారపరంగా ఊపు వచ్చింది. అన్నపూరిణి ఫిలింస్ పతాకంపై అరుణాచలం నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను బాబూరాజ్ నిర్వహించారు. జెమినికిరణ్, కళాభవన్మణి, సత్య, ఐశ్వర్య, జగదీశ్, సీమ, దేవ ముఖ్య పాత్రలను పోషించిన ఇందులో దర్శకుడు బాబూరాజ్ ప్రధాన పాత్ర పోషించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఒక గ్రామంలో అమ్మనాన్న, పిల్లలు అంటూ హాయిగా జీవిస్తున్న ఒక కుటుంబంలో వరుసగా హత్యలు జరుగుతాయన్నారు. ఆ గ్రామంలోనే అసాంఘిక సంఘటనలు చోటు చేసుకుని స్థానిక పోలీసులకే అంత చిక్కని పరిస్థితుల్లో నటుడు పృధ్వీరాజ్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా వస్తారన్నారు. ఆయన తన ఇన్వెస్టిగేషన్లో హంతకుడెరన్నది కనుగొని అరెస్ట్ చేయగా, కొన్ని దిగ్బ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూస్తాయన్నారు. అవి ఏమిటన్నదే పోలీస్ రాజ్యం చిత్రంలో ఆసక్తికరమైన అంశాలని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాయకిగా ఓవియ చాలా గ్లామరస్ పాత్రలో నటించిందని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. నటి ఓవియకున్న క్రేజ్‌ను దృష్టిలో పట్టుకుని పోలీస్‌రాజ్యాం చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా 250 థియేటర్లలో విడుదల చేయనున్నామని చెప్పారు. అదే విధంగా ఓవియ కోరిక మేరకు ఈ చిత్ర ప్రీమియర్‌ను మలేషియాలో ఏర్పాటు చేయనున్నట్లు, ఆ ప్రీమియర్ షోల్లో నటి ఓవియ పాల్గొననున్నట్లు తెలిపారు. -
క్యారెక్టర్స్ మార్చుకున్న సౌత్ స్టార్స్
ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ధృవ నక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో విక్రమ్ డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే రెండు టీజర్స్ లోనూ విలన్ ఎవరన్నది రివీల్ చేయలేదు. విలన్ వాయిస్ ను మాత్రమే ప్రజెంట్ చేశారు. అయితే టీజర్ లో వినిపిస్తున్న విలన్ వాయిస్ మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ దే.. అన్న ప్రచారం జరుగుతోంది. గౌతమ్ మీనన్, విక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో పృథ్విరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే అది విలన్ రోల్ అని మాత్రం రివీల్ చేయలదే. టీజర్ లో వాయిస్ ని బట్టి పృథ్వి చేస్తున్నది విలన్ రోల్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. గతంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన విలన్ సినిమా కోసం పృథ్విరాజ్ హీరోగా నటించగా విక్రమ్ విలన్ గా అలరించాడు. ఇప్పుడు మరో ఆ ఇద్దరు నటులు తమ పాత్రలను మార్చుకొని విక్రమ్ హీరోగా పృథ్విరాజ్ విలన్ గా నటిస్తుండటంతో ధృవ నక్షత్రం సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
30 ఇయర్స్ పృథ్వీరాజ్‌పై వేధింపుల కేసు
హైదరాబాద్: సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఆయన భార్య కవిత పృథ్వీరాజ్ తనను కొంతకాలంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మ అనే మహిళతో పృథ్వీ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కవిత ఫిర్యాదులో పేర్కొన్నారు. పృథ్వీరాజ్ తన నుంచి రెండు లక్షల నగదుతో పాటు బంగారం తీసుకున్నారని ఆరోపించారు. తనను ఇంట్లోకి రానివ్వడం లదేని, ఇదేంటని ప్రశ్నిస్తే తన ఇష్టమొచ్చినట్లు చేస్తానని అంటున్నారని చెప్పారు. కాగా, మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న కవిత 2010లో పృథ్వీరాజ్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ మేరకు పృథ్వీపై సెక్షన్ 420 మోసం, 498ఏ వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ ఎస్సై కే కృష్ణయ్య తెలిపారు. -
రుణమాఫీ చేయాల్సిందే
ముంబై: రుణమాఫీపై ప్రతిపక్షాలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. రుణమాఫీతోనే రైతులు వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడతారని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మాఫీ చే సి తీరాలని, శుక్రవారం అసెంబ్లీలో కాంగ్రెస్-ఎన్సీపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రైతు సమస్యలపై అసెంబ్లీలో రెండో రోజూ చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు పృథ్విరాజ్ చవాన్ మాట్లాడుతూ.. అకాల వర్షాలు, కరువు, వడగళ్ల వాన వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల సమస్యలు రుణమాఫీతోనే తీరుతాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస కూల్చే ప్రయత్నం చేయొద్దని, ఆ వ్యవస్థను పటిష్టం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చెరకుకు సరైన మద్దతు ధర ప్రకటించకపోవడంపై చవాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇందుకు సంబంధించి కేంద్రంతో చర్చించాలన్నారు. 2008లో తాము రైతులకు రూ. 72,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని, ప్రస్తుత ప్యాకేజీ కనీసం రూ. 1.5 లక్షల కోట్లు ఉండాలన్నారు. రైతు సమస్యలకు మాఫీ తప్ప మరో పరిష్కారం లేదని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ అన్నారు. సహజ విపత్తుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిపై ఆధారపడి వ్యవసాయం చేయలేరన్నారు. వాగ్దానాల అమలుపై ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. చర్చలోని ప్రశ్నలకు సీఎం ఫడ్నవీస్ సోమవారం సమాధానం చెప్పనున్నారు. చుక్క నీరు పోనివ్వం: సీఎం దామన్‌గంగ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా గుజరాత్‌కు ఇవ్వబోమని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర వాటా నుంచి నీటిని ఇతర రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని వెల్లడించారు. దామన్ గంగ-పింజల్ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పును తాము సరిచేశామని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమాచారానికి సంబంధించి ఎన్పీపీ నేత ఛగన్ భుజబల్ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ముప్పై ఏళ్లుగా గత ప్రభుత్వాలు నీటి సామర్థ్యాన్ని 132 టీఎంసీలకు మించి పెంచలేకపోయాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఏవిధమైన చర్యలు తీసుకున్నాయని ప్రశ్నించారు. దీనిపై నీటి వనరుల సహాయ మంత్రి విజయ్ శివ్‌తారే మాట్లాడుతూ.. నదుల అనుసంధాన ప్రక్రియలో ప్రాజెక్టును చేర్చాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. 30 టీఎంసీల నీటిని పొందే విధంగా ప్రాజెక్టు వాటర్ టన్నెల్ నిర్మాణాలను కూడా మార్పు చేశామన్నారు. ప్రాజెక్టు గురించి మంత్రి పూర్తిగా వివరించినప్పటికీ నీరు గుజరాత్‌కు తరలిపోతోందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి. దీంతో సీఎం మాట్లాడుతూ.. సమస్యను రాజకీయం చేయకుండా కొత్త ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. రాష్ట్ర వాటాలోని నీటిని ఎవ్వరికీ ఇవ్వబోమని చెప్పారు. హర్సిల్ అల్లర్లపై దద్దరిల్లిన అసెంబ్లీ నాసిక్‌లోని హర్సిల్ పట్టణంలో జరిగిన హింసపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. సమస్యాత్మక ప్రాంతంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. సీపీఎం నేత జీవ పండు గావిత్ అసెంబ్లీలో ఈ ప్రశ్నను లేవనెత్తారు. ఇంతకుముందు రెండు సార్లు గావిత్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ తిరస్కరించింది. సమస్యపై చర్చిండానికి ఇచ్చిన నోటీసులను తిరస్కరించినప్పట్టికీ, క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రత గురించి తె లియజేయడానికి తనకు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. సమస్యల గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చైర్ అడ్డుకుంటోందని ఎన్సీపీ నేత జయంత్ విమర్శించారు. హర్సిల్ పట్టణంలో హింసను అదుపుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీనిపై మంత్రి గిరీశ్ మహాజన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం హర్సిల్‌లో పరిస్థితి సాధారణంగా ఉందని, పట్టణంలో తాను రెండు సార్లు పర్యటించానని, ప్రస్తుతం అక్కడ శాంతి వాతావరణం ఉందని చెప్పారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రకాశ్ మెహతా మాట్లాడుతూ.. హింసకు సంబంధించి సోమవారం సభలో ప్రకటన విడుదల చేస్తామన్నారు. మంగళవారం హర్సిల్ పట్టణంలో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి (రాందాస్ బుధడ్) మృతి చెందాడు. ర్యాలీలో అల్లరిమూకలన నియంత్రించే క్రమంలో 12 మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డారు. రాళ్లు రువ్వడం వల్ల 49 షాపులు, 14 ఇళ్లు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. జూలై 7న హర్సిల్‌కు సమీపంలోని బరిపడ లోని బావిలో భగీరత్ చౌదరి అనే యువకుడి మృతదేహం లభించింది. భగీరత్ మృతికి నిరసనగా హర్సిల్‌లో ర్యాలీ జరిగింది. -
నేను చాలా లక్కీ
ఆ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని అంటోంది నటి వేదిక. పరదేశి చిత్రంలో అద్భుతమైన అభినయాన్ని చాటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం కావ్య తలైవన్. సిద్ధార్థ్, పృథ్విరాజ్‌లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్గా అనైక నటించారు. వసంతబాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. వేదిక తన అనుభవాలను చెప్పింది. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు నటించే చాన్సు చాలా తక్కువమందికే లభిస్తుం ది. ఆ విధంగా చూస్తే నేను చాలా లక్కీ. పరదేశి చిత్రంలో కొండప్రాంత వాసిగా నటనకు అవకాశం వున్న పాత్ర పోషించాను. ఆ పాత్ర కోసం నా రూపురేఖలన్నీ మార్చుకుని నటించాను. చాలామంది అభినందనలు పొందా ను. తాజా చిత్రం కావ్యతలైవన్ చిత్రంలో రంగస్థల నటిగా నటించాను. ఇది 1930 ప్రాంతంలో జరిగే నాటకాల బృందం ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం. నిజం చెప్పాలంటే ప్రఖ్యాత నటీమణి కె.పి.సుందరాంబాల్ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన పాత్ర ఇది. 1940 ప్రాంతంలో నాటకా ల్లో స్త్రీ పాత్రల్ని కూడా మగవారే పోషించేవారు. అలాంటి పరిస్థితిలో నాటకాల్లో నటించడానికి ముందుకొచ్చిన తొలి నటీమణి కేపీ సుందరాంబాల్. కావ్యతలైవన్ చిత్రం లో నటించడానికి ముందు ఈ విషయం తెలుసుకున్నాను. అయితే ఈ తరహా పాత్రలో నటించడం అంత సులభం కాదు అని అనుభవపూర్వకంగా గ్రహించాను. ధరించే దుస్తుల నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేకప్ కోసం గంటల సమయం వెచ్చించాను. ఈ చిత్రంలో నటించేముందు పాత క్లాసికల్ చిత్రాలు పలు తిలకించాను. కావ్యతలైవన్ చిత్రం లో నటించడం చాలా కొత్త అనుభ వం. చిత్రం చూసే ప్రేక్షకులకు వినూత్న అనుభవం కలుగుతోందనే నమ్మకం ఉంది. మరో విషయం ఏమిటంటే రంగస్థల కళాకారుల ఇతివృత్తం అనగానే ఇదేదో సీనియర్ డ్రామాతో కూడిన చిత్రం అనుకుంటారు. సహనటులు సిద్ధార్థ్, పృథ్విరాజ్‌ల గురించి చెప్పాలంటే చాలా డెడికేటెడ్‌గా శ్రమించి నటించారు. వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో చిత్రంలో మంచి అవుట్‌పుట్ వచ్చింది. ప్రముఖ నృత్యదర్శకుడు రఘురాం కన్నుమూసే ముందు ఈ చిత్రంలో నా పరిచయం పాటకు నృత్య దర్శకత్వం వహించారు. కావ్యతలైవన్ నా సినీ కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నానని వేదిక పేర్కొన్నారు. -
పొద్దుతిరుగుడు అడ్డా బతుకులు
వరుణుడి దయ కరువై ఏరువాక సాగక బతుకుపోరు బాట పట్టినోళ్లు వాళ్లు. తేమలేక బీళ్లువారిన చెలకలను చెమ్మగిల్లిన కళ్లతో వదిలి వచ్చినోళ్ల్లు. కొందరు సన్నకారు రైతులు.. ఇంకొందరు కౌలుదారులు. కూటి కోసం.. కూలి వెతుక్కుంటూ.. పట్నంలో అడ్డా మీదికొచ్చి పడ్డవాళ్లే. చద్దన్నం మూటగట్టుకుని.. పలుగు, పారా చేతపట్టుకుని.. ఇల్లాలిని వెంటపెట్టుకుని..తెల్లవారకముందే పని కోసం పరుగు పరుగున అడ్డాకు చేరుకుంటారు. పొద్దుతిరిగే వరకూ ఏదైనా పని దొరకకపోతుందా అని పడిగాపులు కాస్తారు. పని దొరికిందా.. ఒళ్లొంచి పనిచేసి పొద్దుగూకే వేళకు ఇళ్లకు చేరతారు. దొరకలేదా..! తెల్లారి పస్తున్న కడుపుతోనే అడ్డామీదికొచ్చి అదృష్టం వెతుక్కుంటారు. బతుకు కోసం పొద్దంతా అడ్డా మీద తిరిగే కూలీలను ‘సాక్షి’ సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా సినీ నటుడు పృథ్వీరాజ్ పలకరించారు. పృథ్వీరాజ్: హాయమ్మా... ఎలా ఉన్నారు. శ్రీనివాస్: ఏమున్నాం సార్.. గిట్లున్నం. ఇప్పుడు టైం పదకొండు దాటింది. మీరే చూస్తుండ్రు కదా ! రోడ్డు మీద వంద మందిమి కూసున్నం. పనిచ్చే దేవుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నం. లక్ష్మమ్మ: ఇదేం కొత్తకాదు సార్. మా బతుకులు గింతే. పొద్దుగాలే డబ్బాలు పట్టుకుని రావాలె. కూలీ దొరికితే సరే. లేదంటే.. తెచ్చుకున్న పచ్చడి మెతుకులు తీస్కవోయి పిల్లలకు పెట్టి మేం పస్తుండాలె. పృథ్వీరాజ్:తెలుసమ్మా ! మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా రోడ్డు మీద అడ్డాకూలీలు కూర్చున్న సందర్భాలు చాలాసార్లు నా కంటపడ్డాయి..! ఈశ్వరమ్మ: ఏం చెప్పాలి సార్ మా కష్టాలు. ఊరికెళ్లి మొదలువెట్టాల్నా.. ఈడ అడ్డెక్కినాక వ చ్చిన కష్టాల గురించి చెప్పాల్నా ! నా భర్త పోయిండు. బిడ్డను చదివించే పైసల్లేక ఊర్ల మా అమ్మ దగ్గర ఉంచిన. ఈడికొచ్చి నాలుగు పనులు చేస్కొని బతుకుతున్నా. నాలుగు రోజులు పనుంటే.. పది రోజులు పస్తులే. పృథ్వీరాజ్: మామూలుగా రోజూ ఎంత మంది అడ్డా మీదికి వస్తుంటారు. ఎన్ని గంటలకల్లా వస్తారు ? ఐలయ్య: ఓ నాల్గువందల మందిమి పొద్దుగాల ఆరు గంటలకల్లా వస్తం. పృథ్వీరాజ్: అన్ని రకాల పనులూ చేసేవారు ఉంటారా? వెంకటేష్: అందరుంటరు సార్. నేను తాపీమేస్త్రిని, ఈయన వంటజేస్తడు. పృథ్వీరాజ్: అవునా.. నువ్వు వంటచేస్తావా? స్వామి: అవును సార్ నేను వంటమాస్టార్ని. పృథ్వీరాజ్: ఎంతమందికి చేయగలవు? స్వామి: ఓ ఇద్దరు పనోళ్లను ఇస్తే ఐదువందల మందికి చేయగలను. పృథ్వీరాజ్: ఎంత తీసుకుంటావు? స్వామి: బేరాన్ని బట్టిసార్. రెండువేల వరకూ అడుగుతా! పృథ్వీరాజ్: నెలకి ఎన్ని బేరాలొస్తాయి? స్వామి: రెండు మూడు సార్. అవి కూడా చిన్నబేరాలే. పృథ్వీరాజ్: హైదరాబాద్‌లో ఎన్ని అడ్డాలుంటాయంటారు? శ్రీనివాస్: యాభైదాకా ఉంటయి సార్. అన్నిదిక్కులా ఇదే పరిస్థితి. కాకపోతే రియల్ ఎస్టేట్ ఎక్కువ నడిచే దగ్గర పనోళ్లకు గిరాకీ బాగుంటది. సునీత: నాలుగైదు నెలల సంది బిల్డింగులు కట్టేది బాగా తగ్గింది. గప్పట్నుంచి మాకు మస్తు తిప్పలైతాంది. సోమయ్య: పనుల కోసం ఊళ్లకెళ్లి జనాలు వచ్చిపడుతున్నరు. ఈడ చూస్తే అంత పని లేద్సార్. పృథ్వీరాజ్: ఆ మాట నిజమే! ఊళ్లలో జనమంతా పని పేరుతో హైదరాబాద్‌కి వచ్చేస్తున్నారు. అక్కడ రైతులకు కూలీలు దొరకడం గగనం అయిపోయింది. రాములు: ఏం చేస్తం సార్. ఊళ్ల పంటల్లేవు. ఊకే కూర్చుని తినేటన్ని సొమ్ముల్లేక.. ఇట్ల రోడ్డు మీద పడ్డం. పృథ్వీరాజ్: మీకు ఊళ్లో పొలం ఉందా? రాములు: ఎందుకు లేదు సార్. మాది బాన్సువాడ దగ్గర చిన్న పల్లెటూరు. నేనూ రైతునే. నాకు నాలుగెకరాల పొలముంది. రెండు మూడు బోర్లేసినా.. నీళ్లు పడలే.. ఈడికొచ్చిన చాలా మంది పరిస్థితీ ఇదే. ఏం చేస్తం పొట్టచేత పట్టుకుని పట్నం వచ్చినం. పృథ్వీరాజ్: చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. మన నగరంలో చాలాచోట్ల పనోళ్లు దొరకడం లేదని అంటుంటారు. ఇక్కడ చూస్తే పనిలేక వందలమంది రోడ్లపై కూర్చుంటారు. దీని గురించి మీరేమంటారు. పరమేష్: మీరనేది.. ఇంట్ల పని గురించా సార్? పృథ్వీరాజ్: అవును. పరమేష్: ఇండ్లళ్ల పనంటే ఎవ్వర్నివడితే వాళ్లను పెట్టుకోరు కదా సార్. ఇంటి చుట్టుపక్కల ఉన్నోళ్లనే పెట్టుకుంటరు. నమ్మకం ఉండదు. యాడికెళ్లో వచ్చి నోళ్లను నమ్మి నౌకరీ ఎవరిస్తరు సార్. పృథ్వీరాజ్: మరి మీ ఇబ్బందుల గురించి ఈ ప్రాంత నాయకులకు ఎప్పుడైనా చెప్పారా? ఈశ్వరమ్మ: మీకు తెల్వని ముచ్చటేముంటది సార్. ఐదేళ్లకోసారి కనిపిస్తరు.కష్టమొచ్చినప్పుడల్లా కనిపిస్తే నాయకుడెట్లయితడు. ఓట్లొచ్చినప్పుడు మా గుడిసెల చుట్టూ తెగ తిరుగుతరు. శ్రీనివాస్: గా రోజులనెందుకు యాదికి తెచ్చుకోవాలే సార్. మస్త్ మజా జేస్తం. పృథ్వీరాజ్: అవునా (నవ్వుతూ..) బిర్యానీ, డబ్బులు.. ఇంకా చాలా ఉంటాయి కదా! శ్రీనివాస్: ఒక్క వారం రోజులు సార్. మమ్మల్ని నేలపై నడవనివ్వరు. ఓట్లేసిన తెల్లారి నుంచి మా దిక్కు చూస్తే ఒట్టు. పృథ్వీరాజ్: రోజురోజుకీ కూలీలకు పని తగ్గిపోతుందని విన్నాను. కారణం గ్రామాల్లో పంటలు పండకపోవడమే అంటారా? రాములు: అట్లేంలేదు సార్. మిషన్లు పెరిగిపోవడమే పెద్ద కారణం. అన్ని పనులు మిషన్లే చేస్తున్నయి. పృథ్వీరాజ్: అది కూడా నిజమే. బిల్డింగ్లు కట్టే దగ్గర చూస్తున్నాం కదా! టెక్నాలజీని, కొత్తగా వచ్చే మెషనరీస్ని బాగా వాడుకుంటున్నారు. రాములు: మనుషులకయితే చెప్పి చేయించుకోవాలే! అదే మిషన్ అయితే బటన్ నొక్కితే పనైపోతుంది. పృథ్వీరాజ్: చెప్పి చేయించుకోవాలంటే ఒకటి గుర్తొచ్చింది. అడ్డామీద కూలోళ్లకు బాస్ అంటూ ఎవరూ ఉండరు. దాంతో పని సరిగ్గా చేయరని.. మాటలు చెబుతూ రోజు గడిపేస్తారని అంటారు. నిజమేనా? శ్రీనివాస్: అందరు అట్లుంటరా సార్. పనిదొంగలు అట్లుంటరు. పృథ్వీరాజ్: ఓకే. చాలా రోజుల నుంచి మీ జీవితాల గురించి తెలుసుకోవాలని అనుకునేవాణ్ని. ఈ రోజు ఇలా సాక్షి స్టార్ రిపోర్టర్‌గా మిమ్మల్ని పలకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. పృథ్వీరాజ్: అవునూ.. మీరంతా గుడిసెల్లోనే ఉంటారా? లక్ష్మమ్మ: వందకు తొంభై మంది గుడిసెల్లోనే ఉంటం. పృథ్వీరాజ్: అవును మరి. గ్యారంటీ లేని సంపాదనతో ఇళ్లలో ఉండడం కష్టమే! లక్ష్మమ్మ: అంటే గుడిసెలల్ల ఊకనే ఉండనిస్తరనుకుంటున్నరా సార్. గుడిసెకు 500 రూపాయలు. కరెంటుకి వంద. నీళ్లకు వంద తీస్కుంటరు. ఐలయ్య: ఈ పైసలు టైమ్‌కి కట్టకపోతే గుడిసె ఖాళీజేయాలె. పృథ్వీరాజ్: ఎవరు ఖాళీ చేయిస్తారు? ఐలయ్య: ఆ జాగ ఎవరిది అయితే వాళ్లు సార్. పృథ్వీరాజ్: ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకోవచ్చు కదా! ఐలయ్య: అక్కడయితే మేం కబ్జా చేస్తామని డౌట్తోని అడుగు పెట్టనియ్యరు సార్. పృథ్వీరాజ్: ఊరే నయం కదయ్యా. ఉంటే తింటాం. లేదంటే పస్తుంటాం. ఇక్కడ ఉన్నా లేకపోయినా గుడిసెకు కూడా అద్దె కట్టడం అంటే అన్యాయం కదా! సాయిలు: అవే కదా సార్ మా తిప్పలు. -
తమిళంలో వినూత్న యత్నం
తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. ఇటీవల తెలుగులో పెద్దగా కనిపించని ఈ నటుడు తమిళంలోనూ సరైన హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చారిత్రక నేపథ్యంలోని కాల్పనిక కథతో తమిళంలో రూపొందుతోన్న ‘కావ్య తలైవన్’ (కావ్య నాయకుడు అని అర్థం)పై ఆయన ఆశలు పెట్టుకున్నారు. 20వ శతాబ్దపు తొలినాళ్ళలో మదురై లాంటి ప్రాంతంలో ఊరూరూ తిరుగుతూ, నాటకాలు ప్రదర్శించే ఒక చిన్న రంగస్థల సమాజం నేపథ్యంలోని కథ ఇది. అందులోని ఇద్దరు నటుల మధ్య నెలకొనే పోటాపోటీ చిత్ర ప్రధానాంశం. అలా పోటీపడే రంగస్థల నటులుగా సిద్ధార్థ్, మలయాళ హీరో పృథ్వీరాజ్ కనిపిస్తారు. నాయిక పాత్రను వేదిక పోషిస్తున్నారు. ఒకప్పటి ప్రముఖ రంగస్థల నటి, గాయని, సినిమాల్లోనూ పేరు తెచ్చుకున్న తార కె.బి. సుందరాంబాళ్ (‘అవ్వయ్యార్’ చిత్రం ఫేమ్) ప్రేరణతో ఆ కథానాయిక పాత్ర తీర్చిదిద్దారని కోడంబాకం కబురు. విభిన్నమైన చిత్రాల నిర్దేశకుడిగా పేరున్న వసంత బాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ సంగీతం అందిస్తున్నారు. 1920ల నాటి రంగస్థల సంగీతానికి తగ్గట్లుగా బాణీలు కట్టి, రీరికార్డింగ్ చేయడం కోసం రహమాన్ దాదాపు ఆరు నెలలు పరిశోధన చేశారట. రెండేళ్ళ పైగా సాగిన ఈ భారీ ప్రయత్నానికి తగ్గట్లే ఇప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. ‘‘ఊరూరా తిరుగుతూ, తమ నాటకంలోని ఒక ఘట్టాన్ని రోడ్డు మీదే ప్రదర్శించి, ఆకట్టుకొనే అప్పటి రంగస్థల కళాకారుల జీవితంపై సినిమా ఇది. అందుకే, మా చిత్ర బృందం కూడా తమిళనాడులోని ప్రధాన పట్టణాలన్నీ తిరుగుతూ, రకరకాల కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకర్షించనున్నాం’’ అని దర్శకుడు వసంత బాలన్ చెప్పారు. నవంబర్ 14న తమిళనాట విడుదల కానుంది. -
మాఫియా డాన్ ప్రేమకథ
ఓ అనాథ శరణాలయంలో సేవలందించే ఆమె, ఓ మాఫియా డాన్‌తో ప్రేమలో పడుతుంది. అయితే తాను ప్రేమిస్తున్నది ఓ మాఫియా డాన్ని అని ఆ అమ్మాయికి తెలియదు. ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘తేజాభాయ్’. పృథ్వీరాజ్, అఖిల జంటగా సుమన్, తలైవాసల్ విజయ్ కీలక పాత్రల్లో కరుణాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎం. రంగారెడ్డి, ఎస్. రామచంద్రారెడ్డి ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మాటలు: మల్లూరి వెంకట్, పాటలు: చల్లా భాగ్యలక్ష్మి. -
రుణమాఫీ.. అయోమయం..!
సదాశివపేట: రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందున రుణమాఫీపై రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయమై రోజుకో నిర్ణయం వెలువడడంతో మార్గదర్శకాలు తారుమారవుతున్నాయి. కొత్తగా ఆధార్ లింకు పెట్టడంతో రుణ మాఫీపై రైతుల్లో అయోమయం నెలకొంది. చాలా మంది రైతులకు ఇంకా ఆధార్ జారీకాలేదు. అందువల్ల రుణ మాఫీ జాబితాలో తమపేరు ఉన్నదో లేదోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణ మాఫీ ప్రకటనకు కట్టుబడి ఉన్నామంటూ ఈ మధ్యేనే ప్రభుత్వం జీఓ నంబరు 69 జారీ చేసింది. మార్చి 31, 2014 వరకు తీసుకున్న రుణాల్లో లక్ష లోపు రుణమాఫీకి ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రుణ మాఫీకి అర్హులు ఎవరన్న విషయం తేల్చాల్సిన సమయం అసన్నమైన తరుణంలో బ్యాంకర్లు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీని ఆధారంగా రుణ మాఫీ అర్హులను తేల్చేందుకు నిర్వహించే సామాజిక తనఖీలే ప్రామాణికం కానున్నాయి. సదాశివపేట పట్టణంలోని ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఏపీ జీవీబీ, డీసీసీబీ, రూరల్ బ్యాంకు, వైశ్యాబ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, విజయ బ్యాంకుతో పాటు మండల పరిధిలోని నిజాంపూర్ ఎస్బీఐ బ్యాంకుల నుంచి రైతులు పంట రుణాలు తీసుకున్నారు. మండల పరిధిలో దాదాపు 19 వేల మంది రైతులు అధికారికంగా నమోదై ఉన్నారని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. వీరిలో దాదాపు 90 శాతం వరకు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారని వీరిలో 10 శాతం మంది రైతులకు ఆధార్ కార్డులు లేవని సమాచారం. 2014 మార్చి 31 వరకు తీసుకున్న పంట రుణాలు, పాత బకాయిల జాబితాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన పట్టాదార్ పాసుబుక్కుల అధారంగా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల జాబితాను బ్యాంకు అధికారులు తయారు చేస్తున్నారని సమాచారం. ఈనెల చివరి వరకు తుది జాబితాను సిద్ధ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రుణమాఫీపై మార్గదర్శకాలు ఇవే జీఓ నంబరు 69 ద్వారా ప్రభుత్వం రుణ మాఫీపై మార్గదర్శకాలను విడుదల చేసింది. మూడు నెలలుగా రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈనెలాఖరులోగా రుణ మాఫీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులు ఈ ఏడాది మార్చి 31 వరకు తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుంది. ప్రభుత్వం ఒక్కోరైతుకు గరిష్టంగా రూ. లక్ష వరకు మాఫీ అవకాశం కల్పించింది. వడ్డీ కలుపుకుని రూ. లక్ష వరకు మాఫీ అవుతుంది. రూ. లక్షల కంటే అధికంగా ఉన్న రుణ మొత్తాన్ని రైతులే చెల్లించాలి. రైతులు పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నా అన్ని రుణాలను మండల స్ధాయి బ్యాంకర్ల సమావేశంలో లెక్కించి రూ. లక్ష వరకు మాఫీ చేసి మిగతా మొత్తం రైతుల నుంచి వసూలు చేసేందుకు నిర్ణయిస్తారు. రుణ మాఫీకి కూడా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష పంట రుణం మాత్రమే మాఫీ అవుతుందని తెలిసింది. రైతులు బ్యాంకులో ఆధార్ కాపీని అందజేసి ఆధార్ సంఖ్యను నమోదు చేయించుకోవాలి. జీఓ 69 ప్రకారమే ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 69 ప్రకారం రుణ మాఫీకి కొన్ని విధి విధానాలను నిర్ణయించిందని, ఈ ఉత్తర్వులకు లోబడే రుణ మాఫీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్ లింకు రుణ మాఫీ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులను ఆధార్ లింకు అయోమయానికి గురిచేస్తోంది. బ్యాంకర్లు ఆధార్ అర్హతను నిర్ణయించడంతో పంటరుణాలు తీసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట రుణాలు తీసుకొని, ఆధార్ లేని రైతులు అయోమయంలో పడుతున్నారు. ఆధార్ లింక్ తొలగించాలి దాదాపు 90 శాతం వ్యవసాయ భూములున్న రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో 10 శాతం వరకు రైతులకు ఆధార్‌కార్డులు లేవు. ఆధార్‌తో సంబంధం లేకుండా రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి. మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు, పృథ్వీరాజ్ -
లవ్ ఇన్ లండన్ మూవీ పోస్టర్స్
-
కావ్య తలైవన్ చిత్రంలో సిద్దార్థ గెటప్స్
-
విభిన్నపాత్రలతో ఆలరించిన సిద్ధార్థ్
గతంలో లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితులైలన సిద్ధార్థ్ ప్రస్తుతం విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నారు. జిగర్ తాండ్ (చిక్కడు దొరకడు) చిత్రంతో ఓ డిఫరెంట్ లుక్, విభిన్నమైన పాత్రను పోషించి వరుస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. జిగర్ తాండ తర్వాత కావ్య తలైవన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కావ్య తలైవన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. కావ్య తలైవన్ ఆడియో ఆవిష్కరణ నేపథ్యంలో ఆ చిత్రంలోని కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కావ్య తలైవన్ చిత్రంలోని సిద్దార్థ గెటప్స్ చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. వివిధ గెటప్ లో ఉన్న స్టిల్స్ నటుడిగా సిద్ధార్థను కొత్త ఆవిష్కరించే విధంగా ఉన్నాయి. వసంత బాలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రహ్మన్ అందిస్తున్నారు. సిద్ధార్థ తోపాటు పృథ్వీరాజ్, నాజర్, వేదిక, అనైక సోటిలు నటిస్తున్నారు. -
లండన్‌లో ప్రణయం
అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. లండన్‌లో ఉద్యోగం. ఆమె ఓసంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటారు. అతను తనకు తగినవాడేనా? అని ఆ అమ్మాయి, తనకు తగ్గ భార్యేనా అని అతను డైలమాలో పడతారు. చివరికి ఓ రోజు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. పెళ్లికి సుముఖంగానే ఉంటారు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోకి ఇంకో అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనే కథాంశంతో రూపొందిన ఓ మలయాళ చిత్రం ‘లవ్ ఇన్ లండన్’ పేరుతో అనువాదమైంది. ఎస్సీఎస్ ఎంటర్టైన్మెంట్పై సుంకేశుల రాజబాబు ఈ చిత్రాన్ని అనువదించారు. పృథ్వీరాజ్, ఆండ్రియా, నందిత నాయకా నాయికలు. ఇటీవలే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. రాజబాబు మాట్లాడుతూ -‘‘ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ను 99 శాతం లండన్‌లోనే చేశారు. దర్శకుడు అనిల్ సి. మీనన్ అద్భుతంగా తీశారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: మహేశ్ దత్. -
లవ్ ఇన్ లండన్ మూవీ స్టిల్స్
-
రేపు తొలి అంకం
సాక్షి, ముంబై: తొలి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఎన్నికలు జరిగే విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇన్ని రోజులు కనిపించిన రాజకీయ నాయకుల సందడి, రోడ్ షోలు, ఇంటిఇంటికి ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల పదిన నాగపూర్, భండారా, గోండియా, రాంటెక్, యావత్మల్-వాషీమ్, వార్ధా, అకోలా, బుల్దానా, గడ్చిరోలి-చిమూర్, అమరావతి, చంద్రపూర్ లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవీఎం యంత్రాలు, బూత్ అధికారులు, సిబ్బంది దాదాపు అన్నిపోలింగ్ కేంద్రాల వద్దకి చేరుకుంటున్నారు. పొలింగ్ జరిగే కేంద్రాల వల్ల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్రమ మద్యం, డబ్బుల సరఫరాపై నిఘా వేశారు. ఎన్నికలకు మరొక్కరోజు మాత్రమే ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు శతాథా ప్రయత్నించే అవకాశముందన్న సమాచారం మేరకు ఖాకీలు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్ ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పారా మిలటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. చివరి రోజు అభ్యర్థుల కోలాహలం... ఎన్నికల ప్రచారానికి చివరి రోజైనా మంగళవారం ఆయా పార్టీల అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. తమకు ఓటేస్తే నియోజకవర్గాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అభ్యర్థించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీలిచ్చారు. యువత, మహిళలు, వృద్ధులు...ఇలా అందరిని కలిసి ఓటేయ్యాలని కోరారు. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్... ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఏఏ ప్రాంతంలో ఎవరి ఓట్లు ఎటు, కుల సమీకరణాలు ఎలా ఉన్నాయి, తాము ఇచ్చిన హామీలకు ఎంత మంది ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశముంది తదితర అంశాలపై చర్చిస్తూ లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమ పార్టీ సారథుల ప్రభావం పొలింగ్పై ఎంతమేరకు ప్రభావం చూపనుందనే దానిపై కూడా చర్చించుకుంటున్నారు. విదర్భలోని పది స్థానాల్లో మహాకూటమి, ప్రజాసామ్య కూటమి మధ్య ప్రధాన పోరు జరిగే అవకాశం కనబడుతోంది. కొన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉన్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపొవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. విదర్భ ప్రాంతంలో ఏర్పడిన కరువు, అతివృష్టి వల్ల పంటలు కోల్పోయిన రైతులు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది కూడా ప్రధానం కానుంది. స్థానిక రాజకీయ వాతావరణ పరిస్థితులను చూస్తే మహాకూటమి, ప్రజాస్వామ్య కూటమి చెరో ఐదు సీట్లు దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. విదర్భలోని పది లోక్‌సభ స్థానాలకు పోటీచేసే 201 మంది అభ్యర్థుల్లో 90 మంది ఇండిపెండెంట్లు, 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. నమోదిత రాజకీయ పార్టీల నుంచి 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు స్థాన్లాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో ఎన్సీపీ, ఆరు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో శివసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ వాద్ పార్టీ పది స్థానాల్లో బరిలో ఉండగా, సీపీఐ ఒకే స్థానంలో పోటీ చేస్తోంది. నాగపూర్ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విలాస్ ముత్తెంవార్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముత్తెంవార్‌కు బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కారీతో పాటు ఆప్ అభ్యర్థిని అంజలి దమనియా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. వార్ధా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ దత్తా మెఘే కుమారుడు సాగర్ మెఘేలకు గట్టి పోటీ ఎదురవుతోంది. అలాగే భండారా, గోండియా నుంచి బరిలో ఉన్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, రాంటెక్ నుంచి కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, యావత్మల్-వాషీమ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న రాష్ట్ర మంత్రి శివాజీరావ్ మోఘే గెలుపు కోసం శాయశక్తులూ ఒడ్డుతున్నారు. వార్ధా, అకోలా, బుల్దానా, గడ్చిరోలి-చిమూర్, అమరావతి, చంద్రపూర్లోనే అందరూ అభ్యర్థులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షులు కేజ్రీవాల్‌తోపాటు పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వివిధ బహిరంగ సభల్లో పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలను గుప్పించారు. -
క్వార్టర్‌ఫైనల్స్‌లో సాక్షి టీవీ
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్, ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పృథ్విరాజ్ మెమోరియల్ మీడియా 6 ఎ సైడ్ క్రికెట్ టోర్నీలో సాక్షి టీవీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో సాక్షి టీవీ 4 వికెట్ల తేడాతో 6 టీవీపై గెలిచింది. సీతారామ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టివీ 9, టీవీ 1, టీవీ 5, టి న్యూస్, మీడియా క్లబ్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. టోర్నీని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ పి.ఎన్.రావు ప్రారంభించారు. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. -
ఆడపిల్లల రక్షణలో ఆప్తమిత్రులు
యువ ప్రతిభ ఆడపిల్లలను ఏడిపించే యువకుల్ని చూశాం. ప్రేమ అంటూ వెంటపడే కుర్రాళ్లని చూశాం. ర్యాగింగ్ అంటూ అల్లరి పెట్టే అబ్బాయిల్నీ చూశాం. కానీ పృథ్వీరాజ్ రామ్‌రాఖ్యానీ అలాంటివాడు కాదు. హైదరాబాద్‌లోని ‘ఐసీఎఫ్ఏఐ’ విద్యార్థి అయిన ఈ పద్దెనిమిదేళ్ల కుర్రాడు... ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందాడు. వారి కోసం తనవంతుగా ఏదైనా చేయాలని ఆరాటపడ్డాడు. తన స్నేహితుడు అక్షయ్ రేతాతాతో కలిసి మహిళలకు మేలు చేసే ఓ చక్కని ఆవిష్కరణకు ఊపిరి పోశాడు. నిర్భయ ఉదంతం యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఆ ఉదంతం పృథ్వీని కూడా కదిలించింది. ఆ తరువాత వరుసగా జరిగిన కొన్ని అత్యాచార ఉదంతాలు కూడా అతడి మనసును చలింపజేశాయి. సంఘటన జరిగిన ప్రతిసారీ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటివి జరగడానికి వీల్లేదు అంటున్నారు. కానీ అలా జరగకుండా ఉండేందుకు మాత్రం ఎవరూ ఏమీ చేయడం లేదు. అది అతడిని ఎంతో బాధించింది. క్యాండిల్స్ వెలిగించడం వల్లనో, వీధుల్లో చేరి నినాదాలు చేయడం వల్లనో ఏదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించాడు. తమ వంతుగా స్త్రీల సంరక్షణ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. అలా అతడి వేదనలోంచి, తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి చేసిన మేథో మథనంలోంచి పుట్టుకొచ్చిందే... నాగా చిల్లీస్ పెప్పర్ స్ప్రే. ఇప్పటికే మార్కెట్లో చాలా పెప్పర్ స్ప్రేలు ఉన్నాయి. కానీ వాటి ఖరీదు కాస్తంత ఎక్కువే. అందువల్లనే చాలామంది మహిళలు వాటిని కొనడం లేదనే విషయాన్ని గుర్తించారు ఈ స్నేహితులిద్దరూ. అందుకే తామే ఓ పెప్పర్ స్ప్రేని తయారుచేసి, తక్కువ రేటుకే మహిళలకు అందించాలనుకున్నారు. తమ పాకెట్‌మనీని పోగుచేస్తే పదకొండు వేలు అయ్యింది. ఫ్రెండ్సందరినీ అడిగి మరికొంత సొమ్ము కూడబెట్టారు. నాగాల్యాండ్‌లో దొరికే నాగా చిల్లీస్‌ని (ఇవి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు) ఉపయోగించి శక్తిమంతమైన పెప్పర్ స్ప్రేని తయారుచేశారు. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లి తమ స్ప్రే గురించి వివరించారు. దాన్ని దగ్గర ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. మార్కెట్లో ఐదు వందలు పలికే స్ప్రేని 199 రూపాయలకే అమ్మడం మొదలుపెట్టారు. వాళ్లు ప్రతి స్ప్రేమీద వేసుకున్న లాభం... కేవలం 50 రూపాయలు. అయితే ఈ లాభాన్ని కూడా తమకోసం వాడుకోవడం లేదు. పేద మహిళలకు అమ్మే స్ప్రేలలో ఈ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. చాలామందికి వీరు కేవలం యాభై రూపాయలకే స్ప్రేను అమ్ముతున్నారు. ఇప్పటికి ఇలా ఓ రెండు వేల క్యాన్ల స్ప్రేలను అమ్మారు. ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే... ‘‘జరిగిన తరువాత బాధపడితే ఉపయోగం ఏముంది, అలాంటివి జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలా అని ఆలోచించాం, అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మా ఆలోచన మంచి ఫలితాన్నే ఇచ్చింది’’ అంటాడు పృథ్వీ. అది నిజం. ‘సమాజం మారాలి’, ‘దురాగతాలు ఆగాలి’ అంటూ నినాదాలు చేస్తే ఫలితం ఉండదు. ఎవరు వచ్చి ఈ దుస్థితిని మారుస్తారా అని ఎదురుచూడటం వల్ల ఉపయోగం ఉండదు. మార్పును మనస్ఫూర్తిగా కోరుకుంటే మొదటి అడుగు మనమే వేయాలి. ఆ విషయాన్ని ఈ ఇద్దరూ నిరూపించారు!