Andhra Cricket Team
-
AND Vs RJS: ఐదు వికెట్లతో మెరిసిన విజయ్.. రాజస్తాన్‌ను చిత్తు చేసిన ఆంధ్ర
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు విజయంతో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ జట్టును చిత్తు చేసింది. తాజా సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆంధ్ర జట్టుకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.ఏడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 13 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆంధ్ర జట్టు ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఆరో స్థానంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 95/7తో శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ చివరకు 39.4 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.అభిజిత్ తోమర్ (31), అజయ్ సింగ్ (30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడారు. ఆంధ్ర జట్టు బౌలర్లలో త్రిపురాణ విజయ్ మరోసారి 5 వికెట్లతో విజృంభించగా... పృథ్వీరాజ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 31 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి గెలిచింది.రికీ భుయ్ (76 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... శ్రీకర్ భరత్ (43; 5 ఫోర్లు), కరణ్ షిండే (35 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేయగా... ఆంధ్ర జట్టు 220 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టిన ఆఫ్‌స్పిన్నర్ విజయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఎలైట్ గ్రూప్ ‘బి’ నుంచి విదర్భ, గుజరాత్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. చదవండి: 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ -
ఐదు వికెట్లతో చెలరేగిన శ్రీకాకుళం కుర్రాడు..
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఆంధ్ర ఆఫ్‌స్పిన్నర్ త్రిపురణ విజయ్ (5/62) విజృంభించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజస్తాన్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచిందిటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజీత్ తోమర్ (188 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకం చేజార్చుకోగా... మానవ్ సుతార్ (104 బంతుల్లో 54; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు.కెప్టెన్ మహిపాల్ లోమ్రర్ (2)తో పాటు కార్తీక్ శర (13), సమర్పత్ జోషి (8) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ 5 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు రెండు వికెట్లు తీశాడు. పృథ్వీ రాజ్, శశికాంత్, వినయ్ కుమార్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ఓపెనర్లు వంశీకృష్ణ (23 బంతుల్లో 18 బ్యాటింగ్; 3 ఫోర్లు), శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 26 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.ఢిల్లీకి ఆడనన్న విజయ్..కాగా శ్రీకాకుళంకు చెందిన త్రిపురణ విజయ్(Tripurana Vijay) తొలిసారి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో విజయ్ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగొలు చేసింది. విజయ్, 9 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 23 వికెట్లు తీసి, 166 పరుగులు సాధించాడు. రంజీ, కూచ్‌బెహర్ ట్రోఫీల్లోనూ రాణించాడు. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నీలోనూ మంచిగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి! -
శతక్కొట్టిన కరణ్ షిండే.. తేలని ఫలితం
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసింది. పుదుచ్చేరి జట్టుతో ఆదివారం ముగిసిన ఎలైట్ గ్రూప్ ‘బి’ ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినందుకు ఆంధ్ర జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 82.4 ఓవర్లలో 6 వికెట్లకు 319 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.ఓవర్‌నైట్ స్కోరు 86 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన కరణ్ షిండే (171 బంతుల్లో 119 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శశికాంత్ (39; 4 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరు వద్దే అవుటయ్యాడు. ఆ తర్వాత త్రిపురాణ విజయ్ (15; 2 ఫోర్లు), పృథ్వీరాజ్ (14 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సహకారంతో కరణ్ శతకం సాధించాడు. ఆంధ్ర నిర్దేశించిన 363 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి 46 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్లు ఆటను ముగించాయి. ఇక పుదుచ్చేరి ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు (148 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు), జై పాండే (131 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలు చేశారు. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆంధ్ర జట్టు 6 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 7 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 30 నుంచి విజయనగరంలో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్‌తో ఆంధ్ర తలపడుతుంది. -
మెరిసిన పృథ్వీరాజ్
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పుదుచ్చేరితో జరుగుతున్న పోరులో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 209/5తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పుదుచ్చేరి జట్టు 79 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆంధ్ర జట్టుకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పుదుచ్చేరి బ్యాటర్ అమాన్ ఖాన్ (50) అర్ధశతకం సాధించాడు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 5 వికెట్లు పడగొట్టగా... విజయ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొహమ్మద్ రఫీ, శశికాంత్, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కరణ్ షిండే (136 బంతుల్లో 86 బ్యాటింగ్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో సత్తా చాటగా... శ్రీకర్ భరత్ (41; 7 ఫోర్లు), షేక్ రషీద్ (26; 3 ఫోర్లు), రికీ భుయ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్), శశికాంత్ (39 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు ఓవరాల్‌గా 291 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 303; పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్: శ్రీధర్ రాజు (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 0; జయ్ పాండే (బి) పృథ్వీరాజ్ 3; పారస్ (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 39; ఆకాశ్ (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 7; మోహిత్ కాలె (సి) రషీద్ (బి) పృథ్వీరాజ్ 60; అరుణ్ కార్తీక్ (సి) రికీ భుయ్ (బి) పృథ్వీరాజ్ 59; అమాన్ ఖాన్ (సి) రికీ భుయ్ (బి) లలిత్ మోహన్ 50; అంకిత్ శర్మ (సి) శ్రీకర్ భరత్ (బి) విజయ్ 13; సాగర్ (సి) రషీద్ (బి) విజయ్ 0; అబిన్ మాథ్యూ (నాటౌట్) 4; గౌరవ్ యాదవ్ (సి) అభిషేక్ రెడ్డి (బి) రఫీ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (79 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–20, 4–84, 5–148, 6–225, 7–237, 8–238, 9–241, 10–260, బౌలింగ్: పృథ్వీరాజ్ 23–5–64–5; మొహమ్మద్ రఫీ17–1–53–1; శశికాంత్ 15–0–57–1; లలిత్ మోహన్ 16–2–42–1; విజయ్ 8–0–36–2. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) గౌరవ్ యాదవ్ 15; శ్రీకర్ భరత్ (ఎల్బీ) (బి) అంకిత్ శర్మ 41; షేక్ రషీద్ (రనౌట్) 26; కరణ్ షిండే (బ్యాటింగ్) 86; రికీ భుయ్ (సి) (సబ్) సీజీడీ శాస్త్రి (బి) అమన్ ఖాన్ 32; హనుమ విహారి (సి) శ్రీధర్ రాజు (బి) అంకిత్ శర్మ 0; శశికాంత్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (69 ఓవర్లలో 5 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–24, 2–81, 3–82, 4–141, 5–142, బౌలింగ్: గౌరవ్ యాదవ్ 10–1–49–1; అబిన్ మాథ్యూ 11–3–34–0; సాగర్ 21–3–72–0; అంకిత్ శర్మ 22–3–56–2; అమాన్ ఖాన్ 3–0–25–1; ఆకాశ్ 2–1–11–0. -
శశికాంత్ మెరిపించినా...
ముంబై: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆంధ్ర జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 5 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శశికాంత్ (25 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ షాట్లతో అజేయ అర్ధశతకం సాధించాడు. అశ్విన్ హెబర్ (85 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (75 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (47 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్), వినయ్ కుమార్ (40 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రీకర్ భరత్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో ఆంధ్ర జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఆఖర్లో శశికాంత్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో పోరాడే స్కోరు చేయగలిగింది. మహారాష్ట్ర బౌలర్లలో రజనీశ్ గుర్బానీ 3, ముకేశ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మహారాష్ట్ర 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిద్ధేశ్ వీర్ (124 బంతుల్లో 115 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... రాహుల్ త్రిపాఠి (78 బంతుల్లో 69; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో సందీప్ 2 వికెట్లు తీశాడు. గ్రూప్‌లో 6 మ్యాచ్‌లాడిన ఆంధ్ర 4 విజయాలు, 2 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
అజేయ శతకాలతో చెలరేగిన కేఎస్ భరత్, అశ్విన్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో ఆంధ్ర జట్టు అదరగొడుతోంది. గ్రూప్-‘బి’లో భాగంగా మేఘాలయతో పోరులో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 10 వికెట్ల తేడాతో మేఘాలయ(Andhra vs Meghalaya )ను మట్టికరిపించింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ జట్టు 48.2 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ నిశాంత చక్రవర్తి (108 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... అర్పిత్ (90 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించాడు. దీంతో ఒకదశలో మేఘాలయ జట్టు 182/1తో పటిష్ట స్థితిలో కనిపించింది.యారా సందీప్ 5 వికెట్లతో అదరగొట్టాడుఅయితే ఆ తర్వాత ఆంధ్ర బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో మేఘాలయ బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆంధ్ర బౌలర్లలో యారా సందీప్ 28 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ఆంజనేయులు, మహీప్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర 29.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 228 పరుగులు చేసింది.భరత్, అశ్విన్ అజేయ శతకాలుఆంధ్ర కెప్టెన్ శ్రీకర్ భరత్ (KS Bharat- 81 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించాడు. మరో ఓపెనర్ అశ్విన్ హెబర్ (Ashwin Hebbar- 96 బంతుల్లో 108 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) కూడా ‘శత’క్కొట్టడంతో ఆంధ్ర జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. మేఘాలయ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న భరత్... సిక్స్‌లతో చెలరేగిపోతే అశి్వన్ బౌండరీలతో హోరెత్తించాడు. వీరిద్దరూ పోటీపడి పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది.రెండో స్థానంలోగత మ్యాచ్‌లో సర్వీసెస్‌పై అజేయ అర్ధశతకాలతో వికెట్ నష్టపోకుండానే జట్టును గెలిపించిన భరత్, అశ్విన్... ఈసారి కూడా దాన్ని పునరావృతం చేశారు. 5 వికెట్లు తీసిన సందీప్నకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 4 విజయాలు, ఒక పరాజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం మహారాష్ట్రతో ఆంధ్ర జట్టు తలపడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
SMAT 2024: రికీ భుయ్ ఊచకోత.. దుమ్మురేపుతున్న ఆంధ్ర జట్టు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఆంధ్ర జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంధ్ర జట్టు 23 పరుగుల తేడాతో సర్వీసెస్ జట్టును ఓడించింది.కెప్టెన్ రికీ భుయ్ విధ్వంసంటాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (35 బంతుల్లో 84; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. మరోవైపు.. ప్రసాద్ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనమ్ పూనియా, మోహిత్ రాఠి, వినీత్ ధన్కడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది.అగ్రస్థానంలోకెప్టెన్ మోహిత్ అహ్లావత్ (37 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), వినీత్ ధన్కడ్ (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో పోరాడారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు 2 వికెట్లు తీశాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 16 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తదుపరి పోరులో మంగళవారం కేరళతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. స్కోరు వివరాలు ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (సి) అరుణ్ (బి) పూనమ్ పూనియా 63; అశ్విన్ హెబర్ (సి) అరుణ్ (బి) విశాల్ 1; షేక్ రషీద్ (సి) అరుణ్ (బి) పుల్కిత్ నారంగ్ 21; రికీ భుయ్ (సి) వినీత్ (బి) విశాల్ 84; పైలా అవినాశ్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 5; ప్రసాద్ (సి) విశాల్ (బి) పూనమ్ పూనియా 28; శశికాంత్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 0; వినయ్ కుమార్ (నాటౌట్) 7; సత్యనారాయణ రాజు (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–24, 2–63, 3–151, 4–175, 5–188, 6–209, 7–222, 8–222. బౌలింగ్: పూనమ్ పూనియా 4–0–37–2; గౌరవ్ శర్మ 3–0–43–0; విశాల్ గౌర్ 4–0–50–2; మోహిత్ రాఠి 4–0–35–0; పుల్కిత్ 1.5–0–17–1; వినీత్ ధన్కడ్ 2.1–0–24–2; నితిన్ తన్వర్ 1–0–16–0. సర్వీసెస్ ఇన్నింగ్స్: కున్వర్ పాఠక్ (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 2; రజత్ (సి) భరత్ (బి) శశికాంత్ 33; నితిన్ తన్వర్ (ఎల్బీ) రాజు 1; వినీత్ (సి) వినయ్ (బి) శశికాంత్ 51; మోహిత్ అహ్లావత్ (సి) రికీ భుయ్ (బి) రాజు 74; అరుణ్ (బి) శశికాంత్ 0; మోహిత్ రాఠి (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 5; గౌరవ్ శర్మ (రనౌట్/స్టీఫెన్) 3; పూనమ్ పూనియా (సి) ప్రసాద్ (బి) స్టీఫెన్ 17; విశాల్ గౌర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–4, 2–38, 3–50, 4–150, 5–150, 6–173, 7–175, 8–187, 9–199. బౌలింగ్: స్టీఫెన్ 4–0–26–3; శశికాంత్ 4–0–50–3; సత్యనారాయణ రాజు 4–0–39–2; వినయ్ కుమార్ 4–0–35–0; యశ్వంత్ 4–0–43–0. -
ఆంధ్ర ‘హ్యాట్రిక్’
సాక్షి, హైదరాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతోన్న ఆంధ్ర క్రికెట్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నమెంట్లో వరుస విజయాలతో దూసుకెళుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆంధ్ర జట్టు అదే జోరు కొనసాగిస్తూ మహారాష్ట్రను చిత్తు చేసి ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 75 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. పైలా అవినాశ్ (39 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించగా... అశి్వన్ హెబర్ (36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ 3, అర్షిన్ కులకర్ణి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన మహారాష్ట్ర జట్టు 15.4 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (21), దివ్యాంగ్ (24 నాటౌట్) కాస్త పోరాడారు. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (4) విఫలమయ్యాడు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, యశ్వంత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఆదివారం సర్వీసెస్ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది. స్కోరు వివరాలు ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (బి) ముకేశ్ 7; అశి్వన్ హెబర్ (స్టంప్డ్) రుతురాజ్ (బి) విక్కీ 36; షేక్ రషీద్ (సి) నిఖిల్ నాయక్ (బి) ముకేశ్ 0; అవినాశ్ (బి) అర్షిన్ కులకర్ణి 55; ఎస్డీఎన్వీ ప్రసాద్ (సి) సిద్ధార్థ్ (బి) అర్షిన్ కులకర్ణి 1; రికీ భుయ్ (సి) సిద్ధార్థ్ (బి) ముకేశ్ 28; శశికాంత్ (నాటౌట్) 17; బోధల కుమార్ (సి) త్రిపాఠి (బి) దివ్యాంగ్ 2; సత్యనారాయణ రాజు (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–8, 2–18, 3–79, 4–82, 5–133, 6–141, 7–148. బౌలింగ్: ముకేశ్ 4–0–21–3; రామకృష్ణ 2–0–23–0; అర్షిన్ కులకర్ణి 3–0–26–2; విక్కీ 4–0–34–1; దివ్యాంగ్ 4–0–42–1; అజీమ్ కాజీ 3–0–25–0. మహారాష్ట్ర ఇన్నింగ్స్: అర్షిన్ కులకర్ణి (బి) స్టీఫెన్ 16; రుతురాజ్ గైక్వాడ్ (సి) ప్రసాద్ (బి) సత్యనారాయణ రాజు 4; రాహుల్ త్రిపాఠి (సి) భరత్ (బి) శశికాంత్ 21; అంకిత్ (రనౌట్) 1; అజీమ్ కాజీ (సి అండ్ బి) శశికాంత్ 8; సిద్ధార్థ్ (సి) సత్యనారాయణ (బి) బోధల కుమార్ 0; నిఖిల్ నాయక్ (సి) భరత్ (బి) శశికాంత్ 10; దివ్యాంగ్ (నాటౌట్) 24; రామకృష్ణ (ఎల్బీ) యశ్వంత్ 1; విక్కీ (బి) యశ్వంత్ 0; ముకేశ్ (బి) యశ్వంత్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.4 ఓవర్లలో ఆలౌట్) 99. వికెట్ల పతనం: 1–20, 2–22, 3–30, 4–45, 5–50, 6–62, 7–63, 8–64, 9–64, 10–99. బౌలింగ్: స్టీఫెన్ 2–0–11–1; శశికాంత్ 4–0–22–3; సత్యనారాయణ రాజు 2–0–10–1; బోధల కుమార్ 4–0–24–1; యశ్వంత్ 3.4–0–29–3. -
రాణించిన విజయ్, స్టీఫెన్
సాక్షి, హైదరాబాద్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు త్రిపురాణ విజయ్ 8 పరుగులిచ్చి 4 వికెట్లు... స్టీఫెన్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నాగాలాండ్‌ను దెబ్బ తీశారు. శశికాంత్, సత్యనారాయణ రాజు, వినయ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం ఆంధ్ర జట్టు 9.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు కోన శ్రీకర్ భరత్ (26 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), అశ్విన్ హెబ్బర్ (24 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక షేక్ రషీద్ (4 నాటౌట్), వంశీకృష్ణ (5 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో గోవాతో ఆంధ్ర తలపడుతుంది. -
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన తెలుగు కుర్రాళ్లు వీరే..
జెద్దా వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2025 మెగా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు పైలా అవినాష్, సత్యనారాయణ రాజు, షేక్ రషీద్ అమ్ముడుపోయారు. షేక్ రషీద్ ఇప్పటికే ఐపీఎల్లో ఓసారి సీఎస్కే జట్టులో భాగం కాగా.. అవినాష్, సత్యనారాయణలకు మాత్రం తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కింది.విశాఖపట్నంకు చెందిన అవినాష్‌ను కనీస ధర రూ. 30 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కాగా 24 ఏళ్ల అవినాష్‌కు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో బెజవాడ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఏపీఎల్-2024 సీజన్లో అవినాష్ అదరగొట్టాడు. కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని పంజాబ్ సొంతం చేసుకుంది. మరోవైపు కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగొలు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న సత్యనారాయణ.. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. ఇప్పటివరకు కేవలం 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతడు 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ముంబై తమ జట్టులో చేర్చుకుంది. ఇక గుంటూరు క్రికెటర్ షేక్ రషీద్‌ను మరో సారి సీఎస్కే సొంతం చేసుకుంది. అతడు కూడా తన బేస్ ప్రైస్ రూ.30 లక్షలకే అమ్ముడుపోయాడు. -
షేక్ రషీద్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ షేక్ రషీద్ (372 బంతుల్లో 203; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ , తో చెలరేగడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 147 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఓవర్‌నైట్ స్కోరు 168/2తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 143 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. కరణ్ షిండే (221 బంతుల్లో 109; 12 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... షేక్ రషీద్ ద్విశతకంతో విజృంభించాడు. తాజా రంజీ సీజన్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రషీద్ ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేయగా... హైదరాబాద్ బౌలర్లు అతడిని కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రషీద్... పరిస్థితులను ఆకలింపు చేసుకున్న అనంతరం ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు కరణ్ షిండేతో కలిసి రషీద్ 236 పరుగులు జోడించి జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు. హనుమ విహారి (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (33; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 4 వికెట్లు... చామా మిలింద్, రక్షణ్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం యరా సందీప్ (73 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్), లలిత్ మోహన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
రాణించిన రషీద్, కరణ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న పోరు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 244/5తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు చివరకు 105.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (287 బంతుల్లో 159; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాణించాడు. వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (22) క్రితం రోజు స్కోరు వద్దే అవుట్ కాగా.. చామా మిలింద్ (5), తనయ్ త్యాగరాజన్ (10), అనికేత్ రెడ్డి (10) పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ 5, మొహమ్మద్ రఫీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 58 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.కెప్టెన్ షేక్ రషీద్ (161 బంతుల్లో 79 బ్యాటింగ్; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... కరణ్ షిండే (41 బ్యాటింగ్; 4 ఫోర్లు), అభిషేక్ రెడ్డి (38; 4 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. రషీద్‌తో పాటు కరణ్ షిండే క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) సందీప్ (బి) రఫీ 124; అభిరత్ రెడ్డి (సి) మోహన్ (బి) విజయ్ 35; రోహిత్ రాయుడు (సి) (సబ్) జ్ఞానేశ్వర్ (బి) విజయ్ 0; హిమతేజ (సి) భరత్ (బి) సందీప్ 36; రాహుల్ సింగ్ (సి అండ్ బి) విజయ్ 1; నితీశ్ రెడ్డి (స్టంప్డ్) భరత్ (బి) మోహన్ 22; రాహుల్ రాదేశ్ (ఎల్బీ) (బి) శశికాంత్ 22; మిలింద్ (బి) విజయ్ 5; తనయ్ (సి) రషీద్ (బి) విజయ్ 10; అనికేత్ రెడ్డి (సి) భరత్ (బి) రఫీ 7; రక్షణ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 301. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, 6–245, 7–253, 8–265, 9–288, 10–301. బౌలింగ్: శశికాంత్ 19–4–38–1; రఫీ 24.4–4–5–59–2; విజయ్ 31–5–118–5; లలిత్ మోహన్ 23–4–64–1; సందీప్ 8–0–18–1. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: హేమంత్ (సి) నితీశ్ (బి) రక్షణ్ 9; అభిషేక్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 38; షేక్ రషీద్ (బ్యాటింగ్) 79; కరణ్ షిండే (బ్యాటింగ్) 41; ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (58 ఓవర్లలో 2 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–17, 2–84, బౌలింగ్: మిలింద్ 8–2–21–0; రక్షణ్ రెడ్డి 10–0–35–1; అనికేత్ రెడ్డి 22–5–56–1; తనయ్ త్యాగరాజన్ 9–0–39–0; రోహిత్ రాయుడు 9–2–16–0. -
తన్మయ్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (240 బంతుల్లో 124 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఉప్పల్ స్టేడియంలో ఆంధ్ర జట్టుతో మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. హైదరాబాద్ మాజీ కెపె్టన్ తన్మయ్ రోజంతా బ్యాటింగ్ చేసి అజేయ శతకంతో అలరించాడు. అభిరత్ రెడ్డి (114 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్), హిమతేజ (36; 7 ఫోర్లు) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (1)తో పాటు రోహిత్ రాయుడు (0) విఫలం కాగా.. నితీశ్ రెడ్డి (22), వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (22 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్ మోహన్, యరా సందీప్ చెరో వికెట్ తీశారు. తాజా సీజన్లో హైదరాబాద్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది. మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మొత్తం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు ఆంధ్ర జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బ్యాటింగ్) 124; అభిరత్ రెడ్డి (సి) మోహన్ (బి) విజయ్ 35; రోహిత్ రాయుడు (సి) (సబ్) జ్ఞానేశ్వర్ (బి) విజయ్ 0; హిమతేజ (సి) భరత్ (బి) సందీప్ 36; రాహుల్ సింగ్ (సి అండ్ బి) విజయ్ 1; నితీశ్ రెడ్డి (స్టంప్డ్) భరత్ (బి) మోహన్ 22; రాహుల్ రాదేశ్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 244. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, బౌలింగ్: శశికాంత్ 15–3–32–0; రఫీ 17–3–41–0; విజయ్ 27–4–85–3; లలిత్ మోహన్ 23–4–64–1; సందీప్ 8–0–18–1. -
భరత్, విహారి పోరాడినా...
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ అది దక్కలేదు. ఊరించే లక్ష్య ఛేదనలో మిడిలార్డర్ రాణించినా... కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బ కొట్టింది. మొత్తానికి పరాజయాల హ్యాట్రిక్ అనంతరం తాజా సీజన్లో ఆంధ్ర జట్టు ఓటమినుంచి తప్పించుకుంటూ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. 321 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 8/1తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు... చివరకు 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (90 బంతుల్లో 92; 12 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా... హనుమ విహారి (189 బంతుల్లో 66; 6 ఫోర్లు, ఒక సిక్సర్), కరణ్ షిండే (171 బంతుల్లో 65; 8 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. ఓపెనర్లు అభిషేక్ రెడ్డి (6), మారంరెడ్డి హేమంత్ రెడ్డి (2) త్వరగానే ఔటవడంతో ఆంధ్ర జట్టుకు మరో ఓటమి తప్పదనిపించినా... కెపె్టన్ షేక్ రషీద్ (31; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. అతడు వెనుదిరిగిన తర్వాత కరణ్ షిండే , హనుమవిహారి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. విహారి అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆలరించగా.. శ్రీకర్ భరత్ ఎడాపెడా బౌండ్రీలతో మైదానాన్ని హోరెత్తించాడు. అతడున్నంతసేపు ఆంధ్ర జట్టు విజయం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా... అతడు పెవిలియన్ చేరడంతో ఆంధ్ర జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ ధాపోలా 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఉత్తరాఖండ్ ఓపెనర్ ప్రియాన్షు ఖండూరికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 338; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 146; ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్ 128/9 డిక్లేర్డ్; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (బి) దీపక్ ధాపోలా 6; హేమంత్ రెడ్డి (ఎల్బీ) (బి) దీపక్ ధాపోలా 2; షేక్ రషీద్ (ఎల్బీ) (బి) దీపక్ ధాపోలా 31; కరణ్ షిండే (సి) అవనీశ్ సుధ (బి) దీపక్ ధాపోలా 65; హనుమ విహారి (బి) దీపక్ ధాపోలా 66; శ్రీకర్ భరత్ (సి) ఆదిత్య తారె (బి) దేవేంద్ర సింగ్ బోరా 92; శశికాంత్ (నాటౌట్) 7; విజయ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 16, మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–8, 2–13, 3–56, 4–140, 5–276, 6–282, బౌలింగ్: దీపక్ ధాపోలా 21–3–75–5, మయాంక్ మిశ్రా 16–5–34–0; స్వప్నిల్ సింగ్ 19–3–52–0, అభయ్ నేగీ 17–4–57–0, దేవేంద్ర సింగ్ బోరా 14–2–46–1, అవనీశ్ సుధ 5–1–6–0, రవికుమార్ సమర్థ్ 1–0–1–0. -
ప్రియాన్షు అజేయ సెంచరీ
సాక్షి, విజయనగరం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర జట్టుకు నాలుగో మ్యాచ్‌లోనూ మెరుగైన ఆరంభం దక్కలేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆంధ్ర జట్టు... ఎలైట్ గ్రూప్ ‘బి’లో అట్టడుగున కొనసాగుతోంది. విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 232 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్షు ఖండూరి (272 బంతుల్లో 107 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగగా... మరో ఓపెనర్ అవ్నీశ్ (158 బంతుల్లో 86; 12 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 157 పరుగులు జోడించి ఉత్తరాఖండ్‌కు బలమైన పునాది వేశారు. 29 ఏళ్ల ప్రియాన్షుకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది రెండో సెంచరీ కాగా... శతకం చేసేలా కనిపించిన అవ్నీశ్ను ఆంధ్ర స్పిన్నర్ లలిత్ మోహన్ అవుట్ చేశాడు.ఆ తర్వాత కెప్టెన్ రవికుమార్ సమర్థ్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు) కూడా సాధికారికంగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడిన ఉత్తరాఖండ్ ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్ చేసిన 2.66 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఉత్తరాఖండ్‌ను గురువారం ఆంధ్ర బౌలర్లు ఏమాత్రం అడ్డుకుంటారో చూడాలి. స్కోరు వివరాలు ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్: అవ్నీశ్ (సి) షేక్ రషీద్ (బి) లలిత్ మోహన్ 86; ప్రియాన్షు ఖండూరి (బ్యాటింగ్) 107; రవికుమార్ సమర్థ్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (87 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 232. వికెట్ల పతనం: 1–157, బౌలింగ్: చీపురుపల్లి స్టీఫెన్ 19–6–42–0; శశికాంత్ 18–8–31–0; సత్యనారాయణ రాజు 15–3–50–0; లలిత్ మోహన్ 26–2–83–1; త్రిపురాణ విజయ్ 6–1–15–0; మారంరెడ్డి హేమంత్ రెడ్డి 3–0–6–0. -
విశాఖలో మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్‌కు నగరం వేదిక కానుంది. పీఎం పాలెంలో గల ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం నుంచి ఈ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.కాగా అక్టోబరు 26- 29 వరకు ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇన్నింగ్స్ సాగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సెషన్లో సెషన్లో ఆంధ్ర, మధ్యాహ్నం సెషన్లో హిమాచల్‌ప్రదేశ్ జట్లు నెట్స్‌లో ప్రాక్టీసు చేశాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు నిర్వాహకులు క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ అందించారు.క్రికెట్ అభిమానులకు శుభవార్తరేపటి నుంచి ఆరంభం కానున్న రంజీ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. స్టేడియం వద్ద 15వ నంబర్ గేట్ నుంచి ఉచిత ప్రవేశం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆంధ్ర జట్టు తొలుత విదర్భ చేతిలో 74 పరుగులు, రెండో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది.ఆంధ్రా జట్టు కెప్టెన్‌గా రషీద్ఆంధ్రా జట్టు కెప్టెన్ రికీబుయ్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీష్‌కుమార్ ఆస్ట్రేలియా టూర్లో భాగంగా అనధికార నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపికవడంతో అందుబాటులో లేరు. ఆంధ్రా జట్టుకు షేక్ రషీద్ నాయకత్వం వహించనుండగా అభిషేక్ రెడ్డి, హానుమ విహారి ఓపెనింగ్ చేయనుండగా అశ్విన్ హెబ్బర్ మిడిలార్డర్లోను, శ్రీకర్ భరత్ కీపింగ్ చేస్తారు. మహీప్‌కుమార్, వంశీకృష్ణ బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో స్టీఫెన్, సత్యనారాయణ, శశికాంత్, స్పిన్ బౌలింగ్ విభాగంలో లలిత్, విజయ్ బంతి, మనీష్ మెరుపులు మెరిపించనున్నారు. రఫీ, కరణ్ షిండే సైతం జట్టుకు ఎంపికయ్యారు.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
Ranji Trophy 2024: ఆంధ్ర జట్టు కొంపముంచిన ఒకే ఒక్క వికెట్..
రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మాజీ చాంపియన్ గుజరాత్ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది.ఆంధ్ర నిర్దేశించిన 144 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ జట్టు 50.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 131 పరుగులవద్ద గుజరాత్ 9వ వికెట్‌ను చేజార్చుకోగా... అర్జన్ నాగ్వాస్వాలా (16 నాటౌట్; 1 ఫోర్) గుజరాత్ జట్టును గట్టెక్కించాడు.ఆంధ్ర జట్టు స్పిన్నర్ లలిత్ మోహన్ 76 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి తమ జట్టుకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. శశికాంత్‌కు ఒక వికెట్ దక్కగా... మరో వికెట్ రనౌట్ రూపంలో వచి్చంది. అంతకుముందు ఫాలోఆన్ ఆడుతూ ఓవర్‌నైట్ స్కోరు 203/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 90.5 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. శ్రీకర్ భరత్ (47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (32; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (34; 6 ఫోర్లు), త్రిపురాణ విజయ్ (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నాగ్వాస్వాలా 4 వికెట్లు తీయగా... సిద్ధార్థ్ దేశాయ్, రవి బిష్ణోయ్ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు.చదవండి: Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన! -
ఆంధ్ర ఫాలోఆన్
అహ్మదాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా మాజీ చాంంపియన్ గుజరాత్‌తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఫాలోఆన్‌లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ వైఫల్యంతో తక్కువ స్కోరుకే ఆలౌటైన ఆంధ్ర జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతూ 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ రెడ్డి (113 బంతుల్లో 81; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), మహీప్ కుమార్ (55; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో సత్తా చాటారు. కెప్టెన్ రికీ భుయ్ (0), షేక్ రషీద్ (3) విఫలం కాగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (31 బ్యాటింగ్; ఒక ఫోర్, ఒక సిక్సర్), హనుమ విహారి (24 బ్యాటింగ్; 3 ఫోర్లు) పోరాడుతున్నారు. గుజరాత్ బౌలర్లలో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 137/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరకు 51.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్ చేతులెత్తేసిన చోట శ్రీకర్ భరత్ (96 బంతుల్లో 98; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. భారీ షాట్లతో చెలరేగిన భరత్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన నితీశ్ కుమార్ రెడ్డి (47; 7 ఫోర్లు, ఒక సిక్సర్), విజయ్ (36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. గుజరాత్ బౌలర్లలో కెపె్టన్ చింతన్ గాజా 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న గుజరాత్ జట్టు ఆంధ్రను ఫాలోఆన్ ఆడించగా... రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 6 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు 49 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భరత్, విహారి క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు గుజరాత్ తొలి ఇన్నింగ్స్ 367; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 213; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) రవి బిష్ణోయ్ 81; మహీప్ కుమార్ (బి) రవి బిష్ణోయ్ 55; రికీ భుయ్ (సి అండ్ బి) అర్జాన్ 0; షేక్ రషీద్ (ఎల్బీ) రవి బిష్ణోయ్ 3; శ్రీకర్ భరత్ (బ్యాటింగ్) 31; హనుమ విహారి (బ్యాటింగ్) 24; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 203. వికెట్ల పతనం: 1–130, 2–131, 3–138, 4–145, బౌలింగ్: చింతన్ గాజా 6–2–21–0; అర్జాన్ 11– 3–20–1; సిద్ధార్థ్ దేశాయ్ 22–4–55–0; రవి బిష్ణోయ్ 17–2–67–3; జయ్‌మీత్ పటేల్ 6–2–8–0; మనన్ హింగ్రాజియా 4–0–24–0. -
శ్రీకర్ భరత్ పోరాటం
అహ్మదాబాద్: సహచరులు విఫలమైన చోట వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (72 బంతుల్లో 78 బ్యాటంగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఫలితంగా గుజరాత్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తేరుకోగలిగింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్‌తో పాటు... ఇటీవల బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన నితీశ్ కుమార్ రెడ్డి (34; 6 ఫోర్లు) సత్తా చాటాడు. కెప్టెన్ రికీ భుయ్ (9), హనుమ విహారి (0), షేక్ రషీద్ (1), మహీప్ కుమార్ (0), అభిõÙక్ రెడ్డి (15) విఫలమయ్యారు. దీంతో ఒక దశలో ఆంధ్ర జట్టు 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు గుజరాత్ బౌలర్లు విజృంభిస్తుంటే... ఆంధ్ర బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఈ దశలో ఆత్మరక్షణ ధోరణి వీడిన శ్రీకర్ భరత్ ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. అతడికి నితీశ్ కుమార్ రెడ్డి కూడా తోడవడంతో ఆంధ్ర జట్టు కోలుకోగలిగింది. ఈ జంట అబేధ్యమైన ఆరో వికెట్‌కు 107 పరుగులు జోడించింది. గుజరాత్ బౌలర్లలో చింతన్ గాజా 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 289/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ చివరకు 106 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ చింతన్ గాజా (152 బంఉత్లో 92; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా... అర్జాన్ నాగ్వస్వల్లా (82 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయంగా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, లలిత్ మోహన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో ఐదు వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 230 పరుగులు వెనుకబడి ఉంది. శ్రీకర్ భరత్, నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 367; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిõÙక్ రెడ్డి (సి) మనన్ హింగ్రాజియా (బి) జడేజా 15; మహీప్ కుమార్ (సి) ఉర్విల్ పటేల్ (బి) అర్జాన్ 0; షేక్ రషీద్ (సి) మనన్ హింగ్రాజియా (బి) చింతన్ గాజా 1; హనుమ విహారి (బి) చింతన్ గాజా 0; రికీ భుయ్ (సి) ఉర్విల్ పటేల్ (బి) చింతన్ గాజా 9; శ్రీకర్ భరత్ (నాటౌట్) 78; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (32 ఓవర్లలో 5 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–4, 2–5, 3–5, 4–25, 5–29, బౌలింగ్: చింతన్ గాజా 9–1–40–3; అర్జాన్ 7–1–22–1; ప్రియాజిత్సింగ్ జడేజా 3.5–0–25–1; సిద్ధార్థ్ దేశాయ్ 8–1–27–0; జయ్‌మీత్ పటేల్ 0.1–0–0–0, రవి బిష్ణోయ్ 4–0–23–0 -
VIDAR Vs AP: నిరాశపరిచిన కేఎస్ భరత్.. ఆంధ్ర జట్టు ఓటమి
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ఆరంభించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.కాగా 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 79/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఒకదశలో ఒక వికెట్ నష్టానికి 177 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఓపెనర్ అభిషేక్ రెడ్డి (78; 5 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (74; 7 ఫోర్లు) 12 పరుగుల వ్యవధిలో అవుటవ్వడంతో ఆంధ్ర జట్టు పతనం మొదలైంది.శశికాంత్ కాస్త పోరాడినావీరిద్దరు పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన ఇతర బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కెప్టెన్ రికీ భుయ్ (26; 1 ఫోర్, 1 సిక్స్), శశికాంత్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడినా... కేఎస్ భరత్ (2), అశ్విన్ హెబర్ (3) నిరాశపరిచారు. విజయ్ (0), లలిత్ మోహన్ (0), సత్యనారాయణ రాజు (0) డకౌట్ అయ్యారు.చివరి వికెట్‌గా శశికాంత్ వెనుదిరిగాడు. విదర్భ జట్టు బౌలర్లు ఆదిత్య థాకరే (4/47), హర్ష్ దూబే (4/69), అక్షయ్ వాఖరే (2/71) ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో విదర్భ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఈనెల 18 నుంచి జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
విధ్వంసం సృష్టించిన తెలుగు కుర్రాడు.. ఎవరీ నితీష్ రెడ్డి?
ఐపీఎల్లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు కుర్రాడు తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్లాసెన్, మార్క్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర ఆటగాడు సత్తాచాటాడు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో కాస్త సెట్ అయ్యాక భీబత్సం సృష్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి నితీష్ మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టుకు 182 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. కాగా నితీష్ కుమార్‌కు తన ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా నితీష్ ఓ వికెట్ పడగొట్టాడు. ఎవరీ నితీష్ కుమార్ రెడ్డి..? 20 ఏళ్ల కాకి నితీష్ కుమార్ రెడ్డి 2003, మే 26న విశాఖపట్నంలో జన్మించాడు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. నితీష్‌కు 14 ఏళ్ల వయస్సులో విజయ్ మర్చంట్ ట్రోఫీ(2017-18)లో ఆంద్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని నితీష్ సద్వినియోగ పరుచుకున్నాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో 176.41 యావరేజ్‌తో 1237 పరుగులు, బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు. బీసీసీఐ నుంచి 2017-18 ఏడాదికి గాను ‘బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16’ జగన్మోహియా దాల్మియా అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2020 రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2021లో లిస్ట్-ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20ల్లో కూడా నితీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన రెడ్డి.. 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించారు. కాగా టీ20ల విషయానికి వస్తే.. ఆంధ్రా జట్టు తరపున 8 మ్యాచ్‌లు ఆడిన నితీష్ 106 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో నితీశ్ రెడ్డిని ఐపీఎల్ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో నితీష్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్లో హాఫ్ సెంచరీ నాలుగో ఆంధ్రా క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాల రావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. 5️⃣0️⃣ up for Nitish Reddy 💪 The local lad is turning it up 🔥#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/GguSBFYiFc — JioCinema (@JioCinema) April 9, 2024 -
Ranji Trophy: నరాలు తెగే ఉత్కంఠ.. మనోళ్లు ఆఖరి వరకు పోరాడి..
Ranji Trophy 2023-24- Madhya Pradesh vs Andhra, Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రికీ భుయ్ బృందం.. ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడి నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. రంజీ తాజా ఎడిషన్ ఆరంభంలో కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి బ్యాటింగ్‌పై దృష్టి సారించే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. రికీ భుయ్ పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌తో పోటీకి సిద్ధమైన ఆంధ్ర.. శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. కేవీ శశికాంత్ నాలుగు, నితీశ్‌రెడ్డి మూడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటర్లు మాత్రం ఆంధ్రకు శుభారంభం అందించలేకపోయారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే జట్టు కుప్పకూలింది. రికీ భుయ్ 32, కరణ్ షిండే 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హనుమ విహారి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ను ఈసారి... 107 బౌలర్లకే ఆలౌట్ చేశారు ఆంధ్ర బౌలర్లు. ఈ నేపథ్యంలో 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి 43, కరణ్ షిండే 5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టగా.. మరో 12 పరుగులను విహారి, తొమ్మిది పరుగులను కరణ్ తమ తమ స్కోర్లకు జతచేసి అవుటయ్యారు. మిగిలిన వాళ్లలో అశ్విన్ హెబ్బర్ 22 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఆఖర్లో గిరినాథ్‌రెడ్డి పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేయగా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 165 పరుగులకే పరిమితమైన ఆంధ్ర జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో(Madhya Pradesh won by 4 runs Enters Semis) అడుగుపెట్టింది. ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ స్కోర్లు: ►మధ్యప్రదేశ్- 234 & 107 ►ఆంధ్రప్రదేశ్- 172 & 165. -
సెమీస్‌కు చేరువలో ఆంధ్ర..
ఇండోర్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌కు ఆంధ్ర జట్టు మరో 75 పరుగుల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి (43 బ్యాటింగ్), కరణ్ షిండే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 40.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/28), శశికాంత్ (3/20), లలిత్ మోహన్ (3/20) మధ్యప్రదేశ్‌ను దెబ్బ తీశారు. -
ఆంధ్ర 172 ఆలౌట్
ఇండోర్: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆంధ్ర తమ మొదటి ఇన్నింగ్స్‌లో 68.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మధ్యప్రదేశ్‌కు 62 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆంధ్ర బ్యాటర్లలో కరణ్ షిండే (38), కెప్టెన్ రికీ భుయ్ (32) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ చెరో 3 వికెట్లు తీయగా...అవేశ్ ఖాన్, కుల్వంత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసి తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 83 పరుగులకు పెంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 234 పరుగులకు ఆలౌటైంది. 893 రంజీ ట్రోఫీలో ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ చేసిన పరుగులు. ప్రస్తుతం ఈ సీజన్లో అత్యధిక పరుగుల జాబితాలో అతను అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఒకే సీజన్లో ఆంధ్ర తరఫున అత్యధిక పరుగులు (868) చేసిన అమోల్ మజుందార్ (2012–13) రికార్డును భుయ్ సవరించాడు. -
బంతితో మెరిసిన శశికాంత్, నితీశ్
ఇండోర్: భారీ స్కోరు దిశగా సాగుతోన్న మధ్యప్రదేశ్ జట్టును తమ మీడియం పేస్ బౌలింగ్‌తో ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (4/37), నితీశ్ కుమార్ రెడ్డి (3/50) కట్టడి చేశారు. శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మధ్యప్రదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 234 పరుగులు సాధించింది. పచ్చికతో కూడిన పిచ్‌పై ఓపెనర్లు యశ్ దూబే (133 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్), హిమాన్షు మంత్రి (97 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్ 37వ ఓవర్లో హిమాన్షును శశికాంత్ అవుట్ చేయడంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ పతనం మొదలైంది. 36 పరుగుల తేడాలో మధ్యప్రదేశ్ 7 వికెట్లు కోల్పోయింది. దాంతో 123/0తో పటిష్టంగా కనిపించిన మధ్యప్రదేశ్ 159/7తో కష్టాల్లో పడింది. ఈ దశలో సారాంశ్ జైన్ (108 బంతుల్లో 41 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కార్తికేయ (79 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి మధ్యప్రదేశ్ స్కోరును 200 దాటించారు. కార్తికేయను అవుట్ చేసి శశికాంత్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టగా... అవేశ్ ఖాన్‌ను గిరినాథ్ రెడ్డి రనౌట్ చేయడంతో మధ్యప్రదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. -
6 బంతుల్లో 6 సిక్స్‌లు.. యువీని గుర్తు చేశాడుగా! వీడియో వైరల్
కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్ -23 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర ఓపెనర్ మామిడి వంశీ కృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో వంశీ ఈ ఫీట్ నమోదు చేశాడు. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన 10వ ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లు బాది వంశీ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న వంశీ కృష్ణ 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మూడో బ్యాటర్‌గా.. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కృష్ణ నిలిచాడు. అతడి కంటే ముందు రవి శాస్త్రి, రుతురాజ్ గైక్వాడ్ భారత్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం భారత తరపున దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒక్కడే 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ వరుసగా 6 సిక్స్‌లు బాదాడు. మ్యాచ్ డ్రా.. ఇక ఆంధ్ర-రైల్వేస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ డ్రా అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రైల్వేస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. యాన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలతో చెలరేగారు. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ చివరిలో డ్రాగా ముగుస్తుంది. అన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలు, అంచిత్ యాదవ్ (133) సెంచరీలతో రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. 𝟔 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 𝐀𝐥𝐞𝐫𝐭! 🚨 Vamshhi Krrishna of Andhra hit 6 sixes in an over off Railways spinner Damandeep Singh on his way to a blistering 64-ball 110 in the Col C K Nayudu Trophy in Kadapa. Relive 📽️ those monstrous hits 🔽@IDFCFIRSTBank | #CKNayudu pic.twitter.com/MTlQWqUuKP — BCCI Domestic (@BCCIdomestic) February 21, 2024 -
Ranji Trophy: ఆంధ్ర సహా క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లు ఇవే
Ranji Trophy 2023-24- Quarter Finals: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ఎలైట్ డివిజన్లో మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా (ఎ, బి,సి,డి; 8 జట్ల చొప్పున) విభజించారు. గ్రూప్ ‘బి’లో ముంబై జట్టు 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో (3 విజయాలు, 3 ‘డ్రా’, 1 ఓటమి) రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌కంటే ముందే ఈ రెండు జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఎలైట్ డివిజన్‌కు హైదరాబాద్ అర్హత కాగా 32 జట్లలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మణిపూర్, గోవా జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోగా... ‘ప్లేట్’ డివిజన్లో ఫైనల్ చేరిన హైదరాబాద్, మేఘాలయ ఎలైట్ డివిజన్‌కు అర్హత పొందాయి. ఫిబ్రవరి 23 నుంచి క్వార్టర్ ఫైనల్స్ ►ఇక ఈనెల 23 నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటకతో విదర్భ (నాగ్‌పూర్‌లో- Vidarbha vs Karnataka, 1st Quarter Final) ►ముంబైతో బరోడా (ముంబైలో- Mumbai vs Baroda, 2nd Quarter Final) ►తమిళనాడుతో సౌరాష్ట్ర (కోయంబత్తూరులో- Tamil Nadu vs Saurashtra, 3rd Quarter Final) ►మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర (ఇండోర్‌లో- Madhya Pradesh vs Andhra, 4th Quarter Final ) తలపడతాయి. ఆటకు వీడ్కోలు ఇక రంజీ తాజా సీజన్ సందర్భంగా ఐదుగురు క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. మనోజ్ తివారి(బెంగాల్), ధవళ్ కులకర్ణి(ముంబై), సౌరభ్ తివారి(జార్ఖండ్), ఫైజ్ ఫజల్(విదర్భ), వరుణ్ ఆరోన్(జార్ఖండ్) ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టిన ఆంధ్ర బ్యాటర్..
కడప స్పోర్ట్స్: కల్నర్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్–23 క్రికెట్ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓపెనర్ మామిడి వంశీకృష్ణ (64 బంతుల్లో 110; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ ఒకే ఓవర్లోని వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో వంశీకృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు సంధించాడు. అనంతరం ఈ జోరు కొనసాగిస్తూ వంశీకృష్ణ 48 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీకే నాయుడు ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాటర్‌గా వంశీకృష్ణ రికార్డు నెలకొల్పాడు. మామిడి వంశీకృష్ణతోపాటు వన్‌డౌన్ బ్యాటర్, కెపె్టన్ వంశీకృష్ణ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), ధరణి కుమార్ (81; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకట్ రాహుల్ (61 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా రాణించారు. ఇంతకుముందు అంతర్జాతీయ వన్డేల్లో హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), జస్కరణ్ మల్హోత్రా (అమెరికా)... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్ సింగ్ (భారత్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్)... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో (మూడు/నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లు) గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), లీ జెర్మన్ (న్యూజిలాండ్)... దేశవాళీ వన్డేల్లో తిసారా పెరీరా (శ్రీలంక), రుతురాజ్ గైక్వాడ్ (భారత్)... దేశవాళీ టి20ల్లో రోజ్ వైట్లీ (ఇంగ్లండ్), లియో కార్టర్ (న్యూజిలాండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఒకే ఓవర్లో వరుస 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు. -
సెంచరీతో చెలరేగిన కెప్టెన్.. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గ్రూప్ ‘బి’ నుంచి ముంబై, ఆంధ్ర జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాక ముంబై 30 పాయింట్లతో తొలి స్థానంలో, ఆంధ్ర 25 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. కేరళ 14 పాయింట్లతో మూడో స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈనెల 16 నుంచి జరిగే చివరిదైన ఏడో రౌండ్ మ్యాచ్‌ల్లో కేరళతో ఆంధ్ర; అస్సాంతో ముంబై తలపడతాయి. తమ చివరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై ఇన్నింగ్స్ తేడాతో నెగ్గినా కేరళ జట్టు 21 పాయింట్లతో మూడో స్థానం వద్దే ఆగిపోతుంది కాబట్టి ముంబై, ఆంధ్ర జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖాయమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌తో సోమవారం ముగిసిన లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 271/5తో ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 145 ఓవర్లలో 9 వికెట్లకు 429 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (129; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 29 పరుగులు జోడించి అవుటయ్యాడు. షేక్ రషీద్ (85; 10 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. మ్యాచ్‌లో 72 పరుగులు చేయడంతోపాటు 5 వికెట్లు పడగొట్టిన ఆల్‌రౌండర్ శశికాంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
తొలి ఇన్నింగ్స్‌లో యూపీ 198 ఆలౌట్.. ఆంధ్రకు కీలక ఆధిక్యం!
విజయనగరం: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర ఆటగాడు శశికాంత్ (5/54) రెండో రోజు బౌలింగ్‌లో విజృంభించాడు. దీంతో ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం 236/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 95.1 ఓవర్లలో 261 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ రికీభుయ్ (94; 10 ఫోర్లు, 1 సిక్స్) తన ఓవర్‌నైట్ స్కోరుకు 4 పరుగులే జతచేసి... సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కరణ్ షిండే (45), రికీ భుయ్ అవుటయ్యాక ఆంధ్ర ఇన్నింగ్స్ కూలేందుకు ఎంతో సేపు పట్టలేదు. రెండో రోజు 25 పరుగులే చేసిన ఆంధ్ర 6 వికెట్లను కోల్పోయింది. యశ్ దయాళ్, అంకిత్ చెరో 3 వికెట్లు తీశారు. అయితే ఆ తర్వాత యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. ఆర్యన్ జుయల్ (60) రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆంధ్ర ఆట నిలిచే సమయానికి 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ప్రశాంత్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉండగా, మహీప్ (14) అవుటయ్యాడు. ప్రస్తుతం ఆంధ్ర 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
Ranji Trophy 2023-24: తొలి రోజు 'ఆంధ్ర'దే..
సాక్షి, విజయనగరం: ఉత్తరప్రదేశ్ జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు నిలకడగా ఆడుతోంది. డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు సాధించింది. ఆల్‌రౌండర్ కేవీ శశికాంత్ (83 బంతుల్లో 72; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (90 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. శశికాంత్ అవుటయ్యాక రికీ భుయ్‌తో కలిసి కరణ్ షిండే (45 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు రికీ భుయ్, కరణ్ అభేద్యంగా 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో యశ్ దయాళ్, అంకిత్ రాజ్‌పుత్, అకీబ్ ఖాన్, సౌరభ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: పెత్తనమంతా వాళ్లదే.. మర్యాద తప్పొద్దు! ఏంటి జడ్డూ.. నాన్న గురించి ఇలాగేనా? -
ఆ రోజు ద్రవిడ్ చెప్పాడు.. తర్వాత ఎవరూ టచ్‌లో లేరు!
Hanuma Vihari Comments: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి టీమిండియా పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్మెంట్ నుంచి తనకు ఇప్పటి వరకు పిలుపు రాలేదని.. ప్రస్తుతం తాను జాతీయ జట్టులో చోటు గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని పేర్కొన్నాడు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఏ జట్టు కోసమైనా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం రంజీ ట్రోఫీ మీదనే ఉందని.. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తే మంచిదేనంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో అరంగేట్రం కాగా 2018లో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా తెలుగు క్రికెటర్ హనుమ విహారి టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడి 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(111) కూడా ఉంది. అదే ఆఖరు ఇక వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే విహారి ఆఖరిసారిగా 2022లో ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలం(మొత్తం 31 రన్స్) కావడంతో మళ్లీ సెలక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి పెట్టిన హనుమ విహారి తాజా రంజీ సీజన్లో తొలుత ఆంధ్ర కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు కెప్టెన్సీ వదులుకుని ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆరోజు ద్రవిడ్ అదే చెప్పాడు ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి విహారి 365 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ గురించి ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘మేనేజ్మెంట్తో నేను కాంటాక్ట్‌లో లేను. నా ఆఖరి టెస్టు తర్వాత రాహుల్ ద్రవిడ్ ఒక్కడే నాతో మాట్లాడాడు. నా ఆటలోని లోపాలను తెలియజేసి.. వాటిని అధిగమించాల్సిన ఆవశ్యకతను వివరించాడు. ఆ తర్వాత ఎవరూ టచ్‌లో లేరు. అయితే, ప్రస్తుతం దేని గురించి ఆలోచించకుండా.. బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవడంపై మాత్రమే దృష్టి సారించాను. నా దృష్టి మొత్తం బ్యాటింగ్ మీదే ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా బెస్ట్ ఇచ్చి పరుగులు రాబట్టడమే పని. కెరీర్ పరంగా ఇప్పుడు నేను ఎలాంటి ఆశలు, అంచనాలు పెట్టుకునే దశలో లేను. ఏదేతే అది జరుగుతుంది. టెస్టు జట్టులో లేనందుకు నిరాశ, బాధ ఉన్న మాట వాస్తవమే. అయినా ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఇప్పుడైతే రంజీలో వీలైనన్ని పరుగులు రాబట్టడమే పని’’ అని 30 ఏళ్ల హనుమ విహారి చెప్పుకొచ్చాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో ఎలైట్ బి గ్రూపులో ఉన్న ఆంధ్ర జట్టు ప్రస్తుతం మూడు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: #Arjun Tendulkar: సచిన్ కొడుకుకు ఏమైంది..? కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా -
శతక్కొట్టిన నితీశ్‌రెడ్డి.. చెలరేగిన బౌలర్లు! ఆంధ్ర ఘన విజయం
Andhra won by an innings and 157 runs: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఎలైట్ డివిజన్లో భాగంగా బిహార్ జట్టుపై గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర భారీ విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా ఇన్నింగ్స్ 157 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు సెంచరీతో చెలరేగిన నితీశ్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పట్నా వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బౌలర్ గిరినాథ్‌రెడ్డి ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి బిహార్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో 182 పరుగులకే బిహార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు షేక్ రషీద్(91) అద్భుత అర్ధ శతకం, నితీశ్ రెడ్డి సూపర్ సెంచరీ(159; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో 463 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో 352 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బిహార్ మూడోరోజు(ఆదివారం) ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అయితే, సోమవారం నాటి ఆటలో కేవలం కేవలం పదమూడు పరుగులు మాత్రమే జతచేసి బిహార్ ఆలౌట్ అయింది. దీంతో ఆంధ్ర ఇన్నింగ్స్ 157 రన్స్ తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. లలిత్ మోహన్‌కు నాలుగు, కేవీ శశికాంత్‌కు మూడు వికెట్లు దక్కగా.. నితీశ్‌రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్, ప్రశాంత్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. ఘాటుగానే బదులిచ్చాడు! ఫొటో వైరల్ -
హనుమ విహారి, రికీ భుయ్ శతకాలు.. ఆంధ్ర ఘన విజయం
Ranji Trophy 2023-24- Chhattisgarh vs Andhra: రంజీ ట్రోఫీ 2023-24లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఛత్తీస్‌గఢ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 431 పరుగుల భారీ స్కోరు చేసింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్లో హనుమ విహారి(183), కెప్టెన్ రికీ భుయ్(120) సెంచరీలు చేయడంతో ఈ మేరకు పరుగులు సాధించింది. అనంతరం ఛత్తీస్‌గఢ్ 262 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించగా.. ఆంధ్రకు 169 రన్స్ ఆధిక్యం దక్కింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆంధ్ర జట్టు.. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు 320 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, ఆంధ్ర బౌలర్ల విజృంభణ కారణంగా ఛత్తీస్‌గఢ్ 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా సోమవారం ముగిసిన ఈ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లలో ప్రశాంత్ కుమార్, నితీశ్ రెడ్డి మూడేసి వికెట్లు తీయగా.. పృథ్వీరాజ్ యర్రా రెండు, గిరినాథ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
Ranji Trophy: హనుమ విహారి సెంచరీ
Ranji Trophy 2023-24 - Chhattisgarh vs Andhra రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును హనుమ విహారి (119 బ్యాటింగ్; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (120; 14 ఫోర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 231 పరుగులు జోడించారు. విహారి, కరణ్ షిండే (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక ఇరుజట్ల మధ్య శనివారం రెండో రోజు ఆట మొదలైంది. -
రాణించిన లలిత్ మోహన్, మనీశ్.. ఆంధ్ర ఘన విజయం
దిబ్రూగఢ్: రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆంధ్ర జట్టు తొలి విజయాన్ని అందుకుంది. అస్సాం జట్టుతో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మూడో మ్యాచ్‌లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు 172 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన అస్సాం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 81/5తో ఆట కొనసాగించిన అస్సాం మరో 101 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆంధ్ర బౌలర్లు లలిత్ మోహన్ (4/81), గిరినాథ్ రెడ్డి (3/57), గొలమరు మనీశ్ (3/19) అస్సాం జట్టును కట్టడి చేశారు. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న ఆంధ్ర జట్టు రెండో మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయింది. ఈనెల 26 నుంచి జరిగే నాలుగో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌తో ఆంధ్ర ఆడుతుంది. చదవండి: తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం -
Ranji Trophy 2024: గెలుపు దిశగా ఆంధ్ర జట్టు..
డిబ్రూఘర్: రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర మొదటి విజయం దిశగా సాగుతోంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం ఓటమికి చేరువైంది. 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అస్సాం మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. కెపె్టన్ రియాన్ పరాగ్ (48 నాటౌట్) పోరాడుతుండగా...చేతిలో ఉన్న ఐదు వికెట్లతో అస్సాం మరో 282 పరుగులు చేయాల్సి ఉంది. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి 3, లలిత్ మోహన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 147/1తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రికీ భుయ్ (187 బంతుల్లో 125; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం పూర్తి చేసుకోగా, హనుమ విహారి (63) అర్ధసెంచరీ సాధించాడు. షేక్ రషీద్ (40 నాటౌట్) కూడా రాణించగా... అస్సాం బౌలర్లలో సిద్ధార్థ్ వాసుదేవ్ 5 వికెట్లు తీశాడు. చదవండి: SA20 2024: సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..! -
బ్యాట్‌తో రాణించిన నితీశ్ రెడ్డి.. ఆంధ్ర 188 ఆలౌట్
Ranji Trophy 2023-24- Assam vs Andhra, Elite Group B- దిబ్రూగఢ్: అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును షోయబ్ మొహమ్మద్ ఖాన్ (63; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (49; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆంధ్ర జట్టు చివరి 4 వికెట్లను ఐదు పరుగుల తేడాలో కోల్పోయింది. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ (6/46), ముక్తార్ (2/45), ఆకాశ్ సేన్‌గుప్తా (2/37) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. మెరిసిన తనయ్, తన్మయ్, మిలింద్ సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ జట్లపై ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ వరుసగా మూడో విజయంపై కన్నేసింది. సిక్కిం జట్టుతో శుక్రవారం మొదలైన మూడో మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 302 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం జట్టును హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (6/25), సీవీ మిలింద్ (4/30) హడలెత్తించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్, మీడియం పేసర్ మిలింద్ దెబ్బకు సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 27.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ చేయగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (64 బంతుల్లో 83; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. తన్మయ్, రాహుల్ తొలి వికెట్‌కు 18 ఓవర్లలో 132 పరుగులు జో డించడం విశేషం. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్‌కు 138 పరుగులు జత చేశారు. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ (66 బంతుల్లో 70 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), చందన్ సహని (8 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
టీమిండియాలో రీఎంట్రీ ఇస్తా.. 100 టెస్టులు ఆడటమే లక్ష్యం
Aim is to play 100 Test matches: టీమిండియా తరఫున 85 అంతర్జాతీయ టెస్టులు.. 12 సెంచరీలు.. ఇందులో ఒకటి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో.. మరొకటి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సాధించినది.. ఇక అర్ధ శతకాలు 26.. మొత్తంగా 5077 పరుగులు.. ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టుకు సారథి.. 13 ఏళ్ల కెరీర్లో ముంబై బ్యాటర్ అజింక్య రహానే సాధించిన ఘనతలు. అయితే, ప్రస్తుతం జాతీయ జట్టులో 35 ఏళ్ల వెటరన్ బ్యాటర్‌కు అవకాశాలు కరువయ్యాయి. విఫలమై.. జట్టుకు దూరమై యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న పోటీలో ఈ టెస్టు స్పెషలిస్టు వెనుబడిపోయాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్- 2021-23 తర్వాత వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు ఆఖరిసారిగా ఆడిన రహానే.. వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం కారణంగా మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనున్న జట్టు ఎంపిక సందర్భంగానూ సెలక్టర్లు అతడికి మొండిచేయే చూపారు. ఈ నేపథ్యంలో అజింక్య రహానే అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసిపోయినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశ్ చోప్రా వంటి భారత మాజీ క్రికెటర్లు సైతం ఇదే మాట అంటున్నారు. రీఎంట్రీ ఇస్తా.. అయితే, రహానే మాత్రం తాను కచ్చితంగా టీమిండియా తరఫున పునరాగమనం చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. 100 టెస్టులు ఆడటమే తన ఆశయం అంటున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ-2024లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆంధ్రతో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా జట్టుతో చేరాడు. 100 టెస్టులు ఆడటమే లక్ష్యం డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో సారథిగా రహానేకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర జట్టుపై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ముంబై తరఫున మెరుగైన స్కోర్లు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాను. ఈసారి ఎలాగైనా రంజీ ట్రోఫీ గెలవాలనే సంకల్పంతో ఉన్నాం. అలాగే నా ముందున్న మరో అతిపెద్ద లక్ష్యం.. టీమిండియా తరఫున 100 టెస్టులు పూర్తిచేసుకోవడమే’’ అని అజింక్య రహానే చెప్పుకొచ్చాడు. చదవండి: Shreyas Iyer: బాధ లేదు.. నాకు అప్పగించిన పని పూర్తి చేశా.. ఇక -
Ind vs Eng: గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే!
Ranji Trophy 2023-24-Mumbai vs Andhra- ముంబై: రంజీ ట్రోఫీ-2024లో తన ఆరంభ మ్యాచ్‌లో అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కాగా ‘ఎలైట్’ గ్రూప్‌లో భాగంగా ముంబై- ఆంధ్ర జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ముంబై ఓపెనర్ భూపేన్ లాల్వాని (61) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (48), సువేద్ పార్కర్ (41) ఫర్వాలేదనిపించారు. ఇక గత మ్యాచ్‌కు దూరమై ఈసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (0) తొలి బంతికే నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం విశేషం. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ గోల్డెన్ డక్ కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. రీఎంట్రీ ఇక కష్టమే ఇంగ్లండ్‌తో టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడం ఇక కష్టమే అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తొలి రెండు జట్టులకు ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఆట ముగిసేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. ఆంధ్ర బౌలర్ నితీశ్‌కు 3, షోయబ్ మొహమ్మద్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో 281/6 ఓవర్‌నైట్ స్కోరుతో ముంబై శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. కెప్టెన్సీకి విహారి రాజీనామా... మరోవైపు.. ఆంధ్ర రంజీ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విహారి కెప్టెన్‌గా వ్యవహరించగా... అతని స్థానంలో ఈ మ్యాచ్ నుంచి రికీ భుయ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. -
రికీ భుయ్ అజేయ శతకం
విశాఖ స్పోర్ట్స్: బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 71 పరుగుల దూరంలో నిలిచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. రికీ భుయ్ (243 బంతుల్లో 107 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించి ఆంధ్ర జట్టును ఆదుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయి మరో 220 పరుగులు సాధించింది. కెప్టెన్ హనుమ విహారి (51; 7 ఫోర్లు)తో కలిసి రికీ భుయ్ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేశాడు. అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి (30; 6 ఫోర్లు)తో ఆరో వికెట్‌కు రికీ భుయ్ 71 పరుగులు జోడించాడు. ప్రస్తుతం షోయబ్ మొహమ్మద్ ఖాన్ (31 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రికీ భుయ్ ఏడో వికెట్‌కు అజేయంగా 61 పరుగులు జత చేశాడు. బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
ఆంధ్రతో మ్యాచ్.. సెంచరీతో చెలరేగిన బెంగాల్ ఓపెనర్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర జట్టుతో శుక్రవారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 289 పరుగులు సాధించింది. అనుస్తుప్ మజుందార్ (125; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా... ఓపెనర్ సౌరవ్ పాల్ (96; 10 ఫోర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనుస్తుప్, సౌరవ్ మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం కెప్టెన్ మనోజ్ తివారీ (15 బ్యాటింగ్), భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్ రెండు వికెట్లు తీయగా... నితీశ్ కుమార్ రెడ్డి, షోయబ్ ఖాన్లకు ఒక్కో వికెట్ లభించింది. చదవండి: భారత మహిళల విజయగర్జన -
పరాజయంతో ముగించిన ఆంధ్ర
చండీగఢ్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ను ఆంధ్ర జట్టు పరాజయంతో ముగించింది. ఉత్తరప్రదేశ్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 46.5 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ కరణ్ షిండే (67; 7 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 60 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (50 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... పృథ్వి రాజ్ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. షేక్ రషీద్, రికీ భుయ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, శివా సింగ్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం ఉత్తరప్రదేశ్ జట్టు 41.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించి గెలిచింది. ఆర్యన్ జుయల్ (55; 7 ఫోర్లు), సమీర్ రిజ్వీ (61 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్ జురెల్ (57 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేసి ఉత్తరప్రదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో ఆంధ్ర తమ ఆరు మ్యాచ్‌లను పూర్తి చేసుకొని ఆరు పాయింట్ల తో ఐదో స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్‌లో నెగ్గిన ఆంధ్ర, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో మ్యాచ్ వర్షంవల్ల రద్దయింది. -
SMAT 2023: మూడో పరాజయం.. క్వార్టర్ ఫైనల్ అవకాశాలు లేనట్లే!
SMAT- 2023- Andhra vs Saurashtra- రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు మూడో పరాజయం చవిచూసింది. సౌరాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. షేక్ రషీద్ (39 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబ్బర్ (24 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లు జైదేవ్ ఉనాద్కట్ (2/35), చిరాగ్ జానీ (2/35), ధర్మేంద్ర సింగ్ జడేజా (3/14) ఆంధ్ర జట్టును కట్టడి చేశారు. క్వార్టర్ అవకాశాలు గల్లంతు అనంతరం సౌరాష్ట్ర జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. హార్విక్ దేశాయ్ (51 బంతుల్లో 81; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), తరుణ్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రైల్వేస్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు గెలిచినా క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశం లేదు. చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్
BCCI- Women Cricket Team Head Coach: దేశవాళీ దిగ్గజం, ముంబై జట్టు మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించారు. కొన్ని నెలల క్రితం సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ పదవి కోసం పలువురిని ఇంటర్వ్యూ చేసింది. తుదకు 48 ఏళ్ల అమోల్ మజుందార్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. కాగా అమోల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 171 మ్యాచ్‌లు ఆడి 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా ప్రాతినిధ్యం ఇక రంజీ జట్టు టైటిల్ నెగ్గిన ముంబై జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించిన అమోల్ తదనంతరం దేశవాళీ క్రికెట్లో అస్సాం, ఆంధ్ర జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించి 2014లో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్‌వైపు వచ్చాడు. ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్‌కు మూడు సీజన్ల పాటు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: WC 2023: క్రేజీ ఇన్నింగ్స్.. అతడు అద్భుతం.. ఆ ‘వంద’లో నాదీ సమాన పాత్ర: కమిన్స్ -
3 వికెట్లు పడగొట్టిన అర్జున్ టెండూల్కర్.. పోరాడి ఓడిన ఆంధ్ర
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో గోవా తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీ గ్రూపు-సిలో భాగంగా రాంఛీ వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గోవా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. గోవా బ్యాటర్లలో కెప్టెన్ దర్శన్ మిసల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దర్శన్ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. అతడితో పాటు రాహుల్ త్రిపాఠి(47), తునీష్ సాకర్(11 బంతుల్లో 34) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి, పృథ్వీ రాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మోహన్, హనుమా విహారి చెరో వికెట్ పడగొట్టారు. పోరాడి ఓడిన ఆంధ్ర.. ఇక 232 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచింది. 18.3 ఓవర్లలో 201 పరుగులకు ఆంధ్ర ఆలౌటైంది. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఆంధ్ర జట్టు ఓటమి పాలైంది. ఆంధ్ర బ్యాటర్లలో హనుమ విహారి(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ శ్రీకర్ భరత్(31), అశ్విన్ హెబ్బర్(31) పరుగులు చేశారు. గోవా బౌలర్లలో అర్జున్ టెండూల్కర్, లక్షయ్ గార్గ్ తలా మూడు వికెట్లు సాధించగా.. తారి, దర్శన్ మిసల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: AUS vs SL: డేవిడ్ వార్నర్ మంచి మనసు.. వీడియో వైరల్ -
హనుమ విహారి కీలక నిర్ణయం.. మళ్లీ ఆంధ్రతోనే
హైదరాబాద్: భారత టెస్టు క్రికెటర్ గాదె హనుమ విహారి వచ్చే దేశవాళీ సీజన్లో మధ్యప్రదేశ్ జట్టుకు ఆడాలనుకున్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. తన సొంత జట్టు ఆంధ్ర తరఫునే కొనసాగేందుకు సిద్ధమయ్యాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సభ్యుల విజ్ఞప్తి మేరకు విహారి ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత సీజన్లో విహారి నాయకత్వంలోనే ఆంధ్ర రంజీ ట్రోఫీ నాకౌట్ దశకు చేరగా...బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన అతను 14 ఇన్నింగ్స్‌లలో 2 హాఫ్ సెంచరీలతో 490 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కుడి చేతికి తీవ్ర గాయం కాగా, జట్టును ఓటమినుంచి రక్షించేందుకు అతను ఎడమచేత్తో బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంది. భారత్ తరఫున చివరిసారిగా ఏడాది క్రితం బర్మింగ్‌హోం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో విహారి బరిలోకి దిగాడు. చదవండి: ODI World Cup 2023: ప్లీజ్ స్టోక్స్ వచ్చేయ్.. ప్రపంచకప్‌లో ఆడు! -
తండ్రి అయిన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రీతి రాజ్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విహారి దంపతులు సోషల్ మీడియా వేదికగా నిన్న (జులై 17) రివీల్ చేశారు. మా కుటుంబంలో సరికొత్త ఆనందాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము అంటూ బిడ్డ పేరు (Ivaan Kiesh), డేట్ ఆఫ్ బర్త్ (07-07-2023) రివీల్ చేస్తూ విహారి దంపతులు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు, సహచర క్రికెటర్లు విహారి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) కాగా, హనుమ విహారి నేతృత్వంలో సౌత్ జోన్ జట్టు ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీ-2023ని గెలుచుకుంది. వెస్ట్ జోన్‌తో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌత్ జోన్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విహారి కెప్టెన్స్ ఇన్నింగ్స్ (63, 42) ఆడగా.. విధ్వత్ కావేరప్ప 8 వికెట్లు (7/53, 1/51) పడగొట్టి సౌత్ జోన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన 29 ఏళ్ల హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు. 2021 ఇంగ్లండ్ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్‌లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు. దేశవాలీ టోర్నీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించే విహారి.. రాబోయే సీజన్లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అతని నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. -
హనుమ విహారి కీలక నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే దేశవాళీ సీజన్లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని హనుమ విహారి నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. విహారితో పాటు ఢిల్లీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ కుల్వంత్ ఖేజ్రోలియా కూడా వచ్చే డోమాస్టిక్ సీజన్లో మధ్యప్రదేశ్ తరపున ఆడనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇప్పటికే వీరిద్దరూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌తో వీరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అదే విధంగా సోమవారం (జూన్ 26) జరిగిన సమావేశంలో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ 2022 రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌కు ఇదే తొలి రంజీ ట్రోఫీ టైటిల్. ఇక 29 ఏళ్ల విహారి జూన్ 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విహారి చివరగా టీమిండియా తరపున గతేడాది జూలైలో ఇంగ్లండ్‌పై ఆడాడు. ఇప్పటివరకు 16 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విహారి 839 పరుగులు సాధించాడు. చదవండి: CWC Qualifiers 2023: చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా! -
ఆంధ్ర సెమీస్ చేరేనా! .. క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌తో ఢీ
ఇండోర్: ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో గెలిచి... ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలూ కలిసి రావడంతో... రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన ఆంధ్ర జట్టు... డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో నేటి నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. గతంలో ఏనాడూ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన ఆంధ్ర జట్టుకు కొత్త చరిత్ర లిఖించాలని పట్టుదలతో ఉంది. అయితే పటిష్టంగా ఉన్న మధ్యప్రదేశ్‌పై ఆంధ్ర జట్టు గెలవాలంటే మాత్రం సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో ఆంధ్ర తరఫున బ్యాటింగ్‌లో రికీ భుయ్ (461), కెప్టెన్ హనుమ విహారి (448), అభిషేక్ రెడ్డి (384), కరణ్ షిండే (439) నిలకడగా రాణించారు. ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (23 వికెట్లు, 146 పరుగులు), షోయబ్ ఖాన్ (21 వికెట్లు, 300 పరుగులు)లతోపాటు బౌలర్లు శశికాంత్ (26 వికెట్లు), లలిత్ మోహన్ (25 వికెట్లు), మాధవ్ రాయుడు (11 వికెట్లు) కూడా మెరిస్తే ఆంధ్ర సంచలన ఫలితం సాధించే అవకాశముంది. బ్యాటింగ్‌లో రజత్ పాటిదార్, హిమాన్షు మంత్రి, శుభమ్ శర్మ... బౌలింగ్‌లో అవేశ్ ఖాన్, సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ, గౌరవ్ యాదవ్ నిలకడగా రాణిస్తూ మధ్యప్రదేశ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. మంగళవారమే మొదలయ్యే ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో జార్ఖండ్‌తో బెంగాల్; ఉత్తరాఖండ్‌తో కర్ణాటక; పంజాబ్‌తో సౌరాష్ట్ర తలపడతాయి. చదవండి: Marnus Labuschagne: కాఫీ బ్యాగులతో భారత్‌కు ఆసీస్ క్రికెటర్; తాగడానికా.. అమ్మడానికా? -
ముంబై- మహారాష్ట్ర మ్యాచ్ డ్రా.. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర
Ranji Trophy 2022-23 : రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా గ్రూప్ ‘బి’లో మహారాష్ట్ర, ముంబై మ్యాచ్ ‘డ్రా’ అయింది. దీంతో హనుమ విహారి సారథ్యంలోని ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర తలపడుతుంది. ముంబై మ్యాచ్‌లో కాగా బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై సైతం 384 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించడం విశేషం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 252 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆట ముగిసే సమయానికి ముంబై 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అసోంపై ఇదిలా ఉంటే.. అంతకుముందు అసోంపై ఆంధ్ర జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. అభిషేక్‌రెడ్డి (75), కెప్టెన్ హనుమ విహారీ(80), కరణ్ షిండే(నాటౌట్) రాణించడంతో 361 పరుగులు స్కోరు చేసింది. ఇక ఆంధ్ర బౌలర్లు మాధవ్ రాయుడు (4/12), శశికాంత్ (3/34), నితీశ్ రెడ్డి (1/29), మోహన్ (1/24) చెలరేగడంతో అసోం 113 పరుగులకే కుప్పకూలి, ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. దీంతో ఆంధ్ర జట్టు ఘన విజయం సాధించి క్వార్టర్ రేసులో నిలవగా.. ముంబై- మహారాష్ట్ర ఫలితంతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆరో ఓటమితో అధోగతి.. ‘ప్లేట్’ డివిజన్‌కు హైదరాబాద్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన చివరి మ్యాచ్ వరకూ కొనసాగింది. శుక్రవారం ముగిసిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో తన్మయ్ అగర్వాల్ సారథ్యంలోని హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 90/5తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 47 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ వికెట్ నష్టపోయి ఛేదించింది. దీంతో సీజన్లో ఆడిన 7 మ్యాచ్‌లలో వరుసగా ఆరో ఓటమితో హైదరాబాద్ ఒక పాయింట్‌తో చివరి స్థానంలో నిలిచి ‘ప్లేట్’ గ్రూప్‌నకు పడిపోయింది. చదవండి: Arshdeep Singh: ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు IND Vs NZ: తొలి టి20లో టీమిండియా ఓటమి.. -
ఆంధ్ర క్రికెట్ జట్టుకు మధురవాడ కుర్రాడు
మధురవాడ(భీమిలి): మధురవాడ బొట్టవానిపాలేనికి చెందిన ముగడ భానుస్వరూప్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో చోటు సంపాదించాడు. భానుస్వరూప్ ప్రస్తుతం బక్కన్నపాలెం సెయింట్ ఆన్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రమణ లారీ యజమాని. చిన్నప్పుడే కుమారుడి ఆసక్తిని గమనించిన రమణ.. తమకు తెలిసిన వారి దగ్గర క్రికెట్లో శిక్షణ ఇప్పించాడు. అనంతరం పక్కనే ఉన్న పీఎం పాలెంలో స్టేడియం ఉండటంతో.. విశాఖ క్రికెట్ అసోసియేషన్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి భానుస్వరూప్ టోర్నమెంట్లలో పాల్గొంటూ ప్రతిభ చూపేవాడు. ఈక్రమంలో గతేడాది వీడీసీఏలో స్థానం సంపాదించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా, బ్యాటింగ్‌లో రాణిస్తూ.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం కేరళలో దక్షిణాది రాష్ట్రాల జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఏసీఏ తరఫున భానుస్వరూప్ పాల్గొంటున్నాడు. భానుస్వరూప్ మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గమనించిన మా నాన్న.. నన్ను బాగా ప్రోత్సహించారు. వీడీసీఏలోని కోచ్‌లు, పెద్దల సూచనలు, ప్రోత్సాహంతో మరింత పట్టుదలగా ఆడుతున్నాను. నాకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ జట్టులో ఆడాలనేది నా కల. దాన్ని నిజం చేసుకుంటా’అని చెప్పాడు. -
అశ్విన్ హెబ్బర్ సెంచరీ.. ఆంధ్ర 415 ఆలౌట్
సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ అశ్విన్ హెబ్బర్ (109; 12 ఫోర్లు, 1) సెంచరీ సాధించాడు. ఓవర్‌నైట్ స్కోరు 256/5తో బుధవారం ఆట ప్రారంభించిన ఆంధ్ర 415 పరుగుల వద్ద ఆలౌటైంది. లలిత్ మోహన్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (28; 3 ఫోర్లు) అండతో అశ్విన్ సెంచరీ చేశాడు. సౌరాష్ట్ర బౌలర్లలో యువరాజ్ సింగ్, ధర్మేంద్రసింగ్ జడేజాలు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర ఆట నిలిచే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. షెల్డన్ జాక్సన్ (63 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆంధ్ర బౌలర్ నితీశ్ కుమార్ (2/26)... హర్విక్ (8), చతేశ్వర్ పుజారా (5)లను వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ -
సౌరాష్ట్రతో రంజీ పోరు.. అర్ధ సెంచరీతో రాణించిన రికీ భుయ్
రాజ్‌కోట్: ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ (155 బంతు ల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లో సౌరాష్ట్రతో జరుగుతు న్న మ్యాచ్‌లో తొలిరోజు ఆట నిలిచే సమయానికి ఆంధ్ర జట్టు 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ముందుగా ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (34; 6 ఫోర్లు), అభిషేక్ రెడ్డి (46; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమే ఇచ్చారు. అయితే సౌరాష్ట్ర స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా (3/80) తన వరుస ఓవర్లలో అభిషేక్, జ్ఞానేశ్వర్లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం కెప్టెన్ హనుమ విహారి (38; 7 ఫోర్లు), రికీ భుయ్ మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో విహారిని కూడా జడేజా బౌల్డ్ చేశాడు. తర్వాత కరణ్ షిండే (31; 5 ఫోర్లు) అండతో రికీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగిసే దశలో చేతన్ సకారియా బౌలింగ్‌లో రికీ భుయ్ వెనుదిరిగాడు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే... కుల్దీప్కు చోటు! చాహల్‌కు నో చాన్స్ -
Ranji Trophy: సెంచరీతో చెలరేగిన ధ్రువ్ షోరే...
Ranji Trophy 2022-23 - Delhi vs Andhra- ఢిల్లీ: ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఢిల్లీ దీటైన రీతిలో జవాబిచ్చింది. ఓపెనర్ ధ్రువ్ షోరే (261 బంతుల్లో 142 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. హిమ్మత్ సింగ్ (45 బ్యాటింగ్), హృతిక్ షోకీన్ (45) అతడికి సహకరించారు. దీంతో.. మ్యాచ్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ ఖాన్‌కు 2, నితీశ్ రెడ్డికి ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం ఢిల్లీ మరో 159 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం చివరి రోజు కావడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఎవరికి ఆధిక్యం లభిస్తుందనేది చూడాలి. చదవండి: IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది -
చెలరేగిన శశికాంత్.. హైదరాబాద్‌పై ఆంధ్ర భారీ విజయం
Ranji Trophy 2022-23- Andhra vs Hyderabad: రంజీ ట్రోఫీ టోర్నీ 2022- 23లో భాగంగా ఆంధ్ర జట్టు హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. హనుమ విహారి బృందం 154 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. సెంచరీతో మెరిసిన రికీ భుయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఎలైట్ గ్రూప్ బిలో భాగమైన ఆంధ్ర- హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కడు తప్ప.. అంతా సింగిల్ డిజిట్ స్కోర్లే! ఓపెనర్ అభిషేక్ రెడ్డి (81 పరుగులు( మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఆంధ్ర బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 9 ,2, 6 ,5, 3, 4, 1, 13, 0, 1 నాటౌట్. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 5 వికెట్లతో చెలరేగగా.. రక్షణ్ రెడ్డి ఒకటి, కార్తికేయ మూడు వికెట్లు తీశారు. ఇక హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో 197 పరుగులకే ఆ జట్టు కథ ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీలతో మెరిసిన రికీ, కరణ్ ఓపెనర్ జ్ఞానేశ్వర్ 72, కెప్టెన్ హనుమ విహారి 33, రికీ భుయ్ 116, శ్రీకర్ భరత్ 89 పరుగులు సాధించగా.. కరణ్ షిండే 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, హైదరాబాద్ ఆంధ్రకు దీటుగా బదులివ్వలేక చతికిలపడింది. చెలరేగిన శశికాంత్ చందన్ సహాని అర్ధ శతకం(56) సాధించగా రోహిత్ రాయుడు 46 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆంధ్ర బౌలర్ కేవీ శశికాంత్ 5 వికెట్లు కూల్చి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో కొడవండ్ల సుదర్శన్ మూడు, నితీశ్ రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో విజయనగరంలో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆంధ్ర 154 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు ఆంధ్ర- 135 & 462 హైదరాబాద్- 197 & 246 చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
జ్ఞానేశ్వర్, భరత్ అర్ధ శతకాలు.. కోలుకున్న ఆంధ్ర జట్టు.. ఇక సౌరాష్ట్ర
Ranji Trophy 2022- 23 Andhra vs Hyderabad- సాక్షి, విజయనగరం: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. 62 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. తద్వారా తమ ఆధిక్యాన్ని 168 పరుగులకు పెంచుకుంది. సీఆర్ జ్ఞానేశ్వర్ (96 బంతుల్లో 72; 15 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (33; 4 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (52 బంతుల్లో 70 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (51 బంతుల్లో 43 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఆటతీరుతో ఆంధ్ర జట్టును నిలబెట్టారు. ఆంధ్ర కోల్పోయిన మూడు వికెట్లను హైదరాబాద్ బౌలర్ రక్షణ్ రెడ్డి పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 79/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 118 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులవద్ద ఆలౌటై 62 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. శశాంక్ (55 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/64), కేవీ శశికాంత్ (3/40), సుదర్శన్ (2/47) విజృంభించి హైదరాబాద్‌ను 200 స్కోరులోపు కట్టడి చేశారు. సౌరాష్ట్ర 503/6 రాజ్‌కోట్: ఢిల్లీతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 370 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 184/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 503 పరుగులు సాధించింది. అర్పిత్ (127 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్), హార్విక్ దేశాయ్ (107; 15 ఫోర్లు) సెంచరీలు సాధించారు. తొలి రోజు జైదేవ్ ఉనాద్కట్ (8/39) ధాటికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం Hardik Pandya: మేము ఓడిపోయినా పర్లేదనుకున్నా! అందుకే ఇలా.. పాండ్యా కామెంట్స్ వైరల్ -
వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. ఆంధ్ర సంచలన విజయం
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: అద్భుత పోరాట పటిమ కనబరిచిన ఆంధ్ర జట్టు ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. తమిళనాడుతో శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల ఆధిక్యంతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఆంధ్ర నిర్దేశించిన 203 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పేస్ బౌలర్ కేవీ శశికాంత్ (4/47), ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (6/69) ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ (65; 5 ఫోర్లు) చివరిదాకా క్రీజులో ఉండటంతో తమిళనాడు విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే సుందర్‌ను శశికాంత్ అవుట్ చేసి ఆంధ్రకు చిరస్మరణీయ విజయం అందించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 162/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర మరో 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 250 పరుగులవద్ద ఆలౌటైంది. రికీ భుయ్ (76; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా... చివర్లో శశికాంత్ (19; 1 సిక్స్), లలిత్ మోహన్ (16; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆంధ్ర ప్రత్యర్థిముందు ఊరించే లక్ష్యాన్ని పెట్టింది. చదవండి: IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్... ఐపీఎల్ వేలం విశేషాలు ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా.. IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? -
సెంచరీతో మెరిసిన ‘టైటాన్స్’ బ్యాటర్.. వాషింగ్టన్ సుందర్ మాత్రం!
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో మ్యాచ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీతో మెరిశాడు. 180 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ బాబా అపరాజిత్ (88; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం నాటి మూడో రోజు ఆట ఫస్ట్ సెషన్ సమయానికి 6 వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 336 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు కంటే 39 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడు- ఆంధ్ర జట్ల మధ్య డిసెంబరు 20న టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర.. 297 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అభిషేక్ రెడ్డి 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రికీ భుయ్ 68, కరణ్ షిండే 55 పరుగులు చేశారు. వాషీ ప్రభావం చూపలేకపోయాడు తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్‌కు రెండు, వారియర్‌కు మూడు, సాయి కిషోర్‌కు మూడు, అజిత్ రామ్, విజయ్ శంకర్‌కు తలా ఒక వికెట్ దక్కాయి. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయని వాషీ.. బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. 13 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా సాయి సుదర్శన్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ప్రదర్శనను కొనియాడుతూ టైటాన్స్ ట్వీట్ చేసింది. చదవండి: Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్ -
Ranji Trophy-2022: ఆంధ్రాపై ముంబై ఘన విజయం..
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు ఘనవిజయంతో శుభారంభం చేసింది. ఆంధ్ర జట్టుతో ఇక్కడ జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఓవర్‌నైట్ స్కోరు 290/6తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన ముంబై మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 331 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ అర్మాన్ జాఫర్ (116; 16 ఫోర్లు, 1 సిక్స్) అదే స్కోరు వద్ద అవుటవ్వగా... తనుష్ కొటియన్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ నాలుగు వికెట్లు తీయగా... శశికాంత్, లలిత్ మోహన్‌లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. 93 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 47 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఉప్పర గిరినాథ్ (27; 6 ఫోర్లు), రికీ భుయ్ (16; 2 ఫోర్లు), కెప్టెన్ విహారి (14), నితీశ్ రెడ్డి (15; 3 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ముంబై బౌలర్లలో తుషార్ (3/34), తనుష్ (2/18), సిద్ధార్థ్ (2/26) రాణించారు. 39 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై 6.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. చదవండి: PKL 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పింక్ పాంథర్స్.. తుది పోరులో పుణేతో ఢీ -
Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! గ్రూప్‌ల వివరాలు ఇలా!
సాక్షి, హైదరాబాద్: భారత దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు మంగళవారం తెర లేవనుంది. 2022–2023 సీజన్‌కు సంబంధించి తొలి రౌండ్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు వివిధ నగరాల్లో ప్రారంభం కానున్నాయి. మధ్యప్రదేశ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. మొత్తం 38 జట్లను ఐదు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశ ముగింపు అప్పుడే ఎలైట్ విభాగంలో ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’ గ్రూప్‌లు ఉండగా... ప్లేట్ డివిజన్ గ్రూప్ వేరుగా ఉంది. ఎలైట్ విభాగంలోని నాలుగు గ్రూపుల్లో ఎనిమిది జట్ల చొప్పున మొత్తం 32 జట్లకు...ప్లేట్ గ్రూప్‌లో ఆరు జట్లకు చోటు కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 27వ తేదీతో గ్రూప్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఎలైట్ నాలుగు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ ఎప్పుడంటే! జనవరి 31 నుంచి క్వార్టర్ ఫైనల్స్‌ను... ఫిబ్రవరి 8 నుంచి సెమీఫైనల్స్‌ను... ఫిబ్రవరి 16 నుంచి ఫైనల్‌ను నిర్వహిస్తారు. హైదరాబాద్, ఆంధ్ర జట్లు గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తమ తొలి రౌండ్ మ్యాచ్‌లను సొంతగడ్డపై ఆడనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో తమిళనాడుతో హైదరాబాద్... విజయనగరంలో 41 సార్లు రంజీ చాంపియన్ ముంబైతో ఆంధ్ర తలపడనున్నాయి. ఎలైట్ గ్రూప్‌ల వివరాలు గ్రూప్ ‘ఎ’: హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బరోడా, ఒడిషా, ఉత్తరాఖండ్, నాగాలాండ్. గ్రూప్ ‘బి’: హైదరాబాద్, ఆంధ్ర, ముంబై, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, అస్సాం. గ్రూప్ ‘సి’: కర్ణాటక, కేరళ, జార్ఖండ్, గోవా, రాజస్తాన్, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, సర్వీసెస్. గ్రూప్ ‘డి’: మధ్యప్రదేశ్, విదర్భ పంజాబ్,, రైల్వేస్, గుజరాత్, త్రిపుర, జమ్మూ కశ్మీర్, చంఢీగఢ్. ప్లేట్ గ్రూప్: బిహార్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం FIFA WC 2022: క్రొయేషియాతో సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాకిచ్చిన ఫిఫా -
VHT 2022: సెంచరీతో చెలరేగిన అశ్విన్.. బిహార్‌పై ఆంధ్ర ఘన విజయం
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 132 పరుగుల తేడాతో బిహార్‌ను చిత్తు చేసింది. ముందుగా ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అశ్విన్ హెబర్ (141 బంతుల్లో 154; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగగా...రికీ భుయ్ (65 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హనుమ విహారి (70 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం బిహార్ 44.3 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. వీర్‌ప్రతాప్ సింగ్ (49 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సకీబుల్ ఘని (42) మినహా అంతా విఫలమయ్యారు. హరిశంకర్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా...అయ్యప్ప, షోయబ్, నితీశ్ కుమార్ తలా 2 వికెట్లు తీశారు. చదవండి: IND vs NZ: అతడు చాలా డేంజరేస్.. టీమిండియా ఓపెనర్‌గా రావాలి -
Syed Mushtaq Ali Trophy: ఓటమితో ఆంధ్ర ముగింపు
ఇండోర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 11 పరుగుల తేడాతో బరోడా చేతిలో ఓడిపోయింది. ఏడు జట్లున్న గ్రూప్ ‘డి’లో ఆంధ్ర రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆంధ్ర 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కరణ్ షిండే (26 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (26 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు బరోడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఐదు గ్రూపుల్లో ‘టాపర్’గా నిలిచిన ముంబై, పంజాబ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, బెంగాల్ నేరుగా క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాయి. మూడు ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిన మరో మూడు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. -
చెలరేగిన స్టీఫెన్, ఆశిష్.. ఆంధ్ర ఘన విజయం
తిరువనంతపురం: పేస్ బౌలర్ చీపురపల్లి స్టీఫెన్ (5/27), స్పిన్నర్ ఆశిష్ (4/17) అద్భుత బౌలింగ్‌తో... రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో ఆంధ్ర జట్టు విజయంతో తమ లీగ్ దశను ముగించింది. ఉత్తరాఖండ్‌తో మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 36/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ను స్టీఫెన్, ఆశిష్ దెబ్బ తీశారు. వీరిద్దరి ధాటికి ఉత్తరాఖండ్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 65 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయి 101 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 70 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (42 నాటౌట్; 7 ఫోర్లు), అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన షేక్ రషీద్ (20; 3 ఫోర్లు) రాణించారు. ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో ఆంధ్ర మొత్తం 9 పాయింట్లతో తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
చెలరేగిన అయ్యప్ప, పృథ్వీరాజ్.. కుప్పకూలిన ఉత్తరాఖండ్
తుంబా: ఆంధ్ర పేసర్లు బండారు అయ్యప్ప (4/37), పృథ్వీరాజ్ (3/27) ధాటికి రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఇ’లో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. కునాల్ చండీలా (52; 6 ఫోర్లు, 1 సిక్స్), కమల్ సింగ్ (42; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఆంధ్ర 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (25), షేక్ రషీద్ (10) క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs SL 1st Test: శ్రీలంకతో టీమిండియా తొలిపోరు.. కోహ్లి మెరిసేనా..? -
Ranji Trophy: ఆంధ్ర జట్టు పరాజయం
తిరువనంతపురం: రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర క్రికెట్ జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. రాజస్తాన్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఇ’ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 158 పరుగుల తేడాతో ఓడిపోయింది. 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్ లో 53.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 100/4తో ఆట కొనసాగించిన ఆంధ్ర మరో 109 పరుగులు జతచేసి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (39; 6 ఫోర్లు), తపస్వి (44; 6 ఫోర్లు, 1 సిక్స్), సందీప్ (43; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. రాజస్తాన్ బౌలర్లలో శుభమ్ శర్మ(4/32), అనికేత్ చౌదరి(3/50) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా... ఈనెల 27 నుంచి జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో సర్వీసెస్‌తో ఆంధ్ర తలపడుతుంది. చదవండి: Ranji Trophy: ఆరు వికెట్లతో అదరగొట్టిన రవితేజ -
Ranji Trophy 2022: ఆధిక్యం కోల్పోయిన ఆంధ్ర
Ranji Trophy 2022 Andhra Vs Raj- తిరువనంతపురం: రాజస్తాన్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఎలైట్ గ్రూప్ ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 86.2 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 75/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర 149 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ గిరినాథ్ (71; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో శశికాంత్ (26 బంతుల్లో 34; 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. 51 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన రాజస్తాన్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి ఓవరాల్‌గా తమ ఆధిక్యాన్ని 148 పరుగులకు పెంచుకుంది. ఇక తొలి రోజు ఆటలో భాగంగా ఆంధ్ర జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ చీపురపల్లి స్టీఫెన్ (5/51) ఐదు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 59.2 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!