VHT 2022: సెంచరీతో చెలరేగిన అశ్విన్‌.. బిహార్‌పై ఆంధ్ర ఘన విజయం | andhra beats bihar in vijay hazare trophy 2022 | Sakshi
Sakshi News home page

VHT 2022: సెంచరీతో చెలరేగిన అశ్విన్‌.. బిహార్‌పై ఆంధ్ర ఘన విజయం

Published Fri, Nov 18 2022 7:33 AM | Last Updated on Fri, Nov 18 2022 7:49 AM

andhra beats bihar in vijay hazare trophy 2022 - Sakshi

బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 132 పరుగుల తేడాతో బిహార్‌ను చిత్తు చేసింది. ముందుగా ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.

అశ్విన్‌ హెబర్‌ (141 బంతుల్లో 154; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగగా...రికీ భుయ్‌ (65 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హనుమ విహారి (70 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు.

అనంతరం బిహార్‌ 44.3 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. వీర్‌ప్రతాప్‌ సింగ్‌ (49 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సకీబుల్‌ ఘని (42) మినహా అంతా విఫలమయ్యారు. హరిశంకర్‌ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా...అయ్యప్ప, షోయబ్, నితీశ్‌ కుమార్‌ తలా 2 వికెట్లు తీశారు.
చదవండి: IND vs NZ: అతడు చాలా డేంజరేస్‌.. టీమిండియా ఓపెనర్‌గా రావాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement