ఐదు వికెట్లు తీసిన ఆంధ్ర బౌలర్
పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 260 ఆలౌట్
ఆంధ్ర రెండో ఇన్నింగ్స్ 248/5
కరణ్ షిండే అజేయ అర్ధశతకం
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పుదుచ్చేరితో జరుగుతున్న పోరులో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 209/5తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పుదుచ్చేరి జట్టు 79 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆంధ్ర జట్టుకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పుదుచ్చేరి బ్యాటర్ అమాన్ ఖాన్ (50) అర్ధశతకం సాధించాడు.
ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 5 వికెట్లు పడగొట్టగా... విజయ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొహమ్మద్ రఫీ, శశికాంత్, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
కరణ్ షిండే (136 బంతుల్లో 86 బ్యాటింగ్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో సత్తా చాటగా... శ్రీకర్ భరత్ (41; 7 ఫోర్లు), షేక్ రషీద్ (26; 3 ఫోర్లు), రికీ భుయ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్), శశికాంత్ (39 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు ఓవరాల్‌గా 291 పరుగుల ఆధిక్యంలో ఉంది.
స్కోరు వివరాలు
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 303; పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్: శ్రీధర్ రాజు (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 0; జయ్ పాండే (బి) పృథ్వీరాజ్ 3; పారస్ (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 39; ఆకాశ్ (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 7; మోహిత్ కాలె (సి) రషీద్ (బి) పృథ్వీరాజ్ 60; అరుణ్ కార్తీక్ (సి) రికీ భుయ్ (బి) పృథ్వీరాజ్ 59; అమాన్ ఖాన్ (సి) రికీ భుయ్ (బి) లలిత్ మోహన్ 50; అంకిత్ శర్మ (సి) శ్రీకర్ భరత్ (బి) విజయ్ 13; సాగర్ (సి) రషీద్ (బి) విజయ్ 0; అబిన్ మాథ్యూ (నాటౌట్) 4; గౌరవ్ యాదవ్ (సి) అభిషేక్ రెడ్డి (బి) రఫీ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (79 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–20, 4–84, 5–148, 6–225, 7–237, 8–238, 9–241, 10–260, బౌలింగ్: పృథ్వీరాజ్ 23–5–64–5; మొహమ్మద్ రఫీ17–1–53–1; శశికాంత్ 15–0–57–1; లలిత్ మోహన్ 16–2–42–1; విజయ్ 8–0–36–2.
ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) గౌరవ్ యాదవ్ 15; శ్రీకర్ భరత్ (ఎల్బీ) (బి) అంకిత్ శర్మ 41; షేక్ రషీద్ (రనౌట్) 26; కరణ్ షిండే (బ్యాటింగ్) 86; రికీ భుయ్ (సి) (సబ్) సీజీడీ శాస్త్రి (బి) అమన్ ఖాన్ 32; హనుమ విహారి (సి) శ్రీధర్ రాజు (బి) అంకిత్ శర్మ 0; శశికాంత్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (69 ఓవర్లలో 5 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–24, 2–81, 3–82, 4–141, 5–142, బౌలింగ్: గౌరవ్ యాదవ్ 10–1–49–1; అబిన్ మాథ్యూ 11–3–34–0; సాగర్ 21–3–72–0; అంకిత్ శర్మ 22–3–56–2; అమాన్ ఖాన్ 3–0–25–1;
ఆకాశ్ 2–1–11–0.
Comments
Please login to add a commentAdd a comment